Author: Editor's Desk, Tattva News

సమాజంలో వని అల్ప ఆదాయ ర్గాలకు అదనపు ఆదాయ అవకాశాలను కల్పించడంతో పాటు, స్థానిక/స్వదేశీ ఉత్పత్తులకు మార్కెట్‌ను అందించడం, వాటిని ప్రోత్సహించడానికి భారతీయ రైల్వే ప్రారంభించిన నూతన చొరవతో ‘ఒక స్టేషన్ ఒక ఉత్పత్తి’ పథకంకు దక్షిణ మధ్య రైల్వేలో విస్తృతంగా ప్రజాదరణ పొందుతుంది. తెలంగాణలోని 41 స్టాళ్ల ద్వారా 1435, ఆంధ్రప్రదేశ్‌లోని 56 స్టాళ్ల ద్వారా 1960, మహారాష్ట్రలోని 20 స్టాల్స్ నుండి 700, కర్ణాటకలోని 03 స్టాల్స్‌ నుండి 105 మంది, మొత్తం వెరసి 120 ‘ఒక స్టేషన్ ఒక ఉత్పత్తి’ స్టాల్స్ ద్వారా దాదాపు 4200 మంది ప్రత్యక్ష లబ్ధిదారులు వ్యాపార అవకాశాలను పొందుతున్నారు. స్థానిక ప్రజల నుండి అపారమైన స్పందన రావడం వలన ఇప్పుడు, 109 రైల్వే స్టేషన్లలో 120 స్టాళ్లతో ‘ఒక స్టేషన్ ఒక ఉత్పత్తి’ స్టాల్స్ నిర్వహిస్తున్నారు.  తెలంగాణలోని  సికింద్రాబాద్ , హైదరాబాద్, కాచిగూడ , వరంగల్, నిజామాబాద్ , గద్వాల్ మొదలైన 33…

Read More

పల్నాడుకు కృష్ణమ్మ జలాలు అందించబోతున్నామని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. బుధవారం ఉదయం పల్నాడు జిల్లా మాచర్ల వద్ద వరికపుడిశెల ఎత్తిపోతల పథకం పనులకు సిఎం జగన్‌ శంకుస్థాపన చేశారు. అనంతరం సిఎం జగన్‌ బహిరంగ సభలో మాట్లాడుతూ  ఎలాంటి అనుమతులు లేకుండా గత పాలకులు ప్రాజెక్టు చేపట్టారని విమర్శించారు.  ప్రస్తుతం అన్ని అనుమతులు వచ్చిన తర్వాతే ఈ ప్రాజెక్ట్‌కు శంకుస్థాపన చేశామని చెప్పారు. ఈ ప్రాజెక్టును దశలవారిగా మాచర్ల, వినుకొండ, ఎర్రగొండపాలెం వరకు తీసుకెళతామని ప్రకటించారు. ఈ ప్రాజెక్టు ద్వారా తాగు, సాగునీరు అందింబోతున్నామని తెలిపారు. పౌరుషాల పల్నాడు గడ్డను అభివృద్ధి గడ్డగా మారుస్తున్నామని స్పష్టం చేశారు.  ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలతో పాటు మహిళా సాధికారితకు కృషి చేశామని చెబుతూ  రూ.2 లక్షల 40 వేల కోట్లు అక్క చెల్లెమ్మల ఖాతాల్లోకి వెళ్లాయని, డీబీటీ నాన్‌డీబీటీ ద్వారా రూ.4 లక్షల 10వేల కోట్లు అందించామని పేర్కొన్నారు. కరోనా సమయంలోనూ…

Read More

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల వేళ రాష్ట్రంలో ఐటీ దాడులు కలకలం రేపుతున్నాయి. ఇటీవల కాంగ్రెస్ నేతల ఇళ్లే టార్గెట్‌గా దాడులు జరగ్గా.. ఈనెల 13న ఉదయం నుంచి నగరంలోని 15 చోట్ల ఏకకాలంలో ఐటీ అధికారులు సోదాలు చేపట్టారు. ఓ ఫార్మా కంపెనీ యజమాని, డైరెక్టర్‌, సిబ్బంది ఇళ్లు, కార్యాలయంలో సోదాలు నిర్వహించారు.  తెలంగాణ విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి బంధువుల ఇళ్లలో కూడా సోదాలు జరిగాయి.  గత మూడు రోజులుగా మంత్రి సబిత అనుచరుడు ప్రదీప్ రెడ్డి ఇంట్లో ఐటీ సోదాలు నిర్వహించగా.. నేటితో సోదాలు ముగిశాయి. ప్రదీప్ రెడ్డితో పాటు రెడ్డి ల్యాబ్స్ డైరెక్టర్ నరేందర్ రెడ్డి ఇంట్లోనూ సోదాలు జరిగాయి.  నరేందర్ రెడ్డి ఇంట్లో 7.50 కోట్లు, ప్రదీప్ రెడ్డి ఇంట్లో రూ.5 కోట్లకు పైగా నగదును ఐటీ అధికారులు స్వాధీనం చేసుకున్నట్లు తెలిసింది. ఈ డబ్బు మహేశ్వరం ఎన్నికల కోసం సమకూర్చుకున్నదిగా ప్రచారం జరుగుతోంది. ప్రదీప్…

