Author: Editor's Desk, Tattva News

ప్రజల కోసం సీఎం పదవికి రాజీనామా చేయడానికి సిద్ధం అని బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆర్జీ కర్ ఆస్పత్రి జూనియర్ వైద్యురాలి హత్యాచారం విషయంలో న్యాయం జరగాలని తాను కూడా కోరుకుంటున్నట్లు చెప్పారు. ఆర్జీ కర్ ఆస్పత్రి ఘటనపై ప్రతిష్టంభన తొలగించడానికి జూనియర్ డాక్టర్లతో చర్చలు జరపడానికి మూడుసార్లు ప్రయత్నించినట్లు తెలిపారు. వైద్యుల ఆందోళనల నేపథ్యంలో ఇప్పటివరకు 27 మంది మరణించారు, 7 లక్షల మంది రోగులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆమె చెప్పారు. ఆర్జీ కర్ ప్రతిష్టంభనకు నేడు ముగింపు లభిస్తుందని ఆశించిన బంగాల్ ప్రజలకు క్షమాపణలు చెప్పారు. ”ప్రస్తుతం ఈ కేసు కోర్టు పరిధిలో ఉంది. అందువల్ల జూనియర్‌ వైద్యులు డిమాండ్‌ చేసినట్లు చర్చలను ప్రత్యక్ష ప్రసారం చేయలేం. అయితే, ఈ భేటీ వీడియో రికార్డింగ్‌కు ఏర్పాట్లు చేశాం. సుప్రీంకోర్టు అనుమతితో ఆ ఫుటేజీని వైద్యులకు అందజేస్తాం. ఆందోళన చేస్తున్న జూనియర్ డాక్టర్లపై ఎలాంటి…

Read More

సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి కన్నుమూశారు. 72 ఏళ్ల సీతారాం ఏచూరి  గత కొంతకాలంగా ఊపిరితిత్తుల ఇన్‌ఫెక్షన్‌తో ఢిల్లీ ఎయిమ్స్‌లో చికిత్స తీసుకున్నారు. అయితే ఆయన ఆరోగ్యం పూర్తిగా విషమించడంతో గురువారం మధ్యాహ్నం ఆయన మరణించినట్లు ఎయిమ్స్ డాక్టర్లు వెల్లడించారు.  ఊపిరితిత్తుల ఇన్‌ఫెక్షన్‌తో గత నెల 19వ తేదీన సీతారాం ఏచూరి ఢిల్లీ ఎయిమ్స్‌లో చేరారు. అప్పటినుంచి అక్కడే చికిత్స తీసుకుంటున్న ఆయన ఆరోగ్య పరిస్థితి పూర్తిగా విషమించడంతో డాక్టర్లు వెంటిలేటర్‌పై చికిత్స అందించారు. అయితే మొదట ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని.. చికిత్సకు స్పందిస్తున్నారని సీపీఎం పార్టీ పేర్కొంది. తర్వాత మళ్లీ ఆరోగ్యం విషమించిందని తెలిపింది. ఈ క్రమంలోనే ఇవాళ ఆయన కన్నుమూశారు. ఏచూరి సర్వేశ్వర సోమయాజులు, కల్పకం దంపతులకు 1952 ఆగస్టు 12న చెన్నై లో జన్మించిన సీతారాం ఏచూరి 1974లో ఎస్ఎఫ్ఐ చేరారు. 1975లో సిపిఎం ప్రాధమిక సభ్యుత్వంను తీసుకున్నారు. 1985లో సిపిఎం కేంద్ర కమిటీ…

