Author: Editor's Desk, Tattva News

ఇండియన్‌ కోస్ట్‌ గార్డ్‌ డైరెక్టర్‌ జనరల్‌ రాకేష్‌ పాల్‌(58) గుండెపోటుతో మరణించారు. ఆదివారం కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌తో పాటు కోస్ట్‌గార్డ్‌కు సంబంధించిన కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చిన ఆయనకు హఠాత్తుగా గుండె నొప్పి రావడంతో అప్రమత్తమైన అధికారులు వెంటనే ఆయన్ని రాజీవ్‌ గాంధీ గవర్నమెంట్‌ జనరల్‌ ఆస్పత్రిలో చేర్చారు. చికిత్స పొందుతూ కన్ను మూసినట్లు వైద్యులు వెల్లడించారు. రాకేశ్ పాల్ పార్థివదేహాన్ని ఢిల్లీకి తరలించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయని అధికారులు తెలిపారు. రాకేశ్ పాల్​ భౌతిక కాయానికి కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్‌​నాథ్​ సింగ్​, తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ నివాళులు అర్పించారు. ‘ఈ రోజు చెన్నైలో ఇండియన్ కోస్ట్​గార్డ్ డీజీ శ్రీ రాకేశ్ పాల్ అకాల మరణం పట్ల తీవ్ర విచారం వ్యక్తం చేస్తున్నా. ఆయన సమర్థుడైన, నిబద్ధత కలిగిన అధికారి. ఆయన నాయకత్వంలో సముద్ర భద్రతను పటిష్ఠం చేయడంలో భారత్​ ప్రగతిని సాధిస్తోంది. ఆయన కుటుంబ సభ్యులకు నా హృదయపూర్వక…

Read More

అక్రమ నిర్మాణాలపై ‘హైడ్రా’ కొరడా ఝుళిపిస్తోంది. నార్సింగి మున్సిపాలిటీలోని ఖానాపూర్ పరిధిలో చెరువు ఎఫ్‌టిఎల్ బఫర్ జోన్‌లో గత ప్రభుత్వం హయాంలో ఇష్టారాజ్యంగా నిర్మించిన అక్రమ నిర్మాణాలను నేలమట్టం చేశారు. ఉదయం నుంచి భారీ పోలీసు బందోబస్తు నడుమ అక్రమ నిర్మాణాల కూల్చివేత ప్రక్రియ సాయంత్రం వరకు కొనసాగింది. బఫర్ జోన్‌లలో ఉన్న సర్వే నంబరు 233/2, 246, 63 లలో నిర్మించిన ప్రహరీ, ఓఆర్‌ఆర్ స్పోర్ట్, నార్సింగి మున్సిపాలిటి పరిధిలోని చెరువులో నిర్మించిన హోటల్ లను నేలమట్టం చేశారు. నిర్మాణాలను కూల్చివేస్తున్న సమయంలో భవన నిర్మాణాల యజమానులు, అధికారుల మధ్య వాగ్వాదం చోటుచేసుకోవటంతో భద్రతా సిబ్బంది వారిని పోలీసుస్టేషన్‌కు తరలించారు. సుమారు 40కి పైగా నిర్మాణాలను పూర్తిగా నేలమట్టం చేశారు. కూల్చివేస్తున్న నిర్మాణాల వివరాలను సైతం అధికారులు గోప్యంగా ఉంచుతూ అ క్రమ నిర్మాణాలను కూల్చివేసే వరకు మీడియాకు సైతం వివరాలు తెలపడం లేదు. నార్సింగి, మణికొండ మున్సిపాలిటీ, బండ్లగూడ…

Read More

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, అగ్రనేత రాహుల్ గాంధీకి లేఖరాశారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన రుణమాఫీ గుర్తు చేస్తూ.. అమలులో ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరును వివరించారు. తెలంగాణ రైతులను కాంగ్రెస్ ప్రభుత్వం రుణమాఫీ పేరుతో మోసం చేసిందని చెప్పారు. రాష్ట్రంలో రుణమాఫీ అందని లక్షలాది మంది రైతుల తరఫున ఈ లేఖ రాస్తున్నానని తెలిపారు. తెలంగాణ వ్యాప్తంగా రోడ్లపై ఆందోళనలు చేస్తున్నారని.. రైతులందరికీ రుణమాఫీ చేయకుంటే వారి తరఫున కాంగ్రెస్‌ పార్టీపై పోరాడతామని ఆ లేఖ ద్వారా హెచ్చరించారు. వరంగల్‌ రైతు డిక్లరేషన్‌ పేరిట రైతులకు రెండు లక్షల రుణమాఫీ హామీ ఇచ్చారని, కానీ ఈ ప్రభుత్వం అనేక షరతులు పెట్టి 40 శాతం మందికి మాత్రమే రుణమాఫీ చేసిందని కేటీఆర్‌ మండిపడ్డారు. 40 వేల కోట్ల రూపాయల రుణమాఫీ అని చెప్పి కేవలం 17 వేల కోట్ల రుణమాఫీతో రైతులను నట్టేట ముంచిందని…

