పాక్ మాజీ ప్రధాని, పాకిస్థాన్ తెహ్రీక్‌ఎ ఇన్సాఫ్ అధ్యక్షుడు ఇమ్రాన్ ఖాన్‌కు అక్కడి సుప్రీంకోర్టులో భారీ ఊరట లభించింది. ఇమ్రాన్‌ను అవినీతి నిరోధక విభాగం(నేషనల్ అకౌంటబిలిటీ బ్యూరో) అక్రమంగా అరెస్టు చేసిందన్న సుప్రీంకోర్టు ఆయనను తక్షణమే విడుదల చేయాలని గురువారం ఆదేశించింది. కోర్టు ప్రాంగణంలో ఎవరినీ అరెస్టు చేయడానికి వీల్లేదన్న న్యాయస్థానం .. దేశంంలో శాంతి నెలకొనాలని కోరుకుంటున్నామని పేర్కొంది. అలాగే శుక్రవారం ఇస్లామాబాద్ హైకోర్టును ఆశ్రయించాలని, కోర్టు ఆదేశాలకు అనుగుణంగా నడుచుకోవాలని ఇమ్రాన్ ఖాన్‌కు సూచించింది. గత మంగళవారం ఇస్లామాబాద్ హైకోర్టు ఆవరణలో తన అరెస్టును వ్యతిరేకిస్తూ ఇమ్రాన్ ఖాన్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. దీనిపై చీఫ్ జస్టిస్ ఉమర్ అతా బండియాల్ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం గురువారం విచారణ జరిపించింది. ఈ సందర్భంగా హైకోర్టు ప్రాంగణంనుంచి ఇమ్రాన్‌ను అరెస్టు చేసిన తీరుపై ఎన్‌ఎబిపై ధర్మాసనం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. రిజిస్ట్రార్ అనుమతి లేకుండా కోర్టు ప్రాంగణంలోకి ప్రవేశించి ఇమ్రాన్‌ను…
Author: Editor's Desk, Tattva News
ఢిల్లీలో పాలనా సర్వీసులపై నియంత్రణ ఎన్నికైన ప్రభుత్వానిదే అని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. చాన్నాళ్లుగా ఢిల్లీ సర్కార్, ఆ రాష్ట్ర లెఫ్టినెంట్ గవర్నర్ మధ్య జరుగుతున్న వివాదానికి సుప్రీం బ్రేక్ వేసింది. ఈ కేసులో 2019 నాటి సింగిల్ జడ్జీ తీర్పుతో ఏకీభవించడం లేదని సుప్రీం ధర్మాసనం తెలిపింది. ఢిల్లీ ప్రభుత్వానికి అధికారాలు లేవన్న విషయాన్ని తాము అంగీకరించబోమన్నది. ఢిల్లీ ప్రభుత్వం, ఎల్జీ మధ్య జరిగిన వివాదంపై జస్టిస్ అశోక్ భూషణ్ 2019లో తీర్పును వెలువరించారు. అయితే ఆ తీర్పును తాము అంగీకరించడం లేదని సీజేఐ డీవై చంద్రచూడ్ తెలిపారు. దీంతో సుప్రీంకోర్టులో కేజ్రీవాల్ ప్రభుత్వానికి భారీ విజయం దక్కింది. అధికారులను నియమించే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్నట్లు సుప్రీం తెలిపింది. ఇక అన్ని రాష్ట్రాల తరహాలోనే ఢిల్లీలో పాలన ఉంటుందని సుప్రీం తెలిపింది. ల్యాండ్, పోలీస్, లాపై అధికారం కేంద్రానికి ఉంటుందని కోర్టు చెప్పింది. మిగిలి అన్ని అంశాలపై శాసనాధికారం…
