ఏపీకి జీవనదిగా భావించే పోలవరం ప్రాజెక్ట్ ను పూర్తి చేయడం చేతకాకుంటే కేంద్రానికి అప్పగించాలని వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వానికి బిజెపి రాష్త్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి హితవు చెప్పారు. బిజెపి రాష్త్ర అధ్యక్షురాలిగా శుక్రవారం విజయవాడ పార్టీ కార్యాలయంలో ఆమె బాధ్యతలు చేబడుతూ పోలవరం విషయంలో కేంద్రం వెనకడుగు వేయలేదని ఆమె స్పష్టం చేశారు. ప్రాజెక్టు విషయంలో కేంద్రం ఎప్పుడు జాప్యం చేయలేదని చెబుతూ ఇటీవల రూ. 12వేల కోట్లు కేంద్రం మంజూరు చేసిందని ఆమె గుర్తు చేశారు. తమ చేతకానితనంతో కేంద్రం మీద అభాండాలు వేస్తున్నారని ఆమె మండిపడ్డారు. పోలవరం నేషనల్ ప్రాజెక్టు కాబట్టి, నిర్మాణాన్ని చేయలేకపోతే తిరిగి కేంద్రానికి ఇచ్చేయాలని ఆమె సలహా ఇచ్చారు. పోలవరం ప్రాజెక్టులో పరిహారం చెల్లింపు విషయంలో రాష్ట్ర వైఖరి వల్లే ఆలస్యమని ఆమె విమర్శించారు. బాధితుల విసయంలో ఇంకా స్పష్టత ఇవ్వలేదని చెబుతూ క్లారిటీ ఇస్తే కేంద్రం తప్పకుండా స్పందిస్తుందని…
Author: Editor's Desk, Tattva News
భారతదేశంతో పాటు ప్రపంచం మొత్తం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న చంద్రయాన్ -3 ప్రయోగం అన్ని పరీక్షలు పూర్తిచేసుకుని జాబిలమ్మా నీకోసం నేనొస్తున్నామా అంటూ ఈ నెల 14వ తేదీ మధ్యాహ్నం 2.35గంటలకు చంద్రుడివైపు అడుగులు వేయనుంది. ఈ ప్రయోగానికి సంబంధించి బుధవారం ఎంఆర్‌ఆర్ సమావేశాన్ని శాస్త్రవేత్తలు నిర్వహించి రాకెట్ రిహార్సల్ వివరాలు నిశితంగా పరిశీలించి ప్రయోగానికి గ్రీన్‌సిగ్నెల్ ఇచ్చారు. ఈ మేరకు గురువారం మధ్యాహ్నం 2.35 గంటలకు కౌంట్‌డౌన్‌ను ప్రారంభించి 24 గంటల పాటు నిర్విరామంగా కౌంట్‌డౌన్ కొనసాగిన తర్వాత శుక్రవారం మధ్యాహ్నం 2.35గంటలకు ఇస్రో బాహుబలిగా పిలువబడే ఎల్‌వీఎం3-ఎం4 రాకెట్ నారింజరంగు నిప్పులు చిమ్ముకుంటూ నింగికెక్కుపెట్టిన బాణంలా నింగిలోకి దూసుకెళ్లనుంది. భూమికి సుమారు 3.84లక్షల కిలోమీటర్ల దూరంలో ఉన్న చంద్రుడి వరకు మూడు అంచెల్లో ఈ ప్రయోగం సాగనుంది. ముందుగా ఎల్‌వీఎం3-ఎం4 రాకెట్ భూకక్ష్యలోకి ఉపగ్రహాన్ని చేరవేస్తుంది. భూమి చుట్టూ 24 రోజులపాటు తిరుగుతూ ఆ తర్వాత చంద్రుని…
ప్రభుత్వ ఉద్యోగులకు 12వ వేతన సవరణ కమిషన్‌ను నియమిస్తూ ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. కమిషన్ చైర్మన్‌గా రిటైర్డు ఐఏఎస్ అధికారి మన్మోహన్‌సింగ్‌ను నియమించింది. ఏడాదిలోగా వేతన సవరణకు సంబంధించిన నివేదిక అందజేయాలని ఆదేశించింది. ఈ మేరకు బుధవారం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కేఎస్ జవహర్‌రె డ్డి ఉత్తర్వులు జారీ చేశారు. 