Author: Editor's Desk, Tattva News

దేశంలో ద్రవ్యలోటును తగ్గించడానికి, ఆర్ధిక సంక్షోభం బారిన పడకుండా రాష్ట్రాలను కాపాడేందుకు రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా పట్టు సడలించిందని, అందుకే రుణాల కోసం ధరఖాస్తు చేసుకునే రాష్ట్రాల విషయంలో అడిగిందే తడవుగా అనుమతులిస్తూ వస్తోందని అధికారవర్గాల సమాచారం. కరోనా మూలంగా ఆర్ధిక సంక్షోభంలోకి కూరుకు పోకుండా, రాష్ట్రాల ద్రవ్యలోటు, రెవెన్యూలోటు పడిపోకుండా రుణాల పరిమితులను సడలించాలని ఆర్‌బిఐ నిర్ణయం తీసుకొందని, అందుకు తగినట్లుగా రుణాలు కావాలని అడిగిందే తడవుగా ధరఖాస్తు చేసుకొన్న రాష్ట్రాలకు ఆర్‌బిఐ అనుమతులు ఇస్తోందని కొందరు సీనియర్ అధికారులు తెలిపారు. ఈ తాజా నిర్ణయాన్ని దేశంలోని అన్ని రాష్ట్రాలూ సద్వినియోగం చేసుకొంటున్నాయని, కానీ ఒక్క తెలంగాణ ప్రభుత్వమే రుణాలు తీసుకునే విషయంలో ఆచితూచి వ్యవహరిస్తోందని చెబుతున్నారు. గడిచిన ఆరు నెలలుగా ప్రతి రాష్ట్రానికీ సెక్యూరిటీ బాండ్ల వేలం, ఇతర ఆర్ధిక సంస్థల నుంచి రుణాలను సేకరించుకోవడానికి కూడా అనుమతులు ఇస్తూనే ఉన్నారని వివరించారు. ఎఫ్‌ఆర్‌బిఎం పరిమితిని మాత్రం…

Read More

‘వైఎస్సార్‌ లా నేస్తం’ కార్యక్రమాన్ని సిఎం వైఎస్‌.జగన్‌ సోమవారం ప్రారంభించారు. రాష్ట్రవ్యాప్తంగా అర్హులైన 2,677 మంది యువ న్యాయవాదుల ఖాతాల్లో నెలకు రూ.5 వేల స్టయిఫండ్‌ చొప్పున 2023-24 సంవత్సరానికి మొదటి విడత ‘వైఎస్సార్‌ లా నేస్తం’ ఆర్థిక ప్రోత్సాహకాన్ని ముఖ్యమంత్రి జగన్‌ బటన్‌ నొక్కి విడుదల చేశారు. ఈ ఏడాది ఫిబ్రవరి నుంచి జూన్‌ వరకు (5 నెలలు) రూ. 25 వేల చొప్పున మొత్తం రూ.6,12,65,000 జమ చేయనున్నారు. ఈ సందర్భంగా సిఎం జగన్‌ మాట్లాడుతూ నాలుగు సంవత్సరాలుగా లా నేస్తం అమలు చేస్తున్నామని చెప్పారు. 2677 మంది అడ్వకేట్‌ చెల్లెమ్మలకు, తమ్ములకు రూ.6.12 కోట్లను వారి ఖాతాల్లో జమచేస్తున్నామని పేర్కొన్నారు. లా కోర్సు పూర్తి చేసిన, మొదటి మూడు సంవత్సరాల్లో ప్రాక్టీసు పరంగా నిలదొక్కుకోవాల్సిన అవసరం ఉందని, ఈ పరిస్థితుల్లో వారి కాళ్ల మీద వాళ్లు నిలబడేందుకు, వారికి తోడుగా నిలుస్తూ ప్రతి నెలా రూ.5…