భారత ప్రధాని నరేంద్ర మోదీ తొలి అధికారిక అమెరికా పర్యటన ఖరారైంది. జూన్ 22న మోదీ అమెరికా వెళ్లనున్నారు. ఈ పర్యటనలో భాగంగా భారత ప్రధాని కోసం అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ అధికారిక విందు ఏర్పాటు చేశారు. 2009లో చివరిసారిగా అప్పటి భారత ప్రధాని మన్మోహన్ సింగ్ అమెరికాలో అధికారికంగా పర్యటించారు. అప్పట్లో అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా మన్మోహన్ సింగ్‌కు సాదర స్వాగతం పలికారు. ఇక, 2014లో ప్రధాని బాధ్యతలు చేపట్టిన నాటి నుంచీ ఇప్పటివరకూ మోదీ ఐదు సార్లు అమెరికాలో పర్యటించారు. ఈ పర్యటనలో భాగంగా అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, ఆయన భార్య, ప్రథమ మహిళ జిల్ బైడెన్ మోడీ కోసం స్టేట్ డిన్నర్ (అధికారిక విందు) ఏర్పాటు చేశారని కేంద్రం ప్రభుత్వం ఓ ప్రకటనలో తెలిపింది. క్వాడ్ కూటమిని మరింత బలోపేతం చేసే అవకాశాలపై ఇరు నేతలు ఈ పర్యటనలో చర్చించనున్నారు. అంతేకాకుండా, స్వేచ్ఛాయుత,…
అవినీతి కేసులో అరెస్టయిన పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌ను బుధవారం ఇస్లామాబాద్ లోని ప్రత్యేక కోర్టులో హాజరుపరచగా, ఆయనకు ఎనిమిది రోజుల పాటు రిమాండ్ విధించింది. ఓ కేసులో విచారణకు హాజరయ్యేందుకు ఇస్లామాబాద్ హైకోర్టుకు హాజరైన ఇమ్రాన్‌ను పారా మిలటరీ రేంజరు మంగళవారం అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. ప్రభుత్వ ఖజానాకు రూ.5వేల కోట్లకు పైగా నష్టపరచిన అల్‌ఖదీర్ ట్రస్టు కేసులో విచారణ ప్రారంభమైన వెంటనే, ఖాన్‌ను 14రోజుల పాటు రిమాండ్‌కు పంపాల్సిందిగా నేషనల్ అకౌంటబిలిటీ బ్యూరో (ఎన్‌ఎబి) తరపు లాయర్లు కోరారు. ఖాన్ తరపు న్యాయవాది స్పందిస్తూ, తన క్లయింట్‌పై నమోదైన అభియోగాలన్నీ కల్పితాలని, ఆయనను వెంటనే విడుదల చేయాలని కోరారు. కాగా, ప్రభుత్వ బహుమతుల అమ్మకాల ద్వారా వచ్చిన మొత్తాల వివరాలను దాచడానికి సంబంధించి రెండవ కేసు కూడా జిల్లాసెషన్స్ కోర్టులో విచారణ జరగనుంది. గతేడాది పాక్ ఎన్నికల కమిషన్ ఈ కేసును దాఖలు చేసింది. పాలకులకు,…
తెలంగాణ నుంచి పార్ బాయిల్డ్ రైస్‌ను తీసుకునేందుకు తాను చేసిన విజ్ఞప్తి మేరకు గడువును కేంద్ర ప్రభుత్వం ఈ నెలాఖరు వరకు పొడిగించిందని కేంద్ర సాంస్కృతిక, పర్యాటక శాఖ మంత్రి కిషన్‌రెడ్డి తెలిపారు. 2021 -22 (రబీ) పంట కాలానికి సంబంధించి 15 లక్షల మెట్రిక్ టన్నుల పార్ బాయిల్డ్ రైస్‌ను తెలంగాణ రైతుల నుంచి సేకరించేలా అనుమతులు మంజూరు చేయాలని కోరుతూ ఏప్రిల్‌లో వినియోగదారుల వ్యవహారాలు, ఆహార, పౌరసరఫరాల శాఖ మంత్రి పీయూష్ గోయల్‌కి రాయడం జరిగిందని చెప్పారు. ఈ లేఖకు అనుకూలంగా పీయూష్ గోయల్ స్పందిస్తూ 2021 -22 (రబీ)/ 2022- 23 (ఖరీఫ్) పంట కాలాలకు సంబంధించి మొత్తం 13.73 లక్షల మెట్రిక్ టన్నుల పార్ బాయిల్డ్ రైస్ సేకరణకు, లక్ష్యానికి తగినట్లుగా మిగిలిన బియ్యాన్ని రా రైస్ రూపంలో నిర్ధేశించిన గడువులోపు ఎఫ్‌సిఐకు అందజేయడానికి రాష్ట్ర ప్రభుత్వానికి అనుమతి ఇస్తూ నిర్ణయం తీసుకోవడం జరిగిందని వెల్లడించారు.…
