Author: Editor's Desk, Tattva News

భారత టెన్నిస్ స్టార్ రోహన్ బోపన్న చరిత్ర సృష్టించాడు. ఆస్ట్రేలియా ఓపెన్ 2024 టోర్నీలో పురుషుల డబుల్స్ విభాగంలో విజేతగా నిలిచాడు. ఆస్ట్రేలియాకు చెందిన తన సహచరుడు ఎబ్డెన్‌తో కలిసి ఈ సీజన్ తొలి గ్రాండ్‌స్లామ్ టైటిల్‌ను అందుకున్నాడు. కెరీర్‌లో తొలి సారి ఆస్ట్రేలియా ఓపెన్ డబుల్స్ విజేతగా నిలిచాడు. 43 ఏళ్ల లేటు వయసులో టైటిల్ గెలిచి అతిపెద్ద వయసులో ఈ ఫీట్ సాధించిన తొలి ప్లేయర్‌గా చరిత్రకెక్కాడు. శనివారం జరిగిన ఫైనల్లో బోపన్న-ఎబ్డెన్ జోడీ 7-6(7/0), 7-5 తేడాతో ఇటలీ జోడీ సిమోన్-వావోసోరిపై విజయం సాధించింది. హోరాహోరీగా సాగిన ఈ ఫైనల్లో ఇటలీ జోడీ నుంచి బోపన్న జంట తీవ్ర పోటీని ఎదుర్కొంది. తొలి పాయింట్ నుంచి ఇరు జోడీలు నువ్వా-నేనా అన్నట్లు తలపడ్డాయి. టై బ్రేక్‌‌కు దారి తీసిన తొలి సెట్‌ను సొంతం చేసుకున్న బోపన్న జోడీ.. రెండో సెట్‌లో కాస్త తడబడింది. ఓ దశలో రోహన్…

Read More

సిపిఎం అనుబంధ సంస్థ ఎస్‌ఎఫ్‌ఐకు చెందిన కార్యకర్తలను అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తూ కేరళ గవర్నర్ అరిఫ్ మహమ్మద్ శనివారం రోడ్డు పక్కన ధర్నాకు దిగారు. కొల్లాం జిల్లాలో నిలమెల్‌లో ఈ సంఘటన జరిగింది. నిలమెల్‌లో రద్దీగా ఉండే ఎంసి రోడ్డు పక్కన ఓ షాపు నుంచి కుర్చీ తీసుకుని రోడ్డు పక్కన వేసుకుని కూర్చోవడం సంచలనం కలిగించింది. గవర్నర్ ఓ కార్యక్రమానికి వెళ్తుండగా ఎస్‌ఎఫ్‌ఐ కార్యకర్తలు నల్లజెండాలు ప్రదర్శించి నిరసన తెలపడం గవర్నర్ ఆగ్రహానికి కారణమైంది. దీంతో ఆయన కారు దిగి దగ్గర్లోని షాపు వద్ద ధర్నా సాగించారు. ఈ సమయంలో ఆయన పోలీస్‌లపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న దృశ్యాలు టివి ఛానల్స్‌లో వైరల్ కావడం ప్రారంభమైంది. పోలీస్ అధికారులే కాకుండా గవర్నర్ ఖాన్‌కు చెందిన అధికార సిబ్బంది స్థానిక ప్రజలు భారీ సంఖ్యలో ఆ ప్రదేశంలో గుమి కూడారు. నిరసనకారులకు రక్షణ కల్పిస్తున్నారని గవర్నర్ వాదించారు. 13 మంది…

Read More

త్వరలోనే రాష్ట్రంలో కుల గణన చేపడుతామని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం తమ ప్రభుత్వం ఈ నిర్ణయానికి కట్టుబడి ఉందని తెలిపారు. కుల గణనకు అవసరమైన చర్యలు చేపట్టాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. శనివారం సచివాలయంలో బిసి, మైనారిటీ, గిరిజన సంక్షేమ విభాగాలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. సమావేశంలో బిసి కుల గణనపై సుదీర్ఘ చర్చ జరిగింది. బిసి కుల గణన నిర్వహించి జనాభా దామాషా ప్రకారం బిసిలకు రిజర్వేషన్లు పెంచాలని బిసి సంఘాలు చాలా కాలంగా ఉద్యమిస్తున్నాయి. ఈ నేపథ్యంలో కొన్ని రాష్ట్రాల్లో ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు కులగణన నిర్వహిస్తున్నాయి. పొరుగున ఉన్న ఆంద్రప్రదేశ్ రాష్ట్రంలోనూ కులగణన చేపట్టారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ తమ ఎన్నికల మ్యానిఫెస్టోలో కులగణన అంశాన్ని చేర్చింది. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కులగణన నిర్ణయం తీసుకున్నారు. …

