పార్లమెంట్ వర్షాకాల సమావేశాలకు కేంద్రం సిద్ధమవుతోంది. జులై మూడో వారం నుంచి ఈ సమావేశాలు ప్రారంభం కానున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. అయితే సమావేశాల తేదీలను అధికారికంగా ప్రకటించనప్పటికీ జులై 17 లేదా 20వ తేదీన సమావేశాలు ప్రారంభమవుతాయని, ఆగస్టు 10న ముగియవచ్చని తెలిపాయి. కేంద్రమంత్రి రాజ్ నాథ్ సింగ్ అధ్యక్షతన ఏర్పాటు చేసిన పార్లమెంటరీ వ్యవహారాల కేబినెట్ కమిటీ ఒకటి రెండు రోజుల్లో తేదీలను ఖరారు చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అయితే, ఈ సమావేశాలు కొత్త పార్లమెంట్ భవనంలో జరుగుతాయా? లేక ప్రస్తుతం ఉన్న భవనంలోనే కొనసాగుతాయా? అనే విషయంలో మాత్రం స్పష్టత రావాల్సి ఉంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నెల రోజుల క్రితం కొత్త పార్లమెంట్ భవనాన్ని ప్రారంభించినప్పటికీ అందులో ఇంకా కొన్ని పనులు కొనసాగుతున్నాయి. కొత్త పార్లమెంట్ భవనం సమావేశాలను నిర్వహించడానికి పూర్తిగా సిద్ధం కాకపోతే పాత భవనంలోనే వర్షాకాల సమావేశాలు…
Author: Editor's Desk, Tattva News
బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ కు కేంద్ర హోంశాఖ భద్రతను కల్పించనున్నట్లు తెలుస్తోంది. తన ప్రాణాలకు ముప్పు ఉందని తాజాగా ఈటల రాజేందర్ ఆరోపణలు చేసిన నేపథ్యంలో ఈటలకు `వై’ కేటగిరీ భద్రతను కల్పించాలని కేంద్ర హోంశాఖ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.దీనిపై ఒకట్రెండు రోజుల్లో అధికారికంగా ప్రకటన వెలువడే అవకాశం ఉంది. ఇదిలా ఉండగా, ఈటెల రాజేందర్ హత్యకు కుట్ర జరుగుతుందని ఆయన భార్య జమున బుధవారం మీడియా ముందుకు వచ్చి సంచలన ఆరోపణలు చేశారు. ఈటెలను హత్య చేయడానికి రూ.20 కోట్లు కోట్లు ఖర్చు చేస్తానని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కౌశిక్ రెడ్డి అన్నారని పేర్కొంటూ కేసీఆర్ ప్రోత్సాహకంతోనే కౌశిక్ చెలరేగిపోతున్నారని ఆమె మండిపడ్డాయిరు. తనను హత్య చేసేందుకు కుట్ర జరుగుతోందని ఈటల రాజేందర్ కూడా ఆరోపణలు చేశారు. జాగ్రత్తగా ఉండాలంటూ కొన్ని నెలలుగా తనను బెదిరిస్తున్నారని చెప్పారు. అయితే, ఇలాంటి బెదిరింపులకు తాను భయపడనని స్పష్టం చేశారు. తనది భయపడే…
ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అధికార నివాసం మరమ్మతుల కోసం కోట్లాది రూపాయల ప్రజాధనం వెచ్చించారని భారతీయ జనతా పార్టీ ఆరోపిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పడు దానికి వెచ్చించిన వ్యయంపై దర్యాప్తు జరిపే బాధ్యతలను కంప్ట్రోలర్,ఆడిటర్ జనరల్( కాగ్)కు అప్పగించినట్లు తెలుస్తోంది. ఈ పునరుద్ధరణలో భాగంగా పరిపాలన, ఆర్థికపరమైన అవినీతిపై కాగ్ ప్రత్యేక ఆడిట్ నిర్వహించనున్నట్లు