జాతీయ పార్టీగా బిఆర్ఎస్ ను ప్రారంభించినప్పటి నుండి ఎక్కువగా ముఖ్యమంత్రి కేసీఆర్ దృష్టి సారిస్తున్న మహారాష్ట్రలో మొదటిసారి పోటీచేసిన పార్టీ నేతలకు ఎదురుదెబ్బ తగిలింది. మహారాష్ట్ర పంచాయతీ ఎన్నికలలో పోటీ చేసి, సత్తా చాటుకుంటామని కేసీఆర్ చెబుతూ వస్తున్నారు. ఇప్పటి వరకు ఆ రాష్ట్రంలో మూడు బహిరంగసభలలో ప్రసంగించారు. తెలంగాణ బయట బిఆర్ఎస్ బహిరంగసభలు నిర్వహించింది ఇక్కడే కావడం గమనార్హం. త్వరలో జరుగబోయే జిల్లా పరిషద్ ఎన్నికలలో పోటీ చేస్తున్నట్లు కూడా కేసీఆర్ ప్రకటించారు. అయితే, తెలంగాణ సరిహద్దులో నాందేడ్ జిల్లాలోని భోకర్ తాలూకాలో ఉన్న ప్రఖ్యాత భోకర్ వ్యవసాయ మార్కెట్ కమిటీ 18 డైరెక్టర్ పదవులకు శుక్రవారం జరిగిన ఎన్నికల్లో బీఆర్‌ఎస్ మద్దతుదారులు పరాజయంపాలయ్యారు. శనివారం ఓట్ల లెక్కింపు జరగ్గా.. కాంగ్రెస్ మద్దతుదారులు 13, ఎన్సీపీకి 2, బీజేపీ బలపరిచిన ముగ్గురు అభ్యర్థులు డైరెక్టర్ పదవులను కైవసం చేసుకున్నారు. బీఆర్‌ఎస్ ఒక్కరిని కూడా గెలిపించుకోలేకపోయింది. ఈ మార్కెట్‌పై పట్టున్న నాగ్‌నాథ్…
Author: Editor's Desk, Tattva News
2005లో బీజేపీ ఎమ్మెల్యే కృష్ణానంద్ రాయ్ కిడ్నాప్, హత్య కేసులో గ్యాంగ్‌స్టర్ ముక్తార్ అన్సారీకి పదేళ్ల జైలు శిక్షను ఘాజిపూర్ కోర్టు ఖరారు చేసింది. 5 లక్షల జరిమానా కూడా చెల్లించాలని ఎంపీ-ఎమ్మెల్యే కోర్ట్ ఆదేశించింది. ఈ కేసులో ముక్తార్ అన్సారీతో పాటు ఆయన సోదరుడు బీఎస్పీ ఎంపీ అఫ్జల్ అన్సారీని కూడా దోషిగా తేల్చిన కోర్టు. ఆయనకు నాలుగేళ్లు జైలు శిక్ష విధించింది. దీంతోపాటు రూ. లక్ష జరిమానా విధించింది. అఫ్జల్ అన్సారీ ప్రస్తుతం ఘాజీపూర్ ఎంపీగా ఉన్నారు. కోర్టు తీర్పుతో ఆయన తన లోక్ సభ సభ్యత్వాన్ని కోల్పోనున్నారు. ప్రజాప్రాతినిధ్య చట్టం 1951 సెక్షన్ 8లోని ఆర్టికల్ 102(1)(ఈ) నిబంధన ప్రకారం రెండేండ్లు లేదా అంతకంటే ఎక్కువ జైలుశిక్ష పడిన వ్యక్తి తీర్పు వెలువడిన తేదీ నుంచి రాజ్యాంగ పదవుల్లో ఉండటానికి అర్హత కోల్పోతారు. జైలు శిక్షాకాలంతోపాటు మరో ఆరేండ్లపాటు ఎన్నికల్లో పోటీ చేసేందుకూ అనర్హులవుతారు. సెక్షన్ 8లో…
బెంగళూరులోని ఎడ్యుటెక్ స్టార్ట్ అప్ బైజూస్ ఫౌండర్, సీఈఓ బైజు రవీంద్రన్ ఇల్లు, కార్యాలయాలపై శనివారం ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ అధికారులు దాడులు చేశారు. ఆయన నివాసం, తన కంపెనీ ‘థింక్ అండ్ లెర్న్ ప్రైవేట్ లిమిటెడ్ కు చెందిన రెండు కార్యాలయాల్లో సోదాలు నిర్వహించారు. ఫెమా ఉల్లంఘనలకు సంబంధించిన ఆరోపణలపై ఈడీ అధికారులు ఈ తనిఖీలు నిర్వహించారు. బైజు రవీంద్రన్ ‘బైజూస్’ పేరుతో ఒక ఆన్ లైన్ ఎడ్యుకేషన్ టెక్ స్టార్ట్ అప్ ను ప్రారంభించారు. అది అనతికాలంలోనే, ముఖ్యంగా కోవిడ్ లాక్ డౌన్ కాలంలో చాలా పాపులర్ అయింది. దేశవ్యాప్తంగా బ్రాంచ్ లు ప్రారంభమయ్యాయి. అలాగే, పెద్ద ఎత్తున పెట్టుబడులు కూడా వచ్చాయి. ఆ తర్వాత, సంస్థ సీఈఓ రవీంద్రన్ ఫెమా ఉల్లంఘనలకు పాల్పడ్డారన్న ఆరోపణలు వచ్చాయి. ఆ దాడుల్లో వారికి కీలకమైన ఆధారాలు లభించినట్లు సమాచారం. ఫెమా నిబంధనలను ఉల్లంఘించినట్లు నిర్ధారించే, నేరానికి పాల్పడ్డారని నిర్ధారించే…
రెజ్లర్లపై తాను లైంగిక వేధింపులకు పాల్పడినట్లు చేస్తున్న ఆరోపణలు వెనుక కాంగ్రెస్ పార్టీ, ఓ పారిశ్రామికవేత్త హస్తం ఉందని రెజ్లింగ్‌ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (డబ్లూఎఫ్‌ఐ) అధ్యక్షుడు, ఎంపీ బ్రిజ్‌భూషణ్ శరణ్ సింగ్ ఆరోపించారు. తాను నిర్దోషినని, ఎలాంటి విచారణ అయినా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు. అయితే తన పదవికి రాజీనామా చేయనని తేల్చి చెప్పారు. తాను నిర్దోషినని, సుప్రీంకోర్టు, ఢిల్లీ పోలీసులుపై తనకు పూర్తి నమ్మకం ఉందని తెలిపారు. రెజ్లింగ్‌ఫెడరేషన్ ఆఫ్ ఇండియా అధ్యక్ష పదవికి రాజీనామా చేయడం పెద్ద విషయం కాదని, కానీ అలాచేస్తే చేయని నేరాన్ని అంగీకరించినట్లు అవుతోందని పేర్కొన్నారు. శనివారం కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ రెజ్లర్లతో సమావేశమై మద్దతు ఇవ్వడంపై సింగ్ స్పందిస్తూ ఈ వివాదం వెనుక ఎవరు ఉన్నారనేది తెలిసిందని చెప్పారు. తనపై ఎఫ్‌ఐఆర్‌లు నమోదైనా వారింకా ఎందుకు ధర్నా చేస్తున్నారని సింగ్ ప్రశ్నించారు. ప్రధాని మోదీ, క్రీడామంత్రిత్వశాఖకు వ్యతిరేకంగా ఎందుకు…
భారతదేశ సైన్యంలో వీరనారీల శకానికి అంకురార్పణ జరిగింది. మహిళలు దేశ సరిహద్దుల రక్షణలో ఎవరికి తీసిపోరు అనే సత్యాన్ని చాటేందుకు ఇదో అధ్యాయం అయింది. భారతీయ సైన్యంలో చారిత్రక తొలి ఘట్టంగా సైన్యంలోకి ఐదుగురు మహిళలను పదాతిదళంలోకి తీసుకున్నారు. ఈ ఐదుగురిలో ముగ్గురరిని చైనా సరిహద్దుల వెంబడి ఉండే వాస్తవాధీన రేఖ వెంబడి సైనికాధికారిణులుగా నియమించారు. ఈ విధంగా సైన్యంలో మహిళా శక్తికి తొలిసారిగా పట్టం కట్టినట్లు అయింది. ఇంతకాలం మహిళలు సుకుమారం అని , వారు కొండలు గుట్టలు, ఎండలు వానలు మధ్య ముందుకు కదలలేరని సరిహద్దుల యుద్ధ క్షేత్రాలకు వీరిని దూరంగా ఉంచుతూ వచ్చారు. అయితే మహిళలు మగవారితో సమానంగా పోరాట పటిమను చాటుకోగలరనే విషయాన్ని చాటేందుకు ఇప్పుడు ఐదుగురు మహిళా అధికారుల బృందాన్ని సైన్యంలో విధులలోకి పంపించారు. లెఫ్టినెంట్ మెహక్ సైనీ, లెఫ్టినెంట్ సాక్షి దూబే, లెఫ్టినెంట్ అదితి యాదవ్, లెప్టినెంట్ పియోస్ ముద్గిల్, లెప్టినెంట్ ఆకాంక్ష,…
