దావోస్‌లో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి బృందం ఇప్పటివరకు సుమారు రూ.37వేల కోట్ల పారిశ్రామిక ఒప్పందాలు చేసుకుంది. రాష్ట్రంలో రూ. 12,400 కోట్ల పెట్టుబడి పెట్టేందుకు అదానీ గ్రూప్ ముందుకొచ్చింది. మరో పారిశ్రామిక దిగ్గజం జేఎస్‌డబ్ల్యూ గ్రూప్ రూ. 9 వేల కోట్ల రూపాయలతో పంప్డ్ స్టో రేజీ ప్రాజెక్టులు చేపట్టేందుకు ఒప్పందం చేసుకుంది. ఐదేళ్లలో రూ. 8,000 కోట్లతో బ్యాటరీల ఉత్పత్తి సంస్థ స్థాపించి 6వేల మందికి ఉద్యోగాలు కల్పిస్తామని గోడి ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ వెల్లడించింది. మరోవైపు విప్రో, టాటా సన్స్, అమెజాన్ తదితర పారిశ్రామిక సంస్థలతోనూ ముఖ్యమంత్రి సమావేశమయ్యారు. గ్రూప్ భారీ పెట్టుబడులకు సంసిద్ధత వ్యక్తం చేయడంతో పాటు నాలుగు కీలక ప్రాజెక్టులకు ఒప్పందాలు చేసుకుంది. అదానీ గ్రూప్ చైర్మన్ గౌతమ్ అదానీ సమక్షంలో రూ. 12,400 కోట్ల పెట్టుబడులకు సంబంధించిన ఒప్పందాలపై సంతకాలు చేశారు. అదానీ ఎంటర్ ప్రైజెస్ చందనవెల్లిలో రూ. 5,000 కోట్లతో 100 మెగావాట్ల…
Author: Editor's Desk, Tattva News
అఫ్గానిస్థాన్‌తో బుధవారం ఉత్కంఠభరితంగా సాగిన మూడో, చివరి టి20లో భారత్ రెండో సూపర్ ఓవర్‌లో పది పరుగుల తేడాతో విజయం సాధించింది. 3-0తో టీమిండియా ఈ సిరీస్ ను క్లీన్ స్వీప్ చేసింది. నిర్ణీత సమయంలో ఇరు జట్లు చెరో 212 పరుగులు చేయడంతో మ్యాచ్ టైగా ముగిసింది. దీంతో సూపర్ ఓవర్ అనివార్యమైంది. తొలి సూపర్ ఓవర్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన అఫ్గాన్ 16 పరుగులు చేసింది. తర్వాత లక్షఛేదనకు దిగిన భారత్ కూడా 16 పరుగులు చేయడంతో మరోసారి మ్యాచ్ టైగా ముగిసింది. ఈ నేపథ్యంలో రెండో సూపర్ ఓవర్ ఆడించక తప్పలేదు. ఇందులో తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా 11 పరుగులు చేసి ఆలౌటైంది. తర్వాత లక్షఛేదనకు దిగిన అఫ్గాన్ ఒక పరుగు మాత్రమే చేసి రెండు వికెట్లను కోల్పోయింది. దీంతో భారత్‌కు విజయం దక్కింది. ఈ గెలుపుతో టీమిండియా మూడు మ్యాచ్‌ల సిరీస్‌ను 3-0తో క్లీన్‌స్వీప్…
అయోధ్యలో విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమాలు జోరందుకున్నాయి. రామ్‌లల్లా విగ్రహం బుధవారం ఆలయ ప్రాంగణానికి చేరుకుంది. పూలతో అలంకరించిన పల్లకిలో మేళతాళాల మధ్య ఊరేగింపుగా రాములవారి విగ్రహం అయోధ్య ఆలయానికి చేర్చారు. జై శ్రీరామ్ నినాదంతో ఆలయ ప్రాంగణం దద్దరిల్లింది. గురువారం ఉదయం ప్రత్యేక పూజలు నిర్వహించి ఆలయ గర్భగుడిలోకి రామ్‌లల్లా విగ్రహాన్ని తీసుకొచ్చారు. పెద్ద ఎత్తున జై శ్రీరాం అంటూ నినాదాలు చేస్తూ.. క్రేన్ సాయంతో శ్రీరాముడి విగ్రహాన్ని గర్భగుడి ప్రాంగణంలోకి