గత సంవత్సరం జూలైలో పోలవరం ముంపుతో భద్రాచచలం పరిసర ప్రాంతాలు ముంపుకు గురైన విషాద సంఘటన మరవకముందే వర్షాకాలం రావడంతో మరోసారి ఆ ప్రాంత ప్రజలు ముప్పు భయంతో బిక్కుబిక్కుమంటూ జీవిస్తున్నారు. తెలంగాణ నీటి పారుదల శాఖ ప్రత్యామ్నాయ ఏర్పాట్లలో నిమగ్నమైనప్పటికీ పోలవరం ప్రాజెక్టు ఉన్న ఆంధ్ర నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. సీడబ్ల్యూసీ, ఆదేశించినా, న్యాయస్థానం మందలించినా ఏపీ ఏమాత్రం స్పందించకపోవడంతో తిరిగి వర్షకాలంలో ముంపు తప్పదనే భావనలో అక్కడి ప్రజలు, నీటిపారుదల శాఖ ముందస్తుగా సురక్షిత ప్రాంతాలకు వలసలు వెళ్లుతున్నట్లు సమాచారం. పోలవరం ముంపు ప్రాంతాల్లో ఆంధ్ర, తెలంగాణ సంయుక్తంగా ముంపు సర్వే చేయాలని తెలంగాణ చేస్తున్నడిమాండ్ ను ఏపీప్రభుత్వం పట్టించుకోకపోవడంతో తెలంగాణ తీవ్రంగా స్పందిస్తోంది. మరోసారి న్యాయస్థానానికి వెళ్లి ఏపీ నిర్లక్ష్య వైఖరిని ఎండగట్టేందుకు తెలంగాణ నీటిపారుదల శాఖ సిద్ధమైంది. ఈ మేరకు ఇప్పటివరకు జరిగిన నష్టాన్ని అంచనా వేయడంతో పాటుగా తిరిగి వరదలు వస్తే జరిగే నష్టాన్ని అంచనా…
Author: Editor's Desk, Tattva News
దేశంలో మరోసారి వస్తు, సేవల పన్ను వసూళ్లు భారీగా పెరిగాయి. జూన్ నెలకుగాను రూ.1, 61, 497 కోట్లు వసూళ్లు నమోదైనట్లు కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ శనివారం తెలిపింది. ఇందులో సెంట్రల్ జిఎస్‌టి రూ.31,013 కోట్లు కాగా, స్టేట్ జిఎస్‌టి కింద రూ.38,292 కోట్లు, ఐజిఎస్‌టి కింద రూ.80, 292 కోట్లు వసూలయినట్లు తెలిపింది. సెస్‌ల వసూళ్లు రూ.11,900 కోట్లు ఉన్నట్లు తెలిపింది. గత ఏడాది జూన్‌లో రూ.1.44 లక్షల కోట్లు వసూలు కాగా ఈ ఏడాది జూన్‌లో వసూళ్లు 12 శాతం పెరిగాయి.అలాగే జిఎస్‌టి వసూళ్లు లక్షా 60 వేల కోట్లను దాటడం ఇది నాలుగోసారి. 2021 22లో తొలి త్రైమాసికంలో జిఎస్‌టి సగటు వసూళ్లు రూ.1.10 లక్షల కోట్లు ఉండగా 2022 23 తొలి త్రైమాసికంలో రూ.1.51 కోట్లకు, 2023 24 ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో రూ.1.69 లక్షల కోట్లకు పెరిగినట్లు ఆర్ధిక మంత్రిత్వ శాఖ…
2002లో గుజరాత్‌లో జరిగిన అల్లర్లకు సంబంధించిన కేసుల్లో యాక్టివిస్ట్ తీస్తా సెతల్వాద్ కు గుజరాత్ హైకోర్టు షాక్ ఇచ్చింది. ఆ అల్లర్లకు సంబంధించిన కేసుల్లో అమాయకులను ఇరికించేందుకు సాక్ష్యాధారాలను కల్పించారనే ఆరోపణకు సంబంధించిన కేసులో సాధారణ బెయిలు మంజూరు చేసేందుకు హైకోర్టు శనివారం నిరాకరించింది. అంతే కాకుండా ఆలస్యం చేయకుండా లొంగిపోవాలని ఆమెను కోర్టు ఆదేశించింది. ఆ సమయంలో రాష్ట్రంలో జరిగిన అల్లర్లకు సంబంధించిన కేసుల్లో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సహా మరికొందరిని ఇరికించేందుకు తీస్తా సెతల్వాద్ ప్రయత్నించారని కేసు నమోదైంది. అయితే గుజరాత్ అల్లర్లలో అప్పటి ముఖ్యమంత్రి నరేంద్ర మోదీ, తదితరుల ప్రమేయం లేదని ప్రత్యేక దర్యాప్తు బృందం క్లీన్ చిట్ ఇచ్చింది. దీనిపై జకియా సుప్రీంకోర్టు జకియా పిటిషన్ దాఖాలు చేయగా గత ఏడాది జూన్ 24న తోసిపుచ్చింది. గుజరాత్ అల్లర్ల కేసులో ప్రత్యేక దర్యాప్తు బృందానికి తప్పుడు సమాచారం ఇచ్చారన్న ఆరోపణలపై ఆమెను గుజరాత్ ఉగ్రవాద…
పోలీస్ కాల్పుల్లో నాహెల్ అనే 17 ఏండ్ల యువకుడి మృతితో ఫ్రాన్స్‌లో మూడు రోజులుగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. దేశమంతా నిరసనలు వెల్లువెత్తాయి. ముఖ్యంగా యువత పెద్దయెత్తున ఆందోళనలో పాల్గొని విధ్వంసం సృష్టించారు. ముందుజాగ్రత్త చర్యగా పారిస్‌లో బస్సు, ట్రామ్ సర్వీసులను నిలిపివేశారు. ఆ ఆందోళన బెల్జియం రాజధాని బ్రస్సెల్స్‌కు కూడా పాకింది. ఆందోళనకారులకు అడ్డుకట్ట వేయడానికి పోలీసులు టియర్ గ్యాస్, వాటర్ కెనాన్‌లు ప్రయోగించగా, ఆందోళనకారులు రాళ్లు, వెలిగించిన నిప్పు వస్తువులను వారిపైకి విసిరారు. పారిస్ శివారు క్లామర్ట్‌లో కర్ఫ్యూ విధించారు. గత రాత్రి నుంచి దేశంలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి. ఈ అల్లర్లలో 200 మంది పోలీస్ అధికారులు గాయపడగా, 600 మందిని అరెస్ట్ చేశారు. పారిస్ సబ్ అర్బన్ నాంటెర్రెలో పోలీస్ వాహనాలతో పాటు పలు కార్లకు నిప్పుపెట్టారు. సిటీలోని ఒక పోలీస్‌స్టేషన్‌పై దాడి జరిగింది. పారిస్‌లోని రివోలిలో పలు షాపులను లూటీ చేశారు. అబుర్‌విల్లర్స్‌లో…
పోడు రైతులపై గతంలో నమోదైన కేసులు ఎత్తివేస్తామని తెలంగాణ ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు ప్రకటించారు. శుక్రవారం కొమరంభీమ్ ఆసిఫాబాద్ నూతన కలెక్టరేట్ కార్యాలయంలో పోడు రైతులకు సీఎం కేసీఆర్ పోడు భూముల పట్టాలను అందించారు. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ ఆసిఫాబాద్ జిల్లాలో మెడికల్ కాలేజీని కూడా నిర్మిస్తున్న విషయాన్ని గుర్తు చేశారు. అన్ని జిల్లాల్లోని మారుమూల గ్రామాల రైతులకు వ్యవసాయానికి త్రీఫేజ్ విద్యుత్ ను అందిస్తున్న విషయాన్ని ప్రస్తావించారు. పోడు వ్యవసాయం చేసుకుంటున్న రైతులకు పట్టాలు ఇచ్చిన తర్వాత కూడా కేసులు కొనసాగించడం సరైంది కాదని పేర్కొన్నారు. పోడు భూముల విషయమై గతంలో నమోదైన కేసులను ఎత్తివేస్తామని కేసీఆర్ ప్రకటించారు. ఈ మేరకు చర్యలు తీసుకోవాలని సీఎం కేసీఆర్ తెలంగాణ డీజీపీ అంజనీకుమార్ ను ఆదేశించారు. మహిళల పేరుతోనే పోడు పట్టాల పంపిణీ జరుగుతుందని కేసీఆర్ చెప్పారు. పోడు పట్టాలను పంపిణీ చేయడం తనకు చాలా సంతోషంగా ఉందని కేసీఆర్…
