ఏడాదిలో కురవాల్సిన వాన ఒక్కరోజులోనే కురిసింది. ములుగు జిల్లా వెంకటాపురం మండలం లక్ష్మీదేవిపేటలో 64.98 సెంటీమీటర్ల వర్షపాతంతో కొత్త రికార్డు నమోదైంది. దీని ఫలితంగా జన జీవనం స్తంభించింది. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. తెలంగాణ రాష్ట్ర చరిత్రలోనే ములుగు జిల్లా వెంకటాపురం మండలం లక్ష్మీదేవిపేటలో రికార్డు స్థాయిలో 64.98 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైనట్టు వాతావరణశాఖ స్పష్టం చేసింది. ఇప్పటివరకు ఇదే అత్యధిక వర్షపాతమని తెలిపింది. ఇదే జిల్లా వాజేడులో 2013 జూలై 19న 51.75 సెం.మీ వర్షపాతం నమోదైంది. గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలోని 35 ప్రాంతాల్లో 20 సెం.మీ పైన, 200 కేంద్రాల్లో 10 సెం.మీకుపైగా వర్షపాతం నమోదైంది. రాష్ట్రవ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. తూర్పు, మధ్య తెలంగాణవ్యాప్తంగా ఎడతెరపి లేకుండా వానలు పడుతున్నాయి. హైదరాబాద్‌లో గురువారం ఉదయం నుంచి ఎడతెరపి లేకుండా వర్షం కురిసింది. గత 6 గంటల్లో 60 మి.మీ వర్షపాతం నమోదవ్వగా, తదుపరి కొన్ని…
Author: Editor's Desk, Tattva News
దేశవ్యాప్తంగా పెనుసంచలనం సృష్టించిన మణిపూర్ మహిళల నగ్నంగా ఊరేగింపు, అత్యాచారం వ్యవహారంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసు దర్యాప్తును సీబీఐకి అప్పగిస్తూ కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ ఘటనపై సమగ్ర దర్యాప్తు జరిపి నిజానిజాలను నిగ్గు తేల్చాలని ఆదేశించింది. నిందితులకు శిక్ష పడేలా చూడాలని సీబీఐని కోరింది. అంతేకాదు, ఈ కేసుకు సంబంధించిన ముఖ్యమైన విచారణను మణిపూర్ వెలుపల నిర్వహించాలని ఆదేశించింది. మణిపూర్‌లో ఇంకా అల్లర్లు కొనసాగుతున్న నేపథ్యంలో విచారణకు అంతరాయం కలగొచ్చన్న ఉద్దేశంతో కేంద్రం ఈ మేరకు సూచనలు ఇచ్చినట్లు తెలుస్తోంది. త్వరలోనే ఇందుకు సంబంధించిన అఫిడవిట్ ను సుప్రీంకోర్టులో దాఖలు చేయనున్నట్టు సంబంధిత వర్గాలు తెలిపాయి. కాగా.. మణిపూర్ హింసలో భాగంగా కుకీ తెగకు చెందిన ఇద్దరు మహిళలపై మైతేయీ వర్గంవారు వికృతి చేష్టకు పాల్పడిన తీరుతో భారత్‌తోపాటు ప్రపంచదేశాలు సైతం నివ్వెరపోయాయి. నగ్నంగా ఊరేగింపు, అత్యాచారం ఘటన దాదాపు మూడు నెలల తర్వాత ఒక…
పైరసీకి అడ్డుకట్ట వేసేందుకు ఉద్దేశించిన బిల్లుకు రాజ్యసభ గురువారం ఆమోదం తెలిపింది. మణిపూర్ అంశంపై చర్చ చేపట్టాలని డిమాండ్ చేస్తూ ప్రతిపక్ష సభ్యులు వాకౌట్ చేయడంతో మూజువాణి ఓటుతోనే సినిమాటోగ్రఫీ( సవరణ) బిల్లు2023కు సభ ఆమోదం తెలిపింది. సినిమా పైరసీకి పాల్పడే వారికి మూడేళ్ల వరకు జైలు శిక్ష విధించాలని బిల్లులో ప్రతిపాదించారు. అలాగే సినిమా వ్యయంలో 5 శాతం వరకు జరిమానా విధించేలా నిబంధనలను పొందుపరిచారు. పదేళ్లు చెల్లుబాటయ్యేలా ఇప్పటివరకు సినిమాలకు సర్టిఫికెట్లు ఇస్తుండగా, ఇకపై దాన్ని ఎత్తివేసి శాశ్వత సర్టిఫికెట్లు జారీ చేస్తారు. అలాగే వయసు వారీగా ‘యుఎ’ సర్టిఫికెట్లు జారీ చేయాలని ప్రతిపాదించారు. ఇకపై యుఎ7 ప్లస్,యుఎ 13ప్లస్, యుఎ 16 ప్లస్ సర్టిఫికెట్లు జారీ చేస్తారు.