2018 జూలై 1వ తేదీ నాటి నుండి అమల్లోకి వచ్చేలా 2020 ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి పే స్కేలును ప్రభుత్వం సవరించింది. కాగా కొత్త పీఆర్‌సీ ఈ ఏడాది జూలై ప్రామాణికంగా వచ్చే ఏడాది కమిషన్ చేసే సిఫార్సుల మేరకు నిర్ణయాలు తీసుకోనుంది. కొత్తగా ఏర్పాటు కానున్న పే రిజివన్ కమిషన్ (పీఆర్‌సీ)కి నియమ నిబంధనలతో మార్గదర్శకాలు జారీ చేసింది. ప్రస్తుతం అమలులో ఉన్న డీఏను ఏ మేరకు వేతనంలో విలీనం చేయవచ్చో పరిశీలన జరిపి తద్వారా కొత్త పేస్కేల్‌కు రూపకల్పన చేయాలని నిర్దేశించింది. . రాష్ట్ర…
దేశంలో రైల్వే సిగ్నలింగ్ వ్యవస్థను పూర్తిగా ఆధునీకరించి, ఎలక్ట్రానిక్ పద్థతికి మార్చేందుకు రైల్వే విభాగం కీలక నిర్ణయం తీసుకుంది. ఇందుకోసం లక్ష కోట్ల రూపాయలు (ట్రిలియన్) వెచ్చించనున్నట్లు తెలిపింది. ఒడిషాలోని బాలాసోర్‌లో కోరమాండల్ ఎక్స్‌ప్రెస్ రైలు ప్రమాదంలో 290 మందికి పైగా దుర్మరణం చెందారు. ఈ ఘోర ప్రమాదానికి సిగ్నలింగ్ వ్యవస్థలో లోపాలే కారణం అని సేఫ్టీ కమిషన్ తేల్చింది. దీనితో ఇక ముందు ఇటువంటి విపత్తులు తలెత్తకుండా చేసేందుకు ట్రిలియన్ రూపాయలతో ఎలక్ట్రానిక్ సిగ్నలింగ్ వ్యవస్థ ఏర్పాటు నిర్ణయం జరిగింది. బాలాసోర్ రైలు దుర్ఘటన సంబంధించి ఏడుగురు రైల్వే సిబ్బంది సస్పెండయ్యారు. ఈ మేరకు రైల్వే శాఖ ఓ ప్రకటన వెలువరించింది. ఇటీవల సిబిఐ అరెస్టు చేసిన ముగ్గురు అధికారులు కూడా సస్పెన్షన్ వేటుకు గురైన వారిలో ఉన్నారు. అధికారులు అప్రమత్తంగా ఉండిఉంటే ప్రమాదం జరిగి ఉండకపొయ్యేదని, దీనిని పరిగణనలోకి తీసుకుని వీరిని కిందిస్థాయి ఉద్యోగులను సస్పెండ్ చేసినట్లు ఆగ్నేయ…
ఇటీవల కాలంలో సౌర తుఫాను పెను విధ్వంసాన్ని కలిగిస్తున్నాయి. భానుడి భగభగలకు జీవజాలం తోపాటు, కమ్యూనికేషన్ వ్యవస్థలు అస్తవ్యస్థం అవుతున్నాయి. రాబోయే కాలంలో ఈ సౌరతుఫాన్ల తీవ్రత మరింత అధికంగా ఉంటుందనే హెచ్చరికలు ఆందోళన కలిగిస్తున్నాయి. వచ్చే రెండేళ్లలో అంటే 2025 నాటికి సౌరతుఫాన్లు గరిష్ట స్థాయికి చేరుకుంటాయని వాషింగ్టన్ పోస్టు ఓ కథనాన్ని ప్రచురించింది. ఆ వేడిని తట్టుకునే రీతిలో నేటి డిజిటల్ సమాజం లేదని అందులో పేర్కొన్నారు. బలమైన సౌర తుఫాను భూమిని తాకవచ్చు. ఇంటర్నెట్ అనుసంధాన ప్రపంచంలో ఇప్పటి వరకు జరగని అరుదైన ఘటన అవుతుంది. దానివల్ల ఇంటర్నెట్ వ్యవస్థకు తీవ్ర విఘాతం కలుగుతుంది. ఇది 1859 నాటి కారింగ్‌టన్ ఈవెంట్‌ను పోలివుంటుంది. అప్పట్లో కారింగ్‌టన్ కారణంగా టెలిగ్రాఫ్ లైన్లు దెబ్బతిన్నాయి. ఆపరేటర్లు విద్యుదాఘాతానికి గురయ్యారు. అలాగే 1989 సౌర తుఫాన్ క్యూబెక్ పవర్ గ్రిడ్‌ను కొన్ని గంటలపాటు స్తంభింపజేసింది అని వాషింగ్టన్ కథనం పేర్కొంది. దీనిపై…
