Author: Editor's Desk, Tattva News

ఉపాధ్యాయ దినోత్సవం వేళ రాష్ట్రంలోని ప్రభుత్వ విద్యాసంస్థలకు ఉచిత విద్యుత్‌ని సరఫరా చేయనున్నట్లు తెలంగాణ ప్రభుత్వం  ప్రకటించింది. ఈ మేరకు గురువారం విద్యుత్‌ శాఖ ఉత్తర్వులను జారీ చేసింది. రాష్ట్రంలో 27, 862 విద్యాలయాలకు  ఉచితంగా విద్యుత్తును అందిస్తున్నట్లు ఉప ముఖ్యమంత్రి  విద్యుత్ శాఖ మంత్రి భట్టి విక్రమార్క తెలిపారు.  ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా రవీంద్ర భారతిలో జరిగిన గురుపూజోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన విద్యా సంస్థలకు ఉచితంగా ఇచ్చే విద్యుత్తును రాష్ట్ర ప్రభుత్వమే విద్యుత్ శాఖకు చెల్లిస్తుందని తెలిపారు. ఉచిత విద్యుత్ పై కొద్దిరోజుల కిందట ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాలు ఇచ్చిన సంగతి తెలిసిందే. తెలంగాణలో భవిష్యత్తు అవసరాలను దృష్టిలో ఉంచుకొని నాణ్యమైన విద్యుత్ అందుబాటులో ఉండేలా కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఉపముఖ్యమంత్రి భట్టితో కలిసి సమీక్షించిన ఆయన రాష్ట్రంలో విద్యుత్ రంగం, ప్రజల అవసరాలకు అనుగుణంగా తీసుకోవలసిన చర్యలపై…

Read More

ఢిల్లీ మద్యం విధానంలో మనీ ల్యాండరింగ్ వ్యవహారంలో  ముఖ్యమంత్రి  అరవింద్ కేజ్రీవాల్ బెయిల్ పిటిషన్‌తోపాటు తన అరెస్ట్‌ను సవాల్ చేస్తూ దాఖలు చేసిన పిటిషన్లపై సుప్రీంకోర్టు గురువారం విచారణ జరిపింది. అందుకు సంబంధించిన తీర్పును సుప్రీంకోర్టు రిజర్వ్ చేసింది. ఢిల్లీ సీఎం కేజీవాల్‌ దాఖలు చేసిన పిటిషన్లపై గురువారం జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ ఉజ్జల్ భూయన్‌తో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం విచారించింది.  అనంతరం ఈ కేసులో తీర్పును మంగళవారానికి సుప్రీంకోర్టు ధర్మాసనం రిజర్వ్ చేసింది.  ఇప్పటికే ఈ కేసులో జైలుకు వెళ్లిన ఒక్కొక్కరు విడుదల అవుతున్న నేపథ్యంలో కేజ్రీవాల్ బెయిల్‌పై సుప్రీంకోర్టు ఏం తీర్పు వెలువరించనుందో అని అందరిలో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ఇప్పటికే ఈ కేసులో అరెస్ట్ అయి జైలుకు వెళ్లిన ఢిల్లీ మాజీ ఉపముఖ్యమంత్రి మనీష్ సిసోడియా, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత, ఆప్ మీడియా ఇంఛార్జ్ విజయ్ నాయర్ సహా పలువురు బెయిల్‌పై బయటికి వచ్చారు. ఢిల్లీ…

Read More

టీడీపీ మహిళా కార్యకర్తతో అసభ్యంగా ప్రవర్తించిన సత్యవేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలంను  హైకమాండ్‌ పార్టీ నుంచి సస్పెండ్ చేసింది. ఈ మేరకు టీడీపీ హైకమాండ్ ప్రకటన విడుదల చేసింది. ‘ఈ రోజు వివిధ మాద్యమాలలో కోనేటి ఆదిమూలం (సత్యవేడు నియోజకవర్గ ఎమ్మెల్యే) ఒక మహిళను లైంగికంగా వేధించారని వస్తున్న ఆరోపణలను తెలుగుదేశం పార్టీ తీవ్రంగా పరిగణిస్తూ పార్టీ నుంచి సస్పెండ్ చేయడం జరిగింది’ అని టీడీపీ ప్రధాన కార్యాలయం నుంచి ప్రకటన విడుదలయ్యింది.  కాగా.. సస్పెన్షన్ తరువాత వివరణ తీసుకోవాలని హైకమాండ్ నిర్ణయించింది. ఆరోపణలు తీవ్రత దృష్ట్యా ముందు సస్పెండ్ చేసి తరువాత వివరణ తీసుకోవాలని హైకమాండ్ నిర్ణయం తీసుకోవడం జరిగింది. సత్యవేడు టీడీపీ ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలంపై.. పార్టీకి చెందిన మహిళ కార్యకర్త లైంగిక వేధింపులు ఆరోపణలు చేసింది. కొన్ని ప్రైవేటు వీడియోలను సైతం బాధితురాలు రిలీజ్ చేసింది.  గురువారం నాడు హైదరాబాద్‌లోని సోమాజీగూడ ప్రెస్‌క్లబ్‌లో మీడియాకు బాధితురాలు, తన…