అలాగే టెలివిజన్, ఇతర మాధ్యమాల్లో ప్రసారానికి ప్రత్యేక సర్టిఫికెట్ జారీ చేసేందుకు సిబిఎఫ్‌సి(సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిలిమ్ సర్టిఫికేషన్)కి అనుమతించారు. బిల్లుపై చర్చకు కేంద్ర సమాచార, ప్రసారాల శాఖ మంత్రి…
అమెరికా లోని లాస్‌ఏంజెల్స్, బోస్టన్ నగరాలతోపాటు మరికొన్ని నగరాలకు తమ విమానసర్వీస్‌లను విస్తరింపచేయడానికి ఎయిర్ ఇండియా యోచిస్తోంది. ప్రస్తుతం అమెరికా లోని వాషింగ్టన్ డిసి, న్యూయార్క్, న్యూజెర్సీ, చికాగో, శాన్‌ఫ్రాన్సిస్కో నగరాలకు ఎయిర్ ఇండియా నాన్‌స్టాప్ సర్వీస్‌లు నడుస్తున్నాయి. అయితే కొత్త గమ్యస్థానాలుగా లాస్‌ఏంజెల్స్, బోస్టన్ వంటి నగరాలు మరికొన్నిటికి భారత్ నుంచి సుదూర నాన్‌స్టాప్ సర్వీసులను నడపడానికి సమీక్షిస్తున్నారు. ఈమేరకు కొత్తగా సర్వీస్‌లు విస్తరించేముందు అనేక అంశాలను పరిగణన లోకి తీసుకోవాల్సి ఉంటుందని ఎయిర్ ఇండియా వర్గాలు పేర్కొన్నాయి. ఆయా రూట్లలో ప్రయాణికులు ఎంతమంది ప్రయాణిస్తారో, ఎంతమంది పైలట్లు కేబిన్ లోను, క్షేత్రస్థాయి లోను అవసరమవుతారో, ఎంతమందికి శిక్షణ ఇవ్వాల్సి ఉంటుందో ప్రస్తుతం ఉన్న సిబ్బంది, పైలట్లు ఎందరో ఇవన్నీ పరిశీలించవలసి ఉంటుందని ఆయా వర్గాలు పేర్కొన్నాయి. భారతీయ సంతతికి చెందిన వారు భారీ సంఖ్యలో అమెరికాలో నివాసం ఉంటున్నారు. చాలా మంది అక్కడ పనిచేస్తున్నారు. అలాగే అమెరికా యూనివర్శిటీల్లో…
పశ్చిమ ఆఫ్రికా దేశం నైగర్‌లో దేశాధ్యక్షుడు మహ్మద్ బజౌమ్‌కు వ్యతిరేకంగా సైన్యం తిరుగుబాటు చేసింది. అధ్యక్షుడి నివాసాన్ని బుధవారం చుట్టుముట్టి బజౌమ్, ఆయన కుటుంబాన్ని సైన్యం అదుపు లోకి తీసుకుంది. అనంతరం ప్రభుత్వాన్ని పడగొట్టినట్టు సైన్యం ప్రకటించింది. దేశంలో భద్రతా పరిస్థితులు నానాటికీ క్షీణించడంతోపాటు ఆర్థికంగా, సామాజికంగా పేలవమైన పాలన కొనసాగుతుండడంతో ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని కర్నల్ మేజర్ అమదౌ బద్రామనె ఆ దేశ జాతీయ టీవీ ఛానెల్‌లో ప్రకటించారు. ప్రస్తుతమున్న రాజ్యాంగాన్ని రద్దు చేశామని, దేశ వ్యాప్తంగా అన్ని సంస్థల కార్యకలాపాలను నిలిపివేస్తున్నామని , దేశ సరిహద్దులను కూడా తాము మూసివేసినట్టు సైన్యం ప్రకటించింది. ఇది తమ అంతర్గత వ్యవహారమని, ఇందులో ఇతరులు జోక్యం చేసుకోవద్దని పశ్చిమ దేశాలను హెచ్చరించింది. బజౌమ్ మద్దతుదారులు అధ్యక్ష భవనానికి వెళ్లేందుకు ప్రయత్నించగా ప్రెసిడెన్షియల్ గార్డ్ సభ్యులు వారిని అడ్డుకున్నారు. గాల్లోకి కాల్పులు జరిపి వారిని చెదరగొట్టారు. నైగర్‌లో సైన్యం తిరుగుబాటును ఐక్యరాజ్యసమితి,…
