రాంచీలో జరిగిన నాలుగో టెస్టులో టీమిండియా 5 వికెట్లతో అద్భుత విజయాన్ని అందుకుంది. 192 పరుగుల లక్ష్యాన్ని 5 వికెట్లు కోల్పోయి ఛేదించింది. దీంతో ఇంగ్లండ్‌తో ఐదు టెస్టుల సిరీస్‌ను మరో టెస్టు మిగిలుండగానే చేజిక్కించుకుంది. ఓ దశలో టీమిండియా 120 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి కష్టాల్లో ఉన్న జట్టును.. శుభ్ మాన్ గిల్, ధ్రువ్ జురెల్ ఆదుకున్నారు. వీరిద్దరు ఆరో వికెట్‌కు అజేయంగా 72 పరుగులు జోడించి టీమిండియా విజయాన్ని అందించారు. గిల్ 52, జురెల్ 39 పరుగులతో నాటౌట్‌గా ఉన్నారు. టీమిండియా రెండో ఇన్నింగ్స్‌లో కెప్టెన్ రోహిత్ శర్మ 55, యశస్వి జైస్వాల్ 37 పరుగులు చేశారు. రజత్ పాటిదార్ (0), రవీంద్ర జడేజా (4), సర్ఫరాజ్ ఖాన్ (0) నిరాశపరిచారు. టర్నింగ్ పిచ్‌పై యువ ఆటగాళ్లు శుభ్‌మన్ గిల్(52 నాటౌట్), ధ్రువ్ జురెల్(39 నాటౌట్)లు స్టోక్స్ సేనకు పరీక్ష పెట్టారు. క్రీజులో పాతుకుపోయిన ఈ ఇద్దరూ కీలక…
Author: Editor's Desk, Tattva News
తిరుమల తిరుపతి దేవస్థానం గౌరవ ప్రధాన అర్చకులు రమణ దీక్షితులుపై టీటీడీ పాలకమండలి వేటు వేసింది. ఈమేరకు టీటీడీ చైర్మన్ కరుణాకర్ రెడ్డి సోమవారం వెల్లడించారు. టీటీడీ, ప్రభుత్వం, అహోబిలం మఠం, అర్చకులు, జీయ్యర్లపై రమణ దీక్షితులు చేసిన వ్యాఖ్యలపై పాలకమండలి సమావేశంలో చర్చించి ఆయనపై చర్యలకు నిర్ణయించినట్లు చెప్పారు. పాలకమండలి నిర్ణయం మేరకు దీక్షితులను టీటీడీ నుంచి తప్పిస్తూ ఉత్తర్వులు జారీ చేసినట్లు వివరించారు. తిరుమలలో అసాంఘిక కార్యకలపాలు జరుగుతున్నాయని పేర్కొంటూ రమణ దీక్షితులు విడుదల చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. తిరుమలలో క్రిస్టియానిటీ వేగంగా వ్యాప్తి చెందిందని, సీఎం జగన్ క్రిస్టియన్ కావడంతో ఆలయంలోనూ ఆ మతం వ్యాపిస్తోందని రమణ దీక్షితులు ఆరోపించారు. గత నవంబర్‌లో ప్రధాని నరేంద్ర మోదీ తిరుమలను సందర్శించిన సందర్భంగా రమణ దీక్షితులు చేసిన ట్విట్ సంచలనం రేపింది. తిరుమల ఆలయంలో సనాతన ధర్మాన్ని పాటించని ఓ అధికారి, ప్రాచీన…
జ్ఞానవాపిమసీదు లోపల ఉన్న వ్యాస్ కా టెఖనా వద్ద హిందువులు పూజ చేసుకోవచ్చని అలహాబాద్ హైకోర్టు స్పష్టం చేసింది. వ్యాస్ కా టెఖనా వద్ద హిందువులు పూజలు నిర్వహించుకోవచ్చని ఇటీవల వారణాసి సెషన్స్ జడ్జి అనుమతిచ్చారు. దానిని అంజుమన్ ఇంతెజామియా మసీదు కమిటీ అలహాబాద్ హైకోర్టులో సవాల్ చేసింది. పిటిషన్‌పై ఇరు వర్గాల మధ్య వాదనలు జరిగాయి. అలహాబాద్ హైకోర్టు జడ్జి జస్టిస్ రోహిత్ రంజన్ ఈ రోజు తీర్పు ఇచ్చారు. జ్ఞానవాపి వివాదం