Author: Editor's Desk, Tattva News

మద్దతు ధరను చట్టబద్దం చేయాలని డిమాండ్ చేస్తూ నిరసనలు చేపట్టిన రైతు సంఘాల నాయకులతో  కేంద్ర మంత్రులు గత రాత్రి జరిపిన నాల్గవ విడత చర్చలు సానుకూలంగా ముగిసాయి. ఐదు పంటలకు ఐదేళ్లపాటు మద్దతు ధరకు హామీ ఇస్తూ, వాటిని కేంద్ర ప్రభుత్వ ఏజెన్సీల ద్వారా కొనుగోలు చేయిస్తామని కేంద్ర మంత్రులు భరోసా ఇచ్చారు. కేంద్రం ప్రతిపాదనలపై తమ ఫోరమ్ లో చర్చించి, నిపుణుల అభిప్రాయాలు తీసుకొని తదుపరి కార్యాచరణ ప్రకటిస్తామని రైతు సంఘాలు తెలిపాయి. సోమవారం తెల్లవారుజామున ఒంటి గంట వరకు చర్చలు కొనసాగాయి.ఈ చర్చలో ఎంఎస్పీపై కేంద్ర ప్రభుత్వం కీలక ప్రతిపాదనలు చేసింది. రైతులతో ఒప్పందం కుదుర్చుకున్న తర్వాత ఐదేళ్లపాటు పప్పుధాన్యాలు, మొక్కజొన్న, పత్తి పంటలను ప్రభుత్వ ఏజెన్సీలు కనీస మద్దతు ధరకు కొనుగోలు చేస్తాయని తమ బృందం ప్రతిపాదించినట్లు కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ చెప్పారు. కందులు, మినుములు, మైసూర్‌ పప్పు, మొక్కజొన్న పండించే సాగుదారులతో ఎన్…

Read More

విశ్వసనీయతకు, వంచనకు మధ్య యుద్ధం జరుగుతోందని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తెలిపారు. అనంతపురం జిల్లా రాప్తాడు వైఎస్సార్‌సీపీ ‘సిద్ధం’ భారీ బహిరంగ సభలో ఎన్నికల ప్రచారభేరి మోగిస్తూ ఈ ఎన్నికలు రెండు సిద్ధాంతాల మధ్య జరగబోతున్న యుద్ధ అని తెలిపారు. కేవలం ఎమ్మెల్యేలు, ఎంపీలను ఎన్నుకునేవి మాత్రమే కాదని, ఈ ఐదేళ్ల కాలంలో ఇంటింటికీ మనందరి ప్రభుత్వం అందించిన అభివఅద్ధి, సంక్షేమం.. పథకాలు కొనసాగాలని అడుగులేస్తున్న మనకు.. వీటన్నింటినీ రద్దు చేయడమే లక్ష్యంగా డ్రామాలు ఆడుతున్న చంద్రబాబు నాయుడు మధ్య జరుగుతున్న ఈ యుద్ధానికి మీరు సిద్ధమేనా? అంటూ జగన్ ప్రశ్నించారు. ”ఈ యుద్ధంలో పేదలు ఒకవైపున.. పెత్తందారులు మరోవైపున ఉన్నారు. మాట ఇచ్చి నిలబెట్టుకున్న మనకు, మాట తప్పడమే అలవాటుగా ఉన్న ఆ పెత్తందారులకూ మధ్య జరుగుతున్నదీ యుద్ధం. విశ్వసనీయతకు, వంచనకు మధ్య జరుగుతున్న యుద్ధమిది. పేదవాడి భవిష్యత్తు కోసం.. వారి తరఫున నిలబడేందుకు మీరందరూ సిద్ధమేనా?” అంటూ పిలుపిచ్చారు.…

Read More

కాంగ్రెస్ నేతృత్వంలోని ‘ఇండియా కూటమి’ కుటుంబ పార్టీలు, అవినీతిమయం అని కేంద్ర హోమ్ శాఖ మంత్రి ఆరోపించారు. న్యూఢిల్లీలో బిజెపి జాతీయ సమ్మేళనంలో ప్రసంగించిన అమిత్ షా ఆనువంశిక, బుజ్జగింపు రాజకీయాలను ప్రోత్సహిస్తున్నందుకు ప్రతిపక్ష ఇండియా కూటమిపై తీవ్ర విమర్శలు చేశారు. ‘మహాభారత యుద్ధంలో కౌరవులు, పాండవుల శిబిరాలు ఉన్న మాదిరిగా ఇప్పుడు ఎన్నికలకు ముందు రెండు శిబిరాలు ఉన్నాయి’ అని అమిత్ షా చెప్పారు. ‘ఇండియా కూటమి అన్ని ఆనువంశిక పార్టీల సంకీర్ణం. వంశపారంపర్యం, అవినీతి, బుజ్జగింపు రాజకీయాలను అవి పెంచి పోషిస్తున్నాయి. కాని బిజెపి నేతృత్వంలోని ఎన్‌డిఎ దేశ సిద్ధాంతాలను అనుసరించే పార్టీల సంకీర్ణం’ అని ఆయన పేర్కొన్నారు. ఆ రెండు శిబిరాలలో దేనికి అనుకూలంగా తాము ఈ దఫా తీర్పు ఇవ్వాలో దేశ ప్రజలు నిర్ణయించుకోవలసి ఉంటుంది’ అని అమిత్ షా సూచించారు. ‘బిజెపి: దేశ్ కీ ఆశా, విపక్ష కీ హతాశా (బిజెపి: దేశం ఆశ,…

