మరికొన్ని నెలల్లో ఏపీ అసెంబ్లీకి జరగనున్న తరుణంలో అధికార వైఎస్సాఆర్ కాంగ్రెస్ పార్టీకి షాక్‌ల మీద షాక్‌లు తగులుతున్నాయి. ఇప్పటికే నలుగురు ఎమ్మెల్యేలు పార్టీకి రాజీనామా చేయగా ఇటీవల ఎమ్మెల్సీ వంశీకృష్ణ వైసీపీని జనసేన పార్టీలో చేరారు. తాజాగా పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి దాడి వీభద్రరావు వైసీపీకి రాజీనామా చేస్తున్నట్లు సీఎం జగన్‌కు లేఖ రాశారు. తన అనుచరులతో కలిసి పార్టీ వీడుతున్నట్లు ఏకవాక్యంతో రాజీనామా లేఖను సీఎంకు పంపారు. కొంత కాలంగా ఆయన వైసీపీపై తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు తెలిసింది. మంత్రి గుడివాడ అమర్నాథ్‌తో ఉన్న వైరుధ్యాలు, వైసీపీ అధిష్టానం పట్టించుకోకపోవడం లాంటి కారణాలతో ఆయన పార్టీ మార్పుపై వార్తలు వచ్చాయి. దాడి వీరభద్రరావు తెలుగుదేశం పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి పార్టీలో వివిధ హోదాల్లో పని చేసి 1985లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అనకాపల్లి నియోజకవర్గం నుండి తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు. ఆ తర్వాత 1989,…
Author: Editor's Desk, Tattva News
కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్‌కు సీబీఐ మరోసారి నోటీసులు జారీ చేయడం రాజకీయంగా కలకలం రేపుతోంది. కేరళకు చెందిన జై హింద్ టీవీ ఛానల్‌లో పెట్టుబడులకు సంబంధించిన వివరాలు ఇవ్వాలంటూ డీకే శివకుమార్, ఆయన భార్య ఉషతోపాటు మరో 30 మందికి సీబీఐ అధికారులు నోటీసులు జారీ చేశారు. ఈ కేసు విచారణలో భాగంగా ఈ నెల 11 వ తేదీన ఢిల్లీలోని సీబీఐ కార్యాలయంలో విచారణకు హాజరు కావాలని ఆ నోటీసుల్లో సీబీఐ అధికారులు పేర్కొన్నారు. జై హింద్ ఛానల్‌లో పెట్టుబడులు, అందులో డీకే శివకుమార్‌కు ఉన్న వాటాకు సంబంధించిన వివరాలు తెలియజేయాలని ఆ నోటీసుల్లో అధికారులు కోరారు. ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నారన్న ఆరోపణలు, ఢిల్లీలోని డీకే శివకుమార్ ఫ్లాట్‌లలో రూ.8 కోట్లకు పైగా నగదు దొరికిన వ్యవహారంలో కర్ణాటక డిప్యూటీ సీఎంపై ఇప్పటికే సీబీఐ, ఈడీ అధికారులు కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. …
బంగ్లాదేశ్‌కు చెందిన నోబెల్ అవార్డు గ్రహీత, ప్రముఖ ఆర్థికవేత్త డాక్టర్ మొహమ్మద్ యూనుస్‌కు కార్మిక చట్టాలను ఉల్లంఘించారన్న ఆరోపణపై దిగువ కోర్టు ఆరు నెలల జైలు శిక్ష విధిస్తూ సోమవారం తీర్పు వెలువరించింది. అయితే ఇది రాజకీయ దురుద్దేశంతో చేసిన చర్యగా ఆయన మద్దతుదారులు అభివర్ణిస్తున్నారు. కార్మిక చట్టాలను 83 ఏళ్ల యూనుస్ ఉల్లంఘించారన్న ఆరోపణలు నిరూపితమయ్యాయని, ఆరు నెలల సాధారణ లేదా కఠిన కారాగార శిక్ష