Author: Editor's Desk, Tattva News

ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవికి గిడుగు రుద్రరాజు సోమవారం రాజీనామా చేశారు. అఖిల భారత కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకు ఆయన రాజీనామా లేఖను పంపించారు. దానితో కొద్దిరోజుల కిందట కాంగ్రెస్ పార్టీలో చేరిన వైఎస్ షర్మిలకు పీసీసీ చీఫ్‌గా బాధ్యతలు చేపట్టేందుకు మార్గం సుగమం అయినట్లయింది. మరికొద్దిరోజుల్లోనే షర్మిలను ఆ పదవిలో నియమించే యోచనలో కాంగ్రెస్ పార్టీ ఉన్నట్లు తెలుస్తోంది. పీసీసీ చీఫ్ పదవిపై షర్మిలకు ఇప్పటికే ఖర్గే స్పష్టత ఇచ్చినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో హైకమాండ్ ఆదేశాల మేరకే రుద్రరాజు తప్పుకున్నారని సమాచారం.  తెలంగాణ కేంద్రంగా వైఎస్ఆర్ తెలంగాణ పేరిట గతంలో కొత్త పార్టీ పెట్టిన షర్మిల అసెంబ్లీ ఎన్నికల వేళ పోటీ చేయడం లేదని ప్రకటించి తప్పుకున్నారు.  కాంగ్రెస్ పార్టీకి మద్దతు కూడా ప్రకటించారు. ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ పెద్దల్ని కలిసిన షర్మిల పార్టీ విలీనంపైనా చర్చలు జరిపినట్లు తెలిసింది. తర్వాత ఇటీవల…

Read More

యువ బ్యాటర్లు యశస్వి జైస్వాల్‌ (34 బంతుల్లో 5 ఫోర్లు, 6 సిక్స్‌లతో 68), శివమ్‌ దూబే (32 బంతుల్లో 5 ఫోర్లు, 4 సిక్స్‌లతో 63 నాటౌట్‌) దుమ్మురేపే అర్ధ శతకాలతో.. అఫ్ఘానిస్థాన్‌తో మూడు టీ20ల సిరీ్‌సను భారత్‌ మరో మ్యాచ్‌ మిగిలుండగానే సొంతం చేసుకొంది. ఆదివారం జరిగిన రెండో టీ20లో టీమిండియా 6 వికెట్లతో అఫ్ఘాన్‌ను చిత్తు చేసింది. తొలుత అఫ్ఘాన్‌ 20 ఓవర్లలో 172 పరుగులకు ఆలౌటైంది. గుల్బదిన్‌ నైబ్‌ (57) పోరాటం వృథా అయింది. అర్ష్‌దీప్‌ 3 వికెట్లు పడగొట్టగా.. అక్షర్‌ పటేల్‌, రవి బిష్ణోయ్‌ చెరో 2 వికెట్లు దక్కించుకొన్నారు. ఛేదనలో భారత్‌ 15.4 ఓవర్లలో 4 వికెట్లకు 173 పరుగులు చేసి గెలిచింది. కోహ్లీ (16 బంతుల్లో 29) వేగంగా ఆడాడు. కరీమ్‌ 2 వికెట్లు పడగొట్టాడు. అక్షర్‌కు ‘మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌’ దక్కింది. ఛేదనలో జైస్వాల్‌, దూబే మూడో వికెట్‌కు…

Read More

తెలంగాణాలో కాంగ్రెస్ ప్రభుత్వం త్వరలో కూలిపోయే అవకాశం ఉందని బిజెపి జాతీయ కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్‌కుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేల కొనుగోలుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని, పార్లమెంట్ ఎన్నికల తర్వాత రాష్ట్రంలో ఏదైనా జరగవచ్చని హెచ్చరించారు. పలువురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు బిఆర్‌ఎస్ నేతలకు టచ్ లో ఉన్నారని, జాగ్రత్తగా ఉండాలని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నేతలకు సూచించారు. రాష్ట్రంలో మనం మనం తరువాత కొట్లాడుదాం ముందు ప్రాంతీయ పార్టీలను బొందపెడదామని కాంగ్రెస్ కు పిలుపునిచ్చారు. రాష్ట్ర ప్రజలకు కాంగ్రెస్ ఇచ్చిన హామీలు అమలు చేయాలన్నా, రాష్ట్రం అభివృద్ధి జరగాలంటే తెలంగాణలో మెజారిటీ ఎంపీ స్థానాలను బిజెపి గెల్చుకోవాలని ఆయన స్పష్టం చేశారు. తెలంగాణలో ఐదేళ్ల పాటు సుస్థిర ప్రభుత్వం ఉండాలన్నదే తమ పార్టీ ఉద్దేశమని పేర్కొన్నారు. ఎమ్మెల్యేలను లాగేసుకుని ప్రభుత్వాలను కూల్చే సంస్కృతి బిజెపికి లేదని తేల్చి చెప్పారు. అయోధ్య రామ మందిర్ విషయంలో ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలను…

