ఈసారి ఎలాగైనా సరే హ్యాట్రిక్ కొట్టాలని బీఆర్ఎస్, ఎట్టి పరిస్థితుల్లో సీఎం కేసీఆర్‌ను మూడోసారి ముఖ్యమంత్రిని కానివ్వకూడదని కాంగ్రెస్, బీజేపీ పార్టీలు విశ్వ ప్రయత్నం చేస్తున్నాయి. ఈ క్రమంలో పలు ప్రముఖ సంస్థలు రిలీజ్ చేస్తున్న ఎన్నికల సర్వేలతో ఎక్కువగా తెలంగాణలో కాంగ్రెస్‌దే అధికారమని తేల్చేశాయి. అయితే, తాజాగా మరో ప్రముఖ సంస్ ఇండియా టుడే-సీఓటర్ విడుదల చేసిన సర్వేలో హ్యాంగ్ అసెంబ్లీ తప్పక పోవచ్చని తెలుస్తున్నది. ఒక విధంగా బిజెపి సహితం హ్యాంగ్ అసెంబ్లీ కోరుకొంటున్నది. అదే జరిగితే ప్రభుత్వం ఏర్పాటులో తాము కీలక పాత్ర వహించవచ్చని ఎదురు చూస్తున్నది. ఇండియా టుడే- సీ ఓటర్ సర్వేను నిశితంగా పరిశీలిస్తే.. కాంగ్రెస్-బీఆర్‌ఎస్ మధ్య నువ్వా- నేనా అన్నట్లుగా పోటీ ఉందని స్పష్టంగా అర్థం అవుతోంది. అంతేకాదు కేసీఆర్ పాలనా వైఫల్యాలను సైతం సీఓటర్ సర్వే నిశితంగా చర్చించి.. వివరించింది కూడా. కాంగ్రెస్ అతిపెద్ద పార్టీగా ఆవిర్భవిస్తుందని చెబుతున్నా ప్రభుత్వం ఏర్పాటుకు…
Author: Editor's Desk, Tattva News
‘ది కాశ్మీర్ ఫైల్స్’ సినిమాతో ఒక్కసారిగా దేశ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న బాలీవుడ్ దర్శకుడు వివేక్ అగ్నిహోత్రి ఇటీవల ‘ది వ్యాక్సిన్ వార్’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ‘ది కాశ్మీర్ ఫైల్స్’ సినిమా ఎంత పెద్ద విజయాన్ని అందుకుందో.. ‘ది వ్యాక్సిన్ వార్’ అంత పెద్ద డిజాస్టర్ అయ్యింది. అంత పెద్ద డిజాస్టర్ తర్వాత ఇప్పుడు భారీ ప్రాజెక్ట్‌ను ప్రకటించారు అగ్నిహోత్రి. ఎస్.ఎల్. భ్యారప్ప రచించిన కన్నడ నవల ‘పర్వ: యాన్ ఎపిక్ టేల్ ఆఫ్ ధర్మ’ ఆధారంగా మూడు భాగాలుగా ఈ సినిమా తెరకెక్కనుంది. ఈ మూడు భాగాల ద్వారా మహాభారతాన్ని దేశ ప్రజలకు చెప్పనున్నారు వివేక్ అగ్నిహోత్రి. ‘పర్వ: యాన్ ఎపిక్ టేల్ ఆఫ్ ధర్మ’ సినిమాను వివేక్ అగ్నిహోత్రి సోషల్ మీడియా ద్వారా ప్రకటించారు. ‘భారీ ప్రకటన: మహాభారతం చరిత్రా, ఇతిహాసమా? పద్మభూషణ్ డాక్టర్ ఎస్.ఎల్. భ్యారప్ప రచించిన మోడరన్ క్లాసిక్ పర్వ – యాన్…
తెలంగాణాలో రాజకీయంగా కలకలం రేపుతున్న ప్రవళిక ఆత్మహత్య కేసులో అరెస్టైన శివరాం రాథోడ్‌కు నాంపల్లి కోర్టు శనివారం బెయిల్ మంజూరు చేసింది. శివరాం రాథోడ్ కోర్టులో బెయిల్ పిటీషన్ వేయగా, కేసులో ఎలాంటి ఆధారాలు లేవని బెయిల్ మంజూరు చేసింది. పోలీసులు శివరాంకు వ్యతిరేకంగా ఎలాంటి ఆధారాలు చూపించలేదని కోర్టు పేర్కొంది. వరంగల్ జిల్లా, బిక్కాజిపల్లికి చెందిన మర్రి ప్రవళిక నగరంలోని అశోక్‌నగర్‌లోని హాస్టల్‌లో ఉంటూ పోటీపరీక్షలకు సిద్దమవుతోంది. ఈ క్రమంలోనే ప్రవళిక హాస్టల్‌గదిలో