Author: Editor's Desk, Tattva News

ఆర్‌జెడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ రైల్వే మంత్రిగా ఉన్న సమయంలో జరిగిన “భూమికి ఉద్యోగం కుంభకోణం” తో సంబంధం ఉన్న మనీలాండరింగ్ కేసులో ఈడీ తొలి ఛార్జిషీట్‌ను ఢిల్లీ లోని ప్రత్యేక పీఎఎల్‌ఎ కోర్టులో సమర్పించింది. ఇందులో లాలూ సతీమణి, బీహార్ మాజీ సిఎం రబ్రీదేవి, కుమార్తెలు ఎంపీ మీసా భారతి, హేమా యాదవ్, లాలూ కుటుంబ సన్నిహితుడు అమిత్ కత్యాల్, రైల్వే ఉద్యోగి , లబ్ధిదారుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న హృదయానంద్‌లతోపాటు , ఏకే ఇన్ఫోసిస్టమ్స్, ఏబీ ఎక్స్‌పోర్ట్‌లపేర్లు చేర్చి అభియోగాలు మోపింది. నిందితులను ప్రాసిక్యూట్ చేయాలని, అంతకు ముందు అటాచ్ చేసిన ఆస్తులను జప్తు చేయాలని ఈడీ కోర్టును కోరింది. జనవరి 16న ఈ కేసు విచారణకు రానున్నట్టు సంబంధిత వర్గాలు తెలిపాయి. ఈ వ్యవహారానికి సంబంధించి గత ఏడాది మార్చిలో ఢిల్లీ,బీహార్,ముంబైలలో మొత్తం 25 చోట్ల సోదాలు చేపట్టింది. తేజస్వి నివాసంతోపాటు లాలూ కుమార్తెలు, బంధువుల ఇళ్లల్లోనూ…

Read More

ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మెక్రాన్ తీసుకున్న నిర్ణయం ప్రపంచవ్యాప్తంగా సంచలనంగా మారింది. దేశ ప్రధాన మంత్రిగా తొలిసారి ఓ స్వలింగ సంపర్కుడిని ప్రతిపాదించారు. 34 ఏళ్ల గాబ్రియేల్ అట్టల్‌‌ను ప్రధానిగా ఎంపిక చేశారు. దీంతో ప్రధాని పదవిని గాబ్రియేల్ అట్టల్‌‌ చేపట్టడం దాదాపు ఖరారయ్యింది.  త్వరలోనే అధికారిక లాంఛనాలతో ఆయన ప్రధానిగా బాధ్యతలను చేపట్టనున్నారు. స్వలింగ సంపర్కుడే కాదు అతిపిన్న వయస్కుడైన తొలి ఫ్రాన్స్ ప్రధాని కానుండటం విశేషం. ప్రధాని కాబోతున్న గ్యాబ్రియేల్ అట్టల్‌కు అభినందనలు వెల్లువెత్తుతున్నాయి.  ఫ్రాన్స్ ఆరోగ్య శాఖలో పదేళ్ల కిందట సలహాదారుగా పనిచేసిన అట్టల్ సోషలిస్టు పార్టీలో సామాన్య కార్యకర్తగా ఉండేవారు.  ప్రస్తుతం మెక్రాన్ సర్కారులో ఆయన విద్యాశాఖ మంత్రిగా కొనసాగుతున్నారు. ప్రధాని ఎలిజబెత్ బోర్న్(62) సోమవారం రాజీనామా చేయడంతో కొత్త ప్రధాన మంత్రి ఎంపిక అనివార్యమైంది. రెండేళ్ల ముందే పదవికి ఆమె రాజీనామా చేయగా, అధ్యక్షుడు మెక్రాన్ ఆమోదించారు. ఈ ఏడాది జూన్‌లో యూరోపియన్ పార్లమెంట్…

