Author: Editor's Desk, Tattva News

పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు జనవరి 31న ప్రారంభం కానున్నాయి. ఫిబ్రవరి 9 వరకు జరగనున్న జడ్జెట్ సమావేశాల ప్రారంభం రోజున రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఉభయ సభలనుద్దేశించి ప్రసగించనున్నారు. ఈ సమావేశాలలో ప్రభుత్వం కొన్ని కీలక ఆర్థిక ప్రకటనలు చేసే అవకాశం ఉంది. మహిళా రైతులకు ప్రభుత్వం ఒక శుభవార్తను ప్రకటించే అవకాశం ఉంది. ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పథకం కింద మహిళా రైతులకు పెట్టుబడి సాయాన్ని రెట్టింపు చేసే అవకాశం ఉంది. సొంత భూమి ఉన్న మహిళా రైతులకు సంవత్సరానికి రూ. 6,000 ఉన్న పెట్టుబడి సాయన్ని రూ. 12,000 పెంచే విషయాన్ని ప్రభుత్వం పరిశీలిస్తున్నట్లు కొద్ది రోజుల క్రితం వార్తలు వెలువడ్డాయి. ఫిబ్రవరి 1న ప్రవేశపెట్టనున్న మధ్యంతర బడ్జెట్‌లో ఇందుకు సంబంధింఒచిన ప్రకటన చేసే అవకాశం ఉందని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ప్రస్తుతం సంవత్సరానికి రూ. 6,000 అందచేస్తున్న పెట్టుబడి సాయాన్ని రెట్టింపు చేయడం వల్ల…

Read More

కాళేశ్వరం ప్రాజెక్టు విచారణపై కాంగ్రెస్ పార్టీ ద్వంద్వ విధానాన్ని అవలంబిస్తోందని బిజెపి జాతీయ ప్రధాన కార్యదర్శి, కరీంనగర్ ఎంపి బండి సంజయ్ కుమార్ మండిపడ్డారు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో రూ.లక్ష కోట్ల అవినీతికి బిఆర్‌ఎస్ ప్రభుత్వం పాల్పడిందని చెప్పిన కాంగ్రెస్ నేతలు ఇపుడు అందుకు భిన్నంగా మేడిగడ్డ బ్యారేజీ నిర్మాణంపైనే జ్యుడీషియల్ విచారణ కోరడం సిగ్గు చేటని ధ్వజమెత్తారు. బిఆర్‌ఎస్ నేతల అవినీతిని కాపాడేందుకు కాంగ్రెస్ నేతలు ప్రయత్నిస్తున్నారా? అని ప్రశ్నించారు. కాంగ్రెస్ ప్రభుత్వం కోరితే కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో జరిగిన అవకతవకలపై సిబిఐ విచారణ జరిపించేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని ఆయన స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం కాంగ్రెస్ ప్రభుత్వానికి సహకరించేందుకు తాము సిద్ధమని చెప్పారు. కాళేశ్వరంపై సిబిఐ విచారణ ఎందుకు జరిపించడం లేదని సంజయ్ ప్రశ్నించారు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో రూ.లక్ష కోట్ల అవినీతి జరిగిందని కాంగ్రెస్ చెప్పిందని ఆయన గుర్తు చేశారు. మొత్తం కాళేశ్వరం…

Read More

అయోధ్యలో జనవరి 22న జరిగే రామాలయ ప్రాణ ప్రతిష్టాపన మహోత్సవానికి తమ పార్టీ అగ్ర నాయకులెవరూ వెళ్లడం లేదని కాంగ్రెస్ పార్టీ బుధవారం చేసిన ప్రకటనపై భారతీయ జనతా పార్టీ తీవ్రస్థాయిలో మండిపడింది. కాంగ్రెస్ నేతలు మల్లికార్జున్ ఖర్గే, సోనియా గాంధీ, అధిర్ రంజన్ చౌదరి ఈ నెల 22న అయోధ్యకు వెళ్లబోరని కాంగ్రెస్ చేసిన ప్రకటనను తప్పుపట్టిన బిజెపి కాంగ్రెస్ పార్టీని రామ వ్యతిరేకిగా అభివర్ణించింది. రామాలయ ప్రాణ ప్రతిష్టాపన మహోత్సవాన్ని ఆర్‌ఎస్‌ఎస్/బిజెపి కార్యక్రమంగా కాంగ్రెస్ బుధవారం ఒక ప్రకటనలో అభివర్ణించింది. రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్(ఆర్‌ఎస్‌ఎస్), బిజెపి అయోధ్యలో ఆలయాన్ని రాజకీయ ప్రాజెక్టుగా మార్చివేశాయని కాంగ్రెస్ ఆరోపించింది. ఈ ఆరోపణలపై బిజెపి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. కాంగ్రెస్, దాని మిత్రపక్షాలు తరచు హిందువులను, సనాతన ధర్మాన్ని అవమానిస్తున్నారని బిజెపి మండిపడింది. కాగా..అయోధ్య ఆలయంలో ఈ నెల 22న జరిగే మహోత్సవానికి హాజరుకాకూడదని పార్టీ అగ్రనేతలు తీసుకున్న నిర్ణయాన్ని కర్ణాటక…

