కోఠి ఉమెన్స్ విశ్వవిద్యాలయం పేరు మార్చనున్నట్టు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. మహిళా విశ్వవిద్యాలయానికి వీర వనిత చాకలి ఐలమ్మ పేరు పెట్టనున్నట్టు రేవంత్ రెడ్డి ప్రకటించారు. హైదరాబాద్ రవీంద్రభారతిలో ఏర్పాటు చేసిన చాకలి ఐలమ్మ 39వ వర్ధంతి కార్యక్రమంలో పాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటనలు చేశారు. సాయుధ పోరాటంలో చాకలి ఐలమ్మ వీర చరిత మరువలేనిదని కొనియాడారు. ఐలమ్మ స్ఫూర్తితోనే కాంగ్రెస్ సర్కార్ కూడా ముందుకు సాగుతోందని చెప్పుకొచ్చారు. భూముల ఆక్రమణలు అడ్డుకోవడంలో చాకలి ఐలమ్మనే తమకు స్ఫూర్తి అని రేవంత్ రెడ్డి వివరించారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మరో కీలక ప్రకటన చేశారు. చాకలి ఐలమ్మ మనమరాలు శ్వేతను రాష్ట్ర మహిళా కమిషన్ సభ్యురాలిగా నియమిస్తున్నట్టు రేవంత్ రెడ్డి ప్రకటించారు. శ్వేత మాటలు విన్న తర్వాత తనకు నమ్మకం కలిగిందని తెలిపిన రేవంత్ రెడ్డి ఈమేరకు నిర్ణయం తీసుకున్నట్టు చెప్పుకొచ్చారు. త్వరలోనే ప్రభుత్వం…
Author: Editor's Desk, Tattva News
భారత్‌లో ప్రతి గంటకు 53 ప్రమాదాలు జరుగుతున్నాయని, ఇందులో 19 మరణాలు నమోదవుతున్నాయంటూ కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ ఆందోళన వ్యక్తం చేశారు. ఈ క్రమంలో రోడ్డు భద్రతపై వాహనాల తయారీ కంపెనీలకు ఆయన కీలక విజ్ఞప్తి చేశారు. ఇటీవల కాలంలో భారతీయ ఆటోమొబైల్ పరిశ్రమ వేగంగా అభివృద్ధి చెందుతున్నప్పటికీ.. రహదానులపై వాహనదారులు, పాదచారులకు సురక్షితంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని కేంద్ర మంత్రి సూచించారు. దేశ రాజధాని ఢిల్లీలో జరిగిన సొసైటీ ఆఫ్ ఇండియాన్ ఆటోమొబైల్ మాన్యుఫ్యాక్చరర్స్ 64వ వార్షిక సదస్సులో కేంద్రమంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా గడ్కరీ మాట్లాడుతూ రోడ్డు ప్రమాదాల సంఖ్యను తగ్గించడంపై భాగస్వాములు దృష్టి సారించాలని కోరారు. దేశంలో అందరికీ సురక్షితమైన రహదానులను ఏర్పాటు చేయాల్సిన అవసరాన్ని నొక్కి చెప్పారు. డ్రైవర్లు స్థానిక నియమాలు, నిబంధనలపై అవగాహన కలిగి ఉన్నారని, అలాగే వాహనాలు నడపడం, నడపడంలో నైపుణ్యం కలిగి ఉండేలా డ్రైవింగ్ పాఠశాలలను ఏర్పాటు చేయాలని తయారీదారులను కోరారు. …
బంగాల్ ఆర్‌జీ కర్ ప్రభుత్వ కళాశాల ఆసుపత్రిలో జూనియర్ వైద్యురాలిపై జరిగిన హత్యాచార ఘటనపై అగ్నిజ్వాలలు చల్లారడం లేదు. నిరసన చేస్తున్న వైద్యులు మంగళవారం సాయంత్రంలోగా విధుల్లో చేరాలని సుప్రీంకోర్టు ఆదేశించినా ఇంకా ఆందోళనలు కొనసాగుతూనే ఉన్నాయి. బాధితురాలికి న్యాయం జరిగేంత వరకు విధుల్లో చేరే ప్రసక్తే తేలేదంటూ వైద్యులు తేల్చిచెప్పారు. ”మా డిమాండ్లు నెరవేరేంత వరకు ఆందోళన కార్యక్రమాలు కొనసాగుతూనే ఉంటాయి. కోల్‌కతా పోలీస్ కమిషనర్, ఆరోగ్య కార్యదర్శి, హెల్త్ సర్వీసెస్ డైరెక్టర్, వైద్య విద్య డైరెక్టర్‌లను తొలగించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరాం. బాధితురాలికి న్యాయం జరిగేంత వరకు ఈ ఆందోళనలు కొనసాగుతూనే ఉంటాయి” అని వైద్యులు స్పష్టం చేశారు. