Author: Editor's Desk, Tattva News

క్రిమినల్‌ కేసుల విచారణ సమయంలో పోలీసుల ఏర్పాటు చేసే మీడియా సమావేశంలో సర్వోన్నత న్యాయస్థానం బుధవారం కీలక వ్యాఖ్యలు చేసింది. పక్షపాతంతో కూడిన రిపోర్ట్‌తో నిందితుడు నేరం చేశాడనే అనుమానాలకు తావిస్తోందని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. ఈ మేరకు నిందితులు, బాధితుల ఇద్దరి హక్కులను పరిరక్షిస్తూ సున్నితమైన కేసుల్లో మీడియాకు తెలియజేయాల్సిన, చేయకూడని విషయాలపై పోలీసుల అధికారులకు సూచనలు ఇస్తూ మాన్యువల్‌ను రూపొందించాలని కేంద్ర హోంమంత్రిత్వ శాఖను సుప్రీంకోర్టు ఆదేశించింది. మూడునెలల్లోగా సమగ్ర మార్గదర్శకాలు రూపొందించాలని.. అన్ని రాష్ట్రాల డీజీపీలు సూచనలు చేయడంతో పాటు జాతీయ మానవ హక్కుల కమిషన్‌ అభిప్రాయాలను సైతం తీసుకోవాలని సూచించింది. క్రిమినల్‌ కేసులు దర్యాప్తు జరుగుతున్న సమయంలో పోలీసులు అనుసరిస్తున్న విధివిధానాలపై దాఖలైన పిటిషన్‌పై సీజేఐ డీవై చంద్రచూడ్‌, జస్టిస్‌ పీఎస్‌ నరసింహ, జస్టిస్‌ మనోజ్‌ మిశ్రా ధర్మాసనం పిటిషన్లపై విచారణ జరిపింది. ‘పీయూసీఎల్‌ వర్సెస్‌ స్టేట్‌ ఆఫ్‌ మహారాష్ట్ర’ 2014 కేసు తీర్పులో ఎన్‌కౌంటర్ల విషయంలో స్పష్టత…

Read More

ప్రతిపక్షాల ‘ఇండియా’ కూటమి తొలి బహిరంగ సభ బీజేపీ పాలిత మధ్యప్రదేశ్‌ రాజధాని భోపాల్‌లో జరుగనున్నది. అక్టోబరు మొదటి వారంలో దీనిని నిర్వహించాలని ఆ కూటమి నిర్ణయించింది. ఇండియా బ్లాక్‌ కోఆర్డినేషన్‌ కమిటీ తొలి సమావేశం బుధవారం జరిగింది. నేషనలిస్ట్‌ కాంగ్రెస్‌ పార్టీ (ఎన్సీపీ) అధ్యక్షుడు శరద్‌ పవార్‌ ఢిల్లీ నివాసంలో 14 మంది సభ్యులతో కూడిన ప్యానెల్‌ సమావేశమైంది. కాగా, 2024 లోక్‌సభ ఎన్నికలకు సంబంధించి సీట్ల పంపకం సహా పలు అంశాలపై ‘ఇండియా’ బ్లాక్‌ సమన్వయ కమిటీ చర్చించింది. అక్టోబర్‌ మొదటి వారంలో భోపాల్‌లో తొలి బహిరంగ సభ నిర్వహించాలని ఈ సందర్భంగా నిర్ణయించారు. బీజేపీ ప్రభుత్వంలోని అవినీతి, నిరుద్యోగం, ధరల పెరుగుదల వంటి సమస్యలపై ఈ పబ్లిక్‌ మీటింగ్‌లో ప్రధానంగా లేవనెత్తనున్నారు. రానున్న పార్లమెంట్‌ ఎన్నికల్లో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వాన్ని గద్దె దింపేందుకు సుమారు 25కుపైగా రాజకీయ పార్టీలు ‘ఇండియా’ కూటమి పేరుతో ఒక తాటిపైకి వచ్చాయి.…

