Author: Editor's Desk, Tattva News

తెలంగాణలో ఎన్నికల షెడ్యూల్ విడుదలై, ఎన్నికల కోడ్ అమల్లోకి రావడంతో నేతలు, ప్రజాప్రతినిధులు కోడ్‌కు లోబడి వ్యవహిరించాలి. కోడ్ ఉల్లంఘనలకు పాల్పడితే కేంద్ర ఎన్నికల సంఘం చర్యలు తీసుకుంటుంది. తాజాగా మంత్రి కేటీఆర్ ఎన్నికల కోడ్ ఉల్లంఘించారంటూ ఎన్నికల అధికారులకు ఫిర్యాదులు అందాయి.  ప్రగతి భవన్ వేదికగా ఎన్నికల ప్రవర్తన నియమావళి ఉల్లంఘనలు జరిగినట్లు హైదరాబాద్‌ జిల్లా ఎన్నికల అధికారి, జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ రొనాల్డ్‌రాస్‌ లకు ఫిర్యాదులు అందాయి.  దీంతో రిటర్నింగ్‌ అధికారిని, ప్రవర్తన నియమావళి బృందాలు, ఫ్లయింగ్‌ స్క్వాడ్‌లను పంపించి విచారణ జరిపినట్లు రొనాల్డ్ రాస్ వెల్లడించారు.  కోడ్ ఉల్లంఘనలపై మంత్రి కేటీఆర్ వివరణ కోరుతూ నోటీసులు జారీ చేసినట్లు చెప్పారు. పూర్తి విచారణ అనంతరం కేంద్ర ఎన్నికల సంఘానికి నివేదిక పంపనున్నట్లు ఆయన తెలిపారు. ప్రభుత్వ బంగ్లాలు, అతిథి గృహాల నుంచి ఎన్నికల ప్రచారం చేయకూడదని ఎన్నికల సంఘం చెప్పిందని ఎన్నికల అధికారి గుర్తుచేశారు. మంగళవారం జీహెచ్‌ఎంసీ ప్రధాన…

Read More

ప్రధాని నరేంద్ర మోదీ మంగళవారం “మేరా యువభారత్ ” “మై భారత్‌” పోర్టల్‌ను ప్రారంభించారు. 21వ శతాబ్దం జాతి పునర్నిర్మాణంలో ఈ వేదిక కీలక పాత్ర పోషించగలదని పేర్కొన్నారు. మేరా మాటీ మోరా దేశ్ అమృత్ కలశ్ యాత్ర ముగింపు కార్యక్రమంలో భాగంగా మేరా యువ భారత్ పోర్టల్‌ను ఆయన ప్రారంభించారు. ఢిల్లీ లోని కర్తవ్య పథ్‌లో మేరీ మాతీ మేరా దేశ్ అమృత కలశ్ యాత్ర ముగింపు యాత్రలో ప్రధాని మోదీ పాల్గొన్నారు. దేశం నలుమూలల నుంచి సేకరించిన మట్టిని ప్రధాని మోడీ భారత్ కలశ్‌లో ఉంచారు. కలశ్ లోని మట్టిని ఆయన తన నుదుట తిలకంగా దిద్దుకున్నారు. దేశం నలుమూలల నుంచి వచ్చిన మట్టితో ఇండియా గేట్ సమీపాన అమృత్ మహోత్సవ్ స్మారక్ అమృత్ వాటిక నిర్మాణం కానుంది. రానున్న తరాలు ఈ ఈ స్మారక ఉద్యానవనం ద్వారా ఈ చారిత్రక సంఘటనను గుర్తు చేసుకుంటారని పేర్కొన్నారు. దేశ…