కేంద్ర రహదారి రవాణా & జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ, దేశవ్యాప్తంగా మొక్కలు నాటే కార్యక్రమాన్ని ఆంధ్రప్రదేశ్‌లోని తిరుపతిలో బుధవారం ప్రారంభించారు. ‘ఆజాదీ కా అమృత్ మహోత్సవ్’లో భాగంగా, ఎన్‌హెచ్‌ఏఐ భూములు, టోల్ ప్లాజాలు, అమృత్ సరోవర్లు సహా దేశవ్యాప్తంగా జాతీయ రహదారుల వెంబడి 300కు పైగా ప్రాంతాల్లో ఒకే రోజులో 2.75 లక్షల మొక్కలు నాటడానికి ఈ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, పౌరులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, విద్యార్థులు పాల్గొన్నారు. ప్రధానమంత్రి నేతృత్వంలో దేశంలోని జాతీయ రహదారులను హరిత రహదారులుగా మార్చాలనే లక్ష్యంతో చేపట్టిన ‘గ్రీన్ ఇండియా మిషన్’కు (జీఐఎం) అనుసంధానంగా ఈ కార్యక్రమం ఉంటుందని గడ్కరీ చెప్పారు. రహదారి ప్రాజెక్టుల సమయంలో కూలిన ప్రతి చెట్టుకు రెండు రెట్లు ఎక్కువ మొక్కలు నాటడం ద్వారా నష్టాన్ని భర్తీ చేసేందుకు కృషి చేస్తున్నామని వివరించారు. పూర్తిగా పెరిగిన, పెద్ద చెట్లను తరలించడంలోనూ విజయం సాధించామని…
భారతదేశంలో పేదరికం గణనీయంగా తగ్గిందని ఐక్యరాజ్య సమితి నివేదిక పేర్కొంది. 15 ఏళ్ళ కాలంలో మొత్తంగా 41.5 కోట్ల మంది దారిద్య్రం నుండి బయటపడ్డారని తెలిపింది. ప్రపంచంలోనే అధిక జనాభా కలిగిన దేశం 2005-2006 నుండి 2019-2021 మధ్య కాలంలో ఈ విషయంలో గణనీయమైన పురోగతి సాధించిందని ఆ నివేదిక పేర్కొంది. మహాత్మ గాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకం వల్లే పేదరికం తగ్గుముఖం పట్టడానికి ప్రధాన కారణమని గ్రామీణాభివృద్ధి రంగ నిపుణులు విశ్లేషించారు. 2006లో ప్రారంభమైన ఈ పథకం పూర్తిస్థాయిలో అమల్లోకి వచ్చిన నాటి నుంచే పేదరికం తగ్గుముఖం పడుతూ వచ్చిందని పేర్కొంటున్నారు. ఐక్యరాజ్య సమితి అభివృద్ధి కార్యక్రమం (యుఎన్‌డిపి), ఆక్స్‌ఫర్డ్ పావర్టీ అండ్ హ్యూమన్ డెవలప్‌మెంట్ ఇనీషియేటివ్ (ఒపిహెచ్‌ఐ)లు ఆక్స్‌ఫర్ట్ యూనివర్శిటీలో అంతర్జాతీయ బహుముఖ దారిద్య్ర సూచిక (ఎంపిఐ)ను విడుదల చేశాయి. భారత్‌తో సహా 25 దేశాలు 15 ఏళ్ళ కాలంలో తమ అంతర్జాతీయ ఎంపిఐ విలువలను విజయవంతంగా…
శ్రీశైలం రిజర్వాయర్లో నీటి దొంగతనం గురించి నంద్యాల ఎస్పి రఘువీరారెడ్డికి రాయలసీమ సాగునీటి సాధన సమితి అధ్యక్షులు బొజ్జా దశరథ రామిరెడ్డి అద్వర్యంలో రాయలసీమ సాగునీటి సాధన సమితి కార్యవర్గ సభ్యులు మంగళవారం ఫిర్యాదు చేశారు.