వాతావరణాన్ని నియంత్రించే సముద్ర ప్రవాహాలు శతాబ్దపు మధ్య కాలంలో పతనం కావొచ్చని తాజా అధ్యయనంలో వెల్లడైంది. ప్రస్తుత గ్రీన్‌హౌస్ వాయు ఉద్గారాలు ఇప్పటిలానే కొనసాగితే ఈ శతాబ్దపు మధ్యకాలంలోనే సముద్ర ప్రవాహాలు తగ్గే అవకాశం ఉందని కొత్త పరిశోధన అంచనా వేసింది. ఒకవేళ సముద్ర ప్రవాహాలు తగ్గితే ఐరోపాలో చల్లని వాతావరణం, ఉత్తర అట్లాంటిక్ ప్రాంతంలో తుఫానులు పెరగడం వంటి తీవ్రమైన పరిణామాలు జరుగుతాయని, భూమి వాతావరణంలో పెను మార్పులు సంభవిస్తాయని నేచర్ కమ్యూనికేషన్స్ జర్నల్‌లో ప్రచురించిన పరిశోధన తెలిపింది. అట్లాంటిక్ మెరిడియోనల్ ఓవర్‌టర్నింగ్ సర్క్యులేషన్ (ఎఎంఓసి) అని పిలువబడే ప్రవాహాలు, ఈ శతాబ్దంలో పతనమవుతాయని, 2057నాటికి మరింత ఎక్కువగా పతనమయ్యే అవకాశముందని తాజా పరిశోధన అంచనా వేసింది. గత 150 సంవత్సరాల నుండి సుముద్ర ఉష్ణోగ్రత డేటాపై అధునాతన గణాంక సాధనాలను ఉపయోగిస్తున్నట్లు డెన్మార్క్‌లోని కోపెన్‌హాగన్ విశ్వవిద్యాలయం విశ్లేషణ తేటతెల్లంచేసింది. కాగా, తాజా అధ్యయనం యొక్క సహ సంబంధిత రచయిత…
ప్రధాని మోదీ రాజస్తాన్ పర్యటన సందర్భంగా ప్రధాని కార్యాలయం, రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గహ్లోత్ ల మధ్య మాటల యుద్ధం కొనసాగింది. ప్రధాని కార్యక్రమంలో తన ప్రసంగాన్ని తొలగించారని, అందువల్ల తాను ఆ కార్యక్రమానికి హాజరు కావడం లేదని బుధవారం ఉదయం గహ్లోత్ ట్వీట్ చేశారు. ఆ ప్రసంగంలో తాను అగ్నివీర్ స్కీమ్ రద్దు, రుణమాఫి డిమాండ్ తదితర అంశాలను లేవనెత్తాలనుకున్నానని వెల్లడించారు. ప్రధాని మోదీ బుధవారం రాజస్తాన్ లో పర్యటన సందర్భంగా సికర్ లో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు. మరికొన్ని అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ప్రొటోకాల్ ప్రకారం రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా పాల్గొనాలి. అయితే, ఆ కార్యక్రమంలో తన మూడు నిమిషాల ప్రసంగాన్ని తొలగించారని, అందువల్ల ఆ కార్యక్రమానికి హాజరు కావడం లేదని అశోక్ గహ్లోత్ బుధవారం ఉదయం ట్వీట్ చేశారు. ఆ ప్రసంగంలో తాను అగ్నివీర్ స్కీమ్ రద్దు, రుణమాఫి డిమాండ్.. తదితర…
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో గత కొన్నేళ్లలో వేల సంఖ్యలో బాలికలు, మహిళలు అదృశ్యమయ్యారని కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. బుధవారం రాజ్యసభలో పలువురు ఎంపీలు అడిగిన ప్రశ్నకు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి అజయ్ మిశ్రా ఇచ్చిన రాతపూర్వక సమాధానంలో ఈ విషయం తెలిపారు. తెలుగు రాష్ట్రాల్లో ఏటా వేల సంఖ్యలో అదృశ్యం కేసులు నమోదవుతున్నాయని చెప్పారు. 