నేపథ్యంలో 1993 నుంచి హిందువుల పూజలు నిలిచిపోయాయి. ఇటీవల వారణాసి కోర్టు తీర్పు ఇవ్వడంతో పూజలు ప్రారంభించారు. అందుకు సంబంధించి ఏర్పాట్లు చేయాలని కోర్టు జిల్లా అధికారులకు ఆదేశాలు జారీచేసింది. పూజ క్రతువుల కోసం ఆర్చకుడిని నియమించాలని కాశీ విశ్వనాథ ఆలయ ట్రస్ట్‌కు వారణాసి జిల్లా కోర్టు స్పష్టం చేసింది. జ్ఞానవాపి మసీదు ప్రాంగణం దక్షిణ భాగంలో వ్యాస్ కా టెఖనా ఉంది. ఆ నేలమాలిగ…
సీఆర్పీసీ సెక్షన్ 41ఏ కింద తనకు జారీ చేసిన నోటీసులను రద్దుచేయాలని లేదా ఉపసంహరించుకోవాలని కోరుతూ ఎమ్మెల్సీ కల్వకుం ట్ల కవిత సీబీఐకి లేఖ రాశారు. ముందే నిర్ణయించిన కార్యక్రమాల రీత్యా ఈ నెల 26న విచారణకు హాజరు కావడం సాధ్యం కాదని ఆమె తెలిపారు. ఒకవేళ సీబీఐకి తన నుంచి ఏవైనా ప్రశ్నలకు సమాధానాలు, సమాచారం కావాలనుకుంటే వ ర్చువల్ పద్ధతిలో హాజరవుతానని స్పష్టంచేశారు. తనకు సీఆర్పీసీ సెక్షన్ 41ఏ కింద నోటీసులు జారీచేయడం సబబు కాదని ఆమె పేర్కొన్నారు. గతంలో ఇచ్చిన నోటీసులకు పూర్తి విరుద్ధంగా తాజా నోటీసులు జారీ చేశారని ఆరోపించారు. గతం లో (2022, డిసెంబర్)లో అప్పటి ఐవో (విచారణ అధికా రి) సెక్షన్ 160 కింద నోటీసులు జారీ చేసిన విషయాన్ని గుర్తు చేశారు. ప్రస్తుతం 41ఏను ఏ పరిస్థితుల్లో జారీ చేశారో స్పష్టత లేదని పేర్కొన్నారు. అసలు సెక్షన్ 41ఏ కింద నోటీసులు…
హర్యానాలో దారుణం జరిగింది. ఇండియన్ నేషనల్ లోక్ దళ్-ఐఎన్ఎల్‌డీ హర్యానా చీఫ్, మాజీ ఎమ్మెల్యే నఫే సింగ్ రాథీపై గుర్తు తెలియని వ్యక్తులు కాల్పులు జరిపారు. ఈ ఘటనలో నఫే సింగ్ రాథీ అక్కడికక్కడే మృతి చెందారు. నఫే సింగ్ రాథీ కారుపై దుండగులు కాల్పులు జరపగా ఆయనతోపాటు మరో ఇద్దరు ఆ పార్టీ నేతలు ప్రాణాలు కోల్పోయారు. మరో ముగ్గురు సెక్యూరిటీ సిబ్బందికి తీవ్ర గాయాలు అయ్యాయి. తీవ్ర బులెట్ గాయాలైన నఫే సింగ్ అక్కడికక్కడే మరణించారు. హర్యానాలోని ఝజ్జర్ జిల్లాలో ఆదివారం రాత్రి ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. బహదూర్‌గఢ్‌లోని బరాహి గేట్ సమీపంలో హ్యుందాయ్ ఐ10 లో కారులో వేచి ఉన్న షూటర్లు నఫే సింగ్ రాథీ ప్రయాణిస్తున్న కారుపై విచక్షణా రహితంగా కాల్పులు జరిపారు. అనంతరం అక్కడి నుంచి పరారయ్యారు. ఈ కాల్పుల్లో నఫే సింగ్ రాథీతోపాటు ఆ కారులో ఉన్న మరో ఇద్దరు నాయకులు…
