Author: Editor's Desk, Tattva News

డబ్బులు దోచుకోవడానికి సైబర్ నేరస్థులు చివరికి వృద్ధులను టార్గెట్‌గా చేసుకుని వరుసగా నేరాలు చేస్తున్నారు. వారికి మాయమాటలు చెప్పి బ్యాంక్‌లకు సంబంధించిన వివరాలు తెలుసుకుని ఖాతాల్లో ఉన్న డబ్బులను మొత్తం దోచుకుంటున్నారు. ఇలాంటి సంఘటనలు వరుసగా గ్రేటర్ హైదరాబాద్ లోని మూడు పోలీస్ కమిషనరేట్లలో చోటుచేసుకుంటున్నాయి. గతంలో డిడి కాలనీకి చెందిన వృద్ధుడికి సైబర్ నేరస్థులు ఫోన్ చేసి మీ డెబిట్ కార్డు ఎక్స్‌పైరీ అయిందని, వెంటనే రెన్యూవల్ చేసుకోకపోతే బ్లాక్ చేస్తామని చెప్పడంతో వెంటనే బాధితుడు సైబర్ నేరస్థులు అడిగిన వివరాలు చెప్పాడు. అంతే నిందితులు వృద్ధుడి బ్యాంక్ ఖాతాలోని డబ్బులు మొత్తం వేరే వారి ఖాతాకు ట్రాన్స్‌ఫర్ చేసుకున్నారు. ఈ విషయం కొద్ది రోజుల తర్వాత వృద్ధుడు బ్యాంక్‌కు వెళ్లి తన ఖాతా వివరాలు అడిగే సరికి బయటపడింది. వెంటనే హైదరాబాద్ సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. బేగంపేటకు చెందిన ఓ రిటైర్డ్ ప్రభుత్వ ఉద్యోగికి ఫోన్…

Read More

భారీ వర్షాల కురుస్తుండడంతో గుజరాత్ అతలాకుతలమైంది. ఎడతెరిపిలేకుండా కురుస్తున్న కుండపోత వానలతో పలు ప్రాంతాలను వరదలు ముంచెత్తుతున్నాయి. శనివారం రాత్రి కురిసిన వర్షానికి అహ్మదాబాద్ ఎయిర్ పోర్ట్ నీట మునిగింది. జునాగఢ్ జిల్లాలో భారీ వరద ప్రవాహంలో కార్లు, పశువులు కొట్టుకుపోయాయి. ఈ క్రమంలో కారు కోసం వెళ్లి కుటుంబ సభ్యుల కళ్ళ ముందే వరదల్లో కొట్టుకుపోయాడు. మరోవైపు నవ్‌సారి పట్టణంలో గ్యాస్ సిలిండర్లు వరదల్లో కొట్టుకుపోయాయి. కాగా, గుజరాత్ లో భారీ వర్షాలకు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దాంతో రాష్ట్రంలోని పలుచోట్ల లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. అహ్మదాబాద్‌ ఎయిర్‌పోర్టులోకి కూడా భారీగా వరద నీరు వచ్చి చేరింది. దాంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. టెర్మినల్‌ ఏరియాలతోపాటు రన్‌వే పైకి కూడా వరద నీరు వచ్చి చేరింది. దాంతో ప్రయాణికులు సమయానికి తమ ఫ్లైట్‌ను చేరుకోవడంలో సమస్యలు ఎదుర్కొంటున్నారు. మోకాళ్ల లోతు నీళ్లలో…

Read More

నెల్లూరు ప్రభుత్వ ఆసుపత్రిలో శుక్రవారం ఒక్క రోజే ఆరుగురు రోగులు మృతి చెందడం కలకలం రేపింది. మృతుల్లో సాంబయ్య (60), ఎస్‌.లీలావతి (62), పి.రమేష్‌ (42), ఎన్‌.చలపతి (52), వై.సుందరం (70), చెంచమ్మ (70) ఉన్నారు. ఆక్సిజన్‌ అందకే వారు మరణించారని మీడియాలో శనివారం రావడంతో దీనిపై విచారణ జరపాలని డిఎం అండ్‌ హెచ్‌ఒను జిల్లా కలెక్టర్‌ హరినారాయణన్‌ ఆదేశించారు.  దీంతో, జిజిహెచ్‌కు వచ్చి డిఎం అరడ్‌ హెచ్‌ఒ పెంచలయ్య విచారణ చేపట్టారు. ఆస్పత్రికి రోగులు ఎప్పుడు వచ్చారు? ఏ కండిషన్లో వచ్చారు. వారికి వైద్యులు ఎలాంటి వైద్యం అందించారు? వారు ఏ కారణంతో చనిపోయారు? అనే విషయాలపై ఆరా తీశారు. రికార్డులను పరిశీలించారు. కలెక్టర్‌ కూడా జిజిహెచ్‌కు వచ్చి వివరాలు సేకరించారు.  మీడియాతో డిఎం ఆరడ్‌ హెచ్‌ఒ పెంచలయ్య, జిజిహెచ్‌ సూపరింటెండెంట్‌ నాయక్‌ మాట్లాడుతూ ఆక్సిజన్‌ అందక చనిపోయారనేది దుష్ప్రచారమని తెలిపారు. ఆస్పత్రిలో ఆక్సిజన్‌ కొరత లేదని, ఆస్పత్రికి చెన్నరు…