Read More

ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌లో టీమిండియా ప్లేయర్ల హహ కొనసాగింది. దాదాపు నాలుగేళ్ల తర్వాత బ్యాటింగ్‌ విభాగం నుంచి ముగ్గురు ఆటగాళ్లు టాప్‌-10లో చోటు సాధించారు. ఆసియాకప్‌లో అద్భుత ప్రదర్శనలు చేస్తూ టీమిండియాకు వరుసగా రెండో విజయాన్ని అందించిన భారత ఆటగాళ్లు ఇప్పుడు ఐసీసీ తాజా ర్యాంకింగ్స్‌లోనూ అదే జోరు కనబర్చారు. టీమిండియా తరఫున శుభ్‌మాన్‌ గిల్‌, విరాట్‌ కోహ్లీ, కెప్టెన్‌ రోహిత్‌ శర్మలు తమ స్థానాలను మెరుగుపర్చుకున్నారు. దాంతో నాలుగుళ్ల తర్వాత ముగ్గురు భారత ఆటగాళ్లు టాప్‌-10లో చోటు దక్కించుకున్నారు. ఓపెనర్‌ శుభ్‌మాన్‌ గిల్‌ కెరీర్‌ అత్యుత్తమ 2వ ర్యాంకును అందుకోగా విరాట్‌ కోహ్లీ, రోహిత్‌ శర్మలు రెండు, రెండు స్థానాలు మెరుగుపర్చుకొని వరుసగా 8, 9 ర్యాంకుల్లో నిలిచారు. చివరిసారిగా 2018లో టీమిండియా తరఫున శిఖర్‌ ధావన్‌, రోహిత్‌ శర్మ, విరాట్‌ కోహ్లీలు టాప్‌-10లో నిలిచారు. ఇప్పుడు తాజాగా 2023లో గిల్‌, కోహ్లీ, రోహిత్‌లు మరోసారి ఆ ఫీట్‌ను అందుకున్నారు. …

Read More

వచ్చే ఏడాదిలో దేశంలో సగటున రూ.2000 కోట్ల పెట్టుబడితో 100కు పైగా కొత్త ప్లాంట్లను ప్రారంభించనున్నట్లు బయోడీజిల్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా(బిఎఐ) వైస్ ప్రెసిడెంట్ ధరమ్ వీర్ సింగ్ రాజ్ పురోహిత్ తెలిపారు. వచ్చే 2070లో నికర జీరో విజన్ లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం గ్రీన్ ఎకానమీకి నిరంతరం ప్రాధాన్యమిస్తోందని చెప్పారు. దీని వల్ల వాయు కాలుష్య నివారణకు ప్రాధాన్యత ఇస్తున్నామని, దీని వల్ల దేశవ్యాప్తంగా జీవ ఇంధనాలకు డిమాండ్ పెరుగుతోందని తెలిపారు. గ్లోబల్ ఎనర్జీలో భాగంగా సుస్థిర ఇంధనాన్ని పెంపొందించడమే లక్ష్యంగా దేశంలో జరుగుతున్న జి-20 సదస్సులో గ్లోబల్ అలయన్స్ ఆన్ బయోఫ్యూయెల్స్ కోసం భారత్ ప్రతిపాదించింది. బయోడీజిల్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా నూతన మేనేజింగ్ కమిటీని ఏర్పాటు చేయగా అధ్యక్షుడిగా ఎస్ కే మొండల్, ఉపాధ్యక్షుడిగా ధరమ్ వీర్ సింగ్ రాజ్ పురోహిత్, విపి, కోశాధికారిగా కె.చేరన్, కార్యదర్శిగా దీపిన్ షా ఎన్నికయ్యారు.

Read More

బీజేపీ నుంచి ఎదురవుతున్న తీవ్ర ఎదురుదాడి నేపథ్యంలో సనాతన ధర్మంపై తమ వ్యాఖ్యల తీవ్రతను తగ్గించుకోవాలని డీఎంకే నాయకులను, తమిళనాడులోని మిత్రపక్షాలను తమిళనాడు ముఖ్యమంత్రి, డిఎంకె అధ్యక్షుడు ఎంకె స్టాలిన్ కోరారు. అయితే, ఈ విషయమై మరింతగా వాదించడం మరింత నష్టానికి దారితీస్తుందని భయంతో సనాతన ధర్మంపై ఏర్పడిన వివాదాన్ని కేంద్రంలోని మోదీ ప్రభుత్వం తన అవినీతిని, అక్రమాలను కప్పిపుచుకోవడానికి వాడుకుంటోందని అంటూ స్టాలిన్ ఆరోపించారు. సనాతన ధర్మంపై తమిళనాడులోని నాయకులు చేస్తున్న విమర్శలు ప్రతిపక్ష ఇండియా యూటమిలోని భాగస్వామ్య పక్షాలు ముఖ్యంగా కాంగ్రెస్, టిఎంసి, శివసేనను ఆత్మరక్షణలోని నెట్టివేస్తున్నట్లు స్పష్టమైన నేపథ్యంలో స్టాలిన్ నుంచి ఈ ప్రకటన వెలువడడం గమనార్హం. డిఎంకెతోపాటు ఇండియా కూటమిలోని ఈ పార్టీలను హిందూ వ్యతిరేక పార్టీలు బిజెపి ముద్రవేస్తోంది. ససనాతన ధర్మం చర్చనీయాంశం కావాలన్న ఉద్దేశంతోనే కేంద్ర మంత్రులు ఉద్దేశపూర్వకంగా ప్రతిరోజు దీనిపై మాట్లాడుతున్నారని, దేశాన్ని పట్టిపీడిస్తున్న అసలు సమస్యల నుంచి ప్రజలను పక్కదారి…

