తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ‘మహాలక్ష్మి-మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం’ పథకానికి మహిళా ప్రయాణికుల నుంచి అనూహ్య స్పందన వస్తోంది. ఈ పథకం అమల్లోకి వచ్చిన 11 రోజుల్లోనే రికార్డుస్థాయిలో 3 కోట్ల మంది మహిళలు టీఎస్ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించడం గమనార్హం. ప్రతి రోజూ సగటున 30 లక్షల మంది మహిళలు రాకపోకలు సాగిస్తున్నారు. పురుషులతో కలుపుకుంటే మొత్తంగా ప్రతి రోజూ 51 లక్షల మందిని సురక్షితంగా సంస్థ గమ్యస్థానాలకు చేర్చుతోంది. ప్రయాణికుల్లో 62 శాతం మంది మహిళలే ఉంటున్నారు. మహిళల ఉచిత ప్రయాణ స్కీం ఫలితంగా సంస్థ ఆక్యూపెన్సీ రేషియో(ఓఆర్) గణనీయంగా పెరిగింది. గతంలో 69 శాతం ఓఆర్ ఉండగా, ప్రస్తుతం అది 88 శాతానికి పెరిగింది. డిసెంబర్ 16వ తేదిన 17 డిపోలు, 17వ తేదిన 20 డిపోలు, 18వ తేదిన 45 డిపోల్లో 100 శాతానికి పైగా ఓఆర్ నమోదయింది. గత మూడు రోజుల్లో…
Author: Editor's Desk, Tattva News
ఆంధ్ర ప్రదేశ్ లో తెలుగుదేశం- జనసేన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ సదుపాయం కల్పించాలని నిర్ణయించినట్లు టిడిపి అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వెల్లడించారు. నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్ర ముగింపు సందర్భంగా ‘యువగళం-నవశకం’ పేరుతో విజయనగరం జిల్లా నెల్లిమర్ల నియోజకవర్గం పోలిపల్లి ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మాట్లాడుతూ నిరుద్యోగులకు నెలకు రూ. 3 వేల చొప్పున నిరుద్యోగ భృతి ఇస్తామని వెల్లడించారు. 20 లక్షల మందికి ఉపాధి కల్పన బాధ్యత తీసుకుంటామని, అన్నదాత కార్యక్రమం ద్వారా ప్రతి రైతుకు ఆర్థిక సాయం చేస్తామని హామీ చెప్పారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తామని చెబుతూ వచ్చే ఎన్నికల్లో వైసీపీ ఓటమి ఖాయమని జోస్యం చెప్పారు. నారా లోకేష్ చేసిన పాదయాత్రకు జగన్ సర్కారు అనేక అడ్డంకులు సృష్టించిందని చంద్రబాబు మండిపడ్డారు. పోలీసులను అడ్డం పెట్టుకుని ఎన్నో ఇబ్బందులు పెట్టారని,…
ప్రముఖ తెలుగు కథా, నవలా రచయిత తల్లవజ్జుల పతంజలి శాస్త్రికి కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం లభించింది. 2023 ఏడాదికి సంబంధించి 24 భాషల సాహితీకారులను కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారాలకు ఎంపిక చేశామని అకాడమీ కార్యదర్శి శ్రీనివాస రావు బుధవారం ప్రకటించారు. తెలుగులో ‘రామేశ్వరం కాకులు.. మరికొన్ని కథలు’ రచనకు గాను తల్లవజ్జుల పతంజలి శాస్త్రికి ఈ అవార్డు అందిస్తున్నట్టు తెలిపారు. 1945లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోని పిఠాపురంలో జన్మించిన పతంజలి ఒంగోలులో విద్యనభ్యసించారు. పుణెలోని ప్రతిష్ఠాత్మక దక్కన్ కాలేజీ నుంచి పురావస్తు శాస్త్రంలో డాక్టరేట్ అందుకున్నారు. లెక్చరర్‌గా, ప్రిన్సిపాల్‌గా పనిచేసిన ఆయన పతంజలి శాస్త్రి కథలు, వడ్ల చిలుకలు, నలుపెరుపు లాంటి కథా సంపుటాలు వెలువరించారు. రాజమండ్రిలో పర్యావరణ సెంటర్‌ను నిర్వహించారు.