Read More

మహారాష్ట్ర లోని రాయ్‌గఢ్ జిల్లా కొండ ప్రాంతమైన ఇర్షల్ వాడీలో బుధవారం రాత్రి కొండచరియలు విరిగి పడి భారీగా ప్రాణ నష్టం జరిగింది. వీరిలో 25 మంది మృతి చెందగా, 80 మందికి పైగా ఆచూకీ ఇంకా లభ్యం కాలేదు. కొండచరియల కింద ఎంతమంది ఉన్నారో సరిగ్గా తెలియడం లేదు. కొండచరియల కారణంగా కూలిన ఇళ్ల శిధిలాల కింద ఎవరైనా చిక్కుకుని ఉంటే వారు బతికే అవకాశాలు తక్కువేనని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ ప్రమాదం నేపథ్యంలో మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ ఘటనలో తల్లిదండ్రులను కోల్పోయిన 22 మంది చిన్నారులను ఆయన దత్తత తీసుకోనున్నారని శివసేన పార్టీ వెల్లడించింది. రెండు నుంచి 14 ఏళ్ల మధ్యలో ఉన్న చిన్నారులను శ్రీకాంత్ షిండే ఫౌండేషన్ కింద ఆశ్రయం పొందుతారని చెప్పారు. ముఖ్యమంత్రి కుమారుడు, కల్యాణ్ ఎంపీ డాక్టర్ శ్రీకాంత్ షిండే నడుపుతున్న శ్రీకాంత్ షిండే ఫౌండేషన్…

Read More

ఆలయ నిర్వహణకు సంబంధించి తిరుమల తిరుపతి దేవస్థానములు (టీటీడీ) ప్రపంచానికే దిక్సూచిగా నిలుస్తోందని టీటీడీ ఈవో ధర్మారెడ్డి వెల్లడించారు. ఆలయ నిర్వాహకుల దృఢ నిశ్చయం, లక్ష్యం, చిత్తశుద్ధి, భక్తి దేవాలయాల పరిపాలన, అభివృద్ధికి క‌చ్చితంగా ఉపయోగపడతాయని తెలిపారు. ఉత్తరప్రదేశ్‌ లోని వారణాసిలో మూడు రోజుల పాటు జరిగే అంతర్జాతీయ దేవాలయాల సమ్మేళనంలో ఈవో పాల్గొన్నారు. 30 దేశాలకు చెందిన వివిధ హిందూ దేవాలయాల నిర్వాహకులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ప్రపంచ ప్రఖ్యాతి చెందిన పుణ్యక్షేత్రమైన తిరుమలకు వచ్చే లక్షలాది మంది భక్తులకు టీటీడీ కల్పిస్తున్న వసతులు, ఆధ్యాత్మిక, సామాజిక సేవా కార్యక్రమాలు, ఆలయ నిర్వహణకు సంబంధించిన పాలనా వ్యవస్థపై ఈవో అందించిన పవర్‌పాయింట్‌ ప్రజెంటేషన్‌ నిర్వాహకుల దృష్టిని ఆకర్షించింది. ఈ సందర్భంగా ఈవో ధ‌ర్మారెడ్డి ప్రసంగిస్తూ యాత్రికులకు శ్రీవారి దర్శనం, వసతి, తలనీలాలు, లడ్డూల తయారీ తదితర అంశాల్లో టీటీడీ ప్రపంచంలోనే మొదటి స్థానంలో నిలుస్తోందని చెప్పారు. ఆలయం పవిత్రంగా ఉండాలని,…

