భోపాల్ టెర్రర్ లింక్స్ కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఉగ్రవాద సంస్థ ‘హిజ్బ్ ఉత్ తహ్రీర్’ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా మతమార్పిడులకు ప్లాన్ చేసినట్లు ఎటీఎస్ ఇన్వెస్టిగేషన్‌లో బయటపడింది. డార్క్‌వెబ్,కీ ఆఫ్ రైట్ పాత్ పేరుతో యూట్యూబ్ ఛానల్, తీమ్రా,రాకెట్ చాట్ యాప్స్‌తో యువతను ట్రాప్ చేస్తున్నట్టు తెలుస్తోంది. ప్రధానంగా మత మార్పిడులకే మహ్మద్ సలీం అలియాస్ సౌరభ్ రాజ్ వైద్య మాడ్యూల్ ఏర్పాటు చేశారు. ఈ మాడ్యూల్‌తో దేశవ్యాప్తంగా మెట్రో నగరాల యువతను టార్గెట్ చేశారు. ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థల్లో పనిచేస్తున్న యువతను ఆకర్షించేలా ప్లాన్ చేశారు. కీ ఆఫ్ రైట్ పాత్ పేరిట ఓ యూట్యూబ్ చానల్ ఏర్పాటు చేసి అందులో ప్రసంగాలు పెట్టి షేర్ చేసేవారు. భోపాల్‌కు చెందిన సౌరభ్ రాజ్2005 నుంచే ఇస్లాం వైపు ఆకర్షితుడయ్యాడు. ఇస్లాం సాహిత్యం,డార్క్‌వెబ్‌లో ఉగ్రవాద సంస్థల ప్రేరేపిత ప్రసంగాలను ఎక్కువగా చూసేవాడు. ప్రతి రోజూ ఇంట్లో నమాజ్ చేస్తుండేవాడు. ఫ్రెండ్స్,బంధువుల కుటుంబ…
Author: Editor's Desk, Tattva News
అదానీ గ్రూపుపై హిండెన్‌బర్గ్ సంస్థ ఇచ్చిన రిపోర్టును సుప్రీంకోర్టు ప్యానల్ తప్పుపట్టింది. అదానీ కంపెనీ ఎటువంటి ఉల్లంఘనలకు పాల్పడలేదని నిపుణుల కమిటీ తెలిపింది. రెగ్యులేటరీ వైఫల్యం కూడా ఏమీ లేదని సుప్రీంకోర్టు నియమించిన ప్యానల్ తన రిపోర్టులో తెలిపింది. అదానీ గ్రూపునకు క్లీన్ చిట్ ఇస్తున్నట్లు ఆ ప్యానల్ వెల్లడించింది. 2020 నుంచి దర్యాప్తులో ఉను 13 విదేశీ సంస్థల యాజమాన్యానిు సెబీ నిర్ణయించలేకపోయినట్లు తెలిపింది. ఏది ముందు, ఏది తరువాత అనే అంశాన్ని నిర్థరించలేని సందిగ్ధావస్థలో పడినట్లు తెలిపింది. అదానీ గ్రూప్‌పై దర్యాప్తు కోసం కమిటీని సుప్రీంకోర్టు మార్చిలో నియమించింది. సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ ఎఎం సప్రే నేతృత్వంలో కమిటీని ఏర్పాటు చేసింది. దీనిలో సభ్యులుగా ఒపి భట్, జస్టిస్ జెపి దేవధర్, కెవి కామత్, నందన్ నీలేకని, సోమశేఖర్ సుందరేశన్‌లను నియమించింది. ఈ కమిటీ తన నివేదికను ఇటీవల సుప్రీంకోర్టుకు సమర్పించింది. దీనిని సుప్రీంకోర్టు శుక్రవారం ప్రజలకు…
హైదరాబాద్ నగరానికి తిలకం బొట్టులా ఉండే హుస్సేన్ సాగర్‌కు మరిన్ని మంచి రోజులు రానున్నాయి. గతంలో కంపుకొట్టే మురుగునీటితో ముక్కుపుటాలు అదిరిపోయే హుస్సేన్ సాగర్ పరిసరాలు మాత్రమే ఉండేవి. కానీ క్రమంగా స్వేచ్ఛగా విహరించేలా పర్యాటక ప్రాంతంగా సర్కారు తీర్చిదిద్దింది. ఈ క్రమంలోనే ఒకప్పుడు యథేచ్ఛగా నాలాల నుంచి కలిసే వ్యర్థాలతో కాలుష్య కాసారంగా నిలిచిన హుస్సేన్‌సాగర్‌కు జీవం పోసేలా తెలంగాణ ప్రభుత్వం తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకున్నది. హుస్సేన్‌సాగర్ ప్రక్షాళనకు ప్రాధాన్యతనిచ్చిన ప్రభుత్వం ఆధునీకరణ, బయో రెమిడియేషన్, వ్యర్థ జలాల మళ్లింపు వంటి కార్యాచరణతో ఊపిరి పోసింది. ఈ క్రమంలో గోదావరి జలాలతో హుస్సేన్‌సాగర్ నింపి, నిత్యం మంచినీరు ప్రవహించేలా చర్యలకు సిద్ధమవున్నది. గురువారం జరిగిన క్యాబినెట్ సమావేశంలో చర్చించిన సీఎం కేసీఆర్ జంట జలాశయాలను కాళేశ్వరం నీటితో నింపుతూనే, అక్కడి నుంచి హుస్సేన్‌సాగర్‌కు గోదావరి జలాలను తరలించాలని నిర్ణయించింది. జంట జలాశయాల పరివాహక ప్రాంతం నుంచి హుస్సేన్‌సాగర్‌కు…
భారత్ లో రూ. 2,000 నోట్లకు కాలం చెల్లబోతోంది. తక్షణమే వీటి చెల్లుబాటును నిలిపివేస్తున్నట్లు ప్రకటిస్తూ, ఈ నెల 23 నుంచి ఈ నోట్లను తీసుకునే విధానంలో కొన్ని షరతులు పెట్టబోతున్నట్టు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) శుక్రవారం ప్రకటించింది. సెప్టెంబర్ 30 వరకు వీటి ఎక్చేంజ్ చేసుకునేందుకు అవకాశం కల్పించనున్నట్టు తెలుస్తోంది. కాగా, 2016 నవంబర్ లో ప్రవేశపెట్టిన ఈ నోట్ల ఉత్పత్తిని 2018-19లో పూర్తిగా నిలిపివేశారు. ప్రభుత్వం లీగల్ టెండర్‌గా రూ. 500, రూ. 1,000 ఉపసంహరించుకున్న తర్వాత కరెన్సీ అవసరాలను తీర్చడానికి డినామినేషన్ ప్రవేశపెట్టబడింది. రూ. 2,000 నోట్ల లక్ష్యం “ఇతర డినామినేషన్లలోని నోట్లు తగిన పరిమాణంలో అందుబాటులోకి వచ్చిన తర్వాత నెరవేరాయి” అని ఆర్‌బీఐ తెలిపింది. చలామణిలో ఉన్న మొత్తం నోట్లలో దాదాపు 87 శాతం మార్చి 2017కి ముందు జారీ చేశారు. అవి 4-5 సంవత్సరాల జీవితచక్రం ముగింపు దశకు చేరుకుంటున్నాయి. ఇక..…
కర్ణాటక ముఖ్యమంత్రి పదవిపై గత కొన్ని రోజులుగా సాగుతున్న ఎడతెగని అనిశ్చితికి ఎట్టకేలకు తెరపడింది. కాంగ్రెస్ శాసనసభాపక్షం గత సాయంత్రం ఆయనను తమ నాయకుడినిగా ఎన్నుకోవడం, వెంటనే గవర్నర్ థావర్‌చంద్ గెహ్లాట్‌ను కలిసి ప్రభుత్వం ఏర్పాటుకు సంసిద్ధత తెలపడం, ప్రభుత్వం ఏర్పాటుకు ఆహ్వానించడం అన్ని చక చక జరిగిపోయాయి. శనివారం మధ్యాహ్నం 12.30 గంటలకు ప్రమాణ స్వీకారం చేయాలని నిర్ణయించారు. బెంగళూరులోని కంఠీరవ స్టేడియం వేదికగా జరిగే ఈ ప్రమాణస్వీకారోత్సవానికి పలు ప్రతిపక్ష పాలిత రాస్ట్రాల ముఖ్యమంత్రులను, భావసారూప్యత గల పార్టీల నాయకులను కాంగ్రెస్ పార్టీ ఆహ్వానించింది. కాంగ్రెస్ పాలిత రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్, హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రులు అశోక్ గహ్లోత్, భూపేశ్ బఘేల్, సుఖ్వీందర్‌సింగ్ సుక్కూ, తమిళనాడు, పశ్చిమబెంగాల్, బిహార్, జార్ఖండ్ సీఎంలు ఎంకే స్టాలిన్, మమతా బెనర్జీ, నితీశ్‌కుమార్, హేమంత్ సోరెన్, ఎన్‌సీపీ అధ్యక్షుడు శరద్‌పవార్, జమ్మూకశ్మీర్ మాజీ సీఎం మెహబూబా ముఫ్తీ, సీపీఐ, సీపీఎం ప్రధాన కార్యదర్శులు డి.…
