రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు చేప ప్రసాదం పంపిణీ ద్వారా బాగా గుర్తింపు పొందిన బత్తిని హరినాథ్‌గౌడ్ బుధవారం రాత్రి కన్నుమూశారు. గత కొద్దిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న హరినాథ్‌గౌడ్..రాత్రి 10గంటల సమయంలో తుదిశ్వాస విడిచినట్లుగా కుటుంబ సభ్యులు తెలియజేశారు. ఉబ్బసం, ఆస్తమా వంటి జబ్బులు కలిగిన వాళ్లకు సుమారు నాలుగు దశాబ్ధాలకుపైగా చేప ప్రసాదం పంపిణీ చేస్తూ వచ్చారు హరినాథ్‌గౌడ్. ఆయనతో పాటు ఆ వారసత్వాన్ని తన కుటుంబ సభ్యులకు అప్పగించారు. ప్రతీ ఏటా మృగశిర కార్తె రోజున ఈచేపమంది పంపిణి కార్యక్రమాన్ని హైదరాబాద్ లోని నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్‌లో నిర్వహిస్తూ వచ్చారు. ఈ చేప ప్రసాదం కోసం తెలంగాణ నలు మూలల నుంచే కాకుండా దేశంలోని వివిధ రాష్ట్రాల నుంచి భారీ సంఖ్యలో ఆస్తమా బాధులు రెండు రోజుల ముందుగానే నగరానికి వస్తుంటారు. బత్తిన హరినాథ్ మరణవార్త తెలుసుకొని తెలంగాణ సీఎం కేసీఆర్, టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు విచారం వ్యక్తం…
Author: Editor's Desk, Tattva News
చంద్రుడి దక్షిణ ధృవం మీద ఇస్రో పంపించిన ‘విక్రమ్’ల్యాండర్ విజయవంతంగా దిగడం యావద్భారతం గర్వించే క్షణమని కేంద్రమంత్రి, బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్ రెడ్డి హర్షం ప్రకటించారు. ఈ ప్రయోగం విజయవంతం కావడంతో చంద్రుడి దక్షిణ ధృవంపై ల్యాండ్ అయిన తొలి దేశంగా భారత్ నిలిచిందని పేర్కొన్నారు. బుధవారం చంద్రయాన్-3 ల్యాండ్ అయిన అద్వితీయమైన ఘట్టాలను బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఎంపి డాక్టర్ కె. లక్ష్మణ్, ఇతర ముఖ్యనేతలతో కలిసి భారీ ఎల్‌ఈడీ స్క్రీన్‌పై కిషన్ రెడ్డి వీక్షించారు. అనంతరం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సందేశాన్ని వీక్షించారు. పార్టీ కార్యాలయంలో నాయకులు త్రివర్ణతాకాలు చేతబూని భారత్ మాతాకీ జై, జై జవాన్ జై కిసాన్ – జై విజ్ఞాన్ నినాదాలు చేశారు. టపాసులు కాల్చారు. అనంతరం కేంద్రమంత్రి మాట్లాడుతూ ఈ విజయంతో భారత్ కొత్త చరిత్రను లిఖించిందని కొనియాడారు. ఇస్రో, చంద్రయాన్ బృందానికి హృదయపూర్వకంగా అభినందనలు తెలిపారు. ఇస్రో శాస్త్రవేత్తలు ప్రతి…
మంత్రి శ్రీనివాస్ గౌడ్ కేసును విచారిస్తోన్న తెలంగాణ ప్రజా ప్రతినిధుల కోర్టు జడ్జి జస్టిస్ జయకుమార్‌ను సస్పెండ్ చేస్తూ సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఎన్నిక చెల్లదంటూ నమోదైన కేసులో విచారణ జరిపిన జడ్జి జస్టిస్ జయకుమార్ ఇచ్చిన కీలక తీర్పుపై అత్యున్నత న్యాయస్థానం అసహనం వ్యక్తం చేసింది. ఎన్నికల సమయంలో సమర్పించిన అఫిడవిట్‌ను టాంపరింగ్ చేశారన్న ఆరోపణపై దాఖలైన పిటిషన్ మీద విచారించిన జడ్జ్ జయకుమారు శ్రీనివాస్ గౌడ్ సహా 10 మందిపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేయాలని పోలీసులకు ఆదేశించారు. ఈ నేపథ్యంలోనే కేంద్ర, రాష్ట్ర ఎన్నికల కమిషన్ అధికారులపై కేసు నమోదు చేయాలని ఆదేశాలు జారీ చేశారు. 