ఫ్యాన్‌కు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. పోటీపరీక్షలు వరుసగా వాయిదా పడడంతో ప్రవళిక ఆత్మహత్య చేసుకుందని విద్యార్థులు, విద్యార్థి సంఘాలు ఈ నెల 13వ తేదీన అశోక్‌నగర్ చౌరస్తాలో భారీ ఎత్తున ధర్నా చేశారు. ప్రవళికకు న్యాయం జరిగే వరకు మృతదేహాన్ని తరలించమని రోడ్డుపై బైఠాయించారు. ఈ క్రమంలోనే సెంట్రల్ జోన్ డిసిపి వెంకటేశ్వర్లు విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి ప్రవళిక ఆత్మహత్యకు ప్రేమ వ్యవహారమే కారణమని…
పాకిస్థాన్ ముస్లింలీగ్ (ఎన్) అధ్యక్షుడు, పాక్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ నాలుగేళ్ల తర్వాత తొలిసారిగా స్వదేశీ గడ్డపై అడుగుపెట్టారు. వివిధ కేసుల్లో కోర్టు విచారణలు ఎదుర్కొంటున్న షరీఫ్ గత నాలుగేళ్లుగా లండన్‌లో ఉంటున్నారు. తాజాగా కుటుంబ సభ్యులు, పార్టీ సీనియర్ నేతలతో లండన్ నుంచి సౌదీ అరేబియా మీదుగా దుబాయ్ చేరుకున్న షరీఫ్ అక్కడి నుంచి ప్రత్యేక ఛార్టెడ్ విమానంలో శనివారం పాకిస్థాన్‌కు చేరుకున్నారు. ఇస్లామాబాద్ చేరుకున్న ఆయనకు పార్టీ నాయకులు, కార్యకర్తలు స్వాగతం పలికారు. మరోవైపు పాక్ సైన్యంతో లోపాయికారీగా రాజీ పడటం వల్లనే నవాజ్ స్వదేశానికి వచ్చినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. కోర్టు కేసులు ఎదుర్కొంటున్న నవాజ్ కోసం న్యాయపరంగా, రాజకీయపరంగా పలు సవాళ్లు ఇక్కడ కాచుకు కూర్చున్నాయి. ఏవెన్ ఫీల్డ్, అల్ అజీజియా అవినీతి కేసుల్లో ఆయనకు ఈ నెల 24 వరకు ఇస్లామాబాద్ హైకోర్టు ముందస్తు బెయిలు ఇచ్చింది. తోషాఖానా, వాహనాల కేసులో ఆయనపై అరెస్టు…
ప్రతిష్ఠాత్మక మానవసహిత అంతరిక్ష మిషన్ గగన్‌యాన్‌లో వినియోగించే ఫ్లైట్ టెస్ట్ వెహికల్ అబార్ట్ మిషన్-1 వాహకనౌక తొలి పరీక్షను శనివారం ఇస్రో విజయవంతంగా నిర్వహించింది. ఈ టెస్ట్ ఫ్లైట్ ద్వారా గగన్‌యాన్ మిషన్‌లో భాగంగా ‘క్రూ ఎస్కేప్ సిస్టమ్’ పనితీరును పరీక్షించింది. షెడ్యూల్ ప్రకారం ఈ పరీక్ష రెండు గంటల ఆలస్యంగా చేపట్టింది. తొలుత ఉదయం 8 గంటలకు నిర్వహించాల్సి ఉండగా… వాతావరణం అనుకూలించకపోవడంతో 8.30 గంటలకు వాయిదా వేసింది. అనంతరం పరీక్ష సిద్ధమవుతుండగా చివరి నిమిషంలో సాంకేతికలోపం తలెత్తింది. దీంతో ప్రయోగాన్ని నిలిపివేసిన శాస్త్రవేత్తలు లోపాన్ని గుర్తించారు. అనంతరం దానిని సరిచేసి మళ్లీ 10 గంటలకు ప్రయోగాన్ని చేపట్టారు. శ్రీహరికోటలోని సతీశ్ ధావన్ స్పేస్ నుంచి నుంచి సింగిల్ స్టేజ్ లిక్విడ్ రాకెట్ నింగిలోకి దూసుకెళ్లింది. అనంతరం 17 కిలోమీటర్లు ఎత్తుకు చేరిన తర్వాత.. అందులోని క్రూ మాడ్యూల్ వ్యవస్ధ వేరుపడింది. క్రూ మాడ్యూల్, క్రూ ఎస్కేప్ సిస్టమ్ రాకెట్…