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించి, ఇంకా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయకపోయినా, ఆ రాష్ట్రంలోని కొన్ని గ్రామాల ప్రజలు విద్యుత్ బిల్లులు చెల్లించేందుకు నిరాకరిస్తున్నారు. సిద్ధరామయ్య, డీకే శివకుమార్ తమ బిల్లులు చెల్లిస్తారని విద్యుత్ అధికారులకు చెబుతున్నారు. కాగా, ఎన్నికల్లో గెలిచి తమ ప్రభుత్వం ఏర్పడితే 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందిస్తామని కాంగ్రెస్ పార్టీ తన మేనిఫెస్టోలో హామీ ఇచ్చింది. ఈ నెల 10న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఆ పార్టీ గెలిచింది. ఈ నేపథ్యంలో కొప్పల్, కలబురగి, చిత్రదుర్గ వంటి జిల్లాల్లోని గ్రామాల ప్రజలు విద్యుత్ బిల్లుల చెల్లింపును నిలిపివేశారు. ఉచిత విద్యుత్‌పై హామీ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ గెలిచినందుకు విద్యుత్ బిల్లులు చెల్లించే అవసరం లేదని ఆయా గ్రామాల ప్రజలు చెబుతున్నారు. సీఎం కానున్న సిద్ధరామయ్య, డిప్యూటీ సీఎం కానున్న డీకే శివకుమార్ తమ విద్యుత్ బిల్లులు చెల్లిస్తారని అధికారులకు చెబుతున్నారు. వారు…
‘ది కేరళ స్టోరీ’ సినిమాపై పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం విధించిన నిషేధాన్ని సుప్రీంకోర్టు గురువారం నిలిపేసింది. ఈ సినిమాను ప్రదర్శించే థియేటర్ల వద్ద భద్రత కల్పించాలని తమిళనాడు ప్రభుత్వాన్ని ఆదేశించింది. భావోద్వేగాలు వాక్ స్వాతంత్ర్యాన్ని నిర్దేశించజాలవని స్పష్టం చేసింది. సినిమాలను నిషేధించే సంస్కృతిపై తీవ్రంగా విరుచుకుపడింది. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిలిం సర్టిఫికేషన్ సర్టిఫికేట్ ఇచ్చినందువల్ల శాంతిభద్రతలను పరిరక్షించే బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిదేనని చెప్పింది. భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం ఈ ఆదేశాలు ఇచ్చింది. సుదీప్తో సేన్ దర్శకత్వం వహించిన ‘ది కేరళ స్టోరీ’ చిత్రం మే 5న విడుదలైంది. కేరళలో యువతులను ఇస్లాంలోకి మార్చి, ఆ తర్వాత ఉగ్రవాద సంస్థలకు పంపిస్తున్నట్లు ఈ సినిమా కథనం చెప్తోంది. ఈ సినిమాపై పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం మే 8న నిషేధం విధించింది. తమిళనాడు ప్రభుత్వం పరోక్షంగా అదే పని చేసింది. సినిమాను నిర్మించిన సన్‌షైన్ ప్రొడక్షన్స్…
తమిళనాడులో నిర్వహించే ‘జల్లి కట్టు’ క్రీడను సుప్రీంకోర్టు సమర్థించింది. జల్లికట్టును అనుమతించే తమిళనాడు, మహారాష్ట్ర ప్రభుత్వ చట్టాలను సవాల్ చేస్తూ దాఖలైన ఈ పిటిషన్లపై న్యాయమూర్తులు కెఎం జోసెఫ్, అజరు రస్తోగి, అనిరుద్ధ బోస్, హృషికేష్‌రారు, సి.