2018 ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా శ్రీనివాస్ గౌడ్ మహాబూబ్‌నగర్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి నామినేషన్ వేశారు. ఎన్నికల కమిషన్ వెబ్‌సైట్‌లో డాక్యుమెంట్లను అప్‌లోడ్ చేయగా అందులో కొన్ని పొరపాట్లు ఉన్నాయని, అవి బయటకు…
భారత్‌కు చెందిన ప్రపంచ ప్రఖ్యాత గణాంక , గణిత శాస్త్రవేత్త కల్యంపూడి రాధాకృష్ణారావు అమెరికాలో అనారోగ్యంతో బుధవారం కన్నుమూశారు. గణిత శాస్త్రంలో అందించిన సేవలకు గాను స్టాటిస్టిక్స్ రంగంలో అత్యున్నత పురస్కారాన్ని అందుకున్నారు. భారత ప్రభుత్వం ఆయనను పద్మవిభూషణ్‌తో సత్కరించింది. సీఆర్ రావు 78 ఏళ్ల కిందట గణాంక రంగంలో విప్లవాత్మకమైన ఆలోచనలకు బీజం వేసినందుకు గాను ఆ రంగంలో నోబెల్ బహుమతికి సమానమైన ఇంటర్నేషనల్ ప్రైజ్ ఆఫ్ స్టాటిస్టిక్స్ 2023 అవార్డు వరించింది. 102 ఏళ్ల వయసులో ఈ ఏడాదే ఆయన ఈ పురస్కారాన్ని అందుకున్నారు. 1945లో కోల్‌కతా మేథమెటికల్ సొసైటీలో ప్రచురితమైన సీఆర్ రావు పరిశోధన పత్రానికి ఈ అవార్డు దక్కింది. ఆయన చేసిన కృషి , ఇప్పటికీ సైన్స్‌పై తీవ్ర ప్రభావాన్ని చూపుతూనే ఉందని ఇంటర్నేషనల్ ప్రైజ్ ఇన్ స్టాటిస్టిక్స్ ఫౌండేషన్ ఒక ప్రకటనలో తెలిపింది. సీఆర్ రావు 1920 సెప్టెంబర్ 10న బళ్లారి జిల్లా హడగళిలో…
భారత్ మరో చారిత్రక విజయాన్ని సాధించింది. చంద్రయాన్ -3 విజయవంతంగా చంద్రునిపై దిగింది. ఈ క్షణాల కోసం యావత్ ప్రపంచం ఊపిరిబిగపట్టుకుని ఎదురుచూశారు. 17 నిమిషాల పాటు సాగిన ఈ ప్రక్రియలో విక్రమ్ ల్యాండర్, ప్రజ్ఞాన్ రోవర్‌తో కూడిన ల్యాండింగ్ మాడ్యూల్ చంద్రుడిపై కాలుమోపింది. అగ్రరాజ్యాలే చేతులెత్తేసిన చంద్రుని దక్షిణ ధ్రువంలో అడుగుపెట్టిన తొలి దేశంగా భారత్ నిలిచింది. ఇస్రో ప్రయోగించిన చంద్రయాన్ 3 ప్రాజెక్ట్‌లో భాగంగా విక్రమ్ ల్యాండర్ విజయవంతంగా జాబిల్లిపై దిగింది. సాయంత్రం 5.44 గంటల నుంచి ఇస్రో సాఫ్ట్ ల్యాండింగ్ ప్రక్రియను ప్రారంభించింది. అనంతరం సాయంత్రం 6.04 గంటలకు సేఫ్‌గా చంద్రుడిపై ల్యాండ్ అయ్యింది. ఇస్రో.. ల్యాండింగ్ మాడ్యూల్‌కు ఆటోమేటిక్ ల్యాండింగ్ సీక్వెన్స్ (ఏఎల్ఎస్) కమాండ్‌ను పంపింది. దీనిని అందుకున్న ల్యాండర్ మాడ్యూల్.. ఏఐ ద్వారా సాఫ్ట్ ల్యాండింగ్ ప్రక్రియను మొదలుపెట్టింది. తన నాలుగు థ్రాటల్‌బుల్ ఇంజిన్లను మండించి తన వేగాన్ని తగ్గించుకుంది. రఫ్ బ్రేకింగ్ దశను…
