Author: Editor's Desk, Tattva News

భారత అంతరిక్ష పరిశోధనా సంస్ధ ఇస్రో కీర్తికిరీటంలో మరో మైలురాయి చేరింది. వాతావరణ పరిస్ధితులపై పరిశోధనలు చేసేందుకు వీలుగా మూడో తరం ఉపగ్రహం ఇన్సాట్ త్రీడీఎస్ ని ఇవాళ ఇస్రో విజయవంతంగా ప్రయోగించింది. ఏపీలోని శ్రీహరికోటలో ఉన్న అంతరిక్ష కేంద్రం షార్ నుంచి ఈ ప్రయోగం విజయవంతంగా చేపట్టారు. జీఎస్ఎల్వీ అంతరిక్ష వాహక నౌక ఈ ఉపగ్రహాన్ని నింగిలోకి మోసుకెళ్లింది. భూఉపరితలం అధ్యయనంతో పాటు సముద్రాల ఉపరితలాలను పర్యవేక్షించేందుకు చేసేందుకు వీలుగా ఇస్రో ఈ మూడో తరం వాతావరణ ఉపగ్రహం ఇన్సాట్ త్రీడీఎస్ ను ప్రయోగించింది. 51.7 మీటర్ల పొడవైన జీఎస్ఎల్వీ -ఎఫ్14 శ్రీహరికోటలో ఉన్న స్పేస్‌పోర్ట్‌లోని రెండవ లాంచ్ ప్యాడ్ నుంచి నింగిలోకి దూసుకెళ్లింది. దీంతో శనివారం మధ్యాహ్నం నుంచి షార్ గ్యాలరీలో ఈ ప్రయోగం కోసం వేచి చూస్తున్న ప్రేక్షకులంతా కరతాళ ధ్వనులు చేశారు. 2,274 కిలోల బరువున్న ఇన్సాట్ త్రీడీ ఎస్ ఉపగ్రహం భారత వాతావరణ శాఖ…

Read More

అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌కు దెబ్బ మీద దెబ్బ పడుతోంది. ఇప్పటికే కొన్ని కేసుల్లో నేరాభియోగాలు ఎదుర్కొంటున్న ఆయనకు తాజాగా మరో కేసులో ఊహించని షాక్ తగిలింది. కొన్ని బ్యాంకులను మోసం చేసిన కేసులో అక్షరాల $354.9 మిలియన్‌ (మన ఇండియన్ కరెన్సీలో రూ.3వేల కోట్లకు పైనే) జరిమానా చెల్లించాలని న్యూయార్క్ కోర్టు సంచలన తీర్పు ఇచ్చింది.  మాన్‌హాటన్‌లో మూడు నెలల పాటు విచారణ జరిపిన అనంతరం జస్టిస్ ఆర్థర్ ఎంగోరాన్ ఈ మేరకు ఆదేశాలు జారీ చేశారు. అంతేకాదు.. ఏదైనా న్యూయార్క్ కార్పొరేషన్‌లో అధికారి లేదా డైరెక్టర్‌గా పని చేయకుండా ట్రంప్‌పై నిషేధం విధించారు. అయిత ఈ తీర్పుని తాము అప్పీల్ చేస్తామని ట్రంప్ తరఫు న్యాయవాది అలీనా హబ్బా చెప్పారు. తన వ్యాపార సామ్రాజ్యాన్ని మరింత విస్తరించుకునేందుకు గాను డొనాల్డ్ ట్రంప్ తన దగ్గరున్న ఆస్తుల మొత్తాన్ని వాస్తవ విలువ కంటే అత్యధికంగా చూపి బ్యాంకులను, బీమా…

Read More

తెలంగాణ వచ్చినా కూడా నీళ్ల దోపిడీ ఆగలేదని, గత పదేళ్ల పాలనలో నీళ్ల దోపిడీ పెరిగిందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆరోపించారు. సాగునీటి రంగంపై శాసనసభలో ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయగా మంత్రి ప్రసంగిస్తూ గత పాలకులు ఇంజినీర్లు, నిపుణుల సూచనలు పట్టించుకోకుండా సొంత ఇంజినీరింగ్‌ ఆలోచన చేశారని మండిపడ్డారు. ప్రాజెక్టుల రీడిజైనింగ్‌ పేరుతో తెలంగాణకు అన్యాయం చేశారని,కృష్ణా జలాల్లో న్యాయబద్ధంగా రావాల్సిన వాటా సాధనలో విఫలమయ్యారని ధ్వజమెత్తారు.  కృష్ణా జలాల్లో మన వాటా కోసం గత ప్రభుత్వం పట్టుపట్టలేదని, బీఆర్‌ఎస్‌ నిర్లక్ష్యం వల్లే ఏపీకి 512 టీఎంసీలు, తెలంగాణకు 299 టీఓంపీలు వచ్చాయని తెలిపారు.  కేసీఆర్‌ విధానాల వల్లే హైదరాబాద్‌, రంగారెడ్డి, నల్లగొండ, మహబూబ్‌నగర్‌, ఖమ్మం జిల్లాలకు తీవ్ర అన్యాయం జరిగిందని విమర్శించారు.  కృష్ణా బేసిన్‌లో న్యాయంగా తెలంగాణకు 68 శాతం వాటా రావాలని, అయితే 550 టీఎంసీల జలాలు తీసుకోవాలనే స్పృహ నాటి పాలకులకు లేదని చెప్పారు.…