Read More

ఈ ఏడాది జరగనున్న సాధారణ ఎన్నికలను ప్రజాస్వామ్య బద్ధంగా, పారదర్శకంగా నిర్వహించేందుకు ఎన్నికల కమిషన్‌ పెద్దయెత్తున సన్నాహాలు చేస్తోందని భారత ప్రధాన ఎన్నికల కమిషనరు రాజీవ్‌కుమార్‌ తెలిపారు. ఎన్నికల నిర్వహణకు ఇంకా ఏమేమి చేయాలనే అంశంపై గుర్తింపు పొందిన రాజకీయ పార్టీలతో సమావేశం నిర్వహించి వారి ఫిర్యాదులు, అభ్యంతరాలు, సలహాలు, సూచనలు స్వీకరించామని చెప్పారు.  విజయవాడలోని ఓ హోటల్‌లో సాధారణ ఎన్నికలకు సంబంధించిన మొదటి సమావేశం నిర్వహించారు. మూడు రోజుల పర్యటనలో చివరిరోజు బుధవారం ఉదయం సిఇఒ, నోడల్‌ ఆఫీసర్లు, సెంట్రల్‌ ఆర్మ్‌డ్‌ పోలీస్‌ ఫోర్స్‌, రాష్ట్ర పోలీసులతో, అనంతరం సెంట్రల్‌, రాష్ట్ర ఎన్‌ఫోర్స్‌మెంట్‌ ఏజెన్సీస్‌, సాయంత్రం చీఫ్‌ సెక్రటరీ, డిజిపి, సెక్రటరీస్‌తో ఎన్నికల సన్నద్ధతపై సమీక్ష నిర్వహించి పలు సూచనలు చేశారు.  రాష్ట్రంలో మొత్తం 4.07 కోట్ల మంది ఓటర్లు ఉన్నారని, పురుష ఓటర్ల కంటే మహిళా ఓటర్లే అధికంగా ఉన్నారని సిఇసి పేర్కొన్నారు. పురుష ఓటర్లు 1.99 కోట్ల…

Read More

కాంగ్రెస్‌ నేత రాహుల్‌గాంధీ చేపట్టనున్న భారత్‌ జోడో న్యాయ్ యాత్రకు అడ్డంకులు ఎదురయ్యాయి. జనవరి 14న తూర్పు ఇంఫాల్‌లోని హట్టా కాంగ్జెబుంగ్‌లో బహిరంగ ర్యాలీ నుండి యాత్రను ప్రారంభించనున్నట్లు పార్టీ ప్రకటించింది. అయితే బహిరంగ ర్యాలీ చేపట్టేందుకు మణిపూర్ రాష్ట్ర ప్రభుత్వం అనుమతి నిరాకరించింది. అనుమతి నిరాకరణపై సీనియర్‌ కాంగ్రెస్‌ నేత కెసి. వేణుగోపాల్‌ స్పందించారు. ఎన్నికల సన్నాహాలకు ఎలాంటి ఆటంకం కలగకుండా యాత్ర చేపడతామని తెలిపారు. ఇది రాజకీయ యాత్ర కాదని, ఈ దేశ ప్రజలకు న్యాయం చేయాలని కోరుతున్నామని పేర్కొన్నారు. కాంగ్రెస్‌ రాష్ట్ర యూనిట్‌ తగిన సమయంలోనే పోలీస్‌ క్లియరెన్స్‌ను అభ్యర్థించిందని చెప్పారు. ఎదురు దెబ్బలు యాత్రను అడ్డుకోలేవని పేర్కొంటూ ఈ సమస్యను రాజకీయం చేయబోమని ఆయన స్పష్టం చేశారు. మణిపూర్ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు, సీనియర్ కాంగ్రెస్ ఎమ్మెల్యే కె మేఘచంద్ర, పార్టీ నాయకుల బృందంతో కలిసి బుధవారం ఉదయం ముఖ్యమంత్రి ఎన్ బీరెన్…