Read More

వైఎస్సార్సీపీ నాయకుడు, బాపట్ల మాజీ ఎంపీ నందిగం సురేష్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. గుంటూరు జిల్లా మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడి కేసులో ఆయనపై కేసు నమోదైన విషయం తెలిసిందే. ఈ కేసులో ముందస్తు బెయిల్‌ మంజూరు చేయాలని నందిగం సురేష్ దాఖలు చేసిన పిటిషన్‌ను హైకోర్టు కొట్టేసింది. దీంతో ఆయణ్ని అరెస్ట్ చేసేందుకు బుధవారం ఉద్దండరాయునిపాలెంలోని వారి ఇంటికి తుళ్లూరు పోలీసులు వెళ్లారు. అయితే అరెస్ట్ భయంతో సురేశ్ అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. తన సెల్‌ఫోన్‌ స్విచాఫ్‌ చేశారు. దాదాపు 15 నిమిషాలు అక్కడే వేచి చూసి పోలీసులు వెనుదిరిగారు. ఈ క్రమంలోనే సెల్‌ఫోన్‌ సిగ్నల్స్‌ ఆధారంగా బుధవారం ఉదయం నుంచి ఆయన ఎక్కడున్నారో పోలీసులు విచారణ చేపట్టారు. హైదరాబాద్‌ నుంచి పారిపోయేందుకు సురేష్‌ ప్రయత్నిస్తున్నారనే పక్కా సమాచారం పోలీసులకు అందింది. దీంతో హైదరాబాద్‌ వెళ్లిన ప్రత్యేక బలగాలు సురేష్​ను అరెస్ట్ చేసి మంగళగిరికి తరలించారు. మరోవైపు ఈ కేసులో…

Read More

మావోయిస్టు పార్టీ తొలి తరం నేత.. పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడిగా వివిధ హోదాల్లో పని చేసిన ఓరుగల్లు విప్లవ వీరుడు మాచర్ల ఏసోబు(70) పోలీసు కాల్పుల్లో మృతి చెందారు. చత్తీస్ గడ్ రాష్ట్ర ప్రజలకు జగన్ గా, రణదేవ్ దాదా సుపరిచితుడైన ఆయన మంగళవారం దంతెవాడ, బీజాపూర్ అటవీ ప్రాంతంలో పోలీసులు, మావోయిస్టులకు మధ్య జరిగిన ఎదురు కాల్పుల్లో ప్రాణాలు కోల్పోయారు.  ఆయన స్వగ్రామం ఉమ్మడి వరంగల్ లోని హనుమకొండ జిల్లా కాజీపేట మండలం టేకులగూడెంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.  స్థానికంగా 8వ తరగతి వరకు చదివిన ఆయన.. 1974లో మావోయిస్టు పార్టీలో చేరాడు. 1978లో రైతు కూలి సంఘం అధ్యక్షుడిగా ఎన్నికై.. రైతు కూలి ఉద్యమాన్ని ముందుండి నడిపించాడు. ఆ తరువాత 1985లో అజ్ఞాతంలోకి వెళ్లిన ఆయన  వివిధ స్థాయిల్లో పని చేశాడు. కేంద్ర కమిటీ సభ్యుడిగా ఆయనకు అవకాశం కల్పించి, పార్టీ మాజీ సెక్రటరీ గణపతికి స్పెషల్…