సమాచారం. ఢిల్లీ లెఫ్టెనెంట్ గవర్నర్ వికె సక్సేనా రాసిన లేఖ మేరకు కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఈ ప్రత్యేక ఆడిట్‌కు ఆదేశించినట్లు తెలుస్తోంది. ఆ భవన పునరుద్ధరణలో తీవ్రస్థాయిలో ఆర్థిక అవకతవకలు చోటు చేసుకున్నట్లు ఆ లేఖలో తీవ్రస్థాయిలో ఆరోపణలు వెల్లువెత్తాయి. ఆ భవనం మరమ్మతుల కోసం మొదట 15 కోట్లనుంచి 20 కోట్ల వరకు ఖర్చవుతుందని మొదట అంచనా వేశారని, తర్వాత అది రూ.52 కోట్లకు చేరుకుందని ఆ లేఖలో ఆరోపించారు. ఈ విపరీత వ్యయం…
కేసీఆర్ కుమార్తె కవిత బాగుపడాలంటే బీఆర్ఎస్ కు ఓటేయండి, గాంధీ కుటుంబానికి మేలు కలగాలనుకుంటే కాంగ్రెస్ కు ఓటేయండి…మీ పిల్లల భవిష్యత్తు బాగుపడాలంటే బీజేపీకి ఓటేయాలని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సూచించారు. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత దిల్లీ లిక్కర్ స్కామ్ ను ప్రధాని ప్రస్తావించారు. భోపాల్‌లో నిర్వహించిన ‘మేరా బూత్ సబ్‌సే మజ్‌బూత్’ కార్యక్రమంలో ప్రధాని మోదీ పాల్గొంటూ కుటుంబ పార్టీలపై విమర్శలు చేశారు. ఇటీవల జరిగిన విపక్షాల భేటీని ప్రధాని ప్రస్తావిస్తూ అవినీతిపై చర్యలు తీసుకుంటున్నామని, వచ్చే ఎన్నికల్లో బీజేపీ విజయం తథ్యమని భావించి ప్రతిపక్షాలన్నీ ఒకచోటకు చేరుతున్నాయని విమర్శించారు. ప్రతిపక్ష పార్టీలన్నీ అవినీతి, కుంభకోణాలకు హామీ ఇస్తాయని ధ్వజమెత్తారు. బీజేపీ మాత్రం అవినీతిపరులను వదిలిపెట్టేదే లేదని హామీ ఇస్తామని తేల్చి చెప్పారు. తాము ఏసీ గదుల్లో కూర్చొని ఆదేశాలు ఇవ్వమన్న ప్రధాని మోదీ… నిత్యం ప్రజలతో మమేకమయ్యేందుకు కఠిన వాతావరణ పరిస్థితులనూ ఎదుర్కొంటామని తెలిపారు. పార్టీకన్నా దేశమే…
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నోటిఫికేషన్ అక్టోబర్ 10 ప్రాంతంలో ప్రకటించే అవకాశం ఉందని తెలుస్తోంది. ఎన్నికల సన్నద్ధతపై కేంద్ర ఎన్నికల సంఘం ఉన్నతాధికారులు వారం రోజుల క్రితం రాష్ట్రంలో పర్యటించి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీ సహా జిల్లాల కలెక్టర్లతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆ అధికారులు ఎన్నికల నోటిఫికేషన్‌పై సంకేతాలిచ్చినట్టు అధికార వర్గాలు చెబుతున్నాయి. శాసన సభను రద్దుచేసి 2018లో ముందస్తు ఎన్నికలు జరిగినపుడు ఆ ఏడాది నవంబర్ నెల 10వ తేదీన నోటిఫికేషన్ వెలువడింది. ఈ దఫా ఒక నెలముందే ఎన్నికల నోటిఫికేషన్ ప్రకటించాలన్న యోచనలో ఎన్నికల సంఘం ఉన్నట్లు తెలుస్తోంది. శాసనసభ ఎన్నికల గడువు సమీపిస్తున్న వేళ అందుకు అనుగుణంగా అధికార యంత్రాంగంలో మార్పులు, చేర్పులు జరగనున్నాయి. అధికారులు, ఉద్యోగుల బదిలీలు, పోస్టింగుల అంశంపై కేంద్ర ఎన్నికల సంఘం ఇప్పటికే ఆదేశాలు జారీ చేసింది. ఎన్నికల నిర్వహణా విధుల్లో ఉండే అధికారుల బదిలీలకు సంబంధించి మార్గదర్శకాలు జారీ…