తెలుగు రాష్ట్రాల మధ్య నీటి పంపకాల పంచాయితీ ఎటూ తేలడం లేదు. హైదరాబాద్ లోని జలసౌదలో కృష్ణా రివర్ మేనేజ్‌మెంట్ బోర్డు (కేఆర్‌ఎంబీ) సమావేశం బుధవారం ఎటువంటి నిర్ణయం తీసుకోలేక పోయింది. రెండు రాష్ట్రాల మధ్య నీటి కేటాయింపులు, ఇతర విషయాలపై ఈ భేటీలో అధికారులు చర్చించినా రెండు తెలుగు రాష్ట్రాలకు ఎలాంటి వాటా ఖరారు చేయలేదు. ఎందుకంటే 66:34 నిష్పత్తిలో నీటి కేటాయింపులు ఉండాలని ఏపీ చెబుతుండగా, 50 శాతం వాటా కావాలని తెలంగాణ పట్టుబడుతోంది. దీంతో వాటాల ఖరారు అంశాన్ని కేంద్ర జలశక్తి శాఖకు నివేదించాలని కేఆర్ఎంబీ నిర్ణయించింది. ప్రాజెక్టుల వారీగా కేటాయింపులు ఉండాలని ఖచ్చితంగా ప్రత్యేక ట్రైబ్యునల్ ఏర్పాటు చేయాలని తెలంగాణ నీటిపారుదల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్ కుమార్ తెలిపారు. 66:34 శాతం నీటి వాటాకు ఎట్టిపరిస్థితుల్లో ఒప్పుకునేది లేదని స్పష్టం చేశారు. శ్రీశైలం నుంచి ఏపీ 34 టీంఎసీలు మాత్రమే వినియోగించుకోవాలని చెప్పారు. గత…
“పంట నష్టం వాటిల్లితే అధికారుల నుంచి కనీసం పలకరింపు లేదు. రైతు ప్రభుత్వం అని చెప్పుకొనే వైసీపీ పాలకులు ఎక్కడ ఉన్నారు. రైతుకు ఎక్కడ కష్టం వస్తే అక్కడ మేముంటామని చెప్పారు. ఇప్పుడు అకాల వర్షాలకు పంట నష్టపోతే పట్టించుకున్న దిక్కు లేదు” అంటూ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ధ్వజమెత్తారు. ఇటీవల కురిసిన అకాల వర్షాల వల్ల పంట నష్టపోయిన రైతులను పరామర్శించారు. ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా పర్యటనలో భాగంగా దెబ్బతిన్న పంట పొలాలను సందర్శించి రైతులతో మాట్లాడారు. మొలకలు వచ్చిన ధాన్యాన్ని ఆయన పరిశీలించారు. రైతులను ఆదుకునేలా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొస్తామని రైతులకు పవన్ కళ్యాణ్ భరోసా ఇచ్చారు. రైతులకు న్యాయం జరిగే వరకు పోరాటం కొనసాగిస్తామని స్పష్టం చేశారు. నష్టపోయిన రైతుల నుంచి వివరాలను పవన్ కళ్యాణ్ అడిగి తెలుసుకున్నారు. మొలకలు వచ్చిన ధాన్యాన్ని పరిశీలించారు. ముఖ్యమంత్రి గారు రూ. 3 వేల కోట్ల ధరల…
ఉగ్రవాదులకు ఎంఐఎం పార్టీ ఆశ్రయం కల్పిస్తోందని తెలంగాణ బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్ ఆరోపించారు. గతంలో ఉగ్రవాదులకు మద్దతుగా వారికి న్యాయసహాయం చేస్తామని ఓ వైసీ మాట్లాడారని గుర్తు చేశారు. పాతబస్తీలో నలుగురు ఉగ్రవాదులను పోలీసులు అరెస్ట్ చేశారని, ఇందులో ఓ వ్యక్తి ఓవైసీ చెందిన కాలేజీలో హెచ్ వోడీగా పనిచేస్తున్నాడని తెలిపారు. అలాగే ఉగ్రవాదులకు పాతబస్తీ అడ్డాగా