Read More

అమెరికాలోని టెక్సాస్‌ రాష్ట్రంలో శుక్రవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో మరణించిన నలుగురిని భారతీయులుగా పోలీసులు గుర్తించారు. డల్లాస్‌ సమీపంలో ఓ హైవేపై ఆగి ఉన్న ఎస్‌యూవీని వెనుక నుంచి వేగంగా వచ్చిన ట్రక్కు ఢీకొట్టింది. దీంతో కారు పూర్తిగా మంటల్లో దగ్ధమైపోయింది.  ఘటన జరిగినప్పుడు కారులో ఉన్న నలుగురు మరణించారు. వీరి మృతదేహాలు గుర్తుపట్టలేనంతగా కాలిపోయాయి. దీంతో డీఎన్‌ఏ, ఇతర ఆధారాల ద్వారా నాలుగు రోజులకు పోలీసులు మృతులను గుర్తించారు. హైదరాబాద్‌కు చెందిన ఆర్యన్‌ రఘునాథ్‌ ఒరంపట్టి, ఫరూఖ్‌ షేక్‌, లోకేశ్‌ పలచర్ల, తమిళనాడుకు చెందిన దర్శిని వాసుదేవ్‌ ఈ ప్రమాదంలో మరణించినట్టు కొల్లిన్‌ కౌంటీ షెరిఫ్‌ కార్యాలయం ధ్రువీకరించింది.  ఆర్యన్‌, ఫరూఖ్‌ ఇటీవలే టెక్సాస్‌ యూనివర్సిటీలో ఎంఎస్‌ పూర్తి చేసుకున్నారు. లోకేశ్‌ చదువు పూర్తి చేసుకొని ఉద్యోగం చేస్తున్నాడు. కార్‌పూలింగ్‌ యాప్‌ ద్వారా వీరు ప్రమాదం జరిగిన కారు ఎక్కినట్టు తెలుస్తున్నది.  అమెరికాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు తెలంగాణ…

Read More

విజయవాడ వరద బాధితులను ఆదుకోవడంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఘోరంగా విఫలమయ్యారని వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్ రెడ్డి ఆరోపించారు. బుధవారం విజయవాడలో ముంపునకు గురైన ప్రాంతాల్లో పర్యటించి బాధితులను పరామర్శించారు. ముందస్తు చర్యలు తీసుకుని నష్టం జరుగకుండా అడ్డుకున్నామని పేర్కొన్నారు. వాలంటరీ వ్యవస్థ ఉంటే ముందే అప్రమత్తమై తగిన చర్యలు తీసుకొనేవారని తెలిపారు. చంద్రబాబు నివాసముంటున్న ప్రాంతం కూడా నీళ్లలో మునిగినందును అక్కడ ఉండలేని స్థితిలో కలెక్టరేట్‌లో ఉండి బాధితులకు సహాయం చేస్తున్నట్లు బిల్డప్‌లు ఇస్తున్నారని ధ్వజమెత్తారు. వర్షాలు, వరదల సమాచారం ఉన్నాకూడా చంద్రబాబు ప్రజలను ఆదుకునే ప్రయత్నం చేయలేదని విమర్శించారు. ఎక్కడా రిలీఫ్‌ కేంద్రాలు కనిపించడం లేదని ఆరోపించారు. వైసీపీ హయాంలో గోదావరికి వరదలోస్తే పెద్ద ఎత్తున్న ఆదుకున్నామని గుర్తు చేశారు. ముందుగానే సుమారు 40 వేలమందిని సురక్షిత ప్రాంతాలకు తరలించామని చెప్పారు. కూటమి ప్రభుత్వం ప్రణాళికాబద్దంగా వ్యవహరించి ఉంటే విజయవాడ విపత్తుకు గురి…

