మహారాష్ట్రలో ప్రభుత్వాలు మారినా రైతుల వెతలు మాత్రం తీరటం లేదు. దేశానికి వెన్నెముకగా చెప్పుకునే మన రైతులు వ్యవసాయం గిట్టుబాటుకాక అప్పుల ఊబిలో కూరుకుపోయి ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. ఈ ఏడాది 10 నెలల్లో మహారాష్ట్రలో 2,366 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని ఆ రాష్ట్ర మంత్రి అనిల్ భాయిదాస్ పాటిల్ స్వయంగా అసెంబ్లీకి నివేదించారు. అత్యధికంగా అమరావతి రెవిన్యూ డివిజన్‌లో 951 మంది రైతులు మరణించారని చెప్పారు. కాంగ్రెస్ ఎమ్మెల్యే కునాల్ పాటిల్ అడిగిన ప్రశ్నకు మంత్రి ఈ మేరకు లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. ఈ ఏడాది జనవరి నుంచి అక్టోబర్ వరుకు ప్రభుత్వానికి అందిన నివేదికల ప్రకారం మహారాష్ట్రలో మొత్తం 2.366 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని తెలిపారు. వారిలో ఛత్రపతి శంభాజీనగర్ డివిజన్‌లో 877 మంది, నాగపూర్ డివిజన్‌లో 257 మంది, నాసిక్ డివిజన్‌లో 254 మంది, పుణే డివిజన్‌లో 27 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని, వారి…
Author: Editor's Desk, Tattva News
సింగపూర్ ప్రభుత్వం మళ్లీ మాస్క్‌ను తప్పనిసరి చేసింది. విమానాశ్రయాలకు వచ్చే ప్రయాణికులు మస్ట్‌గా మాస్క్‌ను ధరించాలనే నిబంధనను తీసుకొచ్చింది. అంతేకాదు ప్రయాణికుల టెంపరేచర్ చెక్ చేసేందుకు థర్మల్ స్కానర్‌లను కూడా పునరుద్ధరించింది. కరోనావైరస్‌కు సంబంధించిన కొత్త వేరియంట్ల కారణంగా శ్వాసకోశ సమస్యలు వేగంగా వ్యాప్తి చెందుతుండటంతో సింగపూర్ ప్రభుత్వం మళ్లీ ట్రావెల్ నిబంధనలను అమలు చేస్తున్నది. ఫ్లూ, న్యుమోనియా, ఇతర శ్వాసకోశ వ్యాధులను నియంత్రించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు సింగపూర్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. జనాభాలో రోగ నిరోధక శక్తి తగ్గడంతో పాటు క్రిస్మస్, కొత్త సంవత్సరం వేడుకల కారణంగా ఎక్కువ మంది ప్రయాణాలు చేస్తుంటారు. చాలామందిని కలుస్తుంటారు. ఈ కారణంగా వైరస్ వ్యాప్తి ఎక్కువయ్యే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేసింది. అందుకే ముందు జాగ్రత్త చర్యగా కొవిడ్ నిబంధనలను అమలు చేస్తున్నామని వివరించింది. సింగపూర్‌తో పాటు ఇండోనేసియా కూడా ముందు జాగ్రత్త చర్యలు చేపట్టింది. కొవిడ్-19 కేసులు పెరుగుతున్న…
