ఉత్తరప్రదేశ్‌లోని జ్ఞ్ఞానవాపి మసీదు ఉన్న స్థలంలో అంతకు ముందు ఒక భారీ హిందూ అలయం ఉన్నట్లు ఈ మసీదు ప్రాంతంలో సర్వే నిర్వహించిన భారత పురావస్తు పరిశోధన శాఖ (ఎఎస్‌ఐ) నివేదిక పే ర్కొన్నట్లు ఈ నివేదికను అందుకున్న హిందూ వర్గాలకు ప్రాతినిధ్యం వహి స్తున్న న్యాయవాది విష్ణు శంకర్ జైన్ గురువారం విలేఖరుల సమావేశం లో తెలియజేశారు. కోర్టు ఆదేశాల మేరకు ఎఎస్‌ఐ నివేదికను ఈ కేసులోని ఇరుపక్షాలకు అందజేసిన విషయం తెలిసిందే. ఈ నివేదికను మీడియా సమావేశంలో జైన్ చదివి వినిపించారు. ‘స్తంభాలు, ప్లాస్టర్‌ను తిరిగి ఉప యోగించి మసీదుకు కొన్ని మార్పులు చేసినట్లు ఎఎస్‌ఐ నివేదిక పేర్కొం టోంది. కొత్త నిర్మాణంలో ఉపయోగించడం కోసం హిందూ ఆలయానికి చెందిన కొన్ని స్తంభాలను కొద్దిగా మార్పు చేశారు. స్తంభాలమీద ఉన్న శాసనాలను తొలగించడానికి ప్రయత్నాలు కూడా జరిగాయి’ అని నివే దికను ఉటంకిస్తూ జైన్ తెలిపారు. అంతేకాదు దేవనాగరి,…
Author: Editor's Desk, Tattva News
సినీ ప్రముఖుడు మెగాస్టార్ చిరంజీవిని మరో అత్యున్నత పురస్కారం వరించింది. గణతంత్ర దినోత్సవం (2024) వేడుకల సందర్భంగా కేంద్ర ప్రభుత్వం.. దేశంలో రెండో అత్యున్నత పురస్కారమైన ‘పద్మ విభూషణ్’ పురస్కారాన్ని కొణిదెల చిరంజీవికి ప్రకటించింది. మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడిని సైతం పద్మ విభూషణ్ పురస్కారం వరించింది. ఈ ఏడాది మొత్తం ఐదుగురు ప్రముఖులకు పద్మ విభూషణ్ అవార్డులు ప్రకటించారు. ఇటీవల కన్నుమూసిన తమిళ నటుడు కెప్టెన్ విజయ్‌కాంత్‌కు పద్మ భూషణ్ ప్రకటించారు. సినీ రంగం నుంచి ఉషా ఉతుప్ (సింగర్), మిథున్ చక్రవర్తి ‘పద్మ భూషణ్’ అవార్డులకు ఎంపికయ్యారు. ఈ ఏడాది మొత్తం 132 మందికి పద్మ పురస్కారాలు ప్రకటించారు. వీరిలో ఐదుగురికి పద్మ విభూషణ్, 17 మందికి పద్మ భూషణ్, 110 మందికి పద్మశ్రీలు ప్రకటించారు. దేశ అత్యున్నత పౌర పురస్కారమైన ‘భారతరత్న’ను బీహార్ జననాయక్, మాజీ ముఖ్యమంత్రి కర్పూరీ థాకూర్ (మరణానంతరం) ప్రకటించారు.కోట్లాది మంది తెలుగు ప్రేక్షకుల ఆరాధ్య…
టీమ్ ఇండియా స్టార్ క్రికెట్ ప్లేయర్, రన్ మెషీన్ విరాట్ కోహ్లీ ఇప్పటికే లెక్కలేనన్ని రికార్డులను తన పేరిట లిఖించుకున్నాడు. సుమారు దశాబ్దంన్నర కాలంగా భారత క్రికెట్ బ్యాటింగ్‌కు వెన్నెముకగా ఉండి రికార్డుల సునామీ సృష్టిస్తున్న కింగ్ కోహ్ మరో అరుదైన ఘనత సాధించాడు. గతేడాదికి గాను విరాట్ ‘ఐసీసీ మెన్స్ ఓడీఐ (వన్డే) క్రికెటర్ ఆఫ్ ది ఈయర్’ అవార్డు సొంతం చేసుకున్నాడు. ఈ మేరకు ఐసీసీ గురువారం ఎక్స్ (ట్విటర్) ద్వారా ప్రకటన చేసింది. కోహ్లీకి ఈ అవార్డు రావడం ఇది నాలుగోసారి. తద్వారా కోహ్లీ ప్రపంచ క్రికెట్‌లో నాలుగు సార్లు ఈ అవార్డు దక్కించుకున్న తొలి క్రికెటర్‌గా నిలిచాడు. గతంలో కోహ్లీ.. 