Read More

బీజేపీ బీసీ సీఎం ప్రకటన సువర్ణావకాశమని, దానిని తెలంగాణ ప్రజలు  జారవిడుచుకోవద్దని ఆ పార్టీ రాజ్యసభ సభ్యులు, ఓబిసి మోర్చా అధ్యక్షుడు  కె.లక్ష్మణ్ పిలుపిచ్చారు. బీసీ నేతను ముఖ్యమంత్రి చేస్తానన్న బీజేపీ గురించి ఆలోచించాలని లక్ష్మణ్ ప్రజలను కోరారు. సామాజిక దృక్పథం లేకుండా బీఆర్ఎస్, కాంగ్రెస్ పరిపాలన అందించాయన్న ఆయన, బీఆర్ఎస్‌కు అవకాశం ఇస్తే కేసీఆర్ తర్వాత కేటీఆర్, ఆ తర్వాత హిమాన్షురావు ఇలా ఆ ఒక్క కుటుంబం నుంచే ముఖ్యమంత్రులు అవుతారని ఎద్దేవా చేశారు. బీజేపీలో అనేక మంది బీసీలు ఉన్నారని, సమర్థవంతమైన నాయకత్వం ఉందని చెప్పుకొచ్చారు. ఇచ్చిన మాట నిలబెట్టుకునే చరిత్ర బీజేపీకి, మోదీకి ఉందని ధీమా వ్యక్తం చేశారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల పాలన చూసిన తెలంగాణ ప్రజలు బీజేపీకి అవకాశం ఇవ్వాలని లక్ష్మణ్ అభ్యర్థించారు. బీజేపీ సెంట్రల్ ఎలక్షన్ కమిటీ సమావేశమై తెలంగాణలో మిగతా స్థానాల అభ్యర్థులపై కసరత్తు చేస్తుందని తెలిపారు. బీఆర్ఎస్ అభ్యర్థి కొత్త ప్రభాకర్…

Read More

చైనా దేశానికి చెందిన అలీబాబా, బైడు కంపెనీలు తమ ఆన్‌లైన్‌ డిజిటల్‌ మ్యాప్స్‌లో మార్పులు చేసి కొత్తగా ప్రచురించాయి. అయితే, ఇలా కొత్తగా అందుబాటులోకి తెచ్చిన మ్యాప్స్‌లో ఇజ్రాయెల్‌ పేరును ప్రచురించకపోవడం చర్చనీయాంశమైంది. నూతన మ్యాప్‌లలో ఇజ్రాయెల్‌ దేశపు అంతర్జాతీయ సరిహద్దులు, పాలస్తీనా భూభాగాలను సూచించిన చైనా కంపెనీలు ఇజ్రాయెల్‌ పటంపై ఆ దేశం పేరును ప్రచురించలేదు. లగ్జెంబర్గ్‌ లాంటి చిన్నచిన్న దేశాల పేర్లను కూడా స్పష్టంగా ప్రచురించిన చైనా కంపెనీలు ఇజ్రాయెల్‌ పేరును మాత్రం ప్రచురించలేదు. ఇజ్రాయెల్‌ పేరును ప్రస్తావించకుండా అంతర్జాతీయ సరిహద్దులతో ఆ ప్రదేశాన్ని ఖాళీగా చూపించాయి. ఇజ్రాయెల్‌ పేరు లేని ఈ డిజిటల్‌ మ్యాప్‌లకు సంబంధించిన ఫొటోలు ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. ఈ విషయాన్ని తొలుత అమెరికాకు చెందిన ‘వాల్‌ స్ట్రీట్‌ జర్నల్’ బయటపెట్టగా.. ఆ తర్వాత పలు అంతర్జాతీయ మీడియా సంస్థలు ప్రచురించాయి. అయితే డిజిటల్‌ మ్యాప్స్‌లో ఇజ్రాయెల్‌ పేరును తీసేయడానికి గల…

Read More

టీడీపీ అధినేత చంద్రబాబుకు ఏపీ హైకోర్టులో ఊరట లభించింది. స్కిల్ డెవలెప్‌మెంట్ కేసులో కోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. నవంబర్ 24 వరకు మధ్యంతర బెయిల్ మంజూరు చేస్తూ న్యాయమూర్తి జస్టిస్‌ తల్లాప్రగడ మల్లికార్జునరావు తీర్పును వెల్లడించారు. చంద్రబాబు ఆరోగ్యపరమైన సమస్యల ఉన్నాయని, కంటి ఆపరేషన్ చేయాల్సి ఉందని, ఇతర సమస్యలు వెంటాడుతున్నాయని సుప్రీం కోర్టు సీనియర్ లాయర్ సిద్ధార్థ్ లూథ్రా వాదనలు వినిపించారు. బాబుకు మధ్యంతర బెయిల్ మంజూరు చేయాలని కోరారు. చంద్రబాబుకు ఆరోగ్యపరంగా ఎలాంటి ఇబ్బంది లేదని, కంటి ఆపరేషన్ ఇప్పుడు అవసరం లేదని, బెయిల్ ఇవ్వొద్దని సాక్ష్యాలను తారుమారు చేసే అవకాశం ఉందని సీఐడీ తరఫు లాయర్లు వాదించారు. ఇరువురి వాదనలు విన్న న్యాయమూర్తి జస్టిస్ మల్లికార్జునరావు తీర్పునున వెల్లడించారు. డెవలప్‌మెంట్‌ కేసులో సెప్టెంబర్ 9న నంద్యాలలో సీఐడీ అధికారులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. 10వ తేదీ ఉదయం ఏసీబీ కోర్టులో పోలీసులు హాజరుపరిచారు.…

