అత్యంత వివాదాస్పదమైన చండీగఢ్ మేయర్ ఎన్నిక వ్యవహారంపై దేశ అత్యున్నత న్యాయస్థానం నిప్పులు చెరిగింది. ఘాటు విమర్శలు చేసింది. అదే తీవ్రతతో కీలక వ్యాఖ్యలు చేసింది. కొత్త మేయర్ సారథ్యంలో ఎలాంటి సమావేశాలను కూడా నిర్వహించకూడదంటూ తక్షణ ఆదేశాలను జారీ చేసింది. రిటర్నింగ్ అధికారి చేసిన పని ప్రజాస్వామ్యాన్ని హత్య చేసినట్లేనని ప్రధాన న్యాయమూర్తి డీవై చంద్రచూడ్ మండిపడ్డారు. ‘ఆయన కెమెరా వైపు చూస్తూ బ్యాలెట్ పేపర్లు పాడు చేయడం వీడియోలో స్పష్టంగా కనిపిస్తోంది. ఆ అధికారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలి’ అని ఆదేశించారు. సాయంత్రం 5 గంటలలోపు ఎన్నికలకు సంబంధించిన అన్ని రికార్డులను భద్రపరచాలని హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్‌ను ఆదేశించారు. మంగళవారం జరగాల్సిన భావించిన చండీగఢ్ పాలనా యంత్రాంగం బడ్జెట్ సెషన్‌ను కూడా సుప్రీంకోర్టు స్తంభింపజేసింది. తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు బడ్జెట్‌ను సమర్పించవద్దని న్యాయమూర్తులు చంద్రచూడ్, జేబీ పార్దివాలా, మనోజ్ మిశ్రాతో కూడిన త్రిసభ్య ధర్మాసనం ఆదేశించింది. తదుపరి…
Author: Editor's Desk, Tattva News
ఆప్ ఎంపీ సంజయ్ సింగ్ రాజ్యసభ సభ్యుడిగా ప్రమాణస్వీకారం చేయడం కుదరదని రాజ్యసభ ఛైర్మన్ జగదీప్ ధన్‌కర్ చెప్పారు. సంజయ్ సింగ్ వ‍్యవహారం ప్రివిలేజ్ కమిటీ వద్ద విచారణలో ఉన్నందున ఆయన ఎంపీగా ప్రమాణ చేయడం వీలుపడదని స్పష్టం చేశారు. సంజయ్ సింగ్‌పై నమోదైన ప్రత్యేక హక్కుల ఉల్లంఘన కేసును రాజ్యసభ ప్రివిలేజ్ కమిటీ విచారిస్తోంది. కాగా, ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో అరెస్టయిన సంజయ్ సింగ్‌ను రాజ్యసభ సభ్యుడిగా ఆప్ మరోసారి నామినేట్ చేసింది. సంజయ్ సింగ్‌తో పాటు ఢిల్లీ మహిళా కమిషన్ మాజీ చీఫ్ స్వాతి మలివాల్, చార్టర్డ్ అకౌంటెంట్ నరైన్ దాస్ గుప్తాను రాజ్యసభకు నామినేట్ చేశారు. ఈ క్రమంలో రాజ్యసభ ఎంపీగా ప్రమాణస్వీకారం చేసేందుకు ఫిబ్రవరి 5 నుంచి ఫిబ్రవరి 9 వరకు జరుగుతున్న పార్లమెంట్ సమావేశాలకు హాజరయ్యేందుకు ఏడు రోజుల మధ్యంతర బెయిల్‌ను కోరుతూ సంజయ్ సింగ్ ఫిబ్రవరి 1న ఢిల్లీలోని రౌజ్ అవెన్యూ…
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం తొందరలోనే కూలిపోతుందని తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వంపై వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. లోక్‌సభలో రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై సోమవారం వైసీపీ తరఫున విజయసాయి రెడ్డి ప్రసంగిస్తూ కాంగ్రెస్ పార్టీపై తీవ్ర విమర్శలు చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కాంగ్రెస్ పార్టీ తీవ్ర అన్యాయం చేసిందని విజయసాయిరెడ్డి విమర్శించారు. అన్యాయంగా