Author: Editor's Desk, Tattva News

ప్రభుత్వ, ప్రైవేటు రంగంలోని అన్ని ఉద్యోగాల్లో మహిళలకు నెలలో ఒక రోజు నెలసరి సెలవు విధానాన్ని ఒడిశా రాష్ట్ర ప్రభుత్వం గురువారం ప్రకటించింది. కటక్ లో జరిగిన జిల్లా స్థాయి స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో ఒడిశా ఉపముఖ్యమంత్రి ప్రభావతి పరిదా ఈ ప్రకటన చేశారు. రుతుచక్రం మొదటి లేదా రెండవ రోజున పని నుండి సెలవు తీసుకోవడానికి అర్హులైన మహిళా ఉద్యోగులకు ఒక రోజు రుతుక్రమ సెలవు విధానం తక్షణమే అమల్లోకి వస్తుంది. రుతుస్రావం అయ్యే వారందరికీ పెయిడ్ మెన్స్ట్రువల్ లీవ్ పాలసీని అమలు చేయాలనే దీర్ఘకాలిక డిమాండ్ నేపథ్యంలో ఒడిశా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. అన్ని భాగస్వామ్య పక్షాలను సంప్రదించిన తర్వాత పెయిడ్ మెన్స్ట్రువల్ లీవ్ పాలసీని రూపొందించే అంశాన్ని పరిశీలించాలని సుప్రీంకోర్టు జూలై 8న కేంద్రాన్ని కోరింది. అయితే, వేతనంతో కూడిన రుతుస్రావ సెలవును తప్పనిసరి చేసే యోచనలో కేంద్రం ప్రస్తుతానికి లేదు. కేరళ, బీహార్ రాష్ట్రాల్లో…

Read More

పారిస్ ఒలింపిక్స్​లో తనపై విధించిన అనర్హతను సవాలు చేస్తూ రెజ్లర్ వినేశ్‌ ఫొగాట్‌ చేసిన అభ్యర్థనను కోర్ట్‌ ఆఫ్‌ ఆర్బిట్రేషన్‌ ఫర్‌ స్పోర్ట్స్‌ తాజాగా తిరస్కరించింది. ఆమె దాఖలు చేసిన పిటిషన్‌ను కొట్టివేసింది. అయితే ఈ కేసును ఇప్పటికే మూడు సార్లు వాయిదా వేయగా, తుది తీర్పు కోసం వెయిట్ చేసిన క్రీడాభిమానులకు నిరాశే మిగిలింది. “యునైటెడ్ వరల్డ్ రెజ్లింగ్, అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ విధించిన అనర్హతను సవాలు చేస్తూ రెజ్లర్ వినేశ్ ఫొగాట్ చేసిన అప్పీల్‌ను కాస్‌ తిరస్కరించడం నన్ను దిగ్భ్రాంతికి అలాగే నిరాశకు గురిచేసింది. సిల్వర్ మెడల్ ఇవ్వాలని వినేశ్‌ చేసిన అభ్యర్థనను తోసిపుచ్చుతూ కాస్‌ ఆగస్టు 14న తీర్పును ఇచ్చింది” అని భారత ఒలింపిక్ సంఘం అధ్యక్షురాలు పీటీ ఉష తాజాగా ఒక ప్రకటనలో పేర్కొన్నారు. అయితే వినేశ్ అప్పీలుపై తీర్పు ఆలస్యం అవుతుండడం వల్ల సోషల్ మీడియాలో తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. తీర్పు ఎందుకు…

