Author: Editor's Desk, Tattva News

రిజర్వు బ్యాంకు రూ 2,000 నోట్లను ఉపసంహరించుకోవడంతో నకిలీ నోట్ల చలామణి, నల్లధనం పోగుచేసుకోవడం బాగా తగ్గుతుందని ఒకవంక సంబర పడుతూ ఉంటె తాజాగా రిజర్వు బ్యాంకు ఆందోళనకరమైన అంశాన్ని వెల్లడించింది. అన్ని నోట్లలోకన్నా రూ. 500 నోట్లలోనే నకిలీనోట్ల చలామణి ఎక్కువగా ఉన్నట్లు తెలిపింది. రూ.2000 నోట్ల‌తో పోలిస్తే రూ.500 డినామినేష‌న్‌కు చెందిన న‌కిలీ నోట్లే ఎక్కువ‌గా స‌ర్క్యులేష‌న్‌లో ఉన్న‌ట్లు ఆర్బీఐ వెల్ల‌డించింది. 2022-23 సీజ‌న్‌లో రూ.500 డినామినేష‌న్‌కు చెందిన 14.4 శాతం న‌కిలీ నోట్ల‌ను గుర్తించిన‌ట్లు ఆర్బీఐ తెలిపింది. గ‌త ఏడాది రూ.500కు చెందిన 91,110 నోట్ల‌ను గుర్తించిన‌ట్లు ఒక నివేదిక‌లో పేర్కొంది. ఇక అదే సంవ‌త్స‌ర కాలంలో రూ.2000 నోట్లలో కేవ‌లం 9806 నోట్లు మాత్ర‌మే న‌కిలీవేని వివ‌రాలు వెల్ల‌డించింది.. రూ.20కు చెందిన నోట్ల‌ల్లో కూడా 8.4 శాతం నోట్లు న‌కిలీవి దొరికిన‌ట్లు ఆర్బీఐ త‌న రిపోర్టులో తెలిపింది. ఇక రూ.10, రూ.1, రూ.2000 నోట్ల‌ల్లో న‌కిలీలు…

Read More

ఒక వంక రాబోవు రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రెస్ నేతలు ఉమ్మడిగా పనిచేసే విధంగా చేసేందుకు ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్, మాజీ ఉపముఖ్యమంత్రి సచిన్ పైలట్ కలిసి పనిచేసే విధంగా చేయాలని కాంగ్రెస్ అధిష్టానం ప్రయత్నం చేస్తుంటే ఈ ఇద్దరి వ్యవహారం మాత్రం ఎవరిదారి వారిదిగా ఉంది. స్వయంగా కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లిఖార్జున్ ఖర్గే, పార్టీ కీలక నేత రాహుల్ గాంధీ చొరవ తీసుకొని వారిద్దరితో కలిపి సోమవారం సాయంత్రం నాలుగైదు గంటలసేపు సమాలోచనలు జరిపారు. ఆ తర్వాత వారిద్దరూ కలిసి పార్టీ గెలుపుకోసం పనిచేసేందుకు ఒప్పుకున్నారని అంటూ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కేసి వేణుగోపాల్ ప్రకటించారు. అయితే, మంగళవారం గెహ్లాట్ మీడియాతో మాట్లాడుతూ `సచిన్ కాంగ్రెస్ లో ఉంటె కదా..’ అంటూ నర్మగర్భంగా మాట్లాడారు. రాజస్థాన్ కాంగ్రెస్ మాజీ చీఫ్ సచిన్ పైలట్‌తో కలిసి పని చేస్తారా? అని విలేకర్లు అడిగినపుడు గెహ్లాట్ స్పందిస్తూ, సచిన్ పైలట్ కాంగ్రెస్ పార్టీలోనే…