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కోల్‌కతా హత్యాచార ఘటనపై ఇటీవల విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు, బంగాల్ ఆరోగ్య శాఖ సమర్పించిన నివేదికను పరిశీలించిన సంగతి తెలిసిందే. రాష్ట్రంలో వైద్యుల నిరసనలతో ఇప్పటివరకు 23 మంది ప్రాణాలు కోల్పోయారని అందులో తెలిపింది.…
హుస్సేన్ సాగర్‌లో గణనాథుల నిమజ్జనానికి అనుమతి లేదంటూ మంగళవారం పొద్దున ట్యాంక్ బండ్ చుట్టూ రెయిలింగులకు పోలీసులు, జీహెచ్ఎంసీ అధికారులు హెచ్చరికల ఫ్లెక్సీలు కట్టారు. అయితే, సాయంత్రంకల్లా హుస్సేన్ సాగర్‌లో గణేషుల నిమజ్జనానికి హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ప్రతి సంవత్సరం లాగానే.. ఈ ఏడాది కూడా హుస్సేన్ సాగర్‌లో వినాయక విగ్రహాలను నిమజ్జనం చేసుకునేందుకు హైకోర్టు అనుమతించింది. కోర్టు ధిక్కరణపై పిటిషనర్ ఎలాంటి ఆధారాలు చూపించలేకపోవడంతో పిటిషన్‌ను తెలంగాణ హైకోర్టు తిరస్కరించింది. గతంలో ఇచ్చిన ఆదేశాలు పాటించాలని ధర్మాసనం సూచించింది. నిమజ్జనం సమయంలో వచ్చి ధిక్కరణ పిటిషన్ వేయటం సరికాదని హైకోర్టు అభిప్రాయం వ్యక్తం చేసింది. దీంతో.. సెప్టెంబర్ 10వ తేదీ నుంచి 17 వరకు గణేషుల నిమజ్జనాలు కొనసాగనున్నాయి. ఇక.. చివరి రోజైన సెప్టెంబర్ 17న ఖైరతాబాద్ బడా గణేషుడు భారీ శోభాయాత్రతో హుస్సేన్ సాగర్ ఒడికి చేరనున్నాడు. ఇదిలా ఉంటే.. హైకోర్టు ఈ ఆదేశాలు జారీ చేసే…
స్వచ్ఛమైన, పర్యావరణహిత వాహనాలపై ఆటోమేకర్లు దృష్టిసారించాలని ప్రధాని నరేంద్ర మోదీ కోరారు. భారత ఆటోమొబైల్ మ్యాన్యుఫ్యాక్చర్ సొసైటీ 64వ వార్షిక సదస్సులో ప్రధాని తన సందేశంలో కీలక అంశాలు ప్రస్తావించారు. భారత ఆటోమొబైల్ రంగం ఇతరులకు ఆదర్శంగా నిలవాలని పిలుపు ఇచ్చారు. ఈ రంగం అధిక ఆర్ధిక వృద్ధికి ఊతం, ఉత్తేజం కల్పించాలని కోరారు. క్లీనర్, గ్రీనర్ మొబిలిటీ దిశగా ఆటోమొబైల్ రంగం దృష్టి కేంద్రీకరించాలని అన్నారు. ఇక ఈ సదస్సులో కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ మాట్లాడుతూ దేశాన్ని ఐదు లక్షల కోట్ల డాలర్ల ఆర్ధిక వ్యవస్ధగా రూపొందించాలనే ప్రధాని నరేంద్ర మోదీ లక్ష్యాన్ని సాధించే క్రమంలో ఆటోమొబైల్ పరిశ్రమ కీలక పాత్ర పోషిస్తుందని చెప్పారు. ఈ దిశగా ప్రయత్నాలు సాగితే ప్రపంచంలోనే భారత్ మూడో అతిపెద్ద ఆర్ధిక వ్యవస్ధగా ఎదుగుతుందని చెప్పారు. ప్రపంచంలోనే మేటి ఆటో మ్యాన్యుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీగా మనం ఎదగాలని కోరారు. 2070 నాటికి…