Read More

నిరుద్యోగ యువ‌త‌ను కెసిఆర్ ప్ర‌భుత్వ మోసం చేసింద‌ని బిజెపి తెలంగాణ అధ్య‌క్షుడు, కేంద్ర మంత్రి జి. కిష‌న్ రెడ్డి ధ్వజమెత్తారు. కేసిఆర్ ప్రభుత్వంలో నిరుద్యోగులకు జరుగుతున్న అన్యాయానికి నిరసనగా ధర్నాచౌక్, ఇందిరా పార్క్ వద్ద కిషన్ రెడ్డి 24 గంట‌ల ఉపవాస దీక్షను బుధవారం చేపట్టారు. ఈ దీక్ష గురువారం ఉదయం 11 గంటల వరకు దీక్ష కొనసాగనుంది. ఈ సంద‌ర్బంగా ఆయ‌న మాట్లాడుతూ, ఒక పూట తింటూ ఒక పూట ఉపవాసం ఉంటున్న నిరుద్యోగ యువతకు సంఘిబావంగా ఈ ఉపవాస దీక్ష చేస్తున్నానని తెలిపారు. తెలంగాణ పోరాటంలో కీలకంగా ఉంది యువత అని చెబుతూ ప్రాణాలకు తెగించి పోరాడారని గుర్తు చేశారు. తెలంగాణ అడిగితే కాల్చిపారేసింది కాంగ్రెస్ ప్రభుత్వం అంటూ ఆరోపించారు. తెలంగాణ కోసం విద్యార్థులు కాలికి గజ్జ కట్టి అడారని ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇవ్వక‌పోవ‌డంతోనే 12 వందల మంది ఆత్మ బలిదానం చేసుకున్నార‌ని…

Read More

దేశంలో ధరల సెగ కాస్తంత తగ్గింది. జూలైలో నమోదైన 15 నెలల గరిష్ఠ స్థాయి 7.44 శాతం నుంచి ఆగస్టు నెలలో 6.83 శాతానికి తగ్గింది. కాగా గత ఏడాది ఆగస్టులో రిటైల్‌ ద్రవ్యోల్బణం 7 శాతం ఉంది. ఈ ఆగస్టు నెలలో ఆహార ద్రవ్యోల్బణం జూలైతో పోల్చితే 11.51 శాతం నుంచి 9.94 శాతానికి తగ్గిందని జాతీయ గణాంకాల కార్యాలయం (ఎన్‌ఎ్‌సఓ) గణాంకాలు తెలుపుతున్నాయి. అయినప్పటికీ రిటైల్‌ ద్రవ్యోల్బణం ఆర్‌బీఐకి ప్రభుత్వం నిర్దేశించిన గరిష్ఠ పరిమితి 6 శాతం కన్నా పైనే ఉంది. రెపో రేట్ల నిర్ణయంలో ఆర్‌బీఐ రిటైల్‌ ద్రవ్యోల్బణాన్నే గీటురాయిగా తీసుకుంటుంది. 2023-24 ఆర్థిక సంవత్సరానికి ద్రవ్యోల్బణం అంచనాను ఆర్‌బీఐ 5.4 శాతంగా ప్రకటించింది. ఎన్‌ఎ్‌సఓ గణాంకాల ప్రకారం కూరగాయల విభాగంలో ద్రవ్యోల్బణం జూలైతో పోల్చితే 37.4 శాతం నుంచి 26.14 శాతానికి తగ్గింది. అలాగే ఆయిల్‌ అండ్‌ ఫ్యాట్స్‌, మాంసం, చేపలు, గుడ్లు; సుగర్‌ కన్ఫెక్షనరీ,…