‘రెండేళ్ల తర్వాత విశాఖ స్టీల్‌ప్లాంట్‌లో ఉక్కు ఉత్పాదకత ఉండదు. దీని జీవిత కాలం రెండేళ్లే అని నేను భావిస్తున్నాను’ అంటూ కేంద్ర స్టీల్ మంత్రిత్వ శాఖ కార్యదర్శి నాగేంద్రనాథ్ సిన్హా స్టీల్ సందర్శకుల పుస్తకంలో రాసి సంతకం చేశారు. మంగళవారం వైజాగ్ స్టీల్‌ప్లాంట్ (ఆర్‌ఐఎన్‌ఎల్) పర్యటనకు విచ్చేసిన ఆయన పైవిధంగా తన అభిప్రాయాన్ని వెల్లడించారు. ప్లాంటు పరిశీలనకు వచ్చిన కేంద్ర ప్రభుత్వ కార్యదర్శి.. రెండేళ్ల తర్వాత విశాఖ స్టీల్‌ప్లాంట్‌లో ఉక్కు ఉత్పత్తి ఉండకపోవచ్చని పేర్కొన్నారు. ఉక్కుశాఖ కార్యదర్శి వ్యాఖ్యలు తెలిసిన స్టీల్ ప్లాంట్ కార్మికులు ఆగ్రహానికి గురయ్యారు. అడ్మిన్ భవనం ముట్టడించేందుకు సిద్ధమయ్యారు. నినాదాలు, నిరసనలతో ప్లాంటు ప్రాంగణాన్ని హోరెత్తించారు. ప్లాంటు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా 922 రోజులుగా కార్మికులు పోరాడుతుంటే కేంద్ర ప్రభుత్వ కార్యదర్శి స్థానిక పరిస్థితులను కేంద్రానికి వివరించకుండా సందర్శకుల పుస్తకంలో ఈ విధంగా రాయడం ఏమిటని మండిపడ్డారు. ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ నాయకులుఅడ్మిన్ బిల్డింగ్‌లోకి దూసుకు వెళ్లేందుకు…
మునుగోడు ఉప ఎన్నికల్లో వామపక్షాలతో పొత్తు అని ప్రకటించిన కేసీఆర్, ఇప్పుడు ఏకపక్షంగా తమ అభ్యర్థులను ప్రకటించడం పట్ల ఉభయ కమ్యూనిస్టు పార్టీలు అగ్గిమీద గుగ్గిలం అవుతున్నాయి. బిఆర్‌ఎస్‌తో పొత్తు చెడిపోతే వ్యక్తిగతంగా కెసిఆర్‌ను దూషించమని విధానపరంగా తేల్చుకుంటామని వామపక్షాలు స్పష్టం చేశాయి. వచ్చే ఎన్నికల్లో శక్తికి మించి కృషి చేసి, కమ్యూనిస్టుల సత్తా ఏంటో చూపిస్తామని కమ్యూనిస్టు నేతలు కూనంనేని, తమ్మినేని పరోక్షంగా ముఖ్యమంత్రి కేసీఆర్ ను హెచ్చరించారు. హైదరాబాద్ మగ్దం భవన్‌లో ఉభయ కమ్యూనిస్ట్ పార్టీల సమావేశం మంగళవారం జరిగింది. అనంతరం మీడియాతో సిపిఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కూనంనేని సాంబశివరావు మాట్లాడుతూ రాజకీయాల్లో మోసం చేసే వారు, మోసపోయేవాళ్లు ఉంటారని చెబుతూ మునుగోడులో బిజెపిని ఓడించేందుకే తాము బిఆర్‌ఎస్‌కు మద్దతిచ్చామని తెలిపారు. బిఆర్‌ఎస్‌తో పొత్తుల కోసం తాము ఎప్పుడూ వెంపర్లాడలేదని చెబుతూ సిపిఎం, సిపిఐ… రెండు కమ్యూనిస్ట్ పార్టీలు కలిసి భవిష్యత్తు కార్యాచరణపై నిర్ణయం తీసుకోనున్నాయని చెప్పారు.…