భారీ రుణ భారం తెలంగాణకు సవాల్‌గా మారిందని చెబుతూ రుణాన్ని రీ స్ట్రక్చర్ చేసే అవకాశం ఇవ్వండి.. లేదా తమకు అదనపు ఆర్ధిక సహాయాన్ని అందించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 16వ ఆర్ధిక సంఘంను కోరారు. జాభవన్ లో 16వ ఆర్ధిక సంఘ సమావేశంలో ఆయన మాట్లాడుతూ గత ఆర్థిక సంవత్సరం చివరి నాటికి రుణ భారం రూ.6.85 లక్షల కోట్లకు చేరుకుందని చెప్పారు. ఇందులో బడ్జెట్ రుణాలతో పాటు ఆఫ్-బడ్జెట్ రుణాలు ఉన్నాయని పేర్కొన్నారు. గత పదేళ్లలో మౌలిక ప్రాజెక్టులకు నిధుల సమీకరణకు ప్రభుత్వం భారీగా అప్పులు తీసుకుందని, దీంతో ఇప్పుడు రాష్ట్ర ఆదాయంలో ఎక్కువ భాగం రుణాన్ని తిరిగి చెల్లించడానికే వెచ్చించాల్సిన పరిస్థితి ఏర్పడిందని తెలిపారు. రుణాలు, వడ్డీ చెల్లింపులు సక్రమంగా నిర్వహించకపోతే రాష్ట్ర పురోగతిపై ప్రభావం చూపే అవకాశం ఉందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో రుణాల సమస్యను పరిష్కరించేందుకు తమకు తగిన సహాయం,…
ఎప్పటినుంచో జీవిత బీమా, ఆరోగ్య బీమాలపై విధిస్తున్న జీఎస్టీని తగ్గించాలని డిమాండ్లు వెల్లువెత్తుతున్నాయి. దేశంలోని ప్రతిపక్ష పార్టీలే కాకుండా.. అధికార పార్టీ నేతల నుంచి విజ్ఞప్తులు, డిమాండ్లు వస్తుండటంతో ఈ జీఎస్టీ మండలి సమావేశంలో చర్చించారు. జీఎస్టీ కౌన్సిల్ 54వ సమావేశం సోమవారం జరిగింది. ఇన్సూరెన్స్ ప్రీమియంలపై జీఎస్టీ తగ్గింపుపై జీఎస్టీ సమావేశంలో ఏకాభిప్రాయం కుదిరింది. దీనిపై మరింత పరిశీలన చేయడానికి మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేశారు. బీహార్ ఉపముఖ్యమంత్రి సామ్రాట్ చౌధరి నేతృత్వంలో జీఎస్టీ రేట్ల హేతుబద్ధీకరణపై ఏర్పాటైన మంత్రుల బృందానికే హెల్త్, లైఫ్ ఇన్సూరెన్స్‌పై జీఎస్టీ తగ్గింపుపై ఈ బాధ్యతను అప్పగించింది. కొంతమంది కొత్త సభ్యులు కూడా ఈ బృందంలో చేరతారని.. వారంతా అక్టోబర్ చివరి నాటికి నివేదిక సమర్పిస్తారని నిర్మలా సీతారామన్ వెల్లడించారు. అనంతరం నవంబర్‌లో నిర్వహించే జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో నిర్ణయం తీసుకుంటామని పేర్కొన్నారు. అదే సమయంలో పలు వస్తువులపై ఇప్పటివరకు వసూలు చేస్తున్న జీఎస్టీని…
ప్రకాశం బ్యారేజీ గేట్లను బోట్లు ఢీకొన్న ఘటనపై అధికారులు సీఎం చంద్రబాబుకు నివేదిక సమర్పించారు. ఈ ఘటనలో కుట్ర కోణం ఉందని అధికారులు నివేదికలో వెల్లడించారు. ఢీకొన్న బోట్లు వైఎస్సార్సీపీ నేతలు, కార్యకర్తలవని నిర్ధారించారు. దీంతో బ్యారేజ్‌ను పడవలు ఢీకొన్న ఘటనలో దర్యాప్తు ముమ్మరం చేసిన పోలీసులు, ఇద్దరు నిందితులను అరెస్టు చేశారు. గొల్లపూడికి చెందిన పడవల యజమాని