అనుభవించాలని కార్మిక న్యాయస్థానం జడ్జి షేక్ మెరీనా సుల్తానా ప్రకటించారు. గ్రామీణ్ టెలికం చైర్మన్‌గా వ్యవహరిస్తున్న యూనుస్‌తోపాటు మరో ముగ్గురు అధికారులకు న్యాయస్థానం ఆరు నెలల కారాగార శిక్షతోపాటు 25 వేల టాకాల (బంగ్లాదేశ్ కరెన్సీ) చొప్పున జరిమానా విధించింది. తీర్పు వెలువడిన సమయంలో కోర్టులోనే ఉన్న యూనుస్, మరో ముగ్గురు అధికారులు వెంటనే బెయిల్‌కు దరఖాస్తు చేశారు. నెల రోజుల బెయిల్ ఇచ్చిన న్యాయమూర్తి హైకోర్టులో అప్పీలు చేసుకోవడానికి అనుమతించింది. గ్రామీణ్…
శంషాబాద్ విమానాశ్రయానికి వెళ్లే మెట్రో దూరం తగ్గిస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. ఎంజీబీఎస్ నుంచి పాతబస్తీ మీదుగా ఎయిర్ పోర్టుకు మెట్రో మార్గం ఏర్పాటు చేయనున్నట్లు సీఎం తెలిపారు. మెట్రో, ఫార్మా సిటీని రద్దు చేయట్లేదని ప్రకటించారు. ప్రజా ప్రయోజనాల దృష్ట్యా స్ట్రీమ్ లైన్ చేస్తున్నామని వెల్లడించారు. నాగోల్ నుంచి ఎల్బీ నగర్, చాంద్రాయణ గుట్ట వద్ద విమానాశ్రయానికి వెళ్లే మెట్రో లైన్‌కు లింక్ చేయనున్నట్లు తెలిపారు. అవసరమైతే మియాపూర్ నుంచి రామచంద్రాపురం, మైండ్ స్పేస్ వరకు ఉన్న మెట్రోను ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ వరకు పొడిగిస్తామని చెప్పారు. కొత్త మెట్రో కారిడార్లు గత ప్రభుత్వం ప్రతిపాదించిన ఖర్చుతో పోలిస్తే తక్కువ కాగలవని స్పష్టం చేశారు. ఫార్మాసిటీ, రింగ్ రోడ్డు, రీజినల్ రింగ్ రోడ్డు పర్యావరణహిత ప్రత్యేక క్లస్టర్లను ఏర్పాటు చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. ఈ క్లస్టర్లలో పనిచేసే వారికి ఇళ్ల నిర్మాణం చేపడతామని, యువతకు స్కిల్ పెంచేందుకు…
వరల్డ్ మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్, జైషే మహ్మద్ చీఫ్, పుల్వామా దాడి మాస్టర్ మైండ్ మసూద్ అజహర్ దారుణ హత్యకు గురయ్యారు. మృతి చెందినట్లు సమాచారం అందుతోంది. తెల్లవారుజామున 5 గంటలకు గుర్తుతెలియని వ్యక్తులు జరిపిన బాంబు పేలుడులో చనిపోయినట్లు వార్తలు వస్తున్నాయి. అయితే ఈ విషయాన్ని పాకిస్థాన్ ఇంకా ధృవీకరించలేదు. సోమవారం ఉదయం భవల్‌పూర్ మసీదు నుంచి తిరిగి వెళ్తున్న క్రమంలో గుర్తు తెలియని వ్యక్తులు అతనిపై బాంబు విసిరినట్లు కథనాలు వెలువడుతున్నాయి. పాకిస్థాన్‌లో గత కొన్ని నెలలుగా గుర్తుతెలియని వ్యక్తుల చేతుల్లో ఉగ్రవాదులు హతమవుతున్న ఘటనలు చోటుచేసుకొంటున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తాజాగా వైరల్ అవుతున్న మసూద్ మృతి వార్తకు ప్రాధాన్యం సంతరించుకొన్నది. దాడికి సంబంధించిన వీడియో కూడా సోషల్ మీడియాలో షేర్ చేశారు. అందులో మార్కెట్‌లో పేలుడు జరుగుతున్నట్లు కనిపిస్తోంది. పేలుడు అనంతరం తొక్కిసలాట జరిగింది. ప్రాణాలు కాపాడుకునేందుకు జనం పరుగులు తీస్తున్నారు. పేలుడు జరిగినప్పుడు…