Read More

భారత దిగ్గజ వ్యాపార వేత్త, ఆసియాలోనే అత్యంత కుబేరుడు, రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ అధినేత ముకేశ్‌ అంబానీకి మరోసారి బెదిరింపు మెయిల్‌ వచ్చింది. ఈ సారి ఏకంగా రూ.400 కోట్లు ఇవ్వాలని దుండగులు డిమాండ్‌ చేశారు. లేదంటే చంపేస్తామంటూ బెదిరించారు. సోమవారం ఉదయం ఈ మెయిల్‌ వచ్చినట్లు అధికారులు వెల్లడించారు. నాలుగు రోజుల్లో ఇది మూడో బెదిరింపు మెయిల్‌ కావడం గమనార్హం. అక్టోబర్ 27, 28 తేదీల్లో కూడా అంబానీకి బెదిరింపు మెయిల్స్‌ వచ్చినట్లు తెలిసిందే. ముందుగా 27వ తేదీన రూ.20 కోట్లు డిమాండ్‌ చేసిన దుండగులు ఆ తర్వాతి రోజు దాని రేటును రూ.200 కోట్లకు పెంచేశారు.  ఇప్పుడు దాన్ని డబుల్‌ చేసి రూ.400 కోట్లు ఇవ్వాలంటూ డిమాండ్‌ చేశారు. ఈ మూడు బెదిరింపులు ఒకే ఈ మెయిల్‌ ఐడీ నుంచి వచ్చినట్లు ముంబై పోలీసులు తెలిపారు. మెయిల్‌ పంపిన వ్యక్తిని షాదాబ్‌ ఖాన్‌గా గుర్తించినట్లు వెల్లడించారు. బెల్జియం నుంచి ఈ మెయిల్స్…

Read More

తెలంగాణ తెలుగుదేశం పార్టీ అధ్యక్ష పదవికి ఆ కాసాని జ్ఞానేశ్వర్ రాజీనామా చేశారు. పార్టీకి, అధ్యక్ష పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయవద్దని అధిష్టానం నిర్ణయించినందు వల్లే రాజీనామా చేస్తున్నట్లు స్పష్టం చేశారు.తన రాజీనామా లేఖను తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుకు పంపించినట్లు కాసాని జ్ఞానేశ్వర్ తెలిపారు. త్వరలోనే తన భవిష్యత్ కార్యాచరణను ప్రకటిస్తానని ఆయన చెప్పారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు కాసాని సుముఖంగా ఉండగా.. టీడీపీ అగ్ర నాయకత్వం మాత్రం అందుకు అంగీకరించకపోవడంతో అసంతృప్తికి గురయ్యారు. ఈ నేపథ్యంలోనే ఆ పార్టీకి కాసాని రాజీనామా చేశారు.  ముందు ఎన్నికల్లో పోటీ చేయాలని నిర్ణయించి, అభ్యర్థుల జాబితా కూడా సిద్ధం చేసిన తర్వాత ఎన్నికల్లో పోటీ చేయకూడదని అధిష్టానం నిర్ణయించడం కాసానికి తీవ్ర నిరాశకు గురిచేసింది. మరోవైపు, తెలంగాణ టీడీపీ నేతలు, కార్యకర్తలు కూడా అగ్ర నాయకత్వం నిర్ణయంపై అసంతృప్తి గుర్రుగా…

