Author: Editor's Desk, Tattva News

శ్రీకృష్ణ భగవానుడి భగవద్గీత బోధన అనుసారం చెరువులను కాపాడేందుకు అక్రమ నిర్మాణాలు కూలగొడుతున్నామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. తమపై ఎంత ఒత్తిడి ఉన్నా వెనక్కి తగ్గకుండా ముందుకు సాగుతున్నామని చెప్పారు. హైదరాబాద్ మహానగరంలో చెరువులను చెరబట్టిన వారిపై ఉక్కుపాదం మోపుతున్నామని వెల్లడించారుయ కోకాపేట్​ అక్షయ పాత్ర ఫౌండేషన్​ సమీపంలో హరే కృష్ణ హెరిటేజ్​ టవర్ ఆధ్వర్యంలో అనంత శేష స్థాపన ఉత్సవంలో ఆయన పాల్గొని మాట్లాడారు. చెరువులు మనవాళికి జీవనాధారమన్న రేవంత్ రెడ్డి, కొందరు శ్రీమంతులు వాటిలో ఫామ్​హౌజ్​లు నిర్మించారని అసహనం వ్యక్తం చేశారు. అక్రమార్కుల నుంచి చెరువులను విముక్తి చేస్తామని స్పష్టం చేశారు. హైదరాబాద్​ను రక్షించుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని చెప్పారు. ప్రభుత్వంలో ఉన్న వ్యక్తులు అక్రమ నిర్మాణాలు చేసినా కూల్చివేస్తామని స్పష్టం చేశారు. అక్రమ నిర్మాణాలు చేసిన వ్యక్తులు ప్రభుత్వాన్ని ప్రభావితం చేసిన స్థాయిలో ఉండొచ్చని చెప్పారు. ప్రకృతి సంపదను విధ్వంసం చేస్తే అది మనమీద కక్ష…

Read More

భారత ప్రధాని నరేంద్ర మోదీకి పాకిస్థాన్ నుంచి ఆహ్వానం అందింది. అక్టోబర్‌లో కౌన్సిల్ ఆఫ్ హెడ్స్ ఆఫ్ గవర్నమెంట్ (సిహెచ్‌జి) సదస్సు పాకిస్థాన్‌లో జరుగుతుంది. ఈ సంస్థ కీలక భేటీకి పాకిస్థాన్ ఆతిధ్యం ఇస్తోంది. దీనికి హాజరుకావాలని మోడీకి పాకిస్థాన్ ప్రభుత్వం నుంచి ఇప్పటికే అధికారిక ఆహ్వానం అందింది. మోదీతో పాటు షాంఘై సహకార సంస్థ (ఎస్‌సిఒ) కు చెందిన ఇతర నేతలను కూడా పాకిస్థాన్ రమ్మని కోరింది. పూర్తిగా చైనా ప్రాబల్యంతో ఉండటం, భారత్ ప్రయోజనాలకు వ్యతిరేకంగా చైనా పాకిస్థాన్ మీదుగా రోడ్ బెల్ట్ నిర్మాణానికి సంకల్పించడం , ఈ నేపథ్యంలో భారతదేశపు అత్యంత వ్యూహాత్మక రక్షణ స్థావరాలకు పరోక్ష ముప్పు వాటిల్లుతుందని ఆందోళన వ్యక్తం అవుతోంది, అంతేకాకుండా జమ్మూ కశ్మీర్‌లో ఇటీవలి కాలంలో పెద్ద ఎత్తున ఉగ్రవాదులను పంపించడం, ఐరాస ఇతర వేదికల్లో ఆర్టికల్ 370 ప్రస్తావన, ఇప్పటికీ జమ్మూ కశ్మీర్ విషయాన్ని వివాదాస్పదంగా చిత్రీకరించడం జరుగుతోందని భారతదేశం…