18 ఏళ్ల లోపు బాలికలు, 18 ఏళ్లు దాటిన మహిళల అదృశ్యంపై నమోదైన వివరాలను వెల్లడించారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో గత మూడేళ్ళలో 72,767 మంది అదృశ్యమైనట్టు చెప్పారు. వీరిలో 15,994 బాలికలు, 56,773 మహిళలు ఉన్నట్లు తెలిపారు. 2019 నుండి 2021 వరకు మూడేళ్లలో ఏపీలో మొత్తం 7,928 మంది బాలికలు, 22,278 మహిళలు చెప్పారు. 2019లో 2,186 మంది బాలికలు, 6,252 మంది మహిళలు, 2020లో 2,374 మంది బాలికలు, 7,057 మంది మహిళలు అదృశ్యమయ్యారని గణాంకాలు విడుదల చేశారు. 2021లో…
తెలంగాణ రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. బుధవారం రాత్రి ఉత్తర, తూర్పు తెలంగాణల్లో భారీ వర్షం కురిసింది. హైదరాబాద్ నగరంలో రాత్రి నుంచి వర్షం కురుస్తోంది. వరంగల్, ములుగు, కరీంనగర్, భూపాలపల్లి, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్ జిల్లాల్లో భారీ వర్షాల కారణంగా వరదలు పోటెత్తుతున్నాయి. ములుగు జిల్లా వెంకటాపురం మండలం లక్ష్మీదేవిపేటలో గత 24 గంటల్లో 649.8 మి.మీ. వర్షం కురిసింది. జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాలలో గత 24 గంటల్లో 616.5 మి.మీ. వర్షపాతం నమోదైంది. అదే జిల్లా రేగొండలో 459.8 మి.మీ. వర్షం కురవగా.. చెల్పూరులో 457 మి.మీ. వర్షం కురిసింది. భారీ వర్షాల నేపథ్యంలో హైదరాబాద్ వాతావరణశాఖ రాష్ట్ర ప్రజానీకానికి హెచ్చరికలు జారీ చేసింది. రాబోయే మూడు రోజుల పాటు రాష్ట్రంలో అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ అంచనా వేసింది. వికారాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, వరంగల్, పెద్దపల్లి, కరీంనగర్, మహబూబాబాద్, సూర్యాపేట, ఖమ్మం, నల్లగొండ…
దేశంలో లోక్‌సభ ఎన్నికలకు ఇంకా ఏడాది సమయం ఉన్నప్పటికీ.. రాజకీయ పార్టీలు మాత్రం ఇప్పటికే ఎన్నికల సంగ్రామంలోకి దూకేశాయి. 2024 లో అధికారం దక్కేది తమకే అంటూ అధికార, విపక్షాలు పోటాపోటీగా ధీమా వ్యక్తం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి విజయం సాధించి, ముచ్చటగా మూడోసారి అధికార పగ్గాలు చేపడుతుందని ప్రధాని నరేంద్రమోదీ ధీమా వ్యక్తం చేశారు. ఇంతకు ముందు ఎన్నడూ లేని విధంగా.. ఊహించని విధంగా దేశం ఎన్నో విజయాలు సాధిస్తోందని చెబుతూ భారతదేశ అభివృద్ధి పరుగు ఆగదని స్పష్టం చేశారు. తమ ప్రభుత్వం మరోసారి గెలిచి మూడోసారి అధికారంలోకి రాగానే ప్రపంచంలోనే భారతదేశం మూడో ఆర్థిక వ్యవస్థగా అవతరిస్తుందని మోదీ తేల్చి చెప్పారు. దేశ రాజధాని ఢిల్లీలో ఉన్న ప్రగతి మైదాన్‌లో కొత్తగా తీర్చిదిద్దిన ఇంటర్నేషనల్ ఎగ్జిబిషన్ కమ్ కన్వెన్షన్ సెంటర్‌ను ప్రధాని ప్రారంభించారు. అనంతరం జీ-20 సదస్సుకు వేదికైన ఈ…