వైఎస్సార్‌సీపీకి మాజీ క్రికెటర్ అంబటి రాయుడు షాకిచ్చారు. గత గురువారం (డిసెంబర్ 28) పార్టీలో చేరిన రాయుడు తాను వైఎస్సార్‌సీపీని వీడుతున్నట్లు ప్రకటించారు. వైఎస్సార్‌సీపీ నుంచి బయటకు రావాలని నిర్ణయించుకున్నానని, కొంతకాలం రాజకీయాలకు దూరంగా ఉండాలనుకుంటున్నట్లు ట్విట్టర్ ద్వారా తెలిపారు. త్వరలోనే పూర్తి వివరాలను వెల్లడిస్తానని చెప్పుకొచ్చారు. అంబటి రాయుడు వైఎస్సార్‌సీపీలో చేరిన పది రోజుల్లోనే వీడటం సంచలనంగా మారింది. డిసెంబర్ 28న తాడేపల్లిలోని క్యాంప్ కార్యాలయంలో రాయుడికి వైఎస్సార్‌సీపీ కండువా కప్పిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పార్టీలోకి ఆహ్వానించారు. రాజకీయాలతో తన సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభిస్తున్నట్లు రాయుడు వారం క్రితం ప్రకటించారు. మొదటి నుంచి జగన్ మీద మంచి అభిప్రాయం ఉందని, ఆయన కులమతాలు, రాజకీయాలతో పనిలేకుండా పారదర్శకంగా పాలన చేస్తున్నారని ప్రశంసించారు. అందుకే ఆయనకు మద్దతుగా గతంలో ట్వీట్లు పెట్టినట్లు తెలిపారు. తన ప్రాంత ప్రజల సంక్షేమం కోసం పని చేస్తానని అంబటి రాయుడు చెప్పారు. …
Author: Editor's Desk, Tattva News
భారతీయ అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) మరో ఘనత సాధించింది. సూర్యుడిని అధ్యయనం చేసేందుకు ఇస్రో ప్రయోగించిన ఆదిత్య-ఎల్1 తన లక్ష్యాన్ని చేరుకుంది. ఆదిత్య-ఎల్1 స్పేస్ క్రాఫ్ట్ లక్షిత కక్ష్యలోకి ఇస్రో ప్రవేశపెట్టింది. భూమి నుంచి సూర్యుడి దిశలో 15 లక్షల కిలోమీటర్ల దూరంలో ఉన్న లగ్రాంజ్ పాయింట్ చుట్టూ ఉన్న హాలో కక్ష్యలోకి ఆదిత్య-ఎల్ 1 ను ప్రవేశపెట్టారు. ఈ స్పేస్ క్రాఫ్ట్ ఇక్కడి నుంచి సూర్యుడిని పర్యవేక్షించనుంది. ఈ ప్రయోగం విజయవంతమైందని ప్రధాని మోదీ సామాజిక మాధ్యమంలో వెల్లడించారు. ఇస్రో శాస్త్రవేత్తలకు అభినందనలు తెలిపారు. ఇస్రో తొలి సౌర మిషన్ ఆదిత్య-ఎల్1 చివరి కక్ష్యలోకి చేరుకుంది. ఆదిత్య ఎల్1 సోలార్ అబ్జర్వేటరీని గత ఏడాది సెప్టెంబర్ లో ఇస్రో ప్రయోగించింది. ఇస్రో చీఫ్ ఎస్ సోమనాథ్ ఇటీవల ఏఎన్ఐతో మాట్లాడుతూ… జనవరి 6 సాయంత్రం 4 గంటలకు ఆదిత్య-ఎల్1 లగ్రాంజ్ పాయింట్‌కి చేరుకుంటుందని తెలిపారు. గత సంవత్సరం సెప్టెంబరు…
త్వరలోనే టిడిపికి రాజీనామా చేయనున్నట్లు ప్రకటించిన విజయవాడ ఎంపీ కేశినేని నాని అధికార పక్షం వైసిపి వైపు అడుగులు వేస్తున్నట్లు తెలుస్తున్నది. వచ్చే ఎన్నికలలో ఆ పార్టీ అభ్యర్థిగా విజయవాడ నుండి పోటీ చేసేందుకు సిద్ధపడుతున్నట్లు చెబుతున్నారు. శనివారం ఎన్టీఆర్ జిల్లా చందర్లపాడు మండలంలో వివిధ అభివృద్ధి కార్యక్రమాలు, ప్రారంభోత్సవాల్లో పాల్గొన్న ఆయన ఈ సందర్భంగా మాట్లాడుతూ ”టిడిపికి త్వరలో రాజీనామా చేస్తున్నాను. లోక సభ స్పీకర్ అనుమతి