ద్వారకాలో తీగల వంతెన ప్రారంభానికి వచ్చిన సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ పురాతన ఆధ్యాత్మిక నగరం ద్వారకాను సందర్శించారు. ఇందుకు మోడీ స్కూబా డైవింగ్ చేశారు. సముద్ర గర్భంలో నిక్షిప్తం అయిన శ్రీకృష్ణుడి మహానగరాన్ని సందర్శించారు. అక్కడ పూజలు నిర్వహించారు. గుజరాత్ తీరం వెంబడి పంచ్‌కుమి బీచ్ వద్ద ఆయన స్కూబా డైవింగ్‌లో భాగంగా ఆయన ఇందుకు అవసరం అయిన ప్రత్యేక డ్రస్సు వేసుకున్నారు. పురాతన నగరం అవశేషాలను వీక్షించారు. సముద్ర గర్భంలో ఉన్న ద్వారకాస్వామిని సందర్శించడం జల సాహసమే అవుతుంది. ఈ సాహసం కూడా ఆయన ఇప్పుడు పూర్తి చేశారు. సముద్ర గర్భంలో తాను ఉన్నప్పటి, పూజలు నిర్వహిస్తున్నప్పటి ఫోటోలు సామాజిక మాధ్యమాలలో పెట్టారు. ఇదో దివ్యానుభూతి, కాలతీత శక్తి అనుభూతిని భక్తిభావనతో అనుభవించాను. శ్రీకృష్ణుడు సకల జనులను అనుగ్రహిస్తాడు అని వ్యాఖ్యానించారు. తాను చేసింది సాహసం కంటే , పెంచుకున్న విశ్వాసం అని అనుకోవల్సి వస్తుందని మోదీ స్పందించారు. …
సమాజ్‌వాది పార్టీ (ఎస్‌పి) అధ్యక్షుడు అఖిలేశ్ యాదవ్ ఆదివారం ఆగ్రాలో రాహుల్ గాంధీ సారథ్యంలోని ‘భారత్ జోడో న్యాయ్ యాత్ర’లో చేరారు. రానున్న లోక్‌సభ ఎన్నికలకు సంబంధించి ఉత్తర ప్రదేశ్‌లో ఎస్‌పి, కాంగ్రెస్ మధ్య సీట్ల పంపకం ఒప్పందం కుదిరిన కొన్ని రోజులకు ఈ పరిణామం సంభవించింది. ఎస్‌పి, కాంగ్రెస్ కార్యకర్తలు ఇద్దరు అగ్ర నేతలకు మద్దతుగా నినాదాలు చేశారు. ఇద్దరు నేతలు కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రాతో కలసి యాత్ర కోసం చేరిన జనం వైపు చేతులు ఊపారు. ఈ సందర్భంగా ప్రసంగించిన అఖిలేశ్ యాదవ్ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ‘ఇప్పుడు రైతులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిలబడ్డారు. రైతుల బలానికి ప్రభుత్వం బెదురుతోంది. రానున్న కాలంలో బిజెపికి అధికార చ్యుతి కలుగుతుంది. ఇండియా కూటమి ప్రభుత్వం రైతులకు గౌరవం ఇస్తుంది’ అని అఖిలేశ్ చెప్పారు. వెనుకబడిన తరగతులు, దళితులు, మైనారిటీ వర్గాలకు సముచిత గౌరవాన్ని బిజెపి…
దేశంలో భారీ డ్రగ్స్ రాకెట్ గుట్టురట్టయ్యింది. ఢిల్లీ పోలీసులు, ఎన్‌సీబీ అధికారులు సంయుక్త ఆపరేషన్ చేపట్టి అంతర్జాతీయ డ్రగ్ నెట్‌వర్క్‌ను చేధించారు. ఈ దందాలో తమిళనాడుకు చెందిన ఓ సినీ నిర్మాత కీలక సూత్రధారిగా ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. ప్రస్తుతం అతడు పరారీలో ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు. ఈ డ్రగ్ నెట్‌వర్క్ భారతదేశం, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా, మలేషియాలకు విస్తరించినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఆపరేషన్‌లో ముగ్గురు వ్యక్తుల్ని ఢిల్లీలో అరెస్ట్ చేసినట్లు పేర్కొన్నారు. వారి నుంచి 50 కిలోల