Read More

బీజేపీలో చేరేందుకు సిద్దమైన క్యాసినో కింగ్ గా పేరొందిన చీకోటి ప్రవీణ్ కు మంగళవారం చుక్కెదురైంది. కర్మాన్‌ఘాట్‌లోని హనుమాన్‌ టెంపుల్‌ నుంచి భారీ ర్యాలీగా నాంపల్లి బీజేపీ ఆఫీసుకు పార్టీలో చేరేందుకు చేరుకున్నారు. కాసేపట్లో రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి జి. కిషన్‌రెడ్డి సమక్షంలో చీకోటి ప్రవీణ్ బీజేపీ తీర్థం పుచ్చుకుంటారనగా, పార్టీ అధిష్టానం ఆదేశాలతో చీకోటి ప్రవీణ్ పార్టీలో చేరిక ఆగిపోయినదని చెబుతున్నారు. గత వారం తెల్గీ స్టాంప్ పేపర్ల కుంభకోణంలో జైలులో ఉండివచ్చిన మాజీ మంత్రి కృష్ణ యాదవ్ పార్టీలో చేరడం కూడా ఇదే విధంగా చివరిలో ఆగిపోయింది. లుగు రాష్ట్రాల్లో సంచలనమైన క్యాసినో కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న చీకోటి ప్రవీణ్ ను పార్టీలో చేర్చుకోవడంపై కొందరు నేతలు అసంతృప్తి వ్యక్తం చేశారు. ఉమ్మడి హైదరాబాద్, రంగారెడ్డిలో ఓ అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేస్తానని చీకోటి అన్నారు. బీజేపీ తెలంగాణ ఎన్నికల ఇన్ ఛార్జ్ ప్రకాశ్…

Read More

కేంద్ర ప్రభుత్వం ఈనెల 18 నుంచి 22 వరకు పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు నిర్వహించాలని నిర్ణయించింది. సెప్టెంబర్ 18న పార్లమెంట్ పాత భవనంలో ఈ ప్రత్యేక సమావేశాలు ప్రారంభం అవుతాయి. వినాయక చవితిని పురస్కరించుకుని సెప్టెంబర్ 19 నుంచి ఈ సమావేశాలను కొత్త భవనం లోకి మార్చనున్నారు. అయితే నూతన పార్లమెంట్ భవనం లోకి వెళ్లే సమయంలో సిబ్బంది కొత్త యూనిఫాం ధరించి వెళ్లనున్నట్టు సమాచారం. ఈ యూనిఫాంను నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ ప్రత్యేకంగా రూపొందించింది. ఇది నెహ్రూ జాకెట్ల మాదిరిగా ఊదా ఎరుపు రంగు లేదా గులాబీ రంగులో ఉంటాయి.వారి చొక్కాలు పువ్వుల డిజైన్‌తో ముదురు గులాబీ రంగులో ఉంటాయి. ఉద్యోగులు ధరించే ప్యాంట్లు ఖాకీ రంగులో ఉంటాయి. మరికొన్ని మార్పులతో భారతీయ సంస్కృతికి అద్దం పట్టేలా డిజైన్ చేశారు. ఉభయ సభల్లో కూడా మణిపురి తలపాగాలు ధరించేలా నిర్ణయించారు. పార్లమెంట్ భవనంలో ఉన్న భద్రతా సిబ్బందికి…

Read More

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ చైర్ పర్సన్ కేసలి అప్పారావు, ముగ్గురు సభ్యులు గొండు సీతారాం, త్రిపర్ణ ఆదిలక్ష్మి, బత్తుల పద్మావతి గురువారం (14న) అలిపిరి కాలి నడక ద్వారా తిరుమల చేరుకుంటారని తెలిపారు. జూన్ 23న చిరుత బారినపడి కౌశిక్ అనే బాలుడు గాయాలు అయ్యాయి అని, మళ్ళీ ఈ ఆగస్టు 12 వ తేదీన లక్షిత అనే చిన్నారి చిరుత పులి దాడికి బలై ప్రాణాలు కోల్పోయిన నేపథ్యంలో ఈ పర్యటన జరుపుతున్నారు. అలిపిరి మార్గం ద్వారా సంఘటన జరిగిన ప్రాంతాలను సందర్శించి, పరిశీలన చేసి ఇలాంటి దుర్ఘటనలు పునరావృతం కాకుండా తదుపరి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు, చర్యలకు సిపార్సుల ను చేయనున్నారు. తిరుమల చేరుకున్నాక దేవదాయ శాఖ అధికారులు, అటవీ శాఖ అధికారులు, పోలీసు నిఘా విభాగంతో సంఘటనలుపై ఆరా తీసి చర్చిస్తారు. తర్వాత తిరుమలలో బాల్య వివాహాలు జరగకుండా చేపడుతున్న చర్యలును పరిశీలించి, బిక్షాటన,…

Read More