Read More

భారతదేశం, మాల్దీవుల మధ్య కొనసాగుతున్న దౌత్యపరమైన ఉద్రిక్తతల మధ్య.. భారత్ ముందు మాల్దీవులు ఒక డెడ్‌లైన్ పెట్టింది. మార్చి 15వ తేదీలోగా భారత దళాలను ఉపసంహరించుకోవాలని న్యూఢిల్లీని కోరింది. మాలేలోని విదేశాంగ మంత్రిత్వ శాఖతో మాల్దీవుల్లోని భారత హైకమిషన్ అధికారులు జరిపిన చర్చల్లో భాగంగా.. వాళ్లు ఈ అభ్యర్థన చేసినట్టు తెలిసింది.  మాల్దీవుల స్థానిక మీడియా ప్రకారం ప్రస్తుతం ఇరు దేశాల మధ్య నెలకొన్న పరిణామాలతో పాటు మాల్దీవుల్లోని భారత సైనిక సిబ్బంది ఉనికి గురించి ఇరువర్గాల మధ్య చర్చలు సాగాయి. ఈ క్రమంలోనే మార్చి 15లోపు తమ దళాల్ని వెనక్కి రప్పించుకోవాల్సిందిగా వాళ్లు భారత్‌ని కోరారు. కాగా చైనా అనుకూల వ్యక్తిగా పేరుగాంచిన మహమ్మద్ ముయిజ్జూ తాను ఆ దేశాధ్యక్షుడు అవ్వడానికి ముందు ఎన్నికల ప్రచారంలో భాగంగా భారత సైనిక సిబ్బందిని తొలగించి, వాణిజ్యాన్ని సమతుల్యం చేస్తానని వాగ్దానం చేశారు. సెప్టెంబర్‌లో జరిగిన అక్కడి అధ్యక్ష ఎన్నికల సమయంలో ఆయన…

Read More

ఢిల్లీలో కాలుష్యం తీవ్రమవడంతో వాయు నాణ్యత అధ్వాన్నంగా మారింది. అనేక ప్రాంతాలలో విజిబిలిటీ (దృశ్యమాన్యత) స్థాయిలు సున్నాకు పడిపోయింది. దీంతో కేంద్రం ఆదివారం పలు ఆంక్షలు విధించింది. ఢిల్లీ, ఎన్‌సిఆర్‌ పరిధిలో నిర్మాణాలపై కేంద్రం నిషేధం విధించింది. బిఎస్‌-3 పెట్రోల్‌, బిఎస్‌-4 డీజిల్‌ ఫోర్‌ వీలర్‌లను నడపడంపై కూడా నిషేధం విధించింది. అనవసర ప్రయాణాలకు దూరంగా ఉండాలని, డ్రైవింగ్‌లో జాగ్రత్తలు తీసుకోవాలని భారత వాతావరణ శాఖ (ఐఎండి) ప్రజలను హెచ్చరించింది. శనివారం రాత్రి 10 గంటల నుండి పంజాబ్‌, హర్యానా, ఢిల్లీ, ఉత్తర రాజస్థాన్‌, ఉత్తరప్రదేశ్‌లలో దట్టమైన పొగమంచు కమ్ముకున్నట్లు ఐఎండి అధికారి ఒకరు తెలిపారు. పంజాబ్‌ మరియు ఉత్తర రాజస్థాన్‌ నుండి ఈశాన్యం వరకు దట్టమైన పొగమంచుతో కప్పేసిన దృశ్యాలు శాటిలైట్‌లో కనిపించాయి. గంగానగర్‌, పాటియాలా, అంబాలా, చంఢగీఢ్‌, ఢిల్లీ, బరేలీ, లక్నో, బహ్రైచ్‌, వారణాసి, ప్రయాగ్‌రాజ్‌, తేజ్‌పూర్‌ మీదుగా అమృత్‌సర్‌ నుండి దిబ్రూగఢ్‌ వరకు జీరో విజిబిలిటీ నమోదవడం…

