Author: Editor's Desk, Tattva News

ఇజ్రాయెల్-హమాస్ మధ్య జరుగుతున్న యుద్దంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఇరు దేశాల మధ్య జరిగిన నాలుగు రోజుల కాల్పుల విరమణ ఒప్పందం శుక్రవారం నుండి అమల్లోకి వచ్చింది. ఇందులో భాగంగా తమ వద్ద బందీలుగా ఉన్న 240 మంది బందీల్లో 24 మందిని శుక్రవారం కెరెమ్ షాలోమ్ క్రాసింగ్ వద్ద హమాస్ నుంచి 25, ఇజ్రాయల్ నుంచి 39 మంది విడుదల అయ్యారు. ఇరువైపులా విడుదలైన వారిలో అందరూ మహిళలు, చిన్నారులే ఉన్నారు. ప్రతిగా ఇజ్రాయెల్ కూడా 39 మంది పాలస్తీనా ఖైదీలకు స్వేచ్ఛ కల్పించింది. హమాస్ విడుదల చేసిన బందీలు దేశానికి వచ్చినట్టు ఇజ్రాయెల్ ప్రకటించింది. వారికి ఆసుపత్రుల్లో వైద్య పరీక్షలు నిర్వహించింది. ఈ నాలుగు రోజుల తాత్కాలిక కాల్పుల విరమణ ఒప్పందంలో భాగంగా హమాస్ మొత్తం 50 మంది బందీలను విడుదల చేయనుండగా, ఇజ్రాయెల్ 150 మంది పాలస్తీనా ఖైదీలను విడిచిపెట్టనుంది. ఒప్పందంలో లేకున్నా 10 మంది థాయ్…

Read More

మాజీ ఐఎఏస్ ఏకే గోయల్ ఇంట్లో ఎలక్షన్ ఫ్లయింగ్ స్వ్కాడ్, టాస్క్ ఫోర్స్ అధికారులు సంయుక్తంగా తనిఖీలు చేపట్టారు. హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 22లోని ఏకే గోయల్ ఇంట్లో ఎలక్షన్ స్క్వాడ్, టాస్క్‌ఫోర్స్ అధికారులు శుక్రవారం రాత్రి సోదాలు నిర్వహించారు.2010లో ఉద్యోగ విరమణ చేసిన ఆయన కొంతకాలం రాష్త్ర ప్రభుత్వ సలహాదారునిగా పనిచేశారు. ఆయన ఇంట్లో అధికార ఆపార్టీ నేతలు భారీగా నగదు ఉంచారని సీనియర్ కాంగ్రెస్ నేత మల్లు రవి ఎన్నికల కమిషన్, ఆదాయపన్ను అధికారులకు ఫిర్యాదు చేయడంతో ఈ సోదాలు జరిపారు. ఈ క్రమంలో ఏకే గోయల్ ఇంటి వద్దకు పెద్ద ఎత్తున కాంగ్రెస్ కార్యకర్తలు చేరుకున్నారు. దీంతో.. ఆ పరిసరాల్లో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఇన్ని రోజులు కేవలం రాజకీయ నేతలు, వ్యాపారవేత్తల ఇళ్లలోనే తనిఖీలు జరగ్గా ఇప్పుడు ఓ మాజీ ఐఏఎస్ అది కూడా బీఆర్ఎస్ ప్రభుత్వానికి సలహాదారునిగా ఉన్న అధికారి ఇంట్లో జరగటం…

