Author: Editor's Desk, Tattva News

2024 లోక్ సభ ఎన్నికలకు ఒక ఏడాది ముందు జరిగిన కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రెస్, బిజెపిల మధ్య జరిగిన హోరాహోరీ పోరాటంలో కాంగ్రెస్ స్పష్టమైన మెజారిటీతో ఘన విజయం సాధించింది. 224 అసెంబ్లీ స్థానాలున్న రాష్ట్ర అసెంబ్లీలో 136 స్థానాల్లో గెలుపొందింది. భారీ విజయంతో ఆ పార్టీ సంబురాల్లో మునిగిపోయింది. అసెంబ్లీ ఎన్నికల్లో ఓ పార్టీకి ఈ స్థాయిలో మెజార్టీ దక్కడం 34 ఏళ్ల తర్వాత ఇదే మొదటిసారి కావడం చెప్పుకోదగ్గ అంశం. 1989లో కాంగ్రెస్‌ ఏకంగా 178 స్థానాల్లో విజయం సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసింది. ఆ తర్వాత 1994లో జనతాదళ్‌కు 115 స్థానాలు దక్కాయి. మళ్లీ 1999లో కాంగ్రెస్‌ 132 సీట్లు గెలుచుకోగా.. 2004, 2008 ఎన్నికల్లో హంగ్‌ ఏర్పడింది. 2013లో కాంగ్రెస్‌ 122 స్థానాలు దక్కించుకోగా.. 2018 ఎన్నికల్లో మళ్లీ హంగ్‌ వచ్చింది. మరో వైపు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నది. కొత్త ముఖ్యమంత్రి ఈ…

Read More

మాతృ భాషలోనే విద్యార్థులకు ప్రాధమిక విద్యను అందించాలని ప్రధాని నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. స్థానిక భాషల్లో చదువు చెప్పాలని, గ్రామాల్లో ప్రతిభావంతులైన యువకులు టీచర్లుగా మారేందుకు ఇది ఉపయోగపడుతుందని చెప్పారు. ఇందుకోసం కొత్త జాతీయ విద్యా విధానం (ఎన్‌‌‌‌ఈపీ)నిబంధనలు పెట్టినట్లు తెలిపారు. గతంలో విద్యార్థులు పుస్తకజ్ఞానం మాత్రమే పొందే వారిని, ఎన్‌‌‌‌ఈపీతో మార్పు వస్తుందని ప్రధాని పేర్కొన్నారు. ప్రాక్టికల్ లెర్నింగ్‌‌‌‌పై ఎన్‌‌‌‌ఈపీ ఫోకస్ పెడుతుందని, ఈ విధానాన్ని అమలు చేయడం ఉపాధ్యాయుల బాధ్యతని చెప్పారు. శుక్రవారం గుజరాత్‌‌‌‌లోని గాంధీనగర్‌‌‌‌‌‌‌‌లో ఆలిండియా ప్రైమరీ టీచర్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన 29వ బైయాన్యువల్ ఎడ్యుకేషన్ కాన్ఫరెన్స్‌‌‌‌లో టీచర్లను ఉద్దేశించి ప్రధాని మాట్లాడారు. సమాచారం కావాలంటే గూగుల్‌‌‌‌ కూడా ఇస్తుంది కానీ టీచర్ల పాత్ర.. విద్యార్థులకు మెంటార్లలా ఉంటుందని ప్రధాని చెప్పారు. పిల్లల్ని మలచడంలో ప్రైమరీ టీచర్‌‌‌‌‌‌‌‌ది ముఖ్య పాత్ర అని అంటూ తమ కుటుంభం తర్వాత పిల్లలు ఎక్కువ టైం గడిపేది టీచర్ల…

