Author: Editor's Desk, Tattva News

కేరళ డీజీపీగా వైయస్‌ఆర్‌ జిల్లా బద్వేలు నియోజకవర్గం పోరుమామిళ్ల మండల కేంద్రానికి చెందిన దర్వేష్‌ సాహెబ్‌ బాధ్యతలు చేపట్టారు. దర్వేష్‌ను డీజీపీగా నియమిస్తూ కేరళా రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడంతో రెండ్రోజుల క్రితం బాధ్యతలు చేపట్టారు. పోరుమామిళ్ల పట్టణంలోని బెస్తవీధికి చెందిన దర్వేష్‌ ప్రాథమిక విద్య పోరుమామిళ్లలోనే పూర్తి చేశారు. ఒకటి నుంచి అయిదో తరగతి వరకూ ప్రైవేటు పాఠశాలలో, ఆరు నుంచి పది వరకు ప్రభుత్వ పాఠశాల, ఇంటర్‌ జూనియర్‌ కళాశాలలో చదివారు. డిగ్రీ, పీజీలను తిరుపతిలో పూర్తి చేశారు. జిల్లా ఎస్పీ నుంచి వివిధ హోదాల్లో పనిచేస్తూ డీజీపీగా నియమితులయ్యారు. ధర్వేష్‌ తండ్రి అటవీశాఖలో లో ఉద్యోగం చేస్తూ గ్రామంలోని పంచాయతీ ఆఫీస్ వెనకవైపు ఉన్న బెస్తవీధిలో నివాసం ఉండేవారు. ధర్మేష్ ఒకటవ తరగతి నుండి 5వ తరగతి వరకు పోరుమామిళ్ల ఓఎల్ ఎఫ్  పాఠశాలలో చదివారు. ఆరు నుండి ఇంటర్ వరకు పట్టణంలోని గవర్నమెంట్ జూనియర్…

Read More

ఇటీవల మనీలాండరింగ్ కేసులో అరెస్టైన మంత్రి సెంథిల్ బాలాజీని మంత్రి పదవి నుంచి బర్తరఫ్ చేస్తూ తమిళనాడు గవర్నర్ ఆర్ఎన్ రవి ఆదేశాలు జారీ చేయడంతో ఆ రాష్ట్రంలో రాజకీయ దుమారం చెలరేగింది. దీనిపై న్యాయ పోరాటం చేస్తామని ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ ప్రకటించడంతో, కొద్ది గంటల తర్వాత బర్తరఫ్ ఉత్తరువును ప్రస్తుతంకు అమలు కాకుండా ఉంచుతున్నట్లు రాజ్ భవన్ ప్రకటించింది. దీనిపై అటార్నీ జనరల్ సలహాను గవర్నర్ కోరనున్నట్లు చెబుతున్నారు. అయితే, మంత్రివర్గం సిఫార్సు లేకుండా గవర్నర్ ఇటువంటి ఆదేశాలు జారీ చేయడం స్వతంత్ర భారత చరిత్రలో ఇదే మొదటిసారని రాజకీయ వర్గాలు విస్మయం వ్యక్తం చేస్తున్నాయి. కాగా,   ఇప్పటికే సెంథిల్ బాలాజీ మనీలాండరింగ్ కేసులో అరెస్టై జైల్లో ఉన్న విషయం తెలిసిందే. ఉద్యోగాలు అమ్ముకోవడంతో సహా సెంథిల్ బాలాజీపై తీవ్రమైన అవినీతి ఆరోపణలున్నాయి. ఈ క్రమంలో మంత్రిగా ఉంటే విచారణను ప్రభావితం చేసే అవకాశం ఉందని రాజ్‌భవన్ కార్యాలయం…

