Author: Editor's Desk, Tattva News

గత ప్రభుత్వం చేసిన ఖర్చు కంటే నాలుగు రెట్లు ఎక్కువ ఖర్చు చేశామని ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌ వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో 2024-25 ఓటాన్ అకౌంట్‌ బడ్జెట్‌ను ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌ ప్రవేశపెట్టారు. మహాత్మగాంధీ సందేశంతో బడ్జెట్‌ ప్రసంగాన్ని బుగ్గన ప్రారంభించారు. ఐదేళ్లుగా బడ్జెట్‌ ప్రవేశపెట్టే అవకాశం తనకు దక్కినందకు సంతోషం వ్యక్తం చేశారు. గత ఐదేళల్లో ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలతో పాటుగా సాధించిన విజయాలను ప్రసంగంలో ప్రస్తావించారు మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్.. ఆయన మాటల్లో ఆ విజయాలు ఇలా ఉన్నాయి. 2018-19 సంవత్సరంలో 11% రాష్ట్ర స్థూల ఉత్పత్తి రేటుతో 14వ స్థానంలో ఉండగా.. 2023 సంవత్సరంలో రాష్ట్ర స్థూల ఉత్పత్తి రేటు 16.2%నికి పెరగటం వలన 4వ స్టానానికి పురోగతి. 2020-21 ఆర్థిక సంవత్సరంలో జరిపిన వ్యాపార సంస్కరణల కార్యాచరణ ప్రణాళిక ప్రకారం, సులభతర వాణిజ్యంలో మన రాష్ట్రం అగ్రస్థానం కైవసం…

Read More

భారతీయులకు వీసా మినహాయింపు ఇచ్చే దేశాల జాబితాలో తాజాగా ఇరాన్‌ వచ్చి చేరింది. భారతీయ పర్యాటకులకు వీసా ఫ్రీ ఎంట్రీని మంగళవారం ప్రకటించింది. వీసా అవసరం లేకుండానే భారతీయులు తమ దేశానికి రావొచ్చని వెల్లడించింది. ఈ మేరకు వీసా కలిగి ఉండాలన్న నిబంధనలను ఈ నెల 4 నుంచి ఎత్తి వేస్తున్నట్లు ప్రకటించింది.  సాంస్కృతిక, పర్యాటక సంబంధాల మార్పిడిని మరింత వేగవంతం చేసుకొనేందుకు ఈ నూతన విధానం అమలు చేస్తున్నట్టు తెలిపింది. అయితే కొన్ని షరతులు పెట్టింది. భారతీయ పర్యాటకులు వీసా లేకుండానే తమ దేశంలో 15 రోజుల పాటు ఉండొచ్చని తెలిపింది. విమాన మార్గంలో వచ్చే ప్రయాణికులకు మాత్రమే ఈ వీసా ఫ్రీ ఎంట్రీ వర్తిస్తుందని వెల్లడించింది.  ఈ గడువు ఎట్టి పరిస్థితుల్లోనూ పొడిగించబోమని స్పష్టం చేసింది. కేవలం పర్యాటకం కోసం వచ్చినవారికి మాత్రమే వీసా ఎత్తివేత అమలవుతుందని తెలిపింది. ఆరు నెలలకోసారి మాత్రమే ఈ వీసా రహిత టూర్‌లకు…

Read More

నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్‌సీపీ) పేరు, గుర్తుపై తలెత్తిన వివాదంపై భారత ఎన్నికల సంఘం (ఈసీఐ) అజిత్ పవార్ సారథ్యంలోని ఎన్‌సీపీ వర్గానికి అనుకూలంగా మంగళవారంనాడు తీర్పునిచ్చింది. అజిత్ పవార్ సారథ్యంలోని ఎన్‌సీపీనే నిజమైన ఎన్‌సీపీ అని ప్రకటించింది. ఆ పార్టీ పేరు, గుర్తు ఆయన వర్గానికే కేటాయించింది.  ఈసీ నిర్ణయంతో లోక్‌సభ ఎన్నికలు మరికొద్ది నెలల్లోనే జరుగనున్న నేపథ్యంలో శరద్ పవార్ వర్గానికి గట్టి దెబ్బ తగినట్టయింది. గత ఆరు నెలల్లో 10 సార్లు విచారణ జరిపిన అనంతరం ఎన్నికల కమిషన్ తాజా నిర్ణయాన్ని ప్రకటించింది. గత ఏడాది జూలైలో శరద్ పవార్ సారథ్యంలోని ఎన్‌సీపీలో చీలిక తలెత్తింది.  అజిత్ పవార్ తన వర్గం ఎమ్మెల్యేలతో కలిసి అధికార మహారాష్ట్ర కూటమి ప్రభుత్వానికి మద్దతు ప్రకటించారు. ప్రభుత్వంలో ఉప ముఖ్యమంత్రి పదవిని చేపట్టారు. ఆయనతో పాటు ఎనిమిది మంది ఎన్‌సీపీ ఎమ్మెల్యేలు మంత్రులుగా ప్రమాణస్వీకారం చేశారు. ఫిరాయింపు ఎమ్మెల్యేలపై అనర్హత వేటు…