లక్షద్వీప్ ఎంపీ మొహమ్మద్ ఫైజల్‌కు సుప్రీం కోర్టులో ఎదురు దెబ్బ తగిలింది. హత్యాయత్నం కేసులో ఆయనకు కేరళ హైకోర్టు ఇచ్చిన ఊరటను సుప్రీంకోర్టు మంగళవారం పక్కన పెట్టేసింది. ఈ కేసును కొత్తగా మళ్లీ పరిశీలించాలంటూ కేరళ హైకోర్టును ఆదేశిస్తూ ఆరు వారాల వరకు గడువు ఇచ్చింది. దీంతో ఈ వ్యవహారం మరో మలుపు తిరిగినట్టయింది. సుప్రీం కోర్టు తాజా ఆదేశాలతో ఆ గడువు లోగా లక్షద్వీప్ పరిపలనా విభాగం అప్పీల్‌ను హైకోర్టు కొత్తగా పరిశీలించాల్సి ఉంటుంది. ఈ కేసులో లోక్‌సభ ఎంపీని దోషిగా నిర్ధారించి శిక్ష విధించడాన్ని సస్పెండ్ చేయడంలో కేరళ హైకోర్టు అనుసరించిన విధానం తప్పు అని జస్టిస్ నాగరత్న, జస్టిస్ ఉజ్జల్ భుయాన్‌లతో కూడిన ధర్మాసనం అభిప్రాయ పడింది. 2009 సార్వత్రిక ఎన్నికల సమయంలో మాజీ కేంద్ర మంత్రి పీఎం సయ్యిద్ అల్లుడు మహ్మద్ సాలిహ్‌పై హత్యకు ప్రయత్నించినట్టు మహ్మద్ ఫైజల్‌పై ఆరోపణలు వచ్చాయి. ఈమేరకు 2016 జనవరి…
మావోయిస్టు అగ్రనేత మల్లా రాజిరెడ్డి అలియాస్ సత్తన్న అలియాస్ సంగ్రామ్ మరణించారని ఈ నెల 18న వచ్చిన వార్తలను మావోయిస్టు పార్టీ తీవ్రంగా ఖండించింది. మల్లా రాజిరెడ్డితో పాటు కట్టా రామచంద్రా రెడ్డి చనిపోలేదని మావోయిస్టు పార్టీ ప్రకటించింది. అగ్రనేతలు మల్లా రాజిరెడ్డి, కట్ట రామచంద్రారెడ్డి చనిపోయినట్టు వైరల్ అయిన వార్తల్లో ఎలాంటి వాస్తవం లేదని పేర్కొంటూ మవోయిస్ట్పార్టీ ఉత్తర సబ్ జోనల్ దండకారణ్య అధికార ప్రతినిధి మంగ్లీ పేరిట పత్రికా ప్రకటన విడుదలైంది. కేంద్ర ప్రభుత్వ ఆదేశాలతోనే తమ నేతల ఆచూకీని కనిపెట్టేందుకే పోలీసులు ఆడిన కుట్రలో భాగమేనని మావోయిస్టు పార్టీ వెల్లడించింది. అయితే, పోలీసులు చేసిన ప్రయత్నం విఫలమైందన, ఇద్దరు నేతలు క్షేమంగా ఉన్నారని స్పష్టం చేశారు. మల్లా రాజిరెడ్డి అలియాస్ సత్తన్న అనారోగ్యంతో చనిపోయినట్టుగా ఆగస్టు 18న సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. కొన్ని వీడియోలు కూడా వైరల్ అయ్యాయి. చత్తీస్‌గఢ్ పోలీసులు కూడా…
ఏపీలో 23,600 దేవాలయాలు రూ.5.00 లక్షల లోపు ఆదాయం కలిగి ఉన్నవాటిగా గుర్తించడం జరిగిందని ఉప ముఖ్యమంత్రి, దేవాదాయ, ధర్మాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ తెలిపారు. రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం ఆదేశాల మేరకు రూ.5 లక్షల లోపు ఆదాయం ఉన్న దేవాలయాల నిర్వహణ బాధ్యతను ఫౌండర్ ట్రస్టీలకు / అర్చకులకు అప్పగించేందుకు చర్యలు తీసుకోవడం జరుగుచున్నదని వెల్లడించారు. రూ.5 లక్షల లోపు ఆదాయం ఉన్నట్లుగా గుర్తించిన మొత్తం 23,600 దేవాలయాలకు గాను ఇప్పటి వరకూ 37 దేవాలయాలకు సంబందించిన ధరఖాస్తులు మాత్రమే అందాయని ఆయన తెలిపారు. అయితే ధరఖాస్తు చేసుకోని దేవాలయాల నిర్వహణ ప్రస్తుతం ఏవిధంగా ఉందో అదే విధంగా కొనసాగుతుందని ఆయన స్పష్టం చేశారు. సనాతన హిందూ ధర్మం ప్రాముఖ్యతను, ప్రాశస్త్యాన్ని నేటి తరానికి తెలియజేయాలనే లక్ష్యంతో ఈ నెల 6 న అన్నవరంలో ప్రారంభం అయిన ధర్మ ప్రచార కార్యక్రమం విజయవంతంగా కొనసాగుతున్నదని ఆయన తెలిపారు. ఇప్పటికే…