ఎలాన్‌మస్క్ సారథ్యంలో ట్విటర్ ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోతోంది. ప్రస్తుతం నగదు కొరత తీవ్రంగా ఉందని స్వయంగా ఎలాన్ మస్క్ ఆదివారం పేర్కొన్నారు. ముఖ్యంగా వాణిజ్య ప్రకటనల ఆదాయం సగానికి పడిపోవడం, భారీగా రుణాలు ఉండటంతో ఈ పరిస్థితి తలెత్తిందని వివరించారు. ప్రస్తుతం మస్క్ కంపెనీ సీటీవోగా కూడా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. అన్నిటికంటే ముందు నగదు నిల్వల ఏర్పాటు చేసుకొనే స్థితికి ట్విటర్ చేరుకోవాలన్నారు. ఓ వినియోగదారుడు మస్క్‌ను ట్విటర్‌లో పెట్టుబడుల పునర్ వ్యవస్థీకరణపై అడిగిన ప్రశ్నకు సమాధానంగా ఈ విషయాన్ని వెల్లడించారు. వాస్తవానికి ఈ ఏడాది 4.5 బిలియన్ డాలర్ల ఆదాయం వస్తుందని అంచనావేశారు. కానీ, తర్వాత ఆ అంచనాలను కూడా 3 బిలియన్ డాలర్లకు కుదించారు. 2021లో 5.1 బిలియన్ డాలర్లతో పోలిస్తే ఇది చాలా తక్కువ. మస్క్ ట్విటర్ ఆధీనంలోకి తీసుకొన్నప్పటి నుంచి వ్యయనియంత్రణ చర్యలు చేపట్టారు. కానీ, అవేవీ ఇప్పటి వరకు సత్ఫలితాలిస్తున్నట్లు కనిపించడంలేదు. భారీ సంఖ్యలో…
Author: Editor's Desk, Tattva News
హైదరాబాద్ లోని శామీర్‌పేట్ సెలబ్రిటీ క్లబ్‌లో శనివారం జరిగిన కాల్పుల కేసు సంచలనం సృష్టిస్తోంది. సిద్ధార్థదాస్ అనే వ్యక్తిపై మనోజ్ ఎయిర్‌గన్‌తో కాల్పులు జరపడంతో సిద్ధార్థ్ తప్పించుకొని, శామీర్‌పేట పోలీసులను ఆశ్రయించాడు. నటుడు మనోజ్‌పై ఆర్మ్స్ యాక్ట్ కింద కేసు నమోదు చేసిన పోలీసులు ఆదివారం రిమాండ్‌కు తరలించారు. శామీర్‌పేట్ సెలబ్రిటీ క్లబ్‌లో శనివారం కాల్పుల ఘటన కలకలం రేపగా, పలు సంచలనాలకు దారితీస్తుంది. సిద్ధార్థ దాస్ అనే వ్యక్తి భార్య వద్దకు రాగా, ఆమెతో సహజీవనం చేస్తున్న నటుడు మనోజ్ తో గొడవ జరిగింది. ఈ క్రమంలో మనోజ్ కుమార్ ఎయిర్ గన్‌తో సిద్ధార్థ దాస్‌పై కాల్పులు జరిపాడు. అప్రమత్తమైన సిద్ధార్థ్ అక్కడి నుంచి తప్పించుకుని శామీర్ పేట్ పోలీసులను ఆశ్రయించాడు. నటుడు మనోజ్ తనపై కాల్పులు జరిపాడని ఫిర్యాదు చేయగా, ఆర్స్ యాక్ట్ కింద మనోజ్‌పై పోలీసులు కేసు నమోదు చేసి, ఆదివారం రిమాండ్ కు పంపారు. తాజాగా…
అసోంలో కూరగాయాల ధరలు ఆకాశాన్నంటడం రాజకీయ దుమారం రేపుతోంది. అందుకు ‘మియా’(బెంగాలీ మాట్లాడే ముస్లిం వ్యాపారులు)లే కారణమంటూ అసోం ముఖ్యమంత్రి హిమంత బిశ్వశర్మ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు అధికార, ప్రత్యర్థి పార్టీల మధ్య మాటల యుద్ధానికి దారితీస్తుంది. గౌహతిలో కూరగాయల ధరలు పెరిగిపోవడంపై మూడు రోజుల క్రితం విలేఖరులు అడిగిన ప్రశ్నలకు ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ స్పందిస్తూ, కూరగాయల ధరలు పెరగడానికి మియాలే కారణమని విమర్శించారు. అసోం వ్యాపారులు