Read More

బిఆర్ఎస్ నుండి సస్పెన్షన్ కు గురైన తర్వాత తమ రాజకీయ భవిష్యత్ గురించి గత ఆరు నెలలుగా ఎటూ తేల్చకుండా రోజుకొక ఊహాగానానికి ఆస్కారం కల్పిస్తున్న మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు ఎట్టకేలకు సోమవారం కాంగ్రెస్ లో చేరినట్లయింది.ఎఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, టిపిసిసి ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ తీర్థం ఢిల్లీలోని ఏఐసీసీ కార్యాలయంలో కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. కాగా, జులై 2న ఖమ్మంలో జరిగే సభలో రాహుల్ సమక్షంలో లాంఛనంగా పొంగులేటి కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకోనున్నారు. ఆ తర్వాత 15న మహబూబ్ నగర్ లో జరిగే బహిరంగసభలో జూపల్లి కాంగ్రెస్ లో చేరతారు. తమతో పాటు మొత్తం 35 మంది నాయకులు చేరుతున్నట్లు జాబితా ఇచ్చారు.  ఈ సందర్భంగా రాహుల్ గాంధీ కాంగ్రెస్ నేతలంతా వెనక్కి రావడం ఆనందంగా ఉందని  తెలిపారు. ఘర్…

Read More

ఈజిప్టులో పర్యటించిన భారత ప్రధాని నరేంద్ర మోదీకి ఆ దేశ అత్యున్నత పురస్కారం “ ఆర్డర్ ఆఫ్ ది నైల్ ” లభించింది. ఈజిప్టు అధ్యక్షుడు అబ్దెల్ ఫతా ఎల్‌సిసి దీనిని అందజేసి సత్కరించారు. దేశంతోపాటు మానవాళికి విశేష సేవలు అందించే వివిధ దేశాల అధినేతలు, రాజులు, ఉపాధ్యక్షులకు ఈ పురస్కారం అందిస్తున్నారు. 1915లో దీన్ని ప్రారంభించారు. అంతర్జాతీయ స్థాయిలో ప్రధాని మోదీకి ఇది 13 వ పురస్కారం కావడం విశేషం. మూడు చదరపు బంగారు యూ నిట్లతో కూడిన స్వచ్ఛమైన బంగారు కాలర్‌తో ఉండే ఈ పురస్కారంపై గత చారిత్రక వైభవాన్ని గుర్తు చేసే ఫారోనిక్ పాలకుల సంకేతాలు ఉండడం విశేషం. మొదటి యూనిట్ దుష్టశక్తుల నుంచి దేశాన్ని రక్షించే ఉద్దేశాన్ని ప్రతిబింబించగా, రెండో యూనిట్ నైలు తీసుకువచ్చే వైభవాన్ని, ఆనందాన్ని ప్రతిబింబిస్తుంది. మూడో యూనిట్ సంపదను, సహనాన్ని సూచిస్తుంది. ఈ మూడు యూనిట్లు మణులు, రత్నాలు పొదిగిన వృత్తాకార…

Read More

రెజ్లింగ్ సమాఖ్య అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ తమను లైంగిక వేధింపులకు గురిచేశాడని ఆరోపిస్తూ ఆందోళనకు దిగిన మహిళా రెజర్లు ఇకపై తాము వీధి పోరాటాలు చేయబోమని, న్యాయస్థానంలో పోరాడతామని ప్రకటించారు. అధికార బీజేపీకి చెందిన పార్లమెంటు సభ్యుడు బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్‌పై చార్జిషీట్ దాఖలు చేస్తామని ఇచ్చిన హామీని కేంద్ర ప్రభుత్వం నెరవేర్చిందని రెజ్లర్లు వినేశ్ ఫోగట్, సాక్షి మలిక్, బజరంగ్ పునియాలు ఒకే విధంగా ట్వీట్ చేయడం గమనార్హం. ‘ఈ కేసులో న్యాయం జరిగే వరకు రెజ్లర్ల నిరసన కొనసాగుతుంది. అయితే అది (పోరాటం) కోర్టులో ఉంటుంది. రోడ్లపై కాదు. డబ్ల్యూఎఫ్ఐ (రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా)లో సంస్కరణకు సంబంధించి ఇచ్చిన హామీ మేరకు ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైంది. జూలై 11న ఎన్నికలకు సంబంధించి వాగ్దానం నెరవేర్చడం కోసం మేము వేచి ఉంటాం’అని తెలిపారు. ఈ పోస్ట్ చేసిన చేసిన కొద్ది సేపటికే తాము సోషల్…

