Author: Editor's Desk, Tattva News

ఎమ్మెల్సీలుగా టీజేఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం, జర్నలిస్ట్ అమీర్ అలీఖాన్ శుక్రవారం ప్రమాణ స్వీకారం చేశారు. గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీల నియామకంపై రాష్ట్ర హైకోర్టు ఇచ్చిన ఆదేశాలపై సుప్రీం కోర్టు స్టే విధిస్తూ తీర్పును వెలువరించింది. దీంతో ఎమ్మెల్సీల నియామకంపై ఎట్టకేలకు వివాదానికి తెరపడింది. ఈ మేరకు శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి తన ఛాంబర్‌లో వారితో ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమానికి మంత్రులు పొన్నం ప్రభాకర్, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, విప్ బీర్ల ఐలయ్య యాదవ్, ఎమ్మెల్సీ మహేష్ కూమార్ గౌడ్, ప్రభుత్వ సలహాదారుడు వేం నరేందర్ రెడ్డి, తదితరులు హాజరయ్యారు. గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీల నియామకంపై గతంలో తెలంగాణ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలపై తాజాగా సర్వోన్నత న్యాయస్థానం స్టే విధించింది. తదుపరి ఆదేశాలు వచ్చే వరకు హైకోర్టు ఆదేశాలపై స్టే ఉంటుందని జస్టిస్ విక్రంనాథ్, జస్టిస్ ప్రసన్న బాలచంద్ర వరలే ధర్మాసనం స్పష్టం చేసింది. కొత్తగా…

Read More

ఆంధ్రప్రదేశ్‌కు పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యంగా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. స్వర్ణాంధ్రప్రదేశ్ విజన్ 2047 కోసం ప్రభుత్వం ప్రత్యేక టాస్క్‌ఫోర్స్ ఏర్పాటు చేయనుంది. మేధావులు, పరిశ్రమల ప్రమఖులు సభ్యులుగా ఈ ప్రత్యేక టాస్క్‌ఫోర్స్ ఏర్పాటు చేయనున్నారు. ఈ టాస్క్‌ఫోర్స్‌కు టాటా సన్స్ ఛైర్మన్ నటరాజన్ చంద్రశేఖరన్ కో ఛైర్మన్‌గా ఉంటారు. ఈ విషయాన్ని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఎక్స్ వేదికగా ప్రకటించారు. శుక్రవారం టాటా సన్స్ ఛైర్మన్ నటరాజన్ చంద్రశేఖరన్ ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడితో భేటీ అయ్యారు. రాష్ట్రంలో పారిశ్రామికాభివృద్ది, స్వర్ణాధ్రప్రదేశ్- విజన్ 2047 రూపకల్పన అంశాలపై సమావేశంలో చర్చించారు. ఏపీలో ఎయిర్ ఇండియా, విస్తారా ఎయిర్‌లైన్స్ విస్తరణ అంశాలపైనా ఆయనతో చర్చించారు. ఏపీలో సోలార్, టెలీకమ్యునికేషన్స్, ఫుడ్ ప్రాసెసింగ్ ఏర్పాటుపైనా చర్చించారు. అనంతరం సీఐఐ ప్రతినిధుల బృందం కూడా చంద్రబాబుతో భేటీ అయ్యింది. ఏపీ ప్రభుత్వం త్వరలోనే నూతన పారిశ్రామిక విధానం తీసుకు రానుంది. ఈ…

Read More

బంగ్లాదేశ్‌లో మైనారిటీలు, హిందువులపై జరుగుతున్న దాడులపై భారత్ సహా అంతర్జాతీయ సమాజం నుంచి ఆందోళనలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో ఆ దేశ తాత్కాలిక ప్రభుత్వ సారథి మహమ్మద్ యూనస్ భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ఫోన్ చేశారు. బంగ్లాదేశ్‌లో నెలకొన్న పరిస్థితిపై పరస్పరం సంభాషించుకున్నారు. సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో ఆ విషయాన్ని మోదీ వెల్లడించారు. ”బంగ్లాదేశ్ ప్రభుత్వ చీఫ్ అడ్వయిజర్ ప్రొఫెసర్ మమహ్మద్ యూనస్ నుంచి ఫోన్‌కాల్ వచ్చింది. అక్కడి పరిస్థితిపై ఇద్దరూ మాట్లాడుకున్నాం. ప్రజాస్వామిక, సుస్థిర, శాంతియుత, ప్రగతశీల బంగ్లాదే‌శ్‌కు భారత్ మద్దతుగా ఉంటుందని పునరుద్ఘాటించాను. బంగ్లాలోని హిందువులు, మైనారిటీలకు భద్రత కల్పిస్తామని ఆయన హామీ ఇచ్చారు” అని మోదీ ఆ ట్వీట్‌లో పేర్కొన్నారు.  బంగ్లాదేశ్‌లో షేక్ హసీనా ప్రభుత్వం పడిపోవడానికి దారితీసిన అల్లర్లు, హింసాత్మక ఘటనలు, మైనారిటీ ఆస్తులపై దాడుల నేపథ్యంలో యూనుస్, మోదీ ఫోనులో సంభాషించుకోవడం ఇదే మొదటిసారి.  బంగ్లా తాత్కాలిక ప్రభుత్వ చీఫ్ అడ్వాజయిర్‌గా ప్రమాణస్వీకారం చేసిన…

