Author: Editor's Desk, Tattva News

లంచం కేసుల్లో చట్టసభ్యులకు మినహాయింపు లేదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఎంఎల్‌ఎ, ఎంపిలు అవినీతికి పాల్పడితే విచారణ ఎదుర్కొవాల్సిందేనని కోర్టు తీర్పు వెల్లడించింది. చట్ట సభల్లో ప్రశ్నలు అడిగేందుకు, ప్రసంగించేందుకు ఓటు వేసేందుకు లంచం తీసుకుంటే రక్షణ కల్పించలేమని ఏడుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం కీలక తీర్పు ఇచ్చింది. ఈ సందర్భంగా 1998 నాటి తీర్పును ఉన్నత న్యాయస్థానం కొట్టేసింది. 2012లో ఝార్ఖండ్ ముక్తి మోర్చా అవినీతి కేసు దేశంలో పెను సంచలనం సృష్టించిన విషయం విధితమే. రాజ్య సభ ఎన్నికలలో ఆ పార్టీ శాసన సభ్యురాలు సీతా సోరెన్ ఒక పార్టీ అభ్యర్థికి ఓటు వేయడానికి లంచం తీసుకొని మరొకరికి ఓటు వేశారనే ఆరోపణలు రావడంతో సిబిఐ కేసు నమోదు చేసింది. ఈ కేసును కొట్టివేయాలి కోరుతూ సీతా హైకోర్టు తలుపుతట్టారు. హైకోర్టు తిరస్కరించడంతో సుప్రీంకోర్టును ఆశ్రయించారు. 2019లో అప్పటి ప్రధాని న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగొయ్ నేతృత్వంలోని త్రిసభ్య…

Read More

రైతుల న్యాయమైన డిమాండ్లను పరిశీలించాలని, శాంతియుతంగా యాత్ర చేసుకోవడానికి వీలుగా అన్ని అడ్డంకులను తొలగించి దేశ రాజధానిలో సమావేశవ్వడానికి తగిన ఆదేశాలను ఇవ్వాలని కోరుతూ రైతుల తరఫున దాఖలైన పిటిషన్‌ను సుప్రీంకోర్టు సోమవారం తోసిపుచ్చింది. కేవలం వార్తాపత్రిక కథనాల ఆధారంగా ప్రచారం కోసం ఇటువంటి పిటిషన్ వేయడం తగదని పిటిషనర్‌ను సుప్రీంకోర్టు మందలించింది. ఇటువంటి విషయాలలో చాలా జాగ్రత్తగా ఉండాలని, ఇదే తరహా పిటిషన్‌పై హైకోర్టు ఇప్పటికే ఆదేశాలు జారీచేసిందని జస్టిస్ సూర్యకాంత్, స్టిస్ కెవి విశ్వనాథన్‌లతో కూడిన ధర్మాసనం పేర్కొంది. తాము ఎవరి పక్షాన మాట్లాడడం లేదని, ఇవి చాలా జఠిలమైన అంశాలని, పూర్తిగా పరిశోధన చేసిన తర్వాతే పిటిషన్ వేయాలని ధర్మాసనం సూచించింది. దీంతో ఈ పిటిషన్‌ను ఉపసఃహరించుకోనున్నట్లు పిటిషనర్ తెలియచేశారు. రైతులకు చెందిన సోషల్ మీడియా ఖాతాలను అన్‌బ్లాక్ చేయాలని, వాక్ స్వాతంత్య్రాన్ని కాపాడాలని పిటిషనర్ తన పిటిషన్‌లో కోర్టును అభ్యర్థించారు. సిక్ ఛాంబర్ ఆఫ్ కామర్స్…

Read More

భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) చీఫ్ సోమనాథ్ క్యాన్సర్ బారిన పడ్డారు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా వెల్లడించారు. సూర్యుడిని అధ్యయనం చేసేందుకు రూపొందించిన ఆదిత్య ఎల్ 1ప్రయోగం చేపట్టిన రోజే వ్యాధి నిర్ధారణ అయినట్టు తెలిపారు. ఓ మళయాళం వెబ్ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడిన ఆయన ప్రస్తుతం పూర్తిగా కోలుకుంటున్నట్టు చెప్పారు. చంద్రయాన్ 3 ప్రయోగం సమయం లోనే ఆరోగ్య సమస్యలు వచ్చాయి. ఆ సమయం లో దాని గురించి నాకు స్పష్టమైన అవగాహన లేదు. కానీ ఆదిత్య ఎల్ 1 మిషన్ ప్రయోగించిన ఉదయమే వైద్య పరీక్షలు చేయించుకున్నా. కొద్ది సమస్య ఉన్నట్టు గుర్తించారు. ప్రయోగం ముగిసిన తర్వాత చెన్నై వెళ్లి మరిన్ని స్కాన్‌లు చేయించగా అప్పుడే నాకు అర్థమైంది నా కడుపులో కణితి పెరిగిందని. మరో రెండు మూడు రోజుల తరువాత నిర్ధారణ అయ్యింది. అది వంశపారంపర్యంగా వచ్చే వ్యాధి అని ఇస్రో ఛైర్మన్…