Read More

మహారాష్ట్రలో కొనసాగుతున్న మరాఠా రిజర్వేషన్ల ఉద్యమం ముగిసింది. వారి డిమాండ్లకు మహారాష్ట్ర ప్రభుత్వం అంగీకారం తెలిపింది. దీంతో ఉద్యమకారుడు మనోజ్‌ జరాంగే తన నిరసన దీక్షను విరమించారు. మరాఠాలకు విద్యా, ఉద్యోగాల్లో రిజర్వేషన్లు కల్పించాలని కోరుతూ మనోజ్‌ జరాంగే నేతృత్వంలో కొంతకాలంగా ఉద్యమం కొనసాగుతున్న విషయం తెలిసిందే.  అయితే, వీరి డిమాండ్లను మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్‌ షిండే ప్రభుత్వం పట్టించుకోలేదు. దీంతో ఆగ్రహించి తాడోపేడో తేల్చుకోవడానికి జరాంగే నేతృత్వంలో వేలమంది ముంబై దిశగా ర్యాలీ చేపట్టారు. అయినా ప్రభుత్వం నాన్చుడు ధోరణి అవలంబిస్తుండటంతో తాజాగా జరాంగే డెడ్‌లైన్‌ విధించారు. ‘రిజర్వేషన్ల కోసం ఉద్యమం ఉద్ధృతంగా సాగుతున్నది. ర్యాలీ దాదాపు ముంబై దగ్గరికి వచ్చింది. ఇప్పుడు ప్రభుత్వం చెప్పే మాటలు వినే పరిస్థితి లేదు. కాబట్టి ప్రభుత్వం ఇవాళ ఉదయం 11 గంటలలోపు అధికార ప్రకటన చేయాలి. లేకుంటే 12 గంటలకు కార్యాచరణ ప్రకటిస్తా’ అని వెల్లడించారు. `మా అడుగులు ముంబైలోని ఆజాద్‌…

Read More

అసెంబ్లీ ఎన్నికల ఫలితాలతో సంబంధం లేకుండా వచ్చే లోక్ సభ ఎన్నికల్లో తెలంగాణ నుంచి రెండంకెల సీట్లను గెలుచుకోవాలని పట్టుదలతో బిజెపి పనిచేస్తున్నది. 2019 ఎన్నికల్లో ఏకంగా నాలుగు ఎంపీలను గెలుచుకుని బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలకు సవాల్ విసిరింది. ఆ తర్వాత క్రమంగా పుంజుకుంటూ వచ్చింది బీజేపీ. అయితే మరోసారి వచ్చే లోక్ సభ ఎన్నికల్లో అత్యధిక సీట్లలో పాగా వేయాలని చూస్తోంది.  ఇందులో భాగంగా ఆ పార్టీ అగ్రనేత అమిత్ షా ఆదివారం తెలంగాణలో మూడు జిల్లాల్లో తలపెట్టిన కీలక సమావేశాల్లో పాల్గొంటారు. దక్షిణాది రాష్ట్రాల్లో ఒక్కటైన తెలంగాణ నుంచి ఎన్నికల శంఖారావాన్ని పూరించనుంది బీజేపీ.  ఆదివారం మధ్యాహ్నం ఒంటి గంట తర్వాత ప్రత్యేక విమానంలో బేగంపేటకు చేరుకొని, అక్కడ్నుంచి నేరుగా మహబూబ్‌నగర్‌ వెళ్లి, జిల్లా కేంద్రంలో నిర్వహించే పార్టీ క్లస్టర్ సమావేశానికి హాజరవుతారు.  లోక్ సభ ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా పార్టీ నేతలు, శ్రేణులకు దిశానిర్దేశం చేస్తారు. ఆ…