గ్యాంగ్‌స్టర్ గోల్డీ బ్రార్‌ను కేంద్ర హోంశాఖ సోమవారం ఉగ్రవాదిగా ప్రకటించింది. ఈ ఉగ్రవాది ప్రస్తుతం కెనడాలో తలదాచుకుంటున్నాడు. పంజాబ్‌లో దోపిడీలు, సరిహద్దుల నుంచి అక్రమంగా ఆయుధాలు, డ్రగ్స్ స్మగ్లింగ్‌కు పాల్పడ్డాడు. గోల్డీ బ్రార్ పేరుమోసిన గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్ సహచరుడు. పంజాబ్‌కు చెందిన ప్రముఖ సింగర్ సిద్ధూ మూసేవాలా హత్య తర్వాత గోల్డీ బ్రార్ కెనడాకు మకాం మార్చాడు. అతనిపై హత్య, హత్యాయత్నం, ఆయుధాల స్మగ్లింగ్ సహా దాదాపు 13 కేసులు నమోదయ్యాయి. అతనిపై ఇంటర్‌పోల్ రెడ్ కార్నర్ నోటీసు సైతం జారీ చేసింది. సెప్టెంబర్ నెలలో గోల్డీ బ్రార్ పోలీసులపై సైతం దాడికి పాల్పడ్డాడు. ఇంతకు ముందు కేంద్ర హోంమంత్రిత్వ శాఖ లఖ్‌బీర్ సింగ్ లాండాను ఉగ్రవాదిగా ప్రకటించిన విషయం తెలిసిందే. పంజాబ్‌లో జరిగిన ఆర్పీజీ దాడికి లాండా ప్రధాన సూత్రధారి. గతంలో లాండాపై ఎన్‌ఐఏ రూ.15 లక్షల రివార్డును ప్రకటించింది. లఖ్‌బీర్ స్వస్థలం పంజాబ్‌లోని తరన్ తరణ్ జిల్లా…
వైఎస్సార్‌టీపీ అధినేత్రి వైఎస్ షర్మిల కుమారుడు రాజారెడ్డి ప్రేమ వివాహం చేసుకోబోతున్నారే వార్త గత కొంత కాలంగా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నది. అమెరికాలో పుట్టి పెరిగిన తెలుగు అమ్మాయి అట్లూరి ప్రియను ఆయన పెళ్లి చేసుకోబోతున్నారంటూ కొన్ని వార్త పత్రకలు, మీడియా ఛానెళ్లు కూడా కథనాలు ప్రసారం చేశాయి. ప్రియకు షర్మిల తల్లి విజయమ్మ చీర పెట్టిన ఫొటో కూడా నెట్టింట్లో వైరల్ అయింది. అయితే అధికారికంగా రాజారెడ్డి ప్రేమ వివాహం గురించి షర్మిల, అనిల్ దంపతులు నోరు మెుదపలేదు. తాజాగా.. వారి పెళ్లి విషయమై వైఎస్ షర్మిల న్యూ ఇయర్ రోజున శుభవార్త చెప్పారు. ఈనెల 18 రాజారెడ్డి, ప్రియల నిశ్చితార్థం ఉంటుందని ట్వీ్ట్ చేశారు. వచ్చే నెల 17న పెళ్లి ముహూర్తం ఖరారు చేసినట్లు చెప్పారు. ‘అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఈ 2024 నూతన సంవత్సరంలో నా కుమారుడు వైఎస్ రాజారెడ్డికి, ప్రియమైన అట్లూరి ప్రియాతో…
జపాన్‌లో కొత్త ఏడాది మొదటి రోజున భారీ భూకంపం సంభవించింది. ఉత్తర మధ్య జపాన్‌లో రిక్టర్ స్కేల్2పై సోమవారం 7.6 తీవ్రతతో భూకంపం చోటుచేసుకున్నట్టు ఆ దేశ అధికారిక మీడియా ఎన్‌హెచ్‌కే వెల్లడించింది. భూకంపంతో పశ్చిమ తీరానికి జపాన్ వాతావరణ విభాగం సునామీ హెచ్చరికలు జారీచేసింది. జపాన్ వాతావరణ సంస్థ పశ్చిమ తీర ప్రాంతాలైన ఇషికావా, నీగాటా, టొయామా ప్రిఫెక్చర్లకు సునామీ ముప్పు ఉందని హెచ్చరించింది. ఇషికావా ప్రిఫెక్చర్‌లోని నోటోలో