Read More

హైదరాబాద్ లోని రాజేంద్రనగర్ ఉగ్రవాదులకు అడ్డాగా మారిందని కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా ఆరోపించారు. రాజేంద్రనగర్, శేరిలింగంపల్లి నియోజకవర్గ పరిధిలో రోడ్ షోలలో పాల్గొంటూ రాజేంద్రనగర్‌లో ముగ్గురు ఉగ్రవాదులను ఎన్ఐఏ అధికారులు అదుపులోకి తీసుకున్నారని గుర్తు చేశారు. ఎంఐఎం సాయంతోనే ఉగ్రవాదులు హైదరాబాద్‌లో తలదాచుకుంటున్నారని ఆరోపించారు.  ఉగ్రవాదులను ఎన్ఐఏ అధికారులు పట్టుకునే వరకు.. ఇక్కడి పోలీసులు ఏం చేస్తున్నారంటూ అమిత్ షా ప్రశ్నించారు. సీఎం కేసీఆర్‌కు ఓవైసీ భయం పట్టుకుందని ఎద్దేవా చేశారు. అందువల్లే సెప్టెంబర్ 17ను అధికారికంగా నిర్వహించడం లేదని అమిత్ షా ఆరోపించారు. కారు పార్టీ స్టీరింగ్ ఎంఐఎం చేతిలో ఉందన్న అమిత్ షా దేశంలోనే అత్యంత అవినీతి ప్రభుత్వం బీఆర్ఎస్ సర్కార్ అని ధ్వజమెత్తారు.  తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఉగ్రవాదులను ఏరి పారేస్తామని అమిత్ షా స్పష్టం చేశారు. ప్రధాని మోదీ ఇచ్చిన మాట ప్రకారం తప్పకుండా ఎస్సీ వర్గీకరణ చేస్తామని చెప్పారు.…

Read More

నటి త్రిషపై ఇటీవల అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన నటుడు మన్సూర్ అలీఖాన్ తాజాగా ఆమెకు క్షమాపణ చెప్పారు. తనకు త్రిషపై ఎలాంటి చెడు ఉద్దేశం లేదని అన్నారు. తాను సరదాగా ఆ వ్యాఖ్యలు చేశానన్నారు. ఆమె పెళ్లికి తాను మంగళసూత్రం ఇచ్చి దీవించాలని అనుకుంటున్నానని తెలిపారు. ఈ మేరకు ఎక్స్‌లో పోస్టు ఉంచారు. ప్రస్తుతం ఈ పోస్టు నెట్టింట వైరల్‌గా మారింది. మన్సూర్ పోస్టుపై త్రిష పరోక్షంగా స్పందించారు.‘ తప్పు చేయడం మానవ సహజం. క్షమాపణ అత్యున్నతమైనది’ అని అంటూ ఆమె తాజాగా ట్వీట్ చేశారు. దీంతో గత కొద్ది రోజులుగా కొనసాగుతున్న ఈ వివాదానికి తెరపడినట్లు అయింది. మన్సూర్ అలీఖాన్ ఇటీవల ఓ ఇంటర్వూలో మాట్లాడుతూ గతంలో తాను ఎన్నో రేప్ సీన్లలో నటించానని,‘ లియో’ సినిమాలో అవకాశం వచ్చినప్పుడు త్రిషతో కూడా అలాంటి సీన్ ఉంటుందని అనుకున్నానని, ఆ సన్నివేశం లేకపోవడంతో బాధ కలిగిందని అన్నారు. సంబంధిత వీడియో…

Read More

ఆదాయానికి మించి ఆస్తుల కేసులో విచారణ ఎదుర్కొంటున్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి మంజూరు చేసిన బెయిల్ రద్దు చేయాలంటూ నర్సాపురం ఎంపీ కనుమూరు రఘురామకృష్ణ రాజు దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు విచారణకు స్వీకరించింది. కేసులో ప్రతివాదులుగా ఉన్న ఏపీ సీఎం జగన్‌తో పాటు దర్యాప్తు సంస్థలు సీబీఐ, ఈడీలకు శుక్రవారం నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణ జనవరి మొదటివారంలో చేపట్టనున్నట్టు వెల్లడించింది. ఆదాయానికి మించి ఆస్తుల కేసుపై ట్రయల్ కోర్టులో జరుగుతున్న విచారణ ఏళ్ల తరబడి నత్తనడకన సాగుతోందని, నిందితులు తమ అధికారం, పలుకుబడి ఉపయోగించి సాక్ష్యాధారాలు తారుమారు చేస్తున్నారని ఆరోపిస్తూ రఘురామకృష్ణంరాజు పిటిషన్ దాఖలు చేశారు. తొలుత ట్రయల్ కోర్టు విచారణను హైదరాబాద్ నుంచి ఢిల్లీకి లేదా వేరే ఏదైనా రాష్ట్రానికి బదిలీ చేయాలని కోరుతూ ఒక పిటిషన్ దాఖలు చేయగా, దానిపై ఇప్పటికే సర్వోన్నత న్యాయస్థానం నోటీసులు పంపించింది. తాజాగా జగన్‌కు మంజూరైన…