యావత్ దేశాన్ని కుదిపేసిన పార్లమెంట్‌లో పొగబాంబు ఘటనలో సూత్రధారి ఓ `ట్యూషన్ టీచర్’ అని ఢిల్లీ పోలీసులు భావిస్తున్నారు. అతను ఇప్పటివరకు పట్టుబడలేదు. ఘటన జరిగిన వెంటనే రంగంలోకి దిగిన దర్యాప్తు సంస్థలు ఇప్పటికి ఐదుగురిని అదుపులోకి తీసుకున్నాయి. కానీ, దాడి వెనుక మాస్టర్‌మైండ్ లలిత్ ఝా మాత్రం ఇంకా పరారీలోనే ఉన్నాడు. అయితే, అతడి చరిత్రకు సంబంధించి ఇప్పుడిప్పుడే పలు అంశాలు వెలుగులోకి వస్తున్నాయి. జాతీయ మీడియా కథనాల ప్రకారం, లలిత్ ఝా కోల్‌కతాలో దాదాపు ఏడాదిన్నర పాటు ఓ ఇంట్లో అద్దెకు ఉన్నాడట. బారాబజార్ ప్రాంతంలో అతడు ఉండేవాడని తెలుస్తోంది. మీడియాలో అతడి ఫొటో చూసి అక్కడి స్థానికులు ఆశ్చర్యపోయారు. తను టీచర్ అని లలిత్ చెప్పుకుతిరిగేవాడని పేర్కొన్నారు. ఇరుగుపొరుగు పిల్లలందరూ అతడిని ట్యూషన్ సర్‌గా పిలిచేవారని తెలిపారు. మరో విషయం ఏంటంటే ఆ ఇంటి ఓనర్‌తో లలిత్ ఝా నేరుగా అద్దె ఒప్పందం కుదుర్చుకోలేదని స్థానికులు చెబుతున్నారు.…
శ్రీకృష్ణ జన్మభూమి కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. మధుర లోని షాహీ ఈద్గా కాంప్లెక్స్‌లో సర్వే నిర్వహించడానికి అలహాబాద్ హైకోర్టు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. హిందూ పక్షం శీకృష్ణ విరాజ్‌మాన్ తరఫున దాఖలైన పిటిషన్ పరిశీలించి కమిషన్ ఏర్పాటుకు ఆమోదం తెలిపింది. ఈమేరకు గురువారం కీలకమైన ఆదేశాలను జారీ చేసింది. ముగ్గురు న్యాయవాదులను కమిషనర్లుగా నిర్ణయించింది. వివాదాస్పద మసీద్ కాంప్లెక్స్‌లో సర్వే చేపట్టాలంటూ అలహాబాద్ హైకోర్టు సింగిల్ బెంచ్ జ స్టిస్ మయాంక్ కుమార్ జైన్ ఆదేశాలు జారీ చేశారు. శ్రీకృష్ణ విరాజ్ మాన్ తరఫున దాఖలైన పిటిషన్‌పై విచారణ జరిపి ఈ ఆదేశాలు ఇచ్చారు. ఈ కేసుకు సంబంధించి మధుద డిస్ట్రిక్ట్ కోర్టు నుంచి బదిలీ అయిన మొత్తం 18 పిటిషన్లను హైకోర్టు పరిశీలించింది. మధుర డిస్ట్రిక్ట్ కోర్టులో పెండింగ్‌లో ఉన్న పిటిషన్లు అన్నింటినీ అందించాలని హైకోర్టు కోరింది. సర్వే చేయించాలంటూ తాము దాఖలు చేసిన పిటిషన్‌ను అలహాబాద్ హైకోర్టు…
పార్లమెంటులో బుధవారం చోటు చేసుకున్న చొరబాటు ఘటనపై గురువారం ఉభయసభల్లోనూ విపక్షాలు నిరసనకు దిగాయి. ప్రభుత్వం వైఫల్యం వల్లే ఈ ఘటన చోటు చేసుకుందని ఆరోపించాయి. పార్లమెంటు భవనంలోకి అగంతకులు చొరబడిన వ్యవహారంపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రకటన చేయాలని డిమాండ్ చేశాయి. దీంతో సభా కార్యకలాపాలకు తీవ్ర అంతరాయం కలిగింది. దీంతో ఉభయసభలు ప్రారంభం కాగానే వాయిదా పడ్డాయి. పార్లమెంట్లో అనుచితంగా ప్రవర్తించినందుకు 15 మంది ఎంపీలు సస్పెన్షన్‌కి గురయ్యారు. సస్పెండ్ అయిన వారిలో ఒక రాజ్యసభ ఎంపీతో పాటు 14 మంది లోక్‌సభ ఎంపీలు ఉన్నారు. సస్పెండ్ అయిన సభ్యుల్లో మాణికం ఠాగూర్, కనిమొళి, పీఆర్ నటరాజన్, వీకే శ్రీకాంతం, బేణి బహన్, కే సుబ్రమణ్యం, ఎస్ఆర్ ప్రతిబన్, ఎస్ వెంకటేషన్, మహ్మద్ జావేద్ ఉన్నారు. ఎంపీల్లో 9 మంది కాంగ్రెస్ ఎంపీలు ఉన్నారు. సీపీఎంకు చెందిన ఇద్దరు, డీఎంకేకి చెందిన ఇద్దరు, సీపీఐ నుంచి ఒక…