Read More

ప్రపంచవ్యాప్త అనిశ్చితి, కీలక సవాళ్ల నడుమ భారతదేశం దీపస్తంభంగా నిలిచిందని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ చెబుతూ ఈ అద్బుత ఘట్టంతో ప్రపంచం అంతా ఇప్పుడు భారత్ వైపు చూస్తోందని, పలు దేశాలకు ఇండియా ఇప్పుడు ప్రగతి ఛోదకం, విశ్వసనీయ స్నేహం, సుస్థిరతల పునాదిగా మారిందని పేర్కొన్నారు. వెరసి భారతదేశం ఇప్పుడు ప్రపంచ స్థాయిలో ఏ కోణంలో చూసినా ‘విశ్వామిత్ర’ పాత్రకు చేరుకొంటోందని తెలిపారు. స్వరాష్ట్రం గుజరాత్‌లో ప్రధాని మోదీ 10వ వైబ్రెంట్ గుజరాత్ గ్లోబల్ సమ్మిట్‌ను ఉద్ధేశించి ప్రారంభోత్సవ ఉపన్యాసం చేస్తూ పలు కిష్టతల మధ్య ప్రపంచంలో కొన్నేళ్లుగా అలుముకున్న కారుమబ్బుల నడుమ భారతదేశం కాంతిపుంజం అయిందని తెలిపారు. భారతదేశం ఆర్థిక పురోగతి రికార్డు స్థాయిలో ఉందని, ప్రధాన రేటింగ్ ఏజెన్సీలన్ని కూడా ఇదే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నాయని చెప్పారు. వీటి అంచనాల మేరకు వచ్చే కొద్ది సంవత్సరాల్లోనే భారతదేశం ప్రపంచంలోనే భారతదేశం అతిపెద్ద మూడు ఆర్థిక శక్తివంత దేశాలలో…

Read More

అయోధ్యలో జనవరి 22న జరగనున్న రామాలయ ప్రాణ ప్రతిష్టాపన మహోత్సవానికి కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ, లోక్‌సభలో ప్రతిపక్ష నాయకుడు అధిర్ రంజన్ చౌదరి హాజరుకావడం లేదని కాంగ్రెస్ బుధవారం ప్రకటించింది. ఈ కార్యక్రమాన్ని ఆర్‌ఎస్/బిజెపి ప్రాజెక్టుగా సామాజిక మాధ్యమం ఎక్స్(పూర్వ ట్విటర్)లో రాసిన పోస్టులో కాంగ్రెస్ అభివర్ణించింది. అయోధ్యలో జనవరి 22న జరిగిన ఆలయ ప్రతిష్టాపన మహోత్సవానికి మల్లికార్జున్ ఖర్గే; సోనియా గాంధీ, అధిర్ రంజన్ చౌదరిలకు ఆహ్వానాలు అందాయి. అయోధ్యలోని ఆలయాన్ని రాజకీయ ప్రాజెక్టుగా ఆర్‌ఎస్‌ఎస్, బిజెపి ఏనాడో మార్చివేశాయని కాంగ్రెస్ ఆరోపించింది. భగవాన్ శ్రీరాముడిని మన దేశంలోని కోట్లాది మంది కొలుస్తారని, మతం అన్నది వ్యక్తిగత వ్యవహారమని కాంగ్రెస్ తెలిపింది. అయితే అయోధ్యలోని ఆలయాన్ని రాజకీయ ప్రాజెక్టుగా ఆర్‌ఎస్‌ఎస్, బిజెపి ఏనాడో మార్చివేశాయని ఆరోపించింది. ఎన్నికల్లో లబిద్ధపొందేందుకే అసంపూర్ణ ఆలయానికి ప్రారంభోత్సవం చేయాలని బిజెపి, ఆర్‌ఎస్‌ఎస్ నాయకులు నిర్ణయించారని కాంగ్రెస్ ఒక…