సూడోఎఫెడ్రిన్‌ను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. హెల్త్ మిక్స్ పౌడర్, ఎండు కొబ్బరి వంటి ఆహార పదార్థాల ముసుగులో కొన్ని సరకుల ద్వారా దీనిని అక్రమంగా రవాణా చేస్తున్నట్లు గుర్తించారు. గత 3 ఏళ్లలో వీరు మొత్తం 45 సరకులు పంపారని, అందులో సుమారు 3,500 కిలోల సూడోఎఫెడ్రిన్ ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. దాని విలువ అంతర్జాతీయ మార్కెట్‌లో రూ.2000 కోట్లకు పైగా…
అమెరికాలో జరిగిన ఓ అగ్ని ప్రమాదంలో భారత్‌కు చెందిన ఓ జర్నలిస్టు ప్రాణాలు కోల్పోయాడు. సెయింట్ నికోలస్ ప్లేస్ అపార్ట్‌మెంట్ భవనంలో ఈ ఘటన జరిగింది. న్యూయార్క్‌లోని హార్లెమ్‌లో లిథియం అయాన్ బ్యాటరీ కారణంగా సంభవించిన అగ్ని ప్రమాదంలో అతను మరణించాడు. మృతదేహాన్ని స్వదేశానికి తరలించేందుకు భారత రాయబార కార్యాలయం యత్నిస్తోంది. మృతుడి కుటుంబం, స్నేహితులతో టచ్‌లో ఉంటున్నామని తెలిపింది. వివరాల ప్రకారం.. కొలంబియా జర్నలిజం స్కూల్ పూర్వ విద్యార్థి ఫాజిల్ ఖాన్ (27) హెచింగర్ రిపోర్ట్‌లో డేటా జర్నలిస్టుగా పనిచేస్తున్నారు. 2018లో బిజినెస్ స్టాండర్డ్‌లో కాపీ ఎడిటర్‌గా తన వృత్తిని ప్రారంభించారు. కొలంబియా విశ్వవిద్యాలయం నుండి గ్రాడ్యుయేట్ డిగ్రీ కోసం 2020 న్యూయార్క్ వెళ్లడానికి ముందు ఢిల్లీలోని సిఎన్‌ఎన్-న్యూస్‌లో 18లో కరస్పాండెంట్‌గా పనిచేశాడు. ఈ ప్రమాదంలో పాజిల్ ఖాన్ మృతి చెందాడు. కొందరు కిటికీలో నుంచి దూకి ప్రాణాలు రక్షించుకున్నారు. ఈ ఘటనలో 17 మందికి తీవ్ర గాయాలయ్యాయి. వీరిలో…
వచ్చే ఐదేళ్లలో రూ. 1.25 లక్షల కోట్లతో వేలాది గోదాములు, గిడ్డంగులను నిర్మించడం ద్వారా సహకార రంగంలో 700 లక్షల టన్నుల నిల్వ సామర్థ్యాన్ని సృష్టించనున్నట్టు ప్రధాని నరేంద్ర మోదీ వెల్లడించారు. 11 రాష్ట్రాల్లో 11 ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘాలు (పీఏసీఎస్) ఏర్పాటు చేసిన 11 గోదాములను ఆయన ప్రారంభించారు. అలాగే మరో 500 పీఏసీఎ్‌సలలో గోదాములు, ఇతర వ్యవసాయ మౌలిక సదుపాయాల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ప్రధాని మాట్లాడుతూ ‘‘ ఈ రోజు మన రైతుల కోసం ప్రపంచంలోనే అతిపెద్ద నిల్వ పథకాన్ని ప్రారంభించాం. దీని కింద దేశవ్యాప్తంగా వేలాది గిడ్డంగులు, గోదాముల నిర్మాణం జరుగుతుంది’’ అని పేర్కొన్నారు. దేశంలో నిల్వకు సంబంధించిన మౌలిక సదుపాయాలులేని కారణంగా రైతులు భారీగా నష్టాలను భరించాల్సి వస్తోందని ఆయన తెలిపానరు. ‘‘గత ప్రభుత్వాలు ఈ సమస్యపై ఎప్పుడు దృష్టిసారించలేదు. కానీ ఈ రోజు పీఏసీఎ్‌సల ద్వారా ఈ సమస్యను…