Author: Editor's Desk, Tattva News

ముంబయిపై ఉగ్రదాడులు జరిగి 15 సంవత్సరాలు కావస్తోంది. ఈ నేపథ్యంలో లష్కరే తోయిబా ఉగ్రవాద సంస్థపై ఇజ్రాయెల్ నిషేధం విధించింది. ముంబయిపై జరిగిన దాడులు ప్రాణాంతకమైనవని, ఆ ఉగ్రవాద సంస్థను క్షమించేది లేదని ఇజ్రాయెల్ తెలిపింది. అయితే భారత సర్కార్ సూచన లేకుండానే ఇజ్రాయెల్ తాజాగా ఈ ప్రకటన చేయడం గమనార్హం. లష్కరే సంస్థ గురించి పూర్తి వివరాలు సేకరించిన ఇజ్రాయెల్ ఆ సంస్థను ఉగ్రవాద సంస్థల జాబితాలో చేర్చింది. అయితే ఇదేమీ కొత్త విషయం కాదని 2013నుంచీ ఈ నిషేధం కొనసాగుతోందని, బ్యూరోక్రాటిక్ లోపం కారణంగా ఈ విషయాన్ని మరోసారి ప్రకటించడం జరిగివదని ఇజ్రాయెల్ విదేశీ వ్యవహారాల శాఖ ప్రతినిధి లయర్ హయత్ చెప్పారు. అంతకు ముందు భారత్‌లోని ఇజ్రాయెల్ ఎంబసీ కూడా దీనికి సంబంధించి ఒక ప్రకటన విడుదల చేసింది. వందల మంది భారతీయ పౌరుల హత్యకు ఆ ఉగ్రసంస్థ కారణమని ఇజ్రాయెల్ పేర్కొంది. 2008 నవంబర్ 26న…

Read More

ఉత్తరాఖండ్‌లోని ఉత్తరకాశీలో కూలిన టన్నెల్‌లో చిక్కుకున్న కార్మికులను కాపాడే రెస్కూ ఆపరేషన్‌లో భారీ పురోగతి కనిపించింది. సొరంగంలో చిక్కుకున్న 41 మంది కార్మికులు సుమారు 240 గంటల తర్వాత తొలిసారి కెమెరాకు చిక్కారు. దీంతో గత 11 జులుగా వారిని బైటికి తీసుకు రావడానికి శ్రమిస్తున్న సిబ్బందికి భారీ ఊరట లభించింది. 6 అంగుళాల చుట్టుకొలత ఉన్న ప్రత్యామ్నాయ పైపు సొరంగంలో చిక్కుకున్న కార్మికులు ఉండే చోటికి చేరుకున్న విషయం తెలిసిందే. అధికారులు దానిగుండా ఒక ఎండోస్కోపిక్ కెమెరాను పంపించారు. కార్మికులందరినీ దాని దగ్గరికి రావాలని కోరారు. దీంతో కార్మికులందరినీ ఆ కెమెరా బంధించింది.దీనికి సంబంధించిన వీడియోలను అధికారులు విడుదల చేశారు. అయితే ప్రమాదం జరిగి పది రోజులు కావడంతో వారంతా నీరసంగా ఉన్నట్లు కనిపించినప్పటికీ ఆరోగ్యంగా ఉండడంఊరటనిచ్చే విషయమే. కాగా సోమవారం రాత్రి కార్మికులకు పైప్ ద్వారా గాజు సీసాల్లో కిచిడీ పంపించారు. అంతకు ముందు డ్రైఫ్రూట్స్ మాత్రమే అందించారు.…

Read More

నటుడు, స్టాండప్ కమెడియన్ వీర్‌దాస్ అంతర్జాతీయ ఎమ్మీ అవార్డు 2023 గెలుచుకున్నారు. ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్ లో ప్రసారమౌతున్న ‘ వీర్‌దాస్ :లాండింగ్ ’ కామెడీ సిరీస్‌కు ఈ అవార్డు లభించింది. ఈ అవార్డు కోసం ఆయన ఇప్పటివరకు రెండుసార్లు నామినేట్ అయ్యారు. కానీ ఈసారి విన్నర్‌గా నిలిచారు. ప్రఖ్యాత బ్రిటిష్ షో “డెర్రీ గరల్స్‌” సీజన్ 3 తో ఈ అవార్డు పంచుకున్నారు. ఈ ఎమ్మీ అవార్డుల వేడుక న్యూయార్క్ నగరంలో సోమవారం రాత్రి జరిగింది. స్వప్నంలా ఇది నమ్మలేని నిజంగా అనిపించిందని వీర్‌దాస్ తన భావోద్వేగాన్ని తెలియజేశారు. ఇది నాకొక్కరికే మైలు రాయి కాదని, భారత కామెడీ రంగానికే ఇది చెందుతుందని పేర్కొన్నారు. వీర్‌దాస్ లాండింగ్ తో ప్రపంచ వ్యాప్తంగా భారత్ పేరు ప్రతిధ్వనించడం ఆనందంగా ఉందని తెలిపారు. “స్థానిక కథలను రూపొందించడం నుంచి ప్రపంచ స్థాయిలో ప్రశంసలు అందుకోవడం వరకు నా ప్రయాణం సవాళ్లుగా నడిచింది”…

