టైటానిక్ షిప్ శకలాలను చూసేందుకు ఐదుగురితో వెళ్లి గల్లంతైన టైటాన్ సబ్‌మెర్సిబుల్ కథ విషాదాంతమైంది. తీవ్రమైన ఒత్తిడి వల్ల టైటాన్ పేలిపోయిందని, దీంతో అందులో ఉన్న ఐదుగురు పర్యాటకులు మరణించారని అమెరికన్ కోస్ట్‌గార్డ్ ప్రకటించింది. టైటాన్‌ను వెతికేందుకు సముద్ర గర్భంలోకి పంపించిన రిమోట్ ఆపరేటెడ్ వెహికిల్ (ఆర్‌వోవీ) సహాయంతో మునిగిన టైటానిక్ నౌక సమీపంలో కొన్ని శకలాలను గుర్తించినట్టు వెల్లడించింది. టైటానిక్ ఓడ సమీపంలో 488 మీటర్ల దూరంలో టైటాన్ శకలాలు ఉన్నట్లు పేర్కొంది. అట్లాంటిక్ మహాసముద్రంలో 12 వేల అడుగుల లోతులో ఉన్న టైటానిక్ శకలాలను చూడటానికి టూరిస్ట్ సంస్థ ఓషియన్‌గేట్ పంపిన ‘టైటానిక్ సబ్ మెర్సిబుల్’ (మినీ జలాంతర్గామి) ఆదివారం రాత్రి గల్లంతైంది. దీంతో అప్రమత్తమైన అమెరికా, కెనడా రక్షణ బృందాలు . టైటాన్ ఆచూకీ కనుగొనేందుకు గాలింపు చర్యలు చేపట్టాయి. దాదాపు 13 వేల అడుగుల లోతున్న చోట ఆ మినీ జలాంతర్గామి చప్పుళ్లు వినేందుకు సోనార్లను జారవిడిచారు.…
Author: Editor's Desk, Tattva News
అద్భుతమైన ప్రాజెక్టును చేపట్టి దేశానికి, ప్రపంచానికి అవసరమయ్యే రైళ్లను తెలంగాణ బిడ్డలు తయారు చేయడం గర్వకారణమని రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు కొనియాడారు. రంగారెడ్డి జిల్లా శంకర్‌పల్లి మండలంలోని కొండకల్ గ్రామంలో మేధా సర్వో డ్రైవ్స్, స్విస్ రైల్వే వెహికిల్స్ తయారీదారు స్టాడ్లర్ రైల్ సంయుక్తంగా స్థాపించిన రైల్వే కోచ్ ఫ్యాక్టరీని గురువారం సీఎం కేసీఆర్ ప్రారంభించారు. దేశంలోనే ఇది అతిపెద్ద ప్రైవేట్ కోచ్ ఫ్యాక్టరీ కావడం విశేషం. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో సీఎం కేసీఆర్ మాట్లాడుతూ హైదరాబాద్‌లో ఫార్మా పరిశ్రమలు, పౌల్ట్రీ పరిశ్రమలు పెద్ద ఎత్తున ఏర్పాటవుతున్నాయని, జీనోమ్ వ్యాలీలో మూడోవంతు వ్యాక్సినేషన్ ఇక్కడి నుంచే అందిస్తున్నామని పేర్కొన్నారు. మేధా సంస్థ రూ.2,500 కోట్ల పెట్టుబడితో ఫేజ్-1ను మొదలుపెట్టి, మాన్యుఫ్యాక్చరింగ్‌ను కూడా ఆరంభించిందని చెప్పారు. రానున్న రోజుల్లో ఈ ఫ్యాక్టరీ మరింతగా ఎదగాలని ఆకాంక్షించారు. మేధా సంస్థకు అనుబంధంగా మలేషియన్ కంపెనీతోపాటు మరో నాలుగైదు దేశాల…
బీజేపీ-జనసేన పొత్తు ప్రసక్తి లేదని, తెలంగాణలో బీజేపీ సింహం లెక్క సింగిల్ గానే పోటీ చేసి, అధికారం కైవసం చేసుకుంటుందని బిజెపి రాష్త్ర అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ భరోసా వ్యక్తం చేశారు. గురువారం మహా జనసంపర్క్ అభియాన్”లో భాగంగా బండి సంజయ్ కరీంనగర్ లోని చైతన్యపురి, జ్యోతినగర్ కాలనీల్లో ఇంటింటికీ బీజేపీ కార్యక్రమం నిర్వ హించారు. ఈ సందర్బంగా మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్ నుండి ఎవరు గెలిచినా మళ్లీ వెళ్లేది బీఆర్‌ఎస్ లోకేనని తేల్చి చెప్పారు. ఇటీవల కొందరు నేతలు కేసీఆర్ ను ఓడించడం కోసం అంటూ కాంగ్రెస్ లో చేరడాన్ని ప్రశవిస్తూ కాంగ్రెస్ లో చేరడమంటే బీఆర్‌ఎస్ కు సహకరించినట్లేనని హెచ్చరించారు. ఏనాడూ అమరవీరుల కుటుంబాల ముఖం చూడని కేసీఆర్.. ఇయాళ పిలిచి సన్మానం చేయడం.. శంకరమ్మకు ఎమ్మెల్సీ పదవి ఇవ్వడం వెనుక పెద్ద జిమ్మిక్కు అని ధ్వజమెత్తారు. కాంగ్రెస్ నేత పొన్నం ప్రభాకర్ వ్యాఖ్యలపై స్పందిస్తూ విమర్శలు…
మలేషియాలోని కౌలాలంపూర్‌లో జరిగిన మిస్ అండ్ మిస్టర్ గ్రాండ్ సీ వరల్డ్ 2023 పోటీల్లో తెలంగాణ బిడ్డకు అరుదైన గౌరవం దక్కింది. ఈ అందాల పోటీల్లో హైదరాబాద్‌కు చెందిన మహతి కౌమారి మిస్ అండ్ మిస్టర్ గ్రాండ్ సి వరల్డ్ లో 2వ స్థానం దక్కించుకుంది. జూన్ 4 నుండి 10 వరకు జరిగిన అందాల పోటీల్లో ఆమె భారతదేశం తరఫున పోటీల్లో పాల్గొంది. మలేషియా, దక్షిణాఫ్రికా సహా 15 దేశాల నుండి సుమారు 45 మంది మహిళలు ఈ అందాల పోటీల్లో పోటీ రాగా మహతి కౌమారి 2వ రన్నరప్‌గా గెలుపొందారు. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మహతి కౌమారి మాట్లాడుతూ తెలంగాణ బిడ్డగా తనకు ఈ అవకాశం రావడం అదృష్టంగా భావిస్తున్నానని పేర్కొన్నారు. 2వ రన్నరప్‌గా నిలిచి మన రాష్ట్రానికి కాకుండా దేశానికి పేరు తెచ్చినట్లయిందని ఆమె సంతోషం వ్యక్తం చేశారు. అందాల పోటీల…
తెలంగాణలో ఆషాడ మాస బోనాల ఉత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. గోల్కొండ జగదాంబిక అమ్మవారి ఆలయంలో బోనాలలో పోతురాజులు, భాజా భజంత్రీలు, శివసత్తుల పూనకాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. బోనాల తొలి రోజున తెలంగాణ ప్రభుత్వం తరఫున మంత్రులు ఇంద్రకరణ్ రెడ్డి, మహమూద్ అలీ, తలసాని శ్రీనివాస్ యాదవ్ అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించారు. బోనాలలో పోతురాజులు, భాజా భజంత్రీలు, శివసత్తుల పూనకాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. అనంతరం లంగర్ హౌస్ నుంచి రథం, తొట్టెల ఊరేగింపు ప్రారంభమై గోల్కొండ కోటలోని జగదాంబ ఆలయం వరకు కొనసాగింది. ఉత్సవ విగ్రహాలకు ఆలయ కమిటీ సభ్యులు, ప్రధానార్చకుల ఇంట్లో ఘనంగా పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి మాట్లాడుతూ ప్రముఖ పండుగల్లో ఒకటైన బోనాల పండుగను తెలంగాణ ప్రభుత్వం రాష్ట్ర పండుగగా ప్రకటించిందని తెలిపారు. బోనాల ఉత్సవాలకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసిందని చెప్పారు. 2014 నుంచి 2022 వరకు బోనాల నిర్వణకు రాష్ట్ర…
