మహారాష్ట్ర రాజకీయాలు జాతీయ స్థాయిలో కలకలం రేపుతున్నాయి. 8 మంది ఎమ్మెల్యేలతో పార్టీ ఫిరాయించిన ఎన్సీపీ నేత అజిత్ పవార్ మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా, ఆ పార్టీ ఎమ్మెల్యేలు మంత్రులుగా ఎకనాథ్ షిండే సర్కార్‌లో కొలువుతీరడం సంచలనం కలిగించింది. ఇక అజిత్ పవార్ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరైన ముగ్గురు నేతలను ఎన్సీపీ పార్టీ నుంచి బహిష్కరించింది. మహారాష్ట్ర రాజకీయాలు కాక రేపుతుండగా బిహార్, ఉత్తర ప్రదేశ్ లోనూ ఈ పరిస్ధితి తలెత్తే అవకాశం ఉందని కేంద్ర మంత్రి రాందాస్ అథవలే సంచలన ప్రకటన చేశారు. బిహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ఆర్జేడీతో చేతులు కలపడం పట్ల పలువురు ఎమ్మెల్యేల్లో అసమ్మతి రాజుకుందని ఆయన తెలిపారు. యూపీ విషయానికి వస్తే పాట్నాన విపక్ష భేటీకి ఆర్ఎల్డి నేత జయంత్ చౌదరి గైర్హాజరుతో ఆయన ఎన్డీఏలో చేరవచ్చని పేర్కొన్నారు. మహారాష్ట్రలో వేగంగా మారుతున్న రాజకీయ సమీకరణల నేపధ్యంలో కేంద్ర మంత్రి రాందాస్ అథవలే…
Author: Editor's Desk, Tattva News
ఢిల్లీలోని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నివాసంపై డ్రోన్ కలకలం సృష్టించింది. సోమవారం తెల్లవారుజామున 5 గంటల సమయంలో.. మోదీ నివాసంపై డ్రోన్ తిరుగుతున్నట్టు దిల్లీ పోలీసులకు సమాచారం అందింది. ప్రధాని మోదీ నివాసం రెడ్ నో ఫ్లై జోన్/ నో డ్రోన్ జోన్ కిందకు వస్తుంది. అలాంటిది, ఎన్నడు లేని విధంగా.. మోదీ నివాసంపై డ్రోన్ కనిపించింది. ప్రధాని నరేంద్ర మోదీకి రక్షణ కల్పించే ఇలైట్ స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్ ఈ డ్రోన్‌ను గమనించి పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ నేపథ్యంలో దిల్లీ పోలీసులు అప్రమత్తమయ్యారు. డ్రోన్‌ను కనిపెట్టేందుకు గాలింపు చర్యలు చేపట్టారు. మరోవైపు ఘటనపై దర్యాప్తు చేపట్టినట్లు అధికారులు వెల్లడించారు. “ప్రధాని నివాసానికి సమీపంలో అన్ఐడెన్టిఫైడ్ ప్లయింగ్ ఆబ్జెక్ట్ తిరుగుతున్నట్టు సమాచారం అందింది. వెంటనే స్పందించి సమీప ప్రాంతాల్లో గాలింపు చర్యలు చేపట్టాము. కానీ ఏం లభించలేదు. ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ రూమ్‌ను సంప్రదించాము. వారు కూడా ఎలాంటి ఫ్లయింగ్…