Read More

దేశ రాజధాని ఢిల్లీ సహా ఉత్తరభారతంలో ఏటా శీతాకాలంలో పెరుగుతున్న వాయు కాలుష్యాన్ని కట్టడి చేసేలా ఆదేశాలివ్వాలంటూ దాఖలైన పిటిషన్లపై సుప్రీం కోర్టు మంగళవారం విచారణ జరిపింది. ఈ సందర్భంగా పంజాబ్ లో పంట వ్యర్థాల కాల్చివేతకు సంబంధించి ఆ రాష్ట్రం ఇచ్చిన నివేదికపై సర్వోన్నత న్యాయస్థానం తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. రైతులను ఎందుకు విలన్లుగా చూపిస్తున్నారని అసహనం వ్యక్తం చేసింది. “ఇక్కడ ఎందుకు ప్రతిసారీ రైతులను విలన్లుగా చూపిస్తున్నారు. ఈ కోర్టులో మేం వాళ్లను విచారించడం లేదు. పంట వ్యర్థాలను కాల్చివేయడానికి రైతులకు పలు కారణాలు ఉండవచ్చు” అని తెలిపింది. “యంత్రాలతో చేసే పంట వ్యర్థాల ప్రక్రియను మీరే (పంజాబ్ ప్రభుత్వం) ఎందుకు 100 శాతం ఉచితంగా చేపట్టడం లేదు. ఈ విషయంలో హర్యానా ప్రభుత్వం నుంచి సలహాలు తీసుకోండి. పంట వ్యర్థాలను కాల్చకుండా ఉండేందుకు రైతులకు ఆ ప్రభుత్వం ప్రోత్సాహకాలు ఇస్తోంది” అని సుప్రీం కోర్టు పంజాబ్…

Read More

టిడిపి అధినేత చంద్రబాబు నాయుడుకు ఏపీ హైకోర్టులో బెయిల్‌ మంజూరు కావడంపై సుప్రీంకోర్టును ఆశ్రయించాలని ఏపీ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. బాబుకు రెగ్యులర్ బెయిల్‌ మంజూరు విషయంలో సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాల పరిధిని హైకోర్టు అతిక్రమించిందని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. బెయిల్‌ పిటిషన్‌ విచారణలో పిటిషనర్లు వాదించని, వారు కోరని అంశాల్లోకి కూడా హైకోర్టు వెళ్లేందుకు ప్రయత్నించడంపై ఏపీ ప్రభుత్వం అభ్యంతరం చెబుతోంది. హైకోర్టు తన అధికార పరిధిని అతిక్రమిస్తూ తీర్పులో వ్యాఖ్యానాలు చేసిందని, కేసు మెరిట్స్‌ గురించి, ఔచిత్యం గురించి, ఆధారాల.. దర్యాప్తులో లోపాలుగురించి బెయిల్‌ పిటిషన్‌ సమయంలోనే వ్యాఖ్యానించడంపై సుప్రీం కోర్టును ఆశ్రయించాలని నిర్ణయించింది. సిఐడి దర్యాప్తుపై ఇప్పటికే టీడీపీ పార్టీ నాయకులు, ప్రతినిధులు నిరంతరం రాళ్లు వేస్తూనే ఉన్నారని వైసీపీ ప్రభుత్వం చెబుతోంది. ఇలాంటి సమయంలో బెయిల్‌ సందర్భంగా కోర్టు చేసిన వ్యాఖ్యానాలను వారు సానుకూలంగా మలుచుకునే అవకాశం ఉందని, తీర్పులో పేర్కొన్న వ్యాఖ్యలపై న్యాయపోరాటం చేయాలని…