కోరాను. స్పీకర్ అపాయింట్మెంట్ ఇస్తే అప్పుడు వెళ్లి ఎంపీ పదవికి రాజీనామా చేస్తా. తర్వాత తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేస్తా” అని వెల్లడించారు. ఎంపీ పదవికి, పార్టీకి రాజీనామా చేసి అనుచరులతో సమావేశమై భవిష్యత్తు కార్యాచరణ ప్రకటిస్తానని కేశినేని నాని తెలిపారు. గాంతంలోనే నాని వస్తే సాదరంగా ఆహ్వానిస్తామని కొందరు వైసిపి నేతలు ప్రకటనలు జారీ చేశారు. నియోజకవర్గంలోని వైసిపి నేతలతో కొంతకాలంగా ఆయన సామరస్యంగా వ్యవహరిస్తున్నారు. ఎన్నికల తర్వాత నియోజకవర్గం…
అంగన్వాడీలపై ‘ఎస్మా’ ప్రయోగిస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆదేశాలను జారీ చేసింది. సమ్మెను నిషేధిస్తూ ఉత్తర్వులను ఇచ్చింది. అంగన్వాడీలను అత్యవసర సర్వీసుల కిందకు తీసుకువచ్చింది. ఈ మేరకు జీవో నెంబరు 2ను విడుదల చేసింది. ఆరు నెలల పాటు సమ్మెలు, నిరసనలు చేయటం నిషేధమని పేర్కొంది. అంగన్వాడీల సేవలు అత్యవసర సర్వీసులు కిందకు రానప్పటికీ… వారిని అత్యవసర సర్వీసుల కిందకు ప్రభుత్వం తీసుకువచ్చింది. ఈ మేరకు జీవో నంబర్ 2ను ఏపీ ప్రభుత్వం విడుదల చేసింది. అదేవిధంగా సమ్మె చేసిన కాలానికి అంగన్వాడీ వర్కర్లు, హెల్పర్ల వేతనంలో కోత విధించింది. రూ.3 వేలు తగ్గించి రూ.8050 వేతనాన్ని వారి ఖాతాల్లో జమ చేసింది. 26 రోజులుగా రోజులుగా ఏపీలో పని చేస్తున్న అంగన్వాడీలు ఆందోళన చేస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా దీక్ష శిబిరాలు వేసుకొని నిరసనలను వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడు 1971 అత్యవసర సేవల నిర్వహణ చట్టం కింద సమ్మెను నిషేధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.…
ఎలాంటి శాఖ కేటాయించకుండా మంత్రిగా వి.సెంథిల్ బాలాజీని కొనసాగించడంపై నిర్ణయించుకోవాల్సిన బాధ్యత ముఖ్యమంత్రి ఎంకె స్టాలిన్‌దేనంటూ, ఈ విషయంపై తాను ఎలాంటి ఆదేశాలు జారీ చేయకుండా, బంతిని ముఖ్యమంత్రి కోర్టులోకే నెడుతూ మద్రాసు హైకోర్టు తీసుకున్న వైఖరి సరైనదేనని సుప్రీంకోర్టు శుక్రవారం పేర్కొంది. ఉద్యోగం కోసం ముడుపులు కుంభకోణానికి సంబంధించిన మనీ లాండరింగ్ కేసు మంత్రి సెంథిల్ బాలాజీపై నమోదైంది. ”ఆదేశాలు సరైనవే.. మద్రాసు హైకోర్టు తీసుకున్న నిర్ణయంతో మేం ఏకీభవిస్తున్నాం. ఎలాంటి జోక్యం అవసరం లేదు. పిటిషన్ డిస్మిస్ చేయబడింది.” అని బెంచ్‌కు నేతృత్వం వహిస్తున్న జస్టిస్ ఎఎస్ ఓఖా పిటిషనర్ ఎం.ఎల్ రవిని ఉద్దేశించి వ్యాఖ్యానించారు. సెంథిల్ బాలాజీని ప్రభుత్వంలో కొనసాగించేందుకు గల అవకాశాలపై నిర్ణయం తీసుకోవాల్సిందిగా ముఖ్యమంత్రిని హైకోర్టు కోరింది. అయితే, ”పోర్టుఫోలియో లేకుండా ఒక మంత్రిని ప్రభుత్వంలో కొనసాగించడం రాజ్యాంగాన్ని అపహాస్యం చేయడమే… రాజకీయ ఒత్తిళ్ళు అనేవి ప్రజల నైతికత, సుపరిపాలన లేదా స్వచ్ఛమైన పాలన,…