Read More

సచివాలయం వద్ద తుది దశకు చేరుకున్న అమరుల స్మారక స్తూపం నిర్మాణం పనులను పరిశీలించిన ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు అమరుల స్మారక స్తూ పం ముందున్న విశాలమైన స్థలంలో తెలంగాణ తల్లి విగ్రహం ఏర్పాటు చేయాలని, విగ్రహానికి రెండు వైపులా అత్యద్భుతమైన ఫౌంటేన్లతో సుందరంగా తీర్చిదిద్దాలని అధికారులను ఆదేశించారు. దశాబ్ది ఉత్సవాలు జరుగుతున్నన్ని రోజులు అమరుల స్మారకం వద్దకు వచ్చే ప్రజలకు సౌకర్యవంతంగా వుండే విధంగా ట్రాఫిక్‌కు ఇబ్బంది లేకుండా ఏర్పాట్లు చేయాలని సిఎం సూచించారు. వివిధ ప్రభుత్వ శాఖల అధిపతులకు (హెచ్‌వోడీ) తరచూ సచివాలయంలో పని ఉంటున్న నేపథ్యంలో వారి కార్యాలయాలన్నీ కూడా దానికి సమీపంలో ఒకేచోట నిర్మించాలని ముఖ్యమంత్రి నిర్ణయించారు. నూతన సచివాలయం పూర్తిస్థాయిలో పనిచేస్తున్న నేపథ్యంలో ఆయా హెచ్‌వోడీల కార్యాలయాలను ఒకేచోటకు చేర్చడంపై సీఎం కేసీఆర్‌ ఉన్నతాధికారులతో చర్చించారు. అన్ని రంగాలకు చెందిన ప్రభుత్వశాఖల్లోని హెచ్‌వోడీలు, వారి ఆధ్వర్యంలో పూర్తిస్థాయిలో పనిచేస్తున్న సిబ్బంది సంఖ్య, తదితర అంశాల…

Read More

ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (ఐపీఎల్‌) 16వ సీజన్‌లో చెన్నై విజేతగా నిలిచింది. బంతి బంతికి ఆధిక్యం చేతులు మారుతూ సాగిన పోరులో ధోనీ సేన దుమ్మురేపింది. వరుణుడి ఆటంకం మధ్య డక్‌వర్త్‌ లూయిస్‌ పద్ధతిలో ఫలితం తేలిన పోరులో చెన్నై 5 వికెట్ల తేడాతో డిఫెండింగ్‌ చాంపియన్‌ గుజరాత్‌ టైటాన్స్‌ను మట్టికరిపించింది. తద్వారా ఐపీఎల్లో ఐదో టైటిల్‌ నెగ్గి ముంబై ఇండియన్స్‌ను సమం చేసింది. వర్షం కారణంగా ఆదివారం జరుగాల్సిన మ్యాచ్‌ సోమవారానికి వాయిదా పడగా రిజర్వ్‌ డే నాడు కూడా మ్యాచ్‌ను వరుణుడు వదల్లేదు. టాస్‌ ఓడి మొదట బ్యాటింగ్‌ చేసిన గుజరాత్‌ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 214 పరుగులు చేసింది. సాయి సుదర్శన్‌ (47 బంతుల్లో 96; 8 ఫోర్లు, 6 సిక్సర్లు) తృటిలో సెంచరీ చేజార్చుకోగా.. వృద్ధిమాన్‌ సాహా (39 బంతుల్లో 54; 5 ఫోర్లు, ఒక సిక్సర్‌) అర్ధశతకం నమోదు చేసుకున్నాడు. …

Read More

మార్గదర్శకాలు ఉన్నప్పటికీ కొన్ని బ్యాంక్‌ల్లో పాలనపరమైన లోపాలు కనిపిస్తున్నాయని, ఇది ఆందోళన కలిగించే అంశమని రిజర్వ్‌ బ్యాంక్‌ గవర్నర్‌ శక్తికాంతదాస్‌ హెచ్చరించారు. ఇది బ్యాంకింగ్‌ రంగంలో కొంత అస్థిరతకు కారణమయ్యే అవకాశం ఉందని ఆయన పేర్కొన్నారు. కొన్ని బ్యాంక్‌లు ఒత్తిడిలో ఉన్న తమ ఆస్తుల వాస్తవ స్థితిని దాచడానికి ప్రయత్నిస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందని ఆయన చెప్పారు. కొంత మంది రుణదాతలకు సంబంధించిన లోపాలను గుర్తించినట్లు తెలిపారు. ఆర్బీఐ పర్యవేక్షిస్తున్న సమయంలో ఒత్తిడికి గురైన రుణాల వాస్తవ స్థితిని దాచడానికి వినూత్న మార్గాలను ఉపయోగిస్తున్నట్లు తాము గమనించామని ఆయన ముంబైలో ప్రైవేట్‌ రంగ రుణదాతల కోసం ఆర్బీఐ నిర్వహించిన బ్యాంక్‌ల డైరెక్టర్ల సమావేశంలో మాట్లాడుతూ శక్తికాంతదాస్‌ చెప్పారు. కార్పోరేట్‌ గవర్నెస్‌పై స్పష్టమైన మార్గదర్శకాలు ఉన్నప్పటికీ ఇలాంటి గ్యాప్స్‌ తమ దృష్టికి వచ్చాయని, బ్యాంక్‌ల బోర్డులు, మేనేజ్‌మెంట్‌ ఇలాంటివాటిని నివారించాలని, ఏ విధంగానూ ఇలాంటి వాటిని అనుమతించకూడదని ఆయన స్పష్టం చేశారు. వృద్ధి…

