Author: Editor's Desk, Tattva News

అమెరికాకు చెందిన షార్ట్‌ సెల్లింగ్‌ సంస్థ హిండెన్‌బర్గ్‌ రిసెర్చ్‌ శనివారం విడుదల చేసిన డాక్యుమెంట్‌పై మరోసారి దేశంలో రాజకీయ దుమారం రేగింది. అదానీ గ్రూపు కంపెనీల్లో భారత స్టాక్‌ మార్కెట్ల నియంత్రణ మండలి సెబీ చైర్‌పర్సన్‌ మాధవి పురి బచ్‌కు, ఆమె భర్తకు రహస్య వాటాలు ఉన్నాయని చేసిన ఆరోపణలు సంచలనంగా మారాయి.  ‘సమ్‌థింగ్‌ బిగ్‌ సూన్‌ ఇండియా’ అంటూ ఎక్స్‌లో పేర్కొన్న గంటల వ్యవధిలోనే ఈ బాంబు పేల్చింది. ఈ నేపథ్యంలో సెబీ చైర్‌పర్సన్‌పై హిండెన్‌బర్గ్‌ చేసిన ఆరోపణల నిగ్గు తేల్చేందుకు జాయింట్‌ పార్లమెంటరీ కమిటీ(జేపీసీ) విచారణ చేయించాలని ప్రతిపక్షాలు డిమాండ్‌ చేస్తున్నాయి. అయితే, ఈ ఆరోపణలను ఒక వంక అదానీ గ్రూప్, మరోవంక, మాధవి పురి బచ్‌ తీవ్రంగా ఖండించారు. సెబీ విశ్వసనీయతను దెబ్బతీయడంతో పాటు దాని చైర్‌పర్సన్‌ వ్యక్తిత్వ హననానికి హిండెన్‌బర్గ్‌ సంస్థ ప్రయత్నిస్తున్నదని అంటూ బచ్ ఆగ్రహం వ్యక్తం చేశారు.  ఈ స్కామ్‌ను సుప్రీంకోర్టు సుమోటోగా తీసుకోవాలని…

Read More

నిర్ణీత సమయానికి ఆరు నెలల ముందే భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయ నిర్మాణం పూర్తి చేస్తామని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్‌ నాయుడు ప్రకటించారు. రాష్ట్ర మంత్రులు గుమ్మిడి సంధ్యారాణి, కొండపల్లి శ్రీనివాస్‌లతో కలిసి ఆయన ఎయిర్‌పోర్టు నిర్మాణ పనులను ఆదివారం పరిశీలించారు. నిర్మాణంలో ఉన్న టెర్మినల్‌ భవనం, రన్‌వే, ఎటిసి టవర్‌, ఇతర భవనాలను పరిశీలించి జిల్లా అధికారులు, జిఎంఆర్‌, ఎల్‌ అండ్‌ టి ప్రతినిధులతో సమీక్షించారు. అనంతరం మీడియాతో కేంద్ర మంత్రి మాట్లాడుతూ నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయని తెలిపారు. షెడ్యూల్‌ ప్రకారం 2026 డిసెంబర్‌ నాటికి ఎయిర్‌పోర్టు నిర్మాణం పూర్తి కావాల్సి ఉందని, ప్రస్తుత పనుల తీరును బట్టి ఆరు నెలల ముందుగా 2026 జూన్‌ నాటికే విమానాశ్రయం సిద్ధమవుతుందని చెప్పారు.  ప్రతి నెలా విమానాశ్రయ నిర్మాణ పనులను పరిశీలించి అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహిస్తానని తెలిపారు. దేశంలో విమానయాన రంగం ఏటా 16…

Read More

కోల్‌కతాలోని ఆర్జీ కార్‌ మెడికల్‌ కాలేజీ, హాస్పిటల్‌లో అనుమానాస్పద స్థితిలో మరణించిన పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌ ట్రైనీ డాక్టర్‌ శవ పరీక్ష నివేదిక వెలువడింది. ఆమెపై లైంగిక దాడి చేసిన అనంతరం హత్య చేసినట్టు అది నిర్ధారించింది. ఈ కేసులో ఒక నిందితుడిని పోలీసులు అరెస్ట్‌ చేశారు.  అతడు హాస్పిటల్‌తో ఎలాంటి సంబంధం లేని బయటి వ్యక్తి అని, ఘటన జరిగిన రోజు అతను దవాఖానలోని అన్ని విభాగాలలో స్వేచ్ఛగా తిరిగాడని పోలీసులు శనివారం తెలిపారు. అతని కదలికలు అనుమానాస్పదంగా ఉన్నాయని, ఈ నేరంతో అతడికి ప్రత్యక్ష సంబంధం ఉన్నట్టు అనుమానిస్తున్నట్టు వారు చెప్పారు.  అతడిని సెల్దా కోర్టులో హాజరుపర్చగా న్యాయస్థానం 14 రోజుల పోలీస్‌ రిమాండ్‌కు ఆదేశించింది. ఛాతీ వైద్య విభాగంలో పీజీ రెండో సంవత్సరం విద్యార్థిని అయిన బాధితురాలు గురువారం రాత్రి డ్యూటీలో ఉండగా ఆమెను హత్య చేశారు. సెమినార్‌ హాల్‌లో అర్ధనగ్నంగా పడిఉన్న ఆమె దేహంపై గాయాల గుర్తులున్నాయి. …

