Author: Editor's Desk, Tattva News

యూపీఎస్సీ చైర్మన్‌కు కేంద్రమంత్రి జితేంద్ర సింగ్‌ మంగళవారం లేఖ రాశారు. డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ (లేటరల్ ఎంట్రీ)కి సంబంధించి జారీ చేసిన ప్రకటనలను రద్దు చేయాలని యూపీఎస్సీని కోరారు. లేటరల్‌ ఎంట్రీ ద్వారా ప్రభుత్వ ఉద్యోగాల్లో ఖాళీల భర్తీ విధానంపై ప్రతిపక్షాలు విమర్శలు గుప్పిస్తున్నాయి. ఈ క్రమంలో కేంద్రం వెనక్కి తగ్గింది. ఈ సందర్భంగా ప్రధాని మోదీ ఆదేశాల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు లేఖలో మంత్రి పేర్కొన్నారు. సామాజిక న్యాయంపై మోదీ ప్రభుత్వం దృష్టి సారించిందని.. ఈ నేపథ్యంలో ఈ అంశంపై సమీక్షించాల్సిన అవసరం ఉందన్నారు. 2005లో వీరప్ప మొయిలీ నేతృత్వంలోని రెండో అడ్మినిస్ట్రేషన్‌ రిఫార్మ్‌స్‌ డైరెక్ట్‌ ప్రవేశాలకు సూత్రప్రాయంగా ఆమోదం తెలిపిందని.. 2013లో ఆరవ వేతన సంఘం సిఫారసులు సైతం అదే దిశలో ఉన్నాయని లేఖలో పేర్కొన్నారు. అయితే, అంతకు ముందు చాలా హై ప్రొఫైల్‌ కేసులు లేటరల్‌ ఎంట్రీకి వచ్చాయని.. గత ప్రభుత్వాల్లో వివిధ మంత్రిత్వ శాఖల కార్యదర్శులు,…

Read More

ఢిల్లీలోని ఎయిమ్స్, సఫ్దర్‌జంగ్ తదితర 50 ప్రభుత్వ ,ప్రైవేట్ ఆస్పత్రులతోపాటు ఒక మాల్‌కు మంగళవారం ఈ మెయిల్ ద్వారా బాంబు బెదిరింపులు వచ్చాయి. నన్‌గ్లోయిలోని ఆస్పత్రి నుంచి మధ్యాహ్నం 1.04 గంటలకు , చాణక్యపురి లోని ప్రైమస్ ఆస్పత్రి నుంచి మధ్యాహ్నం 1.07 గంటలకు తమకు సమాచారం అందిందని ఢిల్లీ ఫైర్‌సర్వీస్ అధికారి చెప్పారు. అగ్నిమాపక వాహనాలు, బాంబు తనిఖీ బృందాలు, పోలీస్‌లు ఆయా ప్రాంతాలకు వెళ్లి తనిఖీ చేపట్టారని అయితే ఇంతవరకు ఎలాంటి అనుమానాస్పదమైనవి కనిపించలేదని అధికారులు చెప్పారు. మిగతా ఆస్పత్రుల్లో కూడా తనిఖీలు కొనసాగుతున్నాయని పేర్కొన్నారు. బాంబు బెదిరింపు కాల్స్ అందుకున్న వాటిలో అపోలో, మూల్‌చంద్, మాక్స్ అండ్ సర్‌గంగారామ్ ఆస్పత్రి కూడా ఉన్నాయి. మధ్యాహ్నం 12.04 గంటలకు అందిన జిమెయిల్‌లో “మీ భవనం లోపల అనేక పేలుడు పదార్థాలను అమర్చాం. నల్లని కవర్లలో అవి ఉన్నాయి. కొన్ని గంటల్లో అవి పేలబోతున్నాయి” అని హెచ్చరించి ఉంది. “మీరు…