Read More

ఏడాదిన్నర కిందట భారత్ జోడో యాత్ర పేరుతో కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకూ 3,500 కి.మీ. పాదయాత్ర చేసిన కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఎన్నికలకు ముందు మళ్లీ జనం బాటపట్టారు. ఆదివారం ఆయన మణిపూర్‌ నుంచి భారత్ జోడో న్యాయ్ యాత్రకు శ్రీకారం చుట్టారు.  మణిపూర్‌లోని తౌబల్‌ జిల్లాలో ఓ ప్రైవేట్ మైదానం నుంచి యాత్రను ప్రారంభించారు. మొత్తం 67 రోజుల పాటు కొనసాగనున్న భారత్ న్యాయ్ యాత్ర 15 రాష్ట్రాల్లో 110 జిల్లాల్లోని 100 లోక్‌సభ నియోజకవర్గాల మీదుగా కాలినడకన, బస్సులో మొత్తంగా 6,700కిపైగా కిలోమీటర్ల మేర యాత్ర సాగనుంది. మార్చి 20న ముంబయిలో ఈ యాత్ర ముగుస్తుంది.  మణిపూర్, నాగాలాండ్ మీదుగా జనవరి 18 నాటికి ఈ యాత్ర అసోంకి చేరుకుంటుంది. ఆదివారం రాత్రికి మణిపూర్‌ సరిహద్దులోని ఖుజామా గ్రామంలో రాహుల్ బస చేయనున్నారు. సోమవారం ఉదయం అక్కడి నుంచి నాగాలాండ్‌లోకి ప్రవేశించి ఆ రాష్ట్ర రాజధాని…

Read More

గోషామహల్ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్‌కు మరోసారి బెదిరింపు కాల్స్ రావటం ఇప్పుడు కలకలం రేపుతోంది. నిత్యం వివాదాస్పద వ్యాఖ్యలతో నిత్యం వార్తల్లో నిలిచే బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్‌కు గతంలో కూడా పలుమార్లు బెదిరింపు కాల్స్ రాగా ఇప్పుడు కూడా వార్నింగ్ కాల్స్ వచ్చాయని ఆయనే స్వయంగా తెలిపారు.  శ్రీరామనవమి రోజున శోభయాత్ర తీస్తే చంపేస్తామని కొందరు ఫోన్‌లు చేసి బెదిరింపులకు పాల్పడుతున్నారంటూ రాజాసింగ్ వీడియో విడుదల చేశారు. ఫోన్‌లు చేసి బెదిరించడం కాదని, దమ్ముంటే నేరుగా రావాలని రాజాసింగ్ ఛాలెంజ్ చేశారు. గతంలోనూ ఇలాగే బెదిరింపు కాల్స్ వచ్చాయని రాజాసింగ్ చెప్పుకొచ్చారు. నమ్మిన సిద్ధాంతం కోసం తాను ఎంత దూరమైనా వెళ్తానని, ఇలాంటి బెదిరింపులు తనను ఏం చేయలేవని స్పష్టం చేశారు. బెదిరింపులకు పాల్పడేవారు ఎంత స్థాయి వ్యక్తులైనా తనకు అనవసరమని, దమ్ముంటే నేరుగా రావాలని, లేకుంటే ఫోన్‌లు చేయడం మానుకోవాలని వీడియోలో రాజాసింగ్ హితవు చెప్పారు. అయితే తనకు ఏ…

Read More

మహారాష్ట్రలో కాంగ్రెస్‌ కీలక నేత మిలింద్‌ దేవరా పార్టీకి రాజీనామా చేశారు. ఆ వెంటనే ముఖ్యమంత్రి ఏక్‌నాథ్‌ షిండే నేతృత్వంలోని శివసేన పార్టీలో నేడు చేరనున్నారు. తన రాజీనామా విషయాన్ని మిలింద్‌ దేవరా స్వయంగా ఎక్స్‌ వేదికగా తెలిపారు. ” రాజకీయ ప్రయాణంలో ముఖ్యమైన ముగింపు. నేను కాంగ్రెస్‌ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశాను. పార్టీతో నా కుటుంబానికి 55 ఏళ్ల బంధాన్ని ముగించాను. ఇన్ని ఏళ్లుగా పార్టీ నుంచి నాకు మద్దతు తెలిపిన నాయకులు, సహచరులు, కార్యకర్తలకు కృతజ్ఞతలు తెలుపుతున్నాను. ” అని పేర్కొన్నారు. దేవరా కాంగ్రెస్ కు రాజీనామా చేసిన వెంటనే మిలింద్ దేవ‌రా శివ‌సేన‌లో చేరాల‌ని నిర్ణ‌యించుకుంటే తాను స్వాగ‌తిస్తాన‌ని షిండే ప్రకటించారు. మిలింద్ దేవ‌రా వ్య‌వ‌హారం తాను విన్నాన‌ని, ఆయ‌న త‌మ పార్టీలో చేరితే స్వాగ‌తిస్తాన‌ని షిండే పేర్కొన్నారు. ముంబయి సౌత్‌ లోక్‌సభ స్థానం నుంచి మిలింద్‌ కాంగ్రెస్‌ తరుపున ప్రాతినిథ్యం వహిస్తున్నారు. 2004, 2009…