Read More

తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌కు గడువు సమీపిస్తోన్న కొద్దీ ప్రచార జోరు పెరుగుతోంది. ఎన్నికల ప్రచారంలో తీరిక లేెకుండా వివిధ పార్టీల నేతలు గడుపుతున్న పరిస్థితుల్లో మరోసారి ఆదాయపు పన్నుశాఖ అధికారులు పంజా విసిరారు. ఈ సారి కాంగ్రెస్ అభ్యర్థి జీ వివేక్. ఇంటిపై దాడి చేశారు. పలు చోట్ల ఏకకాలంలో ఈ దాడులు ఆరంభం అయ్యాయి.. ఈ ఎన్నికల్లో ఆయన మంచిర్యాల్ జిల్లాలోని చెన్నూరు నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేస్తోన్న విషయం తెలిసిందే. మంగళవారం తెల్లవారు జాము నుంచి ఆయన ఇంట్లో ఐటీ సోదాలు కొనసాగుతున్నాయి. చెన్నూరులోని వివేక్ నివాసంతో పాటు హైదరాబాద్‌లోని సోమాజీగూడ ఇళ్లు, కార్యాలయాలపై ఏకకాలంలో ఈ దాడులు మొదలయ్యాయి. వివేక్ బంధువులు, కొందరు ముఖ్య అనుచరుల ఇళ్లపైనా ఐటీ అధికారులు సోదాలకు దిగినట్లు తెలుస్తోంది. మొత్తంగా 20 చోట్ల ఈ దాడులు సాగుతున్నట్లు సమాచారం. తెలంగాణాలో పోటీలో ఉన్న అభ్యర్థులు అందరిలో సంపన్నుడిగా…

Read More

వ్యక్తులకు ముందస్తు బెయిల్‌కు సంబంధించి సుప్రీంకోర్టు సోమవారం కీలక తీర్పు వెలువరించింది. ఎవరిపై అయినా వేరే రాష్ట్రంలో ఎఫ్‌ఐఆర్ దాఖలు అయి ఉన్నప్పటికీ అరెస్టు నివారణకు సంబంధించిన ముందస్తు బెయిల్‌ను హైకోర్టులు, సెషన్స్ కోర్టులు వెలువరించవచ్చునని తెలిపింది. అయితే ఈ అవకాశం కేవలం అరుదైన, అసాధారణమైన పరిస్థితులలోనే ఉంటుందని స్పష్టం చేశారు. న్యాయ ప్రయోజనాల కోణంలో ఈ వెసులుబాటుకు వీలుంటుందని తెలిపారు. రాజ్యాంగంలో పౌరుల జీవన హక్కు , వారి వ్యక్తిగత స్వేచ్ఛ పరిరక్షణ అంశం కీలకంగా ఉందని, దీనిని పరిగణనలోకి తీసుకుని ఈ రూలింగ్ వెలువరిస్తున్నట్లు, ఇందులో దిగువ కోర్టులకు రాష్ట్రాల పరిమితి ఉండదని స్పష్టం చేశారు. సంబంధిత కేసులో న్యాయమూర్తులు బివి నాగరత్నం, ఉజ్వల్ భూయాన్‌తో కూడిన ధర్మాసనం రూలింగ్ కీలకం అయింది. వ్యక్తులపై కేసులు తలెత్తినప్పుడు సదరు వ్యక్తి వేరే చోట కూడా ముందస్తు బెయిల్‌కు అప్పీలు చేసుకోవచ్చు. అయితే తనపై కేసు దాఖలు అయిన రాష్ట్రానికి…

Read More

అయోధ్య శ్రీరాముడి విగ్రహ ప్రతిష్టాపనకు ముహూర్తం ఖ‌రార‌య్యింది. ఈ ఆల‌యంలో రాముడి విగ్ర‌హ వేడుకను చూసేందుకు ఎంతో మంది భ‌క్తులు ఎదురుచూస్తున్నారు. రామయ్య విగ్రహ ప్రతిష్టాపన ముహూర్తం స‌మీపిస్తుండ‌డంతో ఏర్పాట్ల‌న్నీ శ‌ర‌వేగంగా సాగుతున్నాయి. ఇప్ప‌టికే ఈ ఆల‌యానికి ఎంతోమంది భ‌క్తులు ఎన్నో కానుక‌లను స‌మ‌ర్పించారు. శతాబ్దాల తరబడి సంఘర్షణల అనంత‌రం ఈ రామ‌మందిర నిర్మాణాన్ని పూర్తిచేస్తున్నారు. ఇప్ప‌డు రాముని విగ్ర‌హ ప్ర‌తిష్టాప‌న‌లో ఎన్నో విశేషాలు దాగి ఉన్నాయి. ఈ వేడుక‌ల్లో కేంద్ర ప్రభుత్వంతో పాటు యూపీ ప్రభుత్వం కూడా పాల్గొన‌నుంది. ఈ శ్రీ‌రాముని వేడుక‌లను ఎంతో ఘ‌నంగా నిర్వ‌హించ‌నున్నారు. దేశ‌మంతా వీక్షించేలా కూడా ఏర్పాట్లు చేస్తున్నారు.  ఇప్ప‌టికే రామ‌య్య విగ్ర‌హ ప్ర‌తిష్టాప‌న‌కు ముహుర్తాన్ని కూడా ఖరారు చేశారు. కేంద్ర‌ప్ర‌భుత్వం చెప్పిన స‌మ‌యానికే ఈ వేడుకను నిర్వ‌హిస్తున్న‌ట్లు తెలుస్తోంది. 2023 ఏడాది చివ‌రినాటికి రామ‌మందిర నిర్మాణం పూర్తిచేస్తామ‌ని, 2024 జ‌న‌వ‌రిలో శ్రీ‌రాముని విగ్ర‌హ ప్ర‌తిష్ట జ‌రిపిస్తామ‌ని కేంద్ర‌ప్ర‌భుత్వం మాట ఇచ్చింది.  ఆ మాట…