బ్రిటీష్ కాలం నాటి చట్టాల స్థానంలో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన మూడు నూతన క్రిమినల్ బిల్లులు లోక్‌సభ ఆమోదం పొందాయి. భారతీయ న్యాయ సంహిత, భారతీయ నాగరిక సురక్ష సంహిత, భారతీయ సాక్ష్య బిల్లులపై చర్చ, కేంద్రం సమాధానం అనంతరం మూడు బిల్లులకు దిగువసభ బుధవారం మూజువాణి ఓటుతో ఆమోదముద్ర వేసింది. నూతన బిల్లులపై లోక్‌సభలో జరిగిన చర్చకు సమాధానం ఇచ్చారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా. భారతీయతను, రాజ్యాంగ స్ఫూర్తిని ప్రతిబింబించేలా దేశ ప్రజల హితం కోరి నూతన క్రిమినల్ బిల్లులు తెచ్చినట్లు ఆయన ప్రకటించారు. బ్రిటిష్ కాలం నాటి చట్టాలను నూతన బిల్లులు భర్తీ చేస్తాయని ఆయన స్పష్టం చేశారు. ప్రజలకు న్యాయం చేసేందుకు నూతన చట్టాల్లో సాంకేతికతకు ప్రోత్సాహం ఇచ్చినట్లు కేంద్ర హోంమంత్రి చెప్పారు. మూక హత్యలను నేరంగా పరిగణించినట్లు చెప్పారు. బ్రిటిష్ చట్టాలు వారి రాజరిక పాలనను రక్షించుకునేందుకు తెస్తే.. తాము ప్రజలే కేంద్రంగా నూతన…
క్రీడా రంగంలో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా పరిగణించే జాతీయ క్రీడా అవార్డులను కేంద్రం ప్రకటించింది. సీనియర్ క్రికెటర్ మహ్మద్ షమీ, పారా ఆర్చర్ శీతల్ దేవి సహా మొత్తం 26 మంది ఆటగాళ్లను అర్జున అవార్డుకు ఎంపికయ్యారు. అలాగే స్టార్ బ్యాడ్మింటన్ జోడీ సాత్విక్‌సాయిరాజ్ రంకిరెడ్డి, చిరాగ్ శెట్టి మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్న అవార్డు సొంతం చేసుకున్నారు. కాగా ఈ ఏడాది మొత్తం 26 మంది ఆటగాళ్లను అర్జున అవార్డుతో సత్కరించాలని క్రీడా మంత్రిత్వ శాఖ నిర్ణయించింది. షమీతో పాటు అంధ క్రికెటర్ ఇల్లూరి అజయ్ కుమార్ రెడ్డికి కూడా అర్జున అవార్డు ఇవ్వనున్నారు. కబడ్డీ, అథ్లెటిక్స్, ఆర్చరీ, రెజ్లింగ్ సహా వివిధ క్రీడాంశాల్లో గెలుపొందిన ఆటగాళ్లు కూడా జాతీయ క్రీడా అవార్డులకు ఎంపికయ్యారు. వీరే కాకుండా వివిధ క్రీడలకు చెందిన 5 మంది కోచ్‌లను ద్రోణాచార్య అవార్డుకు ఎంపిక చేశారు. ముగ్గురు అనుభవజ్ఞులకు ధ్యాన్‌చంద్ లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్ అవార్డును…