విదేశాల సాధించిన అనుభవం, అభివృద్ధిని ఏపీకి కూడా తీసుకు రావాలని ప్రవాసాంధ్రులకు ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి పిలుపునిచ్చారు. నాటా తెలుగు మహాసభలను ఉద్దేశించి సిఎం జగన్ ప్రసంగిస్తూ ప్రవాసాంధ్రుల అనుభవాన్ని రాష్ట్రాభివృద్ధికి వినియోగించాలని కోరారు. అమెరికాలోని డాలస్‌లో జరుగుతున్న నాటా తెలుగు మహా సభలనుద్దేశించి ముఖ్యమంత్రి ఇచ్చిన వీడియో సందేశాన్ని నాటా సభల్లో ప్రదర్శించారు. వేరే దేశంలో ఉన్నా తెలుగు వారు సంస్కృతి సంప్రదాయాలు కాపాడుకోవడం సంతోషంగా ఉందని, తెలుగు వారు సంస్కృతి సంప్రదాయాలను కాపాడుకుంటూ ఐక్యమత్యాన్ని చాటడం సంతోషంగా ఉందని చెప్పారు. పెద్దపెద్ద కంపెనీల సీఈఓలుగా, ఐటీ నిపుణులుగా, నాసా వంటి సంస్థల్లో పరిశోధకులుగా, అమెరికా ప్రభుత్వ ఉద్యోగులుగా, డాక్టర్లుగా, ప్రొఫెసర్లుగా రాణించడంపై గర్వ పడుతున్నట్లు చెప్పారు. ప్రవాసుల్లో చాలామంది పేద, మధ్య తరగతి కుటుంబాల నుంచి వచ్చినా అమెరికా వెళ్లి ఈ స్థాయికి రావడానికి కఠోరమైన శ్రమ, పట్టుదల అక్కడ ఉన్నతంగా నిలిపాయని తెలిపారు. …
తెలంగాణాలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక వితంతువులు, వృద్ధులకు రూ. 4వేల పెన్షన్ అందిస్తామని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ వెల్లడించారు. ఆదివారం ఖమ్మం లో కాంగ్రెస్ పార్టీ జన గర్జన సభలో ముఖ్య అతిధిగా హాజరైన రాహుల్ తెలంగాణ ఫై వరాల జల్లు కురిపించారు. అధికారంలోకి వస్తే వృద్ధులు, వితంతువులు, వికలాంగులు, బీడీ వర్కర్లు, ఒంటరి మహిళలు, కల్లుగీత కార్మికులు, చేనేత కార్మికులు, ఎయిడ్స్ బాధితులు, పైలేరియా/ డయాలసిస్ పేషంట్లకు చేయూత పథకం కింద నెలకు రూ. 4000 పింఛన్ అందించనున్నట్లు ప్రకటించారు. ‘కాంగ్రెస్ గ్యారెంటీ’ అని పేర్కొంటూ ఈ పథకాన్ని ప్రకటించారు. ఖమ్మం గడ్డపై జనగర్జన సభకు విచ్చేసిన భారీ జనసందోహాన్ని చూసిన కాంగ్రెస్ రాహుల్ గాంధీ ఉత్సాహంగా ఖమ్మం జిల్లా కాంగ్రెస్ పార్టీ ఖిల్లా అని అభివర్ణించారు. మీ మనసుల్లో, మీ రక్తంలో కాంగ్రెస్ ఉందని పేర్కొన్నారు. పీపుల్ మార్చ్ చేసిన సీఎల్పీ నేత భట్టి విక్రమార్కను అభినందిస్తున్నట్టు…
నైరుతి రుతుపవనాలు ప్రవేశించినా ఆశించినస్థాయిలో వర్షాలు కురవక రైతులు ఇక్కట్లకు గురవుతున్నారు. దీంతో ఈ ఏడాది వానాకాలం వరి సాగుపై క్రమంగా నీలినీడలు కమ్ముకుంటున్నాయి. ఈసారి లక్ష్యం మేరకు నాటు పడుతుందన్న ఆశలు క్రమంగా సన్నగిల్లుతున్న పరిస్థితులు నెలకొన్నాయి. వర్షాలు పడగానే పొలం దున్ని నాటేసేందుకు రైతులు ఇప్పటికే వరినారు పోశారు. నారు పోసి దాదాపు 20రోజులు దాటిపోతోంది. మరో పది రోజులు గడిస్తే నెల నారు అవుతుందని, ఈ లోగా నాటు వేయాలని, లేకపోతే దిగుబడి రాదని రైతులు వాపోతున్నారు. అయితే ఓ పక్కన వరి నారు ఎదుగుతున్నా వర్షాలు కురవకపోవడంతో బావులు, బోర్లలో భూగర్భ జలాలు వృద్ధి చెందలేదు. భూమి తడిసేంత వర్షాలు పడకపోవడంతో వరినాట్ల కోసం బురదపొలం దున్నకం సాధ్యం కావడం లేదు. బావి, బోరులోని నీటితో దున్నకానికి పూనుకుంటే ఎకరా తడవాల్సిన చోట కనీసం పావు ఎకరం మడి కూడా తడవని పరిస్థితులు నెలకొన్నాయి. ఈ…