Read More

రాజ్‌కోట్‌ వేదికగా జరిగిన మూడోవ టెస్ట్‌లో 434 పరుగుల భారీ తేడాతో టీమ్‌ఇండియా ఘన విజయం సాధించింది. డబుల్‌ సెంచరీతో యశస్వి జైశ్వాల్‌ చేయగా.. బౌలింగ్‌తో రవీంద్ర జడేజా, కుల్‌దీప్‌ యాదవ్‌ ఇంగ్లాండ్‌ను బెంబేలెత్తించారు. దీంతో 557 పరుగుల లక్ష్య ఛేదనలో ఇంగ్లాండ్‌ 122 పరుగులకే కుప్పకూలింది. దీంతో 434 పరుగుల భారీ తేడాతో టీమ్‌ఇండియా గెలుపోందింది. అంతకుముందు తొలి ఇన్నింగ్స్‌లో భారత్‌ 445 పరుగులు చేసింది. ఇంగ్లాండ్‌ 319 రన్స్‌కే పరిమితమైంది. రెండో ఇన్నింగ్స్‌ను టీమ్‌ఇండియా 430/4 స్కోరు వద్ద డిక్లేర్డ్‌ చేసింది. యశస్వి జైస్వాల్‌ (214), సర్ఫరాజ్‌ (66)సాధించాడు. అలాగే శుభ్‌మాన్‌ గిల్‌ 91, కుల్‌దీప్‌ 27, రోహిత్‌ 19 పరుగులు చేశారు. ఇంగ్లాండ్‌ బౌలర్లలో రూట్‌, టామ్‌ హర్ట్లీ, రెహాన్‌ అహ్మద్‌ తలో వికెట్‌ తీసుకున్నారు. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లాండ్‌ బెన్‌ డకెట్‌ (4) రనౌట్‌గా పెవిలియన్‌కు చేరాడు. ఆ తర్వాత జాక్‌ క్రాలే (11)ను…

Read More

ఈ పదేళ్లలో అవినీతి రహిత పాలన అందించానని, అయితే ఇంకా చాలా నిర్ణయాలు తీసుకోవాల్సి ఉందని చెబుతూ తనకు రాజకీయాలు ముఖ్యం కాదని.. దేశమే ముఖ్యమని ప్రధాని నరేంద్ర మోదీ స్పష్టం చేశారు.  బీజేపీ కార్యకర్తలు దేశాభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తున్నారని కొనియాడారు. ఢిల్లీలో 2024 ఎన్నికల సన్నగా జరుగుతున్న రెండు రోజుల బీజేపీ జాతీయ సదస్సు ముగింపు సభలో మాట్లాడుతూ పార్టీని మరోసారి అధికారంలోకి తీసుకురావడానికి బీజేపీ పార్టీ కార్యకర్తలు ఎంతో కష్టపడుతున్నారని ప్రశంసించారు.  వచ్చే వంద రోజులు ఎంతో కీలకమనిచెబుతూ18 ఏళ్లు నిండిన వారంతా 18వ లోక్‌సభ ఎన్నికలకు ఓటు వేయబోతున్నారని పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా పార్టీ శ్రేణులు ఐక్యంగా పనిచేయాలని మోదీ కార్యకర్తలకు పిలుపునిచ్చారు. వచ్చే ఎన్నికల్లో అత్యధిక సీట్లు బీజేపీ గెలుస్తుందని మోదీ తెలిపారు. విపక్ష నేత కూడా బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయేకు 400 స్థానాలు వస్తాయని అంటున్నారని గుర్తు చేశారు. త్వరలో జరగనున్న 2024 లోక్​సభ…