Read More

సుమారు నెలరోజులుగా హింసాకాండతో రగిలిపోతున్న మణిపూర్ లో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చేపట్టిన రెండు రోజుల పర్యటన గురువారం ఉద్రిక్తల నడుమ ప్రారంభమైంది. తెగల మధ్య ఘర్షణలతో రగిలిపోతున్న మణిపూర్‌లోని ఉద్రిక్తతల కేంద్రం చురాచాంద్‌పూర్‌లో ఆయన సహాయక శిబిరానికి వెళ్లి నిర్వాసితులను పరామర్శించారు. అనుకున్న సమయానికి పలు గంటల ఆలస్యంగా ఆయన ఈ క్యాంప్ చేరుకోవల్సి వచ్చింది. శాంతిభద్రతల పరిస్థితి, గ్రనేడ్ దాడుల భయాలు ఉన్నందున రాహుల్ గాంధీ కాన్వాయ్‌ను ముందుకు వెళ్లకుండా అంతకు ముందు రాష్ట్ర పోలీసు బృందాలు మధ్యలోనే అడ్డుకున్నాయి ఈ ప్రాంతం వివాదానికి కేంద్ర బిందువుగా ఉందని, ఎప్పుడేం జరుగుతుందో తెలియని స్థితిలో అక్కడికి నేతలను పంపించడం బాధ్యతారాహిత్యం అవుతుందని అధికారులు తెలిపారు.ఇంఫాల్‌కు 20 కిలోమీటర్ల దూరంలోని బిష్ణుపూర్ వద్ద రాహుల్‌ను నిలిపివేశారు. కాన్వాయ్‌పై దాడి జరిగితే పరిస్థితి ఏమిటని ప్రశ్నించారు. క్యాంప్ సందర్శనకు వెళ్లాలనుకుంటే హెలికాప్టర్ బెటర్ అని తెలిపారు. తరువాత ఆయన ఇంఫాల్‌కు…

Read More

ఇటీవల ముగిసిన కర్ణాటక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ జయకేతనాన్ని ఎగురవేసి అధికార పీఠాన్ని దక్కించుకుంది. అక్కడి ఎన్నికల ప్రచారంలో భాగంగా ‘పేసీఎం’ నినాదాన్ని ఆ పార్టీ విస్తృతంగా వినియోగించుకుంది. ఫోన్‌పే స్కానింగ్ బార్‌పై కర్ణాటక మాజీ సీఎం బసవరాజ్ బొమ్మై ఫొటో ముద్రించి సాగించిన ప్రచారం పార్టీకి బాగా కలిసొచ్చింది. దీంతో త్వరలోనే ఎన్నికలు జరగనున్న మధ్యప్రదేశ్‌లోనూ ఇదే పంథాలో ప్రచారం చేయాలని కాంగ్రెస్ నిర్ణయించింది. కర్ణాటక మాదిగానే మధ్యప్రదేశ్ ప్రస్తుత సీఎం శివరాజ్‌సింగ్ చౌహాన్ ఫొటోను ఫోన్‌పే స్కానింగ్ బార్‌పై ముద్రించిన పోస్టర్లతో ప్రచారం చేస్తోంది. ‘పేసీఎం’ పేరిట గోడలకు అంటించిన పోస్టర్లపై ఫోనో‌పే అఫీషియల్ లోగోలను కూడా కాంగ్రెస్ పార్టీ వాడింది. అనధికారికంగా కంపెనీ పేరు, లోగో వాడుతుండడంపై ఫోన్‌పే అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ మేరకు ట్విటర్ వేదికగా స్పందించింది. “అనధికారికంగా బ్రాండ్ లోగోని ఒక థర్డ్ పార్టీ ఉపయోగించడాన్ని ఫోన్‌పే ఆక్షేపిస్తోంది. రాజకీయ లేదా రాజకీయేతర…

Read More

2024 లోక్‌సభ ఎన్నికల్లో సమైక్యంగా పోటీ చేసి అధికారంలోకి రావాలన్న లక్ష్యంతో ఏర్పాటు చేస్తున్న బిజెపియేతర ప్రతిపక్షాల రెండవ సమావేశం జులై 13–14 తేదీలలో బెంగళూరులో జరగనున్నది. గతంలో నిర్ణయించినట్లు సిమ్లాలో కాకుండా బెంగళూరులో రెండవ సమావేశాన్ని నిర్ణయించినట్లు ఎన్‌సిపి అధినేత శరద్ పవార్ గురువారం వెల్లడించారు. వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో బిజెపిని గద్దె దించడమే ఏకైక లక్షంగా జూన్ 23న బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ ఆధ్వర్యంలో పాట్నాలో జరిగిన తొలి సమావేశం ప్రతిపక్షాల మధ్య ఐక్యతకు సంబంధించి అనుసరించాల్సిన వ్యూహంపై ప్రాథమికంగా చర్చించింది. తొలి సమావేశానికి కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, రాహుల్ గాంధీ, ఎన్‌సిపి అధినేత శరద్ పవార్, శివసేన(ఉద్ధవ్ థాక్రే) నాయకుడు ఉద్ధవ్ థాక్రే, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకె స్టాలిన్, ఆర్‌జెపి అధ్యక్షుడు లాలూ ప్రసాద్ యాదవ్, జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్,…