Read More

ఎన్నికలకు ముందు ఒక పార్టీలో ఉన్న ఎమ్మెల్యేలు.. ఎన్నికలు పూర్తయిన తర్వాత మరో పార్టీలోకి వెళ్లడం మనం చూస్తూనే ఉన్నాం.  ఎమ్మెల్యేలు వెళ్లిపోయిన పార్టీలు వారిపై పార్టీ ఫిరాయింపుల కింద స్పీకర్‌కు ఫిర్యాదు చేయడం, ఆ తర్వాత కోర్టులకు ఎక్కడం జరుగుతూనే ఉంది. ఈ క్రమంలోనే పార్టీ ఫిరాయించి ఇతర పార్టీల్లోకి వెళ్లే ఎమ్మెల్యేలకు హిమాచల్ ప్రదేశ్‌లో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం షాక్ ఇచ్చింది. జంపింగ్ జపాంగ్ ఎమ్మెల్యేలకు పింఛను సదుపాయాన్ని తొలగిస్తూ తీసుకొచ్చిన కొత్త బిల్లుకు హిమాచల్‌ప్రదేశ్ అసెంబ్లీ ఆమోద ముద్ర వేసింది. ఈ చట్టం ప్రకారం పార్టీ మారి, అనర్హత వేటు పడిన ఎమ్మెల్యేలకు పెన్షన్‌ సదుపాయాన్ని ప్రభుత్వం నిలిపివేయనుంది. దీనికి సంబంధించిను సవరణ బిల్లును తాజాగా జరుగుతున్న హిమాచల్ ప్రదేశ్ శాసనసభ సమావేశాల సందర్భంగా బుధవారం ప్రవేశపెట్టగా సభ ఆమోదం తెలిపింది. ఫిరాయింపుల నిరోధక చట్టం ప్రకారం పార్టీ మారిన తర్వాత అనర్హత వేటు పడిన ఎమ్మెల్యేలకు…

Read More

మరోసారి బుడమేరు టెన్షన్ పెడుతోంది. విజయవాడను ముంచేసిన బుడమేరులో మరోసారి వదర ప్రవాహం పెరిగింది. మూడు చోట్ల గండ్లు పడినట్లు గుర్తించారు. ప్రభుత్వం అప్రమత్తం అయింది. ఒక చోట గండిని పూడ్చే ప్రక్రియ చివరి దశకు వచ్చింది. మిగిలిన రెండు గండ్లను యుద్దప్రాతిపదికన పూడ్చేలా ప్రయత్నాలు చేస్తున్నారు.  మంత్రులు లోకేష్, రామానాయుడు పర్యవేక్షిస్తున్నారు. ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. వర్షాలతో మరోసారి బుడమేరుకు వరద ప్రవాహం పెరిగింది. దీంతో బుడమేరుకు గండ్లు పడిన ప్రదేశంలో యుద్ధ ప్రాతిపదికన చర్యలకు అధికారులు ఉపక్రమించారు.  కొండపల్లి శాంతినగర్ వద్ద బుడమేరుకి మూడు చోట్ల గండ్లు పడ్డాయి. 200 మీటర్ల మేర గండ్లు పడడంతో కవులూరు, ఈలప్రోలు రాయనపాడు, సింగినగర్ మీద బుడమేరు విరుచుకుపడింది. వరద ఉధృతి తగ్గడంతోఇరిగేషన్ అధికారులు గండ్లను పూడుస్తున్నారు. మంత్రులు లోకేష్, రామానాయుడుకు సీఎం చంద్రబాబు బాధ్యతలు అప్పగించారు. బుడమేరుకు గండ్లు పూడ్చివేత కార్యక్రమాలను మంత్రి లోకేష్ పర్యవేక్షించాల్సించారు. అధికారులను…

Read More

వరద ప్రాంతంలో పర్యటించాలనుకున్నా కానీ, తన వల్ల సహాయ కార్యక్రమాలకు ఆటంకం కలగకూడదని భావించి పర్యటించలేదని ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తెలిపారు. తన పర్యటన సహాయ పడేలా ఉండాలే తప్ప అదనపు భారం కాకూడదని స్పష్టం చేశారు. తాను రాలేదని నిందలు వేయాలని అంటారు తప్ప మరొకటి కాదని పవన్‌ కల్యాణ్ స్పష్టం చేశారు. విపత్తు సమయంలో నిందల కంటే ప్రజాసేవకు ముందుకు రావాలని పవన్‌ హితవు చెప్పారు. గత ప్రభుత్వ వైఖరి వల్లే విజయవాడ నగరంలో వరద కష్టాలు వచ్చాయని విమర్శించారు. విపత్తు నిర్వహణ కమిషన్‌ కార్యాలయం నుంచి వరద ప్రభావిత ప్రాంతాల్లో పరిస్థితిని ఆయన పరిశీలించారు. బుడమేరును పూర్తి చేసుంటే ఈ పరిస్థితి వచ్చేది కాదని, చిన్న చిన్న నీటి పాజెక్టులను పూర్తి చేయలేదని మండిపడ్డారు. గత ప్రభుత్వాన్ని విమర్శించే సమయం కాదని బాధితులను రక్షించాలని స్పష్టం చేసారు. ప్రస్తుతం విజయవాడలో వరద తగ్గుతోందని, అన్ని శాఖలు సమన్వయంతో…

Read More