తెలంగాణ రాష్ట్రంలో జరిగిన అన్ని కుంభకోణాల్లో ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు హస్తం ఉన్నదని కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ ఆరోపించారు. సిద్ధిపేట జిల్లా దుబ్బాక పట్టణంలో బీజేపీ ఎమ్మెల్యే ఎం రఘునందన్ రావు ఆధ్వర్యంలో నిర్వహించిన నారీ శక్తి వందన్ మహిళా సమ్మేళనంలో ముఖ్య అతిథిగా పాల్గొంటూ కాళేశ్వరం ప్రాజెక్ట్ బడ్జెట్ మొట్టమొదట 40,000 కోట్లు అని చెప్పి తరవాత దానిని రూ. లక్ష కోట్లకు పెంచారని గుర్తు చేశారు. మిగులు బడ్జెట్ తో ఏర్పాటైన తెలంగాణ రాష్ట్రం అప్పులు చేసి తన కుటుంబానికి ఖర్చు పెట్టుకుంటున్నారు తప్ప ప్రజలకు చేసింది ఏమీ లేదని అంటూ ఆమె ఆరోపణలు గుప్పించారు. తన స్వార్థం కోసం తెలంగాణ యువతను వంచించిన ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం అని పేర్కొంటూ తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో నీళ్లు, నిధులు, నియామకాలు కావాలని అందరం కలిసి కొట్లాడినం అని ఆమె తెలిపారు. కానీ, తెలంగాణ ప్రభుత్వం నియామకాలు జరపడంలో…
ఇంద్రకీలాద్రిపై కొలువైన శ్రీ కనకదుర్గ అమ్మవారిని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి శుక్రవారం దర్శించుకున్నారు. దుర్గమ్మ సన్నిధికి చేరుకున్న సీఎం వైయస్ జగన్‌కు ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. శరన్నవరాత్రుల ఉత్సవాలను పురస్కరించుకొని మూలా నక్షత్రం (అమ్మవారి జన్మనక్షత్రం) రోజున సరస్వతీదేవి అలంకరణలో ఉన్న కనకదుర్గమ్మను ముఖ్యమంత్రి జగన్ దర్శించుకొని, అమ్మవారికి రాష్ట్ర ప్రభుత్వం తరుఫున పట్టువస్త్రాలు, పసుపు, కుంకుమలను సమర్పించి ప్రత్యేక పూజలు చేశారు. కనకదుర్గ అమ్మవారికి ముఖ్యమంత్రి జగన్ అంతరాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ చిన్న రాజగోపురం వద్ద సీఎం జగన్‌కు అర్చకులు పరివేష్టం చుట్టారు. అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించిన అనంతరం దుర్గగుడి అభివృద్ధిపై అధికారులు, ప్రజాప్రతినిధులతో చర్చించారు. సరస్వతీదేవిని దర్శించుకున్న సీఎంకు ఆలయ వేద పండితులు వేదమంత్రాలతో ఆశీర్వచనం అందించారు. అమ్మవారి ప్రసాదం, చిత్రపటాన్నిసీఎంకు దేవాదాయశాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ అందజేశారు. శుక్రవారం అమ్మవారి జన్మనక్షత్రం మూలా నక్షత్రం కావడంతో సరస్వతీ దేవి…
హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్‌సీఏ) అధ్యక్షుడిగా అర్శనపల్లి జగన్ మోహన్ రావు ఎన్నికయ్యారు. శుక్రవారం జరిగిన అసోసియేషన్ ఎన్నికల్లో యునైటెడ్ మెంబర్స్ ఆఫ్ హెచ్‌సీఏ ప్యానెల్ నుంచి పోటీ చేసిన జగన్ మోహన్ రావు ఒక్క ఓటు మెజార్టీతో ప్రెసిడెంట్ పదవిని సొంతం చేసుకున్నారు. జగన్ మోహన్ రావుకు మొత్తం 63 ఓట్లు రాగా, ఆయన సమీప అభ్యర్థి అమర్నాథ్‌కు 62 ఓట్లు వచ్చాయి. బీసీసీఐ మాజీ ప్రెసిడెంట్, మాజీ క్రికెటర్ శివలాల్ యాదవ్, అర్షద్ ఆయుబ్ మద్దతుతో బరిలోకి దిగిన క్రికెట్ ఫస్ట్ ప్యానెల్ నుంచి అమర్నాథ్ అధ్యక్షునిగా పోటీ చేశారు. జగన్ మోహన్ రావు ప్యానెల్‌కు అధికార బీఆర్ఎస్ పార్టీ మద్దతు ఇచ్చింది. బీజేపీ నేత, హెచ్‌సీఏ మాజీ అధ్యక్షుడు వివేక్ వెంకటస్వామి మద్దతుతో గుడ్ గవర్నెన్స్ ప్యానెల్ నుంచి పోటీలో నిలిచిన అనిల్ కుమార్‌కు 30 ఓట్లు రాగా, ఆనెస్ట్ హార్డ్ వర్కింగ్ హెసీఏ ప్యానెల్ నుంచి…
మునుగోడు ఉప ఎన్నికలో కారును పోలిన గుర్తులతో నష్టపోయామని, కాబట్టి కారును పోలిన చపాతీ రోలర్, రోడ్డు రోలర్ తదితర గుర్తులను తొలగించాలంటూ బిఆర్‌ఎస్ వేసిన పిటిషన్ ను సుప్రీం కోర్టు కొట్టివేసింది. ఓటర్లకు అన్నీ తెలుసునని ధర్మాసనం స్పష్టం చేసింది. హైకోర్టు తీర్పు తర్వాత దాదాపు 240 రోజుల తర్వాత సుప్రీం కోర్టుకు రావడం ఏంటని ధర్మాసనం ప్రశ్నించింది. అధికార పార్టీగా ఉన్న మీకు ఈ విషయం తెలియదా? అని బిఆర్‌ఎస్ పార్టీ తరపు న్యాయవాదులపై సుప్రీం కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. పిటిషన్‌ను విచారణకు చేపట్టడం సాధ్యం కాదని ధర్మాసనం తేల్చి చెప్పింది. కావాలంటే హైకోర్టుకు వెళ్లచ్చని, అయితే మెరిట్స్ ఆధారంగానే అక్కడ విచారణ ఉంటుందని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది. భారతీయ ఓటర్లు రాజకీయ నిరక్షరాస్యులు కాదని ధర్మాసనం తెలిపింది. వాళ్లకు కారు, చపాతి, రోలర్, రోడ్డు రోలర్ కు తేడా తెలియదు అనుకుంటున్నారా ? అని…
ఖలీస్థానీల వివాదం రగులుతున్న దశలో కెనడా శుక్రవారం భారతదేశం నుంచి తమ దేశానికి చెందిన 41 మంది దౌత్యవేత్తలను , వారి కుటుంబ సభ్యులతో సహా ఉపసంహరించుకుంది. ఖలీస్థానీ నేత నిజ్జర్ హత్యోదంతం ఇరుదేశాల నడుమ దౌత్య స్థాయి వివాదానికి దారితీసింది. భారత్ లోని తమ దౌత్యవేత్తలకు శుక్రవారం నుంచి భద్రతాపరమైన రక్షణను ఎత్తివేస్తున్నట్లు ప్రకటించినందున తమ దౌత్యవేత్తలను వెనకకు రప్పిస్తున్నట్లు కెనడా విదేశాంగ మంత్రి మెలానీ జోలీ టొరంటోలో ప్రకటించారు. దౌత్యవేత్తలకు రక్షణ ఉపసంహరణ అనుచిత చర్య, అంతర్జాతీయ చట్టాలకు ఇది విఘాతం అంటూ ఆమె అసహనం వ్యక్తం చేయసారు. అయితే భారత్‌లాగానే తాము స్పందించాలనుకోవడం లేదని, తప్పనిసరిగా తమ దౌత్యవేత్తలను ఉపసంహరించుకుంటున్నామని విదేశాంగ మంత్రి తెలిపారు. తమకు అందిన సమాచారం ప్రకారం కెనడా దౌత్యవేత్తలను భారత్ నుంచి తిప్పిపంపించేందుకు లేదా వారికి ఉన్న రక్షణను తీసివేసేందుకు చర్యలు చేపట్టినట్లు తెలిసిందని ఆమె వివరించారు. శుక్రవారంతో వీరిపై వేటుపడుతుందని, లేదా…