రాష్ట్రాన్ని విభజించారని ఆరోపించారు. అందుకే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత పదేండ్ల దాకా ఆ పార్టీకి అధికారం దక్కలేదని విమర్శించారు. ఇప్పుడు కూడా అబద్దపు హామీలు ఇవ్వడం వల్లనే కాంగ్రెస్ పార్టీకి తెలంగాణ ప్రజలు అధికారం అప్పగించారని ఆరోపించారు. అబద్ధాలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ తొందరలోనే కూలిపోతుందని సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ నేతలు ప్రత్యేక హోదాపై మాట్లాడటాన్ని విజయసాయి రెడ్డి తప్పుబట్టారు. ఏపీపై కాంగ్రెస్ పార్టీకి చిత్తశుద్ధి ఉంటే విభజన చట్టంలోనే ప్రత్యేక హోదా చేర్చేవారని ధ్వజమెత్తారు. రాష్ట్రాన్ని…
దాదాపు పది రోజులుగా కొనసాగుతున్న ఝార్ఖండ్ సంక్షోభానికి తెరపడింది. ముఖ్యమంత్రి చంపై సోరెన్ నేతృత్వంలోని జేఎంఎం-కాంగ్రెస్ సర్కారు బలపరీక్షలో నెగ్గింది. సోమవారం జరిగిన ఓటింగ్‌లో చంపై సర్కారుకు అనుకూలంగా 47 ఓట్లు.. వ్యతిరేకంగా 29 ఓట్లు వచ్చాయి. దీంతో హేమంత్ సోరేన్ రాజీనామాతో ఏర్పడిన సంక్షోభం ముగిసిపోయింది. మనీ ల్యాండరింగ్ కేసులో జేఎంఎం అధినేత హేమంత్ సోరెన్‌ను ఈడీ అధికారులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. దాంతో జేఎంఎం సీనియర్ నేత చంపై సోరెన్ ఝార్ఖండ్ ముఖ్యమంత్రిగా శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. మొత్తం 81 స్థానాలున్న ఝార్ఖండ్ అసెంబ్లీలో ప్రభుత్వ ఏర్పాటుకు కావాల్సిన మ్యాజిక్ ఫిగర్ 41. ఝార్ఖండ్ ముక్తి మోర్చా, కాంగ్రెస్, రాష్ట్రీయ్ జనతా దళ్‌తో కలిపి 47 మంది సభ్యుల మద్దతు చంపై సోరెన్‌కు ఉంది. మెజార్టీ మార్క్‌కు ఎక్కువ మంది సభ్యులు ఉన్నారు. బలపరీక్షలో వీరంతా ఓటింగ్‌లో పాల్గొని ప్రభుత్వాన్ని నిలబెట్టుకున్నారు. అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యేలను…
బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతికి ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం కృషి చేసిందని రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ తెలిపారు. సామాజిక న్యాయం దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోందని చెబుతూ జగన్ ప్రభుత్వం పేదల ప్రభుత్వం అని, ప్రజల జీవన ప్రమాణాల మెరుగుకు కృషి చేశామని పేర్కొన్నారు. ఎపి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఉభయసభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగిస్తూ జగన్ ప్రభుత్వంలో పేదరికం 11.25 శాతం నుంచి 4.1 శాతానికి తగ్గిందని, దేశంలో ఎక్కడా లేని విధంగా విద్యా సంస్కరణలు చేపట్టామని, పేద పిల్లలకు గ్లోబల్ ఎడ్యుకేషన్ అందిస్తున్నామని, మనబడి నాడు-నేడు ద్వారా స్కూళ్ల రూపురేఖలు మార్చామాని స్పష్టం చేశారు. విద్యారంగంపై రూ.73,417 కోట్లు ఖర్చు చేశామని, జగనన్న విద్యాకానుక కోసం ఇప్పటివరకు రూ.3367 కోట్లు ఖర్చు చేశామని పేర్కొన్నారు. విద్యారంగానికి అధిక ప్రాధాన్యత ఇచ్చామని, 1 నుంచి 10 తరగతి వరకు జగనన్న గోరుముద్ద అములు చేస్తున్నామని, పిల్లలకు నాణ్యమైన…
