Author: Editor's Desk, Tattva News

దక్షిణాది ప్రముఖ నటుడు, దర్శకుడు మనోబాల ఇకలేరు. కొంతకాలంగా  అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఈ రోజు చెన్నైలో తుదిశ్వాస విడిచారు. 69 సంవత్సరాల మనోబాల గత రెండు వారాలుగా కాలేయ సంబంధిత సమస్యల కారణంగా ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చేరినట్లు సమాచారం. జనవరిలో యాంజియో చికిత్స చేయించుకున్నారు. అప్పటి నుంచి పలు అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. ఈ వార్త తమిళ, తెలుగు చిత్ర పరిశ్రమలో అందరినీ షాక్‌కు గురి చేసింది. ఆయన తెలుగులో చివరగా మెగాస్టార్ వాల్తేరు వీరయ్య సినిమాలో జడ్జి పాత్రలో కనిపించారు. శివకార్తికేయన్ హీరోగా తెలుగు, తమిళ్ లో విడుదలైన డాన్ చిత్రంలో స్కూల్ టీచర్ గా అందరినీ నవ్వించారు. మనోబాలకు భార్య ఉష మహదేవన్, కుమారుడు హరీశ్ ఉన్నారు. సినిమాల్లో తనదైన ముద్ర వేశారు మనోబాల. ఎన్నో హిట్ సినిమాల్లో నటించారు. వేస్ట్ పేపర్ పేరుతో యూట్యూబ్ ఛానెల్‌ను కూడా నడిపిస్తున్నారు. తమిళ చిత్రసీమలో కొన్ని ముఖ్యమైన…

Read More

అమరావతి భూ కుంభకోణం, భారీ ప్రాజెక్టుల్లో అవినీతిపై దర్యాప్తు కోసమంటూ ఏపీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన ‘సిట్‌’పై సుప్రీంకోర్టు కీలక తీర్పు వెలువరించింది. సిట్‌పై స్టే విధిస్తూ హైకోర్టు ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను అత్యున్నత న్యాయస్థానం కొట్టేసింది. ఈ కేసును మెరిట్ ప్రాతిపదికన విచారించి తుది నిర్ణయాన్ని వెలువరించాలని హైకోర్టుకు జస్టిస్ ఎం.ఆర్.షా, జస్టిస్ సీటీ రవికుమార్‌లతో కూడిన ధర్మాసనం బుధవారం సూచించింది. గత ప్రభుత్వం హయాంలో జరిగిన పనులపై ప్రస్తుతం జగన్ ప్రభుత్వం వేసిన సిట్‌ వేయడంపై సుప్రీం కీలక ఆదేశాలు ఇచ్చింది. అలాగే హైకోర్టు తీరును సుప్రీంకోర్టు తప్పుపట్టింది. విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ప్రాథమిక దశలోనే దర్యాప్తును అడ్డుకోవడం సమంజసమేనా? అని ప్రశ్నించింది. హైకోర్టు ముందుగా ఈ విషయంలో జోక్యం చేసుకుందని, అందుకే మధ్యంతర ఉత్తర్వులను తోసిపుచ్చుతున్నామని వెల్లడించింది. వివ‌రాల‌లోకి వెళితే చంద్రబాబు ప్రభుత్వ హయాంలో చాలా పనుల్లో అక్రమాలు జరిగాయని ఆరోపిస్తూ ఏపీ…

Read More

అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసిసి) టెస్టు టీమ్ ర్యాంకింగ్స్‌లో టీమిండియా టాప్ ర్యాంక్‌ను అందుకుంది. ఐసిసి మంగళవారం ప్రకటించిన తాజా ర్యాంకింగ్స్‌లో భారత్ అగ్రస్థానానికి దూసుకెళ్లింది. ఈ క్రమంలో టాప్ ర్యాంక్‌లో ఉన్న ఆస్ట్రేలియాను వెనక్కినెట్టి టీమిండియా మొదటి స్థానాన్ని దక్కించుకోవడం విశేషం. గత 15 నెలలుగా టెస్టుల్లో ఆస్ట్రేలియా టాప్ ర్యాంక్‌లో కొనసాగుతున్న విషయం తెలిసిందే. అయితే ఐసిసి వెల్లడించిన తాజా ర్యాంకింగ్స్‌లో భారత్ 121 రేటింగ్ పాయింట్లతో టాప్ ర్యాంక్‌ను సొంతం చేసుకుంది. కొంతకాలంగా టెస్టుల్లో టీమిండియా నిలకడైన విజయాలు సాధిస్తున్న విషయం తెలిసిందే. దీని ప్రభావం ర్యాంకింగ్స్‌పై స్పష్టంగా కనిపించింది. ఈ సీజన్‌లో 25 టెస్టు మ్యాచ్‌లను ఆడిన భారత్ 3,031 పాయింట్లను సాధించింది. ఈ క్రమంలో 121 రేటింగ్ పాయింట్లతో టీమిండియాకు టాప్ ర్యాంక్ దక్కింది. ఇక ఆస్ట్రేలియా 116 రేటింగ్ పాయింట్లతో రెండో స్థానంలో నిలిచింది. ఇంగ్లండ్ మూడో, సౌతాఫ్రికా నాలుగో ర్యాంక్‌లో కొనసాగుతున్నాయి.…