Read More

ఉమ్మడి పౌరస్మృతి(యుసిసి) బిల్లును ఉత్తరాఖండ్‌ ప్రభుత్వం మంగళవారం శాసనసభ ముందుకు వచ్చింది. విపక్షాల ఆందోళన నడుమ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి దీన్ని సభలో ప్రవేశపెట్టారు. ఈ క్రమంలోనే సభలో తీవ్ర గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో సభను మధ్యాహ్నం వరకు వాయిదా వేశారు. ముఖ్యమంత్రి బిల్లును సభలో ప్రవేశపెట్టినప్పుడు బిజెపి సభ్యులు ‘భారత్ మాతాకీ జై’, ‘వందేమాతరం’, ‘జై శ్రీరాం’నినాదాలు చేస్తూ బిల్లును స్వాగతించారు. అయితే ప్రత్యేక సమావేశాల రెండో రోజు సభా కార్యక్రమాల ప్రకారం ఈ బిల్లును ప్రవేశపెట్టడంతో పాటుగా చర్చించడం, ఆమోదించడం.. అంతా ఈ రోజే జరిగిపోవాలి. అయితే దీనికి ప్రతిపక్ష సభ్యులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేయడంతో స్పీకర్ రితు ఖండూరి బిల్లుపై చర్చకు మరింత సమయాన్ని కేటాయించారు. ఈ బిల్లుగనుక ఆమోదం పొందితే స్వాతంత్య్రం తర్వాత దేశంలోనే ఉమ్మడి పౌరస్మృతిని అమలు చేసిన తొలి రాష్ట్రంగా ఉత్తరాఖండ్ నిలవనుంది. గోవాలో పోర్చుగీసు పాలన నాటినుంచి…

Read More

డ్రగ్స్ విక్రయిస్తున్న అంతర్జాతీయ స్మగ్లర్‌ను హైదరాబాద్ పోలీసులు అరెస్టు చేశారు. నిందితుడి వద్ద నుంచి 557గ్రాముల కొకైన్, ఎక్టసీ పిల్స్ 902, హెరాయిన్ 21 గ్రాములు, వీడ్ గంజా 45 గ్రాములు, ఎల్‌ఎస్‌డి బ్లోట్స్ 105, చరాస్ 215 గ్రాములు, అంఫెటమైన్ 7 గ్రాములు, గంజా 190 గ్రాములు, రూ.8 కోట్ల విలువైన డ్రగ్స్, ఎనిమిది మొబైల్ ఫోన్లు, రూ.5.40లక్షల నగదు స్వాధీనం చేసుకున్నారు. వెస్ట్‌జోన్ డిసిపి ఎస్‌ఎం విజయ్‌కుమార్ ప్రకారం నైజీరియా అనంబ్రా రాష్ట్రం, ఒనిట్షా ఇచిడాస్ట్రీట్‌కు చెందిన ఇవులా ఉకోడా స్టాన్లీ(43) బిజినెస్ వీసాపై 2009లో భారత్ కు వచ్చాడు. ముంబాయిలోని అందేరీలో ఉంటూ ఓ స్నేహితుడితో కలిసి రెడీమేడ్ దుస్తుల వ్యాపారాన్ని ప్రారంభించాడు. ఏడాది తర్వాత గోవాలోని కండోలిమ్‌కు చేరుకొని అక్కడే కొందరు నైజీరియన్లతో కలిసి దుస్తుల వ్యాపారం చేశాడు. అక్కడ ఉన్ కొందరు నైజీరియన్లు డ్రగ్స్ విక్రయిస్తు భారీగా డబ్బులు సంపాదించాడం చూశాడు. ముంబాయిలోని నైజీరియన్ల…