సినిమాల ప్రభావమో లేక అందుబాటులోకి వచ్చిన టెక్నాలజీ మహిమో తెలీదుగానీ నేరగాళ్లు తెలివిమీరారు. పోలీసులకు చిక్కకుండా, ఆధారాలు లేకుండా తెలివిగా క్రైమ్ చేస్తున్నారు. అయితే పోలీసులకు కూడా ఎప్పటికప్పుడు అప్ డేట్ అవుతూ నేరగాళ్ల ఆటకట్టిస్తున్నారు. ఇలా అతితెలివితో గంజాయి స్మగ్మింగ్ చేస్తున్న ఓ గ్యాంగ్ ను పోలీసులు చాకచక్యంగా వ్యవహరించి పట్టుకున్నారు. ఎన్టీఆర్ జిల్లాలో గంజాయి స్మగ్లింగ్ ముఠా పట్టుబడింది. పోలీసులు తెలిపిన వివరాలు ప్రకారం ఓ స్మగ్లింగ్ ముఠా భారీగా గంజాయి విజయవాడకు తరలిస్తున్నట్లు సమాచారం అందింది. దీంతో వాహనాల తనిఖీలు చేపట్టిన పోలీసులు ప్రసాదంపాడు వద్ద జాతీయ రహదారిపై రెండు వాహనాలను పట్టుకున్నారు. ఓ కారు డిక్కీలో 150 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకుని అందులోని వారిని అదుపులోకి తీసుకున్నారు. ఇక మరో వాహనంలో ఎవ్వరికీ అనుమానం రాకుండా ఉల్లిపాయల బస్తా కింద గంజాయి పెట్టి తరలించినా పోలీసులు గుర్తించారు. గోనెసంచుల్లో 255 కిలోల గంజాయిని మూటగట్టి…
తన భర్త బీజేపీ నేత, హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ హత్యకు కుట్ర చేస్తున్నారని ఈటెల జామున సంచలన ఆరోపణలు చేశారు. ఈటలను హత్య చేసేందుకు ఎమ్మెల్సీ, ప్రభుత్వ విప్, హుజూరాబాద్ బీఆర్ఎస్ ఇంచార్జ్ పాడి కౌశిక్ రెడ్డి కుట్ర చేస్తున్నారని ఆమె తెలిపారు. రూ.20 కోట్లు ఇచ్చి ఈటలను చంపిస్తానని కౌశిక్ రెడ్డి అన్నట్లు తమకు తెలిసిందని జమున చెప్పారు. సీఎం కేసీఆర్ ప్రోద్భలంతోనే కౌశిక్ రెడ్డి అలా వ్యాఖ్యలు చేసి ఉంటారని పేర్కొంటూ తమ కుటుంభంలో ఎవ్వరికీ హాని కలిగినా సీఎం కేసీఆర్ బాధ్యత వహించాల్సి ఉంటుందని ఆమె చెప్పారు. కేసీఆర్ తమను ఆర్థికంగా ఇబ్బందులు పెడుతున్నారని, కానీ తాము వాటిని ఎదుర్కొంటున్నట్లు తెలిపారు. కేసీఆర్ లాంటి సీఎం తెలంగాణ ప్రజలకు అవసరమా? అని జమున ప్రశ్నించారు. రూ.20 కోట్లు కాదని, ఓటుతో ప్రజలు కేసీఆర్‌కు బుద్ది చెప్తారని విమర్శించారు. శాడిస్టులను పక్కన పెట్టుకుని కేసీఆర్ పాలన చేస్తున్నారని…
ప్రధాని నరేంద్రమోడీ మంగళవారం ఐదు వందేభారత్ రైళ్లను ప్రారంభించారు. బుధవారం రాణి కమలపాటి రైల్వే స్టేషన్‌లో రెండు వందేభారత్ రైళ్లను జెండా ఊపి ప్రారంభించారు. భోపాల్ నుండి ఇండోర్, ఇండోర్ నుండి జబల్‌పూర్‌కి వెళ్లే రైళ్లను మోడీ ప్రారంభించారు. ఇక మరో మూడు రైళ్లు.. మడ్గావ్ (గోవా)- ముంబై, ధార్వార్వాడ్- బెంగళూరు, హతియా – పాట్నా వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లను ఈ సందర్భంగా ఆయన వర్చువల్‌గా ప్రారంభించారు. దీనిపై