Author: Editor's Desk, Tattva News

మార్గదర్శి అక్రమాల కేసు దర్యాప్తులో కీలక పరిణామం చోటు చేసుకుంది. మరోసారి మార్గదర్శి చిట్స్‌కి చెందిన ఆస్తుల్ని భారీగా అటాచ్ చేసింది ఏపీ సీఐడీ. ఈసారి ఏకంగా రూ. 242 కోట్ల ఆస్తులు(చరాస్తులు) జప్తు చేసినట్లు తెలుస్తోంది. మార్గదర్శి అక్రమాల కేసులో ఇప్పటికే దర్యాప్తును ముమ్మరంగా కొనసాగిస్తున్న ఏపీ సీఐడీ ఆ కంపెనీ అధినేత, ఎండీ అయిన రామోజీరావు, శైలజాకిరణ్‌లను పలుమార్లు విచారించిన సంగతి తెలిసిందే. మార్గదర్శి చిట్‌ఫండ్స్‌ చందాదా రులు, డిపాజిట్‌దారుల ప్రయోజనాల పరిరక్షణే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం గతంలోనూ ఇలాంటి కీలక నిర్ణయం తీసుకుంది. మార్గదర్శి చిట్‌ఫండ్స్‌కు చెందిన రూ.793.50 కోట్ల విలువైన చరాస్తులను జప్తు చేసేందుకు సీఐడీని అనుమతించింది. వాటిలో మార్గదర్శి చిట్‌ఫండ్స్‌ నగదు, బ్యాంకు ఖాతాల్లో సొమ్ము, నిబంధనలకు విరుద్ధంగా మ్యూచువల్‌ ఫండ్స్‌లో పెట్టిన పెట్టుబడులున్నాయి. తాజాగా మరో రూ.242 కోట్లు జప్తు చేస్తున్నట్లు ప్రకటించింది. కేంద్ర చిట్‌ఫండ్స్‌ చట్టాన్ని ఉల్లంఘిస్తూ మార్గదర్శి చిట్‌ఫండ్స్‌ దశాబ్దాలుగా…

Read More

గుజరాత్ కచ్, సౌరాష్ట్ర ప్రాంతాల్లో బిపర్‌జోయ్ తుఫాన్ బీభత్సం సృష్టించింది. అరేబియా సముద్రంలో పది రోజుల క్రితం ప్రారంభమై అత్యంత తీవ్రమైన తుపానుగా మారిన బిపర్‌జోయ్ తుపాను ఉగ్ర రూపంతో గుజరాత్‌ తీర ప్రాంతంపై విరుచుకుపడింది. తీరం దాటిన తర్వాత అతి తీవ్రం నుంచి తీవ్ర తుఫాన్‌గా బలహీనపడింది. గుజరాత్ దాటి రాజస్థాన్ దిశగా కదులుతోంది. ఈ కారణంగా నేడు, రేపు గుజరాత్, రాజస్థాన్ రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురవనున్నాయి. తుఫాన్ గాలులతో గుజరాత్‌లో ఎక్కడికక్కడ చెట్లు, విద్యుత్ స్తంభాలు విరిగిపడ్డాయి. 940 గ్రామాలకు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. బిపర్‌జోయ్ సైక్లోన్ తీరాన్ని తాకిన అనంతరం గుజరాత్, కరాచీ తీర ప్రాంతాలతో పాటు రాజస్థాన్ లో కూడా భారీ వర్షాలు కురుస్తున్నాయి. పెను గాలులు వీస్తున్నాయి. ఇప్పటికే జనజీవనం అస్తవ్యస్తంగా మారింది. గుజరాత్ లోని జఖౌ, మాండ్వీ సహా కచ్, సౌరాష్ట్రలోని అనేక ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. పెను గాలులతో…