Read More

దేశంలో ఉమ్మడి పౌరస్మృతి అమలు విషయం తిరిగి వేడి అందుకుంది. ఉమ్మడి పౌరస్మృతి (యుసిసి)కి తాము సూత్రప్రాయ మద్దతు ప్రకటిస్తున్నట్లు ఆమ్ ఆద్మీపార్టీ (ఆప్) తెలిపింది. దీని అమలుకు ముందు సంబంధిత భాగస్వామ్య పక్షాలన్నింటి అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోవల్సి ఉందని ఆప్ స్పష్టం చేసింది. ఆప్ భారతీయుల కోసం సూత్రప్రాయంగా ఉమ్మడి పౌరస్మృతికి మద్దతు ఇస్తుందని పార్టీ ఎంపీ సందీప్ పాఠక్ వెల్లడించారు. అయితే ఈ దిశలో ఏదైనా చర్య తీసుకోవాలంటే అందరు భాగస్వాములతో విస్తృత స్థాయి చర్చలు జరపాలని ఆయన సూచించారు. తాము సూత్రప్రాయంగా యూనిఫాం సివిల్ కోడ్‌కు మద్దతు ఇస్తున్నామని, రాజ్యాంగంలోని ఆర్టికల్ 44 కూడా దీనికి మద్దతు ఇస్తుందని పాఠక్ తెలిపారు. అయితే ఈ సమస్య అన్ని మత వర్గాలకు సంబంధించినది కాబట్టి, పరిష్కారం కూడా విస్తృతంగా ఉండాలని పాఠక్ సూచించారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 44 ప్రకారం భారతదేశ భూభాగం అంతటా పౌరులకు ఒకే విధమైన పౌర…

Read More

అమెరికాలో పనిచేస్తోన్న హెచ్1 బీ వీసాదారులకు కెనడా ప్రభుత్వం మంచి అవకాశం కల్పించింది. 10 వేల మంది హెచ్1 బీ వీసాదారులు తమ దేశానికి వచ్చి ఉద్యోగం చేసుకోడానికి వీలుగా ఓపెన్ వర్క్ పర్మిట్‌ను ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటించింది. ఈ చర్యవల్ల భారత్‌కు చెందిన వేలాది మంది సాంకేతిక నిపుణులకు ప్రయోజనం కలుగుతుంది. అభివృద్ధి చెందుతున్న వివిధ సాంకేతికతలకు సంబంధించి ప్రపంచం మొత్తం మీద అగ్రదేశంగా రూపొందాలని కెనడా ఆకాంక్షిస్తోంది. అమెరికా సాంకేతిక దిగ్గజాలు భారీ ఎత్తున లేఆఫ్‌లు ప్రకటించడంతో ఉద్యోగాలు కోల్పోయిన సాంకేతిక వృత్తి నిపుణులను ఆకర్షించాలని చేస్తున్న ప్రయత్నాల్లో భాగమే ఈ ఓపెన్ వర్క్ పర్మిట్ల విధానం. హెచ్1 బి వీసా అంటే తాత్కాలిక వీసా. ఈ వెసులు బాటుతో అమెరికా కంపెనీలు విదేశీ కార్మికులను, ఉద్యోగులను తమకు అవసరమైన ప్రత్యేక ఉద్యోగాల్లో నియమించుకోగలుగుతున్నాయి. అమెరికా సాంకేతిక సంస్థలు ఏటా భారత్, చైనా వంటి దేశాల నుంచి వేలాది…

Read More

కేంద్ర ప్రభుత్వం 2023-24 పంట సీజన్‌కు చెరకుకు క్వింటాల్‌కు రూ 315 మేర గిట్టుబాటు ధరను (ఫెయిర్ అండ్ రెమ్యూనరేటివ్ ప్రైజ్ ఎఫ్‌ఆర్‌పి) ఖరారు చేసింది. చెరకు రైతులకు ఈ మేరకు మిల్లులు ఈ కనీస ధరను చెల్లించాల్సి ఉంటుంది. ఇంతకు ముందటి ఎఫ్‌ఆర్‌పితో పోలిస్తే ఇప్పటి పెంపుదల రూ 10గా లెక్కలోకి వచ్చింది. ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన బుధవారం జరిగిన కేంద్ర మంత్రి మండలి సమావేశంలో చెరకు ధర పెంపుదల నిర్ణయానికి ఆమోదం తెలిపారు. ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ సిఫార్సుల మేరకు దీనికి అనుమతి పలికారు. దేశవ్యాప్తంగా ఉన్న 5 కోట్ల మంది చెరకు రైతులకు దీని వల్ల ప్రయోజనం దక్కుతుందని సమావేశం తర్వాత కేంద్ర సమాచార ప్రసారాల మంత్రి అనురాగ్ ఠాకూర్ విలేకరులకు తెలిపారు. గత ఏడాది ఎఫ్‌ఆర్‌పి రూ 305 ఉంది. ఇప్పుడిది రూ 315 అయింది. అక్టోబర్ నుంచి ఆరంభమయ్యే చెరకు సీజన్‌లో…