యూనియన్ పబ్లిక్ సర్వీసు కమిషన్ కు (యూపీఎస్సీ) తరహాలో తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీసు కమిషన్ (టీఎస్‌పీఎస్సీ)ను ప్రక్షాళన చేయదలచింనల్టు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెల్లడించారు. సుమారు వందేళ్ల సుదీర్ఘ చరిత్రతో పాటు నిర్ధిష్ట కాలపరిమితిలోనే నోటిఫికేషన్, పరీక్షలు, ఇంటర్వ్యూల నిర్వహణ, నియామక ప్రక్రియను చేపట్టడం, అన్నింటా పారదర్శకత పాటిస్తూ ఉండటంపట్ల యూపీఎస్సీని ఆయన అభినందించారు. న్యూ ఢిల్లీలోని యూపీఎస్సీ కార్యాలయంలో యూపీఎస్సీ ఛైర్మన్ డాక్టర్ మనోజ్ సోని, కార్యదర్శి శశిరంజన్ కుమార్‌లతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్‌రెడ్డి శుక్రవారం భేటీ అయ్యారు. ఈ సందర్భంగా టీఎస్‌పీఎస్సీ ప్రక్షాళన, యూపీఎస్సీ పని తీరుపై సుమారు గంటన్నర పాటు వారు చర్చించారు. యూపీఎస్సీ పారదర్శకత పాటిస్తోందని, అవినీతి మరక అంటలేదని, ఇంత సుదీర్ఘకాలంగా అంత సమర్థంగా యూపీఎస్సీ పని చేస్తున్న తీరుపై ముఖ్యమంత్రి ఆరా తీశారు. తెలంగాణలో నియామక ప్రక్రియలో నూతన విధానాలు, పద్ధతులు పాటించాలనుకుంటున్నట్లు…
అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం ఆస్తుల వేలంలో మొత్తం నాలుగు ప్లాట్‌లకు గానూ రెండింటికి ఎటువంటి బిడ్‌లు దాఖలు కాలేదు. కానీ,కేవలం రూ.15,000 రిజర్వ్ ధర ఉన్న ఒకదానికి ఏకంగా రూ. 2 కోట్లు పలికింది. ముంబయి పేలుళ్ల సూత్రధారి, మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాది పాకిస్థాన్‌లోని కరాచీలో ఆశ్రయం పొందుతున్నట్టు భావిస్తున్నారు. ఇక, దావూద్ స్థలాన్ని శివసేన నేత, న్యాయవాది అజయ్ శ్రీవాస్తవ కొనుగోలు చేశారు. సర్వే నంబరు, మొత్తం కలిపి న్యూమరాలజీలో తనకు అనుకూలంగా ఉండే అంకెతో కూడుకున్నందున అంత మొత్తం చెల్లించినట్లు ఆయన చెప్పారు. అక్కడ సనాతన పాఠశాలను నెలకొల్పాలని భావిస్తున్నట్టు తెలిపారు. మహారాష్ట్ర రత్నగిరి జిల్లాలోని ముంబెకె దావూద్ స్వగ్రామం. అక్కడ ఉన్న నాలుగు ప్లాట్లకు వేలం నిర్వహించారు. 1970లో ముంబయికి వచ్చే వరకు అండర్ వరల్డ్ డాన్ ఇక్కడే ఉన్నాడు. ఆ తర్వాత నేర ప్రపంచంలో అడుగుపెట్టి డాన్‌గా ఎదిగాడు. ముంబెకేలోని దావూద్‌కు సంబంధించి…
పాకిస్థాన్‍తో ప్రస్తుతం జరుగుతున్న టెస్టు సిరీస్‍లో 2-0తో ఆధిక్యంలో ఉన్న ఆస్ట్రేలియా తాజా టెస్టు ర్యాంకింగ్స్ లో అగ్రస్థానానికి చేరింది. కేప్‍టౌన్ వేదికగా జరిగిన రెండో టెస్టులో దక్షిణాఫ్రికాపై విజయం సాధించిన భారత్.. రెండో స్థానంలో ఉంది. దక్షిణాఫ్రికాతో టెస్టు సిరీస్‍ను భారత్ సమం చేయగా, పాకిస్థాన్‌పై ఆసీస్ 2-0తో ఆధిక్యంలో నిలిచింది. దీంతో ఐసీసీ ర్యాంకింగ్స్‌లో ఆసీస్ టాప్ ర్యాంక్ సాధించింది. 