ఎన్నికలు దగ్గర పడుతుండడంతో అమలు పరుస్తున్న పలు సంక్షేమ పథకాలలో ప్రజల ఇబ్బందులను నేరుగా వారి నుండే తెలుసుకొని, సరిదిద్దడం ద్వారా ఎన్నికలలో వారి మద్దతు కూడదీసుకొనేందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కొంత ఏడాది కాలంగా `ఇంటింటికి వైసిపి’ దగ్గర నుండి పలు కార్యక్రమాలను చేబడుతున్నారు. తాజాగా, ప్రజలకు నేరుగా తమ సమస్యలను ముఖ్యమంత్రికి విన్నవించుకొనే విధంగా `జగనన్నకు చెబుదాం’ కార్యక్రమాన్ని మే 9న ప్రారంభిస్తున్నారు. ఈ పథకం అత్యంత ప్రతిష్టాత్మకమైందని ముఖ్యమంత్రి తెలిపారు. స్పందనకు మరింత మెరుగైన రూపమే ఈ కార్యక్రమమని వివరించారు. వ్యక్తిగత ఫిర్యాదుల పరిష్కారంపై ఎక్కువ దృష్టి పెట్టాలన్నారు. ఒకసారి ఫిర్యాదు రిజిస్టర్ చేస్తే దాన్ని అత్యంత జాగ్రత్తగా పరిష్కరించాలని, క్వాలిటీ పెంచాలని, ప్రాజెక్టు మానిటరింగ్ యూనిట్ల ద్వారా నిరంతరం పర్యవేక్షణ చేస్తేనే అది సాధ్యమవుతుందని జగన్ వివరించారు. గ్రామ, వార్డు సచివాలయాల్లో వలంటీర్లు ప్రతి ఇంటినీ సందర్శించి 1902 హెల్ప్‌లైన్ గురించి అవగాహన…
మన్ కీ బాత్ వందో ఎపిసోడ్ వేళ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ దేశ వ్యాప్తంగా 91 ఆకాశవాణి ట్రాన్స్ మీటర్లను వర్చువల్ పద్ధతిలో ప్రారంభించారు.ఈ ట్రాన్స్ మీటర్లన్నీ 100 వాట్ల ఎఫ్ఎం ట్రాన్స్ మీటర్లు. వీటిలో 4 ట్రాన్స్ మీటర్లు తెలంగాణలోని నల్గొండ, దేవరకొండ, రామగుండం, సిర్పూర్ లలో ప్రారంభం అయ్యాయి. 18 రాష్ట్రాలు, 2 కేంద్రపాలిత ప్రాంతాలలోని 84 జిల్లాల్లో మొత్తం 91 ఎఫ్‌ఎం ట్రాన్స్‌మీటర్‌లు శుక్రవారం నుండి పనిచేయడం ప్రారంభించాయి. దేశంలో ఎఫ్‌ఎం కనెక్టివిటీని పెంచేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని, ప్రధాని కార్యాలయం ఓ ప్రకటనలో తెలిపింది. 18 రాష్ట్రాలు, 2 కేంద్రపాలిత ప్రాంతాలలోని 84 జిల్లాల్లో 100 వాట్ల 91 కొత్త ఎఫ్‌ఎం ట్రాన్స్‌మీటర్‌లను ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. సరిహద్దు ప్రాంతాలు, లక్షిత జిల్లాల్లో కవరేజీని పెంపొందించడం ప్రధాన ఉద్దేశమని పేర్కొంది. దీంతో ఎఫ్ ఎం అవకాశం పొందలేని 2 కోట్ల మంది ప్రజలకు లబ్థి…
బిఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు దళితబంధు డబ్బుల నుండి 3 లక్షల రూపాయలు ఎమ్మెల్యేలు లంఛం తీసుకుంటున్నారని స్వయంగా ప్రకటించిన సీఎం కేసీఆర్ వెంటనే వారిని బర్తరఫ్ చేయాలని హుజురాబాద్ ఎమ్మెల్యే, బిజెపి నేత ఈటల రాజేందర్ డిమాండ్ చేశారు. ఆ విధంగా డబ్బు తీసుకోవడం నేరమని, జుగప్పాకరం అని పేర్కొంటూ ఆ ఎమ్మెల్యేల మీద చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. ఆ బాధితులకు