Read More

రూ.850 కోట్ల విలువైన ఓ భూ కుంభకోణంతో సంబంధం ఉన్న చీఫ్ సెక్రటరీ నరేశ్ కుమార్, డివిజినల్ కమిషనర్ అశ్వినీ కుమార్‌లను తక్షణమే పదవులనుంచి తొలగించాలని ఢిల్లీ విజిలెన్స్ మంత్రి ఆతిషి ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కు మంగళవారం సిఫార్సు చేశారు. చీఫ్ సెక్రటరీ నరేశ్ కుమార్ తన కుమారుడు కరణ్ చౌహాన్‌కు సంబంధం ఉన్న ఓ కంపెనీకి అక్రమ లాభం కలిగించడం కోసం ద్వారకా ఎక్స్‌ప్రెస్ వే కోసం బమ్నో గ్రామంలో సేకరించిన భూమికి చెల్లించాల్సిన నష్టపరిహారాన్ని పెంచేశారని ఆతిషీ తన నివేదికలో ఆరోపించారు. ద్వారా ఎక్స్‌ప్రెస్ వే భూ సేకరణలో ఢిల్లీ సౌత్‌వెస్ట్ జిల్లా కలెక్టర్ హేమంత్ కుమార్, భూ యజమానులతో చీఫ్ సెక్రటరీ నరేశ్ కుమార్ కుమ్మక్కయినట్లు చోటు చేసుకున్న సంఘటనలను బట్టి చూస్తే అర్థమవుతోందని దాదాపు 670 పేజీలున్న ప్రాథమిక నివేదిక పేర్కొంది. వాస్తవంగా లబ్ధిదారులకు రూ.850 కోట్ల మేరకు నష్టపరిహారం చెల్లింపు ద్వారా లబ్ధి చేకూరినా…

Read More

నవంబర్ 17న ప్రారంభమయ్యే వార్షిక మండలం-మకరవిళక్కు పండుగతో శబరిమలలోని ప్రసిద్ధ అయ్యప్ప స్వామి ఆలయం తెరవనున్నారు. పాతానంతిట్ట జిల్లాలోని లోతైన అడవులలో ఉన్న ఈ కొండ పుణ్యక్షేత్రం, దాని ప్రాంగణం మలయాళ మాసం వృశ్చికం మొదటి రోజు శుక్రవారం నుంచి రెండు నెలల పాటు అయ్యప్ప నామస్మారణతో ప్రతిధ్వనించనుంది.  అయ్యప్ప ఆలయంలో వార్షిక పుణ్యస్నానాలు సజావుగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు రాష్ట్ర దేవస్వామ్ శాఖ మంత్రి కె.రాధాకృష్ణన్ తెలిపారు. భక్తులందరికీ సురక్షితమైన, సాఫీగా తీర్థయాత్ర జరిగేలా చర్యలు తీసుకున్నామని తెలిపారు. ఇందుకోసం అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించనున్నట్లు వివరించారు.  పండుగ సన్నాహాలను సమీక్షించడానికి ముఖ్యమంత్రి పినరయి విజయన్‌తో సహా ఆరు ఉన్నత స్థాయి సమావేశాలు జరిగాయని పేర్కొన్నారు. శబరిమల, పంబాలో పారిశుద్ధ్య పనుల్లో నిమగ్నమైన ‘విశుధి సేన’ సభ్యుల రోజువారీ వేతనం రూ.450 నుంచి రూ.550కి పెంచామని తెలిపారు. వారి ప్రయాణ భత్యాన్ని కూడా రూ.850 నుంచి రూ.1000కు పెంచామని…

