యావత్ తెలంగాణ రాష్ట్రాన్ని అతలాకుతలం చేసిన భారీ వర్షాలు, వరదల నేపథ్యంలో కేంద్రం తగిన రీతిలో ఆదుకోవాలని భారతీయ జనతా పార్టీ (బీజేపీ) ఎంపీ డా. కే. లక్ష్మణ్ కోరారు. గురువారం రాత్రి రాజ్యసభలో ప్రత్యేక ప్రస్తావన ద్వారా మాట్లాడిన ఆయన ఊహించని రీతిలో కురిసిన అతి భారీ వర్షాలు రాష్ట్రంలో మెరుపు వరదలకు కారణమయ్యాయని తెలిపారు. వాటి కారణంగా ప్రజాజీవనం, జీవనోపాధి దెబ్బతిన్నాయని పేర్కొన్నారు. దాదాపు యావత్ తెలంగాణ రాష్ట్రం భారీ వర్షాల ప్రభావానికి గురైందని, గత 10 రోజులుగా వరంగల్, ములుగు, హైదరాబాద్, భద్రాచలం ప్రాంతాలు నీట ముంపులో ఉన్నాయని చెప్పారు. ఒక్క ములుగు జిల్లాలోనే 16 మంది ప్రాణాలు కోల్పోయారని, మొత్తం రాష్ట్రం మీద చోటుచేసుకున్న మరణాల విషయంలో ఇంకా లెక్క తేలాల్సి ఉందని వివరించారు. భూపాలపల్లి జిల్లాలో పోచంపల్లి గ్రామం పూర్తిగా నీట మునిగిపోయిందని సకాలంలో ఆర్మీ సహా ఇతర సహాయ బృందాలు అక్కడికి చేరుకుని…
Author: Editor's Desk, Tattva News
జమ్మూ కశ్మీరులో 370వ అధికరణను రద్దు చేసి రాష్ట్రాన్ని కేంద్ర పాలిత ప్రాంతాలుగా విభజించడంలోని రాజ్యాంగబద్థతను సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లపై చీఫ్ జస్టిస్ డివై చంద్రచూడ్ సారథ్యంలోని ఐదుగురు న్యాయమూర్తుల రాజ్యాంగ ధర్మాసనం బుధవారం విచారణ ప్రారంభించింది. రాజ్యాంగ ధర్మాసనంలో చీఫ్ జస్టిస్ డివై చంద్రచూడ్‌తోపాటు జస్టిస్ ఎస్‌కె కౌల్, జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ బిఆర్ గవాయ్, జస్టిస్ సూర్యకాంత్ ఉన్నారు. పిటిషనర్ల తరఫున వాదనలు ప్రారంభించిన సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్ అనేక విధాలుగా ఇది చారిత్రాత్మక క్షణమని పేర్కొన్నారు. 2019 ఆగస్టు 6న చరిత్ర ఎందుకు తిరగరాయబడింది? ప్రజాస్వామ్యబద్ధంగానే పార్లమెంట్ అనుసరించిందా? జమ్మూ కశ్మీరు ప్రజల మనోభీష్టం అణచివేతకు గురైందా? వంటి విషయాలను న్యాయస్థానం అధ్యయనం చేయనున్నదని తెలిపారు. ఈ కేసు విచారణ చేపట్టడానికి న్యాయస్థానానికి ఐదేళ్లు సమయం పట్టడం, ఈ ఐదేళ్లుగా అక్కడ ప్రజలచేత ఎన్నుకున్న ప్రభుత్వం లేకపోవడం వంటివి కూడా చారిత్రాత్మకం అనడానికి…
జాతీయ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించాలని భావిస్తున్న బిఆర్‌ఎస్ కు ఇండియా, ఎన్డీయే కూటముల్లో ఉండాల్సిన అవసరం లేదని ఆ పార్టీ అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు స్పష్టం చేశారు. బిఆర్‌ఎస్ ఒంటరిగా లేమని, తమతో కలిసి నడిచే మిత్రులున్నారని మహారాష్ట్ర పర్యటనలో వెల్లడించారు. మహారాష్ట్రలోని సాంగ్లి జిల్లా వాటేగాఁవ్ గ్రామంలోని ఇండియన్ మాక్సింగోర్కిగా