Read More

మావోయిస్టు అగ్రనేత ఆర్‌కె భార్య శిరీషను జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్‌ఐఏ) అరెస్టు చేసింది. ఈ మేరకు ఎన్‌ఐఏ ఓ ప్రకటన విడుదల చేసింది. గుంటూరులో ఉంటున్న శిరీష అనారోగ్యంతో బాధపడుతోంది. చికిత్స కోసం విజయవాడకు వెళ్లి వచ్చే సరికి ఎన్‌ఐఏ అధికారులు ఇంట్లో సోదాలు నిర్వహించారు. శిరీష వచ్చిన వెంటనే ఆమెను, దుడ్డు ప్రభాకర్‌ను అదుపులోకి తీసుకున్నారు. ఇద్దరు మావోయిస్టుల కోసం పనిచేస్తున్నారని తెలిపారు. వీరు మావోయిస్టుల నుంచి భారీగా నిధులు తీసుకున్నారని పేర్కొన్నారు. ఈ విషయం ఆరెకె డెయిరీ ఆధారంగా అరెస్టు చేసినట్లు అధికారులు పేర్కొన్నారు. 2019 తిరియా ఎన్‌కౌంటర్‌లో ప్రభాకర్, శిరీష ఇద్దరు పాల్గొన్నట్లు ఎన్‌ఐఏ తెలిపింది. మావోయిస్టుల కోసం రిక్రూట్‌మెంట్ కూడా వీరు నిర్వహిస్తున్నారని తెలిపారు. మావోయిస్టుల వారోత్సవాల సందర్భంగా భారీ కుట్రకు ప్రణాళిక సిద్ధం చేశారని వివరించారు. మావోయిస్టు అగ్రనేత ఆర్కే సతీమణి శిరీష అలియాస్‌ పద్మను ఎన్ఐఎ శుక్రవారం సాయంత్రం ప్రకాశం జిల్లా టంగుటూరు…

Read More

ఉత్తర కొరియా దేశానికి దక్షిణ కొరియా తీవ్ర హెచ్చరికలు పంపింది. ఉత్తర కొరియా అణుదాడికి పాల్పడితే కిమ్ జోంగ్ ఉన్న పాలన అంతమైనట్టేనని తీవ్ర వ్యాఖ్యలు చేసింది. ఈమేరకు దక్షిణ కొరియా వార్తా సంస్థ కథనం పేర్కొంది. అణు క్షిపణులను ప్రయోగించే సామర్ధమున్న అమెరికా జలాంతర్గామిని ఇటీవల దక్షిణ కొరియా సమీపంలో నిలిపి ఉంచారు. 1980ల తరువాత ఒక ఎస్‌ఎస్‌బీఎన్ ఆ ప్రాంతానికి రావడం ఇదే తొలిసారి. ఉత్తర కొరియా నుంచి ఇటీవల కాలంలో కవ్వింపు చర్యలు పెరగడంతో దక్షిణ కొరియా రక్షణకు కట్టుబడి ఉన్నామంటూ అమెరికా ఈ జలాంతర్గామిని కొరియా ద్వీపకల్పానికి తీసుకువచ్చింది. దీనిపై కిమ్ ప్రభుత్వం తీవ్రంగా స్పందించింది. ఈ తీరు అణుదాడికి దారి తీయొచ్చని వ్యాఖ్యానించింది. అదే జరిగితే కిమ్ పాలన అంతమవుతుందని దక్షిణ కొరియా హెచ్చరికలు పంపింది. “దక్షిణ కొరియా అమెరికా కూటమిపై ఉత్తర కొరియా అణుదాడి చేస్తే మా కూటమి నుంచి తీవ్రస్థాయి ప్రతిస్పందన…

Read More

మణిపూర్‌లో వివిధ వర్గాల మధ్య ఘర్షణల నేపథ్యంలో ఇద్దరు మహిళలను నగ్నంగా ఊరేగించిన దారుణం బయటపడిన కొద్ది రోజులకు పశ్చిమ బెంగాల్‌లో కూడా అటువంటి దుశ్చర్య బయటపడింది. దొంగతనానికి పాల్పడ్డారనే నెపంతో ఇద్దరు మహిళలను అర్ధనగ్నంగా చేసి, కొందరు మహిళా వ్యాపారులు కొట్టినట్లు కనిపిస్తున్న వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. దీంతో బీజేపీ, టీఎంసీ మధ్య వాగ్యుద్ధం మరింత ముదిరింది. పశ్చిమ బెంగాల్‌లోని మాల్డాలో మూడు, నాలుగు రోజుల క్రితం స్థానిక మహిళా వ్యాపారులు ఇద్దరు మహిళలను పట్టుకున్నారు. వీరిద్దరూ దొంగతనం చేస్తున్నారని ఆరోపిస్తూ, వారి శరీరం పైభాగంలోని వస్త్రాలను తొలగించి, కొట్టారు. అయితే అటు వ్యాపారులు కానీ, ఇటు బాధిత మహిళలు కానీ ఈ సంఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేయలేదు. ఈ వీడియో తమ దృష్టిలో పడిన తర్వాత మాత్రమే ఈ సంఘటన గురించి తమకు తెలిసిందని పోలీసులు చెప్తున్నారు. బాధితులు పారిపోగా, వారిని పట్టుకున్నవారు కూడా ఫిర్యాదు…