Read More

తెలంగాణ కుంభమేళా భావించే మేడారం జాతరకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది. దీంతో పాటు భక్తులకు ప్రయాణ సౌకర్యాలు కల్పించింది. టీఎస్ ఆర్టీసీ  జాతరకు ప్రత్యేక బస్సులు నడుపుతుంది. కోటి మందికి పైగా మేడారం జాతరకు వస్తారని సమాచారం. మేడారం జాతరకు దక్షిమ మధ్య రైల్వే ప్రత్యేక రైళ్ నడుపుతోంది.  వరంగల్‌-సికింద్రాబాద్‌-వరంగల్‌  (రైలు నెం.07014/07015), సిరిపుర్‌ కాగజ్‌నగర్‌-వరంగల్‌- సిరిపుర్‌ కాగజ్‌నగర్‌ (రైలు నెం.07017/07018), నిజామాబాద్‌-వరంగల్‌-నిజామాబాద్‌ (రైలు నెం.07019/0720) ప్రత్యేక రైళ్లను నడుపుతున్నట్లు ప్రకటించింది. ప్రత్యేక రైళ్లు.. సికింద్రాబాద్, హైదరాబాద్‌, సిర్‌పుర్‌ కాగజ్ నగర్‌, బెల్లంపల్లి, మంచిర్యాల, రామగుండం, పెద్దపల్లి, జమ్మికుంట, భువనగిరి, జనగామ, ఘన్‌పూర్, కామారెడ్డి, మనోహరాబాద్‌, మేడ్చల్‌, ఆలేరు మీదు ప్రయాణిస్తాయి. ఈ నెల 21 నుంచి 25 వరకు సికింద్రాబాద్ నుంచి మేడారం జాతరకు ప్రత్యేక రైలు నడుపుతున్నారు. ఈ ట్రైన్ మౌలాలి, చర్లపల్లి, ఘట్‌కేసర్‌, బీబీనగర్‌, భువనగిరి, యాదగిరి, వంగపల్లి, ఆలేరు, పెంబర్తి, జనగామ, రఘునాథపల్లి,…

Read More

రాష్ట్రం కుల గణన కోసం అసెంబ్లీలో కాంగ్రెస్‌ ప్రభుత్వం ప్రవేశపెట్టిన తీర్మానానికి తెలంగాణ శాసనసభ ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది. సభలో మంత్రి పొన్నం ప్రభాకర్‌ సభలో తీర్మానం ప్రవేశపెట్టగా  ఆ తర్వాత సభ్యులందరూ చర్చించారు. బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే గంగుల కమలాకర్‌ మాట్లాడుతూ కులగణనపై తీర్మానం కాకుండా చట్టం చేయాలని ప్రభుత్వానికి సూచించారు.  న్యాయపరమైన చిక్కులు రాకుండా కులగణనకు చట్టం చేయాలని సూచించారు.  కులగణన తర్వాత చట్టం ఎలాంటి పథకాలు అమలు చేయనుందో చెప్పాలని డిమాండ్‌ చేశారు. స్థానిక సంస్థల్లో బీసీలకు 42శాతం రిజర్వేషన్‌ కల్పించాలన్నారు. ఎంబీసీలను మొదటి గుర్తించినదే తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్‌దేనని పేర్కొన్నారు.  ఎంబీసీలకు మంత్రి పదవి ఇవ్వాలని, బీసీ సబ్‌ప్లాన్‌ను అమలు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. బీహార్‌లో ఇప్పటికే కులగణన చేస్తే న్యాయపరమైన చిక్కులు వచ్చిన విషయాన్ని గుర్తు చేశారు.  సిరిసిల్ల ఎమ్మెల్యే, బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ మాట్లాడుతూ కేంద్రంలో ఓబీసీ మంత్రిత్వ శాఖను…