డబ్బులు వాపస్ ఇప్పించాలని ఈటెల డిమాండ్ చేశారు. దళితులందరికి ఈ పథకం అందేలా చూడాలని కోరారు. ఈ పథకం అస్తవ్యస్తంగా మారిందని, కంట్రోల్ తప్పింది అనడానికి ఇంతకన్నా పెద్ద నిదర్శనం ఏం కావాలని ఆయన ప్రశ్నించారు. ఈ ఆరోపణలను ప్రతికలో, ప్రతిపక్షాలో చేయలేదని, తమ పార్టీ ఎమ్మెల్యేలపై స్వయంగా సీఎం కేసీఆర్ చేశారని ఈ సందర్భంగా ఈటెల పేర్కొన్నారు. ఇసుక మాఫియా, మద్యం మాఫియా, లాండ్ మాఫియాలతో పాటు ఇప్పుడు దళిత బంధు అక్రమాలను అరికట్టడంలో ఈ ప్రభుత్వం…
ద్వేషపూరిత ప్రసంగాలపై వెంటనే కేసులు నమోదు చేసి, చట్టపరమైన చర్యలు తీసుకోవాలని సుప్రీంకోర్టు ధర్మాసనం ఆదేశాలు జారీ చేసింది. న్యాయమూర్తులు కేఎం జోసెఫ్, బీవీ నాగరత్నలతో కూడిన ధర్మాసనం ఈ తీర్పుని వెలువరించింది. ద్వేషపూరిత ప్రసంగాలు దేశ లౌకిక స్వరూపాన్ని ప్రభావితం చేస్తాయని, తీవ్రమైన నేరంగా పరిగణించాలని ధర్మాసనం అభిప్రాయపడింది. అంతేకాకుండా సుప్రీంకోర్టు 2022లోని ఉత్తర్వు పరిధిని మూడు రాష్ట్రాలకే కాకుండా.. దేశంలోని అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకూ విస్తరిస్తూ అమలు చేయాలని సూచించింది. పౌరులు ఎవరు ఎటువంటి ఫిర్యాదు చేయనప్పటికీ.. ద్వేషపూరిత ప్రసంగాలు చేసే వారిపై కేసులు నమోదు చేయాలని సుప్రీంకోర్టు అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలను ఆదేశించింది. ధర్మాసనం అక్టోబర్ 21, 2022 ఆర్డర్ మతంతో సంబంధం లేకుండా వర్తిస్తుందని, కేసులను నమోదు చేయడంలో ఏదైనా ఆలస్యం చేస్తే కోర్టు ధిక్కారంగా పరిగణించాలని రాష్ట్రాలను హెచ్చరించింది. మతం పేరుతో మనం ఎక్కడికి వెళ్తున్నాం? మనం మతాన్ని…
మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్యకేసులో ముందస్తు బెయిల్ కోసం తెలంగాణ హైకోర్టును ఆశ్రయించిన కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డికి చుక్కెదురవుతున్నది. మూడు రోజులపాటు జరిగిన సుదీర్ఘ విచారణ అనంతరం శుక్రవారం బెయిల్ ఇచ్చే విషయమై తీర్పు ఇవ్వగలదని ఎదురుచూసిన ఎంపీకి ఈ రోజు తీర్పు ఇవ్వలేమని కోర్టు స్పష్టం చేయడంతో నిరాశ ఎదురైంది. పైగా, హైకోర్టుకు శనివారం నుండి జూన్ 2 వరకు వేసవి సెలవలు కావడంతో తర్వాతే తీర్పు ఇస్తామని ధర్మాసనం తెలిపింది. దీంతో జూన్ 5కు విచారణ వాయిదా వేస్తున్నట్లు హైకోర్టు తెలిపింది. ఈ రోజు వాదనలు విన్నప్పటికీ ఈ రోజు తీర్పు ఇవ్వలేనని చెబుతూ బెయిల్ పిటిషన్‌పై తీర్పు అన్ని రోజులు రిజర్వ్‌లో పెట్టడం బాగుండదని, అత్యవసరమైతే చీఫ్ కోర్టును అభ్యర్థించాలని హైకోర్టు సూచించింది. పైగా, సీబీఐ తనపని తాను చేసుకు పోవచ్చునని స్పష్టం చేశారు. ఈ వ్యవహారంలో తాము జోక్యం చేసుకునేది…