మానవ అక్రమ రవాణా అమానుషమని, చాలా దేశాల్లో దీన్ని అరికట్టేందుకుకఠిన చట్టాలు ఉన్నాయని, మన రాష్ట్రంలో కూడా పోలీస్ శాఖలో ప్రత్యేక విభాగం ఏర్పాటు అవసరమని తెలంగాణ రాష్ట్ర హైకోర్టు అభిప్రాయపడింది. చిన్నారుల అదృశ్యం, మానవ అక్రమ రవాణాను అరికట్టే విధంగా ప్రభుత్వాన్ని ఆదేశించాలని అభ్యర్థిస్తూ దాఖలైన ప్రజాప్రయోజన వ్యాజ్యాలు (పిల్స్ ), పిటిషన్లను బుధవారం హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఉజ్జల్ భూయాన్, జస్టిస్ ఎన్ తుకారాంజీ విచారించారు. ఈ సందర్భంగా హైకోర్టు ఆదేశాల మేరకు పసిపిల్లల అదృశ్యం, మానవ అక్రమ రవాణాపై న్యాయసేవాధికార సంస్థ హైకోర్టుకు నివేదిక సమర్పించింది. ఈ నివేదికను పరిశీలించిన ధర్మాసనం చిన్నారుల అదృశ్యం, మానవ అక్రమ రవాణాపై తీసుకుంటున్న చర్యలు పెద్దగా లేకపోవడం, బాలల సంరక్షణ కేంద్రాలలో పరిస్థితులపై ఆశ్చర్యం వ్యక్తం చేసింది. తప్పిపోయిన బాలలను సంరక్షించే కేంద్రాలు ప్రభుత్వం ఆధ్వర్యంలో లేవని, ప్రభుత్వేతర సంస్థల ఆధ్వర్యంలో నడుస్తున్నాయని నివేదికలో పేర్కొంది. అక్కడ ఆరోగ్యకర…
ప్రపంచానికి భారత్ అందించిన యోగా నిజంగా విశ్వవ్యాప్తమని ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. దీనికి కాపీరైట్‌గానీ, పేటెంట్‌గానీ, రాయల్టీగానీ.. ఏమీ లేవని చెప్పారు. అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా న్యూయార్క్‌లోని ఐరాస ప్రధాన కార్యాలయంలో బుధవారం నిర్వహించిన కార్యక్రమానికి ప్రధాని మోదీ నేతృత్వం వహించారు. కార్యక్రమం అనంతరం ‘నమస్తే’ అంటూ తన ప్రసంగాన్ని ప్రారంభించిన మోదీ ఈ వేడుకలకు హాజరయ్యేందుకు సుదూర ప్రాంతాల నుంచి వచ్చిన వారందరికీ కృతజ్ఞతలు తెలిపారు. ‘‘యోగా భారతదేశం నుంచి వచ్చింది. దీనికి కాపీరైట్, పేటెంట్, రాయల్టీ ఏమీ లేవు. మీ వయసు, లింగం, ఫిట్‌నెస్ స్థాయికి అనుగుణంగా ఉంటుంది. యోగా నిజంగా విశ్వజనీనమైనది” అని పేర్కొన్నారు. యోగాకు యావత్ ప్రపంచం మద్దతు పలకడం అద్భుతమని చెప్పారు. అంతకుముందు మోదీ ఒక వీడియో సందేశం విడుదల చేశారు. ‘‘యోగా ద్వారా మనలోని వైరుధ్యాలు, అడ్డంకులు, ప్రతిఘటనలను తొలగించుకోవాలి’’ అని అందులో పిలుపునిచ్చారు. కాగా, ఐక్యరాజ్యసమితిలో ఏర్పాటు చేసిన…