ప్రధాని మోడీ సోమవారం ట్వీట్ చేశారు. ‘ఈ రైళ్లు మధ్యప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్ర, గోవా, బీహార్, జార్ఖండ్ రాష్ట్రాలకు అనుసంధానమై అభివృద్ధి చెందేందుకు దోహదపడనున్నాయి’ అని మోడీ తన ట్వీట్‌లో పేర్కొన్నారు. మధ్యప్రదేశలో జరిగిన ఈ రైళ్ల ప్రారంభోత్సవ కార్యక్రమంలో కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్, మధ్యప్రదేశ్ గవర్నర్ మంగూభారు పటేల్, ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి శివరాజ్‌సింగ్ చౌహాన్, కేంద్ర మంత్రులు నరేంద్రసింగ్ తోమర్, జ్యోతిరాదిత్య సింథియాలతోపాటు తదితరులు…
క్రికెట్ అభిమానులు ఎప్పుడా అంటూ.. ఆసక్తిగా ఎదురుచూస్తున్న ప్రపంచ కప్ షెడ్యూల్ వచ్చేసింది. భారత్‌లో అక్టోబర్-నవంబర్‌లో జరగనున్న ఈ మెగా టోర్నీలో మ్యాచ్‌ల షెడ్యూల్‌ను ఐసీసీ విడుదల చేసింది. బిసిసిఐ, ఐసిసి మంగళవారం ముంబయిలో ఐసిసి క్రికెట్ ప్రపంచ కప్ 2023 షెడ్యూల్‌ను ప్రకటించాయి. అక్టోబర్ 5న అహ్మదాబాద్ వేదికగా ఇంగ్లాండ్, న్యూజిలాండ్ జట్ల తొలి మ్యాచ్ జరగనుంది. చిరకాల ప్రత్యర్థులైన భారత్, పాకిస్థాన్ మ్యాచ్ అక్టోబర్ 15న జరగనుంది. అక్టోబర్ 5న టోర్నీ ప్రారంభమై నవంబర్ 19న ఫైనల్‌తో ముగుస్తుంది. కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్, ముంబైలోని వాంఖడే క్రికెట్ గ్రౌండ్‌లు సెమీస్ మ్యాచ్ లకు ఆతిథ్యం ఇవ్వనున్నాయి. ఫైనల్ మ్యాచ్ అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడి క్రికెట్ స్టేడియంలో జరుగనుంది. ప్రపంచంలో ఇదే అతి పెద్ద స్టేడియం. ఆతిథ్య భారత్ తన తొలి మ్యాచ్‌ని అక్టోబర్ 8న ఆస్ట్రేలియాతో చెన్నైలో అక్టోబర్ 8న ఆడనుంది. ఇక టోర్నీలోనే అత్యంత ఆసక్తికరమైన భారత్,…
టమాటా ధర చూసి సామాన్యులు గగ్గోలు పెడుతున్నారు. పది రోజుల క్రితం వరకు కేజీ టమాటా రూ.20 ఉండగా, క్రమక్రమంగా ధరలు భారీగా పెరుగుతూ వచ్చాయి. ఇప్పుడు ఏకంగా రూ.120కి చేరుకున్నాయి. రూ 80 నుండి రూ. 120 వరకు ధర చెల్లించవలసి వస్తున్నది. టమాటా ధర వందకు చేరడం తో వాటిని కొనేందుకు సామాన్యులు గగ్గోలు పెడుతున్నారు. కేజీ తీసుకునే దగ్గర పావుకేజీ తీసుకొని సరిపెట్టుకుంటున్నారు. కొందరైతే అసలు టమాటా వైపు చూసేందుకు కూడా భయపడుతున్నారు. టమాటాలతో పాటు నిత్యం కూరల్లో ఉపయోగించే పచ్చిమిర్చి ధర భారీగా పెరిగింది. కేజీ రూ.40 లేదా రూ.60కి లభించే పచ్చిమిర్చి.. ఇప్పుడు రూ.120కి చేరుకుంది. దీంతో ప్రజలు పచ్చిమిర్చిని తక్కువ మొత్తంలోనే ఉపయోగిస్తున్నారు. మార్చి, ఏప్రిల్‌లో కురిసిన అకాల వర్షాలతో కూరగాయల తోటలు బాగా దెబ్బతిన్నాయి. అనంతరం అధిక ఉష్ణోగ్రతలు నమోదు కావడంతో కూరగాయల దిగుబడి కూడా తగ్గిందని రైతులు చెబుతున్నారు. అలాగే…