Read More

గాజాలోని అల్‌ షిఫా హాస్పిటల్‌ సామూహిక సమాధిగా మారిందని మంగళవారం ఆ ఆసుపత్రి చీఫ్‌ మొహమ్మద్‌ అబు సాల్మియా ఆవేదన వ్యక్తం చేశారు. ఎంతోమందికి ప్రాణాలు పోయాల్సిన ఆసుపత్రి ఇజ్రాయెల్‌ సైన్యం దిగ్బందించడం వల్ల నేడు సమాధిగా మారిందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. చిన్నారులతో సహా దాదాపు 179 మందిని ఈ ఆసుపత్రి కాంపౌండ్‌లోనే ఖననం చేసినట్లు ఆయన తెలిపారు. వైద్య సౌకర్యాల లేమితో వందలాది మంది ప్రాణాలు కోల్పోతున్నారని ఆయన తెలిపారు. ఈ సందర్భంగా అబు సాల్మియా మాట్లాడుతూ.. ‘ఈ ఆసుపత్రిలో చనిపోయిన వారిని ఈ ఆసుపత్రి కాంపౌండ్‌లోనే సామూహికంగా ఖననం చేయాల్సి వచ్చింది. ఆసుపత్రిలో ఇంధన సరఫరా ఆగిపోవడంతో ఇంటెన్సివ్‌ కేర్‌ యూనిట్‌లోని ఏడుగురు శిశువులు, 29 మంది పెద్దలు చనిపోయారు. వారిని ఆసుపత్రిలోనే ఖననం చేశాము’ అని వివరించారు. ఇంకా మరికొన్ని మృతదేహాలు ఆసుపత్రి కాంప్లెక్స్‌లో పడి ఉన్నాయని చెబుతూ ప్రస్తుతం విద్యుత్ లేదని తెలిపారు.…

Read More

మ‌ధ్య‌ప్ర‌దేశ్‌లో కాషాయ సునామీ కాంగ్రెస్‌ను కూక‌టివేళ్ల‌తో పెకిలిస్తుంద‌ని ప్ర‌ధాని నరేంద్ర మోదీ ధీమా వ్యక్తం చేశారు. గ‌త కొద్దిరోజులుగా తాను మ‌ధ్య‌ప్ర‌దేశ్‌లోని వివిధ ప్రాంతాల ప్ర‌జ‌ల‌ను క‌లుస్తూ వారి ఆశీస్సులు కోరుతున్నాన‌ని, బీజేపీ ప‌ట్ల ప్ర‌జ‌లు విశ్వాసం క‌న‌బ‌రుస్తున్నార‌ని చెప్పారు. ఢిల్లీలో కూర్చుని లెక్క‌లు వేసుకుంటున్న వారి అంచ‌నాల‌కు అంద‌ని రీతిలో మ‌ధ్య‌ప్ర‌దేశ్‌లో బీజేపీకి ఆద‌ర‌ణ ల‌భిస్తోంద‌ని ప్రధాని భరోసా వ్యక్తం చేశారు. ష‌జాపూర్‌లో మంగ‌ళ‌వారం జ‌రిగిన ఎన్నిక‌ల ప్ర‌చార ర్యాలీని ఉద్దేశించి ప్ర‌ధాని మోదీ మాట్లాడుతూ బీజేపీ ప‌ట్ల మీరు క‌న‌బ‌రిచే ప్రేమ కొంద‌రికి నిద్రను దూరం చేస్తోంద‌ని ఎద్దేవా చేశారు. వారి ముఖాల్లో న‌వ్వులు మాయ‌మయ్యాయ‌ని, టీవీ ఇంట‌ర్వ్యూల్లో వారి మాటలు ఈ విష‌యాన్ని వెల్ల‌డిస్తున్నాయ‌ని ప్రధాని పేర్కొన్నారు. కాంగ్రెస్ ఆగ‌డాల‌తో ఆ పార్టీ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో విధ్వంసం జ‌రిగింద‌ని, కాంగ్రెస్ హ‌యాం స‌మ‌స్య‌లతో సంక్లిష్ట‌మైంద‌ని ధ్వజమెత్తారు. మ‌ధ్య‌ప్ర‌దేశ్‌ను క‌డ‌గండ్ల పాలు కాకుండా బీజేపీ కాపాడింద‌ని మోదీ…