Read More

దేశంలోని చాలా రాష్ట్రాల్లో పోటీ పరీక్ష పేపర్ల లీకేజీ ఘటననలు తరచూ చోటు చేసుకుంటుండంతో అనేకమంది ఉద్యోగార్థులు నిరాశ నిస్పృహకు గురవుతున్నారు. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం లీకేజీ సమస్యను పరిష్కరించడానికి కేంద్ర ప్రభుత్వం కొత్త చట్టం అమలు చేసేందుకు సిద్ధమైంది. ఇకపై పోటీ పరీక్షల్లో అవకతవకలకు, లీకేజీలకు పాల్పడే వారిపై కేంద్రం కఠిన శిక్షలు విధించనుంది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం సంస్థలు నిర్వహించే పరీక్షల్లో అక్రమాలను అడ్డుకునేందుకు వీలుగా ‘పబ్లిక్ ఎగ్జామినేషన్స్ (ప్రవెన్షన్ ఆఫ్ అన్ఫెయిర్ మీన్స్) బిల్లు, 2024’ను మంగళవారం లోక్‌సభ ఆమోదించింది. కేంద్రమంత్రి జితేంద్ర సింగ్ దీన్ని సభలో ప్రవేశపెడుతూ ప్రతిభావంతులైన విద్యార్థులు, అభ్యర్థుల ప్రయోజనాలను కాపాడేందుకు ఉద్దేశించిన బిల్లుగా దీన్ని పేర్కొన్నారు. ఈ బిల్లుకు సంబంధించి విపక్ష సభ్యులు ప్రతిపాదించిన కొన్ని సవరణలు తిరస్కరణకు గురయ్యాయి. అనంతరం లోక్‌సభ దీన్ని ఆమోదించింది.  ఇది అమల్లోకి వస్తే పేపర్ లీకేజీ పాల్పడినా, మాల్ ప్రాక్టీస్ చేసినా,…

Read More

So కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధ రామయ్యకు 2022 లో నమోదైన కేసుకు సంబంధించి ఆ రాష్ట్ర హైకోర్టు రూ.10 వేలు జరిమానా విధించింది. రోడ్లను దిగ్బంధించి ప్రయాణికులకు అసౌకర్యం కలిగించారంటూ ఈ కేసు నమోదైంది. ఈ కేసును కొట్టివేయాలని అభ్యర్థిస్తూ ఆయన దాఖలు చేసిన పిటిషన్‌ను కోర్టు కొట్టివేసింది. ఈ జాబితాలో కాంగ్రెస్ సీనియర్ నేత రణ్‌దీప్ సూర్జేవాలాతోపాటు మంత్రులు, ఎంబీ పాటిల్, రామలింగారెడ్డి ఉన్నారు. అలాగే మార్చి 6న ఎంపీ/ఎమ్‌ఎల్‌ఎ ప్రత్యేక న్యాయస్థానంలో హాజరు కావాలని కోర్టు ఆదేశించింది. గత బీజేపీ ప్రభుత్వ హయాంలో గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్ శాఖ మంత్రి కేఎస్ ఈశ్వరప్ప తన గ్రామంలో పనులకు 40 శాతం కమిషన్ డిమాండ్ చేశారని ఆరోపిస్తూ సంతోష్ పాటిల్ అనే కాంట్రాక్టర్ ఆత్మహత్య చేసుకోవడం తీవ్ర సంచలనం కలిగించింది. ఆ సమయంలో అప్పటి సీఎం రాజీనామాకు డిమాండ్ చేస్తూ కాంగ్రెస్ ఆందోళన చేపట్టింది. అప్పటి సిఎం బసవరాజ్ బొమ్మై నివాసాన్ని…