మణిపూర్ హింసాకాండలో చైనా జోక్యం ఉందని అక్కడ అలజడి రేపడంలో డ్రాగన్ కుట్రపూరితంగా వ్యవహరించిందని శివసేన (యూబీటీ) ఎంపీ సంజయ్ రౌత్ ఆరోపించారు. మణిపూర్ హింస వెనుక విదేశీహస్తం ఉన్నదంటూ ఆ రాష్త్ర ముఖ్యమంత్రి బీరెన్ సింగ్ ఆరోపించిన మరుసటి రోజే రౌత్ ఈ ఆరోపణ చేయడం గమనార్హం. చైనాపై ఎలాంటి చర్యలు చేపట్టారో చెప్పాలని కేంద్ర ప్రభుత్వాన్ని రౌత్ డిమాండ్ చేశారు. కేంద్రంలో, మణిపూర్‌లో బీజేపీ అధికారంలో ఉండగా ఈశాన్య రాష్ట్రం మే 3 నుంచి అశాంతితో భగ్గుమంటున్నదని శివసేన ఎంపీ ఆందోళన వ్యక్తం చేశారు. రెండు నెలలుగా మణిపూర్‌లో అల్లర్లు చెలరేగుతూ రాష్ట్రం అట్టుడుకుతున్నదని తెలిపారు. ప్రజలు ఇండ్లు విడిచి పునరావాస శిబిరాల్లో తలదాచుకుంటున్నారని, పరిస్ధితిని చక్కదిద్దేందుకు మీరేం చర్యలు తీసుకున్నారని పాలక కాషాయ నేతలను ఆయన నిలదీశారు. మణిపూర్‌లో శాంతి భద్రతలను కాపాడటంలో విఫలమైన సీఎం ఎన్ బీరేన్ సింగ్ తక్షణమే తన పదవికి రాజీనామా చేయాలని…
ఎన్సీపీలో అసంతృప్తిగా ఉన్న ఆ పార్టీ సీనియర్ నేత అజిత్ పవార్ మరోసారి తిరుగుబాటు జెండా ఎత్తారు. తన మద్దతు ఎమ్మెల్యేలు, నేతలతో కలిసి ఎన్సీపీలో మరోసారి చీలిక తెచ్చారు. తన మద్దతుదారులతో కలిసి మహారాష్ట్రలో అధికారంలో ఉన్న బీజేపీ – షిండే శివసేన కూటమి నేతృత్వంలో ఉన్న ఏక్ నాథ్ షిండే ప్రభుత్వానికి మద్దతు ప్రకటించారు. ఈ క్రమంలోనే ఆదివారం వేగంగా జరిగిన పరిణామాలలో అజిత్ పవార్ సహా మరో 9 మంది ఎమ్మెల్యేలు మహారాష్ట్ర మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. వరుసగా మూడేసారి అజిత్ పవర్ ఉపముఖ్యమంత్రి అయ్యారు. ఇప్పటికే ఉపముఖ్యమంత్రిగా ఉన్న దేవేంద్ర ఫడ్నవిస్ తో కలిసి ఈ పదవిని పంచుకోనున్నారు. ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ముందు తన వర్గం ఎమ్మెల్యేలతో కలిసి మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్ నాథ్ షిండేను అజిత్ పవార్ కలిశారు. ఎన్సీపీకి మొత్తం 53 మంది శాసనసభ సభ్యులు ఉండగా అందులో…
హైదరాబాద్ మెట్రో స్టూడెంట్ పాస్ అందుబాటులోకి తీసుకొస్తుంది. విద్యార్థుల సౌకర్యార్థం శనివారం నుంచి సూపర్ సేవర్ స్టూడెంట్ పాస్ అమల్లోకి తీసుకొచ్చామని మెట్రో రైల్ ఎండీ ఎన్వీఎస్ రెడ్డి ప్రకటించారు. విద్యార్థులు 20 ట్రిప్‌లకు డబ్బులు చెల్లించి 30 ట్రిప్‌లు జర్నీ చేయవచ్చని పేర్కొన్నారు. మెట్రో ట్రైన్ పాస్ తీసుకుంటే వచ్చే ఏడాది మార్చి 31 వరకు ప్రయాణించవచ్చని మెట్రో అధికారులు తెలిపారు. నగరంలోని 10 మెట్రో స్టేషన్‌లలో స్టూడెంట్ పాస్‌లు ఇవ్వనున్నారు. జేఎన్‌టీయూ, విక్టోరియా మెమోరియల్, నాగోల్, రాయ్‌దుర్గ్, దిల్‌సుఖ్‌నగర్, నారాయణగూడ, బేగంపేట్, పరేడ్ గ్రౌండ్, ఎస్‌ఆర్ నగర్, అమీర్‌పేట్ మెట్రో స్టేషన్‌లలో స్టూడెంట్ మెట్రో పాస్‌లు ఇస్తారని అధికారులు వెల్లడించారు. 