Read More

ఉగ్రవాదాన్ని, ఉగ్రవాదులను కనికరించిన చరిత్ర కాంగ్రెస్ పార్టీకి ఉందని ప్రధాని నరేంద్ర మోదీ మంగళవారం ఆరోపించారు. ఉగ్రవాదులను లక్ష్యంగా చేసుకుని నిర్వహించిన సర్జికల్ స్ట్రైక్, వైమానికదాడుల సమయంలో దేశ భద్రతా బలగాలను కాంగ్రెస్ ప్రశ్నించిందని ఆయన గుర్తు చేశారు. కాంగ్రెస్, జెడిఎస్ ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్నాయని ఆయన మండిపడ్డారు. కర్ణాటకలో బీజేపీ ఎన్నికల ప్రచారంలో పాల్గొంటూ ఆ పార్టీలు కర్ణాటకలో పెట్టుబడులును ఎన్నడూ పెంచలేదని, అదేవిధంగా రాష్ట్ర యువతకు కొత్త అవకాశాలు కల్పించలేదని ప్రధాని ఆరోపించారు. కాంగ్రెస్ చరిత్ర, ఆలోచన విధానాన్ని కర్ణాటక ప్రజలు ఎప్పటికీ మరిచిపోరని స్పష్టం చేశారు. ఢిల్లీలోని బాట్లాహౌస్ ఎన్‌కౌంటర్‌లో ఉగ్రవాదులు చనిపోతే కాంగ్రెస్ టాప్ మోస్ట్ లీడర్ (సోనియా గాంధీ) కళ్లలో కన్నీళ్లు తిరిగాయని మోదీ గుర్తు చేశారు. చిత్రదుర్గ ప్రాంతంలో నిర్వహించిన బహిరంగ సభలో మాట్లాడుతూ దేశ భద్రతా బలగాల సామర్థాన్ని కాంగ్రెస్ శంకించిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కర్ణాటకలో కాంగ్రెస్ ఉగ్రవాదాన్ని ఎలా ప్రొత్సహించిందో…

Read More

పరువునష్టం కేసులో కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీకి ఆశాభంగమైంది. సూరత్‌ కోర్టు ఇచ్చిన ఆదేశాలపై మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసిందుకు గుజరాత్‌ హైకోర్టు నిరాకరిస్తూ తుది తీర్పును రిజర్వ్‌ చేసింది. వేసవి సెలవుల తర్వాత జస్టిస్‌ హేమంత ప్రచాక్‌ తీర్పును వెలువరించింది. అప్పటి వరకు రాహుల్ గాంధీకి మధ్యంతర ఉపశమనం కల్పించేందుకు కోర్టు నిరాకరించింది. మోదీ ఇంటిపేరు వ్యాఖ్యలకు సంబంధించిన పరువునష్టం కేసులో సూరత్‌ కోర్టు రాహుల్‌ గాంధీకి రెండేళ్ల జైలు శిక్షను విధించిన విషయం తెలిసిందే. కోర్టు తీర్పును సవాల్‌ చేస్తూ రాహుల్‌ గాంధీ గుజరాత్‌ హైకోర్టును ఆశ్రయించారు. ఏప్రిల్‌ 29న రాహుల్‌ పిటిషన్‌పై విచారణ జరిగింది. కాంగ్రెస్‌ నేత తరఫున సీనియర్‌ న్యాయవాది అభిషేక్‌ మను సింఘ్వీ వాదనలు వాదనలు వినిపించారు. రాహుల్‌ వ్యాఖ్యలు రెండేళ్ల జైలు శిక్ష విధించేంత తీవ్రమైన నేరమేమికాదని పేర్కొన్నారు. 2019 లోక్‌సభ ఎన్నికల సందర్భంగా కర్ణాటకలోని కోలార్‌లో జరిగిన ఎన్నికల ర్యాలీలో రాహుల్‌…