చేర్చారు. రామమందిరంలో జనవరి 22న శ్రీరాముని విగ్రహప్రతిష్ఠకు అన్ని ఏరాట్లు పూర్తయ్యాయి. మంగళవారం నుంచి ఇందుకు సంబంధించిన క్రతువులు ప్రారంభమై 21వ తేదీవరకు నిరాఘాటంగా కొనసాగుతాయి. జనవరి 21న రామ్‌లల్లా విగ్రహానికి 125 కలశాలతో అభిషేకం చేస్తారు. జనవరి 22న ప్రధాన ప్రాణప్రతిష్ఠ వేడుక మధ్యాహ్నం 12.20 గంటలకు ప్రారంభమవుతుంది. రామ్‌లల్లా విగ్రహాన్ని ప్రధాని నరేంద్ర మోడీ ప్రతిష్ఠాపన చేస్తారు. చివరి రోజు జరిగూ మహోత్సవానికి 150 దేశాల నుంచి…
అయోధ్యలో రామాలయ ప్రాణ ప్రతిష్టాపన మహోత్సవానికి ఒకపక్క ఏర్పాట్లు జోరుగా సాగుతున్న నేపథ్యంలో మధ్యప్రదేశ్‌లో శ్రీరాముడి యాత్రా మార్గాన్ని అభివృద్ధి చేసే ప్రాజెక్టులో ముందడుగు పడింది. మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ శ్రీ రామచంద్ర పథ్ గమన్ ట్రస్టు మొదటి సమావేశాన్ని సాత్నాలో నిర్వహించారు. గత ఏడాది అసెంబ్లీ ఎన్నికలకు ఆరు నెలల మందు అప్పటి ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఈ ట్రస్టును ఏర్పాటు చేశారు. బిజెపి మళ్లీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ ప్రాజెక్టుపై దృష్టి సారించింది. శ్రీరామ భగవాన్ పథ్ గమన్ మార్గ్‌ను దశల వారీగా అభివృద్ధి చేస్తామని ముఖ్యమంత్రి యాదవ్ సమావేశంలో వెల్లడించారు. 16 సంవత్సరాలుగా మూలనపడిన ఈ ప్రాజెక్టుకు ఎట్టకేలకు మోక్షం లభించనున్నది. 14 సంవత్సరాల వనవాసం కోసం అయోధ్యను వీడిన శ్రీరాముడు, సీత, లక్ష్మణుడు మధ్యప్రదేశ్‌లోని అనేక ప్రదేశాల మీదుగా ముందుకు సాగారని హిందువులు విశ్వసిస్తారు. రాముడు నడయాడిన ప్రదేశాలలో సాత్నా జిల్లాలోని…
భారతీయ విద్యార్థులకు ఇచ్చే స్టడీ పర్మిట్ల సంఖ్యను కెనడా బాగా తగ్గించింది. దీనికి కారణం దౌత్యపరమైన విభేదాలే అని తెలుస్తోంది. గత ఏడాది డిసెంబర్‌తో ముగిసిన త్రైమాసికంలో కేవలం 14,910 పర్మిట్లను మాత్రమే కెనడా జారీ చేసింది. అంతక్రితం మూడు నెలల వ్యవధిలో ఈ సంఖ్య 1,08,940గా ఉంది. అంటే 86 శాతం వరకు తగ్గింది. ఖలిస్థానీ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్యకు భారతీయ ఏజెంట్లే కారణమని కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో ఆరోపించడం రెండు దేశాల మధ్య తీవ్ర విభేదాలకు దారి తీసింది. చివరకు రాయబారుల సంఖ్య తగ్గించుకోవాలని కెనడాకు భారత్ సూచించడానికి దారి తీసింది. దాంతో కెనడా 41 మంది దౌత్యాధికారులను వెనక్కి తీసుకుంది. ఈ నేపథ్యంలో స్టడీ పర్మిట్లను పెద్ద సంఖ్యలో ప్రాసెస్ చేయడం కుదరడం లేదని కెనడా ఇమిగ్రేషన్ మంత్రి మార్క్ మిల్లర్ ఇటీవల ఓ ఇంటర్వూలో వెల్లడించారు. కెనడాలో చదువుల కోసం వెళ్లే…
గతంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అరెస్ట్ అయిన్నప్పుడు ఆయన చేపట్టిన పాదయాత్రను కొనసాగిస్తూ `జగన్ వదిలిన బాణాన్ని’ అని చెప్పుకున్న వైఎస్ షర్మిల ఇప్పుడు కాంగ్రెస్ లో చేరి, ఎపిసిసి అధ్యక్ష పదవి చేపట్టిన తర్వాత `జగన్ పై ఎక్కుపెట్టిన బాణం’గా మారుతున్న సూచనలు కనిపిస్తున్నాయి. ఆంధ్ర ప్రదేశ్ లో ఒక్క ఎంపీ లేదా ఎమ్యెల్యే సీటును గెల్చుకొనే సామర్థ్యం లేని కాంగ్రెస్ అవసరమైనప్పుడు జగన్ మోహన్ రెడ్డిని `లొంగదీసుకొనే’ ఎత్తుగడగా షర్మిలను ప్రయోయోగిస్తున్నట్లు తెలుస్తున్నది. ఎపిసిసి అధ్యక్ష పదవి చేపట్టినా ఏపీలో ఎక్కడి నుండి కూడా కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీచేసే సాహసం ఆమె చేయకపోవచ్చని పరిశీలకులు భావిస్తున్నారు. ఆమె దృష్టి అంతా కర్ణాటక నుండి రాజ్యసభకు ఎన్నిక కావడం పైననే ఉంది. అయితే, జగన్ మోహన్ రెడ్డికి చికాకు కలిగించేందుకు బాబాయి దివంగత వైఎస్ వివేకానంద రెడ్డి కుమార్తె డాక్టర్ నర్రెడ్డి సునీతా రెడ్డిని రంగంలోకి దింపేందుకు…
పాకిస్థాన్‌లోని బలూచిస్తాన్ ప్రావిన్స్‌పై మంగళవారం రాత్రి ఇరాన్ క్షిపణులతో విరుచుకుపడింది. దావోస్‌లో పాకిస్థాన్ తాత్కాలిక ముఖ్యమంత్రి అన్వర్ ఉల్ హక్ కకర్ ఇరాన్ విదేశాంగ మంత్రి హుస్సేన్ అమిర్ అబ్దుల్లాహియాన్ సమావేశమైన కొన్నిగంటల్లోనే ఈ ఘటన చోటుచేసుకోవడం గమనార్హం. వెయ్యికిలోమీటర్ల మేర పరుచుకున్న రెండు దేశాల ఉమ్మడి సరిహద్దుకు సమీపంలో నైరుతి బలూచిస్తాన్ ప్రావిన్స్‌లోని పంజ్‌గూర్ ప్రాంతంలో ఈదాడి జరిగినట్లు పాకిస్థాన్ తెలిపింది. ఇద్దరు చిన్నారులు మరణించగా, మరో ముగ్గురు బాలికలకు తీవ్రగాయాలైనట్లు తెలిపింది. ఈ దాడిని ఖండిస్తున్నట్లు పాకిస్థాన్ బుధవారం విడుదల చేసిన ఓ ప్రకటనలో పేర్కొంది. ఇది పాకిస్థాన్ సార్వభౌమాధికారాన్ని పూర్తిగా ఉల్లంఘించడమేనని, తీవ్రమైన పరిస్థితులను ఎదుర్కోవాల్సి వుంటుందని ఆ ప్రకటనలో వెల్లడించింది. ఇరుదేశాల మధ్య పలు కమ్యూనికేషన్ ఛానెల్‌లు ఉన్నప్పటికీ.. ఈ చట్టవిరుద్ధమైన చర్య జరగడం మరింత ఆందోళన కలిగిస్తుందని పాకిస్థాన్ విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలిపింది. ఉగ్రవాదం అన్ని దేశాలకూ తీవ్ర ముప్పు తలపెడుతుందని, దీన్ని…
అయోధ్యలో రామమందిరం ప్రారంభోత్సవానికి టీడీపీ అధినేత, ఏపీ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు ఆహ్వాన పత్రిక అందింది. ఈ నెల 22 వ తేదీన ఉత్తర్‌ప్రదేశ్‌లోని అయోధ్యలో జరగనున్న శ్రీరాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమానికి రావాలని శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ ఆహ్వానం పంపించినట్లు టీడీపీ వర్గాలు వెల్లడించాయి. దేశంలోని వివిధ రాష్ట్రాలకు చెందిన