తాను పార్టీ మారుతున్నట్లు వస్తున్న వార్తలపై బీజేపీ ఎమ్యెల్యే, మాజీ మంత్రి ఈటెల రాజేందర్ అసహనం వ్యక్తం చేశారు. పార్టీ మార్పుపై పదేపదే తనలాంటి వాడిని ప్రశ్నించవద్దని….. పార్టీలు మార్చడమంటే బట్టలు మార్చినంత ఈజీ కాదని బదులిచ్చారు. అభివృద్ధి కోసం మాత్రమే కాదు తెలంగాణ తెచ్చుకుందని…. అత్మగౌరవం కోసం కూడా” అని గుర్తు చేశారు. శుక్రవారం సిద్ధిపేట జిల్లాలో పర్యటించిన ఆయన మీడియాతో మాట్లాడుతూ “పార్టీలు మారటమంటే బట్టలు మార్చుకున్నంత ఈజీ కాదు. ఉదయం, సాయంత్రం, రాత్రి ఇలా ఏదో ఒక టైంలో వేర్వురు వార్తలు వస్తున్నాయి. వీటన్నింటికి సమాధానం ఇవ్వలేను” అని తెలిపారు. తాను కాంగ్రెస్ లో చేరుతున్నట్లు వస్తున్న వార్తలను ప్రస్తావిస్తూ కాంగ్రెస్ పార్టీ ఏదో ఆశతో ఉందని, అధికారంలోకి రావాలని చూస్తోందని సానుభూతి వ్యక్తం చేశారు. అయితే, సోషల్ మీడియాలో వచ్చే వార్తలతో హైప్ క్రియేచ్ చేసుకుంటే ప్రజల మద్దతు రాదని స్పష్టం చేశారు. “ఒకటి మాత్రం…
చిన్న మొత్తాల పొదుపు పథకాలపై వడ్డీరేటును కేంద్ర ప్రభుత్వం 1.1 శాతం మేర పెంచింది. అయితే, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికానికి మాత్రమే ఈ పెంపును పరిమితం చేసింది. జులై 1వ తేదీ నుంచి పెంచిన వడ్డీ రేటు అమలులోకి రానుంది. జులై 1 – సెప్టెంబర్ 30వ తేదీ మధ్యకాలానికి మాత్రమే చిన్న మొత్తాల పొదుపు పథకాలకు పెంచిన వడ్డీరేటు వర్తిస్తుంది. సెప్టెంబర్ 30వ తేదీ తరువాత ఇది అమలులో ఉండదు. ఆ తరువాత దీన్ని పొడిగించే అవకాశాలు లేకపోలేదు. సేవింగ్స్ డిపాజిట్లకు మినహాయింపు ఇచ్చింది. వీటిని ఈ పెంపు పరిధిలోకి తీసుకుని రాలేదు. టైమ్ డిపాజిట్లకు మాత్రమే వర్తింపజేసింది. కేంద్ర ప్రభుత్వం సేవింగ్స్ డిపాజిట్లపై ప్రస్తుతం 4.0 శాతం వడ్డీ రేటు ఉంది. దీన్ని అలాగే కొనసాగించనుంది. తొలి సంవత్సరం టైమ్ డిపాజిట్లపై 6.8 నుంచి 6.9, రెండో సంవత్సరం టైమ్ డిపాజిట్‌పై 6.9 నుంచి 7.0కు…
టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు నివాసముంటున్న కరకట్ట వద్ద ఉన్న లింగమనేని రమేశ్ గెస్ట్ హౌస్ జప్తుకు ఏపీ సిఐడికి అనుమతి ఇస్తూ విజయవాడ ఏసీబీ కోర్టు కీలక తీర్పునిచ్చింది. తొలుత లింగమనేని రమేశ్‌కు నోటీసు ఇవ్వాలని ఆదేశించింది. ఉండవల్లి కరకట్ట వద్ద ఉన్న లింగమనేని రమేశ్ గెస్ట్‌హౌస్‌ను అటాచ్ చేయాలంటూ ప్రభుత్వం ఇటీవల జీవో విడుదల చేసింది. ఇందులో భాగంగానే సీఐడీ కోర్టులో అనుమతి పిటిషన్ వేసింది. ఇక మాజీ మంత్రి నారాయణకు చెందిన