టి రవికుమార్‌లతో కూడిన ఐదుగురు న్యాయమూర్తుల ధర్మాసనం గురువారం విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా జంతువులతో కూడిన క్రీడలను అనుమతిస్తూ మహారాష్ట్ర, కర్ణాటక ప్రభుత్వాలు రూపొందించిన చట్టాల చెల్లుబాటును కూడా సుప్రీంకోర్టు అనుమతించింది. అలాగే గత కొన్ని శతాబ్దాలుగా జల్లికట్టు కొనసాగుతోందని ఈ సందర్భంగా సుప్రీం నొక్కి చెప్పింది. అలాగే ఈ చట్టాలపై రాష్ట్రపతి ఆమోదం పొందినందున జోక్యం చేసుకోలేమని స్పష్టం చేసింది. ‘జల్లికట్టు’ ఎద్దుల బండ్ల పందేలను అనుమతించే రాష్ట్రాల చట్టాల చెల్లుబాటును సవాల్ చేస్తూ దాఖలైన అన్ని పిటిషన్లను ధర్మాసనం తోసిపుచ్చింది. ఐదుగురు న్యాయమూర్తుల రాజ్యాంగ ధర్మాసనం అన్ని చట్టాలు ఖచ్చితంగా అమలు చేయబడుతుందని, సవరించిన చట్టాన్ని ఖచ్చితంగా అమలు చేయడానికి…
ఖమ్మంలో ఎన్టీఆర్ విగ్రహం ఏర్పాటుపై తెలంగాణ హైకోర్టు స్టే విధించింది. ఖమ్మంలో కృష్ణుడి రూపంలో ఉన్న ఎన్టీఆర్ విగ్రహ ఏర్పాటును వ్యతిరేకిస్తూ హైకోర్టులో 14 రిట్ పిటిషన్‌లు దాఖలయ్యాయి. శ్రీ కృష్ణ జేఏసీ, అదిభట్ల కళాపీఠం, భారతీయ యాదవ సంఘం పిటిషన్లు దాఖలు చేశాయి. ఈ పిటిషన్లను విచారణకు స్వీకరించిన హైకోర్టు వారి వాదనలను విన్నది. పిటిషనర్ల వాదనలను విన్న హైకోర్టు విగ్రహ ఏర్పాటుపై స్టే విధించింది. అయితే కృష్ణుడి విగ్రహమైనా, లేదంటే ఎన్టీఆర్ విగ్రహమైనా పెట్టుకోవచ్చని కానీ కృష్ణుడి రూపంలో ఉన్న ఎన్టీఆర్ విగ్రహం పెట్టడానికి వీల్లేదని హైకోర్టు స్పష్టం చేసింది. దీనిపై కౌంటర్ దాఖలు చేయాలని ప్రతివాదులను హైకోర్టు ఆదేశించింది. కృష్ణుడి వేషధారణలో ఉన్న ఎన్టీఆర్ 54 అడుగులు విగ్రహాన్ని ఖమ్మం లకారం చెరువులో ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ఆధ్వర్యంలో ఈ విగ్రహాన్ని ఏర్పాటుచేస్తుండగా తానా సభ్యులు, ఎన్నారైలు, పారిశ్రామిక వేత్తలు తమవంతు…
తెలంగాణాలో బీజేపీ అధికారంలోకి వస్తే బీసీ జనాభా ఆధారంగా బడ్జెట్ కేటాయిస్తామని చెబుతూ బిజెపి గురువారం బిసి డిక్లరేషన్ ప్రకటించింది. బిజెపి ఓబిసి మోర్చా జాతీయ అధ్యక్షుడు, ఎంపీ డా. కె లక్ష్మణ్ ఓబీసీల ఆత్మీయ సమ్మేళనంలో ప్రకటించిన డిక్లరేషన్ లో రాష్ట్రంలోని బీసీ కమిషన్ కు రాజ్యాంగ హోదా కల్పిస్తామని తెలిపారు. విదేశాల్లో చదివే బీసీ విద్యార్థులకు స్టాచురేషన్ పద్ధతిలో ఆర్థిక సాయం అందిస్తామని, నామినేటెడ్ పదవుల్లోనూ బీసీలకు ప్రాధాన్యం ఇస్తామని చెప్పారు. హైదరాబాద్ లోని పాతబస్తీ అభివృద్ధి చెందకపోవడానికి బీఆర్ఎస్, ఎంఐఎం పార్టీలే కారణమని, పాలకులు అనుసరించిన విధానాల కారణంగానే మెట్రో రావడం లేదని విమర్శించారు. ట్రిపుల్ తలాక్ ను నిషేధిస్తూ చట్టం తెచ్చిన ఘనత బీజేపీ ప్రభుత్వానిదని చెప్పారు. దానిని బీఆర్ఎస్, కాంగ్రెస్,ఎంఐఎం పార్టీలు వ్యతిరేకించాయన్నారు. రాష్ట్రంలో బజరంగదళ్ ను నిషేధించేందుకు బీఆర్ఎస్ ప్రభుత్వం కుట్రపన్నుతున్నదని బండి సంజయ్ ఆరోపించారు. నిజానికి రాష్ట్రంలోని ఏ ముస్లిం కూడా బజరంగదళ్…