సముద్రపు అలలు 5 మీటర్ల ఎత్తుకు చేరుకుంటాయని వాతావరణ అధికారులు అంచనా వేస్తున్నారు. ఇషికావా ప్రిఫెక్చర్‌లోని వాజిమా నగరం తీరంపై సునామీ ప్రభావం ఇప్పటికే మొదలైందని, అలలు ఒక మీటరుకుపైగా ఎగిసిపడుతున్నాయని ఎన్‌హెచ్‌కే నివేదించింది. భూకంపం తర్వాత హోకురికు అణు విద్యుత్ కేంద్రంలో భద్రత, సమగ్రతను నిర్ధారించడానికి అధికారులు తనిఖీలను నిర్వహిస్తోంది. కాగా, 2011 మార్చిలో సంభవించిన భూకంపం కారణంగా పుకిషిమా దైచీలోని అణు విద్యుత్ కేంద్రంలో ప్రమాదం సంభవించింది.…
కేంద్ర ప్రభుత్వం 16వ ప్రణాళికా సంఘం చైర్మన్‌గా అరవింద్ పనగరియాను నియమించింది. పనగారియా గతంలో నీతి ఆయోగ్ వైస్ చైర్మన్‌గా సేవలందించారు. ఇక ఆర్థిక మంత్రిత్వశాఖలో సంయుక్త కార్యదర్శిగా ఉన్న రిత్విక్ రంజనమ్‌ను సంఘం కార్యదర్శిగా నియమిస్తున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. కమిషన్‌లోని ఇతర సభ్యుల పేర్లను ప్రభుత్వం త్వరలో ప్రకటించనుంది. ప్రధాని నరేంద్ర మోదీ ఆధ్వర్యంలోని కేంద్ర కేబినెట్ గత నెలలో 16వ ప్రణాళికా సంఘం నిబంధనలకు ఆమోదం తెలిపింది. ఈ సంఘం ఐదేళ్ల కాలానికి (2023-27 నుంచి 2030-31) గాను నివేదికను రూపొందిస్తుంది. ఈ నివేదికను 2025 అక్టోబర్ నాటికి రాష్ట్రపతికి సమర్పిస్తుంది. కమిషన్ సభ్యుల పదవీకాలం 2025 అక్టోబర్ 31 వరకు, అంటే నివేదిక సమర్పించే తేదీ వరకు ఉంటుంది. కేంద్ర, రాష్ట్రాల మధ్య పన్నుల పంపిణీ, రెవెన్యూ గ్రాంట్లతో పాటు 16వ ఆర్థిక సంఘం విపత్తు నిర్వహణ చర్యలపై తన సిఫారసులను చేస్తుంది. అంతేకాకుండా విపత్తు నిర్వహణ…
నూతన సంవత్సర వేడుకల సందర్భంగా గుంటూరులో మందుబాబులు వీరంగం సృష్టించారు. విద్యా నగర్ రింగు రోడ్డుకు సమీపంలో ఉన్న మంత్రి విడదల రజిని ఏర్పాటు చేసిన వైసీపీ కార్యాలయంపై రాళ్లు రువ్వారు. దీంతో కార్యాలయ అద్దాలు ధ్వంసమయ్యాయి. ఇటీవలే గుంటూరు పశ్చిమ నియోజకవర్గ వైసిపి ఇంఛార్జిగా రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి విడదల రజిని ని నియమించారు. జనవరి 1న పార్టీ కార్యాలయం ప్రారంభోత్సవానికి ఏర్పాట్లు చేసుకున్నారు. అయితే అర్ధరాత్రి కొంత మంది దుండగులు కార్యాలయంపై దాడికి పాల్పడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు లాఠీఛార్జ్ చేసి గుంపును చెదరగొట్టారు. కొంత మందిని అదుపులోకి తీసుకున్నారు. కార్యాలయం వద్ద బందోబస్తు ఏర్పాటు చేశారు. పెద్ద సంఖ్యలో ఉన్న టీడీపీ-జనసేన అభిమానులు, కార్యకర్తల్ని అదుపు చేయడానికి పోలీసులు తీవ్రంగా శ్రమించారు. దాదాపు గంటన్నర పాటు రోడ్డుపై యువకులు వీరంగం సృష్టించారు. విద్యానగర్‌లో మంత్రి విడదల రజిని కార్యాలయంపై ఆదివారం రాత్రి దాడి జరిగింది. నూతన సంవత్సరం…