Read More

మహారాష్ట్ర రాజకీయాల్లో ఉద్దవ్ థాక్రే నేతృత్వంలోని శివసేన (యూబీటీ)కి భారీ షాక్ తగిలింది. అదే సమయంలో మహారాష్ట్ర సీఎం ఏక్‌నాథ్ షిండే నాయకత్వంలోని శివసేన వర్గానికి ఊరట లభించింది. షిండే నేతృత్వంలోని 40 మంది ఎమ్మెల్యేల సస్పెన్షన్ చెల్లదంటూ మహారాష్ట్ర స్పీకర్ ఉత్తర్వులు జారీ చేశారు. అంతేగాక, ఏక్ నాథ్ షిండే వర్గమే నిజమైన శిసేన అంటూ స్పీకర్ తేల్చి చెప్పారు. ఎన్నికల సంఘం కూడా ఇదే చెప్పిందని స్పీకర్ నర్వేకర్ స్పష్టం చేశారు. షిండే వర్గంలోనే మెజార్టీ ఎమ్మెల్యేలు ఉన్నారని తెలిపారు. కాగా, 2022లో శివసేన రెండు వర్గాలు విడిపోయిన విషయం తెలిసిందే. షిండే వర్గం బీజేపీతో కలిసి మహారాష్ట్రలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఏక్‌నాథ్ షిండే సహా మొత్తం 16 మంది ఎమ్మెల్యేలను అనర్హులుగా ప్రకటించాలని ఉద్ధవ్ థాక్రే వర్గం చేసిన అభ్యర్థనను తోసిపుచ్చారు. అనర్హత నోటీసులు జారీ చేసిన దాదాపు ఆరు నెలల తర్వాత బుధవారం ఈమేరకు…

Read More

టిడిపికి, ఎంపీ పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించిన విజయవాడ ఎంపీ కేశినేని నాని బుధవారం వైసీపీ అధినేత, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని కలిసి ఆ పార్టీలో చేరుతున్నట్లు ప్రకటించారు. తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్ తో భేటీ జరిపిన అనంతరం మీడియాతో మాట్లాడిన కేశినేని నాని చంద్రబాబుపై సంచలన వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు అనే వ్యక్తి పచ్చి మోసగాడని, ఈ రాష్ట్రానికి పనికిరాని వ్యక్తి అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. సీఎం జగన్ పేదల పక్షపాతి అంటూ కొనియాడారు. జగన్మోహన్ రెడ్డితో కలిసి ప్రయాణించాలని నిర్ణయించుకున్నానని కేశినేని నాని వెల్లడించారు. షాజహాన్ తాజ్ మహల్ కట్టాడు, చంద్రబాబు అమరావతి కట్టాడు అనిపించుకోవాలని తాపత్రయం పడుతున్నారని ఎద్దేవా చేశారు. అమరావతి అభివృద్ధి సాధ్యం కాదని ఆనాడే చెప్పినా వినలేదని పేర్కొంటూ 2024 ఎన్నికల్లో టీడీపీ, జనసేన కూటమికి 40 సీట్లు కూడా రావట్లేదని స్పష్టం చేశారు. 2013 జనవరి…

Read More

అయోధ్యలో రామమందిరం ప్రతిష్టాపన తర్వాత ఈ నగరాన్ని ప్రతి నిత్యం మూడు లక్షల మందికి పైగా యాత్రికులు సందర్శించే అవకాశం ఉందని, ఇందు కోసం దేశంలోని తిరుపతి, అమృత్‌సర్ వంటి క్షేత్రాలతోపాటు వాటికన్ సిటీ, కాంబోడియా, జెరుసలెం తదితర ప్రపంచంలోని ప్రముఖ ప్రదేశాలను అధ్యయనం చేసి అయోధ్య పట్టణ ప్రణాళికను రూపొందించినట్లు అయోధ్య రామాలయ ప్రాజెక్టు మాస్టర్ ప్లానర్ దీక్షు కుక్రేజా వెల్లడించారు. గరిష్ట స్థాయిలో లభ్యతలో ఉన్న భూమిని ఉపయోగించుకోవడం, కనిష్ఠ స్థాయిలో రద్దీ ఉండేలా చూడడం, ధర్మశాలలు, హోమ్‌స్టేలకు ప్రాధాన్యత ఇవ్వడం, నగర చారిత్రకత్కృతిక స్వరూపాన్ని మార్చకుండా మౌలిక సదుపాయాలు కల్పించడం వంటివి దీక్షు కుక్రేజా రూపొందించిన పట్టణ ప్రణాళికలోని ప్రత్యేకాంశాలు. రానున్న రోజులలో అయోధ్య నగరం ప్రపంచ పర్యాటక గమ్యస్థానంగా మారనున్నదని, ఆధ్యాత్మిక, సాంస్కృతిక, వారసత్వ సంపద వంటి అంశాలపై ప్రధానంగా ప్రజల దృష్టి ఆలయోధ్యపై ప్రసరించనున్నదని సిపి కుక్రేజా ఆర్కిటెక్ట్ మేనేజింగ్ ప్రిన్సిపాల్ దీక్షు కుక్రేజా…

Read More