గనుక కూరగాయలు అమ్ముతున్నట్లయితే ఇంతగా ధరలు పెరిగేవి కావని ఆయన చెప్పారు. ‘గ్రామీణ ప్రాంతాలలో రైతులు విక్రయించే కూరగాయల ధరలు ఎక్కువగా లేవు. అయితే అవే కూరగాయలను గ్రామాల నుండి కొనుగోలు చేసి గౌహతికి తీసుకొచ్చి అమ్మితే ధరలు పెరిగిపోతున్నాయి. కూరగాయలను అధిక ధరలకు అమ్మే వారు ఎవరు? వారు మియా వ్యాపారులు. వారే ఎక్కువ ధరకు అమ్ముతున్నారు’ అని తెలిపారు. అంతేకాదు గౌహతిలోని ఫుట్‌పాలన్నిటినీ ఖాళీ చేయిస్తానని…
యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ), భారత్ మధ్య ఆర్థిక లావాదేవీల్లో ద్వైపాక్షిక వాణిజ్యం, పెట్టుబడులకు మరింత ఊపునిచ్చే ముఖ్యమైన ఒప్పందం కుదిరింది. దీనికోసం భారత యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ ఫేస్ (యూపీఐ)తో యూఏఈకి చెందిన చెల్లింపుల వ్యవస్థ ఇన్‌స్టాంట్ పేమెంట్ ప్లాట్‌ఫాం (ఐపీపీ)ను అనుసంధానం చేయనున్నారు. తద్వారా రెండు దేశాలు తమతమ కరెన్సీల్లో వాణిజ్య లావాదేవీలు నిర్వహించనున్నాయి. ఫ్రాన్స్ నుంచి తిరిగి వస్తూ శనివారం యూఏఈలో ఒక రోజు పర్యటనకు ఆగిన ప్రధాని మోదీ ఆ దేశ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయేద్ అల్ నహ్యాన్‌తో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా వాణిజ్య లావాదేవీల్లో స్థానిక కరెన్సీ వినియోగంపై ఒప్పందం కుదిరింది. యూఏఈ సెంట్రల్ బ్యాంక్, భారత రిజర్వ్ బ్యాంక్‌ల మధ్య కుదిరిన ఈ ఒప్పందం అత్యంత కీలకమైనదని, విస్తృత ఆర్థిక సహకారానికి దారి చూపుతుందని ప్రధాని మోదీ తెలిపారు. అంతర్జాతీయ ఆర్థిక లావాదేవీలను సులభతరం చేస్తుందని వివరించారు. ‘‘మన…
సుస్థిరాభివృద్ధికి పర్యావరణ పరిరక్షణే మార్గమని భారత పర్యాటక శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డి తెలిపారు. ప్రకృతిని కాపాడుకుంటూ నిర్దేశించుకున్న సమయానికి సుస్థిరాభివృద్ధి లక్ష్యాలను చేరుకుందామంటూ ఐక్యరాజ్య సమితి ప్రపంచ పర్యాటక సంస్థ (యుఎన్ డబ్ల్యుటిఒ) వేదిక పై నుంచి పిలుపునిచ్చారు. పర్యాటక రంగంలో ఆర్థిక ప్రగతి, సామాజిక, పర్యావరణ సుస్థిరత అంశంపై న్యూయార్క్‌లోని ఐక్యరాజ్యసమితి ప్రపంచ పర్యాటక సంస్థ ఆధ్వర్యంలో హైలెవల్ పొలిటికల్ ఫోరం వేదికగా జరిగిన సదస్సులో కిషన్ రెడ్డి మాట్లాడుతూ గత పదేళ్లుగా పర్యావరణ సుస్థిరత కోసం మోదీ సర్కారు చేస్తున్న కృషి కారణంగా.. నేడు టూరిజం వర్కింగ్ గ్రూప్ సమావేశాలకు ఎజెండా నిర్దేశించడంతోపాటు ముందుండి విజయవంతంగా నడిపామని తెలిపారు. జీ-20 ప్రెసిడెన్సీ ద్వారా పర్యాటక వర్కింగ్ గ్రూపు సమావేశాల నిర్వహణతోపాటు గోవాలో గత నెలలో జరిగిన జీ20 సభ్యదేశాలు, ఆతిథ్య దేశాల పర్యాటక మంత్రుల సమావేశంలో ఏకగ్రీవంగా ‘గోవా రోడ్ మ్యాప్’కు ఆమోదం తెలిపిన విషయాన్ని…