Read More

కాళికాదేవి అమ్మవారిని అవమానించే విధంగా కార్టున్‌ను ట్వీట్ చేసినందుకు ఉక్రెయిన్ రక్షణ మంత్రిత్వశాఖ హిందువులకు క్షమాపణ చెప్పింది. హిందువుల దేవత కాళికాదేవి అమ్మవారిని కించపరిచేవిధంగా తమ రక్షణ శాఖ ఒకకార్టూన్‌ను ట్వీట్ చేసిందని, అందుకు తాము క్షమాపణ చెబుతున్నామంటూ ఉక్రెయిన్ విదేశీ వ్యవహారాల శాఖ ఉప మంత్రి ఎమినె జెప్పర్ ట్వీట్ చేశారు. తమ దేశం భారతీయ విశిష్ట సాంప్రదాయాన్ని గౌరవిస్తుందని, తమకు భారత్ నుంచి అందుతున్న మద్దతుకు కృతజ్ఞతలని ఆయన పేర్కొన్నారు. కాళికామాతను కించపరిచే విధంగా ఉన్న కార్టూన్‌ను ఇప్పటికే తొలగించినట్లు ఆమె తెలిపారు. ఉక్రెయిన్ రక్షణ మంత్రిత్వశాఖ ఏప్రిల్ 30న పోస్టు చేసిన ఒక కార్టూన్ తీవ్ర వివాదాస్పదమైంది. ఒకప్పుడు బాగా పాపులర్ అయిన గురుతున్న స్కర్ట్‌తో అలనాటి హాలీవుడ్ నటి మార్లిన్ మన్రో ఫోటోకు కాళికాదేవి ముఖాన్ని తగిలించి బ్యాక్ గ్రౌండ్‌లో విస్ఫోటనం దృశ్యంతో కూడిన కార్టూన్‌ను ఉక్రెయిన్ రక్షణ శాఖ ట్వీట్ చేసింది. దీనికి వర్క్…

Read More

నేషనలిస్టు కాంగ్రెస్ పార్టీ(ఎన్‌సిపి) అధ్యక్ష పదవి నుంచి తప్పుకుంటున్నట్లు రాజకీయ కురువృద్ధుడు, మహారాష్ట్రకు చెందిన సీనియర్‌ నాయకుడు, మాజీ కేంద్ర మంత్రి, మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి శరద్ పవార్ ప్రకటించడం రాజకీయ దుమారం రేపింది. ఎన్‌సిపి అధ్యక్ష పదవికి రాజీనామా చేస్తున్నట్లు శరద్ పవార్ ఎలిపారు. తన ఆత్మకథ లోక్ మఝే సంగాయి-రాజకీయ ఆత్మకథ..విడుదల సందర్భంగా శరద్ పవార్ ఈ నిర్ణయాన్ని ప్రకటించారు. ఎప్పుడు ఆగాలో తనకు తెలుసునని, తదుపరి అధ్యక్షుడిపై నిర్ణయం తీసుకునేందుకు ఎన్‌సిపి సీనియర్ నాయకులతో ఒక కమిటీని ఏర్పాటు చేశానని 82 ఏళ్ల శరద్ పవార్ తన కుమార్తె ప్రతిభ సమక్షంలో ప్రకటించారు. అయితే, గత 55 ఏళ్లుగా కొనసాగుతున్న తరహాలోనే సామాజిక కార్యక్రమాలలో పాల్గొంటూనే ఉంటానని ఆయన పార్టీ శ్రేణులకు హామీ ఇచ్చారు. కాగా, పవార్ రాజ్యసభ సభ్యత్వం కాలపరిమితి మరో మూడేళ్లు ఉంది. అప్పటివరకు ఆ పదవిలో ఉంటానని, ఆ తర్వాత మరేపదవి చేపట్టానని…