లోక్‌సభలో భద్రతా వైఫల్యంపై విచారణ జరుపుతామని స్పీకర్ ఓం బిర్లా ఎంపిలకు హామీ ఇచ్చారు. మధ్యాహ్నం 2 గంటలకు సభ తిరిగి ప్రారంభం కాగానే ఎంపిలు ఈ అంశాన్ని లేవనెత్తారు. భద్రతపై ఆందోళన వ్యక్తం చేశారు. దీనిపై చర్చించాలని పట్టుబట్టారు. బుధవారం పార్లమెంటులోకి ఇద్దరు ఆగంతకులు చొరబడిన ఘటనపై దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ ఘటనపై స్పీకర్ ఓం బిర్లా స్పందించారు. లోక్‌సభ లోపల ఇద్దరు ఆగంతకులు, బయట మరో ఇద్దర్ని అదుపులోకి తీసుకున్నామని తెలిపారు. వారి దగ్గరున్న వస్తువులను స్వాధీనం చేసుకున్నామని, ఈ ఘటనపై పూర్తి స్థాయిలో దర్యాప్తు చేపడుతామని చెప్పారు. నిందితులు వదిలింది కేవలం సాధారణ పొగే అని ప్రాథమిక దర్యాప్తులో తేలిందని, దాని గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు. అయితే, నిందితులు వదిలిన గ్యాస్ ఏమిటనే దానిపై సమగ్ర విచారణ జరుపుతామని చెప్పారు. దీనిపై ప్రతిపక్ష ఎంపిలందరితోనూ ఈ సాయంత్రం సమావేశం…
పార్లమెంట్ లోకి అగంతకుల చొరబాటు వ్యవహారం కేంద్రాన్ని ఉలిక్కిపడేలా చేసింది. పార్లమెంటుపై దాడి జరిగి 22 ఏళ్లు కావస్తున్న సందర్భంగా మరోసారి ఆ స్ధాయిలో కాకపోయినా ఎంపీల్ని భయభ్రాంతుల్ని చేసేలా ఇవాళ చోటు చేసుకున్న పరిణామాలు దేశవ్యాప్తంగా తీవ్ర కలకలం రేపాయి. ఏకంగా లోక్ సభ లోకి సందర్శకుల గ్యాలరీ నుంచి ఆగంతుకులు దూకి స్మోక్ గ్యాస్ ప్రయోగించడం, బెంచీలపై దూకుతూ పరుగులు తీయడం టీవీల్లో చూసిన జనం నిర్ఘాంతపోయారు. ఇది ఏకంగా కొత్త పార్లమెంట్ భద్రతపై అనుమానాలు రేకెత్తించింది.ఈ నేపథ్యంలో పార్లమెంటులో జరిగిన పరిణామాలపై అత్యున్నత స్దాయి దర్యాప్తు కేంద్రం, లోక్ సభ స్పీకర్ కూడా ఆదేశించారు. అంతటితో ఆగకుండా పార్లమెంటు భద్రతా నిబంధనల్లో పలు మార్పులు చేశారు. కొంతకాలంపాటు సందర్శకుల గ్యాలరీలోకి వెళ్లేందుకు పాసులు ఇవ్వరాదని నిర్ణయించారు. అలాగే పార్లమెంటులోకి ఎంట్రీ, ఎగ్జిట్, ఇతర పాయింట్లలో ఎవరు వెళ్లాలనే దానిపైనా సమీక్ష చేస్తున్నారు. ఇందులో భాగంగా పలు కీలక…
తెలంగాణ శాసనసభ స్పీకర్‌గా గడ్డం ప్రసాద్ కుమార్ ఎన్నిక ఏకగ్రీవమైంది. అసెంబ్లీ స్పీకర్ పదవికి బుధవారం జరిగిన నామినేషన్ల ప్రక్రియలో గడ్డం ప్రసాద్ కుమార్ ఒక్కరే నామినేషన్ దాఖలు చేశారు. మిగతా పార్టీలేవీ తమ అభ్యర్థులను నిలపలేదు. గడ్డం ప్రసాద్ కుమార్‌కు కాంగ్రెస్‌తో పాటు బిఆర్‌ఎస్ కూడా మద్దతు తెలిపింది. ఎంఐఎం సైతం తమ మద్దతును ప్రకటించింది. దాంతో శాసనసభ స్పీకర్‌గా