మరికొద్ది నెలల్లో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న వేళ `రజాకార్ ఫైల్స్’ సినిమా రాబోవడం రాజకీయంగా సంచలనం సృష్టింపనుంది. ‘రజాకార్ – ద సైలెంట్ జెనోసైడ్ ఆఫ్ హైదరాబాద్’ సినిమా పోస్టర్ని శనివారం హైదరాబాద్లో ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో మహారాష్ట్ర మాజీ గవర్నర్ సి. విద్యాసాగర్ రావు, బీజేపీ తెలంగాణ మాజీ అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్, మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి, వంటి సీనియర్ నేతలు పాల్గొన్నారు. ఈ సినిమాకు యాట సత్యనారాయణ రచన, దర్శకత్వం వహించారు. ఈ ‘సమర్‌వీర్ క్రియేషన్స్’ బ్యానర్‌పై బీజేపీ నేత గూడూరు నారాయణరెడ్డి నిర్మించారు. హైదరాబాద్ సంస్థానంలోని రజాకార్ల దురాగతాల గురించి బయటకు తెలియని పలు విషయాలను ఈ సినిమా కథలో చిత్రీకరించినట్టు తెలుస్తోంది. ఈ సినిమాని తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో విడుదల చేసేందుకు నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు. ఈ సందర్భంగా దర్శకుడు మాట్లాడుతూ ఈ సినిమా మత ఘర్షణల…
ఈశాన్య రాష్ట్రమైన మణిపూర్ హింసాత్మక ఘటనలతో అట్టుడుకుతుంటే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఏమాత్రం పట్టించుకోకుండా విదేశీ పర్యటనల్లో తలమునకలవుతున్నారని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ శనివారం ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఆయన వ్యాఖ్యలను బీజేపీ నేత, కేంద్ర మంత్రి స్మ్రితి ఇరానీ అంతే దీటుగా తిప్పికొట్టారు. ఈ వ్యవహారం వారిద్దరి మధ్య ‘ట్వీట్ వార్’కు దారితీసింది. “మణిపూర్ మండుతోంది. ఈయూ పార్లమెంట్ భారతదేశ అంతర్గత వ్యవహారంపై చర్చించింది. ప్రధాన మంత్రి మాత్రం ఒక్క ముక్క కూడా మాట్లాడలేదు. ఇదే సమయంలో ఆయనకు రఫేల్ వల్ల బాస్టీల్ డే పరేడ్‌కు టిక్కెట్ లభించింది” అంటూ రాహుల్ గాంధీ ట్వీట్ చేశారు. మణిపూర్ స్వస్థతను కోరుకుంటోంది. రెండు రోజుల పర్యటనలో అక్కడి ప్రజల ఆవేదన చూసి నా గుండె తరుక్కుపోయింది. శాంతి నెలకొల్పడం ఒక్కటే మార్గం. ఆ దిశగా మనమంతా పనిచేయాలని రాహుల్ పేర్కొన్నారు. రాహుల్ వ్యాఖ్యలను కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ ఏమాత్రం…
బాలీవుడ్ మెగాస్టార్ అమితాబచ్చన్ తనయుడు అభిషేక్ బచ్చన్ అలహాబాద్ నుండి రానున్న లోక్ సభ ఎన్నికల్లో అలహాబాద్ నుండి రాజకీయ రంగప్రవేశం చేయనున్నట్లు తెలుస్తోంది. అలహాబాద్ పార్లమెంట్ స్థానం నుంచి ఆయన బరిలోకి దింపేందుకు సమాజ్ వాదీ పార్టీ సన్నద్ధమవుతున్నది. ఆ పార్టీ అధ్యక్షుడు అఖిలేశ్ యాదవ్ త్వరలో ముంబయి వెళ్లి అమితాబ్ బచ్చన్, రాజ్యసభ సభ్యురాలు జయా బచ్చన్‌ను కలిసే అవకాశం ఉన్నట్లు