Read More

బెంగాల్ వైద్యురాలిపై అత్యాచారం, హత్యను భయంకరమైన చర్యగా సుప్రీంకోర్టు అభివర్ణించింది. ఈ కేసులో ఎఫ్ఐఆర్ దాఖలు చేయడంలో జాప్యంపై బెంగాల్ ప్రభుత్వాన్ని తీవ్రంగా తప్పుబట్టింది. ఎఫ్‌ఐఆర్‌ ఎందుకు ఆలస్యంగా నమోదు చేశారని ప్రశ్నించింది. బంగాల్ ప్రభుత్వం, ఆసుపత్రి అధికారులు ఏమి చేస్తున్నారని మండిపడింది. ఈ సందర్భంగా మహిళలు, యువ వైద్యుల భద్రతపై సుప్రీంకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. డాక్టర్​పై అత్యాచార ఘటనను సుమోటోగా విచారణకు స్వీకరించిన న్యాయస్థానం, మంగళవారం విచారించింది. ఈ కేసులో ఈనెల 22లోపు ఈ ఘటనపై పూర్తి నివేదిక ఇవ్వాలని బంగాల్‌ ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. దేశవ్యాప్తంగా డాక్టర్లు, మహిళల రక్షణకు జాతీయ స్థాయి టాస్క్‌ఫోర్స్‌ ఏర్పాటు చేస్తూ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి కీలక ఆదేశాలు జారీ చేశారు. 10 మంది సభ్యులతో కూడిన ప్రముఖ డాక్టర్లు, నిపుణులతో టాస్క్‌ఫోర్స్ ఏర్పాటు చేస్తూ ఆదేశాలు వెలువరించారు. సర్జన్‌ వైస్‌ అడ్మిరల్‌ ఆర్‌.కె.శరిన్‌ అధ్యక్షతన జాతీయ టాస్క్‌ఫోర్స్‌ ఏర్పాటు…

Read More

కోల్‌కతా ఆర్జీ కర్‌ ఆస్పత్రిలో జూనియర్‌ వైద్యురాలిపై జరిగిన హత్యాచార ఘటనలో కీలక విషయం వెలుగులోకి వచ్చింది. ఆమెకు డైరీ రాసే అలవాటు ఉందని, హత్యాచార ఘటన తర్వాత ఆ డైరీలో ఓ పేజీ చిరిగి ఉందని హతురాలి తండ్రి మీడియాకు వెల్లడించారు. ఆ చిరిగిన పేజీ తాలూకు ఫొటో తన వద్ద ఉందని చెప్పిన ఆయన, అందులో ఏం రాసి ఉందనే విషయాన్ని మాత్రం వెల్లడించేందుకు నిరాకరించారు. సీబీఐ అధికారుల సూచన మేరకే తాను బహిరంగపర్చడం లేదని చెప్పారు. హత్యాచార ఘటనపై ప్రజల ఆందోళనలను అణచివేసేందుకు పశ్చిమ బెంగాల్‌ ప్రభుత్వం ప్రయత్నిస్తోందని, ఫలితంగా తమకు సీఎం మమతపై నమక్మం పోయిందని హతురాలి తండ్రి వ్యాఖ్యానించారు. ‘న్యాయం చేయాల్సిన స్థానంలో ఉన్న మమత, తానే న్యాయం కావాలి అంటూ డిమాండ్‌ చేయడంలో ఔచిత్యం ఏమిటి? బాధిత కుటుంబానికి న్యాయం కోసం ఆమె ఏమీ చేయడం లేదు’ అని ఆవేదన వ్యక్తం చేశారు. …

Read More

ప్రపంచ దేశాలను భయాందోళనకు గురిచేస్తున్న మంకీ పాక్స్‌పై ప్రపంచ ‌ఆరోగ్య సంస్థ హెల్త్‌ ఎమర్జెన్సీ ప్రకటించిన నేపథ్యంలో కేంద్రం అప్రమత్తమైంది. దద్దుర్లు ఉన్న రోగులను గుర్తించి, వారికి వైద్యం అందిచడానికి ఐసోలేషన్‌ వార్డులు సిద్ధం చేయాలని అధికారులకు ఆరోగ్య మంత్రిత్వశాఖ ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం. అలాగే డిల్లీలో మూడు నోడల్‌ ఆస్పత్రులను సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. విమానాశ్రయాల్లో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, అవసరమైతే అనుమానితులకు RT-PCR వ్యాధి నిర్థరణ పరీక్ష చేయాలని మంత్రిత్వశాఖ ఆదేశించింది. ఆఫ్రికాలో ఈ ఏడాది 18 వేలకుపైగా మంకీపాక్స్‌ కేసులు నమోదయ్యాయి. పొరుగుదేశం పాకిస్తాన్‌లోనూ మంకీపాక్స్‌ కేసులు వెలుగుచూశాయి. మంకీపాక్స్‌ కేసుల్లో మరణాల రేటు 1 నుంచి 10 శాతం వరకు ఉంది. డబ్ల్యూహెచ్ఓ ప్రకారం, మంకీపాక్స్ వైరస్‌ మనిషి శరీరం లోపలికి ప్రవేశించిన తర్వాత 1 నుంచి 21 రోజుల్లో ఎప్పుడైనా లక్షణాలు బయటపడవచ్చు. పొక్కులు, జ్వరం, గొంతు ఎండిపోవడం, తల, కండరాల నొప్పులు,…