Read More

కొన్ని రోజుల క్రితం సంచలనం కలిగించిన బెంగళూరు రేవ్ పార్టీ కేసులో పోలీసులు ఫైనల్‌గా దాఖలు చేసిన ఛార్జిషీట్‌ లో టాలీవుడ్‌ నటి హేమ  డ్రగ్స్‌ తీసుకున్నట్టు నిర్ధారణ యైంది. పోలీసులు ఎండీఎంఏ మెడికల్‌ రిపోర్ట్‌ను కూడా జత చేశారు. ఈ కేసులో నటి హేమతోపాటు 88 మంది డ్రగ్స్‌ తీసుకున్నారని వివరించారు. పోలీసులు చార్జీషీట్‌లో రేవ్‌ పార్టీ నిర్వాహకులుగా 9 మందిని పేర్కొన్నారు. కొన్ని రోజుల క్రితం బెంగుళూరు రేవ్ పార్టీ అంటూ ఓ రేంజ్‌లో హడావుడి జరిగిన విషయం తెలిసిందే. ఇందులో నటి హేమతో పాటు మరికొంత మంది డ్రగ్స్ సేవించినట్లుగా వార్తలు వైరల్ అయ్యాయి. అయితే హేమ మాత్రం ఈ రేవ్ పార్టీ విషయంలో తనకేం తెలియదని, తను డ్రగ్స్ సేవించలేదంటూ మీడియా ముందుకు వచ్చి క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేస్తూ ఉంది.  ఈ క్రమంలో  బెంగుళూరు పోలీసులు రేవ్ పార్టీ కేస్‌లో ఛార్జ్ షీట్ దాఖలు…

Read More

సెప్టెంబర్ 17వ తేదీన `తెలంగాణ విముక్తి దినం’ను తెలంగాణ ప్రజా పరిపాలన దినోత్సవంగా ఉత్సవాలు జరపాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఆ రోజున రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, స్థానిక సంస్థల కార్యాలయాలు, గ్రామ పంచాయతీల్లో జాతీయ పతాకావిష్కరణ చేయాలని ఆదేశించింది. జాతీయ పతాకావిష్కరణకు జిల్లాల వారీగా ఇంఛార్జీలను ప్రభుత్వం నిర్ణయించింది. మంత్రులు, సలహాదారులను, ప్రభుత్వ విప్‌లను, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను జిల్లాల ఇంఛార్జీలుగా నియమించింది. జిల్లాల వారిగా ఇంఛార్జీలు : ఆదిలాబాద్‌ – ప్రభుత్వ సలహాదారు షబ్బీర్‌ అలీ, భద్రాద్రి కొత్తగూడెం – మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, హనుమకొండ – దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ, జగిత్యాల – ప్రభుత్వ విప్‌ లక్ష్మణ్‌ కుమార్‌, జయశంకర్‌ భూపాలపల్లి – అటవీ అభివృద్ది కార్పొరేషన్‌ ఛైర్మన్‌ పొదెం వీరయ్య, జనగామ – ప్రభుత్వ విప్‌ బీర్ల ఐలయ్య, జోగులాంబ గద్వాల్‌ – ప్రభుత్వ ప్రత్యేక సలహాదారు జితేందర్‌ రెడ్డి, కామారెడ్డి -…

Read More

ఆయుష్మాన్ భారత్ ప్రధాన మంత్రి జన్ ఆరోగ్య యోజన (ఎబి పీఎం- జేఎవై) పథకం కింద ఆదాయంతో సంబంధం లేకుండా 70 ఏళ్లు పైబడిన సీనియర్ సిటిజన్లందరికీ రూ .5 లక్షల ఆరోగ్య బీమా కల్పించాలన్న ప్రతిపాదనకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో కేంద్ర కేబినెట్ బుధవారం ఢిల్లీలో సమావేశమైంది. మోదీ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం దేశవ్యాప్తంగా 4.5 కోట్ల కుటుంబాలకు ప్రయోజనం చేకూరుస్తుందని కేంద్ర సమాచార, ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. సామాజిక, ఆర్థిక స్థితితో సంబంధం లేకుండా 70 ఏళ్ల వయస్సు పైబడిన సీనియర్ సిటిజన్లందరూ ఈ ఆయుష్మాన్ భారత్ ప్రధాన మంత్రి జన్ ఆరోగ్య యోజన ప్రయోజనాలను పొందడానికి అర్హులని ప్రభుత్వం ఒక ప్రకటనలో తెలిపింది. ఈ ప్రభుత్వ ఉచిత ఆరోగ్య బీమాను ఎలా పొందాలి? ఆయుష్మాన్ భారత్ ప్రధాన మంత్రి జన్ ఆరోగ్య యోజన కింద…