తెలంగాణ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై రేవంత్ రెడ్డి ప్రభుత్వం బుధవారం రాష్ట్ర శాసనసభలో శ్వేతపత్రంను ప్రవేశపెట్టారు. ఉప ముఖ్యమంత్రి, ఆర్ధిక మంత్రి భట్టి విక్రమార్క శ్వేతపత్రంను సభ ముందు ఉంచుతూ బడ్జెట్ కు, వాస్తవ వ్యయానికి 20 శాతం అంతరం ఉందని తెలిపారు. 2014లో మిగులు రాష్ట్రంగా ఉన్న తెలంగాణ, 2023 నాటికి అప్పులలో కూరుకుపోయిందని విమర్శించారు. 2014-15 నాటికి రాష్ట్ర రుణం రూ. 72,658 కోట్లు కాగా ఈ తొమ్మిదిన్నర ఏళ్లలో మొత్తం అప్పులు రూ. 6,71,757 కోట్లకు చేరుకున్నాయి. 2014-15 నుంచి 2022-23 మధ్య కాలంలో అప్పు సగటున 24.5 శాతానికి పెరిగింది. 2023-24 అంచనాల ప్రకారం రాష్ట్ర రుణం రూ. 3,89,673 కోట్లుగా ఉంది. 2015-16లో రుణ, జీఎస్డీపీ దేశంలోనే అత్యల్పంగా 15.7 శాతం ఉండగా, అది 2023-24 నాటికి 27.8 శాతానికి పెరిగింది. బడ్జెటేతర రుణాలు పెరిగిపోవడం దీనికి ప్రధాన కారణం. రాష్ట్రం ఏర్పడిన తర్వాత…
అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కు కొలరాడో సుప్రీంకోర్టు భారీ షాకిచ్చింది. వచ్చే ఏడాది జరగనున్న అధ్యక్ష ఎన్నికల్లో కొలరాడో రాష్ట్రం నుంచి పోటీ చేయకుండా అనర్హత వేటు వేసింది. 2021 జనవరి 6న యూఎస్ క్యాపిటల్ పై ట్రంప్ మద్దతుదారుల దాడి నేపథ్యంలో ఆయనపై నిషేధం విధించింది. అమెరికా రాజ్యాంగంలోని నిబంధనల ప్రకారం దేశాధ్యక్ష పదవిని చేపట్టేందుకు ట్రంప్ అనర్హుడని కోర్టు ప్రకటించింది. ఇలాంటి తీర్పును ఇవ్వడం దేశ చరిత్రలోనే ఇదే తొలిసారి. అయితే ఈ తీర్పుపై అమెరికా సుప్రీంకోర్టులో అప్పీల్ చేసుకునే అవకాశాన్ని ట్రంప్ కు కొలరాడో సుప్రీంకోర్టు ఇచ్చింది. కొలరాడో కోర్టు తీర్పు ప్రభావం వచ్చే ఏడాది మార్చ్ 5న జరగనున్న కొలరాడో రిపబ్లికన్స్ ప్రైమరీ బ్యాలట్ పై మాత్రమే కాకుండా… నవంబర్ 5న జరిగే ఎన్నికలపై కూడా తీవ్రంగా ఉండబోతోంది. అధ్యక్ష ఎన్నికల్లో అక్రమాలు చోటు చేసుకున్నాయి.. డొనాల్డ్ ట్రంప్ ఓడిపోవడానికి ఎన్నికల కమిషన్…
భద్రతా ఉల్లంఘన ఘటన పార్లమెంటును కుదిపేస్తున్నది. ఘటనపై కేంద్ర హోం మంత్రి అమిత్‌షా ప్రకటన చేయాలని ఉభయసభల్లో ప్రతిపక్ష ఎంపీలు పట్టుబడుతున్నారు. అయితే ఆందోళన చేపడుతున్న విపక్ష ఎంపీలపై కేంద్ర ప్రభుత్వం సస్పెన్షన్ కొరడా ఝళిపిస్తున్నది. వరుసగా ఎంపీలను పార్లమెంట్ నుంచి సస్పెండ్ చేస్తున్నది. తాజాగా మంగళవారం లోక్‌సభ నుంచి మరో 49 మంది ఎంపీలను సస్పెండ్ చేసింది. దీంతో ఇప్పటివరకూ ఉభయసభల నుంచి సస్పెన్షన్‌కు గురైన ఎంపీల సంఖ్య 141కి చేరింది. ఈ నెల 14న 14 మంది ఎంపీలను (లోక్‌సభ 13, రాజ్యసభ 1) సస్పెండ్ చేయగా, సోమవారం ఒక్కరోజే 78 మందిపై (లోక్‌సభ-33, రాజ్యసభ-45) వేటు వేసిన సంగతి తెలిసిందే. ఒక్క లోక్‌సభలోనే 95 మంది ఎంపీలు సస్పెన్షన్‌కు గురయ్యారు. ఇండియా కూటమి లోక్‌సభ ఎంపీల్లో దాదాపు మూడింట రెండొంతుల మంది ఎంపీలపై వేటు పడింది. ఇండియా కూటమికి లోక్‌సభలో 138 మంది ఎంపీలు ఉండగా.. సస్పెన్షన్ల…