Read More

గోదావరి- కావేరి నదుల అనుసంధానంకు తుది ముసాయిదాను సిద్ధం చేసిన కేంద్రం ఈ విషయమై వేగంగా అడుగులు వేస్తోంది. ఇటీవలనే భాగస్వామ్య రాష్ట్రాల ప్రతినిధులతో కీలక సమావేశం నిర్వహించగా ఈ నెలాఖరులో ఢిల్లీలో మరో భేటీకి ఏర్పాటుకు ఏర్పాట్లు చేస్తున్నారు. దేశంలో నదుల అనుసంధాన ప్రక్రియను పర్యవేక్షిస్తున్న జాతీయ జలవనరుల అబివృద్ధి సంస్థ (ఎన్‌ డబ్ల్యుడీఏ) తుది ముసాయిదాను సిద్ధం చేసింది. గోదావరి నుంచి కావేరికి నదీ జలాలను తరలించే అంశంలో వేర్వేరుగా అందిన భాగస్వామ్య రాష్ట్రాల ప్రతిపాదనలను పరిశీలించిన ఎన్‌డబ్ల్యుడీఏ టాస్క్‌ ఫోర్స్‌ కమిటీ ఈ మేరకు సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్‌)ను కూడా రూపొందించింది. డీపీఆర్‌ ముసాయిదాను గతంలోనే భాగస్వామ్య రాష్ట్రాల ముందుంచిన ఎన్‌డబ్ల్యూడీఏ ఈ నెలాఖరులో నిర్వహించనున్న కీలక సమావేశంలో ఏకాభిప్రాయం సాధించేందుకు ప్రయత్నిస్తోంది. ఏకాభిప్రాయం రాకున్నా ఇదే డీపీఆర్‌ను వీలైనంత తొందరలో ఆచరణలో పెట్టేందుకు అవసరమైన సాంకేతిక, న్యాయపరమైన అంశాలపై కూడా చర్చిస్తోంది. గోదావరి-కృష్ణా-పెన్నా-కావేరి అనుసంధానం…

Read More

ఏపీలో టీడీపీ కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్ కు ఏపీ సీఐడీ మంగళవారం నోటీసులు జారీ చేసింది. మంగళగిరిలోని టీడీపీ ప్రధాన కార్యాలయానికి వచ్చిన ఓ సీఐడీ కానిస్టేబుల్ కార్యాలయ కార్యదర్శి అశోక్ బాబుకు నోటీసు అందించారు. టిడిపి బ్యాంకు ఖాతాల వివరాలు అందజేయాలంటూ సీఐడీ తన నోటీసుల్లో పేర్కొంది. ఈ నెల 18 లోగా వివరాలు ఇవ్వాలని స్పష్టం చేసింది. పార్టీ ఖాతాలోకి వచ్చిన విరాళాల వివరాలు అందజేయాలని సీఐడీ తన నోటీసుల్లో తెలిపింది. స్కిల్ కేసుకు సంబంధించి పార్టీ ఖాతాలోకి వచ్చిన విరాళాలకు సంబంధించిన వివరాలు కావాలంటూ సీఐడీ నోటీసుల్లో కోరింది. స్కిల్ డెవలప్ మెంట్ కేసులో టిడిపి అధినేత చంద్రబాబు నాయుడుపై దర్యాప్తు చేస్తున్న సీఐడీ అందులో భాగంగానే టిడిపి కార్యాలయానికి కూడా నోటీసులు జారీ చేసినట్టు తెలుస్తోంది. స్కిల్ నిధులు టిడిపి ఖాతాల్లోకి మళ్లించారని సీఐడీ అనుమానిస్తోంది. వివిధ షెల్ కంపెనీల ద్వారా టిడిపి ఖాతాల్లోకి…

Read More

ఉన్నత చదువుల నిమిత్తం అమెరికాకు వెళ్తున్న భారతీయుల సంఖ్య ఏటా పెరుగుతోంది. 2022-23లో మొత్తం 2,68,923 మంది భారతీయ విద్యార్థులు అమెరికాలో అడుగుపెట్టారని, కిందటి ఏడాదితో పోల్చుకుంటే విద్యార్థుల సంఖ్య 35 శాతం పెరిగిందని ‘ఓపెన్‌ డోర్స్‌’ నివేదిక వెల్లడించింది.  ప్రస్తుతం అమెరికాలోని విద్యా సంస్థల్లో దాదాపు 10 లక్షల మందికిపైగా అంతర్జాతీయ విద్యార్థులు వివిధ కోర్సులు చదువుతున్నారు.  ఇందులో భారతీయ విద్యార్థుల సంఖ్య దాదాపు 25 శాతానికి చేరుకుంది. అమెరికాలో విద్యా అవకాశాలు, సమగ్రమైన, కచ్చితమైన, తాజా సమాచారం కోసం ఆ దేశ విదేశాంగ శాఖ 6 ఉచిత సలహా కేంద్రాల్ని భారత్‌లో ఏర్పాటుచేసింది.  ఇందులో రెండు కేంద్రాలు హైదరాబాద్‌లో ఉండటం గమనార్హం. ‘ఓపెన్‌ డోర్స్‌ రిపోర్ట్‌ డాటా’ ప్రకారం, ఈ సారి గ్రాడ్యుయేట్‌ స్టూడెంట్స్‌లో 1.65 లక్షల మందితో 62.6 శాతం పెరుగుదల నమోదైంది. గత ఏడాదితో పోల్చుకుంటే సుమారు 64 వేలమంది అధికంగా అమెరికాకు వెళ్లారు.  అలాగే,…

Read More