Read More

భారత్ లో సోమవారం ‘సూపర్ బ్లూ మూన్’ కనువిందు చేయనుంది. నీలి రంగులో చంద్రుడు భారీ సైజులో దర్శనమివ్వనున్నాడు. ఈ మేరకు అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా వెల్లడించింది. సాధారణంగా ఒక ఏడాదిలో రెండు, మూడు సూపర్‌ మూన్స్‌ ఏర్పడుతుంటాయి. బ్లూ మూన్‌ మాత్రం అరుదుగా ఏర్పడుతుందని నాసా పేర్కొంది. అయితే, ఈ సారి మాత్రం సూపర్‌ మూన్‌, బ్లూ మూన్‌ కలయికలో సూపర్‌ బ్లూ మూన్‌ దర్శనం ఇవ్వబోతున్నది. ఈ సూపర్ మూన్ నేటి ఉదయం నుంచి బుధవారం ఉదయం వరకు వివిధ దేశాల్లో వేర్వేరు సమయాల్లో చూడొచ్చని పేర్కొంది. అయితే, మంగళవారం ఉదయం సూపర్ మూన్ అత్యంత స్పష్టంగా కనిపిస్తుందని నాసా వివరించింది. ఈ ఏడాది ఇదే తొలి సూపర్ మూన్ కాగా భారత్ లో ఆగస్టు 19 రాత్రి నుంచి ఆగస్టు 20 ఉదయం వరకు కనిపిస్తుంది. పౌర్ణమి వేళల్లో చంద్రుడు భూమికి 90 శాతం…

Read More

కోల్‌కతా రేప్ అండ్ మర్డర్ కేసును సుప్రీంకోర్టు సుమోటోగా స్వీకరిస్తూ ఆదివారం నిర్ణయించింది. ప్రధాన న్యాయమూర్తి డీవై చంద్రచూడ్, న్యాయమూర్తులు జేబీ పార్దివాలా, మనోజ్ మిశ్రాలతో కూడిన ధర్మాసనం ఆగస్టు 20న ఈ కేసును విచారించనుంది. కోల్‌కతాలోని ఆర్జీ కర్‌ ఆసుపత్రి ఘటన కేసును సుమోటోగా స్వీకరించాలని కోరుతూ ఇద్దరు న్యాయవాదులు చీఫ్ జస్టిస్ డీవై చంద్రచూడ్‌కి లేఖ రాశారు. కేసుకు ఉన్న ప్రాధాన్యత దృష్ట్యా విచారణ చేపట్టనున్నట్లు సుప్రీం అధికారిక వెబ్‌సైట్‌లో తెలిపింది. ఈ కేసును కలకత్తా హైకోర్టు ఇప్పటికే సీబీఐకి బదిలీ చేసిన విషయం తెలిసిందే. రంగంలోకి దిగిన సీబీఐ విచారణను వేగవంతం చేసింది.ప్రధాన నిందితుడికి మానసిక సామర్థ్య పరీక్షలు నిర్వహించేందుకు సిద్ధమవుతోంది. నిందితుడు సంజయ్ రాయ్‌కు సైకోనాలసిస్ పరీక్ష చేయడానికి ఢిల్లీలోని ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీ నుంచి కొందరు నిపుణులను సీబీఐ కోల్‌కతాకి పంపించింది. ఆగస్ట్ 9న ఆర్జీ కర్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్‌లోని సెమినార్ హాల్‌లో…