Read More

నేరుగా థియేటర్లో మాదిరిగా కొత్త సినిమా ఫస్ట్‌ డే ఫస్ట్‌ షోని కుటుంబమంతా కలిసి ఇంట్లోనే కూర్చొని వీక్షించే అవకాశం ”ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ఫైబర్‌ నెట్‌ లిమిటెడ్‌” కల్పిస్తోందని ఏపీఎస్‌ఎఫ్‌ఎల్‌ ఛైర్మన్‌ పూనూరు గౌతంరెడ్డి తెలిపారు. లవ్‌ యూ టూ చిత్ర బృందంతో కలిసి పత్రికా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, సినిమా తీసే నిర్మాతకు, చూసే ప్రేక్షకుడికి లాభం కలిగేలా అతి తక్కువ ధరకే తొలిరోజే సినిమాను రాష్ట్ర ప్రజలు ఇంట్లో వీక్షించే అవకాశం కల్పిస్తున్నామని చెప్పారు. ఏపీ ఫైబర్‌ నెట్‌ ద్వారా తొలి సినిమాగా రూ.99కి ఇప్పటికే ”నిరీక్షణ” అనే చిత్రాన్ని విడుదల చేశామని, రెండవ సినిమాగా ”లవ్‌ యూ టూ” చిత్రాన్ని కేవలం రూ.39లకే జూన్‌, 16న అంటే శుక్రవారం ఏపీఎస్‌ఎఫ్‌ఎల్‌ వేదికగా ద్వారా స్ట్రీమింగ్‌ చేస్తున్నామని పేర్కొన్నారు. ఏపీఎస్‌ఎఫ్‌ఎల్‌ సబ్‌ స్క్రైబర్లు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు. సబ్‌ స్క్రైబ్‌ చేసుకున్నప్పటి నుండి 24 గంటల వరకు…

Read More

ఆస్ట్రేలియా దేశ పార్లమెంట్ వేదికగా తనపై తోటి సభ్యుడు లైంగిక దాడికి పాల్పడ్డాడని ఓ మహిళా ఎంపీ సంచలన ఆరోపణలు చేశారు. ప్రజాస్వామ్య దేవాలయంగా పిలిచే ఈ పార్లమెంట్ భవనం మహిళల విధులకు ఏమాత్రం భద్రత కల్పించడం లేదని ఆమె ఆవేదన వెలిబుచ్చారు. ఈ మేరకు సెనేట్ సభలో ఆమె ఉద్వేగంగా ప్రసంగించారు. కన్సర్వేటివ్ పార్టీకి చెందిన సెనేటర్ డేవిడ్ తనతో దారుణంగా ప్రవర్తించారని స్వతంత్ర మహిళా సెనేటర్ ఆరోపించారు. గురువారం సెనేట్‌లో ప్రసంగిస్తూ ఆయన తనను అనుసరించేవారని, అసభ్యకరంగా తాకే వారని, శృంగార కార్యకలాపాల కోసం ప్రతిపాదించేవారని, దీంతో ఆఫీస్ గదిలో నుంచి బయటకు రాడానికి భయపడేదానినని వివరించారు. డోర్ కొంచెం తెరిచి ఆయన లేరని నిర్ధారించుకున్న తరువాతనే బయటకు వచ్చేదానినని ఆమె విలపించారు. పార్లమెంట్ ప్రాంగణంలో నడిచేటప్పుడు తనకు తోడుగా ఎవరో ఒకరు ఉండేలా చూసుకున్నానని పేర్కొన్నారు. తనలాగే మరికొందరు ఇలాంటి వేధింపులకు బలవుతున్నారని తెలుసునని, కానీ కెరీర్…

Read More

ప్రముఖ సామాజిక మాధ్యమ దిగ్గజం ఫేస్‌బుక్‌పై కర్ణాటక హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. భారత్‌లో ఫేస్‌బుక్ సేవలను నిలిపివేస్తామని హెచ్చరించింది. సౌదీ అరేబియా జైలులో ఉన్న భారతీయుడికి సంబంధించిన కేసు దర్యాప్తులో దర్యాప్తు సంస్థలకు సహకరించడం లేదనే ఆరోపణల నేపథ్యంలో ఈ హెచ్చరిక జారీ చేసింది. కర్ణాటకకు చెందిన శైలేష్ కుమార్ పాతికేళ్లుగా సౌదీ అరేబియాలోని ఓ కంపెనీలో పనిచేస్తున్నాడు. అయితే ఫేస్‌బుక్‌లో సౌదీ రాజుపై ఇస్లాం మతంపై అభ్యంతరకర పోస్ట్ పెట్టాడని ఆరోపిస్తూ శైలేష్‌ను 2019లో అక్కడి పోలీస్‌లు అరెస్ట్ చేసి జైలు శిక్ష విధించారు. తన పేరుతో దుండగులు నకిలీ ఖాతా సృష్టించారని శైలేష్ ఎంత చెప్పినా, అక్కడి అధికారులు వినిపించుకోలేదు. ఈ విషయం తెలిసి శైలేష్ భార్య కవిత మంగళూరులో పోలీస్‌లకు ఫిర్యాదు చేసింది. నకిలీ ఖాతా వివరాలు తెలియజేయాలని పోలీస్‌లు ఫేస్‌బుక్‌కు లేఖ రాశారు. కానీ ఫేస్‌బుక్ స్పందించలేదు. దీంతో 2021లో శైలేష్ భార్య కవిత…