Read More

రష్యాలో ప్రతిపక్ష నేత, అధ్యక్షుడు పుతిన్ తీవ్రవిమర్శకులు , లాయర్ అలెక్సీ నావల్నీ జైలులోనే మృతి చెందారు. 19 సంవత్సరాల జైలుశిక్ష పడటంతో నావల్నీ కార్పాలోని ఆర్కిటిక్‌జైలు సముదాయంలో మూడేళ్ళుగా బందీగా జీవితం గడుపుతున్నారు. 47 సంవత్సరాల నావల్నీ శుక్రవారం మార్నింగ్‌వాక్‌కు వెళ్లి వచ్చిన తరువాత అస్వస్థతకు గురై అపస్మారక స్థితికి చేరుకున్నాడు.ఆయనను కాపాడేందుకు డాక్టర్లు యత్నించినా ఫలితం లేకుండా పోయిందని జైలు అధికారులు ఓ ప్రకటన వెలువరించారు. చాలా రోజులుగా నావల్నీ ఆరోగ్యంపై ఆందోళన వ్యక్తం అవుతూ వచ్చింది. ఆర్కిటిక్ ప్రిజన్ కాలనీలోనే ఆయన మృతి చెందినట్లు రష్యా అధికారిక జైళ్ల శాఖ తెలిపింది. ఆయనను కాపాడేందుకు అన్ని ప్రయత్నాలు చేసినట్లు, వెంటనే అంబులెన్స్ పిలిపించి డాక్టర్ల బృందంతో వివిధ రకాల పరీక్షలు, తక్షణ ప్రాణరక్షణ చర్యలు చేపట్టినట్లు , అయితే చికిత్సకు ఆయన స్పందించలేదని వివరించారు. ఆయన మృతికి దారి తీసిన అనారోగ్య సమస్యలను నిర్థారించాల్సి ఉంది. కాగా…

Read More

ఆమ్‌ ఆద్మీ పార్టీ (ఆప్‌) అధినేత, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ శుక్రవారం అసెంబ్లీలో విశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. మద్యం పాలసీ స్కామ్‌పై ఈడీ ఆరోసారి సమన్లు జారీ చేయడం, ఢిల్లీ కోర్టుకు కూడా హాజరుకావాల్సి ఉండటంతో ఆయనను అరెస్ట్‌ చేయవచ్చన్న ఊహాగానాలు వస్తుండటంతో ఈ చర్యకు దిగారు.  శనివారం అసెంబ్లీలో విశ్వాస పరీక్షను ఎదుర్కోవాలని నిర్ణయించారు. శుక్రవారం అసెంబ్లీలో విశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెడుతూ బీజేపీ సభ్యులు ఆప్‌ ఎమ్మెల్యేలను సంప్రదించారని, ఢిల్లీ సీఎంను త్వరలో అరెస్ట్‌ చేస్తారని వారితో చెప్పారని పేర్కొన్నారు. అలాగే 21 మంది ఆప్‌ ఎమ్మెల్యేలు పార్టీని వీడేందుకు అంగీకరించారని, మరికొంత మంది బీజేపీతో టచ్‌లో ఉన్నట్లు ఆప్‌ ఎమ్మెల్యేలతో చెప్పడంతోపాటు బీజేపీలో చేరేందుకు రూ.25 కోట్లు ఆఫర్‌ చేశారని ఆరోపించారు. కాగా, బీజేపీ ఆఫర్‌కు తాము అంగీకరించలేదని ఇద్దరు ఆప్‌ ఎమ్మెల్యేలు తనకు చెప్పారని కేజ్రీవాల్‌ తెలిపారు. అలాగే ఇతర ఆప్‌ ఎమ్మెల్యేలతో మాట్లాడగా ఏడుగురిని…

Read More

వచ్చే సార్వత్రిక ఎన్నికలకు ముందు కాంగ్రెస్‌ పార్టీకి పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. ఆ పార్టీతో పాటు అనుబంధ విభాగాలకు చెందిన బ్యాంకు ఖాతాలను ఆదాయపు పన్ను శాఖ స్తంభింపజేసింది. ఈ మేరకు కాంగ్రెస్‌ నేత అజయ్‌ మాకెన్‌ వెల్లడించారు. పార్టీ ఇచ్చిన చెక్కులను గౌరవించేందుకు బ్యాంకులు నిరాకరిస్తున్నట్లు ఫిబ్రవరి 15న సమాచారం అందందని, అనంతరం యూత్ కాంగ్రెస్, కాంగ్రెస్ పార్టీకి చెందిన బ్యాంకు ఖాతాలను సీజ్ చేసిందని పేర్కొన్నారు. కాంగ్రెస్, ఆ పార్టీ అనుబంధ విభాగం నుంచి రూ.210 కోట్లు రికవరీ చేయాలని ఆదాయపు పన్ను శాఖ కోరింది. ‘మా ఖాతాల్లోని క్రౌడ్ ఫండింగ్ నగదు స్తంభింపజేశారు… ఎన్నికల నోటిఫికేషన్కు కేవలం రెండు వారాల ముందు ప్రతిపక్షాల ఖాతాలు స్తంభింపచేయడం ప్రజాస్వామ్యాన్ని స్తంభింపజేయడంతో సమానం’ అని కాంగ్రెస్ ఆరోపించింది. ఆదాయపు పన్ను శాఖ కాంగ్రెస్ నాలుగు ప్రధాన బ్యాంకు ఖాతాలను పలు కారణాలతో స్తంభింపజేసిందని ఆ పార్టీ కోశాధికారి అజయ్ మాకెన్ పేర్కొన్నారు.…