ఆదిపురుష్ సినిమా విడుదలైనప్పటి నుంచి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఆ సినిమాలోని డైలాగుల విషయంలో, పాత్రలను మలిచిన తీరు విషయంలో తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా హనుమంతుడి పాత్రతో చిల్లర మాటలు అనిపించడంపై జనం ఆగ్రహం వ్యక్తంచేశారు. ఈ నేపథ్యంలో ఆదిపురుష్ మూవీ మేకర్స్ హనుమంతుడి డైలాగులకు సవరణలు చేశారు. మార్చిన డైలాగులతో ఉన్న వీడియో ట్విటర్‌లో చక్కెర్లు కొడుతున్నది. ఆదిపురుష్ సినిమా హిందీ వెర్షన్‌లో లంకా దహనం సందర్భంగా హనుమంతుడు ఇంద్రజిత్తుతో చెప్పే డైలాగులపై తీవ్ర విమర్శలు వచ్చాయి. ‘కప్డా తేరీ బాప్ కా, తేల్ తేరీ బాప్ కా, అగ్ బీ తేరీ బాప్ కా, జలేగీ బీ తేరి బాప్ హై’ (వస్త్రం నీ అయ్యదే, నూనె నీ అయ్యదే, నిప్పు నీ అయ్యదే, ఇప్పుడు తగులబడేది కూడా నీ అయ్యే) అని హనుమంతుడి చేత ఇంద్రజిత్తుకు చెప్పించడాన్ని పలువురు తప్పుపట్టారు. దాంతో ఆ డైలాగులను ఇప్పుడు మార్చేశారు.…
పాకిస్థాన్ కేంద్రంగా విద్రోహ చర్యలకు పాల్పడుతున్న లష్కరే తొయిబా ఉగ్రవాది సాజిద్ మిర్‌ను నిషేధిత వ్యక్తుల జాబితాలో చేర్చకుండా చైనా అడ్డుపుల్ల వేయడాన్ని భారత్ తీవ్రంగా ఖండించింది. చైనాపై తీవ్ర వ్యాఖ్యలు చేసింది. అనేక సభ్య దేశాలు మద్దతు ఇచ్చినప్పటికీ ఈ ప్రతిపాదన విజయవంతం కాకపోతే, గ్లోబల్ కౌంటర్ టెర్రరిజం ఆర్కిటెక్చర్‌లో నిజంగా ఏదో తప్పు ఉందని నమ్మడానికి తమకు న్యాయమైన కారణాలు ఉన్నాయని స్పష్టం చేసింది. అల్పమైన భౌగోళిక రాజకీయ ప్రయోజనాల కోసం ఉగ్రవాదులను నిషేధిత జాబితా లోకి చేర్చలేకపోతే , మనకు ఉగ్రవాదంపై పోరాడే నిజమైన సంకల్పం లేనట్టే అని చైనాపై తీవ్రంగా మండిపడింది. పాక్ కేంద్రంగా పనిచేస్తోన్న లష్కరే తొయిబా ఉగ్ర ముఠాలో సాజిద్ మీర్ 2001 నుంచి కీలక సభ్యుడిగా పనిచేస్తున్నాడు. 2006 నుంచి 2011 వరకు ఈ ముఠా విదేశాల్లో జరిపిన దాడులకు మీర్ ఇన్‌ఛార్జ్‌గా వ్యవహరించాడు. 2008లో ముంబైలో చోటు చేసుకున్న 26/11…
చైనా, అమెరికా మధ్య మాటల యుద్ధం నువ్వంటే నువ్వనే తీవ్రస్థాయి విమర్శలు జోరందుకున్నాయి. చైనా అధినేత జి జిన్‌పింగ్‌ను అమెరికా అధ్యక్షులు జో బైడెన్ నియంత అని తిట్టిపోశారు. దీనిపై చైనా తీవ్రస్థాయిలో మండిపడింది. ఇటువంటి వ్యాఖ్యలు పరమచెత్తగా ఉన్నాయని, బాధ్యతారాహిత్యం అని చైనా విదేశాంగ మంత్రిత్వశాఖ ప్రతినిధి మావో నింగ్ స్పందించారు. ఓ వైపు బైడెన్ ఆదేశాలతోనే అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోని బ్లింకెన్ ఇటీవలే చైనాలో పర్యటించారు. జిన్‌పింగ్‌ను కలిశారు. చైనా అమెరికా మధ్య కీలక విషయాలల్లో సర్దుబాట్లు కుదిరాయని జిన్‌పింగ్ ఈ దశలో తెలిపారు. అయితే జిన్‌పింగ్‌ను బైడెన్ డిక్టెటర్‌గా పేర్కొనడం తిరిగి ఇరుదేశాల నడుమ పరస్పర వివాదం మరింతగా రగులుకుంది. బైడెన్ ఇటీవలే కాలిఫోర్నియాలో ఓ సభలో మాట్లాడుతూ చైనా అధినేతను తిట్టిపోశారు. దీనిపై చైనా ప్రతినిధి స్పందిస్తూ ఇటువంటి వ్యాఖ్యలు అనుచితం, రెచ్చగొట్టేలా ఉన్నాయని తెలిపారు. ఇదంతా కూడా కేవలం బైడెన్ తమ పార్టీకి…