Read More

ఉమ్మడి విశాఖపట్నం జిల్లాలో ఖాళీ అయిన ఎమ్మెల్సీ (స్థానిక సంస్థల కోటా) స్థానానికి వైసీపీ అభ్యర్థిగా బరిలోకి దిగిన మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ  ఏకగ్రీవంగా ఎన్నిక అయ్యారు. ఈ మేరకు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో బొత్సకు రిటర్నింగ్ అధికారి ధ్రువీకరణ పత్రాన్ని అందజేశారు. దీంతో మాజీ మంత్రి, మాజీ ఎమ్మెల్యే కాస్త ఎమ్మెల్సీ బొత్స అయ్యారు.!  ఏపీ సార్వత్రిక ఎన్నికల తర్వాత జరిగిన తొలి ఎన్నిక కావడం, ఇందులో వైసీపీ గెలవడంతో ఆ పార్టీ శ్రేణులు ఆనందంలో మునిగితేలుతున్నాయి.  ఎన్నికల ప్రక్రియలో భాగంగా బుధవారం రిటర్నింగ్‌ అధికారి, విశాఖపట్నం జిల్లా జాయింట్‌ కలెక్టర్‌ కె.మయూర్‌ అశోక్‌ సమక్షంలో నామినేషన్ల పరిశీలన జరిగింది.  నామినేషన్ల పరిశీలన కార్యక్రమానికి స్వతంత్య్ర అభ్యర్థి షేక్‌ షఫీ, వైసీపీ అభ్యర్థి బొత్స సత్యనారాయణ తరపున ఆయన ప్రతినిధులు హాజరయ్యారు. అన్ని పత్రాలు ఉండడంతో రెండు నామినేషన్లు సక్రమంగా ఉన్నట్టు రిటర్నింగ్‌ అధికారి ప్రకటించారు. నామినేషన్ల ఉపసంహరణకు…

Read More

కన్నడ నటుడు రిషబ్ శెట్టికి జాతీయ ఉత్తమ నటుడి అవార్డు దక్కింది. 70వ జాతీయ చలన చిత్ర అవార్డుల విజేతలను కేంద్ర ప్రభుత్వం ఖరారు చేసింది. 2022 సంవత్సరానికి సంబంధించిన ఈ అవార్డులను సమాచార, ప్రసార శాఖ ప్రకటించింది. 2022 జనవరి 1వ తేదీన నుంచి 2022 డిసెంబర్‌ 31 మధ్య సెన్సార్ అయిన చిత్రాలకు పురస్కారాలను వెల్లడించింది. కాంతార సినిమాకు గాను రిషబ్ శెట్టికి జాతీయ ఉత్తమ నటుడి అవార్డు లభించింది. గతేడాది ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‍కు ఈ పురస్కారం దక్కగా, ఇప్పుడు మరోసారి దక్షిణాది నటుడికే ఈ అవార్డు కైవసం అయింది. ఉత్తమ చిత్రంగా మలయాళ మూవీ ‘ఆట్టం’ నేషనల్ అవార్డు దక్కించుకుంది. ఈ మూవీ 2024లో థియేటర్లలో రిలీజైనా, 2022లోనే సెన్సార్ పూర్తి చేసుకుంది. ఇక, తెలుగులో 2022కు గాను ఉత్తమ ప్రాంతీయ చిత్రంగా ‘కార్తికేయ 2’ సినిమా జాతీయ అవార్డును గెలుచుకుంది. గతేడాది తెలుగు…