ఉషాద్రిని, సూరాయపాలెం వాసి కోమటి రామ్మోహన్‌ను విజయవాడ పోలీసులు అరెస్టు చేశారు. వన్‌టౌన్ ఇన్‌స్పెక్టర్ గురుప్రకాశ్ ఆధ్వర్యంలో ఇబ్రహీంపట్నం మండలం సూరాయిపాలెం గ్రామానికి చెందిన కోమటి రామ్మోహన్, గొల్లపూడి గంగానమ్మ ఆలయం ప్రాంతానికి చెందిన వక్కలగడ్డ ఉషాద్రిని అరెస్టు చేసి ఇక్కడి చీఫ్ మెట్రోపాలిటన్ కోర్టులో హాజరుపరిచారు. న్యాయాధికారి రాజశేఖర్ వారికి ఈ నెల 20వ తేదీ వరకు రిమాండ్ విధించారు. కొట్టుకొచ్చిన 3 పడవలూ కుక్కలగడ్డ ఉషాద్రికి చెందినవిగా గుర్తించారు. నిందితులను అరెస్టు చేసి విజయవాడ కోర్టుకు తరలించారు. నిందితులకు…
తెలంగాణలో అకాల వర్షాలు, వరదల కారణంగా జరిగిన నష్టాన్ని అంచనా వేసేందుకు కేంద్ర ప్రభుత్వం బృందాన్ని పంపనున్నది. నేషనల్ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ అథారిటీ సలహాదారు, కేంద్ర హోంశాఖ జాయింట్ సెక్రటరీ (ఆపరేషన్స్-కమ్యూనికేషన్స్) కర్నల్ కీర్తి ప్రతాప్ సింగ్ నేతృత్వంలోని ఆరుగురు సభ్యులు ఉంటారు. కేంద్ర బృందం బుధవారం ఖమ్మం, మహబూబాబాద్ జిల్లాలు సహా వరద కారణంగా ప్రభావితమైన ప్రాంతాల్లో బృందం పర్యటించనున్నారు. కేంద్ర బృందంలో కల్నల్ కేపీ సింగ్‌తో పాటుగా ఆర్థిక శాఖ, వ్యవసాయ శాఖ, రోడ్లు, రహదారుల శాఖ, గ్రామీణాభివృద్ధి శాఖ, నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ విభాగాలకు చెందిన అధికారులు ఉంటారు. కేంద్ర బృందం వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించి బాధితులు, అధికారులతో చర్చిస్తుంది. ఈ సందర్భంగా కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జీ కిషన్ రెడ్డి కేంద్ర బృందానికి నేతృత్వం వహిస్తున్న కల్నల్ కీర్తిప్రతాప్ సింగ్ మాట్లాడారు. ఆదివారం నాటి తన ఖమ్మం పర్యటనలో తెలుసుకున్న అంశాలను,…
దేశంలోనే అతిపెద్ద వినాయకుడి విగ్రహం తెలంగాణ రాష్ట్రంలో ఉంది. నాగర్ కర్నాల్ జిల్లా తిమ్మాజిపేట మండలం అవంఛలో ఈ గణేషుడి విగ్రహం ఉంది. ఇది దేశంలోనే అత్యంత పురాతన ఏకశిలాతో చేసిన గణపతిగా పేరుంది. ఈ గణేషుడి విగ్రహం 9వ శతాబ్దానికి చెందినదిగా చరిత్రకారులు చెబుతున్నారు. విగ్రహం ఎత్తు 30 అడుగులు కాగా వెడెల్పు 15 అడుగులు. కొత్త తెలంగాణ చరిత్ర బృందం అధ్యక్షుడు రామోజు హరగోపాల్ ప్రకారం సుమారు 879 ఏండ్ల కిందట అంటే క్రీ.శ 1140లో ఈ విగ్రహాన్ని తైలంపుడు అనే రాజు ఏకశిలపై చెక్కించాడు. ప్రస్తుతం కర్ణాటకలోని గుల్బర్గా జిల్లాగా పిలవబడుతున్న ప్రాంతం అప్పట్లో బాదామి రాజ్యంగా ఉండేది. మహబూబ్ నగర్ జిల్లా అవంఛ గ్రామా శివారుల్లో ఉన్న ఈ విగ్రహాన్ని చూసేందకు జనాలు గుంపులు గుంపులుగా తరలి వస్తున్నారు. ఇదిలా ఉండగా కళ్యాణ చాళుక్యుల కాలంలోనే క్రీస్తు శకం 11 శతాబ్దంలో చెక్కిన మరొక విగ్రహం…