Read More

దేశవ్యాప్తంగా సంచలనం కలిగించిన తుని రైలు దగ్ధం కేసును విజయవాడ రైల్వే కోర్టు సోమవారం కొట్టివేసింది. దర్యాప్తు అధికారులు ఎఫ్‌ఐఆర్‌లో పేర్కొన్న 41 మందినిరైలు దగ్ధం కేసులో నిందితులుగా నిరూపించలేకపోవడంతో వారిని నిర్దోషులుగా ప్రకటిస్తూ కోర్టు తీర్పునిచ్చింది. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ అయిన భారతీయ రైల్వేకు చెందిన రైలు తగులబెట్టిన కేసులో సీరియస్‌గా ఆర్‌పిఎఫ్‌ పోలీసులు దర్యాప్తు చేయకుండా తూతూ మంత్రంగా చేయడం పట్ల కోర్టు అసహనం వ్యక్తం చేసింది. కేసు వివరాల్లోకి వెళితే 2016లో కాపులకు రిజర్వేషన్లు కల్పించాలని కోరుతూ మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం నాయకత్వంలో పెద్ద ఎత్తున ఉద్యమించారు. ఈ క్రమంలో ఆందోళనకారులు తునివద్ద రతాుచల్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలును తగులబెట్టారు. ఈ ఘటనకు సంబంధించి ప్రభుత్వం 69 కేసులను నమోదు చేసింది. ఆయా కేసులను వైసిపి అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం ఉపసంహరించుకుంది. రైలు దగ్ధం కేసుకు సంబంధించి నిందితులుగా పేర్కొన్న 41 మందిలో…

Read More

తిరుమలలో ఈ నెల 14 నుంచి 18వ వరకు జరగనున్న హనుమత్ జయంతి ఉత్సవాలలో భక్తులను ఆకట్టుకునేలా ఆధ్యాత్మిక, భక్తి సంగీత కార్యక్రమాలు ఏర్పాటు చేయాలని జేఈవో సదా భార్గవి అధికారులను ఆదేశించారు. తిరుపతిలోని టిటిడి పరిపాలన భవనంలో సోమవారం ఆ తన ఛాంబర్‌లో అన్ని విభాగాల అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, అంజనాద్రి ఆకాశ గంగ, నాద నీరాజనం వేదికలపై ప్రతిరోజు అన్నమాచార్య, దాససాహిత్య, హెచ్‌డిపిపి ప్రాజెక్టుల కళాకారుల ఆధ్వర్యంలో ఆధ్యాత్మిక, భక్తి సంగీత కార్యక్రమాలు ఏర్పాటు చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. శ్రీ హనుమంతుని జన్మ విశేషాలపై ప్రముఖ పండితులతో ప్రసంగాలు ఏర్పాటు చేయాలని సూచించారు. ధర్మగిరి వేద విజ్ఞాన పీఠం, ఎస్వీ వేద విశ్వవిద్యాలయం, జాతీయ సంస్కృత వర్సిటీ, ఎస్వీ ఉన్నత వేద అధ్యయన సంస్థకు చెందిన వేదపండితులతో కార్యక్రమాలు రూపొందించాలని పేర్కొన్నారు. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న భక్తుల కోసం ఈ…

Read More

దేశంలో జీఎస్టీ వసూళ్లు ఏప్రిల్‌లో రికార్డ్‌ స్థాయిలో రూ. 1.87 లక్షల కోట్లుగా నమోదయ్యాయి. 2022 ఏప్రిల్‌లో రూ. 1,67,540 కోట్లు వసూలు అయ్యాయి. ఈ ఏప్రిల్‌లో అంతకంటే రూ. 19,495 కోట్లు అధికంగా వసూలైనట్లు ఆర్ధిక శాఖ సోమవారం నాడు విడుదల చేసిన ప్రకటనలో తెలిపింది. జీఎస్టీ అమల్లోకి వచ్చిన తర్వాత ఇదే అత్యధిక వసూళ్లు. రికార్డ్‌ స్థాయిలో జీఎస్టీ వసూళ్లపై ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ట్విటర్‌లో స్పందిస్తూ ఇది భారత ఆర్ధిక వ్యవస్థకు గ్రేట్‌ న్యూస్‌గా ఆయన అభివర్ణించారు. దేశంలో తక్కువ పన్ను రేట్లు ఉన్నప్పటికీ పన్నులల వసూళ్లు పెరగడం, జీఎస్టీ ఏకీకరణ, సమ్మతిని ఎలా పెంచిందో చూపిస్తుందని తెలిపారు. ఏప్రిల్‌ 2023లో మొత్తం జీఎస్టీ వసూళ్లు రూ. 1,87,035 కోట్లు వసూలయ్యాయి. ఇందులో సీజీఎస్టీ రూ. 38,440 కోట్లు, ఎస్‌జీఎస్టీ రూ. 47,412 కోట్లు, ఐజీఎస్టీ రూ. 89,158 కోట్లు ఉన్నాయి. ఇందులో రూ. 34,972…

Read More