Read More

బ్రిటన్ రాజు ఛార్లెస్-3కి (75) క్యాన్సర్ వ్యాధి నిర్ధారణ అయ్యిందని బకింగ్‌హామ్ ప్యాలెస్ తాజాగా వెల్లడించింది. ఆయన చికిత్స తీసుకుంటున్నారని పేర్కొంది. అయితే, ఆయన వ్యాధి ఏ రకమైనదో మాత్రం వెల్లడించలేదు. ‘‘ఇటీవల రాజుకు ప్రోస్ట్రేట్ గ్రంధికి సంబంధించిన పరీక్షలు చేస్తుండగా వేరే సమస్య బయటపడింది. అదనపు పరీక్షల తరువాత క్యాన్సర్ ఉన్న విషయం నిర్ధారణ అయ్యింది’’ అని బకింగ్‌హామ్ ప్యాలెస్ ఓ ప్రకటనలో తెలిపింది. అయితే, ఇది ప్రోస్ట్రేట్‌కు సంబంధించిన క్యాన్సర్ కాదని ప్యాలెస్ స్పష్టం చేసింది. గత నెలలో బ్రిటన్ రాజు ప్రోస్ట్రేట్‌ గ్రంధి సమస్యతో మూడు రోజుల పాటు ఆసుపత్రిలో ఉన్నారు. కాగా, రాజు కోడలు, ప్రిన్సెస్ ఆఫ్ వేల్స్ కేట్ కూడా ఇటీవల ఉదర భాగంలో సర్జరీ చేయించుకున్నారు. రెండు వారాల పాటు ఆసుపత్రిలో ఉన్న ఆమె ప్రస్తుతం పూర్తిగా కోలుకున్నారని ప్యాలెస్ వర్గాలు తెలిపాయి. చికిత్స పొందుతున్న కారణంగా, ఆయన తన అధికారిక విధుల్లో…

Read More

వాహనాల రిజిస్ట్రేషన్‌కు ఉపయోగించే టిఎస్ స్థానంలో టిజిగా మార్చేందుకు సిఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో కేబినెట్ ఆమోదం తెలిపింది. ప్రస్తుతం రిజిస్ట్రేషన్‌కు వినియోగిస్తున్న టిఎస్ అక్షరాల స్థానంలో ఇకపై టిజిని వినియోగించనున్నారు. ఈ నిర్ణయంతో అందరూ అయోమయానికి గురవుతున్నారు. అందరిలో తమ వాహనాల రిజిస్ట్రేషన్ నంబర్‌లో టిజి మార్చుకోవాలా? అనే అనుమానం తలెత్తుతున్నది. అయితే, ప్రస్తుతం ఉన్న వాహనాల నంబర్ల ప్లేట్లను మార్చుకోవాల్సిన అవసరం లేదని అధికార వర్గాలు పేర్కొన్నాయి. ప్రభుత్వం జివో ఇచ్చిన తర్వాత కొత్తగా వాహనాలకు మాత్రమే టిజి పేరుతో రిజిస్ట్రేషన్ చేయనున్నారు. ప్రభుత్వం జివో జారీ చేసిన తర్వాత అప్పటి నుంచి కొత్తగా రిజిస్ట్రేషన్ అయ్యే వాహనాలకు టిజి కేటాయించే అవకాశం ఉంటుంది. గతంలోనూ రాష్ట్ర విభజన సమయంలోనూ ఏపీ స్థానంలో టిఎస్ మార్చుకోవాల్సిన అవసరం రాలేదు. అక్కడి రిజిస్ట్రేషన్ అయిన వాహనాలను యథావిధిగా కొనసాగాయి. ప్రస్తుతం అదే పద్ధతి కొనసాగుతుందని అధికారులు తెలిపారు. …

Read More

ఎవరేమన్నా వచ్చే ఎన్నికల్లో మూడో సారి విజయం సాధిస్తామని ప్రధాని నరేంద్ర మోదీ ధీమాను వ్యక్తం చేశారు. . రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే చర్చకు సోమవారం ప్రధాని సమాధానమిస్తూ `అబ్ కీ బార్ మోదీకి సర్కార్’ అని ఆయన భరోసా వ్యక్తం చేశారు. మూడో టర్మ్ లో పెద్ద పెద్ద నిర్ణయాలు తీసుకోబోతున్నామని వెల్లడించారు. వంద రోజుల్లో మరోసారి తమ ప్రభుత్వం ఏర్పడబోతుందని చెబుతూ ఎన్‌డీఏకు 400కు పైగా సీట్లు వస్తాయని, బీజేపీకి స్వంతంగా 370కి పైగా సీట్లు వస్తాయని జోస్యం చెప్పారు. భగవాన్ రాముడు తన స్వంత ఇంటికి వచ్చాడని చెబుతూ తాము మూడో దఫా అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రపంచంలో భారత్ మూడో అతిపెద్ద ఆర్ధిక వ్యవస్థగా అవతరించనుందని స్పష్టం చేశారు. 2014లో ప్రపంచంలో 11వ ఆర్ధిక వ్యవస్థగా ఉన్న ఇండియా ప్రస్తుతం ఐదవ స్థానానికి చేరుకున్న విషయాన్ని ఆయన గుర్తు చేశారు. 11వ, స్థానంలో ఉన్న…

Read More