విపక్ష కూటమి ఇండియా తరఫున ప్రధానమంత్రి అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, సీనియర్ దళిత నేత అయిన మల్లిఖార్జున్ ఖర్గే మంగళవారం ఢిల్లీలో జరిగిన భేటీలో తెరపైకి రావడంతో రాజకీయంగా కలకలం చెలరేగింది. ఆయన పేరును పశ్చిమబెంగాల్ సీఎం, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమత బెనర్జీ, ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆప్ నేత అర్వింద్ కేజ్రీవాల్ ప్రతిపాదించడంతో కాంగ్రెస్ వర్గాలే అనిశ్చిత పరిస్థితికి లోనయ్యాయి. అయితే, ఆ ప్రతిపాదనపై ఖర్గే స్పందిస్తూ “ఇప్పుడు గెలవడం ముఖ్యం కానీ, పీఎం అభ్యర్థి ఎవరనేది ముఖ్యం కాదు’’ అని స్పష్టం చేశారని సమాచారం. “కూటమి సమావేశంలో చర్చలు మంచి వాతావరణంలో జరిగాయి. సీట్ల పంపకం, ప్రచార కార్యక్రమంపై చర్చ జరిగింది. మరో 20 రోజుల్లో దీనిపై కార్యాచరణ వెల్లడవుతుంది’’ అని ఆ సమావేశంలో పాల్గొన్నఆర్జేడీ ఎంపీ మనోజ్ ఝా వెల్లడించారు. ఈ సమావేశంలో రానున్న లోక్ సభ ఎన్నికల్లో అమలు చేయాల్సిన వ్యూహాలపై ప్రాథమికంగా చర్చించారు.…
వాయువ్య చైనాలోని గన్సు ప్రావిన్స్‌లో సోమవారం అర్ధరాత్రి 6.2 తీవ్రతతో సంభవించిన భూకంపం జనజీవితాలను అతలాకుతలం చేసింది. భూకంప ధాటికి రహదారులు, ఇళ్లు ధ్వంసయ్యాయి. దీంతో 127 మంది మరణించారు. 700 మందికిపైగా గాయపడ్డారు. చైనా భూకంప నెట్‌వర్క్‌ల కేంద్రం వెల్లడించిన ప్రకారం సోమవారం రాత్రి 11:59 గంటలకు భూకంపం సంభవించింది. లియుగౌ టౌన్‌షిప్‌కు సుమారు 8 కిలోమీటర్ల దూరంలో 10 కిలోమీటర్లు లోతున భూకంప కేంద్రం ఉన్నట్లు తెలిపింది. కంపన తీవ్రతకు 1,55,393 ఇళ్లు నేలమట్టమయ్యాయని, రహదారులు ధ్వంసమయ్యాయని తెలిపారు. భూ అంతర్భాగంలో 35 కిలోమీటర్ల లోతులో కదలికలు సంభవించాయని, గన్సు ప్రావిన్సులోని లాన్‌జ్హౌకు 102 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రం ఉన్నదని చైనీస్ మీడియా తెలిపింది. ఈ భారీ భూకంపంతో చైనా వణికిపోయింది. అర్ధరాత్రి భూకంపం రావడంతో ప్రజలు ఇండ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. భూకంప తీవ్రతకు పలు భవనాలు నేలమట్టమయ్యాయి. దీంతో భారీ నష్టం సంభవించింది.…