Read More

కేరళ వయనాడ్ జిల్లాలో కొండచరియల విలయ బాధిత ప్రాంతాల్లో సహాయ, పునరావాస కార్యక్రమాలకు కేంద్రం సాధ్యమైనంతగా చేయూత ఇస్తుందని ప్రధాని నరేంద్ర మోదీ శనివారం హామీ ఇచ్చారు. కొండచరియలు విరిగిపడిన దుర్ఘటనలో ప్రాణాలతో బయటపడినవారి గురించి ప్రతి ఒక్కరూ ప్రార్థిస్తున్నారని, అవి పలు కుటుంబాల కలలను ‘ఛిద్రం చేశాయ’ని ప్రధాని పేర్కొన్నారు. ఈ విపత్తులో సర్వస్వం కోల్పోయినవారికి సాయం చేయడంలో కేరళ ప్రభుత్వానికి కేంద్రం అండగా నిలుస్తుందని ప్రధాని చెప్పారు. కొండచరియలు విరిగిపడిన దుర్ఘటనలో ఇంత వరకు 226 మంది ప్రాణాలు కోల్పోగా, 130 మందికి పైగా గల్లంతు అయ్యారు. వాస్తవ పరిస్థితి సమీక్ష కోసం, కొండచరియల విలయ బాధితుల పునరావాసానికి ఒక ప్లాన్ రూపకల్పన కోసం వయనాడ్‌లోని జిల్లా కలెక్టరేట్‌లో ఏర్పాటు చేసిన సమావేశంలో ప్రధాని మాట్లాడారు. కొండ చరియలు విరిగిపడడాన్ని ప్రకృతి ‘ప్రకోపం’గా ఆయన అభివర్ణించారు. కేరళ గవర్నర్ ఆరిఫ్ మహమ్మద్ ఖాన్, ముఖ్యమంత్రి పినరయి విజయన్, కేంద్ర మంత్రి…

Read More

తమిళనాడులో 15వ శతాబ్దానికి చెందిన శ్రీమహావిష్ణు విగ్రహాన్ని అగ్రమంగా తరలిస్తున్న ఏడుగురు వ్యక్తులను తమిళనాడు పోలీసుకు చెందిన విగ్రహాల విభాగం శనివారం అరెస్టు చేసి వారి నుంచి విగ్రహాన్ని స్వాధీనం చేసుకుంది. ముందుగా అందిన సమాచారం మేరకు తంజావూరు-తిరుచిరాపల్లి జాతీయ రహదారిపైన మేలతిరువిళాపట్టి వద్ద ఒక కారును అడ్డగించి రెండున్నర అడుగుల ఉన్న విష్ణుమూర్తి విగ్రహాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వారిని ప్రశ్నించగా భూమిని తవ్వుతుండగా తన తండ్రికి ఈ విగ్రహం దొరికినట్లు ఎ దినేష్ అనే వ్యక్తి పోలీసులకు వెల్లడించాడు. విగ్రహాన్ని తన తండ్రి తమ పవుశుల కొట్టంలోని భూమిలో దాచిపెట్టాడని దినేష్ చెప్పాడు. తన తండ్రి మరణించిన తర్వాత ఆ విగ్రహాన్ని విక్రయించాలని నిర్ణయించుకున్నానని, తన సహచరులతో కలసి రూ. 2 కోట్లకు విగ్రహాన్ని విక్రయించేందుకు బేరం కుదుర్చుకున్నానని దినేష్ చెప్పినట్లు పోలీసులు తెలిపారు. కుంభకోణం కోర్టులో నిందితులను జుడిషియల్ రిమాండ్ చేసినట్లు పోలీసులు చెప్పారు. ప్రాథమిక దర్యాప్తులో…