1998 ఏప్రిల్ 1 తర్వాత పుట్టిన విద్యార్థులందరూ ఈ పాస్ పొందేందుకు అర్హులని మెట్రో అధికారులు తెలిపారు. ఈ ఆఫర్ కింద విద్యార్థులు 20 ట్రిప్పులకు మాత్రమే నగదు చెల్లించి అన్ని జోన్‌లలో 30 ట్రిప్పుల వరకు…
కేంద్ర ప్రభుత్వం వ్యవసాయం, రైతుల సంక్షేమానికి ప్రతి ఏటా రూ 6.5 లక్షల కోట్లు ఖర్చు పెడుతోందని ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. అంతర్జాతీయ సహకార సంస్థల దినోత్సవం సందర్భంగా జరిగిన ఓ కార్యక్రమంలో ప్రధాని శనివారం ప్రసంగించారు. రైతుల సంక్షేమంలో సహకార వ్యవస్థ అంతర్భాగంగా నిలుస్తుందని, కో ఆపరేటివ్‌లు ఎప్పటికప్పుడు వినూత్న రీతుల్లో రైతాంగ బాగోగులకు చర్యలు తీసుకోవల్సి ఉందని చెప్పారు. వంటనూనెల విషయంలో దేశం స్వయంసమృద్ధికి కోఆపరేటివ్‌లు తోడ్పాటు అందించాల్సి ఉందని పేర్కొన్నారు. కేంద్రంలో బిజెపి అధికారంలోకి వచ్చిన నాటి నుంచి వ్యవసాయ రంగ అభ్యున్నతికి పలు చర్యలు తీసుకున్నట్లు వివరించారు. పిఎం కిసాన్ పథకం, కనీస మద్దతు ధరలు, ఎరువుల సబ్సిడీలపై ప్రధానంగా దృష్టి సారించినట్లు తెలిపారు. ఇక గత తొమ్మిదేళ్లలో తమ ప్రభుత్వం రైతుల పంటలను సరైన ఎంఎస్‌పిలతో కొనుగోలు చేయడం ద్వారా మొత్తం మీద రూ 15 లక్షల కోట్లు వారికి చెల్లించామని తెలిపారు.…
పార్లమెంట్ వర్షాకాల సమావేశాల జులై 20 నుంచి ఆగస్టు 11 వరకు సమావేశాలు జరుగుతాయని కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి వెల్లడించారు. మొత్తం 23 రోజుల పాటు జరగనున్న ఈ సమావేశాల్లో 17 పనిదినాలుంటాయని ఆయన తెలిపారు. పార్లమెంట్ సమావేశాలకు సహకరించి సజావుగా జరిగేలా చూడాలని ప్రతిపక్షాలకు పార్లమెంటరీ కేంద్ర మంత్రి విజ్ఞప్తి చేశారు. బ్రిటీష్ కాలంలో నిర్మించిన పాత పార్లమెంట్ భవనంలోనే వర్షాకాల సమావేశాలను ప్రారంభించి, మధ్యలో ఒక వేడుకలా కొత్త భవనంలోకి ప్రవేశ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్టు పార్లమెంట్ వర్గాలు చెబుతున్నాయి. తద్వారా దేశ చరిత్రలో సరికొత్త అధ్యాయాన్ని లిఖించాలని అధికారపక్షం భావిస్తోంది. అయితే ఈ సమావేశాలు గతం కంటే వాడీవేడీగా సాగేలా కనిపిస్తున్నాయి. బడ్జెట్ సమావేశాలు ఎలాంటి చర్చ లేకుండానే ముగిశాయి. ఈసారి అధికారపక్షంపై విరుచుకుపడేందుకు ప్రతిపక్షాలు ప్రయత్నిస్తున్నాయి. పైగా ఈ మధ్యనే ప్రతిపక్షాలన్నీ ఏకతాటిపైకి వచ్చే ప్రయత్నాలు మొదలుపెట్టాయి. సరిగ్గా ఇదే సమయంలో…