Read More

తెలంగాణ నుంచి రాజ్యసభ అభ్యర్థి గా అభిషేక్ మను సింఘ్వీని కాంగ్రెస్ పార్టీ ఎంపిక చేసింది. ఈ మేరకు బుధవారం ఎఐసిసి ప్రధాన కార్యదర్శి కెసి వేణుగోపాల్ ప్రకటించారు. కె.కేశవరావు రాజీనామాతో తెలంగాణలో రాజ్యసభ స్థానం ఖాళీ అయిన విషయం తెలిసిందే. రాజ్యసభలోని 12 స్థానాల్లో ఉప ఎన్నికలకు రంగం సిద్ధమైంది.  తెలంగాణ సహా తొమ్మిది రాష్ట్రాలకు చెందిన ఈ ఖాళీలకు సంబంధించి సెప్టెంబరు 3న ఎన్నికలు నిర్వహించేందుకు ఎన్నికల సంఘం (ఇసి) ఇప్పటికే షెడ్యూల్ విడుదల చేసింది. సార్వత్రిక ఎన్నికల్లో రాజ్యసభ సభ్యులు పీయూష్ గోయల్, సర్బానంద సోనోవాల్, జ్యోతిరాదిత్య సింధియా, కామఖ్య ప్రసాద్ తస(బిజెపి), మీసా భారతి (ఆర్‌జెడి), వివేక్ ఠాకుర్ (బిజెపి), దీపేంద్రసింగ్ హుడా (కాంగ్రెస్), ఉదయన్ రాజే భోస్లే (బిజెపి), కె.సి.వేణుగోపాల్ (కాంగ్రెస్), బిప్లబ్ కుమార్ దేబ్ (బిజెపి) లోక్‌సభకు ఎన్నికయ్యారు. వారి రాజీనామాలతో రాజ్యసభలో ఖాళీలు ఏర్పడ్డాయి. అలాగే తెలంగాణలో బిఆర్‌ఎస్ తరఫున రాజ్యసభ…

Read More

భారత దేశ ప్రజల కలు సాకారమయ్యే రోజు ఎంతో దూరంలో లేదని ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. 2047 నాటికి విసిత్ భారత్ మనందరి లక్ష్యమని స్పష్టం చేశారు. మనం అనుకుంటే 2047 నాటికి భారత్ అభివృద్ధి చెందిన దేశంగా మారుతుందని చెబుతూ వికసిత్ భారత్ 2047 నినాదం తమది అని, 140 కోట్ల మంది కలల తీర్మానం అని పేర్కొన్నారు. 78వ స్వాతంత్ర్య దినోత్సవాల సందర్భంగా ఢిల్లీలోని ఎర్రకోటపై వరుసగా 11వ సారి జాతీయ జెండాఎగుర వేసి జాతిని ఉద్దేశించి ప్రసంగిస్తూ భారత్ ను ప్రపంచ నైపుణ్యాల రాజధానిగా మార్చాలని, తయారీ రంగంలో గ్లోబల్ హబ్ గా భారత్ ను మార్చాలన్నదే తమ లక్ష్యమని స్పష్టం చేశారు. కోటి మంది మహిళలను లక్షాధికారులుగా మారుస్తామని తెలిపారు. మరో పది కోట్ల మంది మహిళలు కొత్తగా స్వయం సహాయక సంఘాల్లో చేరుస్తామని హామీ ఇచ్చారు. అంతరిక్షంలో భారత్ స్పేస్ స్టేషన్ త్వరలో…

Read More

కోల్‌కతలోని ఆర్‌జి కర్ ఆసుపత్రిలో హత్యకు గురైన 31 సంవత్సరాల సోస్టు గాడ్యుయేట్ ట్రెయినీ డాక్టర్‌పై సామూహిక అత్యాచారం జరిగినట్లు పోస్టు మార్టమ్ నివేదిక సూచిస్తోందని ప్రభుత్వ వైద్యుల సంఘం అఖిల భారత సమాఖ్య అదనపు ప్రధాన కార్యదర్శి డాక్టర్ సుబర్ణ గోస్వామి వెల్లడించారు. ట్రెయినీ డాక్టర్ శరీరంపై ఉన్న గాయాలను బట్టి అవి ఒక వ్యక్తి వల్ల అయ్యేవి కావని అర్థమవుతుందని ఆయన చెప్పారు. మృతురాలి మర్మాంగంలో 151 గ్రాముల వీర్యం లభించినట్లు పోస్టు మార్టమ్ నివేదిక వెల్లడించిందని, అయితే అంత ఎక్కువ పరిమాణంలో వీర్యం ఒక వ్యక్తికి చెందినది ఉండదని డాక్టర్ గోస్వామి ఒక ఆంగ్ల చానల్‌తో మాట్లాడుతూ తెలిపారు. దీన్నిబట్టి చూస్తే ఈ హత్యాచారంలో ఒకరి కన్నా ఎక్కువ మంది ఉండవచ్చని ఆయన అనుమానం వ్యక్తం చేశారు. ఈ అమానవీయ ఘటన వెనుక చాలామంది పాత్ర ఉండవచ్చని బాధితురాలి కుటుంబ సభ్యులు కూడా అనుమానం వ్యక్తం చేశారని…