Read More

ఏపీలో విశాఖ నుంచే పరిపాలన అంశంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. విశాఖ రిషికొండ మిలీనియం టవర్స్‌లో మంత్రులు, అధికారుల క్యాంప్‌ కార్యాలయాలను కమిటీ గుర్తించింది. ముఖ్యమంత్రి, మంత్రుల పర్యటన సమయంలో భవనాల వినియోగంపై కమిటీ (ఆర్థిక శాఖ, మున్సిపల్‌ అడ్మినిస్ట్రేషన్‌ శాఖ కార్యదర్శి) నివేదిక మేరకు సీఎస్‌ జవహర్‌ రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు.  రిషికొండ మిలినియం టవర్స్‌లో మంత్రులు, అధికారుల క్యాంప్ కార్యాలయాలకు సంబంధించి స్థలాలను కమిటీ గుర్తించింది. సీఎం, మంత్రులు ఉత్తరాంధ్రలో సమీక్షలకు వెళ్లినప్పుడు ఉపయోగించేందుకు మిలినియం టవర్స్‌లో ఏ, బీ టవర్స్‌ను కేటాయించారు. ఉత్తరాంధ్ర ప్రాంత అభివృద్ధి కోసం ముఖ్యమంత్రి, మంత్రుల పర్యటనల సమయంలో వినియోగించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. కమిటీ నివేదిక మేరకు సీఎస్‌ జవహర్‌రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. శాఖల సొంత భవనాలు, స్థలాలను తొలి ప్రాధాన్యంగా వినియోగించాలని తెలిపారు. ఇక వివిధ శాఖలకు చెందిన సొంత భవనాలను ఆయా శాఖల మంత్రులు, ఉన్నతాధికారులు, కార్యదర్శులకు…

Read More

ప్రధాని నరేంద్ర మోదీపై అనుచిత వాఖ్యలు చేయడంతో కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీకి ఎలక్షన్‌ కమిషన్‌ (ఈసి) గురువారం నోటీసులు పంపింది. ప్రత్యర్థులపై నిర్థారణ కాని ఆరోపణలు చేయడం ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించడమేనని ఇసి నోటీసులో పేర్కొంది. శనివారం సాయంత్రంలోగా వివరణనివ్వాల్సిందిగా పేర్కొంది. రాజస్థాన్‌ అసెంబ్లీ ఎన్నికల ప్రచారం సందర్భంగా గత మంగళవారం ప్రధాని మోదీని ఉద్దేశించి ‘పనౌటి’, ‘పిక్‌ పాకెట్‌’ వ్యాఖ్యలు చేశారు. దానితో, రాహుల్‌ గాంధీ ప్రధాని మోదీపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ బిజెపి చేసిన ఫిర్యాదు మేరకు ఈ నోటీసులు పంపినట్లు తెలుస్తోంది. రాహుల్‌ గాంధీ ర్యాలీలో అవమానకరమైన పదాలను ఉపయోగించారని, పలు ఆరోపణలు చేశారని బిజెపి ఫిర్యాదులో ఆరోపించింది. ముఖ్యంగా ప్రపంచకప్‌ ఫైనల్‌ మ్యాచ్‌ను ప్రస్తావిస్తూ భారత్ ఓటమికి ప్రధాని అక్కడకు వెళ్లడమే కారణం అన్నట్లుగా రాహుల్ మాట్లాడటం వివాదాంరేపింది. ‘మన కుర్రాళ్లు అద్భుతంగా ప్రపంచకప్‌ను దాదాపు గెలిచారు కానీ ఓటమిపాలయ్యారు. అయితే, అక్కడికి…