Read More

విజ్ఞాలను తొలగించే విఘ్నేశ్వరుడికి వాడవాడలా పూజలు వైభవోపేతంగా జరుగుతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో ప్రఖ్యాతి గాంచిన ఖైరతాబాద్​లోని శ్రీ సప్తముఖ మహాశక్తి గణపతి వద్ద సైతం భారీ ఎత్తున ఆ బడా గణేశునికి పూజలు అందుతున్నాయి. వినాయక నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా వేలాది భక్తుల నడుమ లక్ష్మీ గణపతి రుద్ర హోమం అంగరంగ వైభవంగా నిర్వహించారు.  ఖైరతాబాద్ బడా గణేష్ 70వ వార్షికోత్సవం సందర్భంగా ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో 280 జంటలతో 70 హోమ గుండాల మధ్య ఈ లక్ష్మీ గణపతి రుద్ర హోమం ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో పెద్దఎత్తున భక్తులు పాల్గొన్నారు. ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలనే సంకల్పంతో ఈ హోమం చేసినట్లు ఉత్సవ కమిటీ నిర్వాహకులు తెలిపారు.  ఖైరతాబాద్​లోని శ్రీ సప్తముఖ మహాశక్తి గణపతి వద్ద సోమవారం శివ పార్వతుల కల్యాణం కన్నులపండువగా నిర్వహించారు. ఈ క్రమంలోనే భక్తులు మహా గణపతికి లక్ష రుద్రాక్షమాలతో అలంకరించారు. మరోవైపు ఖైరతాబాద్ వినాయకుడిని చూసేందుకు…

Read More

“మిస్టర్ రాహుల్ గాంధీ..! క్విట్ ఇండియా” అంటూ కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీని ఉద్దేశించి కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ వ్యాఖ్యానించారు. విదేశాల్లో పర్యటిస్తూ భారత్‌ను కించపర్చడమే కాకుండా ఎన్నికల వ్యవస్థను విమర్శిస్తున్న రాహుల్ గాంధీకి ఈ దేశంలో ఉండే అర్హత లేదని మండిపడ్డారు. రాబోయే జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో కాంగ్రెస్, బిఆర్‌ఎస్, ఎంఐఎం పార్టీలు కలిసి పోటీ చేయబోతున్నాయని బండి సంజయ్ విమర్శించారు. అందరూ కలిసి పోటీ చేసినా ఈసారి జీహెచ్‌ఎంసీపై కాషాయ జెండాను ఎగరేసి తీరుతామని, మేయర్ పదవిని కైవసం చేసుకుంటామని ధీమా వ్యక్తం చేశారు. గచ్చిబౌలి ఎస్సార్ కన్వెన్షన్ హాలులో రంగారెడ్డి అర్బన్ జిల్లా ఆధ్వర్యంలో బుధవారం జరిగిన బీజేపీ సభ్యత్వ నమోదు కార్యక్రమానికి బండి సంజయ్ హాజరయ్యారు. ఆయనతో పాటు చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి, రంగారెడ్డి అర్బన్ జిల్లా అధ్యక్షుడు సామ రంగారెడ్డి, కూన రవి కుమార్ తదితరులు హాజరయ్యారు.…

Read More

సిమ్లాలోని సంజౌలీ ఏరియాలో గల మసీదులో అక్రమ నిర్మాణాన్ని కూల్చివేయాలన్న ఆందోళనకారుల డిమాండ్ బుధవారం ఉద్రిక్తతలకు దారి తీసింది. ఆందోళనకారులు బారికేడ్లు తొలగించి తమ నిరసన ప్రదర్శనలు సాగించడంతో భద్రతాదళాలు లాఠీఛార్జి చేశాయి. వాటర్ క్యాన్లు ప్రయోగించాయి. చాలా మంది ఆందోళన కారులు, పోలీస్‌లుగాయపడ్డారు. వీరిని ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి అధ్వాన్నంగా మారడంతో పాఠశాలల నుంచి విద్యార్థులను వెనక్కు పంపేశారు. హిందూ గ్రూపుల పిలుపుపై వందలాది మంది ఆందోళనకారులు బుధవారం ఉదయం సబ్జీ మండీ థల్లి వద్ద సమావేశమై సంజౌలీ వైపు బయలుదేరారు. ధల్లి టెన్నెల్‌లో అడ్డుగా ఉంచిన బారికేడ్లు తొలగించారు. మసీదు వద్ద బారికేడ్లను కూడా తొలగించి ముందుకు వెళ్తుండడంతో పోలీస్‌లు స్వల్పంగా లాఠీచార్జి చేయవలసి వచ్చింది. వాటర్ క్యాన్లు ప్రయోగించి ఆందోళనకారులను చెదరగొట్టారు. అంతకు ముందు బుధవారం ఉదయం సంజౌలీ మసీదు వద్ద ఆందోళన చేస్తున్నవ్యక్తిని పోలీస్‌లు అదుపు లోకి తీసుకున్నారు. ఆందోళన సాగించిన వ్యక్తి హిందూ జాగరణ్…