Read More

రెజర్లపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారనే ఆరోపణలు ఎదుర్కొంటున్న బీజేపీ ఎంపీ, రెజ్లింగ్‌ ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియా(డబ్ల్యూఎఫ్‌ఐ) అధ్యక్షుడు బ్రిజ్‌భూషణ్‌ శరణ్‌సింగ్‌పై విచారణకు స్పెషల్‌ ఇన్వెస్టిగేటింగ్‌ టీమ్‌(సిట్‌) ఏర్పాటైంది. మరోవైపు ఈ కేసు విచారణలో తాజా పరిస్థితిపై నివేదిక సమర్పించాలని బుధవారం కోర్టు ఆదేశించగా శుక్రవారం రౌస్‌ అవెన్యూ కోర్టుకు పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ సీల్డ్‌ కవర్‌లో నివేదికను అందజేశారు. దీంతో కోర్టు తదుపరి విచారణను మే 27కు వాయిదా వేసింది. మరోవైపు బ్రిజ్‌భూషణ్‌పై చర్యలు చేపట్టాలని రెజ్లర్లు చేస్తున్న ఆందోళన కొనసాగుతుండగా ఆయనను ఢిల్లీ పోలీసులు ప్రశ్నించారు. బీజేపీ ఎంపీ బ్రిజ్‌భూషణ్‌తో పాటు డబ్ల్యూఎఫ్‌ఐ సహాయక కార్యదర్శి వినోద్‌ తోమర్‌ వాంగ్మూలాన్ని పోలీసులు తీసుకున్నారు. ఓ మైనర్‌తో సహా ఏడుగురు మహిళా రెజ్లర్ల ఫిర్యాదు మేరకు బ్రిజ్‌భూషణ్‌పై పోక్సో చట్టంతో పాటు ఇతర సెక్షన్ల కింద రెండు ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేసిన విషయం తెలిసిందే. విచారణకు సహకరించాలని నోటీసులు పంపిన పోలీసులు సుమారు…

Read More

తెలంగాణ, ఏపీ రాష్ట్రాల మధ్య ఉమ్మడి ఆస్తుల విభజనపై తెలంగాణ సర్కార్కు, కేంద్రానికి సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. ఆస్తుల విభజనపై నాలుగు వారాల్లో అఫిడవిట్ దాఖలు చేయాలని ఆదేశించింది. దీనిపై రెండు వారాల్లో ఏపీ సర్కార్ రీజాయిండర్ ఇవ్వాలని ఉత్తర్వుల్లో పేర్కొంది. రూ.1.42 లక్షల కోట్లకు సంబంధించి ఆస్తుల విభజనపై ఏపీ సర్కార్ దాఖలు చేసిన పిటిషన్ పై శుక్రవారం జస్టిస్ జేకే మహేశ్వరి, జస్టిస్ సుందరేశ్ తో కూడిన ద్విసభ్య ధర్మాసనం విచారణ జరిపింది. ఆస్తుల విభజనపై నోటీసులిచ్చి ఐదు నెలలైనా తెలంగాణ సర్కార్ నుంచి సమాధానం లేదని ఏపీ తరఫు సీనియర్ అడ్వకేట్ అభిషేక్ మను సింఘ్వీ ధర్మాసనం దృష్టికి తీసుకెళ్లారు. ఈ వాదనలపై స్పందించిన ధర్మాసనం.. ఇది రెండు రాష్ట్రాల మధ్య సమస్య అయినప్పుడు ఎందుకు సమాధానం ఇవ్వలేదని తెలంగాణ తరఫు అడ్వకేట్ను ప్రశ్నించింది. దీనిపై స్పందించిన తెలంగాణ తరఫు న్యాయవాది ఆఖరి అవకాశంగా తమకు…

Read More

ఇటీవల ఒక భక్తుడు తిరుమలలో శ్రీవారి ఆలయంలోకి మొబైల్ ఫోన్ తీసుకుని వెళ్లి ఆనంద నిలయమును వీడియో తీసి, సోషల్ మీడియాలో పెట్టడంతో అక్కడ భద్రతా వ్యవహారాలపై కలకలం చెలరేగింది. ఆ వ్యక్తి మొబైల్ ఫోన్ ఆలయంలోకి తీసుకువెళ్లడం భద్రత సిబ్బంది నిర్లక్ష్యం వల్లనే జరిగిందని ప్రాథమిక దర్యాప్తులో తేలిందని టిటిడి ఈఓ ఏవి ధర్మారెడ్డి స్పష్టం చేశారు. ఇందుకు సంబంధించిన వారిపై చర్యలు తీసుకోనున్నట్లు తెలిపారు. టీటీడీ విజిలెన్స్ అధికారులు సీసీటీవీ ఫుటేజ్ చూసి భక్తుడు భద్రత సిబ్బందిని మోసం చేసి ఆలయంలోనికి మొబైల్ ఫోన్ తీసుకు వెళ్లినట్లు నిర్ధారించారని పేర్కొన్నారు. అతనిని గుర్తించి తిరుపతికి తీసుకోస్తున్నాట్లు చెప్పారు. శ్రీవారి ఆలయంలో గంటకు 5,500 మందిని దర్శనానికి పంపించాలి. గురువారం క్షుణంగా తనిఖీ చేయడం వల్ల గంటకు 2,500 మందిని మాత్రమే దర్శనానికి పంపినట్లు చెప్పారు. దీన్ని అధిగమించేందుకు రాష్ట్ర ఇంటెలిజెన్స్ విభాగం, కేంద్ర భద్రతాధికారులు తిరుమలకు వచ్చి నూతన…