Read More

కుటుంబ పాలన కావాలంటే ఈ పార్టీలకు ఓటు వేయాలని, అభివృద్ధి కావాలంటే బిజెపికి ఓటు వేయాలని బీజేపీ అధ్యక్షుడు జెపి నడ్డా పిలుపునిచ్చారు. బిహార్‌లో లాలు కుటుంబ పాలన, యూపిలో ములాయం సింగ్ కుటుంబ పాలన, కేంద్రంలో సోనియా గాంధీ కుటుంబ పాలన, తెలంగాణలో కెసిఆర్ కుటుంబ పాలన కావాలంటే ఈ పార్టీలకు ఓటు వేయాలని చెప్పారు. ఆదివారం బిజెపి ఆధ్వర్యంలో నాగర్‌కర్నూల్‌లోని జిల్లా పరిషత్ హై స్కూల్ మైదానంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అధ్యక్షతన నిర్వహించిన నవ సంకల్ప సభకు ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొంటూ పాట్నాలో దేశంలోని ప్రతిపక్ష పార్టీలు కలిసి కూటమి కట్టలేదని అది కేవలం ఒక ఫోటో సెషన్ మాత్రమేనని ఎద్దేవా చేశారు. గతంలో ప్రధానులు విదేశీ పర్యటనకు వెళ్తే నిత్యం టెర్రరిజం, కశ్మీర్, పాకిస్థాన్ సమస్యలు మాత్రమే ముందుకు వచ్చేవని, కానీ నేడు బిజెపి హయాంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వంలో విదేశాలకు వెళ్తే…

Read More

దేశభక్త ప్రజాస్వామ్య కూటమి (పిడిఎ) పేరుతో బిజెపియేతర ప్రతిపక్షాల కూటమి ఉనికిలోకి వచ్చేందుకు కసరత్తు జరుగుతుంది. గత వారం పాట్నాలో నితీష్ కుమార్ సారధ్యంలో జరిగిన భేటీలో ఈ విషయమై ప్రాధమిక చర్చలు జరుగగా, వచ్చే నెల సిమ్లాలో జరుగనున్న భేటీలో ఈ పేరు ఖరారయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. ఎడమెఖం పెడమొఖంగా ఉన్న విపక్షాలను ఒకేతాటిపైకి తీసుకువచ్చేందుకు వచ్చే ఎన్నికలలో బిజెపిని సంఘటితంగా ఎదుర్కొనేందుకు నిర్ణయించారు. ఈ దశలో దేశభక్తియుత ప్రజాస్వామ్య కూటమి చట్రం వెలుగులోకి రానుందని వెల్లడైంది. పాట్నాలో జరిగిన విపక్ష సదస్సులో 15 పార్టీలకు చెందిన 32 మంది ప్రముఖ నేతలు ఒకచోట చేరారు. ఇంతకు ముందు కాంగ్రెస్ ఆధ్వర్యంలో యుపిఎ అధికారంలోకి వచ్చింది. దేశంలోని పలు రాజకీయ పార్టీలు ఈ కూటమిలో కలిసి పనిచేశాయి. ఇప్పుడు అధికారంలో బిజెపి సారధ్యపు ఎన్‌డిఎ చలామణి సాగుతోంది. ఈ క్రమంలో ఇకపై వెలిసే పిడిఎ ఏ విధంగా ఎన్‌డిఎకు సవాలు…

Read More

భారతదేశంలో సగం జనాభా అంటే దాదాపు 70 కోట్ల మంది మొబైల్‌ గేమర్లు ఉన్నారని గణాంకాలు చెబుతున్నాయి. చిన్న పిల్లల నుంచి మొదలుకుని వృద్దుల వరకు ఈ ఆటలకు అలవాటు పడ్డారు. ఖాళీ సమయం దొరికితే చాలు మొబైల్‌ గేమ్‌లలో లీనమయ్యే పరిస్థితి నెలకొంది. దేశంలో మొబైల్‌ గేమలకు పెరుగుతున్న ఆదరణను దృష్టిలో పెట్టుకుని అనేక కంపెనీలు తమ టెస్టింగ్‌ స్టూడియోలను ప్రారంభించడంతో పాటు నాణ్యమైణ సేవలను అందించడంతో హైదరాబాద్‌ విజయవంతమైంది. పలితంగా యూరప్‌, అమెరికన్‌ తదితర దేశాలకు చెందిన కంపెనీలు తమ ఆటలను ప్రారంభించే ముందు నాణ్యతలను పరీక్షించడానికి భాగ్యనగరం తలుపు తట్టుతున్నాయి. ఫలితంగా ఏటా వేల కోట్ల రూపాయల వ్యాపార లావాదేవీలతో పాటు వేలాది మందికి ఉపాధి లభిస్తోంది. మొబైల్ గేమింగ్‌లకు దేశంతో పాటు ప్రపంచ వ్యాప్తంగా వస్తున్న ఆదరణ నేపథ్యంలో హైదరాబాద్‌ నగరంలో ఈ రంగం భవిష్యత్‌లో మరింత విస్తరించే అవకాశం ఉందని నిపుణులు భావిస్తున్నారు. హైదరాబాద్‌…