పేరొందిన అన్నా భావ్‌సాఠే జయంతి వేడుకల్లో పాల్గొన్న ఆయన దేశంలో 50 ఏళ్లకు పైగా అధికారంలో ఉన్న ఆ కూటములలో వారేనని, అయినా మార్పు రాలేదని గుర్తుచేశారు. దేశంలో నూతన మార్పు జరగాల్సిందేనని వాటేగామ్‌లో నిర్వహించిన బహిరంగ సభలో చెప్పారు. ‘మహారాష్ట్రలో సంపదకు కొదవ లేదు. అద్భుతమైన వనరులున్నాయని, ఉపాధి అవకాశాలు అపారమని అయినా ఏ పట్టణానికి వెళ్లినా తాగునీటి కొరత వేధిస్తోంది. దళిత సమాజం ఇప్పటికీ వెనుకబడే ఉంది’ అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. అమెరికాలో వివక్షను విడిచిపెట్టి, నల్లజాతీయుడు బరాక్ ఒబామాను…
దేశంలోని ప్రభుత్వ విధానాల్లో, కష్టించే ప్రజల్లో పూర్తి విశ్వాసం కనిపిస్తోందని పేర్కొంటూ పరస్పర విశ్వాసం లేని చోట అభివృద్ధి సాధ్యం కాదని ప్రధాని నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. ప్రజలు తమ ప్రభుత్వాన్ని పూర్తిగా విశ్వసించే దేశాల్లో భారత్ ఉందని అంతర్జాతీయ సర్వేలో తేలిందని ప్రధాని గుర్తు చేశారు. అపనమ్మకం నుంచి పూర్తి నమ్మకం వైపు భారత్ పయనిస్తోందని చెబుతూ స్వాతంత్య్ర సమరయోధుడు తిలక్ 103 వ వర్ధంతి సందర్భంగా మంగళవారం లోకమాన్య తిలక్ జాతీయ పురస్కారం ప్రదానం చేసిన సందర్భంగా ప్రధాని మోదీ ప్రసంగించారు. తిలక్ స్మారక్ మందిర్ ట్రస్ట్ ఈ పురస్కారాన్ని అందించింది. ఈ మెమెంటోతోపాటు లక్ష రూపాయల ప్రైజ్ మనీని బహూకరించగా, దానిని నమామి గంగ ప్రాజెక్టుకు మోదీ అందజేశారు. ఈ జాతీయ పురస్కారం స్వీకరించడం తనకు ఎంతో గౌరవంగా భావిస్తున్నానని మోదీ పేర్కొన్నారు. గత తొమ్మిదేళ్లలో భారత దేశ ప్రజలు ఎన్నో మార్పులు తీసుకువచ్చారని, ప్రపంచంలోనే…
బీహార్ ప్రభుత్వం చేపట్టిన కులగణన సర్వేను సవాలు చేస్తూ దాఖలైన అన్ని పిటిషన్లను పాట్నా హైకోర్టు మంగళవారం కొట్టేసింది. దీంతో రాష్ట్ర ప్రభుత్వం ఈ సర్వేను తిరిగి ప్రారంభించేందుకు మార్గం సుగమమైంది. ఈ ఏడాది జనవరిలో బీహార్ ప్రభుత్వం కులగణనను మొదలు పెట్టింది. మొదటి దశ సర్వే జనవరి 7- 21 తేదీల మద్య ముగిసింది. రెండో సర్వే ఏప్రిల్ 15న మొదలై మే 15తో ముగియాల్సి ఉండగా, మే 4న పాట్నా హైకోర్టు సర్వేపై స్టే విధించింది. మంగళవారం కులగణనకు వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్లపై హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ కె. వినోద్ చంద్రన్ నేతృత్వంలోని ధర్మాసనం విచారణ జరిపి, వాటిని కొట్టేసింది. దీంతో కుల ప్రాతిపదికన సర్వేను రాష్ట్ర ప్రభుత్వం పునరుద్ధరించవచ్చు. వివిధ అంశాలను ప్రస్తావిస్తూ ఈ సర్వేను నిరోధించాలని పిటిషనర్లు కోరారు. వీటిని డిస్మిస్ చేస్తున్నట్లు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ కే వినోద్ చంద్రన్, జస్టిస్ పార్థసారథి…