Read More

ఏపీ మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ చీఫ్ నారా చంద్రబాబు నాయుడిపై మరో కేసు నమోదైంది. ప్రస్తుతం స్కిల్‌ స్కాం కేసులో అరెస్టై గత 48రోజులుగా రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉన్న చంద్రబాబుపై సీఐడీ అధికారులు మరో కేసు నమోదు చేశారు. చంద్రబాబు సీఎంగా ఉన్న సమయంలో మద్యం కంపెనీలకు అక్రమంగా అనుమతులు ఇచ్చారనే అరోపణల నేపథ్యంలో సీఐడీ ఈ కేసు నమోదు చేసినట్లుగా వెల్లడించింది. పిసి యాక్ట్ కింద చంద్రబాబుపై కేసు నమోదు చేయడం జరిగింది. ఈకేసులో నారా చంద్రబాబునాయుడుని ఎ3గా చేర్చారు సిఐడి అధికారులు. చంద్రబాబు కేసు నమోదు చేసిన అంశాన్ని ఏసీబీ కోర్టుకు తెలిపారు సిఐడి అధికారులు. ఏసిబి కోర్టులో ఈ కేసుకు సంబంధించి విచారణ జరపాలని సిఐడి అధికారులు పిటిషన్ దాఖలు చేశారు. విచారణ జరిపేందుకు పిటిషన్‌ను అనుమతించింది ఏసీబీ కోర్టు. స్కిల్‌ స్కాం కేసులో బెయిల్‌ కోసం ప్రయత్నిస్తున్న చంద్రబాబుపై ఇప్పటికే ఇన్‌రింగ్‌ రోడ్డు, ఫైబర్…

Read More

సిద్దిపేట జిల్లా దౌల్తాబాద్ మండలం సూరంపల్లి గ్రామంలో ఎన్నికల ప్రచారంలో ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డిపై కత్తితో దాడి జరిగింది. చెప్పాలా గ్రామానికి చెందిన రాజు అనే యువకుడు కత్తితో దాడి చేసినట్లు పోలీసులు గుర్తించారు. ఈ ఘటనలో ఎంపీ ప్రభాకర్ రెడ్డికి గాయాలు కాగా ఆస్పత్రికి తరలించారు. నిందితుని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. ఎంపీ ప్రభాకర్ రెడ్డికి మెరుగైన వైద్యం కోసం గజ్వేల్ ఆసుపత్రి నుంచి అంబులెన్స్ లో సికింద్రాబాద్ యశోద కు తరలిస్తున్నారు. ఈ ఘటన విషయం తెలుసుకున్న మంత్రి హరీశ్ వెంటనే హైదరాబాద్ కు బయల్దేరారు. ఫోన్ లో ప్రభాకర్ రెడ్డి ఆరోగ్యంపై ఆరా తీశారు. ఈ ఘటనకు గల పూర్తి కారణాలు తెలియాల్సి ఉంది. మరోవైపు దాడి చేసిన వ్యక్తిపై బీఆర్ఎస్ కార్యకర్తలు దాడికి దిగటంతో గాయపడ్డాడు.ప్రస్తుతం మెదక్ ఎంపీగా ఉన్న ప్రభాకర్ రెడ్డి వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో దుబ్బాక నుంచి ఎమ్మెల్యేగా అభ్యర్థిగా బరిలో ఉన్నారు. ఇప్పటికే…

Read More

మద్యం కుంభకోణం కేసుల్లో అరెస్టయిన ఢిల్లీ మాజీ ఉపముఖ్యమంత్రి ఆప్ నేత మనీశ్ సిసోడియాకు సుప్రీం కోర్టులో మరోసారి ఎదురుదెబ్బ తగిలింది. ఈ కేసుల్లో ఆయన దాఖలు చేసిన బెయిల్ పిటిషన్లను అత్యున్నత న్యాయస్థానం తిరస్కరించింది. ఈ కేసులో నగదు లావాదేవీలు జరిగినట్టు కొన్ని ఆధారాలున్నాయని దర్యాప్తు సంస్థ చూపించిందని సుప్రీం కోర్టు తెలియజేసింది. రూ.338 కోట్ల నగదు బదిలీకి సంబంధించి ఇప్పటికే విచారణ ప్రారంభమైనందున ఈ దశలో బెయిల్ ఇవ్వడం కుదరదని కోర్టు స్పష్టం చేసింది. అయితే ఈ కేసు విచారణను 68 నెలల్లో పూర్తి చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించింది. ఒకవేళ విచారణ నిదానంగా సాగితే … సిసోడియాకు మూడు నెలల్లోపు మళ్లీ బెయిల్‌కు దరఖాస్తు చేసుకోవచ్చని సూచించింది. మరోవంక, ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీపార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్‌కు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ సోమవారం సమన్లు వెలువరించింది. గురువారం (నవంబర్ 2 వ తేదీ)…

Read More