Read More

రాజ్‌కోట్ వేదికగా ఇంగ్లండ్‌తో జరుగుతున్న మూడో టెస్టులో టీమిండియా యువ ఓపెనర్ డబుల్ సెంచరీ సాధించాడు. 231 బంతుల్లో ద్విశతకాన్ని సాధించాడు. శనివారం ఆట చివర్లో 104 పరగుల వద్ద రిటైర్డ్ హట్‌గా వెనుదిరిగిన జైస్వాల్ ఆదివారం తిరిగి మైదానంలో అడుగుపెట్టాడు. టీ20 తరహాలో బ్యాటింగ్ చేస్తూ విరుచుకుపడ్డాడు. వ‌రుస‌గా రెండు టెస్టు మ్యాచుల్లో డ‌బుల్ సెంచ‌రీలు చేశాడు.  విశాఖ వేదిక‌గా జ‌రిగిన రెండో టెస్టు మ్యాచ్‌లో డ‌బుల్ సెంచ‌రీ చేసిన జైస్వాల్ రాజ్‌కోట్ వేదిక‌గా జ‌రుగుతున్న మూడో టెస్టు మ్యాచ్‌లోనూ డబుల్ సెంచరీ చేశాడు.  జో రూట్ బౌలింగ్‌లో సింగిల్ తీసి 231 బంతుల్లో 14 ఫోర్లు, 10 సిక్స‌ర్లు సాయంతో డ‌బుల్ సెంచ‌రీని పూర్తి చేసుకున్నాడు. య‌శ‌స్వి టెస్టు కెరీర్‌లో అత‌డికి ఇది రెండో ద్విశ‌త‌కం. ఇక భారత్ తరఫున ఓ టెస్టు సిరీస్‌లో అత్యధిక పరుగులు చేసిన ఎడమచేతి వాటం బ్యాటర్‌గా చరిత్ర సృష్టించాడు. ఇంగ్లండ్ టెస్టు…

Read More

ప్రముఖ జైన దిగంబర ముని ఆచార్య విద్యాసాగర్ మహారాజ్ శనివారం తనువు చాలించారు.  ఛత్తీస్‌గఢ్‌లోని చంద్రగిరి జైన దేవాలయంలో విద్యాసాగర్ మహారాజ్ శనివారం అర్థరాత్రి 2:35 గంటలకు తన దేహాన్ని విడిచిపెట్టారు. దీనికి ముందు ఆయన ఆచార్య పదవిని వదులుకున్నారు.  మూడు రోజులపాటు ఉపవాసం ఉంటూ, మౌనం పాటించారు. అనంతరం ప్రాణాలు విడిచారు. విద్యాసాగర్ మహారాజ్‌ మరణవార్త తెలియగానే జైన సమాజానికి చెందిన పలువురు చంద్రగిరి జైన దేవాలయానికి చేరుకున్నారు. ఆదివారం ఆయన అంత్యక్రియలు జరగనున్నాయి. విద్యాసాగర్‌ మహరాజ్‌ గురువు జ్ఞాన్‌ సాగర్‌ మహరాజ్‌ కూడా తన 77వ ఏట చంద్రగిరి తీర్థంలోనే సజీవంగా సమాధిలోకి వెళ్లి మూడు రోజులకు దేహాన్ని విడిచారు. సజీవ సమాధికి మూడు రోజుల ముందే విద్యాసాగర్‌ మహరాజ్‌కు జ్ఞాన్‌ సాగర్‌ మహరాజ్‌ జైనమత గురువు స్థానాన్ని కట్టబెట్టారు. అప్పటికి విద్యాసాగర్‌ మహరాజ్‌ వయసు 26 ఏండ్లు. ఇప్పుడు విద్యాసాగర్‌ మహారాజ్‌ కూడా సజీవ సమాధికి ముందు…

Read More

వాలింటీర్లపై జనసేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్ అనుచిత వ్యాఖ్యలు చేశారని పేర్కొంటూ ఆంధ్ర ప్రదేశ్ ప్ర‌భుత్వం సీరియస్ అయింది. ఈ మేర‌కు ఆయ‌న పై రాష్ట్ర ప్రభుత్వం గుంటూరు న్యాయస్థానంలో క్రిమినల్ కేసు దాఖలు చేసింది. గతేడాది జులై 9న ఆయన వాలంటీర్లపై అనుచిత వ్యాఖ్యలు చేశారని, ప్రభుత్వ ప్రతిష్ఠకు భంగం కలిగించారనే ఆరోపణలతో కేసు పెట్టింది. ఈ క్రమంలో 499, 500 ఐపీసీ సెక్షన్ల కింద పవన్‌పై క్రిమినల్‌ కేసు నమోదు చేసిన జిల్లా కోర్ట కేసును నాలుగో అదనపు జిల్లా కోర్టుకు బదిలీ చేసింది. పవన్‌ కల్యాణ్ మార్చి 25న విచారణకు హాజరు కావాలని న్యాయమూర్తి నోటీసులు ఇచ్చారు.  గతేడాది జులై 9న పవన్‌ కల్యాణ్‌ మాట్లాడుతూ కేంద్ర నిఘా వర్గాల సమాచారం మేరకు రాష్ట్రంలో వేల మంది అమ్మాయిలు అదృశ్యమయ్యారని తెలిపారు. వారిలో 14 వేల మంది తిరిగి వచ్చారని పోలీసులు చెబుతున్నారని తెలిపారు. వాలంటీర్లు ప్రజల…