Read More

జమ్మూ కశ్మీర్‌లో ఉదంపూర్ జిల్లాలోని దుడు ప్రాంతంలో సోమవారం ఉగ్రవాదులు మెరుపు దాడికి దిగారు. ఈ దాడిలో సీఆర్పీఎఫ్ ఉన్నతాధికారి మరణించారు. దుడు ప్రాంతంలో సీఆర్పీఎఫ్ బెటాలియన్‌ను మరింతగా మోహరించేందుకు భారత సైన్యం చర్యలు చేపట్టింది. ఆ క్రమంలో బెటాలియన్‌పై ఉగ్రవాదులు మెరుపు దాడికి దిగి.. కాల్పులు జరిపారు. దీంతో సీఆర్పీఎఫ్ అధికారి మరణించారు. జమ్మూలోని కొండ ప్రాంతంలో ఉగ్రవాద వ్యతిరేక చర్యలకు భారత సైన్యం శ్రీకారం చుట్టింది. ఆ ప్రదేశంలో సీఆర్పీఎఫ్ పోస్ట్ ఏర్పాటు చేసేందుకు సన్నాహాకాలు చేస్తుంది. అందులోభాగంగా సీఆర్పీఎఫ్ బెటాలియన్.. సోమవారం ఆ ప్రాంతానికి చేరుకుంది. ఈ విషయాన్ని పసిగట్టిన ఉగ్రవాదులు.. సీఆర్పీఎఫ్‌ బృందంపై మెరుపు దాడికి దిగారు. మరోవైపు ఈ ఏడాది జూన్ నుంచి జమ్మూ కశ్మీర్‌లో ఉగ్రవాద దాడుల సంఖ్య ఇబ్బడి ముబ్బడిగా పెరిగాయి. ఈ దాడుల్లో పలువురు భారత సైన్యానికి చెందిన అధికారులే కాక.. జమ్మూ కశ్మీర్ పోలీసులు సైతం భారీ సంఖ్యలో…

Read More

రుణ‌మాఫీపై శ్వేత‌ప‌త్రం విడుద‌ల చేయాల‌ని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ డిమాండ్ చేశారు. రాఖీ పండుగ‌, ఫొటోగ్ర‌ఫీ దినోత్స‌వం సంద‌ర్భంగా త‌న ఇంటివ‌ద్ద ఏర్పాటు చేసిన కార్య‌క్ర‌మంలో ఆయ‌న మాట్లాడారు. రుణమాఫీ విషయంలో కాంగ్రెస్ చేస్తున్న ప్రచారానికి, వాస్తవానికి పొంతనే లేద‌ని ధ్వజమెత్తారు. రూ.40 వేల కోట్లు మాఫీ చేస్తామని చెప్పి కేవ‌లం రూ.17 వేల కోట్లు మాత్రమే ఖర్చు చేశార‌ని చెప్పారు. ఆరు గ్యారెంటీలు కూడా అమ‌లు చేయ‌కుండ మోసం చేశార‌ని, ఇవన్నీ అడుగుతుంటే బీజేపీలో బీఆర్ఎస్ విలీనమంటూ కాంగ్రెస్ నేత‌లు డ్రామాలు ఆడుతున్నార‌ని మండిపడ్డారు. చనిపోయిన రైతులకు కూడా రుణమాఫీ చేయాలని డిమాండ్‌ చేశారు. . రుణమాఫీ పూర్తిగా చేస్తారా చేయరా చెప్పండి అని ప్రశ్నించారు. ఇటీవల చనిపోయిన రైతులకు కూడా రుణమాఫీ చేయాలని డిమాండ్ చేశారు. నలబై వేల కోట్ల రూపాయల రుణమాఫీ చేస్తా అన్నారు ఇంతవరకు చేయలేదన్నారు. రాష్ట్ర ప్రభుత్వం శ్వేతపత్రం…