Read More

హైదరాబాద్ లో ఔటర్ రింగ్ రైలు ప్రాజెక్టు ఏర్పాటుపై రైల్వేశాఖ చర్యలు చేపట్టిందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. తెలంగాణకు ఔటర్‌ రింగ్‌ రైలు ప్రాజెక్టు రాబోతుందని గుడ్ న్యూస్ చెప్పారు. త్వరలో రీజనల్‌ రింగ్‌ రోడ్డుకు సమాంతరంగా ఔటర్‌ రింగ్‌ రైలు ప్రాజెక్టు రానుందని స్పష్టం చేశారు. ఔటర్ రింగ్‌ రైలు ప్రాజెక్టు వివరాలను ఇప్పటికే కేంద్రం తెలంగాణ ప్రభుత్వానికి అందించినట్టు పేర్కొన్నారు. ఆర్‌ఆర్‌ఆర్‌(రిజనల్ రింగ్ రోడ్డు), ఔటర్‌ రింగ్‌ రైలుతో హైదరాబాద్‌ అభివృద్ధిలో మరింత ముందుకు దూసుకెళ్తుందని చెప్పారు. ఈ ప్రాజెక్టు రూట్‌ దాదాపుగా ఖరారైందని తెలిపారు. ఔటర్ రింగ్ రైలు ప్రాజెక్టు సర్వేకు కేంద్రం నిధులు మంజూరు చేసిందని తెలిపారు. హైదరాబాద్‌ ఔటర్‌ రింగ్‌ రైలు ప్రాజెక్టు దేశంలోనే మొదటని కేంద్రమంత్రి కిషన్‌ రెడ్డి వెల్లడించారు. వ్యాపార, రవాణా రంగంలో ఔటర్ రింగ్ రైలు ప్రాజెక్టు కీలక మార్పు తీసుకువస్తుందని చెప్పారు. విజయవాడ, గుంటూరు, వరంగల్‌,…

Read More

ప్రపంచవ్యాప్తంగా 150 టాప్‌ యూనివర్సిటీలో భారత్‌కి చెందిన బాంబే ఐఐటి స్థానం దక్కించుకుంది. ఐఐటి బాంబే ప్రపంచవ్యాప్త యూనివర్సిటీల్లో నిలిచినందుకు కేంద్ర మంత్రి రాజీవ్‌ చంద్రశేఖర్‌ సంతోషం వ్యక్తం చేశారు. క్వాక్వెరెల్లి సైమండ్స్‌ (క్యూఎస్‌) ప్రపంచ విశ్వవిద్యాలయాల ర్యాంకులనిస్తుంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న 150 టాప్‌ యూనివర్సిటీలో భారత్‌కి చెందిన ఐఐటి బాంబే 149వ ర్యాంక్‌లో నిలిచింది. క్యూఎస్‌ ర్యాకింగ్‌ వెలువడిన అనంతరం ప్రపంచవ్యాప్త టాప్‌ యూనివర్సిటీల్లో ఐఐటి బాంబే చేరి మైలురాయిని సాధించిందని ఆ యూనివర్సిటీ బుధవారం అధికారిక ప్రకటన వెల్లడించింది. ఇక ఈ విషయంపై కేంద్రమంత్రి రాజీవ్‌ మీడియాతో మాట్లాడుతూ.. ‘వరల్డ్‌ టాప్‌ యూనివర్సిటీల్లో ఐఐటి బాంబే ర్యాంక్‌ సాధించడం సంతోషంగా ఉంది. ఈ సందర్భంగా ఐఐటికి నా అభినందనలు. ఈ ర్యాంక్‌లు ఇచ్చే క్యూఎస్‌ వ్యవస్థాపకుడు న్యూనిజికి కృతజ్ఞతలు’ అని తెలిపారు. ఈ సంవత్సరం ర్యాంకింగ్‌ సిస్టమ్‌ కోసం 2,900 యూనివర్సిటీలకు ర్యాంక్స్‌ ఇచ్చారు. వీటిలో 45 భారతీయ…

Read More