మ్యూజిక్ ఇండస్ట్రీలో అత్యంత ప్రతిష్ఠాత్మకమైన పురస్కారం గ్రామీ. 66వ గ్రామీ అవార్డ్స్ లాస్ ఏంజిల్స్ లో మన టైం ప్రకారం ఇవాళ ఉదయం ఆట్టహాసంగా జరిగాయి. ప్రపంచవ్యాప్తంగా పలు కేటగిరీల్లో అనేక సాంగ్స్, మ్యూజిక్ ఆల్బమ్స్, వీడియో ఆల్బమ్స్ పోటీపడ్డాయి. ఈసారి గ్రామీ అవార్డ్స్ లో ఇండియన్స్ కి కూడా అవార్డులు దక్కాయి. అంతర్జాతీయ సంగీత వేదికపై ఇండియన్ మ్యూజిక్ ఆర్టిస్టులు శంకర్ మహదేవన్, జాకీర్ హుస్సేన్ జయకేతనం ఎగరవేశారు. వీరు కంపోజ్ చేసిన ‘దిస్ మూమెంట్’ బెస్ట్ గ్లోబల్ మ్యూజిక్ ఆల్బమ్‌గా అవార్డ్ ను సొంతం చేసుకుంది. ఈ పాటను 8 మంది కలిసి కంపోజ్ చేయగా.. అందులో జాన్ మెక్ లాగ్లిన్ (గిటార్), జాకీర్ హుస్సేన్ (తబ్లా), శంకర్ మహదేవన్ (సింగర్), వి సెల్వగనేశ్ (పెర్కషనిస్ట్), గనేశ్ రాజాగోపాలన్ (వయోలిన్ విద్వాంసుడు) ఉన్నారు. ఇక, భారతీయ సంగీతం గొప్పదనాన్ని విశ్వ వేదికపై చాటిన వీరికి ప్రముఖులు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.…
టీడీపీ, జనసేన పొత్తు విషయంలో సీట్ల సర్దుబాటుపై రెండు పార్టీలు అగ్ర నాయకులు దాదాపు ఒక నిర్ణయానికి వచ్చారు. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఆదివారం రెండు దఫాలుగా సుదీర్ఘంగా ఏకాంతంగా సమావేశమై జనసేన పోటీచేసే నియోజకవర్గాల విషయంలో ఓ నిర్ణయానికి వచ్చారు. జనసేనకు అంతిమంగా 25 అసెంబ్లీ సీట్లు, రెండు లోక్ సభ సీట్లు ఖాయం కానున్నాయి. ఉమ్మడి మేనిఫెస్టో విడుదలకు సిద్దమయ్యారు. ఈ నెల 14న పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో రెండు పార్టీల ఉమ్మడి బహిరంగ సభ నిర్వహించాలని నిర్ణయించారు. అందులో చంద్రబాబు, పవన్ ఇద్దరూ పాల్గొని ఉమ్మడి మ్యానిఫెస్టోను విడుదల చేస్తారు. ఇక, బీజేపీ పొత్తు పైన స్పష్టత తీసుకోవాలని నిర్ణయించారు. పార్లమెంట్ సమావేశాల తరువాత పవన్ ఢిల్లీ వెళ్లనున్నారు. బీజేపీ నేతల వైఖరి పైన స్పష్టత తీసుకొని కలిసి వస్తే సీట్ల కేటాయింపు, మేనిఫెస్టో పైన చర్చ చేయనున్నారు.…
తెలంగాణలో మరో రెండు పథకాలను అమలు చేసేందుకు రేవంత్ రెడ్డి కేబినెట్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది. సచివాలయంలో రేవంత్ రెడ్డి అధ్యక్షతన ఆదివారం సుదీర్ఘంగా సాగిన కేబినెట్ సమావేశంలో రూ.500కే గ్యాస్ సిలిండర్‌తో పాటు ప్రతి ఇంటికి 200 యూనిట్ల ఉచిత కంరెట్ పథకాల అమలుపై మంత్ర వర్గం చర్చించి ఈ రెండు పథకాల అమలుకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇక వీటితో పాటు మరిన్ని అంశాలపై కూడా చర్చించిన కేబినెట్ .. సంచలన