మయన్మార్ పౌర నేత ఆంగ్ సాన్ సూకీ కి సైనిక ప్రభుత్వం క్షమాభిక్ష కల్పించినట్లు తెలుస్తోంది. బుద్ధ పూర్ణిమ సందర్భంగా సైనిక ప్రభుత్వం ఈ ప్రకటన చేసినట్లు భావిస్తున్నారు. 2021లో సూకీని సైన్యం అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే. వేర్వేరు కేసుల్లో ఆమెను దోషిగా తేల్చారు. అయితే దేశవ్యాప్తంగా దాదాపు ఏడువేల మంది ఖైదీలకు క్షమాభిక్ష కల్పిస్తున్నట్లు స్థానిక మీడియా తెలిపింది. క్షమిభిక్ష కింద ఆమెపై ఉన్న అయిదు కేసుల్ని రద్దు చేశారు. మరో 14 కేసులు అలాగే ఉన్నట్లు తాజా సమాచారం ప్రకారం తెలుస్తోంది. రాజధాని నైపితాలో ప్రస్తుతం నోబెల్ గ్రహీత సూకీని హౌజ్ అరెస్టు చేశారు. గత సోమవారం ఆమెను ప్రభుత్వ బిల్డింగ్‌కు మార్చినట్లు స్థానిక మీడియా తెలిపింది. ఏడాదిగా ఆమె కఠిన జైలు జీవితాన్ని అనుభవించారు. ఎన్నికల ఫ్రాడ్‌కు చెందిన కేసుల్లో ఆమె కోర్టులో పోరాడుతోంది. తనపై చేసిన అభియోగాలను ఆమె ఖండించారు. క్షమాభిక్ష కల్పించినా.. ప్రస్తుతానికి…
గతేడాది జూన్ నెల జీఎస్టీ వసూళ్ళతో పోల్చుకుంటే 2023 జూన్ నెలలో జీఎస్టీ వసూళ్ళు 12 శాతం పెరిగినట్లు కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి వెల్లడించారు. రాజ్యసభలో మంగళవారం విజయసాయి అడిగిన ప్రశ్నకు మంత్రి రాతపూర్వకంగా బదులిచ్చారు. జీఎస్టీ కింద 2023 జూన్ నెలలో రూ.161,497 కోట్లు వసూలైనట్లు మంత్రి తెలిపారు. ఒక్క నెలలో జీఎస్టీ మొత్తం వసూలు రూ.1.6 కోట్లు అదిగమించడం జీఎస్టీ అమల్లోకి వచ్చిన తర్వాత ఇది నాలుగోసారని తెలిపారు. జీఎస్టీ వసూళ్లలో ప్రతి సంవత్సరం సాధిస్తున్న వృద్ధితో అనుకూల ధోరణి కనిపిస్తోందని పేర్కొన్నారు. పార్లమెంటులో చేసిన చట్టానికి లోబడి జీఎస్టీ యాక్ట్ ప్రకారం జీఎస్టీ అమలు చేయడం ద్వారా మొదటి 5 సంవత్సరాలు 2017 జూన్ 1 నుండి 2022 జూన్ 30 వరకు రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాలకు ఏర్పడ్డ రెవెన్యూ నష్టాలను పూడ్చేందుకు కేంద్రం నష్టపరిహారం చెల్లించిందని తెలిపారు. ఈ చట్టం…
నరేంద్ర మోదీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రతిపక్ష ఇండియా కూటమి ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంపై పార్లమెంట్ ఆగస్టు 8-,9, 10 తేదీలలో చర్చించనున్నది. ప్రధాని నరేంద్ర మోదీ తీర్మానంపై శుక్రవారం మధ్యాహ్నం ప్రసంగించే అవకాశం ఉందని తెలుస్తోంది. గతవారం లోక్‌సభలో ప్రధాని నరేంద్ర మోదీకి వ్యతిరేకంగా అవిశ్వాస తీర్మానాన్ని ప్రతిపక్ష ఇండియా కూటమి ప్రవేశపెట్టింది. లోక్‌సభలో కాంగ్రెస్ పార్టీ ఉపనాయకుడు గౌరవ్ గొగోయ్ అవిశ్వాస తీర్మానం కోసం స్పీకర్‌కు నోటీసు అందచేశారు. 