Read More

లోక్‌సభ ఎన్నికలలో నాలుగు స్థానాల్లో పోటీ చేసే అభ్యర్థులను బిఆర్‌ఎస్ అధినేత కె.చంద్రశేఖర్‌రావు ప్రకటించారు. కరీంనగర్ నుంచి బి.వినోద్ కుమార్, పెద్దపల్లి నుంచి కొప్పుల ఈశ్వర్, ఖమ్మం నుంచి నామ నాగేశ్వర్ రావు, మహబూబాబాద్ నుంచి మాలోత్ కవిత పేర్లను బిఆర్‌ఎస్ అధినేత ఖరారు చేశారు. లోక్‌సభ ఎన్నికల కార్యాచరణలో భాగంగా రెండు రోజులుగా ఆయా పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని ముఖ్యనేతలతో కెసిఆర్ సమావేశమయ్యారు. సోమవారం ఖమ్మం, మహబూబాబాద్ నియోజకవర్గాల నేతలతో బిఆర్‌ఎస్ అధినేత కెసిఆర్ భేటీ అయ్యారు. తెలంగాణ భవన్‌లో జరిగిన ఈ సమావేశంలో సమావేశంలో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్, సీనియర్ నేత హరీశ్‌రావు, ఎంపీలు కేశవరావు,వద్దిరాజు రవిచంద్ర, నామ నాగేశ్వర రావు, మాలోతు కవిత, మాజీ మంత్రులు, ఎంఎల్‌ఎలు, మాజీ ఎంఎల్‌ఎలు, ఎంఎల్‌సిలు, ఇతర నాయకులు పాల్గొన్నారు. నియోజకవర్గాల పరిధిలోని ప్రజాప్రతినిధులు, మాజీలు, సీనియర్ నేతలతో కెసిఆర్ సమావేశమై లోక్‌సభ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించారు.ఈ సందర్భంగా…

Read More

బీజేపీతోనే తెలంగాణ అభివృద్ధి సాధ్యమని ప్రధాని నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. ఆదిలాబాద్ ఇందిరా ప్రియదర్శిని స్టేడియంలో నిర్వహించిన బీజేపీ విజయసంకల్ప సభలో పాల్గొంటూ ‘నా తెలంగాణ కుటుంబ సభ్యులారా..నా తెలంగాణ కుటుంబ సభ్యులకు నమస్కారాలు’ అంటూ మోదీ తెలుగులో ప్రసంగం ప్రారంభించారు. ఇది ఎన్నికల సభ కాదని, ఎన్నికల తేదీలు ఇంకా ప్రకటించనే లేదని చెబుతూ వికసిత్‌ భారత్‌ కోసం ఇక్కడకు ఇంత మంది రావటం సంతోషంగా ఉందని చెప్పారు. దేశ అభివృద్ధి కోసం రూ.వేల కోట్ల పనులను చేపట్టామని, బీజేపీ పాలనలో దేశం అభివృద్ధి చెందుతోందని ప్రధాని తెలిపారు. 15 రోజుల కాలంలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామని వివరించారు. 15 రోజుల్లో రెండు ఐఐటీలు, ఓ ట్రిపుల్‌ ఐటీ, ఒక ఐఐఎం, ఎయిమ్స్‌ను ప్రారంభించినట్లు మోదీ వెల్లడించారు. తెలంగాణలో కూడా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టినట్లు తెలిపారు. వికసిత్‌ భారత్‌పై ఆదివారం మంత్రులు, అధికారులతో సుదీర్ఘంగా చర్చించినట్లు…