Read More

ఏపీ ఫైబర్ నెట్ మాజీ ఎండీ మధుసూదన్ రెడ్డిపై ప్రభుత్వం సస్పెన్షన్ వేటు వేసింది. ఫైబర్ నెట్ కార్పొరేషన్ లో అవినీతిని కప్పి పుచ్చుకునేలా మధుసూధన్ రెడ్డి ప్రయత్నాలు చేస్తున్నారని ప్రభుత్వం జీవోలో పేర్కొంది. ప్రభుత్వ నిధులు దుర్వినియోగం చేశారని మధుసూదన్ రెడ్డి అభియోగాలు ఉన్నాయి.  నిబంధనలకు విరుద్ధంగా ప్రైవేట్ వ్యక్తులను ఉద్యోగులుగా నియామకం చేశారని మధుసూదన్ రెడ్డిపై ఆరోపణలు వచ్చాయి. ఈ కేసు నుంచి బయటపడేందుకు మధుసూదన్ రెడ్డి రికార్డులను ట్యాంపర్ చేస్తున్నారని, సాక్ష్యాలను ధ్వంసం చేస్తున్నారని ప్రభుత్వం జీవోలో పేర్కొంది. మధుసూదన్ రెడ్డి కేంద్ర సర్వీస్ నిబంధనలను ఉల్లంఘించినట్టు ప్రభుత్వం పేర్కొంది. ఆయన హెడ్ క్వార్టర్స్ విడిచి వెళ్లకూడదని ఆదేశాలు జారీ చేసింది. పలువురు ప్రైవేటు వ్యక్తులకు లబ్ది చేకూర్చేలా వ్యవహరించారంటూ అభియోగాలు ఉన్నాయని ప్రభుత్వం జీవోలో పేర్కొంది. ఏపీ ఫైబర్ నెట్ మాజీ ఎండీ ఎం. మధుసూదన్ రెడ్డిపై విచారణలో భాగంగా రైల్వే శాఖకు రాష్ట్ర ప్రభుత్వం…

Read More

మైసూర్‌ అర్బన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ (ముడా) భూకుంభకోణం కేసులో కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్యకు హైకోర్టు తాత్కాలిక ఊరటనిచ్చింది. ముడా నుంచి తన భార్యకు అనుచితంగా లబ్ధి కలిగించినట్లు ఆరోపణలున్నాయి. కుంభకోణం వ్యవహారంలో ముఖ్యమంత్రిని ప్రాసిక్యూట్‌ చేసేందుకు గవర్నర్‌ థావర్‌ చంద్‌ గెహ్లాట్‌ అనుమతి ఇవ్వడాన్ని ఆయన హైకోర్టులో సవాల్‌ చేశారు.  ఈ అంశంపై విచారణ జరిపిన హైకోర్టులో విచారణ జరిగింది. తన ప్రభుత్వాన్ని అణగదొక్కే ప్రయత్నమని ఆయన వాదించారు. జస్టిస్‌ ఎం నాగప్రసన్న బెంచ్‌ ఎదుట సీఎం తరఫున సీనియర్‌ న్యాయవాది అభిషేక్‌ మను సింఘ్వీ వాదనలు, గవర్నర్‌ తరఫున సొలిసిటర్‌ జనరల్‌ తుషార్‌ మెహతా వాదనలు వినిపించారు. ఈ కేసును ఈ నెల 29న విచారణకు జాబితా చేసింది. కేసు విచారణ వరకు మధ్యంతర ఉత్తర్వులు అమలులో ఉంటాయని పేర్కొంది. ఈ సందర్భంగా సమాధానం చెప్పాలని ప్రతివాదులను కోర్టు కోరింది. అయితే, మధ్యంతర ఉత్తర్వులపై ఫిర్యాదుదారులు తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం…

Read More

దేశంలో పెరుగుతున్న జనాభాపై ఇన్ఫోసిస్‌ సహ వ్యవస్థాపకుడు ఎన్‌ఆర్‌ నారాయణమూర్తి ఆందోళన వ్యక్తం చేశారు. ఎమర్జెన్సీ కాలం నుంచి ఇప్పటి వరకూ జనాభా నియంత్రణపై భారతీయులు శ్రద్ధ చూపలేదడం లేదని విచారం వ్యక్తం చేశారు. దీంతో పెరుగుతున్న జనాభా ప్రస్తుతం దేశానికి పెను సవాల్‌గా మారిందని ఆందోళన వ్యక్తం చేశారు ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రం ప్రయాగ్‌రాజ్‌లోని మోతీలాల్‌ నెహ్రూ నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ స్నాతకోత్సవానికి నారాయణమూర్తి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. జనాభా, తలసరి భూమి లభ్యత, ఆరోగ్య సంరక్షణ సౌకర్యాలకు సంబంధించి భారతదేశం గణనీయమైన సవాళ్లను ఎదుర్కొంటోందని చెప్పారు.  ఎమర్జెన్సీ కాలం నుంచి భారతీయులమైన మనం జనాభా నియంత్రణపై తగినంత శ్రద్ధ చూపలేదని, ఇది మన దేశాన్ని అస్థిరపరిచే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. మన దేశంతో పోలిస్తే అమెరికా‌, బ్రెజిల్‌, చైనా వంటి దేశాల్లో తలసరి భూమి లభ్యత చాలా ఎక్కువగా ఉందని నారాయణమూర్తి వివరించారు. దేశ…

Read More