Read More

కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీకి చెందిన లోక్‌సభ సభ్యుడు బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్‌ తమపై లైంగిక వేధింపులకు పాల్పడినట్లు మహిళా రెజర్లు చేసిన ఫిర్యాదులపై ఢిల్లీ పోలీసులు గురువారం ఛార్జ్‌షీట్‌ను నమోదు చేశారు. పలు సెక్షన్ల కింద ఈ కేసులు పెట్టారు. ఉత్తరప్రదేశ్‌లోని కైసర్‌గంజ్ లోక్‌సభకు ప్రాతినిథ్యాన్నివహిస్తోన్నారు బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ వరుసగా మూడుసార్లు ఆయన ఇదే నియోజకవర్గం నుంచి విజయం సాధించారు. ఆయనను రెజ్లింగ్ ఫెడరేషన్ అధ్యక్షుడిగా నామినేట్ చేశారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. ఈ క్రమంలో మహిళా రెజ్లర్లపై లైంగిక దాడులకు పాల్పడ్డారనే ఆరోపణలు బ్రిజ్ భూషణ్‌పై వెల్లువెత్తాయి. ఆయనపై తక్షణ చర్యలు తీసుకోవాలంటూ భారత మహిళా రెజ్లర్లు రోడ్డెక్కిన విషయం తెలిసిందే. రోజుల తరబడి ఢిల్లీలోని జంతర్‌ మంతర్ వద్ద నిరసన కొనసాగించారు. వినేష్ ఫొగట్, బజరంగ్ పునియా, సాక్షి మాలిక్, సంగీత ఫొగట్, సత్యవ్రత్ కడియన్, సోమ్‌వీర్ రాఠీ, జితేందర్…

Read More

విశాఖపట్నంలో వైసీపీ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ కుటుంబ సభ్యుల కిడ్నాప్ గురువారం కలకలం రేపింది. కిడ్నాపైన ఎంపీ భార్య జ్యోతి, కుమారుడు శరత్, ఆడిటర్ జీవీ లను వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు కొద్దిసేపటికే పట్టుకోగలిగారు. ఉదయం రుషికొండలోని ఎంపీ ఇంట్లోకి కిడ్నాపర్లు చొరబడ్డారు. ఆ తర్వాత భార్య చేత ఆడిటర్‌కు ఫోన్ చేయించారు. ఆడిటర్ రాగానే ముగ్గుర్ని (ఎంపీ భార్య, కుమారుడు, ఆడిటర్‌) కలిపి కిడ్నాప్ చేసి తీసుకెళ్లారు. వెంటనే పోలీసులు రంగంలోకి దిగి గాలింపు మొదలుపెట్టారు. కొద్దిసపటికే కిడ్నాప్‌కు గురైన ముగ్గురు సురక్షితంగా ఉన్నట్లు ఎంపీ స్వయంగా తెలిపారు. విశాఖ-ఏలూరు రోడ్డులో వీరిని గుర్తించినట్లు చెప్పారు. ఎంపీ సత్యనారాయణ ప్రస్తుతం హైదరాబాద్‌లో ఉన్నారు. రియల్ ఎస్టేట్ వ్యాపారాల్లో ఆర్థిక లావాదేవీలు కారణంగా కిడ్నాప్ అనుమానం వ్యక్తమవుతోంది. పాత నిందితుడు హేమంత్ ఈ కిడ్నాప్ చేయించినట్లు తెలుస్తోంది. వ్యాపార లావాదేవీల విషయంలో ముగ్గుర్ని కిడ్నాప్ చేసినట్టు సమాచారం. కిడ్నాప్ చేసి…