2012, 2017, 2018లలో కూడా ఈ అవార్డును సొంతం చేసుకున్నాడు. భారత క్రికెటర్లు శుభ్‌మన్ గిల్, మహ్మద్ షమీల నుంచి గట్టి పోటీ ఎదుర్కున్నా చివరికి ఐసీసీ కోహ్లీకే ఈ అవార్డుకు ఎంపిక చేసింది.…
ఎసిబి వలకు మరో అవినీతి తిమింగలం చి క్కింది. ఆదాయానికి మించిన అస్తులు కూడబెట్టారన్న ఆరోపణలపై హెచ్‌ఎండిఎ మాజీ డైరెక్టర్ శివబాలకృష్ణ ఇళ్లు, కార్యాలయల్లో అవినీతి నిరోధక శాఖ సోదాలు చేసింది. బుధవారం ఉదయం 5గంటల నుంచి బృందాలుగా విడిపోయి ఎసిబి అధికారులు జరిపిన సోదాలలో రూ 100 కోట్లకు పైగా అక్రమాస్తులు వెలుగులోకి రావడంతో అరెస్ట్ చేశారు. శివబాలకృష్ణను ఏసీబీ కోర్టు ఫిబ్రవరి 8 వరకు జ్యుడీషియల్ రిమాండ్ విధించగా, ఏసీబీ అధికారులు చంచల్‌గూడ జైలుకు తరలించారు. ప్రస్తుతం ఆయన రియల్ ఎ స్టేట్ రెగ్యులేటరీ అథారిటీ (రెరా)కి కా ర్యదర్శిగానూ అదనపు బాధ్యతలు నిర్వహిస్తున్నారు. సోదాల్లో భాగంగా మాసబ్ ట్యాంక్‌లోని రెరా కార్యాలయం, అ మీర్‌పేటలోని హెచ్‌ఎండిఎ కార్యాల యం, మణికొండలోని నివాసం, బంధువులు ఇళ్లలో అవినీతి నిరోధక శాఖ, ఏకకాలంలో 20 చోట్ల 14 బృందాలతో దాడులు నిర్వహించింది. అనేక రియల్ ఎస్టేట్ కంపెనీలకు ఇష్టానుసారం అనుమతులు…
కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి జగదీశ్ శెట్టర్ సొంతగూటికి చేరుకున్నారు. అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్‌లో చేరిన శెట్టర్ ఇప్పుడు మళ్లీ బీజేపీలో చేరారు. అసెంబ్లీ ఎన్నికలకు ముందు బీజేపీ ఆయనకు టికెట్ ఇవ్వక పోవడంతో కాంగ్రెస్‌లో చేరారు. బీజేపీ కేంద్ర కార్యాలయంలో గురువారం శెట్టర్ కు బీజేపీ సీనియర్ నేతలు బీఎస్ యడియూరప్ప, బీజేపీ కర్ణాటక అధ్యక్షుడు బివై విజయేంద్ర, ఆహ్వానం పలికారు. కండువా కప్పి పార్టీ లోకి ఆహ్వానించారు. పార్టీ సభ్యత్వాన్ని అందజేశారు. ఈ సందర్భంగా శెట్టర్ మాట్లాడుతూ నరేంద్ర మోదీ మరోసారి ప్రధాని అవుతారన్న విశ్వాసం ఉందని చెప్పారు. యడియూరప్ప, ఇతర సీనియర్ నేతలు , కార్యకర్తలు పార్టీ లోకి రావాలని కోరడంతో తిరిగి సొంతగూటికి చేరానని తెలిపారు. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల సమయంలో బీజేపీ రాష్ట్ర నాయకత్వంపై శెట్టర్ తిరుగుబాటు చేసి కాంగ్రెస్‌లో చేరారు. హబ్బళ్లి ధార్వాడ సెంట్రల్ నుంచి కాంగ్రెస్ తరఫున పోటీ చేసినా ఓటమి…