Read More

టీమిండియా స్టార్‌ బ్యాటర్‌ విరాట్‌ కోహ్లీ తన 500వ అంతర్జాతీయ మ్యాచులో సెంచరీ చేసి మరో రికార్డు సాధించాడు. 181 బంతుల్లో కోహ్లి తన సెంచరీ మార్క్‌ను అందుకున్నాడు. తన పేవరెట్‌ షాట్‌ కవర్‌ డ్రైవ్‌తో కోహ్లీ ఈ ఘనత సాధించాడు.  పోర్ట్ ఆఫ్ స్పెయిన్ వేదికగా వెస్టిండీస్‍తో జరుగుతున్న రెండో టెస్టులో సెంచరీ చేసిన కోహ్లీ.. 500వ అంతర్జాతీయ మ్యాచ్‍లో శతకం సాధించిన తొలి క్రికెటర్‌గా రికార్డు సృష్టించాడు. ఈ శతకం తర్వాత విరాట్‌ కోహ్లీ.. యువ బ్యాటర్‌ శుభ్‌మన్‌ గిల్‌ తరహాలో సెలబ్రేషన్స్‌ చేసుకోవడం విశేషం. ఈ సెంచరీతో కలిపి టెస్టుల్లో ఇప్పటివరకు విరాట్‌ కోహ్లీ 29 శతకాలు బాదాడు. మొత్తంగా అంతర్జాతీయ క్రికెట్‌లో 76వ శతకం నమోదు చేశాడు. కోహ్లీకి వన్డేల్లో 46, టీ-20ల్లో ఒక సెంచరీ ఉన్నాయి.  ప్రపంచ వ్యాప్తంగా అంతర్జాతీయ క్రికెట్‌లో అత్యధిక సెంచరీలు సాధించిన ఆటగాళ్లలో టీమిండియా దిగ్గజ క్రికెటర్‌ వంద సెంచరీలతో…

Read More

వ‌చ్చే ఎన్నిక‌ల‌లో బిజెపి తెలంగాణ‌లో ప్ర‌భుత్వం ఏర్పాటు ఖాయ‌మ‌ని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. కెసిఆర్ అవినీతి పాల‌న‌ను అంతం చేసే బుల్ డోజ‌ర్ ప్ర‌భుత్వం రావాల‌ని ప్ర‌జ‌లంద‌రూ కోర‌కుంటున్న‌రని అయ‌న స్పష్టం చేశారు. తెలంగాణ పార్టీ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన త‌ర్వాత నాంపల్లిలోని పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ,. ”కేసీఆర్‌.. రోజులు లెక్కపెట్టుకోండి. మీ కుటుంబాన్ని ఫామ్‌ హౌస్‌కే పరిమితం చేస్తాం. మీ కుటుంబానికి బానిసలం కాదు” అంటూ హెచ్చరించారు. “నిజాం భవనాన్ని తలపించేలా ప్రగతి భవన్‌ కట్టుకున్నారు. పేద ప్రజల ఇళ్ల కోసం మాత్రం స్థలం, నిధులు ఉండవు. బిఆర్ఎస్, బిజెపి ఒక్కటేనని కాంగ్రెస్‌ నేతలు ఆరోపిస్తున్నారు. 10 ఎకరాలు పార్టీ కార్యాలయం కోసం ఇచ్చిందెవరు? తీసుకున్నది ఎవరు?” అని ప్రశ్నించారు.  కాంగ్రెస్‌ పార్టీని తలదన్నేలా బిఆర్ఎస్ అవినీతి చేసిందని ధ్వజమెత్తుతూ తాము ఏ పార్టీతో కలవం.. కల్వకుంట్ల కుటుంబాన్ని…

Read More