Read More

ఎన్నికల్లో ఓటర్లను ప్రలోభాలకు గురిచేసే డబ్బు, మద్యం సహా ఇతర పద్ధతులపై కేంద్ర ఎన్నికల సంఘం అనుసరిస్తున్న సరికొత్త విధానం సత్ఫలితాలనిస్తోంది. ఎలక్షన్ సీజర్ మేనేజ్మెంట్ సిస్టం (ఈఎస్ఎంఎస్) ద్వారా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు చెందిన వివిధ ఎన్‌ఫోర్స్‌మెంట్ ఏజెన్సీల మధ్య సమన్వయం సాధిస్తూ ఎన్నికల అక్రమాలకు కేంద్ర ఎన్నికల సంఘం అడ్డుకట్ట వేస్తోంది. ఐదేళ్ల క్రితం జరిగిన అసెంబ్లీ ఎన్నికలతో పోల్చితే ప్రస్తుతం జరుగుతున్న 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో కేంద్ర ఎన్నికల సంఘం సీజ్ చేసిన మొత్తం 7 రెట్లు పెరిగిందని కేంద్ర ఎన్నికల సంఘం సోమవారం ప్రకటించింది. మిజోరాంతో, మధ్యప్రదేశ్, చత్తీస్‌గఢ్, రాజస్థాన్, తెలంగాణ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు తేదీలు ప్రకటించినప్పటి నుంచి ఇప్పటి వరకు రూ. 1,760 కోట్ల మేర నగదు, మద్యం, డ్రగ్స్, ఖరీదైన బహుమతులను సీజ్ చేసినట్టు ప్రకటించింది. గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో సీజ్ చేసిన మొత్తం రూ. 239.15 కోట్లతో…

Read More

ఎయిర్ ఇండియా ప్రయాణికులను బెదిరిస్తూ వీడియో విడుదల చేసిన ఖలిస్థాన్ అనుకూల నిషేధిత సంస్థ సిక్స్ ఫర్ జస్టిస్ ఉగ్రవాది గురుపత్వంత్ సింగ్ పన్నూన్ పై నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ సోమవారంనాడు ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. ఐపీసీలోని సెక్షన్ 120B, 153A,506 కింద, చట్టవ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టం-1967లోని సెక్షన్ 10,13,16,17,18,18B, 20 కింద పన్నూన్‌పై కేసులు నమోదు చేసినట్టు ఎన్ఐఏ ఒక ప్రకటన విడుదల చేసింది. ఎయిర్ ఇండియా విమానాల్లో సిక్కులు ప్రయాణించవద్దని, నవంబర్ 19వ తేదీ, ఆ తర్వాత ఆ విమానాల్లో ప్రయాణిస్తే వారి ప్రాణాలకు ముప్పు తప్పదని పన్నున్ ఒక వీడియోలో హెచ్చరించారు. ఈ వీడియో ఒక్కసారిగా వైరల్ అయింది. ఎయిర్ ఇండియా ఆపరేషన్‌ను ప్రపంచంలో ఎక్కడ నుంచి కూడా జరగనీయమని కూడా ఆయన హెచ్చరించారు. ఈ హెచ్చరికలతో కెనడా, ఇండియాతో సహా ఎయిర్ ఇండియా సర్వీసులు నడుస్తున్న ప్రపంచ దేశాల్లో భద్రతా సంస్థలను అప్రమత్తం చేసినట్టు…

Read More