ఫిబ్రవరిలో అయోధ్యను సందర్శించవద్దని కేంద్ర మంత్రులకు ప్రధాని నరేంద్ర మోదీ సూచించారు. రామ మందిరానికి వెళ్లి ప్రోట్రోకాల్, వీఐపీ సందర్శన పేరుతో భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలిగించవద్దని కోరారు. మార్చి నెలలో అయోధ్యకు వెళ్లాలని సూచించారు. బుధవారం జరిగిన కేబినెట్ సమావేశంలో ఈ మేరకు కేంద్ర మంత్రులతో ప్రధాని మోదీ పేర్కొన్నారు. అలాగే అయోధ్యలోని రామ మందిరంలో సోమవారం జరిగిన ప్రాణప్రతిష్ట కార్యక్రమం, ప్రజల స్పందన గురించి కేబినెట్ మంత్రులను ఆయన ఆరా తీశారు. ఇలా ఉండగా, ప్రధాన మంత్రి నరేంద్ర మోదీపై కేంద్ర మంత్రివర్గం ప్రశంసల జల్లు కురిపించింది. బుధవారం ప్రధాని అధ్యక్షతన సమావేశమైన కేంద్ర మంత్రివర్గ సమావేశంలో కీలక తీర్మానాన్ని ఏకగ్రీవంగా సభ్యులందరూ ఆమోదించారు. అయోధ్య రామజన్మభూమి వద్ద ఆలయ నిర్మాణం, ప్రారంభోత్సవం సందర్భంగా ప్రధాన మంత్రిని అభినందిస్తూ, ప్రశంసిస్తూ ఈ తీర్మానాన్ని మంత్రివర్గంలోని మంత్రులు ప్రవేశపెట్టి ఆమోదించారు. ” బాలరాముడి విగ్రహ ప్రాణప్రతిష్ఠాపన సందర్భంగా మీ నాయకత్వాన్ని, మంత్రివర్గ…
తమది ప్రజా పాలనా అని, ఎవరైనా నిరసనలు చేసుకోవచ్చని అధికారం చేబడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పారు. పైగా, తమది దేశంలోనే `ఫ్రెండ్లీ పోలీసింగ్’ అంటూ తెలంగాణ పోలీసులు ఘనత చెప్పుకొంటుంటారు. అయితే, నిరసనలు, ఆందోళనలు జరిగినప్పుడు మాత్రం అదేంటో నిరసనకారులపై తమ ఉగ్రరూపాన్ని ప్రదర్శిస్తుంటారు. నిరసన వ్యక్తం చేసేది రాజకీయ నాయకులు కాకుండా విద్యార్థులో, రైతులో, మహిళలో అయితే మాత్రం.. వారిపట్ల కొంచెం క్రూరంగానే వ్యవహరిస్తున్నారు. దీనికి సాక్ష్యమే.. ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో. ఎబివిపి రాష్త్ర కార్యదర్శి ఝాన్సీరాణి ని ఆడపిల్ల అని కూడా చూడకుండా ఇద్దరు మహిళా పోలీసులు జుట్టుపట్టుకుని ఈడ్చుకొంటూ రోడ్డుపై వెడుతూ ఉండటం సభ్యసమాజం సిగ్గుపడెటట్లు చేస్తున్నది. ఉద్యానవన యూనివర్సిటీ భూములను హైకోర్టు భవనాల నిర్మాణంకోసం బదలాయిస్తూ రేవంత్ రెడ్డి ప్రభుత్వం జారీచేసిన జీవో నెం.55ను వ్యతిరేకిస్తూ హైదరాబాద్ రాజేంద్రనగర్ వ్యవసాయ యూనివర్సిటీలో గత కొన్ని రోజులుగా విద్యార్థులు, విద్యార్థి సంఘాలు…