Read More

వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ, బీఆర్ఎస్ మధ్యే పోటీ ఉంటుందని మాజీ సీఎం, బీఆర్ఎస్ పార్టీ అధినేత కే చంద్రశేఖరరావు స్పష్టం చేశారు. తెలంగాణ భవన్‌లో కరీంనగర్ నియోజకవర్గ నేతలతో ఆయన ఆదివారం సమావేశమవుతూ లోక్‌సభ ఎన్నికలకు పార్టీ కార్యాచరణ, అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించారు. మండల స్థాయిలో పార్టీ సమావేశాలు పెట్టుకోవాలని సూచించారు.  సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో త్వరలో బస్సు యాత్రలు చేద్దామని పార్టీ నేతలకు పిలుపునిచ్చారు. ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్, బీజేపీ మధ్యే పోటీ ఉంటుందని చెప్పారు.  ఈ క్రమంలోనే సెంటిమెంట్​‌గా వస్తున్న కరీంనగర్ ఎస్​ఆర్​ఆర్​ కాలేజీ గ్రౌండ్స్​‌లో మార్చి 12న సభకు ఏర్పాట్లు చేయాలని బీఆర్​ఎస్​ అధ్యక్షుడు కేసీఆర్​ పార్టీ శ్రేణులకు సూచించారు. కరీంనగర్​ పార్లమెంటు స్థానంలో బీఆర్​ఎస్​ గెలవబోతోందని జోస్యం చెప్పారు. అతికొద్ది రోజుల్లోనే కాంగ్రెస్​ ప్రభుత్వంపై వ్యతిరేకత వచ్చిందని చెబుతూ రైతులు రోడ్లు ఎక్కే పరిస్థితి వచ్చిందని తెలిపారు. బీఆర్​ఎస్‌​తోనే మేలు జరుగుతుందనే చర్చ రాష్ట్ర…

Read More

కనీస మద్దతు ధరకు చట్టబద్ధత కల్పించడంతో పాటు పలు ఇతర డిమాండ్ల సాధన కోసం ఈ నెల 6న దేశ రాజధాని ఢిల్లీకి తరలి రావాలని రైతు నేతలు పిలుపునిచ్చారు. ఇటీవల జరిపిన ఆందోళనలో అసువులు బాసిన రైతు స్వగ్రామం బల్లాహ్‌లో ఆదివారం జరిగిన సభలో రైతు సంఘం నేతలు శర్వాన్‌ సింగ్‌ పంధేర్‌, జగ్‌జిత్‌ సింగ్‌ దల్లేవాల్‌ మాట్లాడారు.  ఈ నెల 10న రైతులు దేశవ్యాప్తంగా నాలుగు గంటల పాటు రైల్‌రోకో నిర్వహించాలని పిలుపునిచ్చారు. డిమాండ్ల సాధనకు రైతులు ఇప్పటివరకు చేస్తున్న ఆందోళనను తామున్న ప్రదేశం నుంచే కొనసాగిస్తూ మరింత ఉద్ధృతం చేయాలన్నారు. ఢిల్లీ చలో మార్చ్‌ని మరింత వ్యాప్తి చేయాలని కిసాన్‌ మజ్దూర్‌ మోర్చా పిలుపునిచ్చింది.  ఈ సందర్భంగా శంభు, ఖనౌరి సరిహద్దు ప్రాంతాల్లో ఆందోళన చేస్తున్న పంజాబ్‌, హర్యానా రైతులకు రెండు సంఘాలు మద్దతు ప్రకటిస్తూ ఇతర రాష్ర్టాలకు చెందిన రైతులు, రైతు కూలీలు ఈ నెల…

Read More

విశాఖపట్నంలో కలకలం సృష్టించిన బంగారం చోరీ వ్యవహారంలో బాధితురాలి స్నేహితురాలే నిందితురాలిగా తేలింది. దొండపర్తి బాలాజీ రెసిడెన్సీలో జరిగిన దొంగతనం కేసులో ఓ యువ నటి సోము సౌమ్య శెట్టిని 4 టౌన్ పోలీసులు ఆదివారం అరెస్టు చేశారు. నిందితురాలి నుంచి 57 తులాల బంగారం స్వాధీనం చేసుకున్నారు. పెందుర్తికి చెందిన సౌమ్యశెట్టి బాధితుడు జనపాల ప్రసాద్‌ కుమార్తె స్నేహితురాలు. ఇద్దరికి గతంలో పరిచయం ఉంది. పెళ్లైన తర్వాత ఇద్దరు విడిపోయారు. ఇటీవల ఇన్‌స్టాగ్రాంలో తిరిగి పరిచయం అయింది. ఈ ఏడాది ఫిబ్రవరి 2న ఆమె ఇంటికి వచ్చిన ఈ యువతి బీరువాలో ఉన్న బంగారాన్ని దొంగిలించింది. బాధితులు ఫిబ్రవరి 23న బీరువా తెరిచి చూడగా అందులో 74 తులాల బంగారం కనిపించకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు సాంకేతిక ఆధారాలతో నిందితురాలిని గుర్తించారు. సౌమ్యశెట్టి కొన్నేళ్లుగా చిన్నాచితక చిత్రాల్లో నటిస్తోంది. చోరీ తరువాత నగలతో గోవా …