Read More

ప్రపంచవ్యాప్త ఆర్థిక వ్యవహారాల సంచలనాత్మక విశ్లేషణల వేదిక హిండెన్‌బర్గ్ అదానీ, అంబానీల ఆర్థిక లావాదేవీలపై తీవ్రస్థాయి ఆరోపణలకు దిగింది. భారతీయ మార్కెట్లలో తీవ్రస్థాయి ప్రకంపనలకు దారితీసే విషయాలను హిండెన్‌బర్గ్ వరుసగా రెండురోజులు శుక్రవారం, శనివారం వెలుగులోకి తెచ్చింది. తమ వద్ద ఉన్న విజిల్ బ్లోయర్ డాక్యుమెంట్ల మేరకు అదానీ బినామీ కంపెనీలకు సెబీ ఛైర్‌పర్సన్ మాధబి బచ్, ఆమె భర్తకు సంబంధం ఉందని, వీటిలో వీరిరువురికి వాటాలు ఉన్నాయని హిండెన్‌బర్గ్ తాజా సంచలనంలో పేర్కొంది. పలు డొల్ల కంపెనీలతో అదానీ భారీ స్థాయిలో డబ్బుల అక్రమాలు సాగించారని వెల్లడించింది. ఈ మనీ సైఫనింగ్ స్కాండల్‌కు సెబీ అధినేత్రి పెద్ద ఎత్తున సహకరించడం, ఈ దంపతులకు ఆయా కంపెనీలలో వాటాలు ఉండటం కీలక పరిణామమని హిండెన్‌బర్గ్ సామాజిక మాధ్యమంలో పేర్కొంది. ఇంతకు ముందు తాము పేర్కొన్న నివేదికలో అదానీ అక్రమ లావాదేవీలు ఎటువంటి జంకుగొంకూ లేకుండా సాగాయని తెలిపామని, సెబీ నుంచి ఎటువంటి…

Read More

కర్ణాటకలోని హోస్పేట్‌లో ఉన్న తుంగభద్ర డ్యామ్‌ 19వ గేటు వరదలకు కొట్టుకుపోయింది. దీంతో ఇప్పటివరకు లక్ష క్యూసెక్కుల మేర నీరు వృథాగా పోతున్నది. జలాశయానికి వరద తగ్గడంతో శనివారం రాత్రి 11 గంటల సమయంలో గేట్లను మూసివేస్తున్న క్రమంలో 19వ గేటు చైన్‌ లింక్‌ తెగి కొట్టుకుపోయింది. దీంతో గేట్ నుంచి 35 వేల క్యూసెక్కుల వరద నదిలోకి చేరుతున్నాయి. ఎగువ వరద తగ్గడంతో డ్యాం నీటి నిల్వను మేటెనెన్సు చేసే వేళ సంఘటన చోటు చేసుకుందని అధికారులు వెల్లడించారు. ప్రాజెక్టు నుంచి 60 టీఎంసీల నీళ్లు బయటికి వదిలిన తర్వాతే గేటు పునరుద్ధరణ పనులు చేపడతామని తెలిపారు. ఇందులో భాగంగా ప్రస్తుతం 33 గేట్లు తెరిచి నీటిని కిందికి వదులుతున్నామని పేర్కొన్నారు.  డ్యామ్‌ భద్రతకు సంబంధించి ఇంత పెద్ద ఘటన జరగడం గత 70 ఏండ్లలో ఇదే మొదటిసారి.  ప్రస్తుతం తుంగభద్ర నుంచి సుంకేశుల ప్రాజెక్టుకు లక్ష క్యూసెక్కుల వరద…

Read More

ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లకు సంపన్న శ్రేణిని (క్రీమీలేయర్‌) వర్తింపజేయకూడదని కేంద్ర క్యాబినెట్‌ నిర్ణయించింది. ఈ అంశంలో సుప్రీంకోర్టు చేసిన సూచనలను పరిగణనలోకి తీసుకోకూడదని నిశ్చయించింది. శుక్రవారం రాత్రి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశంలో విస్తృతంగా చర్చించి ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు కేంద్ర సమాచార, ప్రసారశాఖల మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ పేర్కొన్నారు. ‘ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్ల విషయంలో సుప్రీంకోర్టు ఆగస్టు 1న ఒక తీర్పునిచ్చింది. అందులో ఈ రిజర్వేషన్ల విషయంలో కొన్ని సూచనలు చేసింది. దీనిపై మంత్రివర్గ సమావేశంలో విస్తృత చర్చ జరిపాం. చివరకు బాబాసాహెబ్‌ అంబేద్కర్‌ రాజ్యాంగంలో స్పష్టం చేసిన విధానానికి సంపూర్ణంగా కట్టుబడి ఉండాలని క్యాబినెట్‌ తీర్మానించింది. రాజ్యాంగం ప్రకారం రిజర్వేషన్లలో ఎస్సీ, ఎస్టీలకు క్రీమీలేయర్ నిబంధన లేదు. ఆ ప్రకారమే ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లు కొనసాగించాలని క్యాబినెట్ సమావేశంలో నిర్ణయించాం’ అని అశ్వినీ వైష్టవ్ తెలిపారు. ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లలో…