Read More

కర్ణాటకలో అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై ఉత్కంఠ నెలకొంది. మే 13న ఫలితాలు వెలువడనున్న నేపథ్యంలో ఎన్నికల్లో ఎవరు గెలుస్తారన్న విషయంపై అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మే 10న కర్ణాటకలోని 224 నియోజకవర్గాలకు ఎలక్షన్స్ జరగగా, అదే రోజులు కొన్ని ఎగ్జిట్ పోల్ ఏజెన్సీలు ఫలితాల అంచనాలను రిలీజ్ చేశాయి. ఈ ఎగ్జిట్ పోల్స్ లో కొన్ని ఏజెన్సీలు హంగ్ ఏర్పడుతుందని చెప్పగా, హెచ్‌డి కుమారస్వామికి చెందిన జనతాదళ్ (సెక్యులర్) కీలక పాత్ర పోషించడంతో కాంగ్రెస్‌కు స్వల్ప ప్రయోజనం చేకూరుతుందని మరికొన్ని ఏజెన్సీలు సూచిస్తున్నాయి. ఈ సారి జరిగిన ఎన్నికల్లో బీజేపీ, కాంగ్రెస్, మాజీ ప్రధాని హెచ్‌డీ దేవెగౌడ యొక్క జేడీ (ఎస్) మధ్య త్రిముఖ పోటీ నెలకొంది. రాష్ట్రవ్యాప్తంగా 36 కేంద్రాల్లో మే 13న ఉదయం 8 గంటలకు కౌంటింగ్ ప్రారంభం కానుంది, మధ్యాహ్నం నాటికి ఫలితంపై స్పష్టమైన సమాచారం వెలువడే అవకాశం ఉందని పోల్ అధికారులు భావిస్తున్నారు. ఇక ఎన్నికల…

Read More

నెల్లూరు జిల్లా కావలిలో బిజెపి నేతలపై పోలీసుల అరాచకంగా వ్యవహరిస్తూ ఒక భయానక వాతావారణాన్నిసృ ష్టిస్తున్నారని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రికి సమస్యలు చెప్పేందుకు వెళితే పోలీసులు బీజేపీ నేతల‌పై వ్యవహరించిన తీరుచూస్తే రాష్ట్రంలో ప్రజాస్వామ్యం లేదన్నట్లుగా కనపడుతోంది మండిపడ్డారు. సమస్యలు చెప్పుకోవడానికి వెళితే ఒక్కసారిగా పోలీసులు బీజేపీ జిల్లా అధ్యక్షుడు భరత్ కుమార్ తో సహా పలువురు బీజేపీ నేతలపై దాడికి పాల్పడ్డారు. గంటలు గడుస్తున్నా ఇప్పటి వరకు ఏ పోలీస్ స్టేషన్ లో ఉంచారు అన్న విషయం పోలీసులు చెప్పడం లేదని ఆయన విమర్శించారు. ప్రజాస్వామ్యంలొ ఉన్నామా నిరంకుశ రాచరిక వ్యవస్ధలో ఉన్నామా అనే అనుమానం కలుగుతుంద‌న్నారు. పోలీసులు బీజేపీ నేతలను వెంటనే విడుదల చేయాల‌ని, లేదంటే బీజేపీ తన కార్యకర్తలను ఎలా రక్షించుకోవాలో ఆ విధంగా రక్షించుకునే ప్రయత్నం చేస్తామని వైసీపి ప్రభుత్వాన్ని హెచ్చరించారు. బీజేపీ నేతలందరినీ బేషరతుగా విడుదల…