Read More

సంచలనం సృష్టించిన కోల్‌కతా ట్రైనీ డాక్టర్ అత్యాచారం, హత్య కేసు కీలక మలుపులు తిరుగుతోంది. ఈ ఘటనపై తప్పుడు సమాచారం వ్యాప్తి చేశారనే అభియోగంపై ప్రశ్నించేందుకు  అధికార తృణమూల్‌ కాంగ్రెస్‌ (టీఎంసీ) ఎంపీ సుఖేందు శేఖర్ రే తో పాటు బీజేపీ మాజీ ఎంపీ లాకెట్ ఛటర్జీకి కోల్‌కతా పోలీసులు సమన్లు పంపారు. ఆమెతో పాటు డాక్టర్లు కునల్ సర్కార్, సుబర్నో గోస్వామి కూడా సమన్లు జారీ చేశారు. ఆదివారం మధ్యాహ్నం 3 గంటల లోపు పోలీస్ స్టేషన్‌కు హాజరు కావాలని సమన్లలో పేర్కొన్నారు. ఆర్‌జీ కర్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్‌లో ట్రైనీ లేడీ డాక్టర్‌పై హత్యాచారానికి సంబంధించి పలు ప్రశ్నలను ఎంపీ సుఖేందు లేవనెత్తారు. ఈ కేసుపై సీబీఐ న్యాయంగా వ్యవహరించాలని ఆయన కోరారు. తొలుత సూసైడ్‌ స్టోరీ చెప్పిన మెడికల్‌ కాలేజీ మాజీ ప్రిన్సిపాల్, పోలీస్ కమిషనర్‌ను కస్టడీలో విచారించాలని డిమాండ్‌ చేశారు. హాల్ గోడను ఎందుకు కూల్చివేశారని…

Read More

కోల్‌కతాలో జూనియర్‌ డాక్టర్‌పై లైంగిక దాడి, హత్య ఘటనపై దేశవ్యాప్తంగా వైద్యులు, వైద్యసిబ్బంది ఆందోళనకు దిగారు. శనివారం 24 గంటల సమ్మె నిర్వహించారు. దీంతో వైద్యసేవలు స్తంభించిపోయాయి. అన్ని రాష్ర్టాల్లోనూ వైద్యులు, వైద్య విద్యార్థులు, సిబ్బంది విధులు బహిష్కరించి ఆందోళన చేపట్టారు. వైద్యుల సమ్మెతో అనేక దవాఖానాల్లో ఓపీ, డిస్పెన్సరీ వంటి వైద్యసేవలు నిలిచిపోయాయి. ప్రజలకు ఇబ్బంది కలగకుండా ఐసీయూ, ఎమర్జెన్సీ విభాగం, ఆపరేషన్‌ థియేటర్ల కార్యకలాపాలను మాత్రం వైద్యులు కొనసాగించారు. కోల్‌కతా ఘటనను సుమోటోగా తీసుకొని విచారణ జరపాలని కోరుతూ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌కు మూడు లేఖలు అందాయి. కాగా, గుజరాత్‌లోని అమ్రేలీలో వైద్యుల నిరసన కార్యక్రమంలో తన లైసెన్డ్స్‌ తుపాకీని ప్రదర్శించారనే ఆరోపణలతో జీజే జజీరా అనే వైద్యుడిపై పోలీసులు కేసు నమోదు చేశారు. కోల్‌కతా ఘటనకు వ్యతిరేకంగా విదేశాల్లోనూ నిరసనలు జరిగాయి. యూకేలో భారతీయ వైద్యులు, వైద్య విద్యార్థులు లండన్‌లోని ఇండియా హౌస్‌…

Read More

అంతర్జాతీయ ప్రమాణాలతో ఫోర్త్ సిటీ నిర్మాణం ఉంటుందని చెబుతున్న తెలంగాణ సర్కార్ హైదరాబాద్ లో యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీని ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఈ నిర్మాణం కూడా ఫోర్త్ సిటీ పరిధిలోనే ఉండనుంది. దాదాపు 12 వివిధ క్రీడల అకాడమీలను ఇందులో ఏర్పాటు చేయాలని తెలంగాణ ప్రభుత్వం భావిస్తోంది.  వీటిలో అంతర్జాతీయ స్థాయి అధునాతన మౌలిక సదుపాయాలు ఉంటాయి. ఈ స్పోర్ట్స్ హబ్ లో స్పోర్ట్స్ సైన్స్ సెంటర్, స్పోర్ట్స్ మెడిసిన్ సెంటర్ కూడా అందుబాటులో ఉండేలా ఏర్పాట్లు చేస్తారు. స్పోర్ట్స్ వర్సిటీకి అనువైన స్థలంగా ప్రస్తుతం హకీంపేటలో ఉన్న స్పోర్ట్స్ స్కూల్ లేదా గచ్చిబౌలిలోని స్పోర్ట్స్ కాంప్లెక్స్‌లను పరిశీలిస్తున్నారు.  సదరు క్యాంపస్ ను ఒలింపిక్స్ స్థాయి అంతర్జాతీయ ప్రమాణాలుండేలా అప్‌గ్రేడ్ చేయాలని నిర్ణయించారు. ముఖ్యమంత్రి  రేవంత్ ఇటీవల దక్షిణ కొరియా పర్యటనలో ప్రపంచంలోనే గొప్ప పేరున్న కొరియన్ నేషనల్ స్పోర్ట్స్ యూనివర్శిటీని సందర్శించారు. ఒలంపిక్స్ పారిస్ 2024లో దక్షిణ…