Read More

మణిపూర్‌ పరిస్థితులను చక్కదిద్దేందుకు అఖిలపక్షాన్ని పంపాలని వివిధ రాజకీయ పార్టీలు డిమాండ్‌ చేశాయి. మణిపూర్‌ హింసను నిలువరించడంలో విఫలమైన ముఖ్యమంత్రి బీరెన్‌ సింగ్‌ను తక్షణమే బర్తరఫ్‌ చేయాలని డిమాండ్‌ చేశాయి. శనివారంపార్లమెంట్‌ లైబ్రరీ బిల్డింగ్‌లో కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా అధ్యక్షతన మణిపూర్‌ పరిస్థితులపై అఖిలపక్ష సమావేశం జరిగింది. మణిపూర్‌లో పరిస్థితి అదుపులో లేదని అమిత్‌ షా తొలిసారి బహిరంగంగా అంగీకరించారు. తనను విశ్వసించాలని, ఈ విషయంపై ప్రధాని సూచనలు ఇస్తున్నారని అమిత్‌ షా పేర్కొన్నారు. ఈ ఘర్షణల్లో ఇప్పటి వరకు 131 మంది మరణించారని, హింస, దోపిడీ సహా 5,036 ఘటనలు నమోదయ్యాయని తెలిపారు. 5,889 ఎఫ్‌ఐఆర్‌లు నమోదు కాగా, 144 మందిని అరెస్టు చేశారు. వివాదాలకు కారణమైన కేసును హైకోర్టు నుంచి సుప్రీం కోర్టుకు బదిలీ చేసేలా చర్యలు తీసుకోవచ్చని అమిత్‌ షా తెలిపారు. కేంద్ర సాయుధ బలగాలను వెంటనే వెనక్కి పంపాలన్నారు. పరిస్థితిని చక్కదిద్దడంలో, సంక్షోభాన్ని…

Read More

రష్యాలో నాటకీయ పరిణామాల మధ్య తిరుగుబాటు సంక్షోభం ముగిసింది. బెలారస్ అధ్యక్షుడు లుకషెంకో రాయబారంతో రష్యా సైన్యం, వాగ్నర్ గ్రూప్ మధ్య ఒప్పందం కుదిరింది. రష్యాలో వాగ్నర్ గ్రూప్ తిరుగుబాటు ప్రకటించిన నేపథ్యంలో రంగంలోకి దిగిన బెలారస్ అధ్యక్షుడు, వాగ్నర్ గ్రూప్ చీఫ్ ప్రగోజిన్‌తో చర్చలు జరిపారు. ఉద్రిక్తతను సడలించడానికి బలగాలను నిలువరించాలని లుకషెంకో విజ్ఞప్తి చేశారు. ఇరివురి మధ్య జరిగిన చర్చల అనంతరం రష్యా సైన్యం, వాగ్నర్ గ్రూప్ మధ్య రాజీ ఒప్పందం కుదిరింది. దీంతో ఉక్రెయిన్‌లోని శిబిరాలకు తిరిగి వెళ్లిపోవాలని ప్రిగోజన్ తన సైన్యాన్ని ఆదేశించారు. మరోవైపు, రాజీ ఒప్పందం అనంతరం వాగ్నర్ చీఫ్ ప్రిగోజిన్‌పై క్రిమినల్ కేసు ఎత్తివేస్తామని క్రెమ్లిన్ ప్రకటించారు. కాగా, ఉక్రెయిన్‌పై సైనిక చర్యలో ఇంత కాలం రష్యాకు అండగా ఉండిన ప్రైవేటు సైన్యం వాగ్నర్ గ్రూపు ఇప్పుడు తిరుగుబాటు బావుటా ఎగరేసింది. మాస్కోలోని సైనిక నాయకత్వాన్ని కూలదోసేందుకు అన్ని చర్యలు తీసుకుంటామని ప్రతిన…

Read More