ఆస్తులను పాక్షికంగా జప్తు చేయాలని ఉత్తర్వుల్లో పేర్కొంది. రాజధాని అమరావతి కోసం భూ సమీకరణలో అక్రమాల నేపథ్యంలో ఉండవల్లిలో ఈ ఇంటిని అటాచ్ చేస్తూ ఏపీ హోంశాఖ ఉత్తర్వులు జారీ చేసిన నేపథ్యంలో ఇంటిని జప్తు చేయడానికి సీఐడీ ప్రయత్నిస్తోంది. ఇంటిని జప్తు చేయడానికి ఏసీబీ కోర్టును ఏపీ సిఐడి ఆశ్రయించింది. దీనిపై సుదీర్ఘంగా వాదనలు కొనసాగాయి. టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు సీఆర్డీఏ…
హైడ్రామా మధ్య తన రాజీనామా నిర్ణయాన్ని మణిపూర్ ముఖ్యమంత్రి ఎన్. బీరేన్ సింగ్ శుక్రవారంనాడు వెనక్కి తీసుకున్నారు. ప్రస్తుత క్లిష్ట పరిస్థితుతుల్లో తాను రాజీనామా చేయడం లేదంటూ ఆయన తాజాగా ట్వీట్ చేశారు. దీంతో ఆయనకు మద్దతుగా ఉదయం నుంచి నుపిలాల్ క్లాంప్లెక్ వద్దకు పెద్ద సంఖ్యలో చేరుకున్న మహిళలు శాంతించారు. మణిపూర్‌లో గురువారం మరోసారి హింస ప్రజ్వరిల్లి ముగ్గురు ప్రాణాలు కోల్పోడవం, ఐదుగురు గాయపడటంతో నిరసనలు పెల్లుబికాయి. ఈ నేపథ్యంలో బీరేన్ సింగ్ రాజీనామా చేస్తారని, రాష్ట్రపతి పాలన విధిస్తారని ఊహాగానాలు వెలువడ్డాయి. మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో గవర్నర్‌ను బీరేన్ సింగ్ కలుసుకుని రాజీనామా సమర్పిస్తున్నట్లు ప్రచారం జరిగింది. దీంతో ఉదయం నుంచి ఉత్కంఠ నెలకొంది. పెద్దఎత్తున మహిళలు బీరేన్‌కు మద్దతుగా నినాదాలు చేస్తూ రోడ్లపైకి వచ్చారు. సీఎం నివాసం వెలుపల వందల సంఖ్యలో మహిళలు ఆందోళనకు దిగారు. బీరేన్ తమకు ఎంతో చేశారని, ఆయన సీఎంగా కొనసాగాలని,…
మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో శుక్రవారం కీలక పరిణామం చోటు చేసుకోనున్నది. మధ్యంతర ఛార్జిషీటును దాఖలు చేయనున్నట్లు సిబిఐ వెల్లడించింది. దర్యాప్తు పూర్తిచేసి, జూన్ 30 లోగా ఛార్జ్ షీట్ దాఖలు చేయమని సుప్రీంకోర్టు ఆదేశించిన దృష్ట్యా సిబిఐ ఈ నిర్ణయం తీసుకోండి. దానితో ఇప్పుడు సిబిఐ ఛార్జిషీటుపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. మధ్యంతర ఛార్జిషీటులో జగన్, అవినాష్ రెడ్డి పేర్లు ప్రస్తావించనున్నట్లు విశ్వసనీయ వర్గాలు తెలుపుతున్నాయి. అదే జరిగితే ఈ కేసు రాజకీయంగా కలకలం రేపే అవకాశం ఉంది. ఆ తర్వాత, దర్యాప్తునకు మరింత గడువు కావాలని జులై3వ తేదీనే సుప్రీంకోర్టును కోరాలని సిబిఐ నిర్ణయించినట్లు తెలుస్తోంది. జులై 3న సిజెఐ ధర్మాసనం ముందు కడప ఎంపీ వైఎస్ అవినాష్ మధ్యంతర బెయిల్ రద్దు పిటిషన్‌పై విచారణ జరగనుంది. ఇప్పటివరకు జరిపిన దర్యాప్తు వివరాలన్నింటినీ సిబిఐ ఛార్జిషీటులో ప్రస్తావించనుంది. కుట్ర కోణం వెలుగులోకి తెచ్చేందుకు మరింత గడువు…