సమాచారం. అభిషేక్ ఎన్నికల బరిలోకి దిగితే పోటీ ఆసక్తికరంగా మారనున్నది. అమితాబ్‌కు ప్రయాగ్‌రాజ్‌కు ప్రత్యేక అనుబంధం ఉన్నది. అమితాబ్ బచ్చన్ 1984 లోక్‌సభ ఎన్నికల్లో ఇక్కడి నుండి ఘన విజయం సాధించారు. మాజీ ముఖ్యమంత్రి, అప్పటి ప్రముఖ నేత హేమవతి నందన్ బహుగుణను ఓడించి అందరినీ ఆశ్యర్యానికి గురి చేశారు. ఆ ఎన్నికల్లో అమితాబ్‌కు 68శాతం ఓట్లు రాగా, బహుగుణకు 25 శాతం ఓట్లే పోలయ్యాయి. అభిషేక్ అభ్యర్థిత్వంపై మయునాపర్ అధ్యక్షుడు పప్పులాల్ నిషాద్ స్పందిస్తూ…
సుమారు ఐదేళ్ల తర్వాత ఈ 18న ఢిల్లీలో జరుగుతున్న బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే సమావేశంకు మొదటిసారిగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ను ఆహ్వానించారు. అదే విధంగా లోక్ జన్‌శక్తి పార్టీ చీఫ్ చిరాగ్ పాశ్వాన్ ను కూడా బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా ఆహ్వానించారు. ఈ విషయాన్ని నడ్డా ఒక ట్వీట్‌లో తెలియజేశారు. నరేంద్ర మోదీ సారథ్యంలోని కేంద్ర ప్రభుత్వం 9 ఏళ్ల పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా ఢిల్లీలో జరిగే ఎన్‌డీఏ సమావేశానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షత వహించనున్నారు. 2019 ఎన్నికల తర్వాత పవన్ కళ్యాణ్ బిజెపితో పొత్తు కున్న తర్వాత మొదటిసారిగా ఎన్డీయే సమావేశం జరుపుతున్నారు. కేంద్రంలోని బీజేపీతో ఎల్‌జేపీకి (రామ్ విలాస్) పొత్తు ఉంది. 2021లో చీలిక తలెత్తడంతో ఎల్‌జేపీ (రామ్ విలాస్)కు ఎన్నికల సంఘం కొత్త గుర్తు కేటాయించింది. కేంద్ర మంత్రి పశుపతి కుమార్ పరస్ నాయకత్వంలోని ప్రత్యర్థి ఎల్‌జేపీ వర్గం రాష్ట్రీయ…
ఇసుక తవ్వకాలకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. అడ్డుగోలుగా సాగుతును ఇసుక తవ్వకాలను తక్షణమే నిలిపివేయాలంటూ గతంలో జాతీయ హరిత ట్రైబ్యునల్ (ఎన్‌జిటి) జారీ చేసిన ఉత్తర్వులను సర్వోన్నత న్యాయస్థానం సమర్థించింది. ఎన్‌జిటి ఇచ్చిన ఆదేశాలను సవాలు చేస్తూ నిషేదం ఎత్తివేయాలని కోరుతూ రాష్ట్ర ప్రభుత్వం చేసిన విజ్ఞప్తిని ధర్మాసనం తోసిపుచ్చింది. ఎన్‌జిటి ఉత్తర్వులపై స్టే ఇవ్వడం కుదరదనిస్పష్టం చేసింది. గత మార్చి 23న ఇసుక తవ్వకాలపై ఎన్‌జిటి నిషేదం విధించిన సంగతి తెలిసిందే. దీనినిసవాలు చేస్తూ ఏపి ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌ను జస్టిస్ అభరు ఎస్ ఓకా, జస్టిస్ సంజరు కరోల్‌తో కూడిన ధర్మాసనం శుక్రవారం విచారణ చేపట్టింది. ఎన్‌జిటి తీర్పుపై స్టే ఇవ్వడానికి నిరాకరించింది. కాగా రాష్ట్రంలోని వైసిపి ప్రభుత్వం ఇసుక తవ్వకాలను గంపగుత్తగా జయప్రకాశ్ పవర్ వెంచర్స్ లిమిటెడ్ పరం చేసిందను ఆరోపణలున్నాయి. పర్యావరణ నిబంధనలకు విరుద్ధంగా భారీ యంత్రాలతో…