Read More

పాకిస్తాన్‌ 24వ ప్రధానిగా షెహబాజ్‌ షరీఫ్‌ ఆదివారం ఎన్నికయ్యారు. సంక్షోభంలో ఉన్న పాకిస్తాన్‌ నావను మిత్ర పక్షాల సహాయంతో ఒడ్డుకు చేరుస్తానని పాక్‌ ప్రధానిగా ఎన్నికైన వెంటనే చేసిన ప్రసంగంలో షెహబాజ్‌ పేర్కొన్నారు. పాకిస్థాన్‌ పీపుల్స్‌ పార్టీ (పిపిపి), పాకిస్థాన్‌ ముస్లిం లీగ్‌ -నవాజ్‌ (పిఎంఎల్‌-ఎన్‌) పార్టీల సంకీర్ణ ప్రభుత్వానికి రెండో పర్యాయం ఆయన నేతృత్వం వహించనున్నారు.  పార్లమెంటులో నిర్వహించిన ప్రధాని ఎన్నికలో షెహబాజ్‌ తన ప్రత్యర్థి పిటిఐ మద్దతు కలిగిన ఒమర్‌ అయూబ్‌ ఖాన్‌పై విజయం సాధించారు. షెహబాజ్‌కు 201 ఓట్లు రాగా, అయూబ్‌ ఖాన్‌కు 92 ఓట్లు వచ్చాయి. షహబాజ్‌ ప్రధానిగా సోమవారం ప్రమాణ స్వీకారం చేయనున్నారు. షెహబాజ్‌ 2022 ఏప్రిల్‌ నుండి ఆగస్టు 2023 వరకు మొదటి సంకీర్ణ ప్రభుత్వానికి నాయకత్వం వహించారు. షెహబాజ్‌ ప్రధానిగా ఎన్నికైనట్లు పాక్‌ జాతీయ అసెంబ్లీ (పార్లమెంటు) స్పీకర్‌ సర్దార్‌ అయాజ్‌ సాదిఖ్‌ ప్రకటించిన వెంటనే ఆయన తన సోదరుడు పాకిస్తాన్‌…

Read More

తెలంగాణలో ఎండల తీవ్రత దడ పుట్టిస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా ఫిబ్రవరి నెల చివర నుంచే ఎండలు మండిపోతున్నాయి. ఉదయం, సాయంత్రం వేళలో వాతావరణం చల్లగా ఉన్నా పగటిపూట మాత్రం సూర్యుడు విజృంభిస్తున్నాడు. నిప్పులు చెరిగే ఎండలతో జనాలు బెంబేలెత్తిపోతున్నారు. వారం రోజులుగా హైదరాబాద్ తోపాటు పలు జిల్లాల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఈ క్రమంలో రానున్న 5 రోజులు తెలంగాణ వ్యాప్తంగా ఎండలు తీవ్రంగా ఉంటాయని హైదరాబాద్ వాతావరణ శాఖ వెల్లడించింది. ఆదివారం నుంచి గురువారం వరకు ఐదు రోజుల పాటు ఎండల తవ్రత రికార్డు స్ధాయిలో నమోదు కానున్నట్టు వాతావరణ శాఖ తెలిపింది. ఈ 5 రోజులు 37 డిగ్రీల సెల్సీయస్ నుంచి 40 డిగ్రీల వరకు పగటి ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. రాత్రి వేళల్లోనూ సాధారణం కంటే ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయని పేర్కొంది. ఇక, హైదరాబాద్‌లోనూ ఎండలు మండిపోతున్నాయి. రాష్ట్రంలో ఇప్పటికే ఉష్ణోగ్రతలు సాధారణం…

Read More