Read More

ఆఫ్ఘనిస్తాన్‌లోని ఐక్యరాజ్యసమితి సహాయ మిషన్ (యునామ) ఆదివారం తాలిబాన్లు ఆఫ్ఘనిస్తాన్‌లో అమలుచేయబోతున్న కఠినమైన నైతిక చట్టంపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. యునామ సెక్రటరీ జనరల్ తాలూకు ప్రత్యేక ప్రతినిధి అయిన రోజా ఒటున్‌బయేవా, 35 ఆర్టికల్స్ కలిగి ఉన్న “ధర్మాన్ని ప్రోత్సహించడం, చెడు నివారించే చట్టం” ఆప్ఘనిస్థాన్ భవిష్యత్తుకు బాధ కలిగించే విషయం అని పేర్కొన్నారు. విస్తృతమైన, కొన్నిసార్లు అస్పష్టమైన ఉల్లంఘనల జాబితాల కింద ఎవరినైనా బెదిరించడానికి , నిర్బంధించడానికి కొత్త చట్టాల సమితి నైతిక తనిఖీదారులకు అధికారం ఇస్తుందని ఐక్యరాజ్య సమితి ప్రతినిధి తెలిపారు. అనైతికత కింద మహిళలను ఇబ్బంది పెట్టేందుకు తావిస్తుందని చెప్పారు. కానీ ఆయన మహిళలను నైతికత కట్టుబాట్లలో ఎలా ఉంచాలో వివరించలేదు. బహుశా మహిళలకు విశృంకలత కల్పించాలన్నది ఆయన ఉద్దేశమేమో. వాస్తవానికి తాలిబాన్లు పెట్టిన కట్టుబడులు పొట్టి, పారదర్శక దుస్తులు ధరించొద్దని, బహిరంగ ప్రదేశాలలో ఇతరులతో (పరపురుషులతో) మాట్లాడొద్దని, పాడొద్దని, గట్టిగా చదవొద్దని మాత్రమే.…

Read More

ఆర్‌జి కర్‌ మెడికల్‌ కాలేజీ మాజీ ప్రిన్సిపల్‌ సందీప్‌ ఘోష్‌ నివాసంలో సిబిఐ ఆదివారం సోదాలు చేపట్టింది. ఘోష్‌ ప్రిన్సిపల్‌గా ఉన్న సమయంలో ఆర్‌జి కర్‌ ఆస్పత్రిలో ఆర్థిక అవతవకలకు పాల్పడ్డారని అధికారులు తెలిపారు. సిబిఐకి చెందిన సుమారు ఏడుగురు అధికారులు ఉదయం 8.00 గంటల నుండి బెలియాఘట నివాసంలో ఘోష్‌ని విచారించింది. కేంద్ర భద్రతా బలగాలతో అధికారులు ఉదయం 6.00 గంటలకు ఘోష్‌ నివాసానికి చేరుకున్నారు. అయితే సుమారు గంటన్నరపాటు అధికారులు వేచిచూసినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. మరో సిబిఐ అధికారుల బృందం ఆస్పత్రిలోని ఘోష్‌ కార్యాలయంలో సోదాలు నిర్వహించింది. ఇన్‌స్టిట్యూట్‌ క్యాంటీన్‌ను కూడా పరిశీలించింది. ఆర్జీకర్‌ ఆస్పత్రి మాజీ ప్రిన్సిపల్‌ సందీప్ ఘోష్‌ అవినీతికి పాల్పడినట్లు గతంలో పనిచేసిన డిప్యూటీ సూపరింటెండెంట్‌ అక్తర్‌ అలీ ఫిర్యాదు చేశారు. రోగులకు అవసరమైన సామాగ్రిని సరఫరా చేసేవారి నివాసాలు, కార్యాలయాలపై కూడా సిబిఐకి చెందిన అవినీతి నిరోధక విభాగం దాడులు చేస్తోందని…

Read More

మహిళలపై నేరాలకు పాల్పడే వారి పట్ల కఠినంగా వ్యవహరిస్తామని, ఎట్టి పరిస్థితిల్లోనూ వారిని విడిచిపెట్టేది లేదని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ హెచ్చరించారు. మహారాష్ట్రలోని జలగావ్‌లో ఆదివారంనాడు జరిగిన ‘లఖ్‌పతి దీదీ’ కార్యక్రమంలో ప్రధాని పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, మహిళలపై నేరాలకు పాల్పడే వారిని శిక్షించేందుకు కఠిన చట్టాలను రూపొందిస్తు్న్నామని చెప్పారు.  దేశంలో గత రెండు వారాల్లో మహిళలపై అకృత్యాల ఘటనలు చోటుచేసుకున్న నేపథ్యంలో ప్రధానమంత్రి ప్రకటన ప్రాధాన్యత సంతరించుకుంది.  దేశంలోని మహిళల సామర్థ్యాన్ని పెంచడంతో పాటు వారి భద్రతకు కూడా అంతే ప్రాధాన్యత ఉందని, ఎర్రకోట నుంచి ఇదే అంశాన్ని తాను పలుమార్లు ప్రస్తావించానని మోదీ అన్నారు. దేశంలో ఎక్కడ మహిళలపై అఘాయిత్యాలు జరిగినా వారి బాధ, ఆగ్రహం తాను అర్థం చేసుకోగలనని తెలిపారు.  మహిళలపై అఘాయిత్యాలు క్షమించరాని పాపమని, దోషులను ఎట్టి పరిస్థితుల్లోనూ తాను విడిచిపెట్టేది లేదని స్పష్టం చేశారు. ఈ విషయాన్ని దేశంలోని ప్రతి…