Read More

భారత ప్రధాని నరేంద్ర మోదీ అమెరికా పర్యటన నేపథ్యంలో అగ్రరాజ్యం సాయుధ డ్రోన్ల సరఫరా ఆఫర్‌ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న కీలక అధికారులు ఈ విషయాన్ని వెల్లడించారు. దాదాపు డజను సాయుధ డ్రోన్లు విక్రయించేలా ఈ డీల్‌ ఉందని వారు వెల్లడించారు. భారత్‌ కూడా చాలా కాలంగా అమెరికా నుంచి సాయుధ డ్రోన్లను కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపుతోంది. కానీ, బ్యూరోక్రటిక్‌ ఇబ్బందులతో ఈ డీల్‌ ముందుకు వెళ్లడంలేదు. జూన్‌ 22న మోదీ శ్వేతసౌధం పర్యటన.. ఈ డీల్‌ను ఓ కొలిక్కి తెస్తుందని అంచనా వేస్తున్నారు. అమెరికాలో మోదీ పర్యటన ఖరారు కాగానే డ్రోన్‌ డీల్‌ విషయంలో పురోగతి చూపించాలని అమెరికా స్టేట్‌ డిపార్ట్‌మెంట్‌, పెంటగాన్‌ అధికారులు భారత్‌ను కోరారు. దాదాపు 30 ఎంక్యూ9బి సీ గార్డియన్‌ డ్రోన్లను విక్రయించాలని భావిస్తోంది. ఈ పర్యటనలో ప్రధాని మోడీ, అమెరికా అధ్యక్షుడు జోబైడెన్‌ మధ్య పలు ఆయుధాల తయారీ,…

Read More

ఈసారి అసెంబ్లీలో అడుగుపెట్టకుండా ఎవరు ఆపుతాడో చూస్తానని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. 2024 ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని బుధవారం ఆయన `వారాహి విజయ యాత్ర’ను ప్రారంభించిన సందర్భంగా కత్తిపూడిలో జరిగిన బహిరంగ సభలో మాట్లాడుతూ వైసీపీ ప్రజల్ని విభజించి పాలన చేస్తుందని విమర్శించారు. తాను పార్టీని నడపడానికి సినిమాలు చేస్తున్నానని, తన వద్ద అక్రమ ఆస్తులను లేవని స్పష్టం చేశారు. తన బిడ్డల కోసం దాచిన డబ్బులతో పార్టీని ప్రారంభించానని చెబుతూ ప్రజల్నే తన బిడ్డలుగా భావిస్తున్నానని పేర్కొన్నారు. పవన్ కల్యాణ్ సినిమాలను అడ్డుకుంటూ, సినిమా టికెట్ల రేట్లు తగ్గించి క్లాస్ వార్ చేస్తుంది సీఎం జగన్ అని విమర్శించారు. జనసేన ఆంధ్ర నుంచే రాజకీయాలు చేస్తుందని పేర్కొంటూ పొత్తులపై ఇంకా ఆలోచించలేదని, ఒంటరిగా వెళ్లాలో, ఉమ్మడిగా వెళ్లాలో నిర్ణయించుకున్న రోజు కుండ బద్దలు కొట్టి చెప్తానని వెల్లడించారు. “వచ్చే ఎన్నికల్లో అసెంబ్లీలో అడుగుపెడతాను. దానికోసం ఎన్ని…

Read More

తెలంగాణను ఐదు అంతర్జాతీయ అవార్డులు వరించాయి. రాష్ట్రంలోని ఐదు నిర్మాణాలకు లండన్‌లోని గ్రీన్ ఆర్గనైజేషన్ అందిస్తున్న గ్రీన్ యాపిల్ అవార్డులు దక్కాయి. సచివాలయం, యాదాద్రి ఆలయం, మొజంజాహీ మార్కెట్, దుర్గం చెరువు, కమాండ్ కంట్రోల్ సెంటర్ నిర్మాణాలకు ఈ అరుదైన గౌరవం లభించింది. భారత్‌కు గ్రీన్ యాపిల్ అవార్డులు రావడం ఇదే ప్రప్రథమమని ఈ సందర్భంగా గ్రీన్ ఆర్గనైజేషన్ వెల్లడించింది. బ్యూటిఫుల్ వర్క్‌స్పేస్ బిల్డింగ్ కేటగిరీలో తెలంగాణ సచివాలయానికి, హెరిటేజ్ కేటగిరీలో మొజంజాహీ మార్కెట్కు, యూనిక్ డిజైన్ కేటగిరీలో దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జికి, స్పెషల్ ఆఫీస్ కేటగిరీలో ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్‌కు, అద్భుతమైన మతపరమైన నిర్మాణాల విభాగంలో యాదాద్రి ఆలయానికి గ్రీన్ యాపిల్ అవార్డులు వచ్చాయి. ఈ నెల16వ తేదీన లండన్‌లో జరగనున్న అవార్డుల ప్రదానోత్సవంలో స్పెషల్ సిఎస్ అరవింద్ కుమార్ ఈ అవార్డులను అందుకోనున్నారు. పర్యావరణ రంగంలో ప్రపంచంలోనే పేరొందిన లండన్‌కు చెందిన ప్రతిష్టాత్మక ‘గ్రీన్ ఆర్గనైజేషన్’…

Read More