Read More

అయోధ్యలోని రామ మందిరంలో ప్రతిష్టించిన బాలరాముడి విగ్రహాన్ని చెక్కిన ప్రముఖ శిల్పి అరుణ్ యోగిరాజ్‌కు చేదు అనుభవం ఎదురైంది. కుటుంబంతో కలిసి అమెరికా సందర్శన కోసం దరఖాస్తు చేసిన వీసాను ఆ దేశం నిరాకరించింది. వర్జీనియాలోని రిచ్‌మండ్‌లో ఆగస్ట్‌ 30 నుంచి సెప్టెంబర్ 1 వరకు ప్రపంచ కన్నడ కాన్ఫరెన్స్ 2024 ఈవెంట్ జరుగనున్నది.  అసోసియేషన్ ఆఫ్ కన్నడ కూటాస్ ఆఫ్ అమెరికా దీనిని నిర్వహిస్తున్నది. కర్ణాటకకు చెందిన ప్రసిద్ధ శిల్పి అరుణ్ యోగిరాజ్‌ను ఈ సదస్సుకు ఆహ్వానించారు.  కాగా, కుటుంబ సభ్యులతో కలిసి ప్రపంచ కన్నడ కాన్ఫరెన్స్‌లో పాల్గొనేందుకు అమెరికా వీసా కోసం రెండు నెలల కిందట అరుణ్ యోగిరాజ్‌ దరఖాస్తు చేశారు.  అయితే ఆయన వీసాను తిరస్కరించినట్లు ఆగస్ట్‌ 10న అమెరికా రాయబార కార్యాలయం పేర్కొంది. వీసా నిరాకరణకు ఎలాంటి కారణాలను వెల్లడించలేదు. మరోవైపు వీసా తిరస్కరణ విషయం తెలుసుకున్న అరుణ్‌ యోగిరాజ్‌, అతడి కుటుంబ సభ్యులు షాక్‌…

Read More

మద్యం కుంభకోణానికి సంబంధించిన సీబీఐ కేసులో ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్‌ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్‌ అరవింద్‌ కేజ్రీవాల్‌ కు చుక్కెదురైంది. తన అరెస్ట్‌కు వ్యతిరేకంగా కేజ్రీవాల్‌ దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీం కోర్టు తిరస్కరించింది. కేజ్రీకి మధ్యంతర బెయిల్‌ ఇవ్వలేమని పేర్కొంది. ఈ మేరకు కేజ్రీవాల్‌ వేసిన పిటిషన్‌పై సీబీఐకి సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. సీబీఐ కేసులో బెయిల్‌ కోరుతూ కేజ్రీవాల్‌ ఇటీవలే సుప్రీం కోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. సీబీఐ తనను అరెస్ట్‌ చేయడాన్ని దేశ అత్యున్నత న్యాయ స్థానంలో సవాల్‌ చేశారు. ఈ కేసులో కేజ్రీ రెగ్యులర్‌ బెయిల్‌ కోసం పిటిషన్‌ వేసినట్లు ఆప్‌ న్యాయ బృందం సోమవారం తెలిపింది. దీంతో పాటు గతంలో ఈ కేసులో ట్రయల్ కోర్టు తనకు ఇచ్చిన మధ్యంతర బెయిల్ పై హైకోర్టు స్టే విధించడాన్ని వ్యతిరేకిస్తూ మరో రెండు పిటిషన్లు దాఖలు చేశారు. ఈ పిటిషన్లపై సుప్రీంకోర్టు ఇవాళ…

Read More

జమ్ముకశ్మీర్‌లోని దోడా జిల్లాలో బుధవారం ఉదయం భద్రతా సిబ్బంది, ఉగ్రవాదుల మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో ఓ ఆర్మీ కెప్టెన్ అమరుడయ్యారు. ఈ ఎన్​కౌంటర్​లోనే నలుగురు ఉగ్రవాదులు మరణించినట్లు అధికారుల వెల్లడించారు. దోడా జిల్లాలో ఇంకా సెర్చ్​ ఆపరేషన్ కొనసాగుతున్నట్లు తెలిపారు. స్వాతంత్ర దినోత్సవం వేళ ఉదమ్‌పుర్‌లో ఉగ్రవాదులు ఉన్నట్లు నిఘా వర్గాల నుంచి సమాచారం వచ్చింది. దీంతో మంగళవారం సాయంత్రం భద్రతా సిబ్బంది సెర్చ్​ ఆపరేషన్‌ చేపట్టారు. సాయంత్రం 6 గంటల ప్రాంతంలో భద్రతా దళాలపై ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. సిబ్బంది ఎదురుకాల్పులు జరపడం వల్ల దుండగులు దోడా జిల్లాలోని అడవుల్లోకి ప్రవేశించి ఉంటారని అధికారులు భావించారు. దీంతో మంగళవారం రాత్రి సెర్చ్‌ ఆపరేషన్​ చేపట్టారు. బుధవారం ఉదయం 7:30 గంటల సమయంలో శివగఢ్ – అస్సార్​ బెల్ట్​లో భద్రతా సిబ్బంది సెర్చ్​ ఆపరేషన్ నిర్వహిస్తుండగా ఉగ్రవాదులు దాడికి దిగారు. దీంతో భద్రతా సిబ్బంది ఎదురు కాల్పులు జరిపారు. ఈ ఘటనలో…