Read More

లోక్‌సభతో పాటు కొన్ని రాష్ర్టాల అసెంబ్లీ ఎన్నికలకు ఏర్పాట్లు దాదాపుగా పూర్తయ్యాయని ప్రధాన ఎన్నికల అధికారి రాజీవ్‌ కుమార్‌ వెల్లడించారు. ఎలక్టోరల్‌(ఎన్నికల) బాండ్ల పథకంపై ఇటీవల సుప్రీం కోర్టు జారీ చేసిన ఆదేశాలకు అనుగుణంగానే ఎన్నికల సంఘం పనిచేస్తుందని స్పష్టం చేశారు.  శనివారం భువనేశ్వర్‌లో ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఎన్నికల కమిషన్‌ పారదర్శకంగా పనిచేస్తుందని తెలిపారు. ఇదే విషయాన్ని సుప్రీంకోర్టుకు సమర్పించిన అఫిడవిట్లో పేర్కొన్నట్టు చెప్పారు. ఈవీఎంలు లేకుండా ఎన్నికల నిర్వహణ అంశంపై స్పందిస్తూ ఈ కేసు సుప్రీం కోర్టులో పెండింగ్‌లో ఉన్నదని, తీర్పు వచ్చాక, అందుకు అనుగుణంగా ఏర్పాట్లు చేస్తామని అన్నారు.  అసెంబ్లీ ఎన్నికలకు కూడా తాము సిద్ధంగా ఉన్నట్టు ఆయన ప్రకటించారు. పార్లమెంట్‌తోపాటు ఆయా రాష్ట్రాల్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల కోసం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు వెల్లడించారు. దేశవ్యాప్తంగా చేయాల్సిన ఏర్పాట్లన్నీ పూర్తి చేసినట్లు పేర్కొన్నారు.  ఇప్పటికే అన్ని రాష్ట్రాల్లో పరిశీలన పూర్తైందని, ఎన్నికల కోసం అధికారులను…

Read More

ప్రఖ్యాత ఉర్దూ కవి గుల్జార్‌, సంస్కృత పండితుడు జగద్గురు రాంభద్రాచార్యులు 58వ జ్ఞానపీఠ్‌ అవార్డు గ్రహీతలుగా ఎంపికయ్యారు. ఈ మేరకు సాహిత్యంలో అత్యున్నత పురస్కారమైన జ్ఞానపీఠ్‌ అవార్డు గ్రహీతల ఎంపిక కమిటీ శనివారం ప్రకటించింది. గుల్జార్‌ హిందీలో అనేక సినిమా పాటలను రాశారు. ఈయన ఉర్దూ కవిగా కూడా పేరు సంపాదించుకున్నారు. ఈయన ఉర్దూ రచనలకుగానూ 2002లో సాహిత్య అకాడమీ అవార్డు లభించింది. 2013లో దాదాసాహెబ్‌ ఫాల్కే అవార్డు, 2004లో పద్మభూషణ్‌ అవార్డులు వరించాయి. వీటితోపాటు పలు జాతీయ చలనచిత్ర అవార్డులు ఆయనకు దక్కాయి. రామభద్రాచార్య చిత్రకూట్‌లోని తులసిపీఠం వ్యవస్థాపకుడు. ఈయన హిందూ ఆధ్యాత్మిక నాయకుడు. విద్యావేత్త. ఇప్పటివరకు ఆయన వంద కంటే ఎక్కువ పుస్తకాలను రచించారు. ఉర్దూ, సంస్కృతం రెండు భాషలకు చెందిన ప్రముఖ రచయితలైన గుల్జార్‌, రామభద్రాచార్యలను ఈ అవార్డులను ఇవ్వాలని నిర్ణయించిందని జ్ఞానపీఠ్‌ ఎంపిక కమిటీ ఓ ప్రకటనలో పేర్కొంది. జ్ఞానపీఠ్ అవార్డును1944లో స్థాపించారు.భారతీయ సాహిత్యానికి విశేషమైన…

Read More