Read More

త్వరలోనే లక్షలాది మందితో హైదరాబాద్ లో నిరుద్యోగ మార్చ్ చేపడుతామని బిజెపి రాష్త్ర అధ్యక్షుడు బండి సంజయ్ వెల్లడించారు. సంగారెడ్డిలో చేపట్టిన బీజేపీ నిరుద్యోగ మార్చ్ లో మాట్లాడుతూ టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ ఘటనతో 30 లక్షల మంది జీవితాలను కేటీఆర్ నాశనం చేశారని విమర్శించారు.   టీఎస్ పీఎస్ సీ పేపర్ లీక్ కేసులో కేటీఆర్ ను  బర్తరఫ్ చేసి.. సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించేంత వరకు  వదిలిపెట్టే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు.  రాష్ట్రంలో సాగుతున్న నయా నిజాం, గడీల పాలనను బద్దలు కొట్టేందుకే నిరుద్యోగ మార్చ్‌ చేపట్టినట్లు సంజయ్‌ చెప్పారు. మరో ఐదు నెలల్లో  బీజేపీ అధికారంలోకి వస్తదని బండి సంజయ్ స్పష్టం చేశారు. బిశ్వాల్ కమిటీ  చెప్పిన నివేదిక ప్రకారం  తొలి ఏడాదిలోనే రెండు లక్షల ఉద్యోగాల నియామక ప్రక్రియను  ప్రారంభిస్తామని,  ప్రతి ఏడాది జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామని హామీ ఇచ్చారు.  కేసీఆర్‌ బెదిరింపులకు తమ…

Read More

డిజిటల్‌ వేదికలు, యాప్స్‌తో ఆర్థిక మోసాలు ఎక్కువ అవుతున్నాయని ఓ నివేదిక వెల్లడిచేసింది. భారతదేశంలో జరిగిన అన్ని మోసాల సంఘటనలలో సగానికి పైగా సామాజిక మాధ్యమాలు, రిమోట్‌ వర్క్‌, ఇ-కామర్స్‌, డెలివరీ అప్లికేషన్స్‌, కాంటక్ట్‌లెస్‌ చెల్లింపులు, పిన్‌టెక్‌ వేదికలు తదితర వాటితోనే అధికంగా చోటు చేసుకున్నాయని పిడబ్ల్యుసి ఇండియా వెల్లడించింది. పిడబ్ల్యుసి గ్లోబల్‌ ఎకనామిక్‌ క్రైమ్‌ అండ్‌ ఫ్రాడ్‌ సర్వే 2022 రిపోర్ట్‌ ప్రకారం డిజిటల్‌ వేదికల వల్లే 26 శాతం పైగా భారతీయ సంస్థలు 1 మిలియన్‌ డాలర్లు (రూ.8.2 కోట్లు) మోసపోయాయి. 44 శాతం మంది నేరస్తులు ఆర్థిక లాభం కోసమే మోసానికి పాల్పడ్డారని పిడబ్ల్యుసి నివేదిక తెలిపింది. టెక్నాలజీ, ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌, బ్యాంకింగ్‌, క్యాపిటల్‌ మార్కెట్లు, కన్స్యూమర్‌ ప్రొడక్ట్స్‌, రిటైల్‌, విద్యా, వైద్యం తదితర విభిన్న రంగాలకు చెందిన 111 సంస్థలను సర్వే చేసినట్లు పిడబ్ల్యుసి తెలిపింది. గత కొన్ని సంవత్సరా లుగా భారతీయ వినియోగదారులు, సంస్థలు…

Read More

జూనియర్ పంచాయతీ కార్యదర్శులు (జెపిఎస్) హక్కుల కోసం పోరాడుతుంటే బెదిరింపులతో సమ్మెను నీరుగార్చే ప్రయత్నం చేస్తున్నారని బిజెపి రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్ ధ్వజమెత్తారు. గురువారం బిజెపి రాష్ట్ర కార్యాలయంలో మీడియాతో లక్ష్మణ్ మాట్లాడారు. జెపిఎస్‌లను ఉద్యోగాల నుంచి తీసివేస్తామని బెదిరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. జెపిఎస్ సమస్యలను తక్షణమే పరిష్కరించి.. రాష్ట్ర ప్రభుత్వం వారిని ఆదుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. ‘ఐదు వేలకు పైగా వీఆర్వోలు తమ హక్కుల కోసం పోరాటం చేస్తే వీఆర్వో వ్యవస్థనే లేకుండా చేశారు. ఆర్టీవీ సమ్మెపైనా ప్రభుత్వం ఉక్కుపాదం మోపింది. అకాల వర్షాలతో రైతులు తీవ్రంగా నష్టపోయారు. రైతులకు అందించే పరిహారం విషయంలో ముఖ్యమంత్రికి సమీక్ష చేసే తీరిక లేకపోవడం చూస్తే.. అన్నదాతల పట్ల ఆయనకు ఉన్న చిత్తశుద్ధి అర్ధమవుతోంది. ప్రచారం కోసం రూ. వెయ్యి కోట్లు ఖర్చు పెట్టేందుకు బిఆర్‌ఎస్ సర్కారు సిద్ధంగా ఉంది తప్పు.. రైతుల కోసం రూ.300 కోట్లు ఖర్చు చేసేందుకు…

Read More