Read More

మార్గదర్శి చిట్ ఫండ్స్ ఛైర్మన్ రామోజీ రావుపై ఏపీ సీఐడీ అధికారులు నమోదు చేసిన కేసులో ఆ సంస్థకు చెందిన రూ 793 కోట్ల ఆస్తులను తాజాగా జప్తు చేశారు. ఇటీవలే రాష్ట్రవ్యాప్తంగా ఆ సంస్థ కార్యాలయాలపై విస్తృత దాడులను నిర్వహించిన అనంతరం కేసు పెట్టిన సీఐడీ అధికారులు ఇప్పుడు ఆస్తులను అటాచ్ చేశారు. వీటి విలువ రూ. 793,50,72,460. దీనికి సంబంధించిన నోట్‌ను వారు విడుదల చేశారు. ఛిట్ ఫండ్ కార్యకలాపాల కోసం రూపొందించిన మార్గదర్శకాలను ఉల్లంఘించిందనే ఆరోపణలను ఎదుర్కొంటోంది మార్గదర్శి చిట్స్ సంస్థ యాజమాన్యం. అవి నిజమని తేలడంతో సీఐడీ అధికారులు ఇదివరకే కేసు నమోదు చేశారు. మార్గదర్శి ఛిట్ ఫండ్స్ సంస్థ ఛైర్మన్ రామోజీ రావు, మేనేజింగ్ డైరెక్టర్ శైలజా కిరణ్, ఇతర బ్రాంచ్ మేనేజర్ల పేర్లను ఇందులో పొందుపరిచారు. మార్గదర్శి ఛిట్ ఫండ్ కంపెనీ మేనేజర్ల నివాసాలపై ఇటీవల విస్తృతంగా ఏపీ సీఐడీ అధికారులు సోదాలను…

Read More

శ్రీహరికోట షార్ కేంద్రం నుంచి ఇస్రో ప్రయోగించిన జీఎస్ఎల్వీ-ఎఫ్ 12 ప్రయోగం విజయవంతం అయింది. సోమవారం ఉదయం 10.42 గంటలకు జీఎస్ఎల్వీ-ఎఫ్12 వాహకనౌక ఎన్‌వీఎస్‌-01 ఉపగ్రహాన్ని నింగిలోకి మోసుకెళ్లింది. ఈ ఉపగ్రహం విజయవంతంగా కక్ష్యలోకి చేరిందని ఇస్రో ఛైర్మన్ సోమనాథ్ ప్రకటించారు. ఈ ప్రయోగానికి ఆదివారం ఉదయం 7.12 గంటల నుంచి కౌంట్‌డౌన్‌ ప్రారంభమైంది. నిరంతరాయంగా 27.30 గంటలపాటు కొనసాగిన కౌంట్ డౌన్ అనంతరం రాకెట్‌ నింగిలోకి దూసుకెళ్లింది. జీఎస్‌ఎల్‌వీ-ఎఫ్‌12 పొడవు 51.7 మీటర్లు కాగా, బరువు 420 టన్నులు. ఈ వాహకనౌక 2232 కిలోల బరువున్న నావిక్‌ ఉపగ్రహం ఎన్‌వీఎస్‌-01 నిర్ణీత కక్ష్యలోకి చేర్చింది. దీని ఉపగ్రహం జీవితకాలం 12 ఏళ్లని శాస్త్రవేత్తలు తెలిపారు. భారత భూభాగం చుట్టూ సుమారు 1500 కి.మీ పరిధిలో రియల్‌ టైమ్‌ పొజిషనింగ్‌ సేవలను అందించనుంది ఈ ఉప్రగ్రహం. ఇండియన్ రీజనల్ నేవిగేషన్ సిస్టమ్ ని రూపొందించుకునే ప్రయత్నం ఈ ప్రయోగం కీలకం కానుంది. అందుకే …