ఈ సందర్భంగా బొజ్జా దశరథ రామిరెడ్డి నీటి దొంగతనం గురించి ఎస్పికి సవివరంగా వివరించారు. కృష్ణా, తుంగభద్ర నదుల ద్వారా సుమారు 2017 టిఎంసి ల నీరు గత నీటి సంవత్సరం అనగా జూన్ 1, 2022 నుండి మే 31, 2023 వరకు శ్రీశైలం రిజర్వాయర్ కు చేరిందని బొజ్జా ఎస్ పికి తెలిపారు. నీటి కేటాయింపులకు అదనంగా శ్రీశైలం రిజర్వాయర్ కు నీరు చేరిన సందర్భంలో కనీస నీటిమట్టం 854 అడుగుల పైన 60 టి ఎం సీ ల క్యారీ ఓవర్ రిజర్వుగా నీరు నిలువ ఉంచాలని చట్టం ఉందన్న విషయాన్ని వివరించారు. రాబోయే నీటి సంవత్సరంలో వర్షాలు ఆలస్యమైనా, నీరు…
ఆన్‌లైన్ గేమింగ్, క్యాసినోలు, హార్స్ రేసింగ్‌లపై గరిష్ఠంగా 28 శాతం పన్ను వేయాలని వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) మండలి నిర్ణయించింది. మంగళవారం ఢిల్లీలో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ నేతృత్వంలో 50వ జీఎస్టీ కౌన్సిల్ సమావేశం జరిగింది. ఆయా రాష్ర్టాల మంత్రులతోపాటు కేంద్రపాలిత ప్రాంతాల నుంచి ప్రతినిధులూ హాజరయ్యారు. ఈ క్రమంలోనే ఆన్‌లైన్ గేమింగ్, క్యాసినోలు, హార్స్ రేసింగ్‌లపై పన్ను ఎంతన్నదానిపై ఎప్పట్నుంచో పరిశీలిస్తున్న మంత్రుల బృందం సిఫార్సుల ఆధారంగా ఈ 28 శాతం పన్నును నిర్ణయించినట్టు భేటీ అనంతరం విలేఖరులతో మాట్లాడుతూ నిర్మలా సీతారామన్ తెలిపారు. నిజానికి బెట్టింగ్ ముఖ విలువపై పన్ను వేయాలా? లేదా గేమింగ్ స్థూల రెవిన్యూపై విధించాలా? లేకపోతే ప్లాట్‌ఫామ్ ఫీజులపై మాత్రమే వర్తింపజేయాలా అన్నదానిపై మంత్రుల బృందం తర్జనభర్జనపడ్డట్టు మంత్రి తెలియజేశారు. ఈ నేపథ్యంలోనే మొత్తం వాల్యూపై పన్ను వేయాలని నిర్ణయించినట్టు చెప్పారు. ఆన్‌లైన్ గేమింగ్ సంస్థల టర్నోవర్, బెట్టింగ్…
కృష్ణా జలాల్లో రెండు తెలుగు రాష్ట్రాల వాటాల లెక్కలు తేలేవరకు 50:50 నిష్పత్తిలో చెరో సగం పంచాలని తెలంగాణ ఆర్థిక మంత్రి టి. హరీష్ రావు కేంద్రాన్ని కోరారు. 50వ జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో పాల్గొనేందుకు మంగళవారం ఢిల్లీ వచ్చిన ఆయన సమావేశం అనంతరం రాత్రి కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్‌ను ఆయన నివాసంలో కలిశారు. నీటిపారుదల శాఖకు చెందిన పలు ప్రాజెక్టులు, అంశాలపై ఆయనకు వినతి పత్రాలు అందజేశారు. అందులో ప్రధానంగా కృష్ణా జలాల వాటా గురించి చర్చించారు. 2020 అక్టోబర్ 6న జరిగిన అపెక్స్ కౌన్సిల్ సమావేశంలో తీసుకున్న నిర్ణయం మేరకు ఇప్పటి వరకు రెండు తెలుగు రాష్ట్రాల వాటాలు తేల్చేందుకు కొత్త కృష్ణా ట్రిబ్యునల్ ఏర్పాటు చేయలేదని గుర్తు చేశారు. సుప్రీంకోర్టులో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌ను వెనక్కి తీసుకుంటే వెంటనే కొత్త ట్రిబ్యునల్ ఏర్పాటు చేస్తామని కేంద్రం చెప్పిందని, రెండేళ్లు…