Read More

ఢిల్లీలో జరిగిన అధికారిక స్వాతంత్య్ర దినోత్సవ కార్యక్రమంలో జాతీయ జెండాను ఎగురవేయడానికి ఢిల్లీ హోంమంత్రి కైలాష్ గెహ్లాట్ ను లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా నామినేట్ చేశారు. ఆగస్టు 15న జరిగే రాష్ట్ర స్వాతంత్య్ర దినోత్సవ కార్యక్రమానికి ఎవరు నాయకత్వం వహిస్తారనే దానిపై ప్రతిష్టంభన, అనిశ్చితి నెలకొన్న నేపథ్యంలో గహ్లోత్ ను నియమిస్తూ ఎల్జీ నిర్ణయం తీసుకున్నారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ తిహాఢ్ జైలులో ఉన్నారు. దాంతో, ఆగస్ట్ 15న ఛత్రసాల్ స్టేడియంలో జరిగే ఢిల్లీ ప్రభుత్వ అధికారిక జెండా వందన కార్యక్రమంలో త్రివర్ణ పతాకాన్ని ఎవరు ఎగరవేయాలనే విషయంలో సందిగ్ధత నెలకొన్నది. తన తరఫున ఢిల్లీ విద్యా శాఖ మంత్రి అతిషి జెండా వందనం చేయాలని కేజ్రీవాల్ కోరుకున్నారు. కానీ, ఢిల్లీ ప్రభుత్వంలో చాలా జూనియర్ అయిన హోం మంత్రి కైలాష్ గెహ్లాట్ ను ఎల్జీ వీకే సక్సేనా నామినేట్ చేశారు. ఢిల్లీ…

Read More

అగ్రిగోల్డ్‌ భూముల వ్యవహారంలో ఏపీ మాజీ మంత్రి, వైసీపీ నేత జోగి రమేష్ కుమారుడు జోగి రాజీవ్‌ ను ఏసీబీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. అతడిపై అంబాపురం అగ్రిగోల్డ్ భూముల వ్యవహారంలో అక్రమాలకు పాల్పడ్డారనే ఆరోపణలు ఉన్నాయి. ఈ కేసులో రాజీవ్‌ ఏ1గా ఉన్నారు. ఈ నేపథ్యంలో అతడిని అరెస్ట్‌ చేశారు. తాజా పరిణామాల నేపథ్యంలో జోగి రాజీవ్‌ మీడియాతో మాట్లాడుతూ అగ్రిగోల్డ్‌ భూముల క్రయ విక్రయాల్లో ఎలాంటి గోల్‌మాల్‌ జరగలేదని అన్నారు. ప్రభుత్వం కక్షసాధింపు చర్యలకు పాల్పడుతోందని ఆరోపించారు. తన తండ్రిపై కక్షతోనే తనను అరెస్ట్‌ చేశారని విమర్శించారు. ఈ కేసులో జోగి రమేశ్‌ ఇంటిపై ఏబీసీ అధికారులు మంగళవారం ఉదయం దాడి చేశారు. ఎన్టీఆర్‌ జిల్లా ఇబ్రహీంపట్నంలోని ఆయన నివాసంలో మంగళవారం ఉదయం 5 గంటల నుంచి 15 మంది అధికారులు సోదాలు చేశారు. అగ్రిగోల్డ్ భూముల వ్యవహారంపై ఏసీబీ అధికారులు తనిఖీలు చేస్తున్నట్లు సమాచారం. సీఐడీ జప్తులో…

Read More