Read More

కాంగ్రెస్‌ ఎంపీ, లోక్‌సభలో విపక్ష నేత రాహుల్‌ గాంధీ అమెరికా పర్యటనలో బీజేపీ, ఆరెస్సెస్‌పై చేసిన వ్యాఖ్యలను బిజెపి నేతలు తీవ్రంగా ఖండిస్తున్నారు. విదేశీ గడ్డపై దేశాన్ని అవమానించేలా మాట్లాడటం రాహుల్‌ గాంధీకి అలవాటుగా మారిందని దుయ్యబడుతున్నారు. రాహుల్‌ విదేశీ పర్యటనలో అర్ధరహిత, నిరాధార, తప్పుదారి పట్టించే అవాస్తవాలను పదేపదే వల్లెవేస్తున్నారని రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ తప్పుపట్టారు. రాహుల్ వ్యాఖ్యలు సిగ్గుచేటని, అవి దేశ ప్రతిష్టను దెబ్బతీసేలా ఉన్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. భారత్‌లో సిక్కులను గురుద్వారల్లో తలపాగాలను ధరించనీయడం లేదని, తమ మతాచారాలను పాటించకుండా నిరోధిస్తున్నారని రాహుల్‌ చెప్పారని ఇది పూర్తిగా సత్యదూరమని రాజ్‌నాథ్‌ సింగ్‌ ట్వీట్ చేశారు. ఎన్డీయే ప్రభుత్వం రిజర్వేషన్లను తొలగించాలని కోరుకుంటున్నదని ప్రచారం చేశారని ఇది నిరాధార ఆరోపణని మంత్రి పేర్కొన్నారు. అమెరికా పర్యటనలో చైనా సరిహద్దు విషయంలోనూ తప్పుదారిపట్టించే అవాస్తవాలను మాట్లాడారని ఆరోపించారు. రాహుల్‌ గాంధీ ప్రేమ దుకాణానికి బదులు అసత్యాల దుకాణం…

Read More

ఇంద్రకీలాద్రి పై వున్న దుర్గమల్లేశ్వర స్వామివార్ల దసరా ఉత్సవాలకు ఘనంగా ఏర్పాట్లు చేయాలని దేవస్థానం అధికారులను దేవాదాయ శాఖా మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ఆదేశించారు. మంగళవారం నాడు కనకదుర్గ ఆలయాన్ని సందర్శించిన మంత్రి కొండపై నిర్మిస్తున్న రిటైనింగ్ వాల్ పనులను పరిశీలించారు.  నిర్మాణం పనుల పురోగతి అడిగి తెలుసుకున్నారు.  అమ్మ వారి ఉత్సవాలకు వచ్చే భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా  దేవస్థానం అధికారులు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఏర్పాట్లు విషయంలో భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలిగిన తీవ్రమైన చర్యలు తీసుకుంటామని మంత్రి హెచ్చరించారు. గతంలో జరిగిన ఇబ్బoదులను దృష్టిలో ఉంచుకుని అవి పురావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని మంత్రి సూచించారు. కొండాపై నిర్మిస్తున్న రిటైనింగ్ వాల్ పనులను త్వరిత్తగాతిన పూర్తి చేయాలని మంత్రి ఆనం ఆదేశించారు. దసరా ఉత్సవాల నిర్వహణకు సంబంధించి కార్యాచరణ ప్రణాళికను రెండు రోజుల్లో రూపొందించుకుని రావాలని దేవస్థానం అధికారులను ఆదేశించారు. ఈ సారి అమ్మవారి ఉత్సవాలను…

Read More