Read More

బంగ్లాదేశ్‌ తాత్కాలిక ప్రభుత్వ సారధిగా గురువారం ప్రమాణ స్వీకారం చేసిన ప్రొఫెసర్‌ మహ్మద్‌ యూనస్‌ శుక్రవారం బాధ్యతలు చేపట్టారు. రక్షణ, విద్య, ఇంధనంతోసహా 27 మంత్రిత్వ శాఖలను తన వద్దనే వుంచుకున్నారు. దౌత్యవేత్త మహ్మద్‌ తుహిద్‌ హుస్సేన్‌ను విదేశాంగ మంత్రిగా నియమించారు. బంగ్లాదేశ్‌ సెంట్రల్‌ బ్యాంక్‌ మాజీ గవర్నర్‌ సలావుద్దీన్‌ అహ్మద్‌ను ఆర్థిక, ప్రణాళికా శాఖ మంత్రిగా నియమించారు.  విద్యార్థి నేతలు, పౌర సమాజ ప్రతినిధులతో చర్చలు జరిపిన తర్వాతనే సలహాదారుల ఎంపిక జరిగింది. ప్రభుత్వ ఉద్యోగాల్లో వివాదాస్పదమైన రిజర్వేషన్‌ కోటాపై ప్రజాగ్రహం పెల్లుబుకడంతో హసీనా ప్రభుత్వం పదవి నుండి వైదొలగాల్సి వచ్చింది. దాంతో మిలటరీ మద్దతు కలిగిన తాత్కాలిక ప్రభుత్వం గురువారం కొలువుదీరింది. దేశంలో శాంతి భద్రతలను పునరుద్ధరించడమే తక్షణ ప్రాధాన్యత అని హోం శాఖ బాధ్యతలు చూస్తున్న సలహాదారు, రిటైర్డ్‌ బ్రిగేడియర్‌ జనరల్‌ ఎం.షెకావత్‌ హుస్సేన్‌ పేర్కొన్నారు. శాంతి భద్రతల అమలు యంత్రాంగాల్లో, సంస్థల్లో ప్రస్తుతం విశ్వాసం లోపించిందని,…

Read More

పారిస్ ఒలింపిక్స్ లో భార‌త్ ఆరో మెడ‌ల్‌ను సొంతం చేసుకున్న‌ది. రెజ్లింగ్‌లో అమ‌న్ సెహ్రావ‌త్ కాంస్య ప‌త‌కం గెలిచాడు. శుక్ర‌వారం రెజ్లింగ్ 57 కేజీల విభాగంలో కాంస్య ప‌త‌క పోరులో ప్యూర్టోరికాకు చెందిన డారియ‌న్ క్ర‌జ్‌పై 13-5 తేడాతో అమ‌న్ అద్భుత విజ‌యాన్ని అందుకున్నాడు. ఆరంభం నుంచే ప్ర‌త్య‌ర్థిపై ఆధిప‌త్యం ప్ర‌ద‌ర్శించిన అమ‌న్ ఫ‌స్ట్ హాఫ్‌లో ఆరు, సెకండ్ హాఫ్‌లో ఏడు పాయింట్లు సాధించాడు. డారియ‌న్‌కు ఏ మాత్రం అవ‌కాశం ఇవ్వ‌లేదు. సెమీస్‌లో చేసిన త‌ప్పుల‌ను కాంస్య పోరులో రిపీట్ చేయ‌కుండా జాగ్ర‌త్త‌ప‌డ్డాడు. సెకండ్ హాఫ్‌లో అమ‌న్ దూకుడుకు డారియ‌న్ చేతులెత్తేశాడు. భారత్ త‌ర‌ఫున ఒలింపిక్ మెడ‌ల్ గెలిచిన అతి చిన్న వ‌య‌స్కుడిగా అమ‌న్ రికార్డ్ క్రియేట్ చేశాడు. 21 ఏళ్ల 24 రోజుల్లో అమ‌న్ కాంస్యం గెలిచాడు. 21 ఏళ్ల 44 రోజుల్లో పీవీ సింధు మెడ‌ల్ గెల‌వ‌గా, 22 ఏళ్ల వ‌య‌సులో విజేంద‌ర్ సింగ్ బాక్సింగ్‌లో కాంస్యం సాధించాడు.…

Read More