118 రేటింగ్ పాయింట్లతో ఐసీసీ టెస్టు ర్యాంకింగ్‍ల్లో ఆస్ట్రేలియా అగ్రస్థానానికి చేరింది. 117 పాయింట్లు ఉన్న భారత్ రెండో స్థానానికి పడిపోయింది. ఇంగ్లండ్ 115 పాయింట్లతో మూడో ప్లేస్‍లో ఉండగా.. దక్షిణాఫ్రికా (106), న్యూజిలాండ్ (95) వరుసగా నాలుగు, ఐదో స్థానాల్లో ఉన్నాయి. ఆ తర్వాత పాకిస్థాన్ (92), శ్రీలంక (79), వెస్టిండీస్ (77), బంగ్లాదేశ్ (51), జింబాబ్వే (32), అఫ్గానిస్థాన్ (10) వరుసగా ఉన్నాయి. మరోవైపు, వరల్డ్ టెస్టు చాంపియన్ 2023-25 సైకిల్‍లో భారత్ ప్రస్తుతం…
రేషన్ పంపిణీ కుంభకోణంలో దర్యాప్తు కోసం పశ్చిమ బెంగాల్‌లోని ఉత్తర 24 పరగణాల జిల్లాకు చెందిన సందేశ్‌ఖలి ప్రాంతానికి వెళ్లిన ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఇడి) అధికారులపై శుక్రవారం ఉదయం విచక్షనారహితంగా దాడి జరిగింది. తృణమూల్ కాంగ్రెస్ నాయకుడు, ఇదే కేసులో అరెస్టయిన రాష్ట్ర మంత్రికి సన్నిహితుడైన షాజహాన్ షేక్‌ను ప్రశ్నించేందుకు ఆయన ఇంటికి వెళ్లిన ఇడి అధికారులపై షాజహాన్ మద్దతుదారులు దాడి చేశారు. అధికారులను విచక్షణారహితంగా కొట్టడంతో వారు ప్రాణాలు అరచేతిలో పట్టుకుని పరుగలు తీశారు. అధికారులకు రక్షణగా వచ్చిన సిఆర్‌పిఎఫ్ బలగాలకు చెందిన వాహనాలను కూడా ఆందోళనకారులు ధ్వంసం చేశారు. తమకన్నా పెద్ద సంఖ్యలో ఆందోళనకారులు ఉండడంతో సిఆర్‌పిఎఫ్ సిబ్బంది సైతం నిస్సహాయంగా ఉండిపోవలసి వచ్చింది. పశ్చిమ బెంగాల్‌లో రేషన్ పంపిణీ కుంభకోణంపై ఇడి దర్యాప్తు చేస్తోంది. ప్రజా పంపిణీ వ్యవస్థ కింద అబ్ధిదారులకు అందచేసే రేషన్‌లో 30 శాతం బహిరంగ మార్కెట్‌కు మళ్లించారని, దాని ద్వారా వచ్చిన సొమ్మును రేషన్…
సుప్రీంకోర్టులో భారతీ సిమెంట్స్‌కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. జగన్ అక్రమాస్తుల కేసు దర్యాప్తులో భాగంగా ఈడీ జప్తు చేసిన భారతీ సిమెంట్స్ ఎఫ్‌డీలను విడుదల చేయాలంటూ గతంలో తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పును సర్వోన్నత న్యాయస్థానం తప్పుపట్టింది. భారతీ సిమెంట్స్‌కు చెందిన రూ.150 కోట్ల ఎఫ్‌డీ మొత్తాన్ని విడుదల చేయాలని గతంలో ఈడీని తెలంగాణ హైకోర్టు ఆదేశించింది. భారతీ సిమెంట్స్ ఎఫ్‌డీల స్థానంలో బ్యాంకు గ్యారంటీలు తీసుకొని, ఎఫ్‌డీలను విడుదల చేయాలని హైకోర్టు తీర్పు చెప్పింది. అయితే హైకోర్టు తీర్పును ఈడీ సుప్రీంకోర్టులో సవాల్ చేసింది. ఈ పిటిషన్‌పై విచారణ సందర్భంగా జస్టిస్ అభయ్ ఎస్ ఓఖా నేతృత్వంలోని ధర్మాసనం ఈడీ వాదనలతో ఏకీభవించింది. గతంలో ఇచ్చిన తీర్పును పునఃపరిశీలించాలని తెలంగాణ హైకోర్టుకు సూచించింది. బ్యాంకు గ్యారంటీలు తీసుకున్న తర్వాత కూడా ఈడీ భారతీ సిమెంట్స్ ఎఫ్‌డీలను జప్తు చేసిందని ప్రతివాదుల తరఫు న్యాయవాది ముకుల్ రోహత్గీ కోర్టు దృష్టికి తెచ్చారు. కాగా,…