రోజూ మనం తింటున్న బియ్యం, గోధుమలు ఓ రకంగా విషపు ఆహారంగా మారిపోయాయి. శరీరానికి ఎంతో అవసరమైన జింక్, ఐరన్ వంటి పోషకాల స్థానంలో ఆర్సెనిక్ వంటి విష పదార్థాలు వచ్చి చేరడమే దీనికి కారణం. ఈ మేరకు ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ రిసెర్చ్ (ఐసీఏఆర్) పరిశోధకులు, ‘డౌన్ టు ఎర్త్’ మ్యాగజీన్ సంయుక్తంగా నిర్వహించిన అధ్యయనంలో తేలింది. గడిచిన 50 ఏండ్ల వ్యవధిలో భారత్‌లో పండిస్తున్న బియ్యంలో జింక్ పోషకాలు 30 శాతం మేర తగ్గుముఖం పట్టగా, ఐరన్ పోషకాలు 27 శాతం మేర క్షీణించినట్టు అధ్యయనం తెలిపింది. గోధుమల్లో జింక్ స్థాయిలు 30 శాతం, ఐరన్ స్థాయిలు 19 శాతం మేర తగ్గినట్టు వెల్లడించింది. ఇదే సమయంలో ఆర్సెనిక్ మోతాదు బియ్యంలో ఏకంగా 1,493 శాతం పెరిగినట్టు పేర్కొంది. గోధుమల్లోనూ దాదాపుగా ఈ స్థాయిలోనే ఆర్సెనిక్ పెరుగుదల నమోదైనట్టు వివరించింది. హరిత విప్లవంలో భాగంగా జనాభా పెరుగుదలకు…
లోక్‌సభ ఎన్నికల ముందు ఇండియా కూటమికి షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఎన్నికల్లో కూటమితో కలిసి పనిచేసేందుకు పలు పార్టీలు వెనకడుగేస్తున్నాయి. లోక్ సభ ఎన్నికల్లో తాము ఒంటరిగానే పోటీ చేస్తున్నామని పంజాబ్ లో ఆమ్ ఆద్మీ పార్టీ ప్రకటించింది. పంజాబ్‌లో కాంగ్రెస్‌కు గెలిచే సత్తా లేదని.. 13 స్థానాల్లో ఆప్ ఒంటరిగానే పోటీ చేస్తుందని ముఖ్యమంత్రి భగవంత్ సింగ్ మాన్ స్పష్టం చేశారు. తృణమూల్ కాంగ్రెస్ అధ్యక్షురాలు, పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కూడా ఇండియా కూటమికి షాకిచ్చారు. వచ్చే లోక్ సభ ఎన్నికల్లో పశ్చిమ బెంగాల్ నుంచి ఒంటరిగా పోటీ చేస్తామని వెల్లడించారు. ఇండియా కూటమితో పొత్తు ఉండదని, సీట్ల పంపకాల విషయమై కాంగ్రెస్ తో జరిపిన చర్చలు విఫలమయ్యాయని ఆమె చెప్పారు. బెంగాల్ లో ఒంటరిగానే పోటీ చేసి, బిజెపిని మట్టి కరిపిస్తామని స్పష్టం చేశారు. ఆమె ప్రకటించిన కొన్ని గంటలకే పంజాబ్ ముఖ్యమంత్రి కూడా కాంగ్రెస్…
పంటలకు కనీస మద్దతు ధరను కల్పించే చట్టాన్ని అమలు చేయకపోవడంతో పాటు దేశంలో రైతులు ఎదుర్కొంటున్న అనేక సమస్యలపై ఫిబ్రవరి 16న రైతులు భారత్ బంద్ నిర్వహించనున్నట్లు రైతు నాయకుడు, భారత్ కిసాన్ యూనియన్(బికెయు) జాతీయ అధికార ప్రతినిధి రాకేష్ తికాయత్ ప్రకటించారు. వ్యాపారులు, రవాణా సంఘాల నాయకులను కూడా తమ ఆందోళనకు మద్దతు తెలియచేసి ఒకరోజు సమ్మెలో పాల్గొనవలసిందిగా కోరినట్లు తికాయత్ తెలిపారు. ఉత్తర్ ప్రదేశ్‌లోని ముజఫర్ నగర్‌లో ఆయన విలేరులతో మాట్లాడుతూ ఫిబ్రవరి 16న జరిగే భారత్ బంద్‌లో సంయుక్త కిసాన్ మోర్చ(ఎస్‌కెఎం)తోసహా అనేక రైతు సంఘాలు పాల్గొంటాయని తెలిపారు. రైతులు ఆ రోజున పొలానికి వెళ్లకుండా సమ్మె చేయాలని ఆయన పిలుపునిచ్చారు. గతంలో కూడా అమావాస్య నాడు రైతులు తమ పొలాలకు వెళ్లకుండా, పని మానేశారని అలాగే వచ్చే ఫిబ్రవరి 16 కూడా రైతులకు మాత్రమే అమావాస్య అని ఆయన పేర్కొన్నారు. ఆ రోజున రైతులకు పొలాలకు…