Read More

పారిస్ ఒలింపిక్స్ 2024లో అనర్హత వేటుకు గురైన భారత మహిళా రెజ్లర్ వినేష్ ఫొగట్.. స్వదేశానికి తిరిగి వచ్చారు. విశ్వ క్రీడ‌ల్లో ఊహించిన విధంగా ప‌త‌కం కోల్పోయిన భార‌త రెజ్ల‌ర్ వినేశ్ ఫొగాట్‌ కు సొంత‌గ‌డ్డ‌పై అపూర్వ స్వాగ‌తం ల‌భించింది. ఢిల్లీ విమానాశ్ర‌యం అవ‌త‌ల భారీగా జ‌మ‌కూడిన అభిమానులు వినేశ్‌కు చాంపియ‌న్ త‌ర‌హాలో వెల్‌క‌మ్ చెప్పారు.  పారిస్ ఒలింపిక్స్‌లో ప‌త‌కం చేజారిన బాధ‌లో ఉన్న రెజ్ల‌ర్ ఒక్క‌సారిగా భావోద్వేగానికి గురైంది.  రెజ్లర్లు సాక్షి మాలిక్, బజరంగ్ పునియా సహా పలువురు అథ్లెట్లు ఆమెకు స్వాగతం పలికారు. వాళ్లంద‌రూ త‌న‌పై చూపిస్తున్న అభిమానానికి, ప్రేమ‌కు ఫిదా అయిన ఆమె అనంత‌రం మీడియాతో మాట్లాడింది. ‘మీ ప్రేమ ముందు వెయ్యి బంగారు ప‌త‌కాలైనా త‌క్కువే’ అని వినేశ్ అంది. పారిస్ నుంచి వినేశ్ శ‌నివారం ఢిల్లీ వ‌చ్చింది. అక్క‌డ రెజ్ల‌ర్లు బ‌జ్‌రంగ్ పూనియా, సాక్షి మాలిక్ ఆధ్వ‌ర్యంలో ఆమెకు ఘ‌న స్వాగ‌తం ల‌భించింది. ‘చాంపియ‌న్…

Read More

కర్ణాటక ముఖ్యమంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత సిద్ధరామయ్య చిక్కుల్లో పడ్డారు. కర్ణాటకలో రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తోన్న మైసూరు నగరాభివృద్ధి ప్రాధికార (ముడా) కుంభకోణం కేసులో సిద్ధూ విచారణను ఎదుర్కొనున్నారు. సిద్ధరామయ్య కనుసన్నల్లోనే ఈ కుంభకోణం జరిగిందనేది ప్రతిపక్షాల ప్రధాన ఆరోపణ. దీంతో సిద్ధరామయ్యకు రాజకీయంగా ఇబ్బందికర పరిస్థితులు ఎదురవుతున్నాయి.  ఈ కేసులో ముఖ్యమంత్రిని విచారించేందుకు కర్ణాటక గవర్నర్‌ థావర్‌ చంద్ గెహ్లాట్ అనుమతి ఇచ్చారు. దీనికి సంబంధించిన సమాచారం అందినట్లు సీఎం కార్యాలయం వెల్లడించింది.  గతంలో పలు రాష్ట్రాలలో అవినీతి ఆరోపణలపై విచారణకు గవర్నర్ అనుమతి ఇచ్చిన సందర్భాలలో ఆయా ముఖ్యమంత్రులు అరెస్ట్ లకు గురయ్యారు. దానితో సిద్దరామయ్య అరెస్ట్ సహితం తప్పకపోవచ్చనే ప్రచారం జరుగుతుంది. ముడా భూముల కేటాయింపుల్లో అక్రమాలు జరిగాయని ఆరోపిస్తూ ప్రదీప్ కుమార్, టీజే అబ్రహామ్, స్నేహమయి కృష్ణ అనే ముగ్గురు సామాజిక కార్యకర్తలు పిటిషన్లు దాఖలు చేశారు. ఇందులో సిద్ధరామయ్యకు ప్రమేయం ఉందని వారు ఆరోపించారు. ‘గవర్నర్…

Read More