Read More

ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ప్రముఖ నటుడు ప్రకాష్ రాజ్ కు రూ. 100 కోట్ల రూపాయల పోంజీ స్కామ్ కు సంబంధించి మనీ లాండరింగ్ కేసులో నోటీసులు జారీ చేసింది. ఈ కేసులో చెన్నైలో వచ్చేవారం ప్రజాష్ రాజ్ విచారణకు రావాలని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ తన నోటీసులో పేర్కొంది. తిరుచ్చికి సంబంధించిన ఒక జువెలరీ గ్రూపు పై నవంబర్ 20వ తేదీన దాడిచేసి 23. 70 లక్షల లెక్క చెప్పని నగదు మరియు కొన్ని ఆభరణాలను స్వాధీనం చేసుకున్న తర్వాత ప్రకాష్ రాజ్ కు ఈడి అధికారులు నోటీసులు జారీ చేయటం అందరిలోనూ ఆసక్తిని రేకెత్తించింది. తిరుచ్చికి సంబంధించిన ఈ ఆభరణాల సంస్థకు ప్రకాష్ రాజ్ ప్రచారకర్తగా ఉన్నారు. ప్రణవ్ జూవెలర్స్ సంస్థకు బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరిస్తున్న ప్రకాష్ రాజ్ ను ఈ సంస్థకు సంబంధించిన వ్యవహారాలలో ఈడీ అధికారులు విచారించనున్నారు. తమిళనాడు పోలీస్ ఆర్థిక నేరాల విభాగం నమోదు చేసిన…

Read More

జమ్ముకశ్మీర్ లోని రాజౌరీ జిల్లాలో జరిగిన భారీ ఎన్‌కౌంటర్‌లో నలుగురు సైనికులు ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. ఇదే ఎన్‌కౌంటర్‌లో పాకిస్థాన్‌కు చెందిన ఓ కీలక ఉగ్రవాది హతమయ్యాడు. అతడిని పాకిస్థాన్‌కు చెందిన క్వారీగా గుర్తించినట్టు రక్షణ శాఖ వర్గాలు వెల్లడించాయి. లష్కరే తొయిబా (ఎల్‌ఇటి)లో అతడు ఉన్నతస్థాయి ఉగ్రనేత అని, పేలుడు పదార్థాల తయారీలో నిపుణుడని తెలిపాయి. మరోవైపు ఈ ఎన్‌కౌంటర్ రెండో రోజు గురువారం కూడా కొనసాగుతున్నట్టు పేర్కొన్నాయి. “పాక్‌అఫ్గాన్ సరిహద్దుల్లో ఉగ్ర శిక్షణ పొందిన క్వారీ లష్కరే తొయిబాలో హై ర్యాంకు కలిగిన నాయకుడు. గత ఏడాది కాలంగా తన బృందంతో కలిసి రాజౌరీపూంచ్‌లో ఉగ్ర కార్యకలాపాలు నిర్వహిస్తున్నాడు. డాంగ్రీ, కాండీ దాడుల వెనుక సూత్రధారి అతడే” అని రక్షణ శాఖ వర్గాలు వెల్లడించాయి. “ఈ ప్రాంతంలో ఉగ్రవాదాన్ని మళ్లీ ప్రేరేపింప చేయడానికి అతడిని పంపినట్టు తెలుస్తోంది. పేలుడు పదార్ధాల తయారీలోనే కాదు, గుహల్లో దాక్కొని ఉగ్ర కార్యకలాపాలు…

Read More

భారతదేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు చరిత్రలో మొట్టమొదటి మహిళా న్యాయమూర్తి జస్టిస్ ఫాతిమా బీవీ గురువారం కన్నుమూశారు. కేరళలోని కొల్లాంలో వృద్దాప్య సంబంధ వ్యాధులతో ఆమె ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ఫాతిమా బీవీ వయసు 96 సంవత్సరాలు. అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె కొన్ని రోజులుగా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. సుప్రీంకోర్టు జడ్జిగా పదవీ విరమణ చేశాక కేరళలోని పత్తంనతిట్టలో నివాసం ఉంటున్నారు. ఫాతిమా బీవీ సుప్రీంకోర్టు తొలి మహిళా జడ్జి మాత్రమే కాదు, జాతీయ మానవ హక్కుల కమిషన్ సభ్యురాలిగా కూడా వ్యవహరించారు. అంతేకాదు, ముస్లిం వర్గం నుంచి గవర్నర్ గా నియమితురాలైన తొలి మహిళ కూడా ఆమే. జస్టిస్ ఫాతిమా బీవీ గతంలో తమిళనాడుకు గవర్నర్ గా వ్యవహరించారు. పైగా, కేరళ నుండి 1950లో లా డిగ్రీ పొందిన ఆమె ముస్లిం మహిళలతో ఆ డిగ్రీ పొందిన మొదటి మహిళా కావడం విశేషం. దేశ…

Read More