Read More

వాల్మీకి స్కామ్‌తో ఉక్కిరిబిక్కిరి అవుతున్న కర్ణాటక సీఎం సిద్ధరామయ్యకు మరిన్ని చిక్కులు తప్పేలా లేవు. ఆయనపై నమోదైన 2014నాటి ముడుపుల కేసులో లోకాయుక్త పోలీసుల తీరుపై ప్రజాప్రతినిధుల ప్రత్యేక కోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. విచారణకు ఆదేశించినప్పటికీ పట్టించుకోకపోవడాన్ని కోర్టు తీవ్రంగా పరిగణించి షోకాజ్‌ నోటీసులు జారీ చేసింది. సిద్ధరామయ్య మొదటిసారి సీఎంగా ఉన్నప్పుడు 2014 జూలై 28న మైసూరులోని వివేక్‌ హోటల్స్‌ ఎండీ వివేకానంద అలియాస్‌ కింగ్స్‌ కోర్టు వివేక్‌ వద్ద నుంచి రూ.1.3 కోట్ల చెక్కును లంచంగా తీసుకున్నారనే ఆరోపణలు వచ్చాయి. బెంగళూరు టర్ఫ్‌ క్లబ్‌ లిమిటెడ్‌కు స్టెవార్డ్‌గా నియమించేందుకు ముడుపులు తీసుకున్నారని ఆరోపణ. ఈ కేసులో క్విడ్‌ ప్రోకో జరగలేదని పేర్కొంటూ గత ఏడాది జూన్‌ 7న కర్ణాటక లోకాయుక్త డిప్యూటీ ఎస్పీ కోర్టులో కేసు క్లోజర్‌ రిపోర్టును సమర్పించారు. లోకాయుక్త నివేదికను సవాల్‌ చేస్తూ బీబీఎంపీ మాజీ కౌన్సిలర్‌ రమేశ్‌ కోర్టును ఆశ్రయించారు. మరోసారి విచారణ…

Read More

తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి సాలకట్ల బ్రహ్మోత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహిస్తామని టీటీడీ ఈవో శ్యామలరావు తెలిపారు. పురటాసి మాసం కూడా వస్తున్నందువల్ల భక్తుల రద్దీ అత్యధికంగా ఉంటుందని చెప్పారు. అన్ని విభాగాల అధికారులు, జిల్లాయంత్రాంగంతో సమన్వయం చేసుకుని భక్తులకు ఎలాంటి ఇబ్బందులు ఎదురుకాకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. టీటీడీలోని అన్ని విభాగాల అధికారులతో శనివారం తిరుమలలోని అన్నమయ్య భవనంలో ఈవో సమీక్ష నిర్వహించారు. అక్టోబరు 4 నుండి 12వ తేదీ వరకు సాలకట్ల బ్రహ్మోత్సవాలను వైభవంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. వార్షిక బ్రహ్మోత్సవాల్లో ముఖ్యమైన రోజుల్లో అక్టోబరు 4న ధ్వజారోహణం ఉంటుందని తెలిపారు. అదే రోజు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాష్ట్ర ప్రభుత్వం తరపున శ్రీ వేంకటేశ్వర స్వామికి పట్టువస్త్రాలు సమర్పిస్తారని వివరించారు. బ్రహ్మోత్సవాల ముఖ్యాంశాలు ఉదయం 8 నుండి 10 గంటల వరకు, రాత్రి 7 నుండి 9 గంటల వరకు వాహనసేవలు జరుగుతాయి. గరుడవాహనసేవ సాయంత్రం 6:30 గంటలకు…