Read More

గాజా పరిస్థితులు నరకంగా మారాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యుహెచ్‌ఒ) డైరెక్టర్‌ జనరల్‌ టెడ్రోస్‌ అధనామ్‌ ఆందోళన వ్యక్తం చేశారు. కాల్పుల విరమణే ఇజ్రాయెల్‌- పాలస్తీనా వివాదానికి శాశ్వత పరిష్కారమని ఆయన స్పష్టం చేశారు. గాజాలో ప్రస్తుతం నరకంగా మారిందని, శాంతియుతంగా పరిష్కరించుకోవాలని గాజా ఆరోగ్య అత్యవసర పరిస్థితులపై జరిపిన చర్చలో ఆయన హితవు చెప్పారు. ఇథియోపియాకు చెందిన టెడ్రోస్‌ చిన్నతనంలో స్వయంగా యుద్ధ పరిణామాలను ఎదుర్కొన్నారు. 1998- 2000 మధ్య ఎరిత్రియాతో సరిహద్దు యుద్ధ సమయంలో ఆయన పిల్లలూ బంకర్లలో తలదాచుకున్న సందర్భాలు ఉన్నాయి. ప్రస్తుతం గాజాలో నెలకొన్న పరిస్థితులను వివరిస్తూ ఆయన చిన్నప్పటి పరిస్థిలను గుర్తు చేసుకుని కన్నీటి పర్యంతమయ్యారు. ఘర్షణలు, ద్వేషం, ఆవేదన, విధ్వంసం తప్ప.. యుద్ధం ఎలాంటి పరిష్కారం ఇవ్వదని తన సొంత అనుభవంతో చెబుతున్నానని ఆయన తెలిపారు. అందుకే శాంతియుతంగా, రాజకీయంగా ఈ వివాదాన్ని పరిష్కరించుకుందామని సూచించారు. పరిస్థితి ఇలాగే కొనసాగితే గాజాలో ఆకలి,…

Read More

తెలంగాణ రాష్ట్రంలో గోదావరి నదిపై నిర్మించిన కాళేశ్వరం ఎ త్తిపోతల సాగునీటి పథకం పనుల్లో పెద్ద ఎత్తున అవినీతి అక్రమాలు జరిగాయన్న ఆరోపణలను నిగ్గుతేల్చేందుకు తాము సిద్ధంగానే ఉన్నట్టు హై కోర్టుకు కేంద్ర దర్యాప్తు సంస్థ సిబిఐ స్పష్టం చేసిం ది. హైకోర్టు ఆదేశాలిచ్చినా ,లేదా రాష్ట్ర ప్రభు త్వం కోరినా కాళేశ్వరం ప్రాజెక్టుపై దర్యాప్తు చేపడతామని వెల్లడించింది. అయితే దర్యాప్తునకు అ వసరమైన వసతులు ఆర్ధిక వనరులు కల్పించాల్సివుంటుందని సిబిఐ కోర్టుకు తెలిపింది. కాళేశ్వరం ఎత్తిపోతల సాగునీటి పథకంలో పెద్దఎత్తున అవినీతి అక్రమాలు జరిగాయని, డిజైన్లలో మార్పులు చేర్పులు జరిగాయని, పనులు నాశిరకంగా చేసి, అంచనాలు పెంచి భారీగా సోమ్ముచేసుకున్నారని, ప్రజాధనం పక్కదారి పట్టిందన్న ఆరోపణలు చెలరేగాయి. ఈ అంశంపై దర్యాప్తు చేపట్టాలని సిబిఐకి చేసిన ఫిర్యాదులలో కోరినప్పటికీ సిబిఐ నుంచి స్పందనరాలేదని పేర్కొంటూ న్యాయవాది రామ్మోహన్‌రెడ్డి తెలంగాణ రాష్ట్ర హైకోర్టులో పిటీషన్ దాఖలు చేశారు. ఈ పిటీషన్‌ను విచారణకు…

Read More

ఆంధ్ర ప్రదేశ్ కు కీలకమైన పోలవరం ప్రాజెక్టు పూర్తికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని రాష్ట్ర గవర్నర్‌ అబ్దుల్‌ నజీర్‌ తెలిపారు. 75వ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని ఇందిరాగాంధీ స్టేడియంలో శుక్రవారం ఆయన జాతీయ పతాకావిష్కరణ చేశారు.  సాయుధ దళాల గౌరవ వందనం స్వీకరించిన అనంతరం ఆయన రాష్ట్ర ప్రజలనుద్దేశించి మాట్లాడుతూ పోలవరం ప్రాజెక్టుతో పాటే సహాయ పునరావాస పనులు (ఆర్‌ఆండ్‌ఆర్‌) కూడా ఒకేసారి పూర్తయ్యేలా చూస్తామని చెప్పారు. కరువు పీడిత రాయలసీమ, ప్రకాశం, వెనుకబడిన జిల్లాల్లో సాగు, తాగు, పారిశ్రామిక అవసరాలకు నీరు అందించేందుకు చేపట్టిన జలయజ్ఞం ప్రాజెక్టులను కూడా పూర్తిచేస్తామని చెప్పారు.  వెలిగొండ రెండో టన్నెల్‌ పూర్తయిందని, 2024 సెప్టెంబరు నాటికి నల్లమల సాగర్లో నీటిని నిల్వ చేసుకోవచ్చని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రజలకు ప్రత్యక్ష, పరోక్ష నగదు బదిలీ పథకాల ద్వారా రూ.4,21,094 కోట్లను అందించామని తెలిపారు. 7000 మెగావాట్ల సౌర విద్యుదుత్పత్తి కోసం సెకీతో ఒప్పందం చేసుకున్నట్లు…