Read More

కాళేశ్వరంలో ప్రాజెక్టులో జరిగిన అవినీతిపై విచారణ చేయిస్తామని కొద్ది రోజులుగా చెబుతున్న రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఆ దిశగా అడుగులు వేస్తోంది. తాజాగా ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన మేడిగడ్డ బ్యారేజ్ కుంగుబాటుపై విజిలెన్స్ విచారణకు ఆదేశించింది. మేడిగడ్డ బ్యారేజ్‌లో పిల్లర్ల కుంగుబాటుపై విచారణను విజిలెన్స్‌కు అప్పగించారు. హైదరాబాద్ జలసౌధలోని ఇంజనీర్ ఇన్ చీఫ్ కార్యాలయంలో విజిలెన్స్ అధికారులు సోదాలు చేస్తున్నారు. రెండో అంతస్థు, నాలుగో అంతస్థులో సోదాలు నిర్వహిస్తున్నారు. కాళేశ్వరం పరిధిలోని పలు ఇరిగేషన్ కార్యాలయాల్లోనూ ఈ తనిఖీలు జరుగుతున్నాయి. మేడిగడ్డ కుంగుబాటుకు కారణాలేమిటో తేల్చాలని విజిలెన్స్‌ను ఆదేశించామని భారీ నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. మొత్తం 12 చోట్ల సోదాలు జరుగుతున్నాయని వెల్లడించారు. మేడిగడ్డ కుంగుబాటుకు కారణాలు, ఇతర అంశాలను తేల్చాలని ఆదేశాల్లో పేర్కొన్నట్లుగా తెలిపారు. అదేవిధంగా, మేడిగడ్డ బ్యారేజ్ పిల్లర్లు కుంగిపోవడంపై సిట్టింగ్ జడ్జి విచారణ కోసం హైకోర్టు ప్రధాన న్యాయమూర్తికి లేఖ…

Read More

కోట్లాది మంది భారతీయుల దశాబ్దాల కల నెరవేరబోతోంది. అయోధ్యలో రామమందిరం నిర్మాణాన్ని పూర్తి చేసుకొని ప్రారంభోత్సవానికి సిద్ధమవుతున్నది. ఈ నెల 22న అయోధ్య రామ మందిరం ప్రతిష్టాపన కార్యక్రమం జరుగనున్నది. అంగరంగ వైభవంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయి. ప్రధాని నరేంద్ర మోదీ శ్రీరాముడి విగ్రహ ప్రతిష్టాపన చేయనుండగా.. దేశ విదేశాల నుంచి ప్రముఖులు హాజరుకానున్నారు. అయితే, అయోధ్య రామాలయం ప్రారంభోత్సవం, ప్రాణప్రతిష్ఠ కార్యక్రమాన్ని యావత్ భారతదేశంతో పాటు విదేశాల్లోనూ ప్రత్యక్ష ప్రసారం చేయనున్నారు. అమెరికా న్యూయార్క్ నగరంలోని ప్రసిద్ధ టైమ్ స్క్వేర్‌లోనూ ప్రత్యక్ష ప్రసారం చేయనుండడం విశేషం. ప్రస్తుతం ఉన్న సమాచారం మేరకు ఈ వేడుకను వివిధ దేశాల్లో ఉన్న భారత రాయబార కార్యాలయాల్లోనూ ప్రసారం చేయనున్నారు.  ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం అనంతరం ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగించనున్నారు. వేడుకకు సంబంధించిన సన్నాహాలను ప్రధాని మోదీ నిశితంగా పరిశీలిస్తుండగా ఈ సందర్భంగా అనుసరించాల్సిన ఆచారాలు, నియమాలపై సవివరంగా తెలుసుకున్నట్లు…

Read More

ప్రధాని నరేంద్ర మోదీపై తమ దేశ మంత్రులు చేసిన అనుచిత వ్యాఖ్యలను మాల్దీవ్స్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ టూరిజమ్‌ ఇండిస్టీ (ఎంఎటిఐ) తీవ్రంగా ఖండించింది. సోషల్‌ మీడియా వేదికగా డిప్యూటీ మంత్రులు చేసిన వ్యాఖ్యలను ఖండిస్తున్నామని ఎంఎటిఐ మాలెలో విడుదల చేసిన ఓ ప్రకటనలో పేర్కొంది. ”మాల్దీవుల పర్యాటక పరిశ్రమకు భారత్‌ స్థిరమైన, గణనీయమైన సహకారాన్ని అందిస్తోంది. మా దేశ సరిహద్దులను తిరిగి తెరిచినపుడు, కరోనా మహమ్మారి సయమంలో పర్యాటక పునరుద్ధరణకు సహాయం అందించింది. అప్పటి నుండి మాల్దీవులకు భారత్‌ అగ్ర మార్కెట్‌లలో ఒకటిగా కొనసాగుతోంది” అని పేర్కొంది. భారత్‌ను సమీప పొరుగుదేశం, మిత్రదేశాలలో ఒకటని ఆ ప్రకటనలో తెలిపింది. ”వివిధ సంక్షోభాల సమయంలో భారత్‌ మొదటగా ప్రతిస్పందించిందని, భారత ప్రభుత్వం, ప్రజలు కలిగి ఉన్న సన్నిహిత సంబంధాలకు మేము కృతజ్ఞులం. ఇకపై అలాగే కొనసాగాలని కోరుకుంటున్నాం” అని వెల్లడించింది. మాల్దీవుల పర్యాటక మంత్రిత్వ శాఖ గణాంకాల ప్రకారం 2023లో సుమారు 17…