మారిందని మండిపడ్డారు. రాజకీయ ప్రయోజనాల కోసం ఉగ్రవాద సంస్థలను ఎంఐఎం వాడుకుంటోందని ధ్వజమెత్తారు. ఓట్ల కోసం ఉగ్రవాదులకు ఆశ్రయిస్తున్న ఎంఐఎం పార్టీని బీఆర్ఎస్ వాడుకుంటోందని సంజయ్ ఆరోపించారు. కాంగ్రెస్ , బీఆర్ఎస్ కు అధికారమే కావాలని, ప్రజల భద్రత అవసరం లేదని మండిపడ్డారు. నిన్న అరెస్ట్ అయిన హిజ్జు ఉత్ తహరీర్ (హెచ్ యు టి) సంస్థ ఉగ్రవాదులు ఐసిస్ కన్నా ప్రమాదకరం అని సంజయ్ హెచ్చరించారు. రసాయన, జీవ ఆయుధాలతో దాడులు చేస్తూ భయోత్పాతం స్రుష్టిస్తున్న సంస్థ. ఒంటరిగానే ఎవరిపైనైనా…
అవినీతి కేసులో నాటకీయ పరిణామాల మధ్య పాక్ మాజీ ప్రధాని, పీటీఐ చైర్మన్ ఇమ్రాన్ ఖాన్ మంగళవారం అరెస్ట్ కావడంతో ప్రస్తుతం ఆ దేశం అల్లర్లతో అట్టుడికిపోతోంది. ఆయన అరెస్టుకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా పీటీఐ కార్యకర్తలు, మద్దతుదారులు ఆందోళనలకు దిగారు. పలుచోట్ల వాహనాలకు నిప్పుపెట్టడంతోపాటు ప్రజా ఆస్తులను ధ్వంసం చేస్తున్నారు. ప్రస్తుతం దేశంలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు, ఆర్మీ ఆందోళన కారులను ఎక్కడికక్కడ కట్టడి చేస్తున్నారు. ఖాన్ అరెస్ట్ తర్వాత దేశంలోనే అత్యధిక జనాభా కలిగిన పంజాబ్ ప్రావిన్స్ లో దాదాపు 1,000 మందిని అరెస్టు చేసినట్లు పోలీసులు బుధవారం వెల్లడించారు. ఈ అల్లర్లలో ఇప్పటి వరకు సుమారు 130 మంది అధికారులు గాయపడినట్లు తెలిపారు. అల్లర్ల నేపథ్యంలో పాక్ ప్రభుత్వం పంజాబ్ ప్రావిన్స్‌లో ఇంటర్నెట్ సేవల్ని బంద్ చేసింది. 144 సెక్షన్ విధించింది. ఫైసలాబాద్‌లోని హోంమంత్రి ఇంటిపై పీటీఐ కార్యకర్తలు రాళ్ల దాడికి…
కాలమిస్ట్ ఇ జీన్ కరోల్‌పై లైంగిక వేధింపుల కేసులో అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ దోషిగా తేలారు. కరోల్‌కు 5 మిలియన్ డాలర్లు చెల్లించాలని జ్యూరీ ఆదేశించింది. అంతేకాదు, కరోల్‌ను అబద్ధాల కోరుగా అభివర్ణిస్తూ ట్రంప్ ఆమె పరువును రోడ్డున పడినట్టు కూడా జ్యూరీ నిర్ధారించింది. వచ్చే ఎన్నికల్లో మళ్లీ బరిలోకి దిగాలన్న ట్రంప్ ఆశలకు ఇది విఘాతం కలిగించే అవకాశం ఉంది. జ్యూరీ తీర్పుపై రీ అప్పీలుకు వెళ్లనున్నట్టు ట్రంప్ తరపు న్యాయవాది టకోపినా తెలిపారు. 1995-96లో మన్‌హటన్‌లోని బెర్గ్‌డార్ఫ్ గుడ్‌మన్ డిపార్ట్‌మెంట్ స్టోర్ డ్రెస్సింగు రూములో ట్రంప్ (76) తనపై అత్యాచారానికి పాల్పడినట్టు కరోల్ (79) ఆరోపించారు. అయితే, ఆమె ఆరోపణలను ట్రంప్ ఖండించారు. ఆమె ఆరోపణలు పూర్తిగా అవాస్తవమని, బూటకమని, పూర్తిగా అబద్ధమని 2022లో తన సోషల్ మీడియా ‘ట్రూత్’లో పేర్కొంటూ తన పరువుకు భంగం కలిగించారని కరోల్ సివిల్ విచారణలో ఇటీవల వాంగ్మూలం ఇచ్చారు.…