ముఖ్యమంత్రులు, ప్రతిపక్ష నేతలు, సీనియర్ నేతలు, వివిధ రంగాల ప్రముఖులు.. ఇలా చాలా మందికి శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ ఆహ్వానాలు అందిస్తోంది. ఈ నెల 22 వ తేదీన అయోధ్య రామాలయ ప్రారంభోత్సవం ఉండగా ఆ అపూర్వ ఘట్టానికి సంబంధించి ఇప్పటికే ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. ఈ నెల 22 వ తేదీన మధ్నాహ్నం 12:20 గంటలకు ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం జరగనుంది. ఇక ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లో పలువురు ప్రముఖులకు అయోధ్య నుంచి ఆహ్వానాలు అందాయి. అయోధ్య…
బంగ్లాదేశ్‌లో ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో తమ అవామీ లీగ్ పార్టీ అఖండ విజయం సాధించడం బంగ్లాదేశ్ ప్రజల విజయమని, ఈ ఎన్నికలు ప్రజాస్వామ్యాన్ని, ప్రజల ఓటుహక్కును కొనసాగించాయని బంగ్దాదేశ్ ప్రధాని షేక్ హసీనా పేర్కొన్నారు. జనవరి 7న జరిగిన ఈ ఎన్నికలను ప్రధాన విపక్షం బంగ్లాదేశ్ నేషనల్ పార్టీ (బిఎన్‌పి) బహిష్కరించగా, హసీనా నేతృత్వం లోని అవామీ లీగ్ (ఎఎల్) అఖండ విజయం సాధించింది. ప్రపంచం మొత్తం మీద ఉన్న వందలాది ప్రవాసీ అవామీ లీగ్ కార్యకర్తలు ఢాకా లోని హసీనా అధికారిక నివాసం ‘గణభబన్’ వద్దకు మంగళవారం చేరుకుని 12 వ పార్లమెంట్ ఎన్నికల్లో వరుసగా నాలుగోసారి అవామీ లీగ్ పార్టీ విజయం సాధించగా, హసీనాను అభినందించారు. వారిని ఉద్దేశిస్తూ హసీనా మాట్లాడారు. ఈ ఎన్నికల ద్వారా ప్రజల రాజ్యాంగపరమైన ఓటు హక్కును నిర్ధారించగలిగామని ఆమె తెలిపారు. ఎన్నికల్లో పాల్గొనకుండా బహిష్కరించిన విపక్షం బిఎన్‌పిపై ఆమె ధ్వజమెత్తారు. 2008…
ఎటువంటి అంచనాలు లేకుండా సంక్రాంతికి విడుదలైన హనుమాన్ మూవీ బాక్సాఫీస్ వద్ద ఎదురులేకుండా దూసుకుపోతుంది. ఐదో రోజు కూడా రికార్డ్ కలెక్షన్స్‌తో దుమ్మురేపింది. మంగళవారం రోజు ఇండియా వైడ్‌గా హనుమాన్ మూవీ రూ.11.90 కోట్లకు వసూళ్లు రాబట్టినట్లు ట్రేడ్ వర్గాలు చెబుతోన్నాయి. మంగళవారం నాటితో ఈ మూవీ రూ. 100 కోట్ల క్లబ్‌లో చేరింది. సంక్రాంతి సినిమాల్లో గుంటూరు కారం తర్వాత రూ. 100 కోట్ల మైలురాయిని అందుకున్న రెండవ చిత్రంగా హనుమాన్ నిలిచింది. ఓవర్‌సీస్‌లో హనుమాన్ వసూళ్ల వర్షం కురిపిస్తోంది. మూడు మిలియన్ల మార్క్‌ను దాటింది. తెలుగు రాష్ట్రాల కు ధీటుగా ఓవర్‌సీస్‌లో ఈ సూపర్ హీరో మూవీ వసూళ్లను రాబడుతోంది. సీజన్ ముగిసిన మౌత్ టాక్ కారణంగా హనుమాన్ వసూళ్లు మాత్రం నిలకడగా కొనసాగుతోన్నాయి. ఐదు రోజుల్లో వరల్డ్ వైడ్‌గా హనుమాన్ రూ. 109 కోట్లకుపైగా గ్రాస్ కలెక్షన్స్‌ను రాబట్టినట్లు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. రూ. 59 కోట్ల…