Read More

టీమిండియా స్టార్‌ పేసర్‌ మహ్మద్‌ షమీ మంగళవారం ఢిల్లీలో రాష్ట్రపతి చేతుల మీదుగా క్రీడలలో ప్రభుత్వం అందజేసే రెండో అత్యున్నత పురస్కారమైన అర్జున అవార్డును అందుకున్నాడు. గత కొన్నాళ్లుగా టీమిండియా తరఫున నిలకడగా రాణిస్తున్న షమీ గత నాలుగేండ్లుగా అంతర్జాతీయ స్థాయిలో 127 వికెట్లు పడగొట్టాడు.  ఇక గతేడాది భారత్‌ వేదికగానే జరిగిన వన్డే వరల్డ్‌ కప్‌లో 24 వికెట్లు సాధించాడు.  ఇప్పటిదాకా  భారత క్రికెట్‌ జట్టులో అర్జున అవార్డు అందుకున్నవారిలో షమీ 58వ క్రికెటర్‌. ప్రస్తుతం టీమిండియాలో ఉన్న క్రికెటర్లలో విరాట్‌ కోహ్లీ, రోహిత్‌ శర్మ, అజింక్యా రహానే, అశ్విన్‌, ఛతేశ్వర్‌ పుజారా, రవీంద్ర జడేజాలు కూడా ఈ జాబితాలో ఉన్నారు. అర్జున అవార్డు అందుకోవడం పట్ల సంతోషం వ్యక్తం చేసిన షమీ ఇది ఒక కలగా అభివర్ణించాడు. ‘‘అర్జున అవార్డు అందుకోవడం ఒక కల. చాలామందికి వారి జీవిత కాలం మొత్తంలో కూడా ఈ అవార్డు దక్కదు. అలాంటిది…

Read More

ఆరు గ్యారంటీల అమలుకోసం ప్రజా పాలన ద్వారా దరఖాస్తులు స్వీకరించిన ప్రభుత్వం ఇప్పుడు అమలు దిశగా కసరత్తు ప్రారంభించింది. దీని కోసం తాజాగా మంత్రివర్గ ఉప సంఘం ఏర్పాటు చేస్తూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్ణయం తీసుకున్నారు. వంద రోజుల్లోగా పథకాల అమలు చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. ఇదే సమయంలో దరఖాస్తులకు ఆధార్, రేషన్ కార్డు అనుసంధానం చేయాలని నిర్ణయించింది. ఆరు గ్యారెంటీల అమలు కోసం తెలంగాణ ప్రభుత్వం కేబినెట్ సబ్ కమిటీని ఏర్పాటు చేసింది. సబ్ కమిటీకి ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క చైర్మన్‌గా వ్యవహరించనున్నారు. సభ్యులుగా మంత్రులు శ్రీధర్‌బాబు, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి వ్యవహరించనున్నారు. ప్రజాపాలనపై సీఎం రేవంత్‌రెడ్డి అధ్యక్షతన జరిగిన సమీక్ష సమావేశంలో ఆరు గ్యారెంటీల అమలుపై చర్చించారు. ఎన్నికల హామీకి ప్రభుత్వం కట్టుబడి ఉన్నామని మంత్రులు ప్రకటించారు. డిసెంబర్ 28 నుంచి ఈ నెల 6 వరకు ప్రజాపాలనలో రాష్ట్ర వ్యాప్తంగా 1,24,85,383 దరఖాస్తులు వచ్చాయి. ఇందులో…

Read More

అధిష్ఠానంపై ధిక్కారస్వరం వినిపించిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల విషయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. గీతదాటిన నలుగురు ఎమ్మెల్యేలు, ఇద్దరు ఎమ్మెల్సీలపై అనర్హత వేటు వేయాలని నిర్ణయించారు. ఈ మేరకు శాసనసభ స్పీకర్, మండలి చైర్మన్‌‌లకు వైఎస్ఆర్సీపీ ఫిర్యాదు చేసింది. ఉమ్మడి నెల్లూరు జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, ఆనం రామనారాయణ రెడ్డి, మేకపాటి చంద్రశేఖరరెడ్డి, గుంటూరు జిల్లాకు చెంది ఉండవల్లి శ్రీదేవితో సహా ఎమ్మెల్సీలు వంశీ కృష్ణ యాదవ్, సి.రామచంద్రయ్యపై ఫిర్యాదు చేసింది. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల సమయంలో పార్టీ విప్‌ను ధిక్కరించి ఎమ్మెల్యేలు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, ఆనం రామనారాయణ రెడ్డి, ఉండవల్లి శ్రీదేవి, మేకపాటి చంద్రశేఖరరెడ్డి ప్రత్యర్థికి ఓట్లు వేసిన విషయం తెలిసిందే. వీరిని ఇప్పటికే పార్టీ నుంచి సీఎం జగన్ సస్పెండ్ చేశారు. ఎమ్మెల్సీ వంశీ కృష్ణ యాదవ్ ఇటీవలే జనసేన పార్టీలో చేరారు. ఇక, ఎమ్మెల్సీ సి.రామచంద్రయ్య…