గడ్డం ప్రసాద్ కుమార్ ఎన్నిక ఏకగ్రీవం కాగా, ఈ విషయాన్ని గురువారం శాసనసభలో ప్రొటెం స్పీకర్ అక్బరుద్దీన్ ఒవైసీ అధికారికంగా ప్రకటించనున్నారు. గడ్డం ప్రసాద్ కుమార్ గురువారం ఉదయం 10 గంటలకు శాసనసభ ప్రారంభంలో స్పీకర్‌గా బాధ్యతలు స్వీకరించనున్నారు. కాంగ్రెస్ తరఫున మధ్యాహ్నం 12:30 గంటల సమయంలో వికారాబాద్ ఎంఎల్‌ఎ గడ్డం ప్రసాద్ కుమార్ సభాపతి పదవికి నామినేషన్ దాఖలు చేశారు. అధికార పార్టీ నుంచి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, ప్రతిపక్షం నుంచి కెటిఆర్ గడ్డం ప్రసాద్‌కుమార్‌ను ప్రతిపాదిస్తూ నామినేషన్‌పై…
ఆరోగ్యశ్రీ కింద రూ.25 లక్షల వరకు ఉచిత చికిత్స అందించే కార్యక్రమం డిసెంబర్ 18న ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో అధికారులతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి బుధవారం సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షలో సీఎం జగన్ మాట్లాడుతూ ఆరోగ్య శ్రీ పరిమితి రూ.25 లక్షలకు పెంపు చరిత్రాత్మక నిర్ణయం తెలిపారు. విద్య, ఆరోగ్యం ప్రజలకు ఒక హక్కుగా లభించాలని స్పష్టం చేశారు. పేద ప్రజలకు ఎలాంటి వైద్యం అవసరమైనా రూ.25 లక్షల వరకు ఉచిత చికిత్స లభిస్తుందన్న భరోసా ఇవ్వాలని చెప్పారు. వైసీపీ ప్రభుత్వం మానవీయ దృక్పథంతో ముందడుగు వేస్తోందని పేర్కొన్నారు. వైఎస్సార్ ఆరోగ్య శ్రీ కార్డు ఉంటే ఆ వ్యక్తికి రూ.25 లక్షలు వరకు వైద్యం ఉచితంగా లభిస్తుంద, ఎలాంటి ఆరోగ్య సమస్యలు వచ్చినా ఆరోగ్యశ్రీ అండగా నిలుస్తుందని వివరించారు. ఈ నెల 19 నుంచి ప్రతి నియోజకవర్గంలో ఎమ్మెల్యేలు ఆరోగ్య శ్రీ…
దేశంలో ఇటీవల కలకలం సృష్టించిన మహదేవ్ బెట్టింగ్ యాప్ మనీలాండరింగ్ వ్యవహారానికి సంబంధించి యాప్ యజమానుల్లో ఒకరైన రవి ఉప్పల్ ను దుబాయ్‌లో అదుపు లోకి తీసుకున్నారు. ఈడీ అభ్యర్థన మేరకు ఇంటర్‌పోల్ జారీ చేసిన రెడ్ కార్నర్ నోటీస్ ఆధారంగా గత వారమే పోలీస్‌లు రవిని అదుపు లోకి తీసుకున్నారు. అతడిని భారత్‌కు తీసుకు వచ్చేందుకు దుబాయ్ అధికారులతో ఈడీ సంప్రదిస్తోంది. మరో యజమాని సౌరభ్ చంద్రశేఖర్ కోసం దుబాయ్ పోలీస్‌లు గాలిస్తున్నారు. ఛత్తీస్‌గఢ్ లోని భిలాల్ ప్రాంతానికి చెందిన రవి ఉప్పల్, సౌరభ్ చంద్రశేఖర్ దుబాయ్ కేంద్రంగా భారత్‌లో మహదేవ్ బెట్టింగ్ యాప్ నిర్వహిస్తున్నారు. ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్ పేరున మనీలాండరింగ్ సాగిస్తున్నారు. దీనిపై ఈడీ రంగం లోకి దిగి ఈ నెట్‌వర్క్‌తో సంబంధం ఉన్న కోల్‌కతా, భోపాల్ ముంబై వంటి నగరాల్లో సోదాలు చేపట్టింది.రూ. వందల కోట్లలో అక్రమ నగదు బయటపడింది. యాప్ ద్వారా వచ్చే మొత్తాన్ని…