నిర్ణయాలు తీసుకుంది. ఈ నెల 8 నుంచి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు నిర్వహించాలని మంత్రివర్గం నిర్ణయించింది. అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగానికి కూడా కేబినెట్ ఆమోదం తెలిపింది. కేబినెట్ తీసుకున్న నిర్ణయాలను మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, శ్రీధర్ బాబు వెల్లడించారు. టీఎస్ ను టీజీగా మార్చటానికి కూడా కేబినెట్ ఆమోదం తెలిపినట్టు. ఇక నుంచి వాహనాల నెంబర్ ప్లేట్లపై టీజీగా రిజిస్ట్రేషన్ జరగనున్నట్టు…
మాస్కోలోని భారత రాయబార కార్యాలయంలో నియుక్తుడైన పాకిస్తానీ ఇంటర్ సర్వీసెస్ ఇంటలిజెన్స్ (ఐఎస్‌ఐ) గూఢచారి సత్యేంద్ర సివాల్‌ను ఉత్తర ప్రదేశ్ ఉగ్రవాద నిరోధక దళం (ఎటిఎస్) అరెస్టు చేసింది. సత్యేంద్ర సివాల్ 2021 నుంచి రాయబార కార్యాలయంలో పని చేస్తున్నాడు. ఉత్తర ప్రదేశ్‌లోని హాపూర్ స్వస్థలమైన సత్యేంద్ర సివాల్ విదేశాంగ మంత్రిత్వశాఖలో మల్టీ టాస్కింగ్ స్టాఫ్ (ఎంటిఎస్)గా పని చేస్తున్నాడు. మాస్కోలో భారత రాయబార కార్యాలయంలో ఒక వేగు పని చేస్తున్నాడని తమ వర్గాల నుంచి ఎటిఎస్‌కు ఒక సమాచారం అందినట్లు అధికార ప్రకటన వెల్లడించింది. ఆ సమాచారం ఆధారంగా యుపి ఎటిఎస్ సత్యేంద్రను ప్రశ్నించింది. కానీ అతని సమాధానాలు సంతృప్తికరంగా లేవు. అయితే, ఆ తరువాత తన గూఢచర్యం సాగిస్తున్నట్లు అంగీకరించాడు. అతనిని మీరట్‌లో అరెస్టు చేశారు. భారత సైన్యం గురించి, దాని దైనందిన కార్యకలాపాల గురించి సమాచారం రాబట్టేందుకు భారత ప్రభుత్వ అధికారులకు డబ్బు ఎర వేసినట్లు సత్యేంద్ర…
తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పద్మ అవార్డు గ్రహీతలకు రూ.25 లక్షల నగదు బహుమతిని ప్రకటించింది. దీంతో పాటు ప్రతి నెల రూ.25వేలు పింఛన్ అందించాలని నిర్ణయం తీసుకున్నారు. పద్మ పురస్కారాలకు ఎంపికైన తెలుగువారిని తెలంగాణ ప్రభుత్వం ఆదివారం సత్కరించింది. హైదరాబాద్ శిల్పకళావేదికలో జరిగిన ఈ కార్యక్రమంలో పద్మ అవార్డులకు ఎంపికైన మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, మెగాస్టార్ చిరంజీవిని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సన్మానించారు. వీరితో పాటు పద్మశ్రీ అవార్డులకు ఎంపికైన తెలంగాణవాసులు గడ్డం సమ్మయ్య, దాసరి కొండప్ప, ఆనందాచారి, ఉమా మహేశ్వరి, కేతావత్ సోమ్‌లాల్, కూరెళ్ల విఠాలాచార్యను కూడా సీఎంతో పాటు మంత్రులు సత్కరించారు. లంగాణ నుంచి పద్మ అవార్డులకు ఎంపికైన ఈ ఐదుగురికి పెన్షన్ ఇవ్వనున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. ప్రతిష్ఠాత్మక అవార్డులు గెలుచుకున్న తర్వాత కూడా చాలామంది పద్మ అవార్డు గ్రహీతలు, కళాకారులు ఎదుర్కొన్న ఆర్థిక ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని నగదు బహుమతి,…