2018 తర్వాత పార్లమెంట్‌లో అవిశ్వాస తీర్మాన్ని ప్రధాని మోదీ ఎదుర్కోవడం ఇది రెండవసారి. అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టిన ఎంపీ గౌరవ్ గగోయ్ నోటీసుపై 50 మంది సభ్యులు సంతకం చేశారు. లోక్‌సభలో 543 మంది సభ్యులు ఉన్నారు. ప్రస్తుతం ఎన్డీఏ బలం 331. విపక్ష కూటమి ఇండియా బలం 144 మంది. అయితే ఈ తీర్మానాన్ని విపక్షం నెగ్గడం కుదరదు. కానీ మణిపూర్ అంశంపై ప్రధాని మోదీ మాట్లాడే విధంగా…
భారతదేశపు మూడో చంద్రుడి మిషన్ చంద్రయాన్-3 విజయవంతంగా సాగిపోతోంది. చందమామపై నిగూఢ రహస్యాలను కనుక్కునేందుకు ఇస్రో ప్రయోగించిన ఈ అంతరిక్ష నౌక భూమి కక్ష్యను వీడి చంద్రుడి కక్ష్యలోకి విజయవంతంగా ప్రవేశించింది. నిన్న అర్ధరాత్రి 12.15 నిమిషాలకు భూకక్ష్యను వీడి చంద్రుడి కక్ష్యలోకి చంద్రయాన్ 3 నౌక ప్రవేశిస్తున్న గ్రాఫిక్ పిక్ ను ఇస్రో ట్విట్టర్ లో షేర్ చేసింది. దీంతో చంద్రయాన్ 3కి మరో కౌంట్ డౌన్ మొదలైంది. భూమి కక్ష్యలో నుంచి చంద్రుడి కక్ష్యలోకి ప్రవేశించిన చంద్రయాన్ 3 నౌక ఈ నెల 5న విజయవంతంగా కక్ష్యలోకి పూర్తిగా ప్రవేశిస్తుంది. అంటే ఈ ఆరు రోజులు కౌంట్ డౌన్ అన్నమాట. ఈ ఆరు రోజుల తర్వాత చంద్రుడి కక్ష్యలో తిరుగుతూ క్రమంగా తన వ్యాసాన్ని తగ్గించుకుంటూ చివరికి చంద్రుడిని చేరడం చంద్రయాన్ 3 లక్ష్యం. కాబట్టి ఈ దశ మరింత కీలకంగా భావిస్తున్నారు. అర్ధరాత్రి చంద్రయాన్ నౌకను భూకక్ష్యలో…
హర్యానాలోని గురుగ్రామ్‌కు సమీపంలో విశ్వహిందు పరిషత్ (వీహెచ్‌పీ) చేపట్టిన ఊరేగింపుపై రాళ్ళ దాడి జరగడంతో తీవ్ర ఘర్షణలకు దారితీసింది. సోమవారం నుహ్ వద్ద వీహెచ్‌పీ చేపట్టిన ‘బ్రిజ్ మండల్ జలాభిషేక్ యాత్ర’ నేపథ్యంలో పెద్ద ఎత్తున హింస చెలరేగింది. పెద్ద సంఖ్యలో వాహనాలకు నిప్పుపెట్టారు. హింసాత్మఘటనల్లో ఇద్దరు హోంగార్డులు మృతి చెందారని, డీఎస్పీ సజ్జన్ సింగ్ తలకు గాయమైందని, ఓ ఇన్‌స్పెక్టర్ తీవ్రంగా గాయపడ్డాడని స్థానిక పోలీసు అధికారి ఒకరు వెల్లడించారు.పదిమంది పోలీసులతో సహా 20 మంది వరకు గాయాలకు గురయ్యారు. గురుగ్రామ్-ఆల్వార్ జాతీయ రహదారిపై వీహెచ్‌పీ ఊరేగింపును కొంతమంది అడ్డుకోవటంతో హింస చెలరేగిందని తెలిపారు. ఈ ఘటనలు రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర ఉద్రిక్తతకు దారితీశాయి. ఇరు వర్గాల వారిని చెదరగొట్టేందుకు పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీస్‌లు మొదట టియర్ గ్యాస్ షెల్స్ ప్రయోగించారు. ఇంకా పరిస్థితిని అదుపులోకి తీసుకురాడానికి కాల్పులు జరిపారు. కాల్పుల్లో గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించారు. రాష్ట్ర…