Read More

కాంగ్రెస్, నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీ పొత్తుకు ఓ ఎజెండా లేదని పీపుల్స్‌ డెమోక్రటిక్‌ పార్టీ (పీడీపీ) అధినేత్రి మెహబూబా ముఫ్తీ ఆరోపించారు. కేవలం సీట్ల పంపకం కోసమైతే తాము ఏ కూటమిలోనూ చేరబోమని స్పష్టం చేశారు. ఒకవేళ తమ ఎజెండాకు కాంగ్రెస్‌, నేషనల్‌ కాన్ఫరెన్స్‌ పార్టీ అంగీకరిస్తే, పీడీపీ ఎన్నికల పోటీ నుంచే తప్పుకుంటుందని ఆమె హామీ ఇచ్చారు. కశ్మీర్‌ సమస్యల పరిష్కారమే తమకు ప్రాధాన్యం తప్ప ఇంకేదీ ముఖ్యం కాదని ముఫ్తీ స్పష్టం చేశారు. ఈ క్రమంలో శ్రీనగర్లోని పార్టీ ప్రధాన కార్యాలయంలో మ్యానిఫెస్టోను విడుదల చేశారు. ప్రజలపై వరాల జల్లును కురిపించారు. “జమ్ముకశ్మీర్ ఎన్నికలు సయోధ్య, వాణిజ్యం పునరుద్ధరణ, కశ్మీర్ సమస్య పరిష్కారం కోసం జరుగుతున్నాయి. ఇవే పీడీపీ అజెండాలో ఉన్నాయి. ఈ అజెండాకు కాంగ్రెస్, ఎన్ సీ కూటమి అంగీకారం తెలిపితే పీడీపీ బేషరతుగా మద్దతు ఇస్తుంది” అని ఆమె ప్రకటించారు. అయితే, పొత్తులపై రాజకీయ చర్చ…

Read More

యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్ కు కేంద్ర కేబినెట్ శనివారం ఆమోదం తెలిపింది. ఈ పథకం కింద కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు వేతనంలో 50 శాతం పెన్షన్ ఇస్తారు. ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన శనివారం జరిగిన కేంద్ర కేబినెట్ భేటీలో ఈ కీలక ప్రతిపాదనకు ఆమోదం తెలిపారు. కేంద్ర కేబినెట్ నిర్ణయాలను కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ మీడియాకు వెల్లడించారు. కొత్త పెన్షన్ స్కీం గురించి వివరిస్తూ, ‘‘కొత్త పెన్షన్ పథకంలో కొన్ని మార్పులు చేయాలని ప్రభుత్వ ఉద్యోగులు డిమాండ్ చేశారు. దాంతో, కేబినెట్ కార్యదర్శి టీవీ సోమనాథన్ అధ్యక్షతన ఓ కమిటీని ప్రధాని మోదీ ఏర్పాటు చేశారు. ఈ కమిటీ వివిధ సంస్థలతో పాటు దాదాపు అన్ని రాష్ట్రాలతో 100కు పైగా సమావేశాలు నిర్వహించింది. ఆ తరువాత ఈ యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్ ను సిఫారసు చేసింది’’ అని వివరించారు. ‘‘ప్రధాని మోదీ పనిచేసే విధానానికి, ప్రతిపక్షాల పనితీరుకు తేడా…

Read More

అక్రమ కట్టడాలపై ‘హైడ్రా’ దూకుడుగా ముందుకెళ్తోంది. ముఖ్యంగా చెరువులను ఆక్రమించి చేపట్టిన నిర్మాణాలపై ప్రధానంగా ఫోకస్ చేస్తోంది. ఇందులో భాగంగా హీరో నాగార్జునకు చెందిన మాదాపూర్‌లోని ఎన్‌ కన్వెన్షన్‌ ను కూల్చివేసే పనులను శనివారం ఉదయం ప్రారంభించింది. తుమ్మిడికుంట చెరువును కబ్జా చేసి ఎన్ కన్వెన్షన్ ను నిర్మించారని హైడ్రాకు ఫిర్యాదులు అందటంతో కూల్చివేత పనులను ప్రారంభించారు. మూడున్నర ఎకరాల స్థలాన్ని కబ్జా చేసి ఈ నిర్మాణం జరిగినట్లు ఆరోపణలు ఉన్నాయి.ఎన్-కన్వెన్షన్ మొత్తం 10 ఎకరాల్లో నిర్మించబడి ఉంది. ఎన్ కన్వెన్షన్ ను ఎఫ్ టీఎల్ పరిధిలో నిర్మించారనే ఆరోపణలు ఎప్పట్నుంచో వినిపిస్తున్నాయి. మొత్తం మూడున్నర ఎకరాల స్థలాన్ని ఆక్రమించి ఈ నిర్మాణం చేపట్టారని ఫిర్యాదులు కూడా అందాయి. గతంలోనే ఈ నిర్మాణంపై చర్యలు తీసుకుంటారనే వార్తలు వచ్చినప్పటికీ జరగలేదు. ఇటీవలే తెలంగాణ ప్రభుత్వం హైడ్రాను ఏర్పాటు చేసింది. ఆక్రమణకు గురైన చెరువులు, కుంటలు, బఫర్ జోన్ పరిధిలోని స్థలాలపై హైడ్రా…

Read More