Read More

దేశ రాజధాని ఢిల్లీలోని కర్తవ్యపథ్‌లో మువ్వన్నెల జెండా రెపరెపలాడింది. 75వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. భారత నారీశక్తిని చాటేలా పరేడ్‌ సాగింది. కత్తితో కవాతు చేయడం మొదలు సాంప్రదాయ బ్యాండ్ల వాయిస్తూ, రక్షణ వ్యవస్థలను లీడ్‌ చేస్తూ, రాష్ట్ర/కేంద్ర శకటాలను వివరిస్తూ, మోటర్‌ బైక్స్‌ పై ఒళ్లు గగురుపొడిచేల విన్యాసాలతో మహిళలు తమ శక్తియుక్తులను ప్రదర్శించారు. కాగా 40 ఏళ్ల తరువాత గుర్రపు బగ్గీలో కర్తవ్య పథ్‌ చేరుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము… అనంతరం జాతీయ జెండా ఆవిష్కరించారు. ఈ సారి వేడుకలకు ముఖ్య అతిథిగా ఫ్రెంచ్‌ అధ్యక్షులు ఇమాన్యూవల్‌ మాక్రాన్‌ హాజరయ్యారు. ఉపరాష్ట్రపతి జగదీప్‌ ధన్కర్‌, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, కేంద్ర మంత్రులు, పెద్ద సంఖ్యలో వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు ఈ వేడుకల్లో పాల్గొన్నారు. తొలిసారి 112 మంది మహిళా కళాకారులు భారతీయ సంగీత వాయిద్యాలను వాయిస్తూ.. పరేడ్‌ ను ప్రారంభించారు. అనంతరం ప్రారంభమైన కవాతు…

Read More

బీహార్‌ ముఖ్యమంత్రి, జేడీయూ నాయకుడు నితీశ్‌కుమార్‌ మరోసారి బీజేపీ వైపు అడుగులు వేస్తున్నట్టు తెలుస్తున్నది. కాంగ్రెస్‌తో జట్టుకట్టిన నితీశ్‌ గత రెండు మూడేండ్లుగా బీజేపీకి వ్యతిరేకంగా ‘ఇండియా’ కూటమిని ఏర్పాటు చేయడంలో కీలకంగా వ్యవహరించిన సంగతి తెలిసిందే. అయితే,  ఇండియా కూటమిలోని ఆర్జేడీతో ఏర్పడిన విభేదాల నేపథ్యంలో నితీశ్‌ తిరిగి బీజేపీ పంచన చేరాలని నిర్ణయించుకున్నట్టు చెప్తున్నారు.  ‘గాలి తన దిశను మార్చుకున్నట్టు నితీశ్‌ తన విధానాలను మార్చుకోవడం సహజమే’ నంటూ ఆర్జేడీ అధ్యక్షుడు లాలూ ప్రసాద్‌ యాదవ్‌ కుమార్తె రోహిణి ఆచార్య శుక్రవారం ట్వీట్‌ చేశారు. ఇక ఇంతకాలం నితీశ్‌ను ఎట్టిపరిస్థితిల్లోనూ తమ దరిదాపుల్లోకి రానివ్వబోమని బీరాలు పలికిన బీజేపీ నేతలు సహితం ఇప్పుడు సానుకూల సంకేతాలు పంపుతున్నారు.  బీజేపీ బీహార్‌ నేతలు నితీశ్‌ రాకను వ్యతిరేకిస్తుండగా, జాతీయ నాయకులు మాత్రం ఇప్పటికే ఆయన పట్ల తమ సానుకూలతను వ్యక్తం చేసినట్టు తెలుస్తున్నది. గతంలో జరిగిన చేదు అనుభవాలను బట్టి…

Read More