Read More

పంటల కనీస మద్దతు ధరకు చట్టబద్ధత కల్పించాలని డిమాండు చేస్తూ ఢిల్లీ శివారుల్లో ఒకవైపు అన్నదాతలు ఆందోళన కొనసాగుతుండగా చండీగఢ్‌లో గురువారం ముగ్గురు కేంద్రమంత్రులు రైతు నాయకులతో అర్థరాత్రి వరకు జరిపిన చర్చలు ఫలించలేదు. ఆందోళన మొదలయిన తరువాత ఇవి మూడో దఫా చర్చలు కావడం విశేషం. రైతు సంఘాలతో కేంద్ర మంత్రులు అర్జున్ ముండా, పీయూష్ గోయల్, నిత్యానంద్ రాయ్. గురువారం అర్ధరాత్రి వరకు చర్చలు జరిపారు. అయితే రైతుల డిమాండ్లపై స్పష్టత రాలేదు. మరోవంక, శుక్రవారం భారత్ బంద్‌కు రైతు సంఘాలు పిలుపునిచ్చాయి. శాంతియుతంగా బంద్ కొనసాగనుంది. కేంద్ర మంత్రి అర్జున్ ముండా మాట్లాడుతూ.. ప్రభుత్వం, రైతు సంఘాల మధ్య చాలా సానుకూల వాతావరణంలో చర్చలు జరిగాయని తెలిపారు. రైతు సంఘం హైలైట్ చేసిన అంశాలపై దృష్టి సారించి, తాము ఈ నిర్ణయం తీసుకున్నామని పేర్కొన్నారు. ఆదివారం సాయంత్రం 6 గంటలకు మరొసారి రైతు సంఘాలతో కేంద్రం చర్చలు…

Read More

భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ షార్‌ కేంద్రంలోని రెండో ప్రయోగ వేదిక నుంచి జీఎస్‌ఎల్‌వీ ఎఫ్‌-14 రాకెట్‌ను ప్రయోగించేందుకు సిద్ధమ‌య్యారు. రేపు సాయంత్రం 5.35 గంటలకు ఈప్ర‌యోగం ప్రారంభం కానుంది. ఇవాళ మధ్యాహ్నం 2.05 గంటల నుంచి 27.30 గంటల కౌంట్‌డౌన్‌ అనంతరం జీఎస్‌ఎల్‌వీ ఎఫ్‌-14 రాకెట్‌ను ప్రయోగించనున్నారు.  ఇక, షార్‌లోని బ్రహ్మప్రకాష్‌ హాలులో గురువారం నాడు మిషన్‌ రెడీనెస్‌ రివ్యూ (ఎంఆర్ఆర్) సమావేశం నిర్వహించిన తర్వాత ప్రయోగ పనులను లాంచ్‌ ఆథరైజేషన్‌ బోర్డు (ల్యాబ్‌) వారికి అప్పజేప్పింది. కాగా, అనంతరం లాంచ్‌ ఆథరైజేషన్‌ బోర్డు చైర్మన్‌ ఆర్ముగం రాజరాజన్‌ ఆధ్వర్యంలో మరోసారి ల్యాబ్‌ సమావేశం జరిగింది.  ఇది షార్‌ కేంద్రం నుంచి 92వ ప్రయోగం కాగా.. జీఎస్‌ఎల్‌వీ సిరీస్‌లో 16వ ప్రయోగం పూర్తి స్వదేశీ సాంకేతిక పరిజ్ఞానంతో క్రయోజనిక్‌ ఇంజిన్లు తయారు చేసుకుని చేస్తున్న 10 వ ప్రయోగం కావడం విశేషం అని ఇస్రో శాస్త్రవేత్తలు వెల్లడించారు.  మొత్తం 2,272…

Read More