Read More

జమ్మూకశ్మీర్, హర్యానా అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌ను భారత ఎన్నికల కమిషన్ శుక్రవారం ప్రకటించింది. 90 అసెంబ్లీ స్థానాలున్న జమ్మూకశ్మీర్ అసెంబ్లీకి మూడు విడతలుగా సెప్టెంబర్ 18, 25, అక్టోబర్ 1వ తేదీల్లో ఎన్నికలు జరుగనుండగా, అక్టోబర్ 4న కౌంటింగ్ జరిపి ఫలితాలు వెల్లడిస్తారు.హర్యానా అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ అక్టోబర్ 1న నిర్వహించనున్నారు. అక్టోబర్ 4న ఫలితాలు ప్రకటిస్తారు. ఈ ఎన్నికల షెడ్యూల్ ప్రకటన సందర్భంగా చీఫ్ ఎలక్షన్ కమిషనర్ రాజీవ్ కుమార్ మాట్లాడుతూ.. ‘2024 లోక్‌సభ ఎన్నికలు ప్రపంచంలోనే అతిపెద్ద ఎన్నికల ప్రక్రియ. ఆ ఎన్నికలు విజయవంతంగా, శాంతియుతంగా పూర్తయ్యాయి. దేశవ్యాప్తంగా యువత మొదలుకుని వృద్ధుల వరకు భారీ సంఖ్యలో తరలివచ్చి ఓటు హక్కు వినియోగించుకున్నారు. ముఖ్యంగా జమ్మూకశ్మీర్ ఎన్నికల్లో అక్కడి ఓటర్లు ఎంతో చైతన్యం చూపించారు. ఈసారి వారు హింసను పక్కనపెట్టి ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు వినియోగించుకునేందుకే మొగ్గు చూపారు’ అని చీఫ్ ఎలక్షన్ కమిషనర్ రాజీవ్ కుమార్ తెలిపారు.…

Read More

కోల్​కతా వైద్యురాలి అత్యాచారంపై దేశవ్యాప్తంగా నిరసనలు రోజురోజుకు తీవ్రమవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఇండియన్​ మెడికల్​ అసోసియేషన్​ (ఐఎంఏ) సంచలన ప్రకటన చేసింది. కోల్​కతా వైద్యురాలి మృతికి నిరసనగా దేశవ్యాప్తంగా వైద్య సేవలను నిలిపివేస్తున్నట్టు ప్రకటించింది. ఆగస్ట్​ 17 నుంచి 24 గంటల పాటు వైద్య సేవలను నిలిపివేస్తున్నట్టు పేర్కొంది. ఆగస్టు 9న కోల్​కతా ఆర్​జీ కర్ మెడికల్ కాలేజీలో డ్యూటీ డాక్టర్​ అత్యాచారం, హత్య ఈ నిర్ణయానికి కారణమని పేర్కొంది. ఆమె ఛాతీ వైద్యంలో పోస్ట్ గ్రాడ్యుయేట్. “ఇది వైద్య వర్గాలతో పాటు దేశాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది. అప్పటి నుంచి రెసిడెంట్ డాక్టర్లు సమ్మె చేస్తున్నారు. ఐఎంఏ ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా నిరసనలు, కొవ్వొత్తుల ర్యాలీలు జరుగుతున్నాయి,” అని ప్రకటనలో ఉంది. ఆగస్టు 17 (శనివారం) ఉదయం 6 గంటల నుంచి ఆగస్టు 18 (ఆదివారం) ఉదయం 6 గంటల వరకు 24 గంటల పాటు మోడ్రన్ మెడిసిన్ వైద్యుల సేవలను నిలిపివేస్తున్నట్లు…