Read More

రాజస్థాన్‌లో అధికార బిజెపికి ఎన్నికల ఎదురుదెబ్బ తగిలింది. రాష్ట్ర మంత్రి సురేంద్రపాల్ సింగ్ కరాన్‌పూర్ అసెంబ్లీ నియోజకవర్గ ఎమ్మెల్యే స్థానానికి జరిగిన పోటీలో ఓటమి పాలయ్యారు. సోమవారం ఫలితం వెలువడింది. ఇక్కడ ఆయన కాంగ్రెస్ అభ్యర్థి రూపీందర్ సింగ్ కూనర్ చేతిలో ఓడారు. కాంగ్రెస్ అభ్యర్థి ఈ మంత్రిని 11 వేలకు ఓట్ల ఆధిక్యతతో ఓడించారు. అసెంబ్లీ ఎన్నికల దశలో కరాన్‌పూర్ కాంగ్రెస్ అభ్యర్థి గుర్మీత్ సింగ్ అకాల మరణంతో ఈ స్థానానికి అప్పుడు పోలింగ్ వాయిదా వేశారు ఈ నెల 5వ తేదీన తిరిగి పోలింగ్ నిర్వహించారు. సోమవారం ఫలితం వెలువడింది. ఇక్కడి నుంచి రూపీందర్ సింగ్ విజయం సాధించిన విషయాన్ని ఎన్నికల సంఘం ధృవీకరించింది. రాష్ట్రంలోని భజన్‌లాల్ శర్మ సారధ్యపు మంత్రివర్గంలోకి డిసెంబర్ 30 వ తేదీననే సురేంద్రను తీసుకున్నారు. వ్యవసాయ మార్కెట్ బోర్డు, మైనార్టీ వ్యవహారాల శాఖను అప్పగించారు. నిబంధనల ప్రకారం మంత్రులుగా నియమితులు అయిన తరువాత…

Read More

బిజెపి ఎంఎల్‌ఏ రాజాసింగ్‌పై మహారాష్ట్రలో మరో పోలీస్ కేసు నమోదైంది. మతవిద్వేషాలు రెచ్చగొట్టేలా ప్రసంగించారంటూ గోషామహల్ ఎంఎల్‌ఎపై షోలాపూర్ పోలీసులు కేసు నమోదు చేశారు. మహారాష్ట్ర మాజీ సిఎం నారాయణ రాణే తనయుడు, ఎంఎల్‌ఏ నితీష్ రాణేపై కూడా పోలీస్ కేసు నమోదైంది.  కేసుకు సంబంధించిన వివరాల్లోకి వెళితే గత శనివారం షోలాపూర్‌లోని రాజేంద్ర చౌక్ నుండి కన్నా చౌక్ వరకు హిందూ జన ఆక్రోశ్ ర్యాలీ నిర్వహించారు. ఇందులో బిజెపి ఎంఎల్‌ఏలు నితీష్ రాణే, రాజాసింగ్‌తో పాటు సకల హిందూ సమాజ్ నేతలు, స్థానిక ప్రజలు భారీగా పాల్గొన్నారు.  ఆ సందర్భంగా బిజెపి ఎంఎల్‌ఎలు విద్వేషపూరిత ప్రసంగం చేసినట్లుగా ఆరోపణలు రావడం, ఫిర్యాదులు అందడంలో జైల్ రోడ్ పోలీస్ స్టేషన్ లో కేసులు నమోదయ్యాయి. ఐపిసి 153ఎ, 295ఎ సెక్షన్ల కింద ఎంఎల్‌ఏలు రాజాసింగ్, నితీష్ రాణేతో సకల హిందూ సమాజ్ నాయకులపైనా కేసులు నమోదు చేసినట్లు పోలీసులు వెల్లడించారు. …

Read More