Read More

తమ పార్టీ అధికారంలోకి వస్తే కుటుంబంలోని ప్రతి బిడ్డ చదువుకు ప్రతి సంవత్సరం రూ.15 వేలు ఇస్తామని ఏపీ మాజీ ముఖ్యమంత్రి, టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు ప్రకటించారు. ‘తల్లికి వందనం’ పేరుతో ఈ పథకం అమలు చేస్తామని, కుటుంబంలో చదువుకునే పిల్లలు ఎంత మంది ఉంటే అంత మందికీ సాయం అందిస్తామని ఆయన వెల్లడించారు. ఏపీలోని రాజమండ్రిలో ఆదివారం ముగిసిన రెండు రోజుల టీడీపీ మహానాడులో చంద్రబాబు ఎన్నికల శంఖారావం పూరించారు. ఈ సందర్భంగా ఆయన పార్టీ గ్యాస్ మేనిఫెస్టో విడుదల చేశారు. తాము అధికారంలోకి వచ్చాక ప్రతి ఇంటికి మూడు సిలిండర్లు ఉచితంగా ఇస్తామని, నిరుద్యోగులకు నెలకు రూ.3 వేల భృతి ఇస్తామని ఆయన ప్రకటించారు. 18 నుంచి 59 ఏళ్ల వయసున్న మహిళలకు నెలకు రూ.1500 ఇస్తామన్నారు. అంతేకాకుండా మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం అందుబాటులోకి తెస్తామన్నారు. ‘యువగళం’ పథకం కింద ఐదేళ్లలో 20…

Read More

2024 ఎన్నికల్లో బిజెపిని ఓడించేందుకు ప్రతిపక్షాలను ఒక్క చోటకు చేర్చేందుకు కొంతకాలంగా జెడియు అధినేత, బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ చేస్తున్న ప్రయత్నాలు ఒక్క కొలిక్కి వచ్చాయి. జూన్ 12న పాట్నాలో మొట్టమొదటి భేటీ జరిపేందుకు నిర్ణయించారు. 2024 ఎన్నికలలో అనుసరింపవలసిన ఉమ్మడి వ్యూహంపై జరిగే ఈ సన్నాహక సమావేశంలో కాంగ్రెస్ తో సహా సుమారు 18 పార్టీల నేతలు పాల్గొనగలరని భావిస్తున్నారు. ఇప్పటికే బీహార్ ఉపముఖ్యమంత్రి, ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ తో కలిసి నితీష్ కుమార్ వ్యక్తిగతంగా కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే, రాహల్ గాంధీ, మమతాబెనర్జీ, శరద్ పవర్,  అరవింద్ కేజ్రీవాల్, అఖిలేష్ యాదవ్ సహా పలువురు విపక్ష పార్టీల ప్రముఖులను కలుసుకున్నారు. నితీష్ కుమార్ ప్రతిపాదించిన ”వన్-ఆన్-వన్” వ్యూహానికి మమతా బెనర్జీ సైతం సుముఖత వ్యక్తం చేశారు. ఈ ఫార్ములా ప్రకారం ప్రాంతీయ పార్టీలు బలంగా ఉన్న రాష్ట్రాల్లో ఆ పార్టీలు బీజేపీతో నేరుగా తలబడతాయి.…

Read More

మణిపూర్‌లో తిరుగుబాటుదారులపై బీరేన్‌ సింగ్‌ ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతోంది. ఆదివారం ఒక్కరోజే ఎనిమిది గంటల పాటు వేర్వేరు ప్రాంతాలలో ఎన్‌కౌంటర్లు జరిగినట్లు, దాదాపు 40 మంది వరకూ వేర్పాటువాదులను ఈ దశలో మట్టుపెట్టినట్లు తమకు సమాచారం అందిందని రాష్ట్ర ముఖ్యమంత్రి ఎన్ బీరెన్ సింగ్ ఆదివారం విలేకరులకు తెలిపారు. తిరుగుబాటుదారులను మణిపూర్‌ ముఖ్యమంత్రి ఎన్‌. బీరేన్‌ సింగ్‌ ఉగ్రవాదులతో పోల్చారు. ‘‘సాధారణ పౌరులపై ఎం -16, ఎకె -47, స్నైపర్‌ గన్లతో ఉగ్రవాదులు దాడికి దిగుతున్నారు. గ్రామాల్లోకి వెళ్లి ఇండ్లకు నిప్పు పెడుతున్నారు. ఇండియన్‌ ఆర్మీ, ఇతర భద్రతాబలగాల సాయంతో వారిపై కఠిన చర్యలు తీసుకుంటున్నాం. ఇప్పటి వరకు 40 మంది ఉగ్రవాదులను భద్రతాబలగాలు మట్టుబెట్టాయి’’ అని ఎన్‌. బీరేన్‌ సింగ్‌ మీడియాకు తెలిపారు. ఆందోళనకారులను కుకీ మిలిటెంట్లుగా పరిగణించలేమని మణిపూర్‌ ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. మే 28న రాత్రి 2 గంటల సమయంలో ఇంఫాల్‌ లోయలోని సేక్‌మయి, సుంగు, ఫయేంగ్‌,…

Read More