Read More

స్వాతంత్ర్య దినోత్సవం నాడు వైసీపీ రెండు కీలకమైన పురపాలక సంఘాలపై పట్టు కోల్పోయింది. ఆ పార్టీకి చెందిన వారు సామూహికంగా ఫిరాయించడంతో ఒంగోలు పురపాలక సంఘం, మాచెర్ల మునిసిపాలిటీలలో టిడిపి ఆధిపత్యం ఏర్పడింది. దానితో మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డికి ఒంగోలులో, మాజీ ఎమ్యెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి మాచర్లలో పెద్ద షాక్ తగిలినట్లయింది. 2022లో జరిగిన మాచర్ల మునిసిపల్ ఎన్నికలలో మొత్తం 31 వార్డ్ లలో వైసిపి అభ్యర్థులు గెలుపొందారు. అయితే ఇప్పటికే 14 మంది కౌన్సిలర్లు టీడీపీలో చేరగా, తాజాగా స్వాతంత్ర్య దినోత్సవం రోజు ఛైర్మన్‌ మాచర్ల చిన్న ఏసోబు, వైస్‌ ఛైర్మన్‌ నరసింహారావు టిడిపి ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మారెడ్డితో భేటీ జరిపి ఆ పార్టీలో చేరేందుకు సంసిద్ధత వ్యక్తం చేశారు. దానితో మాచర్ల మున్సిపాలిటీలో మొత్తం 31 వార్డులు ఉంటే టిడిపి బలం 16కు పెరిగిన్నట్లయింది. ఇప్పటికే పోలింగ్ నాటి హింసాయుత ఘటనలకు సంబంధించి అరెస్ట్ అయి నెల్లూరు…

Read More

జమ్మూకశ్మీర్‌ శాంతి భద్రతలకు సంబంధించి కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. జమ్ముకశ్మీర్‌లో ఈ మధ్య కాలంలో ఉగ్రదాడులు అధికమయ్యాయి. ఈ నేపథ్యంలో ఉగ్రమూకల దాడులను అరికట్టేందుకు కేంద్ర హోంశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. సీనియర్ ఐపీఎస్ అధికారి అయిన నళిన్ ప్రభాత్‌ను జమ్మూ కశ్మీర్ స్పెషల్ డీజీగా నియమించింది.  సెప్టెంబర్ 30వ తేదీ ప్రస్తుతం డీజీగా ఉన్న ఆర్ఆర్ స్వైన్ పదవీ విరమణ చేయనున్నారు. ఆయన రిటైర్‌మెంట్ తర్వాత నళిన్ ప్రభాత్ బాధ్యతలు స్వీకరిస్తారు. ఈ మేరకు కేంద్ర హోంశాఖ ఆదేశాలు జారీ చేసింది. ఆర్ఆర్ స్వైన్ రిటైర్మెంట్ తర్వాత జమ్ముకశ్మీర్ డీజీపీగా నళిన్ ప్రభాత్ బాధ్యతలు స్వీకరిస్తారని కేంద్ర హోంశాఖ స్పష్టం చేసింది. తక్షణమే ఆయనను జమ్ముకశ్మీర్ పంపాలని ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది. ఏపీ క్యాడర్‌కు చెందిన 1992 ఐపీఎస్ అధికారి అయిన 55 ఏళ్ల నళిన్ ప్రభాత్  ఆంధ్రప్రదేశ్‌లోని యాంటీ నక్సల్స్ ఫోర్స్ గ్రేహౌండ్స్‌ను నడిపించారు. అలాగే కశ్మీర్‌లో…

Read More

స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలకు భంగం కలిగించేందుకు అస్సాంలోని కీలక ప్రాంతాల్లో 24 బాంబులు అమర్చినట్లు నిషేధిత తీవ్రవాద సంస్థ యునైటెడ్ లిబరేషన్ ఫ్రంట్ ఆఫ్ అసోమ్ (ఉల్ఫా) (ఇండిపెండెంట్) ప్రకటించింది. 19 ప్రాంతాల వివరాలను కూడా ఉల్ఫా(ఐ) పేర్కొంది. . ‘స్వాతంత్ర్య దినోత్సవ సందర్భంగా మా నిరసనలు తెలియజేయడానికి ఏర్పాటు చేసిన బాంబులు పేలలేదు. ముందుగా నిర్ణయించినట్లుగా ఆగస్టు 15వ తేదీన ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటలకు దాడులు జరగాల్సి ఉంది. సాంకేతిక లోపం వల్ల బాంబు పేలుళ్లు జరగలేదు’ అని ఇషాన్ అసోమ్ తెలిపారు. ఈ మేరకు మీడియా సంస్థలకు ఈమెయిల్‌ పంపింది. అయితే సాంకేతిక వైఫల్యం కారణంగా ఆ బాంబులు పేలలేదని తెలిపింది. పేలుడు పదార్థాలను నిర్వీర్యం చేయడంలో ప్రజల సహకారాన్ని కోరింది. కాగా, ఉల్ఫా(ఐ) ప్రకటన నేపథ్యంలో అస్సాం పోలీసులు, భద్రతా బలగాలు అప్రమత్తమయ్యాయి. ఆ రాష్ట్ర వ్యాప్తంగా విస్తృతంగా సోదాలు చేశారు.…

Read More