Read More

తెలంగాణాలో కొత్తగా పారిశ్రామిక కారిడార్‌లను ఏర్పాటు చేయాలని, తద్వారా తెలంగాణ యువతకు లక్షాది ఉపాధి అవకాశాలు కల్పించవచ్చునని ముఖ్యమంత్రి ఎ రేవంత్ రెడ్డి కేంద్రాన్ని కోరారు. హైదరాబాద్ నుంచి మిర్యాలగూడ మీదుగా విజయవాడకు అనుసంధానించే జాతీయ రహదారి పొడవునా కొత్తగా ఏర్పాటు చేయబోయే పారిశ్రామిక కారిడార్‌కు అనుమతివ్వాలని కూడా కోరారు. ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కతో పాటు శనివారం న్యూఢిల్లీలో కేంద్ర పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్‌ను కలిసి రాష్ట్రంకు సంబంధించిన పలు అంశాలపై చారఃచించారు. హైదరాబాద్- నాగ్‌పూర్ పారిశ్రామిక కారిడార్‌కు సంబంధించిన పెండింగ్‌లోని మిగతా అనుమతులు మంజూరు చేస్తే రాష్ట్రానికి రూ. 2,300 కోట్ల నిధులు విడుదలవుతాయని కేంద్ర మంత్రికి రేవంత్ విన్నవించారు. అంతేగాక రాష్ట్రానికి సంబంధించిన అనేక పెండింగ్ లో ఉన్న సమస్యలపై చర్చలు జరిపి, వాటిని సాధ్యమైనంత త్వరగా పరిష్కరించాలని, తెలంగాణ ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలంటే కేంద్రం వద్ద పెండింగ్‌లో ఉన్న సమస్యలన్నీ పరిష్కారం…

Read More

చైనాతో ముప్పు పొంచి ఉన్న వేళ తైవాన్‌లో నిర్వహించిన ఎన్నికల్లో అధికార డెమొక్రటిక్ ప్రొగ్రెసివ్ పార్టీ (డీపీపీ)కి చెందిన లయ్ చింగ్-తే అధ్యక్షుడిగా విజయం సాధించారు. చైనా దురాక్రమణకు ప్రయత్నిస్తున్న నేపథ్యంలో ఈసారి నిర్వహించిన తైవాన్ ఎన్నికలు ప్రపంచం దృష్టిని ఆకర్షించాయి. అధికార డీపీపీ అభ్యర్థి లయ్ చింగ్-తే, ప్రధాన ప్రతిపక్షం కేఎంటీకి చెందిన హో యు-ఇహ్, తైవాన్ పీపుల్స్ పార్టీకి చెందిన కో వెన్-జె మధ్య జరిగిన త్రిముఖ పోరులో లయ్ చింగ్ విజేతగా నిలిచారు. ప్రస్తుత తైవాన్ అధ్యక్షురాలు త్సయి ఇంగ్-వెన్ స్థానంలో లయ్ చింగ్ బాధ్యతలు చేపడతారు.  తైవాన్ అధ్యక్ష పదవి చేపట్టిన తొలి మహిళగా గుర్తింపు పొందిన త్సయి తమ దేశ స్వయంప్రతిపత్తికి కట్టుబడి చైనాను ధిక్కరించారు. ఇది డ్రాగన్‌కు ఆగ్రహం తెప్పించింది. 2016, 2020 ఎన్నికల్లో విజయం సాధించిన త్సయి మరోసారి ఎన్నికల్లో పోటీ చేయడానికి అవకాశం లేకుండా పోయింది. దీంతో ఆమె వారసుడిగా…

Read More